Friday, 26 May 2017

గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్

వన్నె తగ్గనిది... విలువ తగ్గనిది... అంతకంతకూ పెరిగేది... 365 రోజులు గిరాకి కలిగి ఉండేది బంగారం ఒక్కటే.  అవును బంగారం ప్రపంచాన్ని శాసిస్తోంది. జనంలో బంగారానికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ధర పెరిగినా బంగారాన్ని కొనుగోలు చేయడం మాత్రం తగ్గడం లేదు.  బంగారంపై పిచ్చి ఇండియన్లకు మాత్రమే కాదు... బంగారంపై ప్రేమ, మమకారం, అవసరం ప్రపంచ దేశాలకు ఎక్కువవుతోంది. బంగారు నిల్వలపై ప్రపంచ దేశాల కన్నుపడింది. ఎంతైతే  డబ్బు దాచుకుంటారో... అంత మొత్తానికి సమానంగా బంగారాన్ని కొనుగోలు చేయాలని జనం భావిస్తున్నారు. డబ్బుకంటే బంగారం రూపానికే ఎక్కువ వాల్యూ ఉంటుందన్న అభిప్రాయం జనంలో ఉంది.  బంగారం లాంటి జీవితం... బంగారు భవిష్యత్.....  బాబు బంగారమంటూ మన జీవితాల గురించి  బంగారం  ప్రభావం ఎంతో ఉంటుంది. గోల్డ్ ఈజ్ గోల్డ్ స్పెషల్ రిపోర్ట్...

బంగారం ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువ గిరాకీ ఉన్న ఖనిజం. అయితే బంగారం నిల్వలలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తక్కువ పరిణామంలోనే ఉన్నాయ్. అనాధిగా బంగారం ఆఫ్రికా ఖండంలో...  ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో లభించేది.  అక్కడి గనుల నుంచి పెద్ద ఎత్తున బంగార నిల్వలు ప్రపంచ వ్యాప్తంగా తరలి వచ్చేవి.   బంగారం, రాగి  క్రీస్తు పూర్వం 5000 ఏళ్ళ క్రితమే కనుగొన్నారు భూమి పై ఉన్న ఏడు ఖండాల్లోనూ బంగారు నిక్షేపాలను కనుగొన్నారు.  ప్రపంచంలో బంగారు నాణాలను తొలిసారిగా వాడుకలోకి తెచ్చిన ఘనత ప్రాచీన గ్రీకు ప్రాంతానికి చెందిన లిడియా రాజు కింగ్ క్రిస్ కు దక్కుతుంది.  క్రీస్తు పూర్వం 540 ప్రాంతంలో స్వచ్ఛమైన బంగారు నాణాలను వాడుకలోకి తెచ్చాడు. హేమం, కనకం, స్వర్ణం ఇలా పలు పేర్లతో బంగారాన్ని పిలుచుకుంటాం.  బంగారు ఒక అరుదైన ఖనిజం. అత్యంత ఖరీదైన వస్తువు. బంగారంతో అద్భుతమైన ఆభరణాలు తయారు చేయవచ్చు...  ఆయా వ్యక్తులు సైతం తమ వద్ద ఉన్న బంగారాన్ని బట్టి ధనికులుగా చెలామణీ అవుతున్నారు. బంగారాన్ని బట్టి ఆ దేశ సంపదను అంచనా వేస్తారు.  బంగారు నిల్వల ఆధారంగానే ఆ దేశ కరెన్సీని ముద్రిస్తుంది. అందుకే బంగారం ధర ప్రపంచమంతా ఒకే మాదిరిగా ఉంటుంది. ఒకచోట ఒకలా... మరో చోట మరోలా బంగారం ధరల్లో వ్యత్యాసం ఉండదు. బంగారం అతి తక్కువ ప్రమాణంలో నేల పొరలల్లో  నిక్షిప్తమై ఉంటుంది. భూమిలో బంగారం ప్రధానంగా రెండు రకాలుగా లభిస్తుంది. ప్రథమ శ్రేణి, లోడ్ నిల్వలు  ద్వితీయ శ్రేణి నిల్వలను ప్లసెర్ అంటారు. ఈజిప్టులో ఫారోల కాలంలో బంగారాన్ని గనుల నుంచి తవ్వేవారు. ఆ బంగారం అవసరానికి తగినంతగా లభించనప్పుడు యెమెన్,  దక్షిణాఫ్రికాలో అన్వేషణ కొనసాగించారు. అయితే బంగారు గనుల్లో పనిచేసే వారి జీవితం దుర్భరంగా ఉంటుంది.  గనుల్లో తవ్వకాలతో కార్మికులు కాలుష్యం బారినపడి... దీర్ఖకాలంలో ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రస్తుతం భూమి మీదా వాడుక లో ఉన్న బంగారం 20 శాతం మాత్రమేనని మరో 80 శాతం భూ గర్భం లోనే ఇంకా నిక్షిప్తమై ఉందని శాస్త్ర వేత్త ల అంచన.  భూమి పై ఉన్న అన్ని సముద్రాల అట్టడుగునా దాదాపు 2 కోట్ల టన్నుల వరకు బంగారం ఉంటుందని శాస్త్ర వేత్తల అభిప్రాయపడుతున్నారు. ఇతర గ్రహాల్లోనూ బంగారం అవశేషాలను కనిపెట్టినట్టుగా చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు గనుల నుంచి తవ్వి తీసిన మొత్తం బంగారంలో దాదాపు సగం బంగారం ఒకే ఒక్క ప్రదేశం నుంచి దొరికింది.  ఆ ప్రదేశమే దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్స్ రాండ్ . ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల పలుచని రేకులా సాగ గొట్టవచ్చును. బంగారం భౌతిక గుణగణాలు నిజంగా విశ్మయాన్ని కలిగిస్తాయ్.  అత్యంత పలుచని రేకులుగా సాగే అద్భుతమైన భౌతిక ధర్మాన్ని బంగారం కలిగి ఉంది.  వెంట్రుకల  కన్నా సన్నని తీగెలుగా బంగారం సాగుతుంది. ఒక ఔన్సు బంగారం అంటే 28 గ్రాముల బంగారాన్ని 50 మైళ్ళ పొడవున్న తీగెను చేయవచ్చట.  కేవలం ఒకగ్రాము భారమున్న బంగారాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యం గల రేకుగా సాగతీయోచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్వ కాలంలో బంగారాన్ని మారకంగా వినియోగించేవారు.  బంగారంనుండి ఎక్కువగా నాణేలు, ఆభరణాలు తయారు చేయుటకు ఉపయోగించడం జరిగేది. 1930నుండి బంగారపు నాణేల చలామణిని ఆగిపోయింది. 2012 నాటికి లక్షా 74 వేల 100  టన్నుల బంగారం ప్రపంచం వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యింది
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా పెరుగుతూ వచ్చాయ్. బంగారం ధర ఎన్నాళ్లకు రెట్టింపు అవుతోంది. బంగారం డిమాండ్ వచ్చే రోజుల్లో కొనసాగుతోంది... పడిపోతుందా... బంగారం డిమాండ్ ఎందుకు తగ్గుతోంది. బంగారం విషయంలో భారతీయులకు క్రేజ్ ఎక్కువ. అయితే భారతదేశంలో లభిస్తున్న బంగారం చాలా తక్కువనే చెప్పాలి. భారతీయులు కొనుగోలు చేస్తున్న బంగారమంతా ప్రపంచ  దేశాల నుంచి దిగుమతి చేసుకునేదే...  బంగారాన్ని అంతర్జాతీయ రేట్లు ఆధారంగా విక్రయిస్తారు. కొనుగోళ్లు జరుపుతారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ఒకే రకమైన ధరను కలిగి ఉంటుంది.  బంగారం ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుంది. 1925లో పది గ్రాముల బంగారం ధర రూ 18.75 పైసలు. 1950లో పది గ్రాముల బంగారం ధర రూ. 99.18 పైసలు... 1975లో పది గ్రాముల బంగారం ధర రూ. 540. అదే 2000 సంవత్సరంలో పది గ్రాముల బంగారం ధర రూ. 4400. అదే ప్రస్తుతం రూ. 29,000గా ఉంది.  బంగారం ధరలు అంతకంతకు పెరుగుతుండగా... రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల బంగారం కొనుగోలు చేయడంతో  దాని ధర పలానా విధంగా పెరిగిందని సంతోషించవచ్చు.
దేశ ప్రజలు బంగారం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్న పలు చర్యల మూలంగా 13 ఏళ్ల కనిష్ట స్థాయికి ఇండియాలో బంగారం డిమాండ్ తగ్గింది. 2016లో గోల్డ్ డిమాండ్ 580 టన్నులుగా ఉంది. అది ఈ ఏడాది 34 శాతం తగ్గినట్టుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2003 తర్వాత ఇలాంటి పరిస్థితి చూడటం ఇదే మొదటి  సారిగా గోల్డ్ ఎక్సపర్ట్స్ చెబుతున్నారు. 2016 బంగారం వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు వచ్చినట్టుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. 2016లో గోల్డ్ దిగుమతులు 498 టన్నులుగా ఉంది. 2015 నుంచి నెలకు 60 టన్నుల గోల్డ్ దిగుమతులు జరుగుతున్నాయ్.  అయితే 2020 నాటికి భారతదేశంలో బంగారం డిమాండ్ 850 నుంచి 950 టన్నుల వరకు ఉంటుందని వరల్డ్ గోల్డ కౌన్సిల్ పేర్కొంది.  2010లో భారతదేశంలో గోల్డ్ డిమాండ్ 1006 టన్నులుగా ఉంది. 2011లో 986 టన్నులుగా ఉంది. 2012లో ఆ సంఖ్య 864 టన్నులుగా ఉంది. 2013లో 975 టన్నులుగా ఉంది. 2014లో బంగారం డిమాండ్ 811 టన్నులు ఉంది. 2015లో 858 టన్నులు ఉంది. 2016లో అది 580 టన్నులకు పడిపోయింది. బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోడానికి కారణం... 2016 బడ్జెట్లో 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ వేయడమన్న అభిప్రాయాన్ని పరిశ్రమవర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. దీనికి నిరసనగా 42 రోజులపాటు ఆందోళన కూడా చేశారు.   దేశీయంగా బంగారు దొరకడం తక్కువకావడంతో... ఎక్కువ శాతం బంగారాన్ని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
భారతదేశంలో బంగారు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతోంది. మనం వాడుతున్న బంగారమంతా బయట నుంచి వచ్చేదేనా? కర్ణాటకలో తప్పించి మిగతా చోట్ల దొరికే బంగారం అంతంత మాత్రమేనా?
ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో సింహ భాగం భార‌త్‌, చైనా దేశాల నుంచే జ‌రుగుతోంది. ప్రపంచంలో ని బంగారం లో దాదాపు 11 శాతం భారతదేశంలో ని మహిళా ల వద్ద ఆభరణాల రూపం లోనే ఉంది. ఈ ఆభరణాల పరిమాణంత అమెరికా , జర్మని , స్వీట్లర్జాండ్ , ఐ ఎం ఎఫ్ ల మొత్తం బంగారు నిల్వల కంటే చాలా ఎక్కువ. అంత‌ర్జాతీయంగా ప‌సిడి ధ‌ర‌లు మార‌డంలో వీటి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌త కొద్ది నెల‌లుగా ఈ రెండు దేశాల్లో వినియోగం త‌గ్గుతోంది. ఆర్థిక ప‌రిస్థితులు  ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో బంగారం త‌దిత‌ర సాధనాల్లో పెట్టుబ‌డి దిశ‌గా కొనుగోళ్లు జ‌రిపేవారు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత బంగారం అమ్మాకాలపైనా ప్రభావం చూపింది. అమ్మకాలు తగ్గినప్పటికీ... బంగారం ధర మాత్రం అదే విధంగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా దొరుకుతున్న బంగారు నిల్వల్లో దేశంలో దొరుకుతున్న బంగారం నిల్వలకు చాలా తక్కువగా లభిస్తున్నాయ్. మెజార్టీ మొత్తం బయట దేశాల నుంచే మనం కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రపంచంలో లభించే గోల్డ్ నిల్వల్లో మెజార్టీ మన దేశంలో వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచ వ్యాప్తంగా 116.5 మిలిటన్ టన్నుల ఖనిజాలుండగా...   22.4 మిలియన్ టన్నుల బంగారం నిల్వలున్నాయి. అదే సమయంలో భారతదేశంలో ఉన్న గోల్డ్ నిల్వలు కేవలం ఒక శాతంగానే ఉన్నాయన్న అంచనా ఉంది.  దక్షిణాఫ్రికా మనకంటే 60 సార్లు అధికంగా ఉత్పత్తి చేయగలిగితే, కెనడా 22 సార్లు, ఆస్ట్రేలియా 5 సార్లు మన కంటే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయగలుగుతున్నాయ్. అయితే బంగార నిల్వలను వెలికితీయడం ఏటికేడు తగ్గుతూ వస్తోంది. దేశంలో బంగారు అందుబాటులో ఉన్నప్పటికీ... 1999-2000 సంవత్సరాల మధ్య అది 2,586 కేజీలుగా ఉంది. 2002-03 నాటికి అది 3,049 కేజీలకు చేరింది.  భారతదేశంలో బంగారం నిల్వలు ఎక్కువగా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్, హుట్టి గోల్డ్ ఫీల్డ్, ఆంధ్రప్రదేశ్ లోని రామగిరి గోల్డ్ ఫీల్డ్ లో  ఉన్నాయ్.  కర్ణాటకలో 42 వేల కేజీల బంగారు లభ్యవుతుందని అంచనా వేస్తున్నారు. అది దేశంలోని 88.7 శాతంతో సమానం. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని రామగిరి వద్ద పెద్ద మొత్తంలో బంగారు నిల్వలున్నాయ్. జార్ఖండ్, కేరళలోనూ బంగారం లభ్యవుతోంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెద్ద ఎత్తున గోల్డ్ నిల్వలున్నాయ్.  రిజర్వ్ బ్యాంక్ చేతి వద్ద  1312.5 బిలియన్ రూపాయల బంగారు నిల్వలున్నాయి. ఆ నిల్వల ఆధారంగానే కరెన్సీ ముద్రణ జరుగుతుంది.
భారతదేశంలోని దేవాలయాల్లో కుప్పలుతెప్పలుగా బంగారం నిల్వలున్నాయన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి దేవాలయంలో బంగారు కోటాను కోట్ల విలువ  కలిగినది ఉన్నదని అంటారు. అదే సమయంలో టీటీడీ వద్ద భారీగా బంగారం నిల్వలున్నట్టుగా చెబుతున్నారు. అసలు భారతదేశంలోని దేవాలయాల్లో బంగారు నిల్వలు ఏ మేరకు ఉన్నాయ్. భారతదేశంలో ఇష్టదైవానికి బంగారం సమర్పిస్తే మంచి జరుగుతుందన్న అభిప్రాయం భక్తుల్లో ఎక్కువగా ఉంది. అందుకే వారి ఇష్టదైవాలను స్మరిస్తూ... ఆయా ఆలయాలకు భక్తుల బంగారు నగలు, బంగారు వస్తువులను సమర్పించుకుంటారు. ఇలా సమర్పించుకున్న బంగారు నిల్వలు దేశంలోని కీలక ఆలయాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయ్. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 7 వేల కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయ్. మార్కెట్లో ఆ బంగారం విలువ విలువ సుమారు రూ.1,800 కోట్లుగా ఉంది. ముంబయి... సిద్ధివినాయక గణపతి మందిరం 160 కిలోల బంగారు ఆభరణాలున్నాయ్. షిర్డి సాయిబాబా మందిరం 384 కిలోలు గుజరాత్‌ సోమనాథ్‌ మందిరం 35 కిలోలు, విజయవాడ కనకదుర్గ ఆలయం 110 కిలోల బంగారం నిల్వలున్నాయ్. ఇక కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలోని  నేలమాళిగల్లో దాగిన అపారసంపద బయట పడింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే ఇక్కడి సంపద, నిక్షేపాలపై సుప్రీం పర్యవేక్షణ ఉండటంతో... ఇక్కడ సంపదపై పూర్తి స్థాయి ఆధారాలు లభ్యం కాలేదు.
బంగారంపై ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి నిపుణులు ఏం చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడాకి సంబంధించి అందుతున్న సూచనలేంటి? బంగారం విషయంలో కామన్ మ్యాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
బంగారమంటే స్త్రీలకు మొజు. బంగారమంటే మహిళలు పడిచస్తారు. బంగారు ఆభరణాలు ధరించాలని... బంగారాన్ని తగినంతగా సమకూర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. ఫంక్షన్లకు వెళ్లాలంటే బంగారు లేకుండా వెళ్లనే వెళ్లరు. బంగారు ధరించడం ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా మహిళలు భావిస్తారు.  భారతీయ సంస్కృతి ప్రకారం పండుగ, పెళ్లిళ్లంటే గుర్తుకొచ్చేది బంగారం మాత్రమే. అందుకే భారత దేశంలో బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు ఏమాత్రం తగ్గట్లేదని సర్వేలో తేలింది. భారతీయులు ఏడాదికి 700-900 టన్నుల వరకు బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే బంగారం వినియోగంలో భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. బంగారం నిల్వలను, కొనుగోళ్లను భారతీయ వివాహ వ్యవస్థ పెంచుతోంది. ఈ క్రమంలో 18వేల టన్నుల బంగారాన్ని భారతీయులు ధరించుకుని తిరుగుతున్నారని సర్వే తేల్చింది. దీని విలువ అక్షరాల 60 లక్షల కోట్లు. అమెరికా, యూరప్, స్విజ్ బ్యాంకుల కంటే భారత రిజర్వ్ బ్యాంక్‌ ఇతరత్రా బ్యాంకుల్లో దాచే బంగారాన్ని లెక్కకు తీసుకోకుండా, గృహస్థుల వద్ద మాత్రం 950 బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంటుందని అంచనా. అయితే బంగారం పెట్టుబడుల వెనుక పెద్ద ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పటికీ భారతీయ కుటుంబాలు బంగారాన్ని అమ్ముకునేందుకు ఇష్టపడట్లేదని, అందుకే భారత్‌లో బంగారం నిల్వ శాతం పెరిగిపోతోందని సర్వే తెలిపింది. రూపాయి బలహీన పడటానికి బంగారు వినియోగం పెరగడమే కారణమని, ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత భారత్ బంగారాన్నే అధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. డీమానిటైజేషన్ తర్వాత అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ ప‌థ‌క‌మైన ఎస్‌పీడీఆర్ నుంచి గ‌త నెల రోజులుగా ఇన్వెస్ట‌ర్లు 75 ట‌న్నుల బంగారానికి స‌మాన‌మైన పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌న దేశంలో అన్ని ర‌కాల బంగారం కొనుగోళ్లు బాగా ప‌డిపోయాయి. దీంతో ఈ సంవ‌త్స‌రం కూడా బంగారు దిగుమతులు 500 ట‌న్నులు మించ‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.  డాల‌ర్ ప్ర‌భావం డాల‌ర్ ప్ర‌భావం అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌ల‌ను డాల‌ర్ల మార‌కంలో నిర్ణ‌యిస్తారు. ఇత‌ర క‌రెన్సీల‌తో పోలిస్తే డాల‌ర్ విలువ పెరిగితే బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయి. డాల‌రు మార‌కం విలువ బ‌ల‌హీన‌ప‌డితే బంగారం పెరుగుతుంది.
శుభ సూచికకు చిహ్నం  బంగారం... బంగారమంటే ఒక అభిమానం... ఒక ధైర్యం... ఒక భరోసా... ఒక ధీమా... బంగారం లాంటి జీవితం... బంగారం లాంటి మనిషి... బంగారం లాంటి వ్యవస్థ... బంగారాన్ని ఇలా అనేక విధాలుగా మనం పిలుచుకుంటాం... అంతెందుకు ఎవరైనా పోటీలో విజేతగా నిలిస్తే బంగారు పతకాన్ని బహూకరిస్తాం... ఇంతట మహిమాన్వితమైన బంగారం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం...
బంగారానికి బంగారమే సరిపోతుంది. బంగారం లాంటి మాట చెప్పావ్ అంటారు... బంగారం అంటూ వ్యక్తులను పిలుచుకుంటారు... బంగారంతో తయారైన కప్పులను గిఫ్టులుగా ఇస్తారు. ఆయా రాజుల పాలన సువర్ణయుగంగా పిలుస్తారు. బంగారంతో తయారు చేసిన ట్రోఫీలను బహూకరిస్తారు. ఒలింపిక్స్ తో గెలిచిన వారికి గోల్డ్ మెడల్స్ ను ఇస్తారు. కొంత మంది విగ్రహాలకు బంగారపు పూత పూస్తారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఎమ్మీ అవార్డులు, బ్రిటీష్ అకాడెమీ అవార్డులు అన్నీంట్లో కూడా బంగారపు పూత ట్రోఫీలను అందిస్తారు.
ప్రఖ్యాత అర్ధశాస్త్ర నిపుణులు అరిస్టాటిల్ సైతం కొన్ని విషయాల్లో బంగారు భావన పదాన్ని ఉపయోగించారు. యువతకు బంగారు భవిత రాబోతుదంటూ అభివర్ణిస్తారు. అభివృద్ధి సూచికగా కూడా బంగారాన్ని కొలుస్తారు. కాపురం బంగారంలా ఉందని... మా పిల్లల జీవితాలు బంగారంగా ఉన్నాయంటూ కూడా చెప్తారు. గోల్డెన్ ఇయర్స్, గోల్డెన్ ఏజ్ అంటూ జీవిత ఘట్టాలను వివరిస్తారు. క్రైస్తవంలోనూ, జూడాయిజంలోనూ బంగారం దైవత్వంతో కూడినదని చెబుతారు. అంతెందుకు పెళ్లిళ్లలోనూ, ఎంగేజ్మెంట్ల సందర్భంగానూ బంగారు ఉంగారాలను తొడుగుతారు. బంగారు కీరిటమంటూ కీర్తిస్తారు. గోల్డెన్ ఛాన్స్ అంటూ అవకాశం గురించి చెబుతారు. గెల్డెన్ అవర్ అని వ్యక్తి ప్రాణాన్ని నిలెబట్టే సమయంగానూ చెప్తారు. మొన్నటి వరకు భారత్ నెంబర్ వన్... ఇప్పుడు గోల్డ్ వినియోగంలో చైనా నెంబర్ వన్...  బంగారానికి తుప్పు పట్టదు... చిలుము పట్టదు...  బంగారం బంగారమే...
బంగారం... బంగారమే. బంగారం ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది. బంగారంతో సాటి గల వస్తువు ఇంత వరకు భూమిపై లేదు. బంగారం కంటే ఖరీదైన వస్తువులున్నప్పటికీ బంగారం మంది అవి దిగదుడుపే.  బంగారంతో ఏదీ కూడా సరిసమానం కాదు. గత రెండేళ్లుగా బంగారం దిగుమతులు భారత్ లో తగ్గినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. అయితే 2017లో తిరిగి భారతదేశంలోనూ పెద్ద ఎత్తున దిగుమతులు పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారంపై భారీగా ప్రభావం చూపినప్పటికీ అది ఈ ఏడాది చివరకు పుంజుకుంటుందన్న అంచనాను పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. ఇదీ ఇవాళ్టి స్పెషల్ రిపోర్ట్

భాగ్యనగరంలో సరగోసీ కల్లోలం


భాగ్యనగరంలో ఏదైనా సాధ్యమే...  కొందరికి... అవును నేను చెబుతున్నది నిజమా... తెలుగు సినిమా హీరోలు చెప్పే డైలాగ్ ను ఇక్కడ చెప్పుకోవాలి. దేనికైనా ఓ రేటు. అవును ఇక్కడ పైసలుంటే ఏ పనైనా ఇట్టే అయిపోతుంది. అది ఎంత పెద్ద పనైనా సరే...  చేసేందుకు ఓ టీం...  ఓ నెట్ వర్క్ ఎల్లప్పుడూ రెడీ. హైదరాబాద్ లో జరుగుతున్న సరగోసి నిబంధనలకు నీళ్లొదిలేస్తోంది.  కాసులు విదిలిస్తే కనేందుకు మనుషులు సిద్ధం... ఆ మనుషుల్ని వలేసి పట్టుకునేందు ముఠాలూ సిద్ధం... వారిని కంట్రోల్ చేసేందుకు ఓ నెట్ వర్కూ సిద్ధం...
హైదరాబాద్ లో ఇప్పుడు సరగోసి విధానం కల్పతరువులా మారింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం వాణిజ్యపరంగా సరగోసిని వినియోగించడం నిషేదించడంతో...  ఇప్పుడు సరగోసి ఒక సిక్రీట్ బిజినెస్ గా మారింది. కేంద్ర చట్టంతో వాణిజ్య పరంగా సరగోసి నిషేదించబడినప్పటికీ... ఆసుపత్రులు, సంతానోత్పత్తి కేంద్రాలు మాత్రం తమ వికృత క్రీడను కొనసాగిస్తున్నాయ్. ఎజెంట్లను నియమించుకొని... అమాయక మహిళలకు ఆశ చూపిస్తూ... పల్లెటూరి మహిళలను  సరగొసి రొంపిలోకి దింపుతున్నారు. ఎక్కువగా అనుమానం రాకుండా ఉండేందుకు నగరంలోని శివారు ప్రాంతాల్లో ఈ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. బాలానగర్ , సురారం ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా జరుగుతోంది. పెళ్లిగాని మహిళలకు పెద్ద ఎత్తున డబ్బులు ఎరచూపి ఎజెంట్లు ఈ పనులు కానిచ్చేస్తున్నారు. 18 నుంచి 20 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిని ఇందుకు సిద్ధం చేస్తున్నారు. తల్లికావాలని కోరిక ఉన్న పలువురు మహిళలకు సుమారు రూ. 4 నుంచి 5 లక్షల వరకు ఆశ చూపి... వారు గర్భం దాల్చేలే చేస్తున్నారు. ఇందుకు ఫ్యాక్టరీల్లో పనిచేసే అమాయక యువతులు టార్గెట్ అవుతున్నారు. నెలకు రూ. 8 వేలు అంతకన్నా తక్కువ జీతం సంపాదించేవారందరూ...  పెద్ద మొత్తంలో వచ్చే డబ్బుకు దాసోహమవుతున్నారు. నెలకు 8 వేల రూపాయలంటే ఏడాదికి లక్ష... అదే గర్భం దాల్చితే... 9 నెలలకే నాలుగు లక్షలు అంటే సుమారు నెలకు రూ. 45 వేలు. ఇంత మొత్తంలో డబ్బులు వారు ఏం చేసిన సంపాదించడం కష్టమే. అందుకే అమాయక పల్లెటూరి మహిళలు ఇందుకు సిద్ధమవుతున్నారు.  సరగోసీ ద్వారా బిడ్డల్ని కనే తల్లులకు ముఖ్యంగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో మొత్తంలో కాసులు ముట్టజెప్తున్నారు. హైదరాబాద్ లో ఈ విధానం కింద తల్లులకు సుమారు రూ. 4 లక్షల వరకు ఇస్తుండగా, బెంగళూరులో, ముంబాయిలో రూ. 4 లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు అందిస్తున్నారు.
పెద్ద మొత్తంలో డబ్బు  ఎజెంట్లకు ఆసుపత్రుల నుంచి లభిస్తుంటే... ఎజెంట్లు వారి కమిషన్ మినహాయించుకొని సరగొసీ మహిళలకు డబ్బులను అందిజేస్తున్నారు. చిత్రమైన విషయమేమంటే... పెద్ద ఎత్తులో మహిళలను ఆకట్టుకుంటున్న ఏజెంట్లు నగరంలో వివిధ పత్రికల్లో వేరే పేర్లతో ప్రకటనలు ఇస్తూ...  టోల్ ఫ్రీ నెంబర్లతో మహిళలకు ఎరవేస్తున్నారు.  ఎవరైతే మహిళలు డబ్బులు అవసరముంటుందో... తేలిగ్గా డబ్బు సంపాదించొచ్చన్న ఆశ ఉన్న మహిళలు ఇందుకు సిద్ధమమవుతుండటంతో ఎజెంట్లకు కాసుల వర్షం కురుస్తోంది.
చట్టం ఏం చెబుతోంది. సరోగసి విధానం ద్వారా బిడ్డలను కనే విషయంలో కేంద్రం ఏం చెబుతోంది. ఐవీఎఫ్ కేంద్రాలు ఏం చేస్తున్నాయ్. చట్టంలో ఉన్న లొసుగులే ఐవీఎఫ్ కేంద్రాలకు కాసులు కురిపిస్తున్నాయా... ఐవీఎఫ్  కేంద్రాలు చట్టాన్ని ఏవిధంగా వాడుకుంటున్నాయ్...  కేంద్రం ప్రభుత్వం తెచ్చిన బిల్లు ప్రకారం... ఇప్పటి వరకు మహిళలకు స్వచ్చంధంగా గర్భాన్ని దాల్చాల్సి ఉంటుంది. డబ్బు అన్న ప్రస్తావన గర్భం దాల్చిన మహిళలకు ఇవ్వడమన్నది అస్సలు జరక్కూడదని చట్టం చెబుతోంది. అయితే ఎవరైతే సరోగసి ద్వారా వేరేవారి గర్భాన్ని అద్దెకు తీసుకుంటున్నారో వారు... ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు... ఇతర ఖర్చులను భరించాల్సి ఉంటుంది. కేంద్రం 2010లో తీసుకొచ్చిన ఎ.ఆర్.టి. అసిస్టెడ్ రిప్రొడెక్టివ్ టెక్నాలిజీ డ్రాఫ్ట్ నిబంధనల ప్రకారం... వాణిజ్యపరమైన గర్భందాల్చేందుకు కొంత మేర వెసులుబాటును సాకుగా చూపిస్తూ... ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)  కేంద్రాలు పుట్టుగొడుగుల్లా వెలుస్తున్నాయ్. అయితే ఇది చట్టం కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం డ్రాఫ్ నిబంధనలతో సంతానోత్పత్తి కేంద్రాలు జనాల జేబులకు చిల్లులుపెడుతున్నాయ్. చాలా ఐవీఎఫ్ కేంద్రాలు అక్రమంగా నడుస్తున్నాయ్. పెద్ద డబ్బులను ఆశ చూపించి... గర్భం దాల్చితే తలరాత మారిపోతుందని... 9 నెలలు రిస్కు తీసుకుంటే చాలంటూ వారిని ఈ రొంపిలోకి దించుతున్నాయ్. అయితే ఇప్పుడు సరగొసీ ద్వారా బిడ్డలను కన్న పిల్లల ఆరోగ్యానికి గ్యారెంటీ ఎవరూ ఉండరు. బిడ్డను కన్న తల్లికి తన పని పూర్తైపోతుంది. ఆసుపత్రులు సైతం బిడ్డను ఎవరైతే సరోగసి కోరుకుంటున్నారో వారికి అప్పజెప్పి చేతులు దులిపేసుకుంటారు. ఇక ఎజెంటు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. నా పని... మీకు బిడ్డను కనివ్వడం వరకే... ఆ తర్వాత దేవుడిదే దయా అంటూ చల్లగా ఎజెంట్లు జారుకుంటున్నారు. గత ఏడాది కేంద్రం సరోగసి రెగ్యులేషన్ బిల్లు 2016ను కేబినెట్ ఆమోదించింది. అయితే ఈ బిల్లు పూర్తిగా వాణిజ్యపరంగా గర్భం దాల్చడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అయితే ఇది చట్టం కావాల్సి ఉంది. చట్టం కాకపోవడంతో అక్రమార్కులకు, ఐవీఎఫ్ సెంటర్లకు ఇది వరంగా మారింది. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎజెంట్లు, ఐవీఎఫ్ కేంద్రాలు అమాయకులను ఇష్టానుసారం దోచుసుకుంటున్నాయ్. సంతానం అవసరం ఒకరిది. డబ్బు అవసరం మరొకరిది. ఇద్దరి అవసరాలను క్యాష్ చేసుకునేందుకు అటు ఆసుపత్రులు... ఇటు ఎజెంట్లు కావాల్సిన విధంగా ప్రణాళికలు రూపొందించేస్తారు.
దేవుడు చల్లంగా చూసి బిడ్డలను ప్రాసాదించాలంటూ మొక్కుకునే వారిని మనం చూశాం. అయితే ఇక్కడ కొంత మంది తల్లిదండ్రులు తమకు పిల్లలు పుట్టకపోయినప్పటికీ... తమకు పుట్టబోయే బిడ్డలు అందంగా పుట్టాలంటూ కోరికల చిట్టా విప్పుతున్నారు. ఇది ఏజెంట్లకు, కాలేజీ అమ్మాయిలకు పెద్ద ఎత్తున కాసులు కురిపిస్తోంది. అండం విడుదలయ్యే సందర్భంగా ఒక గంట ముందు ఆసుపత్రులకు వెళ్లొస్తే రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు వస్తుంటే వద్దనుకునేవారెవరుంటారు. తాజాగా పరిశోధనల ప్రకారం మహిళా ఎగ్ డోనర్స్ కోసం ఏజెంట్లు, ఆసుపత్రులు పెద్ద ఎత్తున శోధన మొదలుపెట్టాయి.  ఎవరు దొరుకుతారా... మనకు అనుకూలమైనవారంటూ లెక్కలు వేసుకుంటున్నారు. వాణిజ్యపరంగా గర్భం దాల్చడాన్ని నిషేదించాలని కేంద్రం యోచిస్తున్న తరుణంలో... ఆరోగ్యకరమైన మహిళలకు, అందమైన మహిళల కోసం ఐవీఎఫ్ కేంద్రాలు ఎజెంట్లను పురమాయిస్తున్నాయ్. మహిళా ఎగ్ డోనర్లకు చెల్లించే మొత్తం రూ. 20 వేల నుంచి ప్రారంభమవుతోంది. అదే డిగ్రీ చదువుకున్న, కాలేజీ చదువుతున్న అమ్మాయిలకైతే ఆ మొత్తం రూ. 30 నుంచి 40 వేల దాకా ఉంది. బాగా అందమైన అమ్మాయిలు, చదువుకున్న అమ్మాయిలకైతే ఈ మొత్తం రూ. 40 వేల నుంచి 50 వేల వరకు ఇచ్చేందుకు సైతం  ఏజెంట్లు రెడీ అవుతున్నారు. సంతానం కోసం వచ్చేవారి అవసరాలను, అభిరుచులను బట్టి... తాము పెద్ద మొత్తంలో ఎగ్ డోనర్స్ కు డబ్బులు ఎర వేస్తున్నట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఏజెంట్లు వివరిస్తున్నారు. 18 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలను ముంబయి, బెంగళూరు, చెన్నై వరకు వెళ్లేందుకు మంచి మొత్తాలను ఆఫర్ చేస్తున్నారు. ఇందుకు గాను వారికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేలు, రూ 30 వేల వరకు కూడా ముట్టజెబుతున్నారు. అదే సమయంలో అందమైన అమ్మాయి కేరళ నుంచి కావాలనుకుంటే వారికి రూ. 50 వేల వరకు నజరానా అందించేందుకు ఐవీఎఫ్ కేంద్రాలు ఎజెంట్లను రంగంలోకి దించేస్తున్నాయ్. ఇందుకోసం అమ్మాయిలు ఫోటోలను పంపించాల్సి ఉంటుంది. అదే ముంబయి, పూణే ప్రాంతాల్లో ఎగ్ డోనర్  చేసే అమ్మాయిలకు రూ. 30 వేల నుంచి 40 వేల మొత్తాన్ని అందిస్తున్నారు.  ఎగ్ డోనర్  చేసే అమ్మాయిల రుతు స్రావం సమయం పూర్తయ్యాక అండాలను సేకరిస్తారు.
ఐవీఎఫ్ కేంద్రాల దందా కొన్నిసార్లు పతాక స్థాయిలోకి వెళ్తోంది. సంతానం కోసం వచ్చే తల్లిదండ్రులు వారి అభిరుచులకు సంబంధించి తెలుసుకోవడం... వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రేట్లు ఫిక్స్ చేయడం కామనైపోయింది. కేవలం సంతానం కోసమే వచ్చిన జంటలకు ఐవీఎఫ్ కేంద్రాలు, ఎజెంట్లు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయ్. ఎగ్ డోనర్స్ చేసే మహిళల విషయంలో ఎజెంట్లు, ఐవీఎఫ్ కేంద్రాలు కొన్ని రకాల పంథాలను అనుసరిస్తున్నాయ్. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయా జంటలకు కావాల్సిన పిల్లను అందించేందుకు ఎగ్ డోనర్ గా ఉన్న మహిళలను దోపిడీ చేస్తున్నారు. ఈ కోవలోనే... ఏ పాటిజివ్ బ్లడ్ గ్రూపు ఉన్న మహిళలను అన్వేషించేందుకు మరికొంత మంది ఎజెంట్లు ఇంకొన్ని దారులు వెదుక్కుంటారు. వారికి ప్రత్యేకంగా సొమ్ములు ముట్టజెప్పేందుకు ఎజెంట్లు రెడీ అవుతారు. ముందుగా ఎగ్ డోనేషన్ చేసే మహిళలు వారి ఆరోగ్య సంబంధమైన ఫుల్ డేటాను ఎజెంట్లుకు అందించాల్సి ఉంటుంది. రంగు, ఎత్తు, బరువు, బ్లడ్ గ్రూపు, వివాహం అయిన మహిళలైతే వివాహనమోదు ధ్రువపత్రాన్ని సైతం సమర్పించాల్సి ఉంటుంది. మరికొంత మంది ఇంకొంచెం ముందుడేగిసి తమ కొర్కెల చిట్టా విప్పేస్తారు. అప్పటికే తల్లులుగా ఉన్న కొంత మంది మహిళల విషయంలో వారి పిల్లల ఫోటోలను సైతం పంపించాల్సిందిగా కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా  తమకు ఐవీఎఫ్ పద్దతిలో పుట్టబోయే బిడ్డలు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఎక్కువ శాతం ఎగ్ డోనర్ గా ఉన్న మహిళలు వారు అజ్ఞాతంలోనే ఉంటారు. వారి ఐడెంటిటీని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. మరికొన్ని సార్లు నకిలీ ఏజెంట్ల బారినపడి మోసపోయే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉండటం ఆందోళన కలిగించే విషయం. కొన్నిసార్లు మహిళలకు అండం దానం చేయడం కోసం మైనర్ సర్జరీలు చేసినప్పుడు తలెత్తే పరిణామాల విషయంలో నకిలీ ఎజెంట్లు మహిళలను మోసం చేయడం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది.
2016 సరోగసి చట్టం ఏం చెబుతోంది. సరోగసి విధానంలో నిబంధనలు ఎలా ఉన్నాయ్... ఐవీఎఫ్ కేంద్రాలు ఏం చెబుతున్నాయ్... నియంత్రణ, నిబంధలకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన 2016 సరోగసి బిల్లు ప్రకారం వాణిజ్యపరమైన గర్భం దాల్చడాన్ని నిషేదించింది. న్యాయబద్ధమైన, సమంజసమైన భావనగా మాత్రమే గర్భం దాల్చమన్న ప్రక్రియ జరగాలి... కేవలం 23 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు, 26 నుంచి 55 ఏళ్ల మధ్య వయసు ఉన్న పురుషులు మాత్రమే ఈ విధానం ద్వారా సంతానాన్ని కోరుకోవచ్చు. సరోగసి ద్వారా సంతానాన్ని కోరుకునే దంపతులు భారతీయులై ఉండాలి. వారి వివాహం చేసుకొని ఐదేళ్లు పూర్తయి ఉండాలి. అదే సమయంలో సరగోసీ ద్వారా సంతానాన్ని కోరే దంపుతులకు సంతానం లేకుండా ఉండటమే కాక, దత్తత తీసుకున్న చరిత్ర కూడా ఉండకూడదు. అంతకుముందు సరోగసి ద్వారా సంతానాన్ని కూడా కనరాదన్న నిబంధన విధించారు. ఒకవేళ సరోగసి ద్వారా సంతానాన్ని కన్నప్పుడు ఆయా బిడ్డలు అనారోగ్యంగా ఉండటం, మతిస్థిమితంతో ఉండటం... ఆరోగ్యంగా ఫిట్ గా లేకుండా ఉండటం, బతకడం కష్టసాధ్యమైనప్పుడు.... సరోగసి ద్వారా మరోసారి సంతానాన్ని కనే వెసులుబాటు చట్టం కల్పిస్తోంది. సరోగసి ద్వారా గర్భం దాల్చే మహిళ... పిల్లలు కనాలని కోరుకుంటున్న మహిళకు దగ్గర రక్తసంబంధం కలిగి ఉండాలి. వారి వయస్సు కూడా 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అదే సమయంలో సరోగసి ద్వారా కన్న బిడ్డకు సాధారణంగా కనే బిడ్డలకు ఉన్న పూర్తి హక్కులు లభిస్తాయ్.
మరోవైపు తల్లిదండ్రులు కాలేకపోయిన అనేక మంది సరోగసి విధానం కావాల్సిందేనంటూ స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ఆన్ లైన్ ఉద్యమాన్ని సైతం మొదలుపెట్టారు. తల్లిదండ్రులుగా మాతృప్రేమను పొందాలనుకున్నవారు... సరోగసి విధానం లేకుంటే... బిడ్డలను కనాలన్న కోరిక ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. సరోగసి కోసం ఆన్ లైన్ ఉద్యమం మొదలైంది. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం వాణిజ్యపరమైన గర్భం దాల్చడమన్నది నిషేదం. అయితే బిడ్డలను కనలేని వారి బాధ ఎవరికి తెలుస్తుందన్న అభిప్రాయాన్ని ఆన్ లైన్ లో పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇందుకోసం చట్టాన్ని సవరించాలని కూడా వారు కోరుతున్నారు. మారుతున్న ఆధునిక టెక్నాలజీ ప్రకారం తల్లిదండ్రులయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు సరోగసి వద్దంటారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో అక్రమాలు  ఎక్కడ జరుగుతున్నాయో ప్రభుత్వ యంత్రాంగాలకు బాగా తెలుసనని... అలాంటప్పుడు అక్రమాలకు అడ్డుకట్టవేసి... నిజమైన సరోగసి విధానాన్ని అనుమతించాలని వారు కోరుతున్నారు. గత ఏడాది నవంబర్ 2016లో ప్రవేశపెట్టిన సరోగసి బిల్లు ప్రకారం... మహిళలను దోపిడీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సరోగసి ద్వారా గర్భం దాల్చేవారికి మెడికల్ బిల్లులు మాత్రమే ఇవ్వాలని కూడా బిల్లులో పేర్కొన్నారు. సరోగసి తల్లికి ఏజెంట్లుగానీ, ఐవీఎఫ్ కేంద్రాలు కానీ అణాపైసా చెల్లించారదని చట్టంలో కేంద్రం స్పష్టం చేసింది. నిబంధనలు ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ... బిడ్డలు లేని తల్లిదండ్రులు... సరోగసి విధానం ద్వారా బిడ్డలను కన్నప్పుడు వారికి నిజమైన మాతృ ప్రేమ వర్ణించడం సాధ్యమవుతుంది. సమాజంలో ఈసడించుకునే మనషులు మధ్య జీవించి ఉన్న అనేక మంది గోడ్రాలంటూ... మీకు పిల్లలు లేరా అంటూ చేసే కామెంట్లతో అనుభవించిన క్షోభ ఒక్కసారి తమకు పుట్టిన బిడ్డలను చూసుకున్నప్పుడు మర్చిపోవడం తేలికవుతుంది.
మరోవైపు వాణిజ్యపరమైన గర్భాన్ని అడ్డుకోవద్దంటూ కూడా పలువురు నెటిజెన్లు కేంద్రానికి విజ్ఞాపనలు పంపిస్తున్నారు. ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది. అయితే అది ఇష్టానుసారం కాకుండా... ఒక నిబంధన, క్రమ పద్ధతి ప్రకారం చెల్లింపులు జరిపితే నష్టమేంటని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొంత మది సరోగసి విధానంలో కేవలం రక్తసంబంధీకులే కాకుండా... స్నేహితులు, తమకు మద్దతిచ్చేవారిని కూడా సరోగసి అనుమతించాలని పలువురు కోరుతున్నారు.
ఎన్నో వ్యయప్రయాసలకు కారణమవుతున్న సరోగసి విషయంలో కొందరు సెలబ్రిటీలు ఇష్టానుసారం వ్యవహరించడాన్ని కచ్చితంగా అడ్డుకోవాలి. పిల్లల్ని కనే యంత్రాలుగా సరోగసి తల్లులను చూడటం సమంజసం కాదు. ఇందుకు నిఘా వ్యవస్థలు, యంత్రాంగాలు వారి పని వారు చేయాలి. చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్నవారు... సరోగసిని కూడా తమ ఇష్టానుసారం చేస్తుండటం... విమర్శలకు తావిస్తోంది. సెలబ్రిటీలు పిల్లల్నికనడానికి సరోగసి విధానాన్ని అవలంబించడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. సృష్టికి ప్రతిసృష్టి జరుగుతున్న తరుణంలో పిల్లలు లేనివారి కోసం పిల్లలను కంటున్న ఈ పద్దతిలో సెలబ్రిటీలు ఎలాంటి కష్టం లేకుండా...  పిల్లల్ని కంటున్న  తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. క్రేజ్ కోసం పిల్లల్ని సరోగసీ ద్వారా కనడం చట్ట విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. డబ్బుంటే అన్నీ చేసుకోవచ్చన్న అభిప్రాయాన్ని పెద్దలు తగ్గించుకోవాలి. ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన పనులకు అవసరం ఉన్నా... లేకపోయినా అసహజపద్దతిలో చేయాలని చూడటం సమంజసం కాదన్న భావన ఉంది. సాధారణంగా ఎన్నో వ్యయప్రయాసలతో కంటున్న బేబీలను సాధారణ డెలివరీ వరకు వేచి చూసే పరిస్థితి ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉంది. నార్మల్ డెలవరీలో ఉండే కాంప్లికేషన్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ సార్లు పిల్లలను ఆపరేషన్ చేసి మాత్రమే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఆ తల్లులకు వస్తున్న కాంప్లికేషన్లు ఎక్కువగా ఉంటున్నాయ్. పిల్లలు పుట్టిన తర్వాత ఆ తల్లులను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.  ఒకసారి సిజేరియన్ చేసుకున్నవారికి కాంప్లికేషన్స్ జీవితాంతం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. సెలబ్రిటీలో విషయంలో ఈ విమర్శలు ఎక్కువవుతున్నాయ్. కన్నవారికి ఉన్న మమకారం పెంచినవారికి ఉంటుందా అన్న అభిప్రాయాన్ని కూడా ఎక్కువవుతోంది. మానవశాస్త్రవేత్తలు సైతం ఇలాంటి పరిస్థితులను ఖండిస్తున్నారు. సరోగసి ద్వారా పిల్లలను కనడమన్నది ఒకరకంగా అవయవదానం తరహాలోనే ఉందన్న అభిప్రాయాన్ని కొంత మంది వైద్యులు చెబుతున్నారు. బతికున్నవారి వారి కుటుంబ సభ్యులకు ఏవిధంగా అవయవదానం చేస్తున్నారో... సరగోసీ కూడా అలాగే ఉండే దానికి సర్ధకత చేకూరుతుందని... డబ్బుల కోసమే ఈ ప్రక్రియకు సహకరించడమన్నది దారుణమని నిపుణులు  హెచ్చరిస్తున్నారు.
అదే సమయంలో వ్యవస్థలో సమస్యలుంటే... వాటిని పరిష్కరించాలి కానీ... మొత్తం సరోగసి విధానంలో కొత్త చిక్కులు క్రియేట్ చేయోద్దన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం సరగొసీ చేసుకునే విధానాన్ని నిర్వహిస్తున్న ఐవీఎఫ్ కేంద్రాలను నియంత్రించాలే కానీ... నిషేదం మాత్రమే పరిష్కారం కాదని అంటున్నారు. నిషేదమంటే... అండర్ గ్రౌండ్ వ్యాపారాన్ని ప్రోత్సహించడమే అవుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను నిరోధిస్తూ... బలమమైన చట్టం ద్వారా అక్రమాలకు కళ్లెం వస్తే సరోగసి అర్థం పరమార్థం లభిస్తుంది.

మోదీ మూడేళ్ల పాలన... మెరుపులు... మరకలు

మోదీ మూడేళ్ల పాలన

సామాన్యుడు అసామాన్యుడయ్యాడు.  సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తి అయ్యాడు. దేశ రాజకీయాల్లో మార్పు అంటూ మోత మోగించాడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ... ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఇప్పుడు దేశాన్ని సింగిల్ హ్యాండ్ తో నడిపించే చోదకుడయ్యాడు. రాజకీయంగా పెను సంచలనాలు సృష్టిస్తూ... తన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నాడు. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేస్తానన్న ఎన్నికల హామీ దిశగా పాలనలో కొంత పుంతలు తొక్కిస్తున్నాడు. ప్రపంచదేశాల దృష్టిలో భారతదేశాన్నో ఆర్థిక శక్తిగా నిలబెట్టే ప్రణాళికను ఆవిష్కరిస్తున్నాడు. అన్నింటికీ మించి దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాడు. విమర్శలెన్నున్నా... అన్నింటికీ గెలుపే సమాధానమన్న రీతిలో దూసుకుపోతున్నాడు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా మూడేళ్లు... మూడేళ్ల మోదీ ఏలుబడిలో దేశం ఎన్నో సంచలనాలను నమోదు చేసింది. ఇంటా బయటా జరిగిన మార్పులు ప్రపంచపటంలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశాయ్. మోదీ మూడేళ్ల పాలన మరో ఐదేళ్ల పాలనకు బాటలు వేస్తోందా? మోదీ మేనియా వచ్చే పదేళ్ల వరకు కొనసాగుతుందా? యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ప్రభ జగద్విఖితమవుతుందా? నిరంకుశంగా వ్యవహరిస్తూ... అన్నింటా తన పంతాన్నే నెగ్గించుకోవాలని చూస్తున్నాడా? పార్టీలో తనను వ్యతిరేకించేవారే లేకుండా చేసుకుంటున్నారా? మూడేళ్ల మోదీ పాలనలో ప్లస్ లేంటి? మైనస్ లేంటి?  లెట్స్ వాచ్ ద స్పెషల్ రిపోర్ట్

మోదీ రాజకీయంగా ఎలాంటి సంచలనాలు ఆవిష్కరించారు. 2014 ఎన్నికల్లో గెలుపు తర్వాత జరిగిన ఎన్నికల్లో మోదీ ఎలాంటి ప్రభావం చూపించారు. ఓటమి నుంచి గెలుపు... గెలుపు నుంచి ఓటమి... ఫైనల్ గా యూపీ ఎన్నికల్లో తిరుగులేని విజయం... రాజకీయంగా మోదీ మార్క్ ఎలాంటి ప్రభావం చూపించింది. రాష్ట్రాల్లో గెలుపు ద్వారా మోదీ బలమైన నాయకుడిగా ఆవిర్భవించారా? గోవా, మణిపూర్ లో వ్యవహరించిన తీరు మోదీలోని అసలు రాజకీయనాయకుడ్ని బయటకు తెచ్చిందా?
2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో మోదీ బీజేపీని విజయతీరాలకు చేర్చారు. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్  పార్టీ 8 రాష్ట్రాల్లో ఓటమిపాలైంది. ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. అసోం, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో  బీజేపీ సొంతగా విజయం సాధించగా, ఏపీ, జే అండ్ కే, మహారాష్ట్రలో భాగస్వామ్యపక్షాలతో కలిసి ఎన్నికల్లో జయభేరి మోగించింది. కేవలం ఒక్క పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. త్వరలో జరగనున్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై పైచేయి సాధించాలని బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తోంది. బెంగాల్ లో తృణముల్ పార్టీ, ఢిల్లీలో ఆప్, బీహార్ లో నితీష్, లాలూ కూటమి, తమిళనాడులో అన్నాడీఎంకే, కేరళలో సీపీఎం విజయాలు సాధించాయ్. ఈ నాలుగు రాష్ట్రాలు తప్పించి మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ గణనీయమైన విజయాలను సొంత చేసుకొంది.
మోదీని ఇరుకుపెట్టేందుకు క్రియాశీలకంగా మారిన కేజ్రీవాల్ ఇప్పుడు సొంత ఇంటిని రిపేర్ చేసుకునే పనిలో పడ్డారు. పంజాబ్, గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవాలు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆప్ ఢిల్లీని కాపాడుకుంటే చాలన్నట్టుగా పరిస్థితుల్లో మార్పు వచ్చాయ్. అదే సమయంలో మోదీకి కొరకరాని కొయ్యగా ఉన్న తృణముల్ పార్టీ సైతం నర్మదా చిట్ ఫండ్ స్కామ్ లో పీకల్లోతు కష్టాల్లో ఉంది. అయితే మోదీపై యుద్ధాన్న కొనసాగిస్తానంటూ దీదీ కుండబద్ధలు కొడుతున్నారు. అయితే నితీష్ మాత్రం బీజేపీకి 50-50 దూరంలో ఉన్నట్టుగా కన్పిస్తున్నారు. దాణస్కామ్ లో చిక్కుకున్న లాలూను, నితీష్ నుంచి వేరు చేసే పనిలో మోదీ పడ్డారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టల స్టోరీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. భవిష్యత్ లో ప్రధాని కావాలని కలలు కంటున్న నితీష్... తన ఇళ్లు పదిలంగా ఉంటే చాలన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. గతంలో మోదీపై నిప్పులు చెరిగిన నితీష్ ఇప్పుడు  కేంద్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక తమిళనాడు విషయంలో మోదీ ప్రయోగం విఫలమైంది. శశికళను టార్గెట్ చేసిన బీజేపీ... ఆ స్థానంలో పన్నీర్ సెల్వాన్ని కూర్చోబెట్టాలన్న వ్యూహం బెడిసికొట్టింది. అయితే శశికళ జైలుకెళ్లడం, దినకరన్ కేసుల్లో ఇరుక్కోవడం... పళని స్వామి మోదీ అండ్ కో చెప్పినట్టుగా ఒదిగిపోయే అవకాశమూ కన్పిస్తోంది. ఏపీలోనూ అటు మిత్రపక్షంతోనూ, ప్రధాన ప్రతిపక్షంతోనూ డ్యూయల్ లవ్ లో బీజేపీ మునిగితేలుతోంది. జగన్ కేసుల వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణలో పాగా వేస్తామంటూ బీజేపీ అధ్యక్షుడు ఓవైపు కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తుంటే...  మోదీ మాత్రం కేసీఆర్ సర్కారుపై ప్రేమ చూపిస్తారు.
ఒడిశాపైనా బీజేపీ దృష్టి పడింది. రెండు దశాబ్దాలుగా తిరుగులేకుండా పాలిస్తున్న నవీన్ పట్నాయక్ కు చెక్ పెట్టి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసి... తామే అధికారం చేపట్టాలన్న భావనలో బీజేపీ ఉంది.
ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్ర సింగ్ కు సీబీఐ, ఈడీలతో మద్దెలదరువు మోత మోగుతోంది. యూపీ ఎన్నికల తర్వాత జాతీయ పార్టీలైన సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీని అస్థిత్వం కోసం పోరాడేలా చేయడంలో మోదీ విజయం సాధించారు.
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించినా... ఆ పార్టీకి గోవా, మణిపూర్ లో పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. అయినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాలే ఏర్పడేలా గవర్నర్లు వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో కేంద్రం పాత్రపైనా, గవర్నర్ పాత్రపైనా పెద్ద ఎత్తున విమర్శలు రేగాయ్. ఉత్తరాఖండ్ లో హరీష్ రావత్ సర్కారును పడగొట్టాలని ప్రయత్నించి... బెడిసికొట్టడంతో కేంద్రం యూ టర్న్ తీసుకొంది. రాజకీయంగా మోదీ పంథా ఒక్కటే కన్పిస్తోంది రణమా... శరణమా... అవును శరణమంటే ఓకే... రణమంటే... ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు అర్థమైపోతోంది. అందుకే ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థులు సైతం మోదీకి సాహో అనాల్సిందే...
దేశంలో ఇప్పుడు మోదీ గాలికి మిగతా పార్టీలు నామరూపాల్లేకుండా పోతున్న పరిస్థితి. పేరుకు ఎన్డీఏ ఉన్నప్పటికీ... అది అంతా బీజేపీగానే ట్రీట్ చేయబడుతోంది. ఎన్డీఏ పక్షాలకు ప్రస్తుతం 334 ఎంపీ స్థానాలుంటే వచ్చే రోజుల్లో ఆ సంఖ్య ఎంతకు చేరుతుంది... అందులో బీజేపీ పార్టీ  ప్రభ ఎలా ఉండబోతుంది. జనవరిలో ఇండియా టుడే చెప్పిన సర్వే లెక్కలు... ఇతర సర్వేలెక్కలు అంచనాలేంటి?
యూపీ ఎన్నికలకు ముందు పలు సర్వేలు సైతం మోదీ మేనియా ముందు ఎవరూ నిలబడరన్నట్టుగా చెబుతూ వచ్చాయ్. బీజేపీ పార్టీ వరసుగా రాష్ట్రాల్లో విజయం సాధించడం... అన్నింటికీ మించి యూపీలో సాధించిన విజయం ఆ పార్టీకి తిరిగులేని ఆధిక్యాన్ని చూపిస్తోంది. అప్పటి వరకు వచ్చిన సర్వేలు బీజేపీ గతంలో కంటే ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలుచుకోవడం అనుమానమన్నట్టుగా విశ్లేషించగా... అవి యూపీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా మారిపోయాయ్. పలు రాజకీయ పార్టీలు సైతం 2023లో పోటీకి ప్రిపేర్ అవ్వాలని... 2019లో మోదీని కదిలించడం ఎవరి తరమూ కాదన్న అభిప్రాయంలోకి వచ్చేశాయ్.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 360 స్థానాలొస్తాయంటూ సర్వేలు కూడా వస్తున్నాయ్. ఎన్డీఏకు 42 శాతం ఓట్లు వస్తాయని, యూపీఏ 25 శాతం, ఇతరులు 33 శాతం ఓట్లు సాధిస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్డీఏ ఓట్ల శాతం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం 334 సీట్లు ఎన్డీఏ పక్షాలకు లభించగా... అవి 360 స్థానాలు గెలుస్తాయని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు సాధించే అవకాశముందని... ఇతరులు 123 స్థానాలకు పరిమితమవుతారని అంటున్నారు. ఇవి జనవరి 2017 ఇండియా టుడే అంచనాలు.
తాజాగా యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ భారీగా ఎంపీ స్థానాలను గెలుచుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ బలం 281 స్థానాలు. కాంగ్రెస్ పార్టీ బలం 44 స్థానాలు. అన్నాడీఎంకేకు 37 మంది ఎంపీల బలం ఉండగా, తృణముల్ పార్టీకి 34 లోక్ సభ సభ్యుల బలం ఉంది. బీజేడీ 20, శివసేన 18, టీడీపీ 16 టీఆర్ఎస్ 11 మంది ఎంపీల బలాన్ని కలిగి ఉన్నాయ్. అదే సమయంలో మిత్రపక్షాల నుంచి మరికొన్ని ఎంపీల బలాన్ని పొందాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలున్నారు. ఆ పార్టీ అధికారంలో భాగస్వామ్యులుగా ఉన్న చోట్ల మరికొన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించడం ద్వారా సొంతగా 300 స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఉంది.
మొత్తంగా మీడియా మేనేజ్మెంట్ మోదీకి బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. మీడియాలో తనకు వ్యతిరేక వార్తలు ఇచ్చే పరిస్థితి లేకుండా చేయగలిగారన్న విమర్శ మోదీ ఎదుర్కొంటున్నారు. మీడియాలో మోదీ భజన ఎక్కువైనట్టుగా కూడా పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తాయ్. జాతీయ న్యూస్ చానెల్ ఎన్డీటీవీపై నిషేదం చివరి వరకు వచ్చినా... చివరి నిమిషంలో ఆ ఆలోచనను కేంద్రం ఉపసంహరించుకొంది.
నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తాం... దేశాన్ని రక్షిస్తా... అవినీతి రహితంగా దేశాన్ని పాలిస్తానంటూ ఎన్నికల్లో జయభేరి మోగించిన ప్రధాని నరేంద్ర మోదీ నల్లధనం విషయంలో అనుకున్నది సాధించారా... దేశాన్ని అవినీతిరహితంగా మార్చగలిగారా... అవినీతిపరుల అంతం జరిగిందా? పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఏం మార్పు జరిగింది?
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల అవినీతికి చరమగీతం పాడుతానంటూ మోదీ ఎన్నికల ప్రచారాల్లో హోరెత్తించారు. దేశం నుంచి తరలిపోయిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించి దేశాన్ని సుసంపన్నం చేస్తానన్నారు. పనిలో పనిగా ఒక్కో భారతీయుడు ఎకౌంట్లో ఎంత వేయోచ్చు కూడా చెప్పారు. దోపిడీదారులు విదేశీ బ్యాంకుల్లో దాచిన డబ్బునంతటినీ వెనక్కు తెస్తే దేశ ప్రజలు ఒక్కొక్కరికి 15, 20 లక్షల రూపాయలు వరకు ఇవ్వొచ్చని మోదీ కుంటబద్ధలు కొట్టారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.బి.షా సారథ్యంలో సిట్‌ ఏర్పాటు చేసినప్పటికీ... అది అంతగా విజయవంతం కాలేదు. విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని వెల్లడించడానికి 2015లో నల్ల ధనం చట్టం చేయగా... కేవలం రూ. 4,164 కోట్ల ఆస్తులను మాత్రమే పలువురు ప్రకటించారు.  అంతగా స్పందన లభించకపోువడం... స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని గత ఏడాది కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 55,000 కోట్ల ఆస్తులను వెల్లడయ్యాయి. అయితే నల్లధనం విషయంలో ఇప్పటి వరకు కేంద్రం పెద్దగా సాధించిందేమీ లేదని చెప్పొచ్చు. స్విట్జర్లాండ్ బ్యాంకులకు లేఖలు రాయడంతోపాటు... కొంత ముందడుగు పడినప్పటికీ... అవి పూర్తి స్థాయిలో జరగకపోవడం మోదీకి ఇబ్బందికరమైన అంశం.
రాజకీయ నాయకులు కోటాను కోట్ల రూపాయలను స్విస్ బ్యాంకు లాకర్లలో దాచేసుకుంటే... ఆ మొత్తం దేశానికి తిరిగి వస్తుందని అందరూ కళలుగన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని... పేద ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలు దక్కుతాయని అందరూ భావించారు. అయితే మోదీ అంచనాలు నల్లధనం విషయంలో పెద్దగా విజయవంతం కాలేదు.
ఇక పెద్ద నోట్ల రద్దుతో సాహసోపేతమైన నిర్ణయమంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాది నవంబర్ లో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటి వరకు దేశ ఆర్థిక వ్యవస్థ కోలేకులేదనిపిస్తోంది. రూ. 500, వెయ్యి నోట్ల రద్దు తర్వాత నగదు సరఫరా అంతగా చేయలేకపోవడం, డిజిటల్ బ్యాంకింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసినా  అది అంతగా ఫలించలేదు. అయితే తాజాగా కేంద్రం మాత్రం పెద్ద నోట్ల రద్దు తర్వాత 90 లక్షల మంది కొత్తగా పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చారంటూ చెబుతోంది. అయితే రోగం ఎక్కడ ఉందో తెలిసి కూడా సరైన మందు వేయలేదన్న అభిప్రాయం ఆర్థికరంగ నిపుణలు  వ్యక్తం చేశారు.
కేవలం పెద్ద నోట్ల రద్దు యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే మోదీ తీసుకున్నారన్న అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తమైంది. బలమైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలను దెబ్బతీసేందుకే మోదీ అలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని... తీవ్రవాదకలాపాలు తగ్గుతాయని... మోదీ సుస్పష్టంగా చెప్పారు. అయితే కాశ్మీర్ లో కొంత కాలం అలజడులు తగ్గినప్పటికీ అవి మళ్లీ యాధావిధిగా మారిపోయాయ్.  పైపెచ్చు బ్యాంకు అధికారులు అవినీతికూపంలో కూరుకుపోయేలా నోట్ల రద్దు ఉదంతం నడిచింది. వచ్చిన నోట్ల కట్టలన్నీ పెద్దల ఇళ్లకు నేరుగా వెళ్లిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అదే సయంలో సామాన్యుడు మాత్రం సమధలా మారిపోయాడు. సామాన్యుడు మాత్రం నగదు కోసం గంటలు గంటలు లైన్లో నిలుచోవాల్సి వచ్చింది.
బినామీ లావాదేవీల చట్టం, రాజకీయ విరాళాల్లో సంస్కరణలు, సూట్ కేసు కంపెనీలపై దాడులు, నగదు లావాదేవీలపై పరిమితులు వంటి చర్యల వల్ల మున్ముందు నల్లధనాన్ని అరికట్టడానికి వీలు కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలోని నగదుపై కేంద్రానికి క్లారిటీ వస్తోంది కానీ.. విదేశాల్లో దాచిన నల్లధనం విషయంలో మాత్రం ఏమాత్రం ముందడుగు పడటం లేదు.
ఆర్థికరంగంపై మోదీ ప్రభావం ఎలా ఉంది. ఉద్యోగ అవకాశాలు మోదీ చెప్పినట్టుగా జరిగాయా? ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ కేంద్రంగా నిలిచిందా? ప్రపంచ దేశాల్లో భారత్ ప్రభ వెలిగిందా? మోదీ చెబుతున్నట్టుగా  ఆల్ ఈజ్ వెల్లేనా?
అచ్చేదిన్ తెస్తామంటూ పాలన పగ్గాలు చేపట్టిన మోదీ ఆర్థికంగా కొంత ముందడుగేశారని చెప్పొచ్చు. దేశంలో కొన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటినప్పటికీ... వాటిని కొంత మేరకు తగ్గించడంలో విజయం సాధించారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలోనూ పర్వాలేదనిపించింది. ద్రవ్యలోటు 5.31 గా ఉంది 3.2 శాతానికి దిగివచ్చింది. ధరలు అమాంతంగా పెరిగినప్పుడు ఎగుమతులను కంట్రోల్ చేసి దేశీయంగా వస్తువులను అందుబాటులోకి తెచ్చారు.
ప్రణాళిక సంఘం స్థానే... నీతి అయోగ్ ను తీసుకురావడం ద్వారా కంట్రోల్ తన చేతిలో పెట్టుకున్నారు మోదీ. తద్వారా ఆయా రాష్ట్రాలన్నీ తన కనుసన్నల్లో పనిచేసే సంస్కృతిని తీసుకురావడంపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయ్. నిధులు ఇవ్వాలన్నా... నిధులు ఆపాలన్నా అంతా కేంద్రం చేతిలో ఉండేలా చేయడం ద్వారా... రాష్ట్రాల పాలనపై కేంద్రం ప్రభావం ఎక్కువవుతోందన్న విమర్శ ఉంది. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అంతకంతకూ తగ్గడం మోదీకి కలిసివచ్చింది. చమురుపై ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్ర ఖజానాలో భారీగా నిధులు వచ్చి పోగవుతున్నాయ్. బ్యారెల్ చమురు ధర 120 డాలర్లు ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ రూ 70 ఉంటే... బ్యారెల్ 50 డాలర్లు ఉన్నప్పుడు కూడా పెట్రోల్, డీజిల్ ధర అదే విధంగా ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు భావించినా... అది జరగలేదు. సబ్సిడీ వద్దంటూ చేసిన ప్రచారంతో కేంద్రానికి భారీగా నిధులు మిగిలిపోతున్నాయ్. అయితే అదే సమయంలో ధర తగ్గించి పేదలపై భారం తగ్గిద్దామన్న ఆలోచన మోదీకి అసలే లేకుండా పోయింది. సబ్సిడీల ఎత్తివేత కూడా అండర్ గ్రౌండ్ లో చేసేస్తున్నారు మోదీ.
ఇక ఆర్థికంగా భారతదేశం తాత్కాలిక అడ్డుంకులను అధిగమించి ముందడుగేస్తున్నట్టుగా కేంద్రం లెక్కలు చెబుతున్నాయ్. 2013-14లో విదేశీ పెట్టుబడులు 36 బిలియన్ డాలర్లు ఉండగా అవి నేడు 60 బిలియన్ డాలర్లుకు చేరాయ్. సెన్సెక్స్ 30 వేల మార్క్ ను దాటింది. అందరికీ బ్యాంకింగ్ రంగాన్ని అందుబాటులో తెచ్చారు. ఆన్ లైన్ ట్రాన్సక్షన్ ను ప్రోత్సహిస్తూ...  నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు.  విద్యుత్ ఉత్పత్తిలో స్వావలంబన సాధించడమే గాక మిగులు విద్యుత్ దిశగా అడుగులు పడ్డాయ్.
స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావొస్తున్నా ఈనాటికి మన దేశంలో బ్యాంకు ఖాతాలు లేని వారు కోట్ల మంది ఉన్నారు. 2014 ముందు వరకు దేశంలో కేవలం 32 శాతం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవి. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక 2014 ఆగస్టు నెలలో ప్రధాని మంత్రి జన్ ధన్ యోజన ద్వారా కేవలం 6 నెలల కాలంలో 21 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు కొత్తగా తెరవడంతో దేశంలో ఈ రోజు 70 శాతం మందికి పైగా బ్యాంక్ ఖాతాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో బ్యాంకులకు బడా కంపెనీలు చెల్లించాల్సిన మొండి బకాయిల విషయంలో మాత్రం ముందడుగుపడటం లేదు. విజయ్ మాల్యా లాంటి వ్యాపార వేత్త వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిపోతుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగాలు విఫలమయ్యాయ్. లలిత్ మోదీని దేశంలోకి రప్పించడంలోనూ కూడా మోదీ సర్కారు విఫలమైంది. సాక్షాత్తూ కేంద్రం పెద్దలు లలిత్ మోదీని రక్షిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.  దేశంలో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2014 జూన్‌నాటికి రూ. 2.34 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు.. 2016 డిసెంబర్‌ నాటికి రూ. 6.46 లక్షల కోట్లకు పెరిగాయి.
స్వచ్ఛభారత్ నినాదంతో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన మోదీ... ఆ తర్వాత ఆ బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టారు. ఇలా చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో స్వచ్ఛ సంకల్పం కలిగింది. గతంతో పోల్చుకుంటే వ్యక్తిగత మరుగుదొడ్లు, డెఫెక్షన్ ఫ్రీ ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయ్. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా కేంద్రం లెక్కలు చెబుతోంది. రెండు కోట్ల మందికి గృహాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా... కేవలం మూడున్నర లక్షల ఇళ్లే నిర్మించారు.  ఉద్యోగాలతో నిరుద్యోగాన్ని మాయం చేస్తామన్న మోదీ అంచనాలు విఫలమయ్యాయి. ఏటా కోటి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న ప్రభుత్వ అంచనాలు తప్పాయ్. మేకిన్ ఇండియా, స్టార్టప్ కంపెనీలు వెల్లువలా వస్తాయని భావించినా... అవి కాగితాలకే పరిమితమైపోయాయ్. 2019 నాటికి కొత్త ఉద్యోగాల కల్పన మోదీ ముందున్న అతిపెద్ద సవాల్. గోరక్షకులు, అసహనం మోదీ సర్కారు ఏలుబడిలో పెద్ద వివాదాస్పదమవుతున్నాయ్. ప్రపంచంలోనే బీఫ్ ఎక్సోపోర్ట్ లో నెంబర్ 1గా ఉన్న మనదేశంలో గోవధ పేరుతో బీజేపీ నేతలు, అతివాద హిందూ సంస్థలు చేసినా నానాయాగీ ప్రపంచవ్యాప్తంగా  భారత్ విమర్శలపాలైంది. ఢిల్లీ జేఎన్టీయూలో కన్నయ్యతసహా పలువురిపై దేశద్రోహం కేసుల విషయంలో కేంద్రం అభాసుపాలైంది. హైదరాబాద్ యూనివర్శిటీలో వీసీ వేధింపులతో రోహిత్ వేముల ఆత్మహత్య పెనుదుమారాన్నే రేపింది. దేశవ్యాప్తంగా కేంద్రం విమర్శలపాలైంది.

అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను వేగంగా చుట్టివచ్చిన ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టింంచారు. ప్రపంచదేశాల్లో భారత్ గొప్పతనాన్ని ఆవిష్కరించడం..... వారి నుంచి మనకేం కావాలో... మన నుంచి వారికేం కావాలో తెలుసుకోవడంలో మోదీ విజయం సాధించారు. ఇండియా ఫస్ట్ నినాదాన్ని విదేశాల్లో విన్పించారు. ఏ ప్రధాన మంత్రికి సాధ్యం కాని విధంగా ప్రపంచదేశాల్లో భారత్ అనుకూల, ప్రతికూల దేశాల్లోనూ భారత్ ను స్మరించుకునేలా చేశాడు. అయితే ఐటీపై అమెరికా నిబంధనలతో వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో చోద్యం చూస్తున్నారు.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక కీలక దేశాలను చుట్టివచ్చారు. వెళ్లిన ప్రతీ చోట భారత్ ఫస్ట్ నినాదాన్ని చాటారు. తీవ్రవాదం వల్ల ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయింది భారత దేశమని చాటుతూ... తీవ్రవాద అంతానికి ప్రపంచదేశాలు ఏకం కావాలనని అది ఒక్కరి సమస్యగా చూడరానిది ప్రపంచం బాధ్యతగా చూడాలని కుండబద్ధలు కొడుతున్నారు.
అమెరికాలోని మాడీసన్ స్క్వేర్ లో మోదీ చేసిన ప్రసంగం ఇప్పటికీ భారతీయుల చెవుల్లో మార్మోగుతోంది. గల్ఫ్ లో కీలక దేశమైన  యూఏఈ వెళ్లి అక్కడ భారత మాతకు జై అంటూ నినదించాడు.
మన దేశాన్ని ఆసియా దేశాల్లో పెద్దన్న పాత్ర పోషించేలా చైనాకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు మోదీ. లూక్ ఈస్ట్ నీతితో మన దేశ సరిహద్దుల పటిష్టతపై  దృష్టి  పెట్టారు.  నేపాల్ సహాయకచర్యల్లో భారత్ భేషంటూ ప్రపంచదేశాల కీర్తించడం విశేషం. సరిహద్దు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ పక్క దేశాలైనా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్, ఫిజీ, మాల్దీవులతో సత్సంబంధాల కోసం ప్రయత్నించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఘనంగా నిర్వహించేలా చేశారు.
తనదాకా వస్తే గానీ తీవ్రవాదం సంగతి తెలియదని మొన్న అమెరికాకు, నిన్న యూరప్ దేశాలకు ఇప్పుడు గల్ఫ్ దేశాలకు తేటతెల్లమవుతుంది. తీవ్రవానికి వ్యతిరకంగా ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో విజయం సాధించింది భారత్. తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం భారత్ తీవ్రవాదంతో ఇబ్బందులు ఎదుర్కోంటుందని సౌదీ పర్యటనలో ముస్లిం దేశాల సాక్షిగా వ్యాఖ్యానించారు. తద్వారా పాకిస్తాన్ తో అంటకాగడానికి ప్రపంచదేశాలేవీ కూడా సిద్ధంగా లేవన్న సందేశాన్ని పంపించారు.
అదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పాలనపగ్గాలు చేపట్టాక ఐటీ ఆధారిత ఉద్యోగాల విషయంలో దేశ వ్యాప్తంగా నీలినీడలు కమ్ముకుంటున్నాయ్. అమెరికాలో ఆధిపత్యం చలాయిస్తున్న భారత ఐటీ కంపెనీలు నిబంధనల పేరుతో భారతీయుల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో మోదీ విఫలమయ్యారన్న అభిప్రాయం కలుగుతోంది.
పాకిస్తాన్ విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి ఆ దేశాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తోంది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశం... ఆ తీవ్రవాదం దెబ్బతోనే కూనరిల్లుతున్న విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని మోదీ ఇన్ డైరెక్ట్ గా పలుసార్లు హెచ్చరించారు కూడా. జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదాన్ని రగిలించడం మానుకొని... సొంత ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. తాజాగా మాజీ నావీ అధికారి జాదవ్ ను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న చొరవ కూడా ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది.
మోదీ కాశ్మీర్ కార్చిచ్చును ఆపేలా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. జమ్మూ-కాశ్మీర్ లో భాగస్వామిగా ఉన్న బీజేపీ... కాశ్మీర్ అల్లర్లను అడ్డుకోకపోవడం... రోజు రోజుకు హింసాత్మక సంఘటనలు పెరిగిపోతుండటం... సమస్యను జఠిలం చేస్తోంది. పెరుగుతున్న తీవ్రవాద కలపాలు... స్థానికులను ఆకర్షిస్తుంటే... ప్రభుత్వం ఆ చర్యలను తగ్గించేలా ఎలాంటి కార్యాచరణ చేయలేకపోవడం విమర్శలకు కారణమవుతోంది. వేర్పాటువాదులు... స్థానికులపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాశ్మీర్ ప్లాన్ రూపకల్పన ద్వారా  మోదీ మరో ముందడుగేయాలి.
మోదీ ఇప్పుడు ఒక విజయవారధి. తాను ఏం చేసినా సక్సెస్ అవుతానన్న ధీమా ఆయనలో వచ్చేసింది. ఏం చేసినా కరెక్టే... ఆలోచించే చేస్తాడు. దేశానికి మంచే జరుగుతుందన్న ఓ సెక్షన్ ఇప్పుడు మోదీ వెనుక నడుస్తోంది. విపక్షాలను ఏకాకుల్ని చేస్తూ... సింగిల్ గా దేశాన్ని పాలిస్తున్న మోదీ పట్టిందల్లా బంగరమేనా? వ్యతిరేకులను చీల్చిచెండడమే మోదీ నైజమా? తనకు అడ్డొస్తే ఎవరైనా అంతేనా? అద్వానీ విషయంలోనూ మోదీ తన పంతం నెగ్గించుకుంటున్నారా?
మోదీ దేశానికి ఇప్పుడు దిశానిర్దేశం చేస్తున్నాడు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టీలను చిత్తుచేశాడు. తన అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నాడు. రాజకీయంగా ఒంటరిగా విపక్షాలను ఏకాకులను చేస్తున్నాడు. విపక్షాల అసమర్థత... తన సమర్థతగా మార్చేసుకుంటున్నారు. తన వైఫల్యాలను సైతం విజయాలుగా మార్చుకునేలా పరిస్థితులు మారుతున్నాయ్.
సుమారు మూడు దశాబ్దాల తర్వాత ఒక పార్టీకి కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీ రావడం కూడా మోదీ పూర్తి స్థాయిలో పనిచేయడానికి అవకాశం లభించినట్టయింది. తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూనే... మరింత శక్తిమంతమైన నాయకుడిగా మోదీ రూపాంతరం చెందారు. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ తన మాటే శాసనం... తన మాటే ఫైనల్ అన్న అభిప్రాయాన్ని కలిగించడంలోనూ కృతకృత్యులయ్యారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విముక్తి భారత్ అంటూ అందుకున్న పల్లవి ఆ పార్టీని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయ్. పార్టీలో నేతలకు భవిష్యత్ పై ఆశలు లేకుండా చేస్తూ... ప్రాంతీయ పార్టీలను సైతం దారిలోకి తెచ్చుకుంటున్నాడు. అనుకూలంగా ఉంటే ఓలా... వ్యతిరేకంగా ఉంటే మరోలా వ్యవహరిస్తూ... కొత్త రాజకీయ సంస్కృతికి తెరదీస్తున్నాడు. మోదీ తీరుపై విపక్షాలు... ఎప్పుడూ మీదే అధికారముండదు కదా... అంటూ సరిపెట్టుకుపోవాల్సిన పరిస్థితిలోకి నెట్టేస్తున్నాడు.  అందరికీ కన్పించే మోదీ... అందరికీ కన్పించని మోదీ రెండు పార్శ్వాలు మోదీలో ఉన్నాయ్. తను బలపడటం... పార్టీ బలపడం రెండూ అంశాల ఓవైపు... తనకు అనుకూలంగా ఉంటే ఒకరకంగా... తనకు వ్యతిరేకంగా ఉంటే మరోలా చేయడం మోదీ వర్కింగ్ స్టైల్. పార్టీలో తన వ్యతిరేకులను కంట్రోల్ చేయడం... ఆర్ఎస్ఎస్ వద్ద తన పరపతిని పెంచుకోవడం రెండు విషయాల్లోనూ మోదీ ఒక్కో అడుగు ముందుకేస్తున్నాడు.
ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ విషయంలో మోదీ వ్యవహరిస్తున్న తీరు అటు పార్టీ సీనియర్లలోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ అసంతృప్తికి కారణమవుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి అద్వానీ పేరును సిఫారసు చేస్తారని అందరూ భావించినా... మోదీ మాత్రం ఆ విషయాన్ని మరుగునపడేలా చేసేశారు. పైగా అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతిపై బాబ్రీ మస్జీద్ కూల్చివేత కత్తి వేలాడుతోంది. ఇదంతా మౌని మునిలా చూస్తూ ఊర్కొంటున్నాడన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. రాజకీయ నిరంకుశత్వం మోదీలో ఉన్నట్టుగా మరో నేతలో తన జీవితంలో చూడలేదని బీజేపీ అగ్రనేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు.
మోదీ అంటే ఒక నమ్మకం...  మోదీ అంటే ఒక భరోసా... మోదీ అంటే ఒక ధైర్యం... మోదీ అంటే ఒక గెలుపు... ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ... స్వపక్షంలో విపక్షం లేకుండా చేయడంలో మోదీని మించినవారు లేరు. ఎవరమేమనుకుంటే నాకేంటంటూ మోదీ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ పాలనపగ్గాలు చేపట్టడంపై విమర్శలు రేగినా... వాటిని అణిచివేశాడు. మూడేళ్ల పాలనలో అప్పటి వరకు ఉన్న వ్యవస్థల పనితీరును పూర్తి స్థాయిలో మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కన్పిస్తూనే... వ్యవస్థలన్నీ తన మాటే వినాలే మార్చుకుంటున్నారన్న అభిప్రాయం ఎక్కువవుతోంది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మరొకరు అధికారంలోకి రావడం సాధ్యం కాదన్న రీతిలో మోదీ వటుడింతై అన్నట్టుగా ఎదిగిపోతున్నారు.వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో మోదీకి మించినవారు మరొకరుండరంటే అతిశయోక్తి కాదేమో... ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా వన్ మ్యాన్ షో..

Thursday, 25 May 2017

కొరివితో తల

అటు ట్రంప్... ఇటు కిమ్. ఇద్దరూ ఇద్దరే...  దూకుడుతో రెచ్చగొడతారు... ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. ఒకరి స్థాయి పెద్దది... ఇంకొకరి స్థాయి చిన్నది తేడా ఇంతే...  ఇద్దరూ కూడా వారి వారి దేశాలతోపాటు ప్రపంచాన్ని సైతం కలవరపెడుతున్నారు.  మా జోలికెస్తే అమెరికానే కాదు... ప్రపంచం మొత్తాన్ని తుదముట్టాస్తామంటూ ఉత్తర కొరియా గర్జిస్తుంటే... పెద్దన్న పాత్ర పోషించాల్సిన అమెరికా మాత్రం ఇంకొంచెం రెచ్చగొడుతూ యుద్ధానికి సై అంటోంది. పూటకో మాట రోజుకో రకమైన చేష్టలతో అమెరికన్లను బెంబేలెత్తిస్తున్న ట్రంప్... ఉత్తర కొరియా విషయలో ఏం చేస్తారోనన్న బెంగ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. కిమ్‌, ట్రంప్‌ చివరికి ప్రపంచానికి ఏ గతి పట్టిస్తారోనని జనం బెంబేలెత్తిపోతున్నారు.  ఇద్దరి నడుమ చైనా ఆడుతున్న డ్రాగన్ గేమ్స్ మరింత కల్లోలానికి కారణమవుతున్నాయ్...  కొరియా... కొరివి ఓ వైపు ట్రంప్ కంపు మరోవైపు రెచ్చిపోతుంటే ఏం జరుగుతుంది...  
మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉన్నట్టు కన్పిస్తోంది. కొరియా కొడుతున్న బుసులు... అమెరికా రాజేస్తున్న మంటలు  కొరియా ద్వీపకల్పంలో యుద్ధావాతావరణాన్ని సృష్టిస్తున్నాయ్.  అణ్వాయుధాలే దేశ సొత్తుగా ముందుకు సాగుతున్న ఉత్తర  కొరియా... దక్షిణ కొరియాపై ఒంటికాలుతో లేస్తుండటం... అమెరికాను రంగంలోకి దించేస్తోంది. కిమ్ అరుపులు... ట్రంప్ రంకెలు ఇప్పుడు కొత్త యుద్ధం  దిశగా పరిణామాలను తీసుకెళ్తున్నాయ్.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించనంత కాలం ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు... డొనాల్డ్ ట్రంప్  ప్రెసిడెంట్ గా వచ్చిన దగ్గర్నుంచి మారిపోతున్నాయ్. మొన్న సిరియా... నిన్న ఆప్ఘనిస్తాన్...  రేపు కొరియాపై దాడులే తథ్యమన్న రీతిలో అమెరికా పెద్దల వ్యాఖ్యలు విన్పిస్తున్నాయ్.  ట్రంప్ ఏ క్షణానికి ఏం చేస్తాడోనంటూ ప్రపంచం హడలిపోతోంది. అదే సమయంలో అమెరికాపై ఒంటికాలుపై లేస్తున్నఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మిసైల్ వదిలితే ఏమవుతుందోనన్న బెంగ ప్రపంచానికి పట్టుకొంది.
కొరియా ద్వీపకల్పంలో గత నెల రోజుల నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఏప్రిల్‌ 17న ఉత్తర కొరియాపై చేసిన ప్రకటన కొనసాగింపుగా పరిణామాలు మారిపోతున్నాయ్. ట్రంప్‌ సహనాన్ని పరీక్షించవద్దని పెన్స్‌ ఉత్తర కొరియాను హెచ్చరించారు. సిరియాపై వైమానిక దాడిని, అఫ్గానిస్థాన్‌లో ఐఎస్ పై మదర్ ఆఫ్ ఆల్ బాంబుతో చేసిన దాడిని మర్చిపోవద్దంటూ  ఉత్త పెద్దలకు అమెరికా సందేశాన్ని పంపించేసింది.
ఉత్తర కొరియా ఆరో అణ్వస్త్ర పరీక్ష ఏప్రిల్‌ 16న క్షిపణి పరీక్ష విఫలమైనా, దూకుడు తగ్గించదనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో  ఉంది. గత పదేళ్లలో ఆ దేశం అయిదు సార్లు అణ్వస్త్ర పరీక్షలు జరిపి ప్రపంచ దేశాల నిరసనకు, అమెరికా ఆగ్రహానికి గురైంది. అయినా ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ అన్‌ ఎవరినీ ఖాతరు చేయలేదు. ఒకవైపు తమ దేశ ప్రజలు ఆకలి చావులతో చస్తున్నా... అవేమీ పట్టించుకోకుండా అంతకంతకూ శక్తిమంతమైన అణు బాంబుల తయారీకి సంపదను వెచ్చిస్తున్నారు. అమెరికాపైనే అణ్వస్త్రాలు కురిపిస్తానంటూ బెదిరిస్తున్నారు.
సిరియా, అఫ్గానిస్థాన్‌ల తరహాలో ఉత్తర కొరియా దారికి వస్తుందనుకోవడం అమెరికా భ్రమ మాత్రమే అనుకోవాలి.  అమెరికా దాడులకు బెదరకుండా, ఆత్మరక్షణ పేరిట మరిన్ని అణుబాంబులను సమకూర్చుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మాటవరసకు యుద్ధమే వచ్చి ఉత్తర కొరియా చిత్తుగా ఓడి కిమ్‌ ప్రభుత్వం కుప్పకూలిపోతుందనుకున్నా, అంతకుముందు అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ల మీద ఉత్తర కొరియా సైతం అణు బాంబులు, క్షిపణులు ప్రయోగించడం ఖాయం. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ భస్మీపటలమై ఆ దేశం సర్వనాశనమవుతుంది. ఈ సంగతి అమెరికాకూ తెలుసు.
అయితే దక్షిణ కొరియా అంటే అది తనేనన్న అభిప్రాయం అమెరికాలో ఉంది. ఎందుకంటే తన మిత్రదేశాలపై ఇతరుల దాడిని అమెరికా చీల్చిచెండాతుంది. న్యూక్లియర్ అంబ్రెల్లాతో మిత్ర దేశాలపై దాడంటే అది తనపై జరిగే దాడిగా భావిస్తూ...  వారికి గుణపాఠం చెప్తామన్న సిద్ధాంతంతో అమెరికా పనిచేస్తోంది. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్ తో అమెరికా... దక్షిణ కొరియా రక్షణ గోడను నిర్మిస్తోంది.  ఈ సంవత్సరాంతానికి ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తుందని దక్షిణ కొరియా అంచనా వేస్తోంది.
ఆయన రూటే సెపరేటు... ఎవరి మాట వినడు. ఎవరినీ నమ్మడు...  తన మన ఆ విషయంలో మినహాయింపు లేదు. తన వారసత్వాన్ని ప్రశ్నించే వారెవరూ మిగలకూడదు. తనను విమర్శించే ఏ దేశమూ నిలువకూడదు. అది ఆఖరి సవతి సోదరుడైనా... మిత్ర దేశం చైనా అయినా... ఈ విషయంలో తన పంతమే నెగ్గాలి... ఇదే దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ అసలు ఉద్దేశం.
కిమ్ తనకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు తప్పించి ఎవరినీ ఇన్వాల్వ్ చేయరు. ఉత్తర కొరియా విషయంలో చైనా ఎలా వ్యవహరించాలో అర్థం కాక సతమతమైపోతున్నాడు.
మిగతా ప్రపంచ దేశాలకు ఉత్తర కొరియాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అన్నీ చోట్ల అమెరికా అనుకున్న విధంగా పరిణామాలు జరిగితే... కొరియాలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిణామాలున్నాయ్. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్  విషయంలోనూ, లిబియా అధ్యక్షుడు గడాఫీ విషయంలోనూ అమెరికా ఎలా వ్యవహరించిందో కిమ్ కు బాగా తెలుసు. అందుకే ఎవరి మాట కూడా  వినకుండా తన దారేదో తనే డిసైడ్ చేసుకునేట్టుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు.
చిన్న కిమ్‌కి ప్రస్తుతం 33 ఏళ్లు.  అచ్చు తన తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ పోలికల కోసం ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడు. చదువు కూడా అంతంత మాత్రమే  ఉండటంతో తండ్రి తన వద్దే ఉంచేసుకొని రాజకీయాలు వళ్లించాడు.
ఉత్తర కొరియాకు నచ్చజెప్పడం చైనా వల్ల కూడా కాదా... ఉత్తర కొరియాకు ఎన్నో విధాలుగా చైనా సహకరిస్తూ వస్తోంది. కొంత మంది ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తే కిమ్ దారిలోకి వస్తాడని చెబుుతున్నారు. అయితే... వాస్తవంలో కిమ్ ఆ విషయంలోనూ వెనుకడుగేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఎందుకంటే చైనా అత్యంత భద్రత కల్పించిన... కిమ్ సవతి సోదరుడ్ని సైతం కిమ్ అంతమొందిస్తే... చైనా కిమ్మనలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న కిమ్‌ మనుషుల చేతిలో సవతి సోదరుడు హతమయ్యారు. ఒక్క 2017లోనే ఏడు క్షిపణి పరీక్షలు జరిపినా చైనా కిక్కురుమనలేదు.
ఉత్తర కొరియాపై అమెరికా దాడి చేయడానికి ఎందుకు సంశయిస్తోంది?  ఉత్తర కొరియాకు ఎందుకు పెద్దన్న పెద్దగా ఢీకొడుతోంది. కొరియా ధైర్యమేంటి? అమెరికాకు ఉన్న సంశమేంటి? మొత్తం వ్యవహారంలో చైనా ఆడుతున్న గేమేంటి?
నాలుగు కారణాల రీత్యా ఉత్తర కొరియా ను ఎవరూ ఎటాక్ చేయలేరని సుస్పష్టంగా చెప్పొచ్చు. అమెరికాకు సియోల్ భయం వెంటాడుతోంది. సియోల్ దక్షిణ కొరియా రాజధాని. ఉత్తర కొరియా ఆర్టిలరీ గన్స్ పరిధిలో ఉన్న నగరం...  పది లక్షల జనాభా... ఏ మాత్రం కవ్వించినా సియోల్ పై ఉత్తర కొరియా అణ్యాయుధ దాడికి దిగొచ్చు... మందుగుండుతో మంటపెట్టేయోచ్చు. ప్రపంచ పటం లో సియోల్ నగరం లేకుండా చేసే పెను ప్రమాదం ఉంది.
రెండో విషయం జపాన్..  ఉత్తర కొరియాను అమెరికా కవ్విస్తే... జపాన్ పైనా దాడికి దిగి ప్రమాదం ఉంది. ఈ రెండు దేశాలు కూడా అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నాయ్.
దక్షిణ కొరియా  వద్ద గానీ, జపాన్ వద్ద గానీ అణ్వాయుధాలు లేవు... ఉత్తర కొరియాను ఈ రెండు దేశాలూ ఏమీ చేయలేవు... ఒకవేళ ఏదైనా బాంబులు వేయాలనుకున్నా... ఉత్తర కొరియా వెంటనే యుద్ధానికి దిగితే జపాన్, దక్షిణ కొరియా విలవిలలాడిపోవాల్సిందే... అదే అమెరికాకు పెద్ద భయంగా ఉంది. ఉత్తర కొరియా అమెరికా నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికీ... పెద్ద ఎత్తున అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. క్షిపణి పరీక్షలను ఉధృతం చేస్తోంది. వచ్చే రెండేళ్లలో అమెరికా భూభాగాన్ని తాకే మిసైళ్లను రూపొందించాలని కిమ్... ఆదేశ శాస్త్రవేత్తలకు ఆదేశాలిచ్చారు. సృష్టి ఆరంభం నుంచి  అమెరికా ప్రపంచ దేశాలపై దాడులకు తెగబడిందే కానీ... అమెరికాపై ఎవరూ కూడా దాడి చేయలేదు. కేవలం హవాయి దీవులపై మాత్రమే దాడి చేయడం జరిగింది. తాజాగా కొరియా రూపొందిస్తున్న క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్తే అమెరికాకు ముప్పు తప్పకపోవచ్చు. అమెరికా ఏం చేయలేదని చెప్పడానికి కారణమేమంటే... ఒకసారి కొరియా వెపన్స్ వాడటం మొదలుపెడితే...  దక్షిణ కొరియా కకావికలమైపోతుంది.
దక్షిణ కొరియాను క్షిపణుల నుంచి రక్షించేందుకు థాడ్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టమ్ ను అమెరికా మోహరించింది. అయితే అవి కేవలం మిసైళ్లను అడ్డుకుంటుంది.  అయితే అవి అణ్వాయుధాలను మాత్రం అడ్డుకోలేవు. ఉత్తర కొరియా అండర్ గ్రౌండ్, గుహల్లో పెద్ద ఎత్తున వెపన్స్ ఉన్నాయ్. వాటిని గుర్తించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. విజిబుల్ గా కన్పించకపోవడంతో... వాటి విషయంలో కొంత గందరగోళమైతే ఉంది.
కొరియా విషయంలో చైనాకు ఉన్న భయాలేంటి?  ప్రపంచ ఆర్థిక సామ్రాజ్య విజేతగా నిలవాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న చైనాకు కొరియా సమస్యల విషయంలో ఉన్న సొంత ఆలోచనలేంటి? కొరియా విషయంలో ఏదైనా జరగరానికి జరిగితే... చైనా ఆధిత్యం చాప్టర్ గల్లవుతుందన్న బెంగ ఏమైనా ఉందా?
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కొరియా ద్వీపకల్పం జపాన్ కంట్రోల్ లో ఉండేది. అయితే ఆ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో... కొరియాలోని రెండు భాగాలు రెండు దేశాల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. నార్త్ నుంచి సౌత్ వరకు రష్యా ఆధీనంలోకి తీసుకుంటే...  సౌత్ నుంచి నార్త్  వరకు భూభాగాన్ని అమెరికా స్వాధీనం చేసుకొంది.  రష్యా అండదండలున్న భూభాగం... ఉత్తర కొరియాగా ఉండగా... అమెరికా మద్దతిచ్చిన భూభాగం... దక్షిణ కొరియాగా ఉంది.  సోవియట్ బ్లాక్, అమెరికా బ్లాక్ గా రెండు కొరియా దేశాలు ఉండేవి. ఉత్తర కొరియా ప్రజలు రెండు దేశాలు కలవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ... దక్షిణ కొరియా ప్రజలు మాత్రం... ఎవరి అభివృద్ధి వారిదే... ఇక కలయిక అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రష్యా ప్రమేయం తగ్గిన తర్వాత... ఉత్తర కొరియా విషయంలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది.
ఇక కొరియాను నిలబెడుతుంది చైనా...  ఉత్తర కొరియా జీవనవిధానం మొత్తం చైనా ఇచ్చే డబ్బులతో నడుస్తుంది. కొరియా బొగ్గు తీసుకుని ఆ దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని చైనా అందిస్తోంది. ఆ డబ్బుతోనే కొరియా జీవనం సాగుతుంది. అయితే ఆ మొత్తంలోనే మేజర్ పోర్షన్ ను కొరియా అణ్వాయుధాలు అభివృద్ధి పర్చడానికి, క్షిపణి ప్రయోగాలకు వినియోగిస్తోంది.
అయితే అమెరికా మాత్రం చైనాపై ఒకటే ఒత్తిడి చేస్తోంది. కొరియాకు ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయోద్దని... గట్టి హెచ్చరికలు పంపిస్తోంది. అయితే... చైనా ఉత్తర కొరియాకు సాయం చేయడానికి రెండు కారణాలున్నాయ్. యుద్ధం మొదలైతే చైనా ప్రావిన్సులకు కొరియా శరణార్థులు విచ్చలవిడిగా పెరుగుతారు. ఇప్పటికే ఆర్థికంగా చిన్నాభిన్నమైన కొరియా సరిహద్దులు... వచ్చే శరణార్థులను స్వాగతించలేవు.
అదే సమయంలో అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోడానికి నిలబడ్డ ఒక్క ఆసియా సింహ కిమ్ అన్న భావన చైనాలో ఉంది. కిమ్ ను అంతమొందిస్తే...  తిరిగి ఉమ్మడి కొరియా ఏర్పడితే అది చైనాకు కంటగింపుగా మారుతుంది. ఇప్పటి వరకు దక్షిణ కొరియా సముద్రజలాల్లో ఉన్న అమెరికా ఆయుధ వ్యవస్థ అంతా చైనా సరిహద్దుల్లోకి మరలతుంది. అంటే ఒకరకంగా చైనాపై ఎక్కుపెట్టే అస్త్రాలుగా అవి మారతాయ్. ఇలాంటి పరిస్థితి చైనా కోరుకుదు కదా... అందుకే కిమ్ కు చైనా ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనుకుంటున్న చైనా... అందుకు శిఖండిగా ఉత్తర కొరియాను వినియోగిస్తోంది.
కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయ్. అణుపరీక్షకు ఉత్తర కొరియా సిద్ధమంటూ గ్రాండిస్తుటే... ఉత్తర కొరియాపై తీవ్ర చర్యలు దిశగా అమెరికా అడుగులు వేస్తోంది.  చేతనైతే కట్టడి చేయండి, లేదంటే మేం రంగంలోకి దిగుతామంటూ ట్రంప్ చైనాకు పంపిన హెచ్చరికలతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తే... అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదంటూ ఉత్తర కొరియా గర్జిస్తోంది. నిత్యం యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాను కంట్రోల్ లో పెట్టడానికి నికి నడుం కట్టారు.1950-53 కొరియా యుద్ధం తర్వాత ఉత్తర కొరియా విషయంలో అమెరికా ఇంత దూకుడుగా వ్యవహరించటం ఇదే తొలిసారి. ఇటీవల రసాయన ఆయుధాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై సిరియాపై  తోమహక్‌ మిస్సైళ్లతో  అమెరికా దాడిచేసింది. అఫ్ఘనిస్థాన్‌లోని తాలిబూన్ మూకలపై అతిపెద్ద నాన్‌-నూక్లియర్‌ బాంబుతో దాడి చేసిన ఘటనలు తర్వాత ఉత్తర కొరియా దిశగా అడుగులు పడతాయేమోనన్న అభిప్రాయం ఎక్కువుతోంది.  అమెరికాపై కాలుదువ్వే ఉత్తర కొరియాను దారికి తేవాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్  కు ఇటీవల భేటీలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే  ఇప్పటి వరకు చైనా ఏవిధంగానూ ఉత్తర కొరియా విషయంలో స్పందించకపోవడంపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గుర్రుగా ఉంది. అమెరికాపై అణు దాడి చేస్తామంటూ బుసలు కొడుతున్న కొరియా... అమెరికాపై అణు బాంబు చేసినట్టుగా చూపించే చిత్రాలతో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది.
కొరియా ద్వీపకల్పంలోని జపాన్, దక్షిణ కొరియా దేశాలకు బాసటగా నిలిచే అమెరికా... ఉత్తర కొరియా చేస్తున్న యుద్ధ తంత్రలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అమెరికా యుద్ధ విమాన వాహకనౌక యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్సన్‌ దక్షిణ కొరియాకు రక్షణగా వచ్చింది.  దక్షిణ కొరియాలోని సైనిక బలగాన్ని బలోపేతం చేయడంతోపాటు...  ఉత్తర కొరియా విషయంలో అనుసరించాల్సిన వైఖరిపైనా అమెరికా ప్రణళికలు సిద్ధం చేసుకొంది.
మాజీ సోవియట్‌ యూనియన్‌ సహకారంతో ఉత్తర కొరియా తన అణు పరిశోధనలు 1950 నుంచే ప్రారంభించింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన రెండేళ్లకు 1993లో ప్రపంచ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి ఉత్తర కొరియా తప్పుకుంది.  ఆ తర్వాత ఉత్తర కొరియా అణ్వస్త్ర పాఠవాన్ని పెంచుకునేందుకు పాకిస్తాన్ పై ఎక్కువగా ఆధారపడింది. పాకిస్తాన్ అణ్వస్త్ర పరిజ్ఞానానికి చైనా సహకరిస్తుంటే... చూసీ చూడనట్టుగా వ్యవహరించిన అమెరికాకు చేదు నిజం తర్వాత తెలిసింది.  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉత్తర కొరియా వద్ద ఏముంది... ఏం చేసుకొని ఆ దేశం అంతలా రెచ్చిపోతోంది. రోగ్ దేశమంటూ ప్రపంచ దేశాలన్ని తూ... అంటున్నా... తాను మాత్రం తన పని చేసుకుపోతోంది. ఉత్తర కొరియా వద్ద ఉన్న మిలిటరీ, అణ్వస్థ్ర సామార్థ్యమెంత? ఉత్తర కొరియా అమెరికాను చేరుకగల అణ్వస్త్రాలున్నాయా... లేక అమెరికా మిత్రు దేశాలనే టార్గెట్ చేసే ప్రమాదం ఉంది?
అమెరికా నుంచి ప్రతిఘటన ఎదురైన పక్షంలో ఉత్తర కొరియా ఏం చేస్తుంది? తిరిగి అమెరికా మీద దాడులు చేస్తుందా? అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా? అలా జరగకపోవచ్చు. కానీ పొరుగున ఉన్న దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకొని పెను దాడికి దిగుతుంది. దక్షిణ కొరియాపై  దాడి చేయటం అంటే అమెరికా మీద దాడి చేసినట్లేనని కిమ్  సర్కారు భావిస్తోంది.  దక్షిణ కొరియా రాజధాని సియోల్‌, ఉత్తర- దక్షిణ కొరియా దేశాల సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది.  దాదాపు 45 శాతం జనాభా దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఉంది.
జపాన్ లో సునామీ వస్తే ప్రపంచ దేశాల్లో ఐటీ ఆధారిత ఉపకరణాల రేట్లు విపరీతంగా పెరిగాయ్. ఇప్పుడు గృహోపకరణాలకు కీలకంగా ఉన్న దక్షిణ కొరియాపై దాడి జరిగితే ఆసియాతోపాటు, పలు ఆఫ్రికా, ఐరోపా దేశాలు విలవిల్లాడాల్సిందే. ఉత్తర కొరియా సైనిక సత్తాను ఓరి పరిశీలిస్తే...  వివిధ ప్రాంతాలను చేరుకోగల మిసైళ్లు ఉత్తర కొరియా వద్ద వెయ్యి వరకు ఉన్నాయి. హాసాంగ్ 5, హాసాంగ్ 6 మిసైళ్లు దక్షిణ కొరియాను భస్మీపటలం చేయగలవు. ఇక మధ్యశ్రేణి నోడాంగ్ మిసైళ్లు జపాన్ లోని టార్గెట్లను చేరుకోగలవు. ఇక అత్యాధునిక మిసైళ్లైన ముసదాన్ అమెరికా మిలిటరీ బేస్ గౌమ్ ను చేరుకోగలవని అంచనా వేస్తున్నారు.  నోడాంగ్ క్షిపణి వెయ్యి కి.మీ రేంజ్, తాయ్పోడాంగ్ 2,200 కి.మీ రేంజ్, ముసాడాన్ 4 వేల కి.మీ, తాయ్పోడాంగ్ 2-6 వేల కి.మీ రేంజ్ భూభాగాన్ని చేరుకోగలవు.
ఉత్తర కొరియా వద్ద 15 లక్షల ఆర్మీ బలగాలు ఉన్నాయి. 6 లక్షల రిజర్వ్ బలగాలున్నాయ్.  3500 యుద్ధ ట్యాంకులున్నాయి. యుద్ధం చేసేందుకు కావాల్సిన  21 వేల ఆర్టిలరీ ట్యాంకర్లు కొరియా అమ్ములపొదిలో ఉన్నాయ్.  వెయ్యి యుద్ధ విమానాలు, 2500 రాకెట్ లాంచర్లు సైన్యం వద్ద ఉన్నాయి.  72 సబ్ మెరైన్లు, 400 పెట్రో వెసల్స్ ను సన్నద్ధం చేసుకొంది.   18 ఏళ్లు దాటిన వారందరూ విధిగా సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో అది 18 ఏళ్లు ఉండగా... ఇప్పడది 13 ఏళ్లకు కుదించారు. మహిళలు సైతం మిలిటరీలో పనిచేసేలా నిబంధనలు విధించారు. 23 ఏళ్ల వయసు వచ్చే లోగా కొంత కాలమైనా వారి దేశానికి సేవలందించాలి. ప్రతి వెయ్యి మందిలో 48 మంది సైన్యంలో సభ్యులుగా ఉంటారు.
ఉత్తర కొరియా చేతిలో 15 నుంచి 20 వరకూ అణు వార్‌హెడ్లు ఉంటాయని అంచనా. దాదాపు రూ.65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను రక్షణ కోసం ఖర్చు చేస్తోంది.  ఉత్తర కొరియా జీడీపీ 25 బిలియన్‌ డాలర్లు... 2015 గణాంకాల ప్రకారం తలసరి ఆదాయం 1,000 డాలర్లుగా ఉంది. అదే సమయంలో అభివృద్ధి చెందిన దక్షిణ కొరియా తలసరి ఆదాయం 25,976 డాలర్లు. 2013 లెక్కల ప్రకారం జీడీపీ 1.3 ట్రిలియన్ డాలర్లు...  శంలో 90 శాతం మంది ప్రజలకు అంతర్జాలం సదుపాయం అందుబాటులో ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజాలు  హ్యూండాయ్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అగ్రగామి సంస్థలైన శ్యామ్‌సంగ్‌, ఎల్‌జీ దక్షిణ కొరియా కంపెనీలే. ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలు సియోల్‌లో ఉండటంతో... ఉత్పాత్తం జరిగితే వాటి పరిస్థితేంటన్న అభిప్రాయం ఎక్కువగా ఉంది.  చైనాకు దీటుగా నౌకా నిర్మాణం, గనుల తవ్వకం, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ రంగాల్లో దక్షిణ కొరియా గొప్ప అభివృద్ధి సాధించింది. 2006 అక్టోబరు 9న తొలిసారిగా అణు పరీక్ష నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. 2006 నుంచి 2016 సెప్టెంబరు మధ్యకాలంలో అయిదుసార్లు అణుపరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు ఆరోదఫా అణు పరీక్షకు సిద్ధమవుతోంది. ఇక రసాయన ఆయుధాలను సైతం ఉత్తర కొరియా తయారు చేస్తోందన్న అమెరికా చెబుతోంది.  ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ 2-సంగ్‌ 105వ జయంత్యుత్సవాల సందర్భంగా దేశ సైనికులు, యుద్ధట్యాంకులు, ఇతర ఆయుధ సంపత్తితో భారీ పరేడ్‌ నిర్వహించారు. పరేడ్‌లో తొలిసారిగా సబ్‌మెరైన్‌ నుంచి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులు ప్రదర్శించారు. ట్రంప్ సైకో అవతారమెత్తారా... ఎప్పుడు ఎలా ఏం మాట్లాడతాడో కూడా తెలియదా... పూటకోలా ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నాడు... అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాను ట్రంప్ ఇరుకునపడేస్తున్నాడా? ఇప్పటికే దేశంలో వివాదాస్పద నిర్ణయాలకు కారణమవుతున్న ట్రంప్ ఇప్పుడు కొరియాపై రాజే అగ్గి ప్రపంచాన్ని అంటుకుంటుందా? విచ్చలవిడి  వ్యాఖ్యలతో, ఇష్టానుసారం వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో విపత్తును సృష్టించబోతున్నారా... ఇరాక్, ఆప్ఘనిస్తాన్ లా కొరియాను టార్గెట్ చేస్తారా... అయితే ఆ రెండు దేశాలకు... ఉత్తర కొరియాకు ఉన్న తేడా తెలిసిందా?  ఉత్తర కొరియాపై ఓ సారి చర్యలంటాడు. మరోసారి చర్చలంటాడు. ఇంకోసారి మరోలా రియాక్ట్ అవుతాడు. వైట్ హౌజ్ వర్గాలకే అంతుబట్టని ట్రంప్... కొరియా విషయంలో దూకుడుగా వెళ్తే జరిగే ప్రమాదం అమెరికా పెద్దలకు తెలియంది కాదు... అయితే ఇవన్నీ తెలియకుండానే ఇష్టానుసారం మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు... ఉత్తర కొరియాతో చర్చలకు సై అంటున్నారు.  పనికిమాలినవాడు కిమ్ అంటూ రోత పుట్టించేలా మాట్లాడిన ట్రంప్... ఆ తర్వాత సైలంటవ్వాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేశాడు.
రష్యా సైతం అమెరికాపై విరుచుకుపడుతోంది. కొరియాపై యుద్ధమంటే ఆషామాషీ కాదంటూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు పంపించాడు. పైకి అమెరికాకు అనుకూల వైఖరి అవలంబిస్తున్నట్టు కన్పిస్తున్న చైనా సైతం అమెరికా విషయంలో స్పష్టతతో ఉంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేలా కిమ్ సర్కారుకు మద్దతివ్వడం. కిమ్ ప్రకటనలు ఒకసారి సరైనవేనన్న భావను అమెరికాను వ్యతిరేకించే వారి నుంచి విన్పించే మాట.  ఆసియాపై పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అడ్డుకుంటున్న ఒక్క మగాడు కిమ్  అంటూ వారు ప్రశంసిస్తారు.  చైనా, ఇండియా కూడా అమెరికాకు ఆధిపత్యం ముందు తలవంచుతున్న పరిస్థితుల్లో  ఆసియాలో కిమ్ ఉన్ లేకపోతే... మొత్తం పరిణామాలన్నీ అమెరికాకు అనుకూలంగా మారిపోతాయ్. అందుకే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ ను డైరెక్ట్ గా సమర్థించకపోయినప్పటికీ ఇన్ డైరెక్ట్ గా సమర్థించేవారు ఎక్కువుతున్నారు. అయితే మానవాళిని ఉనికి ప్రశ్నిస్తున్న కిమ్ లాంటి వారికి మద్దతివ్వడమంటే కొరివితో తలగొక్కున్నట్టేనన్న అభిప్రాయం కూడా సర్వత్రా ఉంది.

టాయిలెట్లలో పేపరా... బిడెట్సా...



తుడుచుకోవడమా... కడుక్కోవడమా... తేల్చుకోండి... అమెరికన్లకు ఆ దేశ పర్యావరణ వేత్తలు చేస్తున్న సూచన ఇది. దీంట్లో ఆశ్లీలమూ లేదు.... అసందర్భమూ లేదు... రోజూ మనం ఉపయోగించే టాయిలెట్లలో బిడెట్స్ వినియోగిస్తే పెద్ద ఎత్తున పేపర్ వినియోగాన్ని అడ్డుకోవచ్చని... తద్వారా భారీగా నిధులు దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని అమెరికా నిపుణుల   పరిశోధనలో వెల్లడైంది.  పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో సహకరిస్తుందని రుజవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

టాయిలెట్  కు వెళ్లినప్పుడు నీళ్లను వదిలి పెడుతోంది బిడెట్. ఇప్పటి వరకు కొన్ని పాశ్చాత్య దేశాలతోపాటు, అమెరికాలో ఎక్కువగా టాయిలెట్లకు వెళ్లినప్పుడు టిష్యూ  పేపర్లను వాడటం అలవాటుగా ఉంది. అయితే ఈ టిష్యూ పేపర్లను వినియోగించడం వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని... ఇప్పటికే ఎంతో నష్టం వాటిల్లిందని  మెటా ఎఫిసీయంట్ డాట్ కమ్ ఎడిటర్ జస్టిన్ థామస్ వివరిస్తున్నారు. అదే సమయంలో  టాయిలెట్లలో బిడెట్ ను వినియోగించడం ద్వారా అడవులను సంరక్షించడంతోపాటు... నీటిని పొదుపు చేయోచ్చంటూ అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు.  టాయిలెట్లలో శుభ్రత కోసం వినియోగించే టిష్యూలు, బిడెట్స్ యూరప్, జపాన్  దేశాల్లో బాగా ప్రసిద్ధం. బాత్ రూమ్ లలో జెట్ వాటర్ ను ఉపయోగించడం ద్వారా  పర్యావరణాన్ని కాపాడొచ్చని థామస్ వివరిస్తున్నారు.  పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వచ్చే రోజుల్లో ప్రపంచమంతా ఇదే పద్ధతిని అవలంబించాలని ఆయన సూచిస్తున్నారు.  ఈ పద్దతి ద్వారా టాయ్ లెట్లలో పేపర్ వినియోగం పూర్తిగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.

ఏటా అమెరికా ప్రజలు 36.5 బిలియన్ రోల్స్ పేపర్ ను వినియోగిస్తున్నారు.  అంటే 3,650 కోట్ల రౌండ్లను పేపర్లను అమెరికన్ల టాయ్ లెట్లలో వాడుతున్నారు. ఈ రోల్స్ తయారీ కోసం మొత్తం కోటిన్నర చెట్లు అవసరమవుతాయి. ఈ పేపర్లను తయారు చేసేందుకు 47 వేల 358 కోట్ల గ్యాలెన్ల నీరు అవసరమవుతోంది. ఈ నీటిని బ్లీచింగ్ చేయడం కోసం 2 లక్షల 53 వేల టన్నుల క్లోరిన్ వినియోగించాల్సి  వస్తోంది.  ఇందుకోసం అయ్యే విద్యుత్ 17.3 టెరా వాట్ల విద్యుత్ అవసరమవుతోందని...  థామస్ తన పరిశోధనలో వెల్లడించాడు. దాంతోపాటు ఈ పేపర్లను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చును కూడా తగ్గించవచ్చని స్పష్టం చేస్తున్నాడు.

ఎవరైతే బిడెట్స్ వినియోగాన్ని వ్యతిరేకిస్తారో... వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని వారికి ఎలాంటి వ్యాధుల సమస్యలు రావని కూడా వివరిస్తున్నాడు. అదే సయంలో బిడెట్స్ ను వినియోగించడం ద్వారా చాలా తక్కువ పరిణామంలో నీరు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. బిడెట్ ద్వారా వాడే నీరు గ్యాలెన్లో ఎనిమిదో వంత మాత్రమేనని వారు వివరిస్తున్నారు. ఒకసారి టాయెలెట్ కు వెళ్లడం వల్ల దాదాపు 15 లీటర్ల నీటిని వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్క పేపర్ రోల్ తయారు చేయడానికి 136 లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 1.3 కిలో వాట్ల విద్యుత్ తోపాటు, 700 గ్రాముల చెట్టును వినియోగిస్తున్నారు. కొన్ని బిడెట్లు రూ. 36 వేల వరకు ఉండగా... రూ. 5 వేలకు లభ్యమయ్యేవి కూడా ఉన్నాయ్.

టాయిలెట్లలో పేపర్ వినియోగించడంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయ్. చెత్త శుభ్రం చేయడం కోసం ఇది పెద్ద ప్రహసనమే అవుతుందని మెటా ఎఫిసీయంట్ డాట్ కమ్ ఎడిటర్ జస్టిన్ థామస్ అభిప్రాయపడ్డారు.  టాయెలెట్లలో బిడెట్స్ ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. జపాన్లో ఇప్పటికే పెద్ద ఎత్తున 60 శాతం ఇళ్లలో బిడెట్స్ వినియోగిస్తున్నారని... వెనుజులాలో 90 శాతం ప్రజలు టాయ్ లెట్లలో బిడెట్స్ వాడుతున్నారని చెబుతున్నారు.

పేపర్ ను ఉపయోగించడం కంటే నీటని ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని అంటున్నారు. నీటిని ఉపయోగించడం ద్వారా  పలు అంటురోగాలను సైతం అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. టాయె లెట్లను వినియోగించిన తర్వాత సగం మంది మాత్రమే చేతులు కడుక్కుంటున్నారని... ఇది అనారోగ్యానికి కారణమవుతుందని అంటున్నారు. సో మీరు కూడా ఈ పర్యావరణ సహిత బిడెట్స్ ను వినియోగిస్తే... అటు నీరు... ఇటు ఆరోగ్యం రెండూ పదిలం చేసుకోవచ్చు.


ఏపీలో బీజేపీ డబుల్ గేమ్


రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి రావడం వైసీపీ ప్రతిపక్షంలోకి కూర్చోవడం చకచకా జరిగిపోయాయ్. ఏపీలో అధికారాన్ని అందుకోవాలని ఆరాటపడిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల పోరులో చతికిలపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని, పవన్ కల్యాణ్ మద్దతుతో టీడీపీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్నికలు పూర్తై దాదాపు మూడేళ్లు పూర్తి కావొస్తున్నా... టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు అంతగా బలపడినట్టుగా కన్పించడం లేదు.  కేంద్ర మంత్రి వెంకయ్య,చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుంటే... వైసీపీ అధినేత జగన్ సైతం బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ పెద్దలు మాత్రం అటు జగన్ తోనూ, ఇటు చంద్రబాబుతోనూ అవసరం మేరకు మాత్రమే స్పందిస్తున్నట్టుగా కన్పిస్తోంది.  అయితే చంద్రబాబుపై పూర్తిగా నమ్మకం లేకనే బీజేపీ జగన్ వైపు కూడా బీజేపీ పెద్దలు చూస్తున్నారా? అందుకే రెండు పార్టీలతో కమలం పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందా?


బీజేపీ నేతలకు ఏపీ విషయంలో క్లారిటీ వచ్చేసిందా..  తెలంగాణపై పట్టు కోసం పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగితే... ఏపీ విషయంలో మాత్రం పెద్దగా దృష్టి సారించినట్టుగా కన్పించడం లేదు. టీడీపీతో పొత్తే బీజేపీ ఆచితూచి వ్యవహరించడానికి కారణమా?
వరుస ఎన్నికల్లో విజయం తర్వాత...  బీజేపీ ఫుల్ జోష్ లో కన్పిస్తోంది.  తిరుగులేని నాయకుడిగా మోదీ ప్రభ పతాకస్థాయిలో దూసుకుపోతుండంతో ఆ పార్టీ నేతల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కన్పిస్తోంది. అయితే... దేశ వ్యాప్తంగా దూసుకుపోతున్న బీజేపీకి ఏపీ విషయంలో  క్లారిటీ మిస్సవుతోంది. టీడీపీతో పొత్తు ఉండటం ఆ పార్టీ ముందడుగేయలేని పరిస్థితిలోకి నెట్టబడుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకొని గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తుందన్న సంకేతాలను పార్టీ నేతలు ఇస్తున్నప్పటికీ... రెండు పార్టీల్లో ఏదో అనుమానం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీతో పొత్తు లేదని...   గో ఎలోన్... గ్రో ఎలోన్ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నట్టు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. సో ఇప్పుడు విషయంలో బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయాలు తక్కువనే చెప్పాలి. అందుకే ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ వేచి చూసే ధోరణిలో ఉంది.  టీడీపీతో ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ నేతల్లో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయ్. కొంత మంది టీడీపీతో కలిసే ఉందామని ప్రతిపాదిస్తుండగా... మరికొంత మంది టీడీపీతో పొత్తుతో బీజేపీకి ఒరిగేదేమీ లేదని... బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలంటే అది టీడీపీ పొత్తుతో సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1999 నుంచి బీజేపీతో పొత్తు ఉన్న సందర్భాల్లోనే టీడీపీకి గెలుపు సాధ్యమైందని... ఒంటరిగా వెళ్లినప్పుడు టీడీపీ ఎప్పుడూ కూడా గెలవలేదన్న విశ్లేషణను కొంత మంది ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎక్కున స్థానాలను డిమాండ్ చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.


బీజేపీ డిమాండ్లకు టీడీపీ తలొగ్గుతుందా... గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కేటాయించిన టీడీపీ... ఈసారి బీజేపీ విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తుంది. ఏ మేరకు సీట్లను కేటాయిస్తుంది. ఎమ్మెల్యేలు కాకుండా బీజేపీ ఈసారి టీడీపీని ఎంపీ స్థానాలు విషయంలో గట్టి పట్టబడుతుందా? ఏ రాష్ట్రంలోనైనా తమ ముద్ర తప్పనిసరన్నట్టుగా బీజేపీ ఢిల్లీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఎక్కడిక్కడ కంట్రోల్ చేస్తూ పాలన సాగిస్తున్న బీజేపీ... దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించడాన్ని అంగీకరించే ప్రసక్తి కన్పించడం లేదు. నయోనా... భయనో బీజేపీకి సాహో అనాల్సిన తప్పనిసరి పరిస్థితిని ఆయా పార్టీలకు కలుగుతోంది. ఇటీవల పరిమామాలు చూసినప్పుడు మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. బెంగాల్ విషయంలోగానీ, హిమాచల్ ప్రదేశ్ విషయంలోగానీ, తమిళనాడు విషయంలోగానీ కేంద్రం కీలకంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఒంటరిగా అధికారంలోకి రావాలని తలపోస్తున్న బీజేపీ ఏపీ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించక తప్పని పరిస్థితిలో ఉంది.
టీడీపీతో డైరెక్ట్ గా యుద్ధానికి ఆ పార్టీ సిద్ధం కాకపోవచ్చు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సయోధ్య కొనసాగుతున్న తరుణంలో టీడీపీని ఇరుకునపెట్టేలా బయటకు వ్యవహరించకపోయినా... తమ ఆధిపత్యాన్ని మాత్రం నిరూపించుకోవాలని ఢిల్లీ పెద్దలకు తెలుసు. అందుకు కావాల్సిన కార్యాచరణను వారు సిద్ధం చేసుకుంటున్నారు.  ఏపీలో వీలైనన్ని అసెంబ్లీ సీట్లను అడగడంతోపాటు, మెజార్టీ ఎంపీ స్థానాలను కోరాలన్నది ఆ పార్టీ ఆలోచన.  అయితే టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో పెద్దగా సానుకూలంగా రియాక్ట్ కాకపోయినప్పటికీ... ఎంపీల విషయంలో బీజేపీ అభిప్రాయాన్ని గౌరవించక తప్పని సరి పరిస్థితి టీడీపీకి ఉంటుంది.
తెలంగాణలో స్వయంగా అధికారంలోకి రావాలని ప్రణాళికలు రూపొందిస్తున్న బీజేపీ... ఏపీ విషయంలో 50-50 అన్న భావనలోనూ ఉన్నట్టు టీడీపీతో అంతగా సఖ్యత కోరుకొని కొంత మంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితిలో టీడీపీ ఎలా వ్యవహరిస్తుందన్నది కూడా  ఆ పార్టీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బీజేపీతో టీడీపీ కలిసి పనిచేయాల్సిన నేపథ్యంలో ఆ పార్టీ విషయంలో ఆచితూచి వ్యవహరించక తప్పని పరిస్థితి ఉంటుందని కొంత మంది నేతలు చెబుతున్నారు. బలమైన వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీని తట్టుకొని గెలవాలంటూ రెండు పార్టీల మధ్య సఖ్యత ఎంతో అవసరం. ఇది బీజేపీ కంటే టీడీపీకే బాగా  తెలుసు. అందుకే ఆ పార్టీ బీజేపీ విషయంలో క్లారిటీతో ఉంది. పొత్తు తప్పనిసరి పరిస్థితుల్లో కుదుర్చుకోవాలన్నది ఆ పార్టీ స్టాండ్. బీజేపీకి కూడా ఈ విషయంలో స్పష్టతతో ఉంది. టీడీపీ నుంచి వీలైనన్ని ఎక్కువ అసెంబ్లీ, ఎంపీ స్థానాలను దక్కించుకోవాలన్నది. తేడా వస్తే... ఉండనే ఉంది కదా.... వైసీపీ...

అవును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో బీజేపీకి సెకండ్ ఒపీనియన్ ఉంది. టీడీపీ నుంచి జగన్ విషయంలో ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికీ... బీజేపీ తన పంథాను అదే విధంగా కొనసాగిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి శత్రువంటే మనకు మిత్రుడే కదా... ఇదే లాజిక్కు జగన్ విషయంలో బీజేపీ మెతకవైఖరి అవలంబించడానికి కారణమా... లేక చంద్రబాబును కంట్రోల్ లో పెట్టాలంటే జగన్ కావాలనా... ?
కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకనేతగా ఉన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోగా... వైసీపీ టీడీపీకి గట్టి ఫైట్ ఇచ్చింది. బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్ కలిస్తే గానీ వైసీపీని ఓడించలేని పరిస్థితి. ఇదే విషయాన్ని బీజేపీలోని కొంత మంది నేతలు అనేకసార్లు చెప్తూ వస్తున్నారు.  గతంలో ఢిల్లీలో చక్రం  తిప్పిన ఏపీ సీఎం చంద్రబాబు... మరోసారి కీలక పాత్ర పోషించే పరిస్థితి రాకూడదన్నది బీజేపీ అంతరంగం. బయటకు ఈ వైఖరిని పార్టీ నేతలు ఎక్కడా చెప్పకపోయినప్పటికీ... బాబు బలపడితే ఇబ్బందన్న భావన ఆ పార్టీ పెద్దల్లో ఉంది. అందుకే టచ్ మీ నాట్ గా టీడీపీతో ఢిల్లీ పెద్దలు ఉంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.
ఇదే వైసీపీ అధినేత జగన్ కు కలిసొచ్చే అంశం. ఆస్తుల కేసులో 16 నెలల పాటు జైళ్లో ఉండొచ్చిన జగన్... బీజేపీతో ఎలాంటి వైఖరి అవలంబించాలో తెలియనివారేం కాదు. కాంగ్రెస్ పార్టీకి తాను పూర్తిగా దూరంగా ఉన్నానని... అవసరమైనప్పుడు తన మద్దతు మీకేనంటూ మోదీ అండ్ కోకు జగన్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపర్చిన అభ్యర్థికే మద్దతిస్తానంటూ చెప్పడం కూడా జగన్ కు ఢిల్లీ పాలిట్రిక్ లో మరోసారి యాక్టివ్ రోల్ లభించినట్టైయింది. తనను విమర్శించేవారితో మాట్లాడే బదులు... తనకు మద్దతిచ్చేవారి సపోర్ట్ తీసుకోవాలన్న భావనలో ఉన్న మోదీకి... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి మద్దతు కూడా కొన్ని విషయాల్లో  అవసరమవుతోంది.  ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న జగన్ కు ఇది అడ్వాంటేజస్ సిట్యూవేషన్ ను ఇస్తోంది.
అదే సమయంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్న జగన్ విషయంలో ప్రజల్లో ఉన్న అంచనాలు కూడా బీజేపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటోంది. ఏపీలో ఉన్న పరిస్థితులను బీజేపీ హైకమాండ్ నిశతంగా గమనిస్తోంది. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు, చంద్రబాబుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు... రెండు గ్రూపుల నుంచి సమాచారాన్ని సేకరించి... ఫైనల్ డిసిషన్ మాత్రం మోదీ, షా ద్వయం తీసుకుంటోంది.  మరోవైపు చంద్రబాబు సర్కారును  విమర్శించడంలోనూ, రాజధాని భూముల స్కాములు, అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలోనూ జగన్ అనుసరిస్తున్న తీరు రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీకి ఆదరణ లభించడానికి కారణమవుతోంది. ఈ విషయంలో బీజేపీ పెద్దలు ఖుషీఖుషీగా ఉన్నారన్న అభిప్రాయాన్ని వైసీపీ నేతలు వివరిస్తున్నారు.  అయితే బాబు కాదంటే జగన్ ఇదే బీజేపీ లాజిక్కు...  

జగన్ పార్టీ ఏపీలో ఎంత వరకు బలపడుతోంది. గతంలో చేసిన తప్పును మరోసారి జగన్ రిపీట్ చేస్తున్నారా... లేక టీడీపీని ఓడించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారా?
జగన్ పార్టీ ఏపీ పాలిట్రిక్స్ లో ప్రస్తుతమున్న పొజిషనేంటి? దేశంలోనే బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ... ఏపీలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. అధికారపక్షం ముందు నిలబడే సామర్థ్యంలోని  పలువురు నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకొని... మంత్రులు కూడా అయిపోయిన పరిస్థితి. జగన్ వైఖరిపైనా ప్రశ్నాస్త్రాలు సంధిస్తూ... వారంతా టీడీపీలోకి వెళ్తున్నారు. ఇప్పటి వరకు 20 మందికి పైగా టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబుకు ఎదురెళ్లి మరో కొంతకాలం వెయిట్ చేయగలమా... లేదా అన్న అంశం కూడా ఆ పార్టీ నేతల్లో ఎక్కువగా కన్పిస్తోంది. మరోవైపు జగన్ పై ఉన్న ఆస్తుల కేసుల విషయంలోనూ కొంత మందిలో భిన్నాభిప్రాయాలున్నాయ్. ఇది కూడా పార్టీలో స్టబ్బర్న్ గా ఉంటున్న నేతలను ఆలోచనలో పడేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్థితి ఉంది. తెలంగాణలో అన్నిపార్టీల నేతలకు కేసీఆర్ గేట్లు బార్లా తెరిస్తే... ఏపీలో మాత్రం వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా పోరు సాగుతోంది.  జగన్ కు పూర్తి స్థాయిలో మొదట్నుంచి మద్దతిస్తున్న చిత్తూరు, కడప జిల్లా నేతల బలం కొండంత అండగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, శివప్రసాద్రెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా తదితర నేతల ఇటు ఇంటా బయట పార్టీకి ఎంతో దన్నుగా నిలుస్తున్నారు. అసెంబ్లీలోనూ పార్టీ అధినేత స్వరాన్ని గట్టిగా విన్పిస్తూ... ప్రభుత్వంపై సమరం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిందంటూ జగన్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో జరుగుతున్న అక్రమాలపైనా జగన్ మీడియా సాక్షి పతాకస్థాయిలో కథనాలు అందించింది. రైతుల సర్కారు మోసం చేస్తోందని... భూసేకరణపైనా జగన్ పోరాటం సాగిస్తున్నారు. పలు ఆందోళనల్లో విపక్షాన్ని సైతం కలుపుకొని వెళ్తున్నారు.
చంద్రబాబును ఎదుర్కోవడంలో జగన్ సమర్థవంతంగా పనిచేస్తున్నారన్న భావనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు ఉన్నారు. అయితే  జగన్ కేసుల విషయంలో ఎలాంటి వార్తలు వస్తాయన్న బెంగ ఆ పార్టీ నేతల్లో కన్పిస్తోంది.

జగన్ పార్టీ ఒక్కటే ఏపీలో టీడీపీ ని ఓడించే పరిస్థితి ఉందా...? జగన్ పార్టీ లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేయాలా? పవన్ కల్యాణ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ఏపీలో ఉన్న ఆరు పార్టీలు రెండు వైపులా బరిలోకి దిగుతాయా? మొన్నటి వరకు జగన్ తో కలిసి పనిచేస్తున్న లెఫ్ట్ పార్టీలో జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుతో ఏవిధంగా వ్యవహరిస్తుంది? ఏపీలో ముక్కోణపు పోటీ తప్పదా? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో టాక్ట్ ఫుల్ గా పనిచేస్తున్న పరిస్థితి... అటు బీజేపీతో సఖ్యతగానే ఉంటూనే... బీజేపీ ఎలాంటి వైఖరి అవలంబిస్తుందన్న విషయంపై ఓ కన్నేసి పాలన సాగిస్తున్నారు. ఏపీకి కేంద్రం సపోర్ట్ ఉంటేనే మనుగడన్న భావనలో మాట్లాడిన సీఎం చంద్రబాబు... ప్రత్యేక హోదా బదులు... ప్రత్యేక సాయానికి కూడా ఓకే చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సి ఉన్నప్పటికీ... ప్రాజక్టును టేకప్ చేస్తూ... వచ్చే ఎన్నికల సమయానికి నిర్మాణం పూర్తి చేస్తే... తనకు తిరుగుండదని బాబు భావిస్తున్నారు. అయితే బాబు ఆలోచనలు నాణేనికి ఓ వైపు మాత్రమే. మరోవైపు బీజేపీ చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఏమేరకు అందిస్తుందన్నది అనుమానమే... బీజేపీ, టీడీపీ కలిసి పనిచేశాయనుకుందాం... అప్పుడు మిగతా పార్టీలు ఎటువైపు?
పవన్ కల్యాణ్ తో కలిసి పనిచేయాలని లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయ్. బయటకు చెప్పలేకపోయినా... పవన్ తమతో ఉంటే మంచిదన్న అభిప్రాయంలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. కాపుల్లో నెలకొన్న అసంతృప్తి... ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుందన్న భావనలో పలువురు నేతలు ఉన్నారు.  ఇప్పటికే ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబు వైఖరిపై మండిపడుతున్నారు. పవన్ మాత్రం... బీజేపీనిపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ... నేరుగా ఎక్కడా కూడా టీడీపీపై మాత్రం వ్యాఖ్యలు చేయడం లేదు. బాబు సర్కారును విమర్శించే ప్రయత్నం కూడా చేయడం లేదు. బీజేపీ, టీడీపీ కలిసి పనిచేస్తున్న సమయంలో పవన్ టీడీపీతో రాజీపడతారా... కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తానంటున్న పవన్ పాత్ర ఏపీ పాలిటిక్స్ లో ఎలా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఉంది.
అదే సమయంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఒకలైన్లో ఉంటే... వైసీపీ, లెఫ్ట్ పార్టీలు మరోవైపు ఉండగ తప్పనిసరి పరిస్థితి. అదే సమయంలో బీజేపీతో కలిసి పనిచేసేందుకు జగన్ పార్టీ సైతం సిద్ధంగా ఉందన్న అభిప్రాయం ఉంది. యూపీ ఫలితాల తర్వాత మైనార్టీలు, ఎస్సీ ఓట్లన్న భావన కంటే... తనకు ఏది ఉపయోగపడుతుందన్న భావనలో జగన్ ఉన్నారు.
అటు లెఫ్ట్ పార్టీలైనా, జగన్ పార్టీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా కంపల్షన్ లో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే. ఒకరితో ఒకరు జట్టు కట్టాల్సిందే... ఇందుకోసం కొన్ని విషయాల్లో ఆయా పార్టీల రాజకీపడాల్సిందే... ఇక జనసేన పరిస్థితి గందరగోళంగా ఉంది.
అన్నీ బేరీజు వేసుకున్న జగన్...  రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిస్తామని... ఎన్నికల్లో విపక్షాలు అభ్యర్థిని సైతం నిలబెట్టాల్సిన అవసరం లేదన్నది కుండబద్ధలు కొట్టారు. ఇదే విషయాన్ని జగన్... ప్రధాని మోదీని కలిసిన తర్వాత చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ నేతలు ఈ పరిణామాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కేసులకు సంబంధించి మోదీని కలిశారు తప్పించి మరోటి కాదంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం... మోదీని... జగన్ కలిస్తే టీడీపీకి ఉలుకెందుకంటూ అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు.
మరోవైపు మోదీతో జగన్ భేటీపై టీడీపీ నేతల విమర్శలను బీజేపీ కీలక నేత సోము వీర్రాజు ఒక్కరే గట్టిగా దుయ్యబడుతున్నారు. ప్రధాని మోదీ దేశం మొత్తానికి ప్రధాని అని... మోదీని కలిస్తే పెడ అర్థాలు  ఎందుకు తీస్తారంటూ ఆయన మండిపడుతున్నారు.  వచ్చే రోజుల్లో  బీజేపీ-వైసీపీల మధ్య బంధానికి చిహ్నంగా కొంత మంది వైసైపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.  

       ఏపీలో బీజేపీని కాదని... చంద్రబాబు ఎన్నికల్లో ఒంటరి పోరు చేయగలరా...  మరోసారి ఏపీలో విజయం సాధింగచగలరా...  ఏపీలో తన తప్ప ఎవరూ కూడా పాలన ప్రజలకు సజావుగా సాగించలేరన్న దీమాతో ఉన్న బాబుకు జనంలో అదే రకమైన ఆదరణ కన్పిస్తోందా? ఏపీలో తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించే పరిస్థితి ఉందా?  ప్రజలకు చేయాల్సిందంతా చేస్తున్నానన్న బాబును జనం ఎంత వరకు నమ్మగలరు... అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబుకు మరోసారి కలిసివస్తోందా?
కేంద్రం సహకరించినా... సహకరించకపోయినా... ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆదుకుంటున్నామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఏపీలో బీజేపీని కాదని... ఒంటరి పోరు సాగించడం కష్టమేనా ? బాబు ఎన్నికల్లో గెలిచిన ప్రతీసారి బీజేపీతో పొత్తుతోనే సాధ్యమైందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే టీడీపీలో ఉన్న పలువురు నేతలు బీజేపీతో పొత్తు తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారు... ఆ విషయం తెలియని కొంత మంది టీడీపీ నేతలు మాత్రం... బీజేపీతో పొత్తు వద్దని అంటున్నారు.
అయితే ఏపీ రాజకీయాలతోపాటు, జాతీయ రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు... బీజేపీ విషయంలో ఎలాంటి విముఖతను బయటకు వ్యక్తం చేయకుండానే... తన పని తాను చేసుకుపోతున్నారు. బీజేపీ ఇచ్చినవన్నీ తీసుకుంటూ... ఏపీ హక్కుల కోసం పోరాడతానంటూ చెబుతూ వస్తున్నారు. ప్రత్యేక సాయంగానీ, పోలవరం ప్రాజెక్టు రావడంగానీ అన్నీ తనతోనే సాధ్యమయ్యాయని బాబు చెప్తున్నారు. రాజధాని భూసేకరణ ఎలాంటి వివాదం కాకుండా చేయగలిగామని... ప్రపంచశ్రేణి రాజధాని నిర్మాణం చేస్తున్నామని... చెప్తున్నా... కొన్ని చోట్ల రాజధాని భూముల రైతుల్లో ఎన్నో అనుమానాలున్నాయ్. అయితే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణంతో సత్తా చాటానన్న భావనలో చంద్రబాబు ఉన్నారు.
అయితే నోటుకు ఓటు కేసుతోనే చంద్రబాబు... బీజేపీతో అమీతుమీ తేల్చుకోలేకపోతున్నారని... రాజీ ధోరణి అవలంబిస్తున్నారని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు వింటున్నారని... సొంత నిర్ణయాలు... సొంత ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని... లోకేశ్ ను తెరపైకి తీసుకురావడానికి కారణం కూడా ఇదేనన్న అభిప్రాయం ఉంది. వచ్చే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నా తన రాజకీయ వారసుడికి పగ్గాలు కట్టబెట్టేందుకు బాబు సిద్ధమవుతున్నారు.

        బీజేపీ ఏపీ విషయంలో అనుసరిస్తున్న పంథా ఏంటి? ఏం చేస్తే బీజేపీకి ఎక్కువ లాభం కలుగుతుంది? టీడీపీతో పొత్తు కొనసాగితే టీడీపీకి ఎక్కువ లాభమా? బీజేపీకి ఎక్కువ లాభమా..?
అటు జగన్ తోనూ, ఇటు చంద్రబాబుతోనూ ఇద్దరితోనూ ఒకే డిస్టాన్స్ బీజేపీ మెయింటేన్ చేస్తోందా... రాష్ట్రపతి ఎన్నికల్లో జై కొట్టిన జగన్ కు ఏపీలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది..?
ఏపీలో అనుకున్న స్థానాల్లో విజయం సాధించాలన్నా... టీడీపీ మద్దతు లేదా... మరో పార్టీతో సఖ్యతగానైనా ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితన్న భావన బీజేపీలో ఉంది. అయితే పెద్ద ఎత్తున పార్టీకి నేతలు వలసలు వచ్చినా... బలమైన నేతలు పార్టీలోకి వస్తే తమ అదృష్టం మారుతుందన్న అభిప్రాయం పార్టీ హైకమాండ్ లో ఉంది. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితికి పూర్తి భిన్నంగా బీజేపీ ఎదగాలన్నది ఆ పార్టీ నేతల క్లియర్ అండర్ స్టాండింగ్.  అయితే పార్టీలో ఉన్న నేతలే  ఇప్పుడున్న రాష్ట్ర స్థాయి నాయకత్వంపై అసహనంగా ఉన్నారు. ఢిల్లీ పెద్దలు ఏపీ బీజేపీ అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయినా మరో నేతలను ఇప్పటి వరకు  ఎంపిక చేయని పరిస్థితి. వీటన్నింటికీ కుల, ప్రాంతాల సమతూల్యతతోపాటు, టీడీపీని పరిగణలోకి తీసుకోవాల్సిరావడమేనన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు విన్పిస్తున్నారు.
బీజేపీని దోషిగా నిలబెట్టాలనేలా ఏపీలో పాలిట్రిక్స్ నడుస్తున్నాయ్. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ... ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్న అభిప్రాయం అటు టీడీపీ, వైసీపీ నేతల్లో ప్రబలంగా ఉంది. అయితే గట్టిగా బీజేపీని ప్రశ్నించే ధైర్యం రెండు పార్టీలకు లేదు. అదే సమయంలో ఏపీకి చెప్పినదానికంటే ఎక్కువ చేస్తున్నామని బీజేపీ చెప్పుకుంటోంది.  14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నది బీజేపీ భావన.
అందుకే బీజేపీ ఏపీకి చేయాల్సిన సాయం విషయంలో వెనుకడుగేయడం లేదని...  అదే సమయంలో ప్రత్యేక హోదా మాత్రం సాధ్యం కాదన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే బాధ్యతను ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడికి అప్పజెప్పింది. అదే సమయంలో ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున సాయం చేస్తుందన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రణాళికను ఆ పార్టీ నేతలు విన్పిస్తున్నారు.  అయితే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే ఆర్థిక సంఘం సిఫారసులు పెద్దగా అడ్డంకి కాదన్నది కాంగ్రెస్ పార్టీ వర్షన్. అయితే ప్రత్యేక హోదా ఇస్తే ఏపీ సీఎం చంద్రబాబును పట్టుకోవడం ఎవరి తరమూ కాదన్న అభిప్రాయం ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న బీజేపీ నేతల్లో బలంగా ఉందన్న అభిప్రాయాన్ని కొంత మంది ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణలో ఇప్పటికే ఒంటరి పోరంటూ ఆ పార్టీ నేతలు స్పష్టం చేయడంతో... ఏపీలో మాత్రం కలిసే పనిచేస్తామన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం తెలంగాణలో అధికారం చేపట్టడం... ఏపీలో కింగ్ మేకర్ రోల్ పోషించేలా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే... అటు జగన్... ఇటు చంద్రబాబు... నడుమ బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోంది. ఏ పరిస్థితుల్లోనైనా తమదే పై చేయి కావాలన్నది ఆ పార్టీ నేతల భావనగా ఉంది.