ఏ జంటకైనా పెళ్ళి ముడివేసేందుకు బంధుమిత్రుల సమక్షంలో వేడుక నిర్వహిస్తారు. అతిథులందరి సమక్షంలో జరిగే వివాహ ఉత్సవం ద్వారా వారికి భార్యాభర్తల హోదా కట్టబెడతారు. క్రమంగా ఈ వివాహ ఉత్సవాలు కేవలం కుటుంబ సభ్యులకే పరిమితమవుతున్నాయి. ప్రేమ వివాహమైతే అది ప్రేమికులకు మాత్రమే సంబంధించినదిగా మారుతోంది. ఏ గుడిలోనో, మరోచోటో దండలు మార్చుకుని వారు దంపతులైపోతున్నారు. వివాహం ఏదైనా సవ్యంగా సాగినన్నాళ్లూ ఎలాంటి సమస్యా ఉండదు. దంపతుల మధ్య వివాదాలు మొదలైనప్పుడే వివాహ బంధానికి చట్టబద్ధ గుర్తింపు ఎంత అవసరమో ఎరుకపడుతుంది. చట్టబద్ధ వివాహమే దంపతుల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది వివాహం రిజిస్ట్రేషన్ చేయించు కోవాలంటూ కొన్ని రాష్ట్రాల్లో చట్టాలున్నప్పటికీ అవి అమలవుతున్న దాఖలాలు లేవు. గడచిన కొంతకాలంగా వివిధ కేసుల విచారణలో భాగంగా వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తోంది. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి రాష్ట్రాలన్నింటికీ వర్తించేలా కేంద్ర ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని జాతీయ న్యాయ కమిషన్ సైతం సలహా ఇచ్చింది.
పెరుగుతున్న దాంపత్య వివాదాలు
భారత్‌లో లింగ విచక్షణ మరీ దారుణంగా ఉందనడంలో మరోమాట లేదు. బాల్య వివాహాలు, బహుభార్యత్వం, గృహహింస వంటి సమస్యలు దేశ సామాజిక ముఖచిత్రాన్ని వికృతంగా మార్చేస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించి దేశాన్ని సంస్కరణల బాటపట్టించాల్సిన అవసరం ఉరుముతోంది. దేశంలో విస్తరించిన ఈ తరహా సామాజిక అనాచారాలను నిషేధిస్తూ ఎన్నో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. ఆ చట్టాలను ఉల్లంఘించిన వారికి తీవ్ర శిక్షలనూ ఖరారు చేశారు. మోసపూరితంగా చేసుకునే పెళ్ళిళ్లకు, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలంటే చట్టబద్ధ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అందుకోసం పటిష్ఠమైన చట్టాన్ని పట్టాలకెక్కించడం అనివార్యం. దాంపత్య వివాదాలకు సంబంధించిన పలు కేసులు కోర్టులకు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. వరకట్న వేధింపుల కేసులూ లెక్కకు మిక్కిలిగా కోర్టులకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా మోసపూరిత వివాహాలకు సంబంధించిన కేసులే అధికం. దేశవ్యాప్తంగా మహిళలు దాఖలు చేసిన క్రిమినల్ కేసులు 13 లక్షల దాకా ఉండగా అందులో దాంపత్య, లైంగిక వేధింపుల కేసులే మిక్కిలిగా ఉన్నాయి. ఒక్క కేరళలోనే దాంపత్య వివాదాలతో ముడివడిన సుమారు 52వేల కేసులు పెండింగులో ఉన్నాయి. చట్టబద్ధ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాకపోవడంతో కేరళ మహిళాలోకం మోసాల బారినపడుతోంది. విలువలేని వివాహాలతో మహిళలు సామాజిక గుర్తింపుతోపాటు చట్టభద్రతనూ కోల్పోతున్నారు. అయితే విదేశాల్లో ఉంటున్న భారతీయులే అత్యధికంగా ఈ తరహా మోసాల బారినపడుతుండటం గమనార్హం!
మతాధికారుల సమక్షంలో జరిగే వివాహ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఇండియన్ క్రిస్టియన్ వివాహ చట్టం-1872లో నిబంధనలు పొందుపరచారు. సాధారణ క్రైస్తవులు, భారత స్థానిక క్రైస్తవ వివాహాల నమోదుకు ప్రత్యేక నిబంధనలున్నాయి. ముస్లిముల వివాహానికి సంబంధించి 1880నాటి ఖాజీ చట్టం అమలులో ఉంది. ఖాజీల ఆధ్వర్యంలో ఈ వివాహాలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఖాజీలను నియమించే అధికారం ఉంటుంది. పెళ్ళి (నిఖా) పూర్తయ్యాక సంపూర్ణ వివరాలతో కూడిన ‘నిఖా నామా’(వివాహ ఒప్పంద పత్రం)పై దంపతులతోపాటు మరో ఇరువురు సాక్షులతోనూ ఖాజీ సంతకం చేయిస్తారు. నిఖా నామా ఓ ప్రతిని ఖాజీ భద్రపరుస్తారు. ఈ నిఖా నామాను వివాహ రిజిస్ట్రేషన్‌లకు ఆధారంగా సమర్పించవచ్చు. 1909నాటి ఆనంద్ వివాహ చట్టం సిక్కుల పెళ్ళిళ్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తుంది. ఇది 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం, 1955నాటి హిందూ వివాహ చట్టం పరిధిలో ఉంటుంది. ఈ చట్టానికి 2012లో సవరణ తీసుకువచ్చారు. హిందూ వివాహ చట్టంనుంచి బయటికి వచ్చి ఆనంద్ చట్టం కింద సిక్కుల వివాహాలను రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు ఆ సవరణ అవకాశం ఇస్తోంది. పార్సీ వివాహ, విడాకుల చట్టం-1936లోని సెక్షన్-12 ప్రకారం మత గురువులు నిర్దిష్ట కాలావధిలోగా రిజిస్ట్రార్‌కు సంబంధిత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ మేరకు వివాహాన్ని ధ్రువీకరించకపోయినా, వివరాలను రిజిస్ట్రార్‌కు అందజేయకపోయినా ఆ మతగురువు మూడు నెలల సాధారణ జైలుశిక్ష, జరిమానా అనుభవించాల్సి ఉంటుంది. 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం మతాలతో నిమిత్తం లేకుండా వివాహం చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. కులాంతర వివాహల నిమిత్తం తీసుకువచ్చిన ఈ చట్టంలోని సెక్షన్-15 ప్రకారం పెళ్ళిళ్లను రిజిస్టర్ చేయించాల్సి ఉంటుంది. 1955నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-8 కింద రిజిస్ట్రేషన్ జరగాలి. ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. విదేశాల్లోని భారతీయుల వివాహాల నిమిత్తం 1969లో విదేశీ వివాహ చట్టం అమలులోకి వచ్చింది. ఆ చట్టం విదేశీయులను పెళ్లి చేసుకోవడానికి భారతీయులకు అనుమతిస్తోంది. సీమా వర్సెస్ అశ్వనికుమార్ కేసులో సుప్రీంకోర్టు 2006, 2007, 2008ల్లో వెలువరించిన ఆదేశాల మేరకు అనేక రాష్ట్రాలు తప్పనిసరి వివాహ రిజిస్ట్రేషన్ చట్టం తీసుకువచ్చాయి. హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, దిల్లీతోపాటు పలు రాష్ట్రాలు చట్టాలు రూపొందించాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల్లోనే రిజిస్ట్రేషన్‌లకు వీలు కల్పిస్తూ నిబంధనలు జతచేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరి రిజిస్ట్రేషన్ చట్టం 2002లోనే ప్రభుత్వం తీసుకువచ్చింది. చట్టం తీసుకువచ్చి దానికి నిబంధనలను రూపొందించినప్పటికీ అమలు మాత్రం కాలేదు. శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో బాల్యవివాహాలు జరుగుతున్న అంశాన్ని ‘సుమోటో’గా తీసుకున్న మానవ హక్కుల కమిషన్ అప్పటి ఛైర్మన్ జస్టిస్ బి.సుభాషణరెడ్డి నేతృత్వంలో అక్కడ శిబిరం నిర్వహించింది. బాల్య వివాహాలను అరికట్టడానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని భావించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం 2006 ఏప్రిల్ 12న వివాహ నమోదు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను ఈ చట్టం అమలుకు రిజిస్ట్రార్‌గా నియమించింది. జిల్లా స్థాయిలో కలెక్టర్, పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు రిజిస్ట్రార్‌లుగా వ్యవహరిస్తారని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అప్పటి మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, ప్రస్తుత లోకాయుక్త ఛైర్మన్ జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వివాహాల రిజిస్ట్రేషన్ బాధ్యతలను వివిధ శాఖలకు అప్పగించడం వల్ల సమన్వయం ఉండకపోవడంతో ఆచరణలోకి రావడంలేదన్నారు. మొత్తం బాధ్యతను రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. తాలూకా, జిల్లా స్థాయిల్లో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వివాహాల నమోదుకు ఓ విభాగం ఏర్పాటు చేస్తే మెరుగైన ఫలితాలుంటాయన్నారు.
కేంద్రీకృత వ్యవస్థ అవసరం
జనన, మరణాలు, వివాహ నమోదు చట్టం, భారతీయ క్రిస్టియన్ వివాహ చట్టం, పార్సి వివాహ, విడాకుల చట్టం, హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం ఇలా పలు చట్టాలున్నప్పటికీ నమోదైన వివాహాల వివరాలన్నీ ఒకేచోట లభ్యమయ్యే వెసులుబాటు కల్పించలేదు. మతాలు, సంప్రదాయలకు అతీతంగా అన్ని తెగలవారి వివాహాల వివరాలు తెలుసుకోవడానికి పటిష్ఠమైన వ్యవస్థ లేదు. ప్రత్యేక వివాహ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఓ విధానం తీసుకువచ్చారు. దంపతులు ప్రధానంగా తమకు కావాల్సిన మతానికి సంబంధించిన చట్టం ఎంపిక చేసుకోవడానికి ఇది వీలు కల్పించింది. అంటే ప్రధానంగా మతాన్ని ఎంచుకోవడానికే ఈ విధానం ఉపయోగపడింది. మతంతో సంబంధం లేకుండా వివాహాల రిజిస్ట్రేషన్ అవసరం చాలా ఉంది.
చాలా దేశాల్లో వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలన్న చట్టం ఉంది. అయితే విస్తీర్ణం, జనాభా, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉండటంతో అలాంటి చట్టం అమలు అంత సులభం కాదని జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని ప్రస్తుత న్యాయ కమిషన్ కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఈనెల 4న అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. అయితే అమలు చేయడం కష్టమన్న కారణం ఈ తరహా చట్టంలోని ప్రయోజనాలను విస్మరించలేమనీ పేర్కొంది. కొత్త చట్టం తీసుకువస్తే గతంలో ఉన్న సివిల్, క్రిమినల్ నిబంధనలను మెరుగ్గా అమలు చేయాలనీ అభిప్రాయపడింది. నూతన చట్టం ద్వారా కొత్త హక్కులు ఇవ్వాల్సిన అవసరంలేదని పేర్కొన్న న్యాయస్థానం- ఇప్పటికే ఉన్న చట్టాల్లో దంపతులకు ఉన్న హక్కులు సక్రమంగా అమలయ్యేలా చూస్తే చాలని వ్యాఖ్యానించింది. ఇప్పటికే పలు చట్టాలున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌లకే పరిమితమయ్యేలా మరో కొత్త చట్టం అవసరం లేదని సూచించింది. కుటుంబ చట్టాన్ని మొత్తంగా సంస్కరించాలన్న అంశం జోలికి వెళ్ళకుండా- కేవలం వివాహాలకు రిజిస్ట్రేషన్‌ను తప్పని చేయడంపైనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జనన, మరణాలకు రిజిస్ట్రార్ బాధ్యత వహించిన పద్ధతిలోనే- పెళ్ళిళ్ల నమోదుకు సంబంధించీ వారికే బాధ్యత దఖలుపరచాలని సూచించింది. నిర్దిష్ట సమయంలో జనన, మరణాలు నమోదు చేయకపోతే జరిగిన జాప్యానికి రుసుము వసూలు చేసే పద్ధతిని సవరణ బిల్లులో చేర్చాలంది. తమ ప్రాంత పరిధిలో జరిగిన వివాహం నమోదు కాని పక్షంలో దాన్ని ‘సుమోటో’గా తీసుకుని రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని పంజాబ్ చట్టం రిజిస్ట్రార్‌కు కట్టబెడుతోంది. ఇదే తరహా నిబంధనను కేంద్ర చట్టంలోనూ తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏ దేశంలో పెళ్ళి చేసుకున్నా దంపతుల్లో్ల ఒకరు భారతీయులైతే, రిజిస్ట్రార్ సంతృప్తి చెందితే రిజిస్టర్ చేయడానికి వీలుగా దిల్లీ చట్టంలో ఉన్న నిబంధన కేంద్ర చట్టంలో చేర్చితే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడింది. వివాహాల రిజిస్ట్రేషన్‌కు కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరంలేదని జనన, మరణాల చట్టం 1969లో వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ సవరణ తీసుకురావాలని సిఫారస్సు చేసింది. పెళ్ళి రిజిస్ట్రేషన్‌పై గ్రామాల్లో, పంచాయతీల్లో జాగృతపరచాలంది. రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ చట్టసవరణ తీసుకువస్తే సగటు మహిళలు ఎదురొంటున్న పలు సమస్యలకు తెరదించినట్లే!
- దండు నారాయణరెడ్డి

No comments:
Post a Comment