అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. పంచ సుత్రాలతో షా తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు. షా అడుగుపెట్టారంటే ఆషామాషీగా ఉండదని... పెద్ద లెక్కలే ఉంటాయన్నది పార్టీ నేతల భావన అందుకే... షా పర్యటనను తెలంగాణ సమాజమంతా ఆసక్తిగా చూస్తోంది. తెలంగాణలో తిరుగులేని నాయకుడిగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, ఆ పార్టీని దెబ్బతీసే మాష్టర్ ప్లాన్ ను షా ఆవిష్కరించబోతున్నారా...? తెలంగాణలో రెండే పార్టీలుండాలన్న అమిత్ షా ఆలోచన వర్కౌట్ అవుతుందా? తెలంగాణలో అమిత్ షా మంత్రాంగం ఎలా ఉండబోతోంది. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ
తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేకుండా ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం... వరుసగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించడం... గులాబీ పార్టీపై అంచనాలు పెరిగాయ్. అయితే తెలంగాణలో బలమైన టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టడం అంత వీజీ కాదన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం కేసీఆర్ సామ్రాజ్యంపై దాడికి సిద్ధమవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ప్రకటన... ఆ తర్వాత తలెత్తిన పరిణామాలతో టీఆర్ఎస్ క్రమంగా బలపడింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాలే గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ... ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకొంది. టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు స్ట్రెంథెన్ కావడంతో మిగతా పార్టీలన్నీ వీకెన్ అయిపోయాయి. కాంగ్రెస్ పార్టీ మొత్తం 22, టీడీపీ 15, మజ్లిస్ 7, బీజేపీ 5, వైసీపీ 3, బీఎస్పీ 2, సీపీఐ, సీపీఎం పార్టీలు ఒక్కొక్క ఎమ్మెల్యేలను గెలిచాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ విసిరిన ఆకర్షకు పలు పార్టీల నేతలు గులాబీ గూటికి చేరిపోయారు. తెలంగాణ టీడీపీ పూర్తిగా టీఆర్ఎస్ పార్టీలో విలీనమైపోయినట్టుగా ఆ పార్టీ ఫిరాయింపు నేతలు ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ వెబ్ సైట్ సాక్షిగా పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయ్. టీఆర్ఎస్ 82, కాంగ్రెస్ 19, మజ్లిస్ 7, బీజేపీ 5, టీడీపీ 3 గా పేర్కొంది. 63 మంది ఎమ్మెల్యేలు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ బలం ప్రస్తుతం 82కు చేరింది.
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా చేయాలన్న సిద్ధాంతంతో గులాబీ పెద్దలు దూసుకుపోతున్నారు. అటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలందరికీ గులాబీ కండూవా కప్పి తెలంగాణలో కేసీఆర్ సరికొత్త పాలిట్రిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ పూర్తిగా తెలంగాణలో నీర్వీర్యమైపోగా... కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై ఇంటా, బయట ఆందోళనలు సాగిస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా క్లిష్టసమయంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని పూర్తి స్థాయిలో స్ట్రెంథెన్ చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేయలేని చోట తాము నిలబడగలమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగురేయాలంటే అందుకు పార్టీని సన్నద్ధం చేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ హైకమాండ్ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఢీ కొట్టేలా యాక్షన్ ప్లాన్ తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో అడుగుపెట్టబోతున్నారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం అంత వీజీ కాదు. అది అమిత్ షాకు బాగా తెలుసు. పార్టీని గ్రామగ్రామాన నిర్మించాలంటే అందుకు పెద్ద ఎత్తున కార్యాచరణ కావాలి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అప్పుడే ఎన్నికల బరిలో పార్టీ సత్తా చూపించగలదు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ బేస్ గా బీజేపీకి పట్టుంది. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక బీజేపీ బలం రోజు రోజుకు దిగిజారినట్టుగా కన్పిస్తోంది. 2014 ఎన్నికల్లో కేవలం 5 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఆ తర్వాత రోజు రోజుకు బలహీనపడుతూ వచ్చింది. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రమే హైదరాబాద్ లో బీజేపీ గెలుపొందింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో చతికిలపడింది. టీడీపీతో పొత్తు పెట్టుకొని... ఎన్నికల బరిలో నిలిచినా... ఫలితాలు అంతంత మాత్రంగానే వచ్చాయ్.
ఇక ఎన్నికలకు రెండు సంవత్సరాలే ఉన్నాయ్. పార్టీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వాన్ని ఎంతలా తరుముతున్నా పార్టీ కేడర్ మాత్రం అయోమయంలో ఉంది. పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేయాల్సిన నేతలు ముందుకు కదలలేకపోతున్నారు. చేస్తున్న ఆందోళనలు కూడా అంతమాత్రమేనే చెప్పాలి. తెలంగాణలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని మార్చి డాక్టర్ లక్ష్మణ్ కు బాధ్యతలు కట్టబెట్టినప్పటికీ పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి వస్తున్న మద్దతుతో పార్టీని బలోపేతం చేసే ఆలోచన చేయాలంటూ పార్టీ నాయకులకు, కేడర్ కు అమిత్ షా సంకేతాలిస్తున్నారు.
తెలంగాణలో బీజేపీకి పెద్ద ఎత్తున చొచ్చుకుపోయే అవకాశముందన్నది బీజేపీ, సంఘ్ నేతల ఆలోచన. తమకు అవకాశం ఉన్న ప్రాంతంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి పార్టీని 2019 ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకు ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేయాలని... పార్టీ నేతలకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. పక్కా ప్రణాళికతో వెళ్తేనే 2019 ఎన్నికల్లో తెలంగాణలో గెలుపు తధ్యమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయ్. అందుకు సంస్థాగతంగా పార్టీని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నడిపించే మంత్రాంగాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందించేందుకు ఢిల్లీ సందేశాన్ని అమిత్ షా తీసుకొస్తున్నారు.
తెలంగాణలో బీజేపీకి పలు ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ ఆదరణ ఉన్నప్పటికీ... అది పూర్తి స్థాయిలో మాత్రం లేదు. అదే పార్టీకి పెద్ద సమస్యగా ఉంది. పార్టీని ముందుండి నడిపించే నాయకుడు కూడా పార్టీకి ఎంతో అవసరం. చిన్న రాష్ట్రాల్లో అవలీలగా గెలుస్తున్న బీజేపీకి తెలంగాణలో గెలుపు నల్లేరుపై నడకేం కాదు... పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఆ పార్టీకి ఎంతో అవసరం.
తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలంటే ఇప్పుడున్న నాయకులకు తోడు మరికొంత మంది సీనియర్ నేతల అవసరం కూడా కచ్చితంగా ఉంది. అందుకు టీఆర్ఎస్ పార్టీని విభేదించి... బలమైన నేతలుగా ఉన్న పలువురు ఇతర పార్టీ నేతలకు కాషాయం కండువా కప్పాలని అమిత్ షా యోచిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థులున్న నల్గొండ జిల్లాపై షా చూపు పడింది. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను నిశితంగా గమనిస్తున్న పలువురు నేతలు... మొత్తం పరిణామాలను బేరీజు వేసుకుంటున్నారు. కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ఏం చేయాలి... ఎలాంటి కార్యాచరణ కావాలన్న ఆలోచన ఇప్పుడు ఆ నేతల్లో ఉంది. ఇతర పార్టీలను టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలను, ప్రజాబలం జనాదరణ ఉన్న మూడు పార్టీల నేతలు, ఎలాంటి మచ్చ లేని నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ యోచిస్తోంది. అలాంటి వారిని బీజేపీలోకి లాగి... వారిని పూర్తి స్థాయిలో స్ట్రెంథెన్ చేస్తే... తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టిస్తుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. టీఆర్ఎస్ పార్టీని క్రియాశీలంగా వ్యతరేకించే పలువురు ఇతర పార్టీ నేతలు... తమ పార్టీలోకి రావాల్సిందిగా అమిత్ షా ఆహ్వానాలు పంపించారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమైతే మరికొంత మంది ఇంకొంత కాలం వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోందని... అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ కూడా బీజేపీలో చేరబోరని... ఆ పార్టీ స్పష్టం చేస్తోంది. బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీలో ఇప్పుడున్న నేతలతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం అంత తేలికకాదని... అటు రాష్ట్ర నాయకులకు, కేంద్ర నాయకులకు సైతం తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని స్ట్రెంథెన్ చేయగల... నాయకుల కోసం అన్వేషణ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని చెప్పడం ద్వారా తాము పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలోకి దిగబోతున్నామన్న సంకేతా7లను పార్టీ నాయకత్వం ఇచ్చింది.
తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర ఎక్కువగా ఉన్నందున... బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాంటి తెలంగాణలో బీజేపీని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాలి. అందుకు షా బహుముఖ సూత్రం వర్కౌటవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీని గెలిపించే యాక్షన్ ప్లాన్ ను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం... వచ్చే ఎన్నికల్లో గెలిపించేలా ప్రణాళిక రూపొందించడం...
దేశ వ్యాప్తంగా అనుకూల పరిస్థితులున్న సమయంలో తెలంగాణలోనూ తమకు అనుకూల పవనాలు వీస్తాయని బీజేపీ అంచనా వేసింది. పైపెచ్చు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పార్టీ అంచనాలు పెరిగాయ్. అయితే తెలంగాణలో మిశ్రమ ఫలితాలు లభించాయ్. టీఆర్ఎస్ పార్టీకి అనూహ్య ఫలితాలు రానప్పటికీ అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 2014 ఎన్నికల్లో కేవలం 5 అసెంబ్లీ, ఒక లోక్ స్థానంలో మాత్రమే విజయం సాధించింది. 8 లోక్ సభ స్థానాలతోపాటు, 47 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు.
అయితే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం... ఎక్కడ పోయింది అక్కడే వెదుక్కోవాలన్న భావనలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో 30 స్థానాలపై పార్టీ నేతలు దృష్టి సారించారు. పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానాలన్నింటిపైనా ఇప్పటికే పార్టీ నాయకత్వం సమగ్ర సమచారాన్ని తయారు చేసింది. ఏ నియోజకవర్గంలో ఏవిధంగా ఓడిపోయారో సవివరమైన లెక్కలు పార్టీ నాయకత్వం వద్ద ఉన్నాయ్. ఆయా నేతలందరినీ కూర్చోబెట్టి పార్టీ గెలుపుకు కావాల్సిన వ్యూహాన్ని అమిత్ షా తయారు చేస్తారు.
పార్టీ నేతలందరితోనూ వన్ టు వన్ మాట్లాడటంతోపాటు వారికి ఎలాంటి సమస్యలున్నాయి... ఏఏ అవసరాలున్నాయన్న విషయాలను తెలుసుకుంటారు. మొత్తం యాక్షన్ ప్లాన్ అక్కడికక్కడే తయారు చేసి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తారు. పార్టీ నేతలు సైతం తమకు సమర్థవంతమైన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు.
అమిత్ షా పర్యటనతో బీజేపీ ఏం ఆశిస్తోంది. ఇప్పటికే తెలంగాణ సర్కారును ఇరుకునపెట్టామన్న భావనలో ఉన్న బీజేపీ కొత్తగా కేసీఆర్ పై ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధించబోతుంది.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏదైనా అంశంపై దృష్టిపెడితే... దాన్ని సాధించేవరకు వదలిపెట్టడన్న అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అలాగే మణిపూర్ లో కేవలం ఐదు అసెంబ్లీ స్థానాలున్న చోట పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఐదు అసెంబ్లీ స్థానాలున్న పరిస్థితి నుంచి అధికారంలోకి తీసుకొస్తారన్న అభిప్రాయం పార్టీ నేతలకు కలుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో దెబ్బతిన్న ప్రతిష్టను మున్సిపల్ ఎన్నికల ద్వారా తిరిగి నిలబెట్టాడు.
తమ పార్టీ గెలవాలంటే దానికి ఓ ఎజెండా అవసరం. ఎలాంటి ఎజెండా తీసుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామో బీజేపీ పెద్దలకు బాగా తెలుసు. అయితే తెలంగాణలో పార్టీని విజయతీరాలకు చేర్చాలంటే టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలి. 2016 సెప్టెంబర్ లో వరంగల్ లో జరిగిన బీజేపీ సభలోనూ కేసీఆర్ పై అమిత్ షా నిప్పులు చెరిగారు. దేశంలోనే టీఆర్ఎస్ అతిపెద్ద అవినీతి సర్కారని మండిపడ్డారు. తెలంగాణ విమోచనదినం నిర్వహించే ధైర్యం కూడా కేసీఆర్ కు లేదని... అసదుద్దీన్ ఒవైసీ అంటే కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. తాజా పర్యటనలో అమిత్ షా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం కన్పిస్తోంది. కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు రూ. 90 వేల కోట్ల రూపాయల నిధులిస్తే... ఆ డబ్బులను ఎమ్మెల్యేలను కొనుగోలుకు వినియోగిస్తున్నాడని విమర్శలు చేశారు. తెలంగాణ కోసం పోరాడినవారిని కేసీఆర్ మరచారని... ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎజెండాగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే కేసీఆర్ ప్రధాని మోదీకి పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నప్పటికీ... తెలంగాణ విషయంలో బీజేపీకి ప్రత్యేక ఎజెండా ఉన్నట్టు కన్పిస్తోంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఎదగడం కష్టం కాబట్టి ఇక బీజేపీ దృష్టి తెలంగాణ, ఒడిశాలపైనే ఉంది. ఇప్పటికే ఒడిశాపై పట్టు బిగించేందుకు కార్యాచరణ సిద్ధం చేసిన బీజేపీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది.
అమిత్ షా రంగంలోకి దిగితే తెలంగాణలో మూడుముక్కలాట తప్పదా... బలమైన టీఆర్ఎస్ పార్టీతో తలపడేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ తోడైతే తెలంగాణలో ఏం జరుగుతోంది. ఇప్పటి వరకు జనంలో పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ పై చేయి సాధిస్తోందా... మిర్చి మంటల్లో టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ పైచేయి సాధించిందా?
అమిత్ షా పర్యటనపై టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన ఎక్కువవుతోంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ కంటే తామే ఎక్కువ పనిచేయగలమని... తమ ద్వారానే తెలంగాణకు మేలు జరుగుతుందని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి హైదరాబాద్ తోపాటు, తెలంగాణ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి జవజీవాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
తెలంగాణలో జనంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అంశాలపై ఫోకస్ చేయాలని బీజేపీ భావిస్తోంది. నగరంలో బీజేపీ, టీడీపీ కలిసి గత ఎన్నికల్లో పోటీ చేసి మెజార్టీ సీట్లను గెలుచుకోగా... ఈసారి గ్రేటర్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాల్లో విజయం సాధించాలని పార్టీ భావిస్తోంది. అందుకు మజ్లిస్ పార్టీని కార్నర్ చేసే కార్యాచరణను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే యూపీలో ముస్లిం మహిళా ఓటర్లు తలాక్ కు వ్యతిరేకంగా బీజేపీకి ఓటేశారన్న అభిప్రాయం ఉంది. అయితే తెలంగాణలో ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందన్నది అనుమానమే. అయితే పేద ముస్లింలంతా మద్దతిస్తారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెబుతున్నారు. మజ్లిస్ కు వ్యతిరేకంగా పోరాడితే తమకు బలం పేరుతుందని బీజేపీ భావిస్తోంది. అప్పుడే హైదరాబాద్ లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవచ్చన్నది పార్టీ భావనగా ఉంది.
ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మిర్చి మంటలు ఎగిసిపడితే... బీజేపీ సందర్భోచితంగా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేసింది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మిర్చికి అదనంగా రూ. 1500 చెల్లించగా... తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికొదిలేసిందని... ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే రంగంలోకి దిగాలని నిర్ణయించిన బీజేపీ... టీఆర్ఎస్ పార్టీకి గట్టి స్ట్రోక్ ఇచ్చింది. మిర్చికి మద్దతు ధరను ప్రకటించి రైతులకు ఊరటనిచ్చింది. ఇలా టీఆర్ఎస్ పార్టీపై పైచేయి సాధించేందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సైతం బలంగా ఉండటంతో వచ్చే ఎన్నికల్లో మూడుముక్కలాట తప్పేలా లేదు. ఇప్పటికే సర్కారుపై కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తోంది. అయితే అది తగినంత స్థాయిలో లేదన్న అభిప్రాయమూ రాజకీయ వర్గాల్లో ఉంది. మరోవైపు తెలంగాణలో టీడీపీకి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే మిగిలి పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు లేనట్టే. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గో ఎలోన్... గ్రో ఎలోన్... నినాదాన్ని పటిస్తున్నారు. వచ్చే రోజుల్లో మిగిలిన టీడీపీ నేతలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లోకి వలస వెళ్లక తప్పనిసరి పరిస్థితి.
మూడు పార్టీల పోరాటంలో వచ్చే రోజుల్లో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశముందన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఎంత వరకు జరుగుతుందో వేచి చూడాల్సిందే...
అమిత్ షా తెలంగాణ పర్యటన పార్టీకి జవసత్వాలిచ్చే విధంగా రూపొందింది. పార్టీ నేతలు... ప్రజలతో ఏవిధంగా మమేకమవ్వాలి... పార్టీని ఏలా ముందుకు నడిపించాలి... తెలంగాణ ఎదురయ్యే సమస్యలను ఏవిధంగా ఎదుర్కోవాలన్న సంకేతాలను అమిత్ షా నేతలకు వివరించనున్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా... మూడు రోజుల పాటు మూడు గ్రామాల్లో పర్యటిస్తారు. షా పర్యటనంతా నల్గొండ జిల్లా కేంద్రంగా పార్టీ ప్లాన్ చేసింది. ఈనెల 22న హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా నేరుగా నల్గొండ చేరుకుంటారు. మధ్యాహ్నం వరకు నల్గొండలోని ఓ గ్రామంలో పర్యటిస్తారు. వారితో అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. సాయంత్రానికి నల్గొండ చేరుకొని బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ బేరర్లతోపాటు, నియోజకవర్గ ఇంఛార్జిలతో సమావేశమవుతారు. మరుసటి రోజు ఉదయం అంటే 23న నల్గొండ జిల్లాలోని మరో గ్రామంలో అమిత్ షా పర్యటిస్తారు. సాయంత్రం పార్టీ నేతలందరితో సమావేశమై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఇక పర్యటన చివరి రోజైన 23 ఉదయం నల్గొండ జిల్లాలోని మరో గ్రామంలో పర్యటించి... గ్రామస్తులతో వారి సమస్యలపై చర్చించి వారితోనే కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకొని కార్వాన్ నియోజకవర్గంలో బూత్ లెవల్ కార్యకర్తలతో సమావేశమవుతారు. 25న అమిత్ షా విజయవాడ చేరుకుంటారు. తెలంగాణలో పార్టీ నేతల పూర్తి స్థాయిలో పనిచేయాలంటూ గత కొంత కాలంగా అమిత్ షా వెంటపడుతున్నారు. ఇంటింటికీ పార్టీని తీసుకెళ్లాలని... నాయకులను ఆదేశించారు. ఇప్పటి వరకు పార్టీ నేతల కార్యక్రమాలకు సంబంధించి పార్టీ ఇంఛార్జి ఇచ్చిన నివేదికను పరిశీలిస్తారు. తెలంగాణలో 2019లో పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో అవకాశాలున్నాయని... నేతలు పూర్తి స్థాయిలో పనిచేయాలని అమిత్ షా వివరించనున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్ లో సఖ్యత, పొత్తు కారణంగా ఇబ్బందులున్న నేపథ్యంలో తెలంగాణలో తిరుగులేదన్న భావనలో పార్టీ అధ్యక్షుడున్నారు. తెలంగాణలో మనం సొంతగా ఎదిగేందుకు పూర్తి స్థాయిలో ఛాన్స్ ఉంది...ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పార్టీ నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారు. కష్టపడి పనిచేస్తే ఢిల్లీ నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని పార్టీ నేతలకు షా మార్గదర్శనం చేయనున్నారు.
తెలంగాణలో బీజేపీ లక్ష్యం సాధ్యమేనా? బలమైన నాయకుడిగా ఉన్న కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా బీజేపీ నేతల వద్ద ఉందా... దేశంలోనే సుపరిపాలనతో తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నానంటున్న కేసీఆర్ కు చెక్ పెట్టడం సాధ్యమేనా? గులాబీ దండును ఢీ కొట్టడానికి ఉన్న పరిస్థితులేమున్నాయ్... .తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రోజు రోజుకు శక్తిమంతమవుతున్నారు. ప్రతికూలంగా ఉన్న పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చుకుంటూ... ప్రభుత్వంపైనా, తనపైనా వ్యతిరేకత లేకుండా కేసీఆర్ జాగ్రత్తపడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపర్చి ముస్లిం రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించారు. తెలంగాణలో ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ల కల్పించడం ద్వారా వారంతా టీఆర్ఎస్ పార్టీకి దన్నుగా నిలుస్తారని ఆయన భావిస్తున్నారు. అయితే మైనార్టీ రిజర్వేషన్లు కోర్టులో నిలిచిపోయినా... గతంలో మైనార్టీలకు వైఎస్సార్ హయాంలో రిజర్వేషన్లకు కల్పించనప్పుడు వచ్చిన మద్దతు తనకు లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయడంతోపాటు, వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరానికి రూ. 4వేల ఎరువుల కోసం సాయం చేస్తామంటూ ఇచ్చిన హామీ కేసీఆర్ పై రైతుల్లో సానుకూలత లభిస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణలో రోజూ సమస్య ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. రైతుల సమస్యలు టీఆర్ఎస్ సర్కారుకు సంకటంగా మారుతున్నాయ్. మిర్చి రైతుల విషయంలో నెపం కేంద్రంపైనా వేస్తున్నప్పటికీ... జరిగిన పరిణామాలన్నీ టీఆర్ఎస్ సర్కారును వెలెత్తి చూపిస్తున్నాయ్. ఉద్యోగాల కల్పన విషయంలోనూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ కు ఉద్యమ సమయంలో పూర్తి మద్దతిచ్చిన విద్యార్థులు ఇప్పుడు కేసీఆర్ పై నిప్పులు చెరుగుతున్నారు. ధర్నా చౌక్ తరలింపు, నయీం కేసు ఘటనలో కూడా సర్కారు నామమాత్రపు చర్యలతో సరిపుచ్చిందన్న అభిప్రాయమూ ఉంది.
తెలంగాణ తెచ్చింది.... ఇచ్చింది మేమేనని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ పూర్వవైభం కోసం తహతహలాడుతోంది. బలమైన నాయకుడు పార్టీని నడిపిస్తే... కేసీఆర్ ను ఎదుర్కోవడం సాధ్యమేనన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది. అయితే ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు రావాలంటే అది ఢిల్లీ నుంచి వచ్చే మంత్రాంగంతోనే సాధ్యమవుతుందన్న అభిప్రాయం స్థానిక పార్టీ నేతల్లో ఉంది.
ఓవైపు బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ... మరోవైపు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలుగా తెలంగాణలో ఉండగా బీజేపీ నిలబడాలంటే పెద్ద ప్రణాళికే అవసరం. టీఆర్ఎస్ పార్టీని ఇరుకునపెట్టేందుకు అమిత్ షా తీవ్ర కసరత్తే చేస్తున్నారు. పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నేతలు రావాలన్నా అందుకు తగిన వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిపైనే ఉంది. ప్రభుత్వాన్ని ఢీకొట్టి ఎదురు తిరిగే నాయకుడొస్తేనే తెలంగాణలో బీజేపీ ప్రభ సాధ్యమవుతుంది.
అమిత్ షా ఆలోచన ఒక్కటే... అదే తెలంగాణలో బీజేపీ పాగా వేయాలి. ఎలాగైనా కేసీఆర్ ను ఢీకొట్టాలి. 2019 ఎన్నికల్లో విజయభేరి మోగించాలి. అందుకు బలమైన నేపథ్యమూ, నాయకుడూ పార్టీకి కావాలి. అయితే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో విజయం సాధించడం సాధ్యమయ్యే పని కాదు... తెలంగాణ గెలుపుకు సరికొత్త ఫార్మూలా వర్కౌట్ చేయాలి. తెలంగాణపై కేసీఆర్ పూర్తి పట్టు సాధిస్తున్న తరుణంలో కాంగ్రెస్, బీజేపీలు అవలంబించే కార్యాచరణ ఆధారంగానే తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ ఆరంభమవుతుంది.

No comments:
Post a Comment