దేశమంతా ఒకే బాదుడు
దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపే నిర్ణయం. దేశంలో ఇకపై ఒకటే పన్ను. ఒకే విధానం. ఎక్కడకెళ్లినా... ఒకటే ధర. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటూ కేంద్రం తీసుకొస్తున్న గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్... జీఎస్టీ ఇప్పుడో సంచలనం. దేశంలో ఉన్న పన్ను ఉగ్రవాదానికి చెరమగీతం పాడేందుకే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతోంది. అయితే జీఎస్టీ విషయంలో ఎంతో అలజడి రేగుతోంది. ఎవరికి లాభం... ఎవరికి నష్టం... దీనిపైనే చర్చంతా జరుగుతోంది. తాజా బిల్లుతో నాకేంటి... నీకేంటంటూ జనం చెవులు కొరుక్కుంటున్నారు. రోజూ వాడే మందుల ధరలు పెరుగుతాయా... అని ఒకరు భయపడుతుంటే.. ఆధునిక సమాజంలో వినియోగిస్తున్న ఫ్యాషన్ ట్రెండ్స్ ధరల పరిస్థితేంటంటూ మరికొందరు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీతో లాభమూ... నష్టమూ? ఏం జరుగుతుందోనన్న బెంగ ఎక్కువుతోంది. మధ్యతరగతి గీతకు కొంచెం పైబడి ఉన్న వ్యక్తికి మాత్రం జీఎస్టీ షాక్ తప్పదన్న సంకేతాలను పరిశ్రమ వర్గాలు విన్పిస్తున్నాయ్. షాపింగ్ లంటూ బాజర్లకెళితే జేబులు గుల్లేనంటున్నారు. ఎగువ మధ్యతరగతి వర్గాలకు మాత్రం బాదుడు తప్పవంటోంది. క్యాష్ ట్రాన్సక్షన్స్ కు కాలం చెల్లడంతో... బంగారం కొనడం అమ్మడం కూడా కష్టమైపోనుంది. రియల్ వర్గాల్లోనూ తాజా నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న బెంగ ఎక్కువుతోంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇప్పుడు ఒక అంతుబట్టని బ్రహ్మపదార్థంలా మారుతోంది. జీఎస్టీతో కొత్తగా వచ్చే మార్పులేంటి? ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్రం జీఎస్టీని ఎందుకు తీసుకొస్తుంది. ? ఇంతకుముందు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వస్తువుపై పన్ను రేటు ఒక్కో విధంగా ఉండేది. ఒకసారి జీఎస్టీ వస్తే ఇందులో ఏకరూపత... అంటే ఒకే విధమైన పన్ను విధానం వస్తుంది. జీఎస్టీ పన్ను రేటు ఒకేలా ఉన్న వసూలు విధానం రాష్ట్ర భుత్వాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మూడు నియంత్రణా వ్యవస్థల ద్వారా పన్ను వసూలు జరుగుతుంది. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంటిగ్రేడెట్ జీఎస్టీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల వసూళ్ల ప్రక్రియ సులభతరం అవుతుందన్న ఉద్దేశంతో జీఎస్టీని కేంద్రం తీసుకువస్తోంది. దేశ వ్యాప్తంగా ఏకరూప పన్ను విధానం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్రం వాదిస్తోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఇకపై పన్నులు ఉండవని... ఏ వస్తువుపైనా, ఏ సేవైనా సరే ఒకే విధమైన పన్ను పద్ధతి అమల్లోకి వస్తోందని పేర్కొంటోంది.
ప్రస్తుతం వివిధ సంస్థలపైనా, ఆయా వ్యక్తులపైనా వసూలు చేస్తున్న పలు రకాల పన్నులకు బదలు ఒకటే పన్నును జీఎస్టీ రూపంలో వసూలు చేయబోతున్నారు. తాజా నిర్ణయం ద్వారా పన్నుల ఎగవేతను చాలా వరకూ అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. పన్నుల భారం తగ్గుతుంది కాబట్టి వర్తకులు, వ్యాపారస్థులు కూడా ఎగవేతకు ఆలోచించచకుండా... నిజాయితీగా పన్నులు చెల్లిస్తారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో వివిధ రకాల పన్నులు వసూలు చేసేందుకు అయ్యే వ్యయం కూడా తగ్గుతుంది. ప్రభుత్వ ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుంది.
ప్రస్తుతం దేశంలో ఆయా వ్యక్తులు పలు రకాల పన్నులను చెల్లిస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కౌంటర్వెయిలింగ్ డ్యూటీ, స్పెషల్ కౌంటర్వెయిలింగ్ డ్యూటీ, వాల్యూ యాడెడ్ ట్సాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ , ఆక్ట్రాయ్, ఎంటర్ టైన్మెంట్ ట్యాక్, ఎంట్రీ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్, లాటరీలపై వేసే పన్నులు ఇలా... రకరకాల ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకేటా ట్యాక్స్ ను చెల్లించేందుకు అవకాశం కల్పిస్తోంది జీఎస్టీ. రకరకాల పన్నుల స్థానంలో ఒకటే ట్యాక్స్ తో పాటుగా కస్టమర్ ఎంత పన్ను చెల్లిస్తున్నాడో కూడా ఈజీగా తెలుసుకునే వీలుకలుగుతుంది.
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు, రీఫండ్ చాలా సులువు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే పరోక్ష పన్ను రేటు అమలు అయ్యేందుకు జీఎస్‌టీ వీలుకల్పిస్తోంది. ఆదాయపన్ను అంచనాలను సైతం ముంబయిలో ఉన్న వ్యక్తి పాట్నాలో చెల్లించవచ్చు. హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి ఢిల్లీలో పన్ను చెల్లించవచ్చు. ఇలా ఎవరు ఎక్కడైనా సరే పన్ను చెల్లించుకోవచ్చు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్న పన్ను సైతం ఉండదు. అన్ని చోట్ల కూడా యూనివర్శల్ పన్ను రాబోతోంది. ఒక వస్తువును ఎక్కడ కొనుగోలు చేసినా ఒకే ధర ఉంటుంది. ఇప్పటి మాదిరిగా ప్రాంతాన్ని, పన్ను రేటును బట్టి వస్తువు ధర మారిపోయే పరిస్థితి ఇకపై ఉండదు. ఎక్కడ ఎవరు ఏ వస్తువు కొన్నా ఒకే విధంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆయా వస్తువుల రేట్లు కూడా ఒకే విధంగా ఉండబోతున్నాయన్నమాట.
అన్ని వస్తువులు, సేవలపై జీఎస్‌టీ ఉంటుంది. మద్యం, ముడి చమురు, హైస్పీడ్ డీజిల్, పెట్రోలు, సహజ వాయువు, విమాన ఇంథనం పై జీఎస్‌టీ పన్ను ఉండదు. ఆయా వస్తువుల కేటగిరీలోను బట్టి నాలుగు స్లాబుల్లో పన్ను వసూలు చేస్తున్నారు. అంతిమ సేవ, వస్తు అమ్మకం, విక్రయం లేదా వినిమయం ఎక్కడ జరిగితే అక్కడ పన్ను ఉండేలా జీఎస్టీని రూపొందించారు. దేశం లోపల జరిగే ప్రతి వస్తు, సేవ పన్ను పరిధిలోకి వస్తుంది. ఇంతకుముందు అంతరాష్ట్ర సరఫరాల మధ్య చాలా తేడాలు ఉండేవి. వాటిపై పన్ను నిర్ణయాధికారంలో తేడాలుండేవి. అయితే జీఎస్టీ వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణ ప్రకారం నిర్ణయించిన రేట్లు అమలవ్వాల్సిందే.
జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ విధానంలో పన్నుల విధానం ఎలా ఉండబోతుందని అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయ్. జీఎస్టీ మండలి సూచించిన దాని ప్రకారం నాలుగంచెల పన్ను వ్యవస్థ కేంద్రం అమలు చేస్తుంది. ఇందులో 5%, 12%, 18%, 28% పన్నులు... నాలుగు రకాలుగా ఈ పన్నులు ఉంటాయి. నిత్యవసర వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయా వస్తువుల పన్నుల ధరలు ఎలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం... అతి సామాన్యుడికి మాత్రం జీఎస్టీ పన్ను పోటు ఉండదు. మధ్యతరగతి వారికి ఓ మోస్తరు పోటు ఉంటుంది. ఎగువ మధ్యతరగతి వర్గాలు, సంపన్న వర్గాలకు జీఎస్టీ కొంచెం మేదం... కొంచెం ఖేదంగా చెప్పుకోవచ్చు. సుఖాన్ని కలిగించే సౌకర్యాలకు పన్ను బాదుడు ఒక రేంజ్లో ఉంటే.. విలాసాల మీద మోజున్న వారికి మాత్రం చుక్కలు కనిపించేలా ఫిక్స్ చేశారు. తాజా జీఎస్టీ బాదుడు ప్రకారం నిరుపేదకు ఓకే కానీ..దిగువ.. మధ్యతరగతి వారికి ఇబ్బందిగా మారితే.. ఎగువ మధ్యతరగతి వారికి మాత్రం దిమ్మ తిరిగిపోతుంది.
ఖజానాకు భారీ ఆదాయాన్ని తీసుకొచ్చేలా భారీగా పన్నుల అమలు విషయంలో సంస్కరణలను కేంద్రం ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం పన్నులు లేని వస్తువులను ఓసారి చూస్తే... ఆహార ధాన్యాలు, పాలు పాల ఉత్పత్తులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. బియ్యం, గోధుమలు ఇతర ఆహార ధాన్యాలు, పాలు, పెరుగు, కోడిగుడ్లు, ప్యాకింగ్ చేయని పన్నీరు, తేనె, కూరగాయలు, పండ్లు, గోధుమపిండి, బెల్లం, శనగపిండి, మైదా, బ్రెడ్, వెజిటబుల్ ఆయిల్స్, ఉప్పు, బొట్లు, కుంకుమ, గాజులు, అప్పడాలు, స్టాంపులు, జుడీషియల్ డాక్యుమెంట్లు, ప్రింట్ చేసిన పుస్తకాలు, గాజులు, చేనేత వస్తువులు, గర్భనిరోధకాల విషయంలో ఇప్పటి వరకు ఎలా ఉందో... అదే పద్ధతి కంటిన్యూ అవుతుంది. ఇక 5 శాతం పన్ను పరిధిలోకి వస్తున్న వస్తువుల వివరాలను చూస్తే... అత్యవసర వస్తువులైనప్పటికీ... కచ్చితంగా మనం రోజూ వినియోగించే వస్తువులనే చెప్పాలి. చక్కెర, టీ, కాఫీ, వంట నూనెలు, బొగ్గు, పాలపొడి, పిల్లలకిచ్చే పాలపొడులు, కండెన్సడ్ పాలు, ప్యాక్ చేసిన పన్నీర్, న్యూస్ పేపర్లు, గొడుగులు, కిరోసిన్, ఎల్ పీజీ, చీపుళ్లు, వెన్న, నిల్వ ఉంచే కూరగాయలు, మసాలా వస్తువులు, చేప మాంసం, పిజ్జా బ్రెడ్, పండ్ల రసాలు, సగ్గుబియ్యం, మందులు, స్టెంట్ లు, లైఫ్ బోట్ లు ఉన్నాయ్. ఇప్పటి వరకు ఈ వస్తువులకు ఆయా రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పన్ను వసూలు చేస్తున్నారు. అయితే ఈ వస్తువులపై పన్ను ఇప్పుడు కొత్త పన్నుకు పెద్ద తేడా లేదన్న అభిప్రాయం ఉంది. రూ. 500 లోపు ఉన్న చెప్పులపై మాత్రం 5 శాతం పన్ను విధిస్తారు. పెట్రోల్ ను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించడంతో విమానం.. రైళ్లు.. బస్సు టికెట్లు తక్కువ పన్ను శ్లాబ్ లోనే ఉంటాయి.
12 శాతం పన్ను వసూలు చేసే వస్తువుల విషయంలో మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపెట్టనుంది. ఇప్పటి వరకు మధ్యతరగతి ప్రజలు అవసరాలుగా భావిస్తూ వచ్చారు. ఇకపై ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి మిడిల్ క్లాస్ ప్రజలు సైతం ఆలోచించుకోవాల్సిందే... వెన్న, నెయ్యి, మొబైల్ ఫోన్ లు, జీడిపప్పు, బాదంపప్పు, సాస్ లు, ఫ్రూట్ జ్యూస్ లు, ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు, అగరుబత్తి, ఫ్రోజెన్ మాంసాహారం, యానిమల్ ఫాట్, మిక్సర్లు, ఆయుర్వేద మందులు, పళ్లపొడి, కుట్టు మిషన్లు, కలర్ పుస్తకాలు ఈ కేటగిరీలో ఉంటాయ్.
ఇక 18 శాతం పన్ను విధించే వస్తువులు చూస్తే... వాటికి ఇంత ఘనం పన్ను ఉందా అనుకుంటాం. ఎందుకంటే మనం వాటికి ఎంత చెల్లిస్తున్నామో కూడా పట్టించుకోం. అయితే ఆయా వస్తువులకు ఇప్పుడు జీఎస్టీ బోర్డు 18 శాతం మేర పన్ను విధిస్తోంది. హెయిర్ ఆయిల్స్, సబ్బులు, టూత్ పేస్టులు, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, జామ్ లు, ఐస్ క్రీమ్ లు, టాయిలెట్ పేపర్, ఫేసియల్ టిష్యూలు, ఐరన్, స్టీల్, ఫౌంటెన్ పెన్నులు, మినరల్ వాటర్, కెమెరాలు, స్పీకర్లు, ఎన్వలప్ కవర్లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలు, వస్తువులను తయారు చేసే యంత్ర సామగ్రి, పరిశ్రమ వర్గాలు ఉపయోగించే వస్తువులు, టెలికాం సేలవలు, ఫైనాన్షియల్ సేవలు వినియోగించాలంటే చేతి చమురు వదలాల్సిందే... ఈ వస్తువుల పేర్లు చెబితే కొన్నిసార్లు అవసరాలుగా ఉంటాయ్. మరికొన్ని సార్లు విలాసాలుగా అన్పిస్తా్య్. ఈ తరహా వస్తువులకు వేస్తున్న పన్ను 28 శాతం. వంద రూపాయలకు వస్తువు కొనుగోలు చేస్తే పన్ను కట్టాలి. అంటే వెయ్యికి 280 రూపాయలు. పదివేలకు 2800 పన్ను కట్టాలి. ఈ కేటగిరిలో ఉన్నవి కార్లు, మోటర్ సైకిళ్లు, సిమెంట్, చూయింగ్ గమ్, కస్టర్డ్ పౌడర్, పాన్ మషాలా, పర్ఫ్యూమ్ లు, షాంపూ, మేకప్ సామగ్రి, బాణాసంచా, వాషింగ్ మిషన్లు, పెయింట్లు, డియోడరెంట్లు, షేవింగ్ క్రీమ్ లు, హెయిర్ డై, వెండింగ్ మిషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, హెయిర్ క్లిప్పర్లు, ఏసీలు, ఫ్రిజ్ లు, చాక్లెట్లు, చాక్లెట్ కోటెడ్ వేఫర్స్, సన్ స్క్రీన్ లోషన్లు, షాంపూలు, ఆప్టర్ షేవ్ లోషన్లు, రేజర్ బ్లేడ్లు, పింగాణీ సామగ్రి, పిస్టల్స్, రివాల్వర్లు, ఫాక్స్ మిషిన్లు, రిస్ట్ వాచ్ లు, ఇన్సులేటెడ్ కాపర్ వైర్లు, స్టార్ హోటళ్లు, రేస్ బెట్టింగ్ లు, క్లబ్ లు, సినిమా టికెట్లు ఉన్నాయ్. పై కేటగిరిలోని అంశాలు కొన్నిసార్లు విలాసాలుగా అన్పించినా మరికొన్ని సార్లు అవసరాలుగా ఉంటాయి. చిన్న ఇళ్లు కట్టుకోవాలనుకున్న వ్యక్తికి సిమెంట్ ధర అవసరం. అదే నాలుగైదు బిల్డింగులు ఉన్నవారు కట్టుకుంటే అది విలాసం కిందకు వస్తుంది. మారిపోతున్న జీవన విధానంలో సామాన్యుడు కనీసం మోటర్ సైకిల్ కొనుగోలు చేయలేని విధంగా ట్యాక్స్ దారుమన్న అభిప్రాయం ఉంది. ఇక సామాన్యుడు సేదదీరే బుల్లితెర పన్ను ఇకపై 28 శాతమంటే సినిమా టికెట్ల రేటులు తడిసిమోపెడు అవ్వబోతున్నాయ్. హోటల్ బిల్లులు కూడా మోతమోగించనున్నాయ్. రెస్టారెంట్లో తినాలన్నా... హోటల్ లో బస చేయాలన్నా ఇకపై 28 శాతం పన్ను కట్టాల్సిందే.
ఇక జనం మానుకోవాల్సిన వాటిపై జీఎస్టీ నడ్డివిరిగేలా పన్నులు విధిస్తోంది. సిగార్ ల మీద 109 శాతం, పొగాకు ఉత్పత్తుల మీద సుంకాలు కలుపుకొని 45 శాతం పన్ను, పాన్ మసాలాలపై సుంకాలతో కలిపి మొత్తం 44.8 శాతం పన్ను, శీతల పానీయాలపై 31.36 శాతం పన్ను విధిస్తున్నారు. ఇక 350 సీసీ సామర్థ్యం ఉన్న బైక్ ల మీద సుంకాలతో కలిపి 28.84 శాతం పన్ను విధించారు. అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు వాడే లగ్జరీ కార్లపై 32.2 శాతం పన్ను విధిస్తున్నారు. ఇక అతి ముఖ్యమైన రియల్ ఎస్టేట్ విషయంలో జీఎస్టీ పన్ను 12 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. ఆందోళన అవసరం లేదని... ఇప్పుడున్న ఇతర రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీలకు సమానంగానే పన్ను ఉంటుందన్న అభిప్రాయాన్ని రియల్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. జీఎస్టీలో రియల్ వర్గాల పై వేసే పన్నుకు సంబంధించి భూమి వాల్యూ తీసేసి 12 శాతంగా ఉంచాలంటూ రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయ్. భూమి ఆధారంగా 12 శాతం వసూలు చేస్తే రియాల్ ఎస్టేట్ బిజినెస్ కష్టతరమవుతుందని వారు చెబుతున్నారు. జీఎస్టీకి వసూలు చేస్తున్న 12 శాతాన్ని రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి వసూలు చేయాలని క్రెడాయ్ వర్గాలు పేర్కొంటున్నాయ్. ప్రస్తుతం 6 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. బిల్డింగ్ మెటీరియల్ కొనుగోలు సందర్భంగా చెల్లిస్తున్న పన్నులను ఇన్ పుట్ ట్యాక్స్ ను తిరిగి చెల్లించడం ద్వారా ఓవరాల్ గా పన్ను 12 శాతం లోపు ఉండాలన్నది వారి నిశ్చాతాభిప్రాయం. వడ్డీరేట్లు తగ్గడం ద్వారా రియల్ బిజినెస్ జోరందుకుంటుందని భావిస్తున్నారు.
కొత్తగా అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను... జీఎస్టీ బిల్లును బాలీవుడ్ స్వాగతించినప్పటికీ... దేశ వ్యాప్తంగా సినీరంగంపై 28 శాతం స్లాబ్ రేట్ విధించడంపైనే పరిశ్రమ వర్గాల్లో అంసతృప్తి వ్యక్తమవుతోంది. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటివరకు అమలులో వున్న ఎంటర్‌టైన్‌మెంట్, సర్వీస్ టాక్సుల స్థానంలో... 28శాతం స్లాబ్ రేట్ అమలులోకి రానుంది. తాజా స్లాబ్ పై బాలీవుడ్ ఖుషీగా ఉంటే దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల సినీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయ్. దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషా చిత్రాలపై వినోదం పన్ను సున్నాకే పరిమితం కాగా, బెంగాలీ సినిమాలపై రెండు శాతం, తెలుగులో చిన్న సినిమాలకు ఏడు నుంచి 18 శాతం వరకు వసూలు చేస్తున్నారు. తాజాగా ఆ భారం 28 శాతం కానుంది. సినిమాహాళ్ల టికెట్ల ధరలు దారుణంగా పెరిగి సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాలపై ముంబయ్ లో 40 శాతం ట్యాక్స్ ఉంది. వారికి అది ఇప్పుడు 28 శాతానికి తగ్గిపోనుంది. అంటే 12 శాతం మేర బాలీవుడ్ సినిమాలకు భరోసా కలగనుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో టాలీవుడ్ తో సహా... ఇతర భాషల ఇండస్ట్రీలపై 28 శాతం పన్ను పడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సినిమాలపై పన్ను 18 శాతంగా మాత్రమే ఉంది. అయితే అన్ని పన్నులు ఎత్తివేసినా తమపై రాష్ట్ర ప్రభుత్వ పన్ను పడితే మనుగడ సాగించడం కష్టమన్నది సినీ వర్గాల వాదన. జీఎస్టీకి తోడు మరే ట్యాక్సు ఉండకూడాదన్నది కేంద్రం వాదన. రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు శాతం పన్ను విధిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమా మనుగడ కష్టసాధ్యమవుతుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ... పన్నులను మూడు రకాలుగా విధించాలంటూ కోరుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో నిర్మాణమైన తెలుగేతర సినిమాలకు ఒకరకంగా... ప్రాంతీయ చిత్రాలకు మరో రకంగా ట్యాక్స్ వేస్తూ... వంద థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకు మరోరకమైన ట్యాక్స్... వేయాలని నిర్మాతలు కోరుతున్నారు. ఒకవేళ వారిపై కూడా 28 శాతం ట్యాక్స్ వేస్తే ఇతర ఖర్చులు అన్నీ పోను వందకు రూ. 40 కూడా మిగలవన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. స్లాబుల రూపంలో ట్యాక్స్ విధిస్తే మంచిదని... పెద్ద సినిమాలకు ట్యాక్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది కలగదని వారు చెబుతున్నారు. జీఎస్టీ బిల్లుని తాము స్వాగతిస్తున్నప్పటికీ... సినీపరిశ్రమపై విధించిన 28 శాతం లెవీనే తాము వ్యతిరేకిస్తున్నామని స్టార్ హీరో కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఈ రేటుని సగానికి తగ్గించి 12-15 శాతం పన్ను విధించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. అలా జరగని పక్షంలో తాను సినీపరిశ్రమకి గుడ్‌బై చెప్పడానికైనా వెనుకాడనని స్పష్టంచేశారు కమల్. ఈ జీఎస్టీ స్లాబ్ రేటుపై స్పందించిన ఫిలిం అండ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ అధ్యక్షుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఇప్పటికే పైరసీ బారినపడి కుదేలవుతున్న సినీపరిశ్రమపై ఈ స్లాబ్ రేటు ఊహించని షాక్‌ని ఇచ్చిందన్నారు సిద్ధార్థ్ రాయ్ కపూర్. ఈ స్లాబ్ రేటుని కేవలం 5శాతానికే పరిమితం చేయాల్సిందిగా తాము ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ, ప్రభుత్వం టికెట్‌పై 28శాతం స్లాబ్ రేట్ వసూలు చేయాలనుకోవడం బాధాకరం అని కపూర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
వస్తు, సేవల పన్ను విషయంలో పలు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తవుతున్నాయ్. ఇప్పటికే ఢిల్లీ, బెంగాల్ ప్రభుత్వాలు తాము జీఎస్టీని ఆమోదించలేమని... మరికొంత కాలం కావాలంటూ కేంద్రానికి తేల్చిచెప్పాయ్. అదే సమయంలో జీఎస్టీతో రాష్ట్రాల పరిస్థితేంటన్న బెంగ పలు రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరుక ఖజానాపై ఉన్న అజమాయిషీ పోతుందన్న బెంగ రాష్ట్రాల్లో ఎక్కువుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రం మాత్రం దేశంలోనే జీఎస్టీ బిల్లును ఆమోదించిన రాష్ట్రంగా నిలిచింది. జీఎస్టీ విషయంలో పలు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయం నెలకొంది. పన్ను వసూలుకు సంబంధించి వస్తున్న ఆలోచనలతో ఆయా ప్రభుత్వాల్లో గందరగోళంలో ఉన్నాయ్. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం దేశంలోనే అందరికంటే ముందుగా జీఎస్టీ బిల్లును ఆమోదించడం విశేషం. అదే సమయంలో సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులను పన్ను నుంచి మినహాయించాలని, తక్కువ పన్ను శ్లాబ్‌లోకి తీసుకురావాలని కేంద్రంపై తెలంగాణ సర్కారు ఒత్తిడి తెచ్చింది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటరీకరణ, బ్యాంకులతోను ప్రభుత్వం సంప్రదించింది.
వచ్చే నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ జీఎస్టీ బిల్లును ఆమోదించాలి. ఇప్పటివరకు 24 రాష్ర్టాలు బిల్లును ఆమోదించగా ఇంకా ఏడు రాష్ర్టాలు ఆమోదించాల్సి ఉంది. తెలంగాణ తర్వాత పదిహేను రోజులకు బీహార్, ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హర్యానా, గోవా.. ఇలా మొత్తం 24 రాష్ర్టాలు ఎస్‌జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. తాజాగా ఈ నెల 5న మణిపూర్ ఆమోదించింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వస్తున్నందువల్ల తప్పనిసరిగా ఈ నెలాఖరుకల్లా మేఘాలయ, పంజాబ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, జమ్ముకాశ్మీర్ రాష్ర్టాలు ఆమోదించాల్సి ఉంది. జమ్ముూ కాశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఉంది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయడం కష్టసాధ్యమేనని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర జీఎస్టీ బిల్లును ఆమోదిస్తుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్నందువల్ల విధిగా పశ్చిమబెంగాల్ సైతం రాష్ట్ర జీఎస్టీ బిల్లును ఆమోదించాలి. మరోవైపు జీఎస్టీకి సంబంధించి రాజకీయ సంక్షోభమూ పొంచి ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. కేంద్రమే అన్ని విషయాల్లో పెద్దన్న పాత్ర పోషించనుందన్న అభిప్రాయ కలుగుతోంది. ఇప్పటి వరకు స్థానిక పన్నులను ఆయా రాష్ట్రాల తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వసూలు చేసుకునేవి. ఇకపై ఆ పన్నులు ఉండవు. ఆ అధికారం రాష్ట్రాలకు ఉండదు. అన్నీ కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చేస్తున్నాయ్. దీంతో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా... ప్రజలకు తాయిలాలివ్వాలన్న కూడా సమస్యనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక బంగారం కొనుగోలు చేసే వారికి ఇప్పుడు ట్యాక్స్ బాధ పెద్దగాలేకపోయినప్పటికీ... బంగారు ఇష్టానుసారం మాత్రం కొనుగోలు చేసే పరిస్థితి మాత్రం ఉండదు. బంగారాన్ని ఇకపై ఎవరూ కూడా రెండు లక్షలకు మించి కొనుగోలు చేసే అవకాశం ఉత్పన్నం కాదు. ఎందుకంటే రెండు లక్షలకంటే ఎక్కువ ట్రాన్సక్షన్ చేస్తే మీపై ఐటీ వేట మొదలైనట్టే... బంగారం విషయంలో పెద్దగా ఆందోళన అవసరం లేదన్న అభిప్రాయాన్ని జీఎస్టీ ద్వారా కలిగించినప్పటికీ... బంగారానికి సంబంధించి ప్రత్యక్షంగా... పరోక్షంగా ఉన్న సమస్యలతో కొనుగోళ్లు పెద్ద ఎత్తున నిలిచిపోయే అవకాశముందని బంగారు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇష్టానుసారంగా బంగారం ఇకపై అమ్మడానికి...గానీ కొనడానికి గానీ నిబంధనలు అంగీకరించవని... కొన్న బంగారమంతా లెక్కలతో సహా చెప్పాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయ్.
బంగారాన్ని కొనుగోలు చేయడమంటే ఒకరకంగా రిస్క్ కిందే చెప్పాలి. కేవలం ఇది శాలరీ ఎంప్లాయిస్ కు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయా జీతాలు నేరుగా కంపెనీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి ఉద్యోగులకు చేరితే సమస్య ఉండదు. అయితే పలువురు ఆదాయం నేరుగా నగదు కింద లభిస్తుండంటం కూడా ఇందుకు ఇబ్బందికరమైన విషయం. ఇప్పటికే కేంద్రం రెండు లక్షల కంటే నగదు ట్రాన్సక్షన్లను రద్దు చేసింది. ఎవరైనా రెండు లక్షల రూపాయల కంటే నగదు లావాదేవీ జరిగిపే సమాచారం తెలియజేయాల్సిందిగా ఐటీ శాఖ ప్రకటనలు కూడా ఇచ్చింది. తీసుకున్నవారు... ఇచ్చినవారిపైనా కేసులు కత్తి వేలాడుతోంది. కేవలం వైట్ మనీతో మాత్రమే కొనుగోలు చేసేవారు బంగారాన్ని తమకు నచ్చిన విధంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుచేసి పప్పుకూడు చందంగా చాలా మంది పెళ్లిళ్ల సందర్భంగా అప్పోసొప్పో జేసి కుటుంబాల్లో కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. వారు కూడా ఇకపై ఇష్టానుసారంగా అప్పులు చేయడానికి కూడా సాధ్యపడదు. ఇప్పటికే నోట్ల రద్దు తర్వాత క్రెడిట్ సమస్యలు ఎక్కువై... అప్పులు ఇచ్చే వారు కూడా తగ్గిపోతున్న పరిస్థితి. కేంద్ర నిబంధనలు అన్ని విధాలుగా ఎకౌంట్ బులిటీని తీసుకొస్తున్నాయ్. ఎవరిష్టానుసారం వారు ఎలాబడితే అలా చేయడానికి కూడా ఇకపై కుదరదు. బంగారం రేటు పెరగకపోయినప్పటికీ... బంగారాన్ని కొనుగోలు చేయడం మాత్రం కూసంత కష్టమే.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాల గురించి చర్చించుకునేవారు... మాకు ప్లస్సేంటి? మైనస్సేంటి? అన్న అంశాలను బేరీజు వేసుకొని తమ కొనుగోళ్లు జరిపేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న జీఎస్టీతో ఏ వర్గాలకు లాభం? ఏ వర్గాలకు నష్టం? నోట్ల రద్దు సందర్భంగానూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... పేదల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ గట్టిగా చెప్పారు. తాజాగా జీఎస్టీతోనూ తాము పేదల పక్షమని... పేదలకు జీఎస్టీ వల్ల భారీగా మేలు జరుగుతుందని కేంద్రం వాదిస్తోంది. ఎగువ, ఉన్నత స్థాయి వర్గాల వారికి జీఎస్టీ వల్ల వడ్డన ఉన్నప్పటికీ... దిగువ మధ్యతరగతి ప్రజలకు లాభసాటిగా ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. ఉదాహరణకు నెలకు పది వేల రూపాయల ఆదాయం సంపాదించే వ్యక్తికి తాజా జీఎస్టీ బిల్లుతో కొంత మేర లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా రోజూ ఉపయోగించే నిత్యవసర వస్తువులను పన్ను నుంచి మినహాయించడం వారికి కలిసివచ్చే అవకాశం. వాటిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న స్వల్ప పన్నులు కూడా ఇకపై ఉండవ్. దీని ద్వారా నెలసరి వినియోగంలో ఖర్చు 5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక 20 వేల నుంచి 30 వేల ఆదాయం సంపాదించే వ్యక్తులకు సంబంధించి తాజా జీఎస్టీతో పెద్దగా లాభనష్టాలేవీ ఉండవని కూడా చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన పలు రకాల స్లాబుల్లో వీరు ఉపయోగించే వస్తువులకు ఆల్టర్ నేటివ్స్ కూడా ఉండటంతో వారు తమకు మేలు కలిగించే వస్తువులను ఉపయోగించే అవకాశం ఉంది. వీరు వినియోగించే వస్తువులన్నీ కూడా నిత్యవసర వస్తువులతోపాటు, 5శాతం, 12 శాతం స్లాబుల్లో ఉన్నాయ్. వీరు నిత్యం ఉపయోగించే ఆహారపదార్థాల ధరల్లో ఇప్పుడున్న పన్నులకు కొంచెం అటూ ఇటూగా ఇక 5 శాతం పన్ను పరిధిలోకి వస్తున్న వస్తువుల వివరాలను చూస్తే... అత్యవసర వస్తువులైనప్పటికీ... కచ్చితంగా మనం రోజూ వినియోగించే వస్తువులనే చెప్పాలి.
ముఖ్యంగా... చక్కెర, టీ, కాఫీ, వంట నూనెలు, బొగ్గు, పాలపొడి, పిజ్జా బ్రెడ్, పండ్ల రసాలు ఈ కేటగిరిలో ఉన్నాయ్. ఇప్పటి వరకు అవసరాలుగా ఉన్న కొన్ని వస్తువులు విలాసాల సరసన చేరిపోతున్నాయ్. 12 శాతం పన్ను వసూలు చేసే వస్తువుల విషయంలో మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపెట్టనుంది. వెన్న, నెయ్యి, మొబైల్ ఫోన్ లు, జీడిపప్పు, బాదంపప్పు, సాస్ లు, ఫ్రూట్ జ్యూస్ లు ఈ కేటగిరిలో ఉన్నాయ్. ఇక 30 వేల నుంచి 50 వేల మధ్య సంపాదించే వారికి మాత్రం రెడీ మేడ్ వాయింపుడు ఎక్కువవుతోంది. వారు ఇకపై ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తానికి కనీసం 5 నుంచి పది శాతం మేర అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వారు ఆయా వస్తువుల కొనుగోలు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి రావచ్చు. ట్యాక్స్ ఎక్కువగా ఉన్న వస్తువులు అంటే 28 శాతం ట్యాక్స్ అప్లై అయ్యే పలు వస్తువుల కొనుగోళ్లు తగ్గే అవకాశం కూడా ఉంది.
అయితే కార్పోరేట్ కంపెనీలు వ్యవహరించే ధోరణిబట్టి కూడా ఆయా వస్తువుల ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వివిధ పన్నుల తక్కువగా ఉండటం వల్లే కొన్నిరకాల కాస్మోటిక్స్ తక్కువ ధర ఉన్నప్పటికీ... తాజా నిర్ణయం వాటి రేటు బాగా పెరిగే అవకాశం ఉంది. వంద రూపాయలకు 28రూపాయల పన్ను... కార్లు, మోటర్ సైకిళ్లు, గృహోపకరణాలు, డియోడరెంట్లు, షేవింగ్ క్రీమ్ లు, స్టార్ హోటళ్లు, సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయ్. కామన్ మ్యాన్ గా మనం ఆదాయపు పన్ను, సేవా పన్ను గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. తయారీ మొదలుకొని వస్తు,సేవల అమ్మకాల దశ వరకూ మనం పన్ను మీద పన్ను కడుతూనే ఉంటాం. అయితే వాటన్నింటినీ మనం అంతగా పట్టించుకోం. జీఎస్టీ ఒక పారదర్శకత పన్ను వ్యవస్థను తీసుకువస్తోంది. ప్రతి దశలోనూ వస్తు,సేవ చేతులు మారేముందు ఒక వ్యక్తి, సంస్థ చెల్లించే పన్ను ఎంతో అందరికీ తెలిసే వ్యవస్థను ఏర్పటవుతోంది. దీని వల్ల పలు వస్తువుల ధరలు బాగా తగ్గే అవకాశమూ ఉంది.
నెలకు పది వేల జీతం సంపాదించే వ్యక్తికి కొత్తగా జీఎస్టీతో ఎంతోకంత లాభం కలుగుతుంది. ఇక 10 నుంచి 25 వేల మధ్య జీతం సంపాదించే వ్యక్తికి నోలాస్ నో గెయిన్. ఇక 25 వేల నుంచి 50 వేల వరకు నెల జీతం సంపాదించే వ్యక్తికి మాత్రం ఖర్చు బారీగా పెరిగే అవకాశం ఉంది. రెడీ మేడ్... రెడీ టు ఈట్... వస్తవులన్నీ కూడా తడిసిమోపడవుతాయ్. ఉన్నతస్థాయి వర్గాల వారికి ఖేదం తప్పదు. బంగారం కొనడం చాలా కష్టం కావొచ్చు. వైద్య పరికరాల ధరల్లో పెద్దగా తేడా లేదు. అయితే దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలుపై ఇప్పుడు గందరగోళం నెలకొంది. పన్నుల తీవ్రవాదాన్ని నిరోధించేందుకు తాము జీఎస్టీ తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. అయితే రాష్ట్రాలు మాత్రం స్వేచ్ఛ కోల్పోతామని బెంబెలెత్తిపోతున్నాయ్. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమనుకుంటారో అని ఓకే చెప్పిన పలు రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు స్వేచ్ఛగా ఉన్న తాము... వచ్చే రోజుల్లో కేంద్రం కనుసన్నల్లోకి వెళ్లిపోతామేమోనన్న భయంవారికి పట్టుకొంది. జీఎస్టీతో ఇప్పటికిప్పుడు సమూల మార్పులైతే రావు కానీ... అమలు చేయడమే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పెద్ద సవాలు. ఇప్పటికే బెంగాల్, ఢిల్లీ సర్కార్లు కేంద్రంపై విమర్శలదాడి పెంచేస్తున్నాయ్. జీఎస్టీ అమలు జులై1 నుంచి సాధ్యం కాదని తెగేసి చెబుతున్నాయ్.

No comments:
Post a Comment