Friday, 14 July 2017

జేసీ చాప్టర్ క్లోజ్

( ) రాజకీయగా వీకైపోతున్నాడు. పట్టులేక  ఒంటరైపోతున్నాడు. రాజకీయంగా చాప్టర్ క్లోజ్ అయ్యే పరిస్థితికి చేరుకున్నాడు. నాటి మహా వృక్షం నేడు నెలకొరిగిపోతోంది. నాడు ఆయన మాటకు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలుకుబడి ఉండేది. అయితే అదంతా ఘనం. వర్తమానంలో అస్థిత్వం కోసం పోరాటం చేస్తున్నారు. రేపు ఏంటో తెలియని అయోమయం జేసీ బ్రదర్స్ ను వెంటాడుతోంది. రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన జేసీకి రాజకీయ గ్రహణం పట్టింది. వరుస
వివాదాలు జేసీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయ్.
ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఆరు సార్లు తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా చరిత్ర సృష్చించాడు. ఓటమితో రాజకీయ జీవితాన్ని ఆరంభించిన జేసీ... ఆ తర్వాత గెలుపును తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. కాదు కాదు...  తాడిపత్రినే తన ఇంటిపేరుగా చేసుకున్నాడు. 1985లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అప్పట్నుంచి 2009 వరకు తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30 ఏళ్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో వరుసగా ఐదేళ్లు కేబినెట్ మంత్రిగా పనిచేశాడు. జేసీ దివాకర్ రెడ్డి ఐదేళ్లు పాటు మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
అయితే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ కేబినెట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నాడు. వైఎస్సార్ వైరి వర్గాలతో పనిచేసిన జేసీ... 2004లో కాంగ్రెస్ గెలుపుతో... వైఎస్సార్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నాడు. జేసీపై వైఎస్ కు సదాభిప్రాయం లేకపోయినప్పటికీ... ఢిల్లీ పెద్దల సూచనల మేరకు కేబినెట్లో చేర్చుకున్నాడు. అయితే జేసీ కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ... జిల్లాలో మరో కీలక నేత రఘువీరారెడ్డి కీలకంగా వ్యవహరించేవాడు. వైఎస్సార్ కేబినెట్లో నెంబర్ 2 రోశయ్య పేరు విన్పించినప్పటికీ... కీలక నిర్ణయాల్లో వైఎస్ రఘువీరాతో చర్చించేవాడు. జేసీకి పంచాయతీరాజ్ శాఖ కట్టబెట్టినప్పటికీ... రఘువీరా కీలక వ్యవసాయ శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేవాడు. అలా జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నప్పటికీ... వ్యవహారాల్లో మాత్రం రఘువీరా తర్వేతే జేసీ రోల్ ఉండేది. 2009లో తిరిగి ఎన్నికైనప్పటికీ... వైఎస్ కేబినెట్లో మాత్రం బెర్త్ దక్కించుకోలేకపోయాడు. అయితే పునర్వ్వస్థీకరణలో చోటు కల్పిస్తానంటూ వైఎస్ హామీ ఇచ్చినప్పటకీ... ఆయన మరణంతో జేసీ ఐదేళ్ల పాటు మంత్రి పదవి ఎండమావిగానే మిగిలింది.
రోశయ్య కేబినెట్ విస్తరిస్తే... పదవి దక్కుతుందని భావించినప్పటికీ... రోశయ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అదీ జరగలేదు. రోశయ్య వెంట ఉంటూనే... ప్రభుత్వం గురించి ఇష్టానుసారం స్టేట్మెంట్లిచ్చేవాడు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ స్థానం లభిస్తుందని భావించినా... అదీ జరగలేదు. రఘువీరా కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా కొనసాగడం... సమైక్య, ప్రత్యేక ఉద్యమాల నేపథ్యంలో... రాయల్ తెలంగాణ అంటూ సెపరేట్ ట్యూన్స్ విన్పించేవాడు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా దెబ్బతినడంతో... జేసీ టీడీపీ గూటికి చేరి అనంతపురం జిల్లా ఎంపీగా విజయం  సాధించాడు. నాడు కాంగ్రెస్ పార్టీలో విచ్చిలవిడి కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలిచాడు. టీడీపీలోకి వచ్చినప్పటికీ... అదే వివాదాలతో జేసీ చలి కాచుకుంటున్నాడు.
నాడు అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజికవర్గం నుంచి కీలక నేత అవసరమన్న భావనలో బాబు జేసీని చేరదీశాడు. జేసీకి అనంతపురం జిల్లాలో ఉన్న బలం, బలగంతో... గట్టి నేతగా కొనసాగుతూ వచ్చాడు. గుంతకల్లు, శింగనమల, తాడిపత్రి, కల్యాణదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో జేసీకి కేడర్ బలం ఉంది. ఓవైపు అంగబలం... మరోవైపు అర్థబలంతో జేసీ అనంతపురం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశాడు. అయితే జేసీ టీడీపీలోకి రావడం ఇష్టంలేని కొంత మంది టీడీపీ నేతలు జేసీని వీలవైనంతగా అడ్డుకోవాలని చూస్తున్నారు. అనంతపురం అర్బన్  ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితోను విభేదాలు. హిందుపూరం పార్లమెంట్ పరిధిలో పరిటాల కుటుంబం... జేసీని ఆమడదూరంలో ఉంచుతోంది. ఇలా రాజకీయంగా జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటున్న తరుణంలో విశాఖ ఎయిర్ పోర్టులో గలభాతో జేసీ బాక్సులు బద్ధలైపోతున్నాయ్.  ఆలస్యంగా వచ్చిందే కాక... బోర్డింగ్ పాస్ ఇవ్వాలంటూ సిబ్బందిపై రుబాబు ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా ప్రింటర్ ను నెలకేసి కొట్టినంత పని చేశాడు. తాను ఎంపీనని... తనకు స్పెషల్ పవర్స్ ఉన్నాయంటూ శివాలెత్తాడు.  విశాఖ విమానాశ్రయం తన సొంత ఇళ్లున్నట్టుగా ఇష్టానుసారం వ్యవహరించాడు. అప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పాపులర్ అయిన జేసీ... విశాఖ ఎయిర్ పోర్టులో ఇండిగో సిబ్బందితో దురుసుగా వ్యవహరించడంతో... దేశ వ్యాప్తంగా విమానయాన సంస్థలు ట్రావెల్ బ్యాన్ విధించాయ్. విమానాలు ఎక్కకుండా అడ్డుకుంటున్నాయ్. ఇటీవల హైదరాబాద్ లో ట్రూజెట్ విమానంలో ప్రయాణించాలని ప్రయత్నించినా... ఎయిర్ పోర్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఎప్పుడూ గందరగోళ వ్యాఖ్యలు, వివాదాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే జేసీని... తాజాగా విమానయాన సంస్థలు కబడ్డీ ఆడుకుంటున్నాయ్.

No comments:

Post a Comment