సీట్లు పాట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సీట్ల పెంపు హాట్ టాపిక్. సీట్లను పెంచుకొని... బలాన్ని రెండింతలు చేసుకోవాలని చంద్రులిద్దరూ తలపోస్తున్నారు. అయితే నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం రేపు రేపంటూ వాయిదా వేస్తోంది. అయితే తాజా పార్లమెంట్ సెషన్లో బిల్లును ప్రవేశపెడ్తామంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సీట్ల పెంపుతో రెండు రాష్ట్రాల్లో పాతుకుపోవాలని... రాజకీయ ప్రత్యర్థిల్ని చీల్చిచెండాడొచ్చని... చంద్ర ద్వయం ప్రణాళికలు రూపొందించుకొంది. అందుకే అన్నింటా మద్దతిస్తున్నా... మా అభ్యర్థన ఎందుకు పట్టించుకోరంటూ కేంద్రానికి మొరపెట్టుకుంటోంది. అయితే రెండు రాష్ట్రాల్లోని విపక్షాలు... సీట్ల పెంపు నిబంధనల ప్రకారమే జరగాలంటూ స్పష్టం చేస్తున్నాయ్. బిల్లును అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెబుతుంటే... ఇద్దరు చంద్రల్లో గుబులు రేగుతోంది. సీట్ల పెంపు అంశంలో ఎవరి వాదనేంటి? ఏం జరిగే అవకాశముంది... మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశముందన్న దానిపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇద్దరు చంద్రులకు ప్రతిష్టాత్మకంగా మారింది. సీట్లను పెంచుకొని రాజకీయంగా బలపడి పరపతి పెంచుకోవాలని చూస్తున్న చంద్రుల ఆలోచలపై కేంద్రం ఏం చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు చంద్రులకు లాభం కలిగే నిర్ణయానికి జై కొట్టడమా... రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు జరిగే చర్యలకు జై కొట్టడమా ఏదో తేల్చుకోవాలన్న ఉద్దేశంలో బీజేపీ పెద్దలున్నట్టుగా తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన తక్షణం జరిగేలా ఏపీ, తెలంగాణ సీఎంలు కార్యాచరణను వేగవంతం చేశారు. ఎట్టిస్థితుల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరాలని ఇద్దరు చంద్రులు పట్టుబడుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత పార్టీలను బలోపేతం చేసుకునేందుకు ఇద్దరు చంద్రులు వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికి ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్న దరిమిలా... ఎమ్మెల్యే స్థానాల పెంపు ఒక్కటే తమకు శ్రీరామరక్ష అని రెండు పార్టీలు భావిస్తున్నాయ్. దీనికి సంబంధించి చంద్రబాబునాయుడు పలుసార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ సీట్ల పెంపు జరగుతుందని... వచ్చే 20 ఏళ్లు తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందన్న సంకేతాలను సీఎం చంద్రబాబు ఇచ్చారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కొంచెం అనుమానంతో ఉన్నట్టుగా కన్పి్స్తోంది. స్థానాల సంఖ్య పెరగాల్సిందేనని కృతనిశ్చయంతో ఉన్న కేసీఆర్... ఢిల్లీ పెద్దలను కలిసిన ప్రతి సందర్భంలోనూ...సీట్ల పెంపు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కేంద్రానికి తమ వైపు నుంచి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని... సీట్ల పెంపు విషయంలో సహకరించాలని కేసీఆర్... బీజేపీ పెద్దలకు పలుసార్లు విజ్ఞప్తి చేశారు. అయితే కలిసిన ప్రతీసారి సీట్లను పెంచుతున్నామని చెబుతున్న బీజేపీ నేతలు... ఆ విషయంలో వంద శాతం క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.
బీజేపీ పెద్దల ఉద్దేశం ఒకటే కన్పిస్తోంది. తాము దేశానికి ఉపయోగపడే అంశాల విషయాల్లో టీఆర్ఎస్ పార్టీగానీ, టీడీపీగానీ సహకరిస్తున్నాయని గానీ... తమకు, పార్టీకి లబ్ధి చేకూర్చే ఒక్క విషయంలోనూ సమర్థించడం లేదు కదా అన్న ఫీలింగ్ లో బీజేపీ పెద్దలు ఉన్నారు. ఢిల్లీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి బీజేపీ పెద్దలు తాజాగా చర్చించారు. సీట్ల పెంపు జరిగితే... మనకు వచ్చే లాభమేంటన్న అభిప్రాయాన్ని... బీజేపీలో సీట్ల పెంపు కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న నేతను... పార్టీ కీలక నేతలు అడిగినట్టు సమాచారం. పార్టీకి ఉపయోగం ఉండాలన్నదే బీజేపీ పెద్దల అంతరంగం. రాజకీయ పరమైన విషయమని... ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలన్నది వారి ఉద్దేశంగా కన్పిస్తోంది. అయితే సదరు బీజేపీ నేత మాత్రం... ఇద్దరు చంద్రులు మనకు ఎంతగానో సహకరిస్తున్నారు... వారు నిధుల గురించి, పథకాల గురించి అడగడం లేదు కదా... సీట్ల పెంపు గురించే కదా... ఇది చేస్తే మనకు వచ్చే ఇబ్బందేముందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు వల్ల బీజేపీకి అంతిమంగా ఏదైనా లాభం ఉందా... లేదా అన్న కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఆ చర్చలో వచ్చిన అభిప్రాయమేమంటే... సీట్ల పెంపు వల్ల ఎక్కువ శాతం ఉపయోగం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉందన్న వర్షన్ ప్రముఖంగా విన్పించింది.
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతికూలత వ్యక్తమవుతుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ఆ విషయాన్ని బీజేపీ లైట్ గా తీసుకుంటున్న సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఏపీలో దుకాణం మూసేసిన నేపథ్యంలో... వారు చేయడానికి ఏమీ ఉండదన్న అభిప్రాయాన్ని బీజేపీ స్థానిక నేతలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ సహకరించినా... సహకరించకపోయినా... నష్టం లేదు... పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో... బీజేపీ పరిస్థితి కూడా అంతే. ఇద్దరికీ ఏపీలో పెద్దగా స్టేక్స్ లేవు. కాకుంటే... బీజేపీకి ఢిల్లీలో ఉన్న బలం కలిసొచ్చే పరిణామం. నాడు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట బీజేపీ పెడచెవిన పెట్టిందని... హోదా వస్తే ఆంధ్రులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఏపీలో స్టేక్స్ ఎంత మాత్రం ఉండవని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్టీ నేతలు ఎక్కడ అవకాశముంటే ఆ పార్టీలోకి ఫిరాయించక తప్పని పరిస్థితి. అలాంటివాళ్లందరికీ...సీట్ల పెంపు వల్ల ఎక్కడో చోట అవకాశం వస్తుంది. అలాంటి వారందరికీ మనం మేలు చేయడమేంటన్న భావన కూడా బీజేపీ వర్గాల్లో ఉంది. మోదీ అభివృద్ధి నినాదం ముందు మరే విషయాలు కూడా కన్పించవని... ఆంద్రప్రదేశ్ అభివృద్ధిలో తమ పాత్ర కీలకమని బీజేపీ భావిస్తోంది. ఎయిర్ పోర్టుల ఆధునికరణ అంత తమ వల్లే జరిగిందని... గతంలో శంషాబాద్ మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయమైతే... ఇప్పుడు విజయవాడ, తిరుపతి, వైజాగ్ మూడు చోట్ల పగలు, రాత్రులు విమానాలు తిరుగుతున్నాయని... అంతర్జాతీయ విమానాల రాకపోకలతో కళకళలాడుతున్నాయని... బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు జరిగితే... అది ప్రజలకు ఎంత మాత్రం లాభం చేకూర్చదని... దాని వల్ల ఇద్దరు చంద్రులకే లాభం జరుగుతుందన్న బెంగ కూడా బీజేపీ పెద్దల్లో ఉంది. పైపెచ్చు. సీట్ల పెంపుదలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ పెద్దలు సైతం... నిబంధనల ప్రకారం వెళ్లాలని... అనవసర తలనొప్పులు ఎందుకన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగాకూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఢిల్లీ లాబీయింగ్ లో కీలకంగా ఉన్న ఇద్దరు చంద్రులు ఏదైనా అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీట్ల పెంపు ప్రతిపాదకు గ్రీన్ సిగ్నల్ వేయించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా విన్పిస్తోంది. లోక్ సభకు సాధారణ ఎన్నికలు 2018 నవంబర్ లో వస్తాయన్న హింట్స్ ను కొంత మంది బీజేపీ నేతలు ఇస్తున్నారు. అలాంటి సమయంలో హడావుడి నిర్ణయాలు ఎందుకు... 2023లో చూసుకోవచ్చు కదా... అన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. సీట్ల పెంపుదలకు సంబంధించి ఏపీ సీఎం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. సీట్ల పెంపు జరిగి తీరుతుందని... పార్టీ నేతలు మరింత కష్టపడాలని అనేక సమావేశాల్లో పార్టీ నేతలను ఉద్దేశించి బాబు చెప్తూ వస్తున్నారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరిగి తీరుతుందని... పార్టీ నేతలు అందుకు సిద్ధంగా ఉండాలని బాబు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో..... టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించుకుందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశముందని బాబు నేతలకు వివరించారు. దీంతో రాష్ట్రశాసనసభ స్థానాలు 225కి పెరుగుతాయన్నారు. గతంలో అనుకున్నట్లుగా దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంటు అనుమతితో ఒక ఉత్తర్వు తీసుకొస్తే సరిపోతుందని ఈ సందర్భంగా సుజనా చౌదరి చెప్పడం విశేషం. జిల్లాతో సంబంధం లేకుండా... లోక్‌సభ నియోజకవర్గాల వారీగా... రెండేసి సీట్లను పెంచుతారు. ఇప్పటికే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 7 అసెంబ్లీ స్థానాలుండగా... 9 సీట్లుగా పెరుగుతాయని పార్టీ ఆశాభావంతో ఉంది.
జూలై 17వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టేందుకు పావులు కదపాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. నియోజకవర్గాల పెంపు బిల్లుకు సంబంధించి కేబినెట్ నోట్‌ను న్యాయవిభాగం ఇప్పటికే సిద్ధం చేసినట్లు, పీఎంవో ఆదేశాల కోసం కేంద్ర హోంశాఖ ఎదురుచూస్తున్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రస్తావించారు. సీట్ల పెంపుపై కేంద్రానికి ప్రతిసారీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఏదో ఒక సాంకేతిక కారణం చూపి వాయిదా వేస్తున్నారని, వర్షాకాల సమావేశాల్లో వచ్చేందుకు తమ తరఫు నుంచి ప్రయత్నిస్తామని చంద్రబాబు.. కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. ప్రధాని మోదీని కలిసినప్పుడు సీట్ల పెంపు అంశాన్ని మరోసారి ప్రస్తావించాలని కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం. గత నెల 23న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.
అదే సమయంలో... టీఆర్‌ఎస్ ఎంపీల ద్వారా సీట్ల పెంపు బిల్లు గురించి సీఎం కేసీఆర్... హోంమంత్రి రాజ్‌నాథ్‌తో ప్రస్తావించాలంటూ పార్టీ నేతలకు సూచించారు. వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోద ముద్ర పడకపోతే 2019 ఎన్నికలలోపు పునర్విభజన ప్రక్రియ ముగియడం కష్టమేనని ఎన్నికల కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అడుగులు వేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన అంశం పార్లమెంటు సమావేశాల్లోనే అటో.. ఇటో తేలిపోతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడుతున్నరు. సీట్ల నిర్ణయాన్ని బట్టే... ఎన్నికల ప్రణాళిక ఉంటుందని నేతలుక ఆయన స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలు 2019లో జరగాల్సి ఉన్నా... ఎప్పుడొస్తాయన్నదానిపై క్లారిటీ లేదన్న భావనను సీఎం కేసీఆర్ విన్పించినట్టుగా తెలుస్తోంది. పునర్విభజన జరగాలంటే... ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టి ఉండాల్సిందని... అడుగు ముందుకు పడటం వల్ల క్లారిటీ మిస్సవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. తనకు ఉన్న సంకేతాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జూలైలో మొదలవుతుందని ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి భేషరతుగా మద్దతు తెలిపిన వైసీపీ నేతలు మాత్రం సీట్ల పెంపు జరగదని ధీమాగా ఉన్నారు. సీట్ల పెంపును వాయిదా వేయాల్సిందిగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారని, ప్రధాని హామీ మేరకే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఎన్డీఏకు బేషరతు మద్దతు ప్రకటించిందని చెబుతున్నారు. రాజ్యాంగ సవరణ అవసరమైన నియోజకవర్గాల పెంపు అంశాన్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ అసలు పట్టించుకొనే పరిస్థితే లేదని పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల పెంపును అక్కడి బీజేపీ రాష్ట్ర నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ అందుకు సుముఖంగా లేదు. తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా మారుతుందని, బీజేపీకి తీవ్ర నష్టం చేస్తుందని ఆ పార్టీ నేతలు అధిష్టానానికి విన్నవించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఇతర పార్టీలనుంచి అనేకమందిని టీఆర్‌ఎస్ తన పార్టీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చి ఉందని, నియోజకవర్గాల పెంపుతో అదనంగా వచ్చే స్థానాల్లో వారందరికీ అవకాశం కల్పించాలన్నది టీఆర్‌ఎస్ ఉద్దేశమని అధిష్టానానికి వివరించారు. పెంపు టీఆర్‌ఎస్‌కు అనుకూలిస్తుందని, అదే సమయంలో నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాల్లో మార్పులు జరిగితే బీజేపీకి నష్టం కలుగుతుందని ఆ పార్టీ నేతలు స్పష్టంచేశారు.
నిబంధనల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగదన్న అభిప్రాయం స్పష్టంగా కన్పిస్తోంది. కేంద్ర మంత్రులు అనేకసార్లు పార్లమెంట్ సాక్షిగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు ఎన్నో అడ్డుంకులు ఎదురవుతున్నాయన్న అభిప్రాయాన్ని కేంద్రం చెబుతూ వచ్చింది. అయితే అదే సమయంలో బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపజేయబోతున్నామంటూ కూడా తేల్చిచెబుతున్నాయ్. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లను 225కు పెంచాలని, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 సీట్లను 153కు పెంచాలని చట్టంలో ఉంది. అయితే గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు, చేర్పులు చేయకుండా యూపీఏ సర్కారు సీలింగ్ పెట్టింది. దీంతో విభజన చట్టంలో ఉన్న నియోజక వర్గాల పెంపు అమలుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. సీట్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని అటర్నీ జనరల్ కూడా కేంద్రానికి నివేదిక ఇచ్చారు. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని ఏజీ నివేదిక ఇచ్చినా, మరికొందరు నిపుణలు వేరే మార్గాలను సూచిస్తున్నారు. అయితే తమవి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కాబట్టి రాజ్యాంగసవరణ చేయాల్సిన అవసరం లేదని తెలుగు రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి... గడిచిన రెండేళ్లలో పార్లమెంట్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలుమార్లు పార్లమెంటు వేదికగానే ప్రకటించింది. పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు ఇస్తూ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని పేర్కొంది. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి కేంద్ర హోంశాఖ పంపిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగంలోని 170 అధికరణను సవరించాల్సిందేనని అటార్నీ జనరల్ కూడా అభిప్రాయపడ్డారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహీర్ తెలియజేశారు. ఇదే అభిప్రాయాన్ని... టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కేంద్రం స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటే 170 (3) అధికరణకు సవరణలు చేయాల్సిందేనని, మరో దారి లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ అందింది గానీ.. ఇప్పట్లో సీట్లు పెంచే అవకాశం ఏ రాష్ట్రంలోనూ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణం ప్రకారం, 2026 జనాభా లెక్కలు వచ్చేంత వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ సీట్లు పెంచడం సాధ్యం కాదని రాజ్యసభలో సభ్యుడు టి.జి.వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ సమాధానమిచ్చారు. మరో సందర్భంలో టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం అటార్నీ జనరల్ వివరణ కోరగా, తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు కుదరదని కేంద్రానికి అటార్నీ జనరల్ నివేదిక ఇచ్చారు. నియోజక వర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని అటార్నీ జనరల్ చెప్పారని వివరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 క్లాజ్ 3 ప్రకారం 2026 తరువాత అందుబాటులోకి వచ్చే మొదటి జనాభా లెక్కల ప్రకారం మాత్రమే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచగలమని, ఈ లోగా అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని అటార్నీ జనరల్ తన నివేదికలో స్పష్టం చేశారు. దీంతో... రాజ్యాంగ సవరణతో పని లేకుండా ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు సవరణ చేస్తే సరిపోతుందని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మొదటి నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాయ్. మరోవైపు సీట్ల పెంపుపై కసరత్తు జరుగుతోందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడతామన్న అభిప్రాయాన్ని హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కూడా చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలని విభజన చట్టంలో ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ అంశం సంచలనం సృష్టించడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ రాజ్యాంగ సవరణ అవసరమన్నారని, అవసరం లేదని కొంత మంది నిపుణులు అంటున్నారని తెలిపారు. దీనిపై హోం, ఆర్థిక మంత్రులతో మాట్లాడినట్లు వెంకయ్య తెలిపారు. కేబినెట్ నోట్ తయారవుతోందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారని, న్యాయ విభాగం సలహా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణకు వెనుకాడబోమని వెంకయ్య స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. ఆ తర్వాత సీట్ల పెంపు గురించి ఆలోచించండి. ముందుగా ప్రత్యేక హోదాపైనా, రైల్వే బోర్డుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాకే... పార్లమెంట్లో సీట్ల పెంపు బిల్లు పెట్టాలంటూ కాంగ్రెస్ లింకు పెడుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో కలిసిన 17 రాజకీయ పార్టీలు సైతం పార్లమెంట్లో సీట్ల పెంపు బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించే కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తోంది.
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లును రానున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఏపీ, తెలంగాణ సీఎంలు ఒత్తిడి పెంచుతుంటే.. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో సీట్ల పెంపును చేర్చిన కాంగ్రె స్ పార్టీ తన వైఖరి ప్రకటించింది. ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌లాంటి ముఖ్యమైన హామీలను నెరవేర్చాకే సీట్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఏకపక్షంగా పార్లమెంటులో బిల్లు పెడితే వ్యతిరేకిస్తామని ఆ పార్టీ తేల్చి చెప్పింది. ఓవైపు సీట్ల పెంపుకు సంబంధించి చంద్రబాబునాయుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా కన్పిస్తుంటే... కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతోంది.
ఈ బిల్లును అడ్డుకోవడానికి యుపీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టాలన్న వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాజ్యసభలో సీట్ల పెంపును అడ్డుకోవాలని రఘువీరారెడ్డి చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓకే చెప్పారు. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతునిస్తున్న 17 పార్టీలను సీట్ల పెంపు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడానికి ఒప్పించగలిగితే రాజ్యసభలో బిల్లు వీగిపోతుందని రాహుల్‌కు రఘువీరా సూచించారు. లోక్‌సభలో బిల్లును పాసు చేయించుకోడానికి తగిన బలం ఉన్న ఎన్డీఏ పక్షాలకు... రాజ్యసభలో మాత్రం ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ బలంగా విన్పిస్తోంది. బీజేపీ నేతలు సైతం ఇదే అభిప్రాయంలో ఉన్నారు. రాజ్యసభలో అధికార ఎన్డీయే కన్నా ప్రతిపక్షాల బలమే ఎక్కువ. అధికార పక్షానికి 77 మంది ఎంపీలుండగా, యూపీఏకి 84, ఇతర పార్టీల్లో 82 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌కోవింద్‌కు మద్దతునిస్తున్న పార్టీల బలబలాలను కలుపుకొంటే రాజ్యసభలో ఆ పక్షం బలం 118కి చేరుకుంటున్నప్పటికీ... యూపీఏ మిత్రపక్షాల బలం 125 దాకా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు బిల్లు పార్లమెంటు ముందుకొస్తే బీహార్, కేరళ, బెంగాల్ రాష్ట్రాల ఎంపీలు కూడా తమ రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు నిర్ణయం తీసుకోవాలంటూ... డిమాండ్లను విన్పించే అవకాశం కూడా ఉందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయ్. దేశం మొత్తానికి అవసరమైన విషయాల్లో నిర్ణయం తీసుకోడానికి బీజేపీ సంకోచించదు. అయితే నియోజకవర్గాల సీట్ల పెంపు ఇష్యూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే సంబంధించినది. ఇలాంటి విషయంలో ఏకాభిప్రాయం ఉంటే అడుగు ముందుకు వేయడం వీజీకానీ... భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో అడుగు ముందుకు వేయడం సమంజసం కాదన్న అభిప్రాయం ఉంది. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన విషయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంగీకరించే ప్రసక్తే లేదని చెబుతోంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్ల పెంపుదలకు ఒప్పుకునే పనిలేదని... రాజకీయ కప్పదాట్ల కోసం సీట్ల పెంపు చేస్తారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది. అందుకే జగన్ ఎన్నికల కార్యాచరణ ప్రకటించి... పాదయాత్రకు సైతం సిద్ధమైపోతున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచి విన్పిస్తోంది. ఓవైపు ఇద్దరు చంద్రులు ఒత్తిడి తేస్తున్నా... వ్యతిరేకిస్తున్న వారు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ సీట్ల పెంపు బిల్లును ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారన్న మీమాంసం కూడా రాజకీయా వర్గాల్లో ఉంది. అయితే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం సీట్ల పెంపు బిల్లును ఎలాగైనా సరే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి తీరుతామని చెబుతున్నారు. కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలు ఇప్పటికే బిల్లును తయారుచేశాయని.. ఇక అడ్డంకులు తలెత్తబోవని భావిస్తున్నానన్నారు. విభజన బిల్లులో సీట్లపెంపును ప్రస్తావించిన కాంగ్రెస్ ఇప్పుడు అడ్డుకుంటామనడం విడ్డూరంగా ఉందన్నారు.
సీట్ల పెంపు ఇప్పుడు చంద్రులకు ప్రతిష్టాత్మకమైంది. పార్టీలోకి ఆహ్వానించిన నేతలకు ఎన్నికల్లో సీట్లిచ్చి గౌరవించుకోవాలని ఇద్దరు చంద్రులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే సీట్ల పెంపు బాల్ ఢిల్లీ కోర్టులో ఉంది. రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు జరిగితే కేంద్రానికి ఒనగూరేదేంటి... బిల్లుతో జనాలకు జరిగే మేలంటన్న అభిప్రాయంలో బీజేపీ పెద్దలున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బిల్లును అడ్డుకొని తీరుతామని తేల్చి చెబుతోంది. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ... సీట్ల పెంపుకు గ్రీన్ సిగ్నలివ్వడమంటే... కప్పదాట్లను బలపర్చడమేనంటోంది. తెలంగాణలో రెండు వైరి పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయ్. మరోవైపు ఇద్దరికీ ఆమోదయోగ్యమైన విషయంలో మనమెందుకు తాత్సారం చేయాలన్న అభిప్రాయం కూడా బీజేపీ నేతల్లో ఉంది. రెండు చోట్ల కూడా పార్టీ ప్రభావం తక్కువే కదా... ఇద్దరు నేతలు కేంద్రానికి మద్దతిస్తున్నప్పుడు మనమెందుకు అడ్డుకోవాలన్న అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే సీట్ల పెంపు విషయం మోదీ చేతుల్లో మాత్రమే ఉంది. ఆయన ఎస్ అంటే పాసవుతుంది... నో అనుకుంటే పెండింగ్ లో ఉంటుంది.

No comments:
Post a Comment