అధికారం తలకెక్కితే శంకర్ నాయక్ లు శంకర్ దాదాలవుతారు... పొగురు ఇంటిపేరైతే... వారు బెజవాడ రౌడీలవుతారు... రూల్స్ మాట్లాడితే బదిలీ వేటుతో శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. రాజకీయం మత్తులో నేతలు విపరీత చర్యలకు తెగబడుతున్నారు. మరోవైపు నేతలు అధికారం తలకెక్కి వ్యవస్థలపై దాడులకు తెగబడుతుంటే... మేమేం తక్కువంటూ బ్యూరోక్రాట్లు శివాలెత్తిపోతున్నారు.
బ్యూరోక్రాట్ల అధికార దాహం సామాన్యుడ్ని తొక్కేస్తోంది. అది మహబూబాబాద్ ఘటన కావొచ్చు... బెజవాడలో అధికార పార్టీల కండకావరం కావొచ్చు... ఎక్కడ చూసినా ఇదే తంతు. ఇటీవల అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ పోలీస్ అధికారిపై బదిలీ వేటుపడుతుంది. చట్టాలను చేసేవారు వాటిని చుట్టాలుగా మార్చుకుంటున్నారు. వాటిని అమలు చేయాల్సిన వారు... వారికి అనుకూలంగా మలచుకుంటున్నారు. ఇద్దరూ ప్రజా సేవకులే... సేవ పేరుతో జనంతో గేమ్స్ ఆడుకుంటున్నారు. పవర్ కోసం పంచాయితీలకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తంతు.
అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్... జిల్లా కలెక్టర్ ను చేయి బట్టుకొని లాక్కెళ్లాలని చూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే తీరుతో కలెక్టర్ ఒక్కసారిగా షాక్ కు గర్యాయరు. ఎమ్మెల్యే వ్యవహారతీరు తెలిసినవారు పెద్దగా ఈ విషయంపై షాక్ కు గురవకపోయినా... రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎమ్మెల్యే తీరుపై తీవ్ర చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే అధికారం తలకెక్కిన ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... సాగిస్తున్న ఆరాచకానికి మహబూబాబాద్ వేదికయ్యింది. ఆయన మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అధికార పార్టీ నేత. తొలిసారి ఎమ్మెల్యే... అయితే అధికారం చేతిలో ఉందకదా... ఏం చేసినా... ఎవరేం చేస్తారన్న ధీమాతో... ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... దుందుడుకు వైఖరితో దూసుకుపోతున్నాడు... ఒకసారి కాదు... రెండు సార్లు కాదు... ఇప్పటికే లెక్కలేననన్ని సార్లు తన ప్రవర్తనతో కలెక్టర్ ను ఇతర అధికారులను వేధించాడు. గట్టిగా మాట్లాడితే... తనకు కలెక్టర్ చెల్లెలితో సమానమంటాడు. ఇద్దరిదీ ఒకే క్యాస్టు అంటాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు. విపరీత చేష్టలతో కింది స్థాయి అధికారుల జీవితాలతో ఆటలాడుకుంటాడు. తాజాగా... సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పైనే రుబాబు ప్రదర్శించి... తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రీతి మీనాను అనేక రకాలుగా పలుసార్లు అవమానించాడు శంకర్ నాయక్. ఎన్నో ఆరోపణలతో ఇప్పటికే నియోజకవర్గంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్...భూ సెటిల్మెంట్లు, దందాలతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాడన్న అభిప్రాయం జిల్లాలో నెలకొంది. తాజాగా... మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాను తీవ్రం అవమానించాడు. కలెక్టర్ చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించి... అవమానానికి గురిచేశాడు. ఇప్పటికే ఎమ్మెల్యే ప్రవర్తనతో విసుగు చెందిన కలెక్టర్... ఎమ్మెల్యే ప్రవర్తనపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనను చేయితో తాకాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటన ప్రభుత్వ వర్గాల్లో పెను ప్రకంనపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే తీరుపై చాన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న కలెక్టర్ ప్రీతి... హరితహారంలో ఘటన తర్వాత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై ఇప్పటికే పలు ఫిర్యాదు నేపథ్యంలో... ఐఏఎస్ అధికారుల సంఘం సీరియస్ గా తీసుకొంది. అధికారుల సంఘం కీలక నేతలు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి... ఎమ్మెల్యే వ్యవహారశైలిపై పూర్తి సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే చరిత్ర మొత్తాన్ని తూర్పారబట్టారు. తక్షణం చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమై ఈ ఘటనను ఖండించింది. కలెక్టర్‌కే ఇలా జరిగిందంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితేమిటని సచివాలయంలో పలువురు అధికారులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం మూడోవిడత కార్యక్రమాన్ని మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఆవరణలో బుధవారం మంత్రి చందూలాల్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్న సమయంలో ఈ లొల్లి జరిగింది. మొక్కలు నాటడం పూర్తయ్యాక స్టేజీ వద్దకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా చేయి పట్టుకొని ముందుకు పదండంటూ లాక్కెల్లినంత పనిచేశారు. ఎమ్మెల్యే బహిరంగంగా అందరి ముందు చేయి పట్టుకోవడంతో... కలెక్టర్ హతాశయురాలయ్యారు. ఎమ్మెల్యే తీరుపై మీనా మండిపడ్డారు. ‘ఐ యామ్ కలెక్టర్.. బీ ఇన్ యువర్ లిమిట్’అంటూ శంకర్ ను హెచ్చరించారు. అయితే సభా వేదిక వద్ద సైలంట్ గా ఉన్న కలెక్టర్... సమావేశం పూర్తయినవెంటనే... జేసీ దామోదర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ ఆయూబ్ అలీని పిలిచి ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును వివరించి... ఎమ్మెల్యేను ఉపేక్షించరాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుకు సంబంధించి... పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. మీడియాలో తీసిన ఫొటోలు, వీడియో క్లిప్పింగుల కోసం ఆరా తీశారు. ఎమ్మెల్యే తన చేయిపట్టుకున్న ఫొటోలను సంపాదించి.. ఐఏఎస్‌ల సంఘానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా పిలిచి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మహబూబాబాద్ లో ఎమ్మెల్యే వ్యవహారశైలిపై అధికారలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో... ఎమ్మెల్యే ప్రవర్తన గురించిన వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ను కలిసి క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులతో ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడతారని... ఫిర్యాదులు సీఎం చెవిన పడ్డాయ్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ రంగంలోకి దిగి కలెక్టరుతో చర్చించారు. గంటన్నరపాటు సంప్రదింపులు జరిపి... కలెక్టర్ ను శాంతింపజేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగబోవని... తమది పూచీ అని చెప్పినట్టు సమాచారం. మంత్రి, ఎంపీ చర్చలు జరుపుతున్నంత సేపు... ఎమ్మెల్యే... శంకర్‌నాయక్ కలెక్టరు ఇంటి బయటే ఉన్నారు. లోపలి నుంచి కబురు రావడంతో ఇంట్లోకి వెళ్లిన ఆయన ఆమెకు క్షమాపణ చెప్పి పది నిమిషాల్లో తిరిగి బయటకొచ్చారు. ఆమె తనకు సోదరితో సమానమని, అనుకోకుండా చేయి తగిలి ఉండొచ్చంటూ విలేకరుల వద్ద వివరణ ఇచ్చారు. కలెక్టరు ఫిర్యాదు మేరకు శాసనసభ్యుడు శంకర్‌నాయక్‌పై పోలీసులు మహబూబాబాద్ ఠాణాలో కేసు నమోదు చేశారు. అరెస్టు చేసినంత వరకు బాగానే ఉన్నా... ఎమ్మెల్యే బెయిల్ పై బయటకు రావడం... ఆమె చెల్లిలితో సమానమంటూ చెప్పడం... పైపెచ్చు... ఇద్దరం కూడా ఎస్టీలే అంటూ చెప్పడం ద్వారా మొత్తం వ్యవహారాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్కటి మాత్రం స్పష్టం ఎమ్మెల్యే తీరు, కలెక్టర్ విషయంలో అలా ఉంటే... మిగతా వారి విషయంలో ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. సీఎం కేసీఆర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఎమ్మెల్యేతో క్షమాపణలు చెప్పించినా... ఇలాంటి వారికి సంఘ బహిష్కారం జరిగితే తప్పించే మార్పు రాదు.
ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రేదశ్ లోనూ అధికార టీడీపీ నేతలు దాడి చేశారు. రవాణా శాఖ కమిషనర్ గా బాధ్యతలు వ్యవహరిస్తున్న ఐజీ బాలసుబ్రమణ్యంను గల్లా పట్టుకున్నంత పనిచేశారు. వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తూ... మేమంటే లెక్కలేదా అంటూ అవమానానికి గురిచేశారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, మరో ఎమ్మెల్సీ కలసి రవాణా శాఖ కార్యాలయంపై దాడికి తెగబడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమయ్యింది. ఏపీలో అధికార పార్టీ నేతలు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంపై దండయాత్ర చేశారు. ముగ్గురు త్రిమూర్తుల మాదిరిగా కమిషనర్ ను నానాదుర్భాషలాడి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గలీజు పని చేస్తా కూడా... తమ మాట కమిషనర్ వినడం లేదంటూ విమర్శలు గుప్పించారు. గడ్డి తింటున్నావ్... గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావంటూ ఎంపీ కేశినేని నాని కమిషనర్ పై విరుచుకుపడితే... ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా ...? ఏం బతుకు నీది అంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను దుర్భాషలాడాడు. మేం ప్రజాప్రతినిధులం... మాకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ... ముగ్గురు ప్రజాప్రతినిధులు చెలరేగిపోయారు.
మార్చి 25న జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్‌బోర్డు చైర్మన్ నాగుల్ మీరా, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ , సుమారు 200 మంది కార్యకర్తలతో కమిషనర్‌ను విజయవాడ నడిరోడ్డుపై అరాజకీయం చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం ను రెండుగంటలకుపైగా... నిలబెట్టి మరీ నానా బూతులు తిట్టారు. కమిషనరే క్షమాపణ చెప్పాలంటూ ఘెరావ్ చేసినంత పనిచేశారు. అక్కడే ఉన్న పోలీస్, రవాణా శాఖ అధికారులు ఎంతగా చెప్పినా... వినకుండా నోటికి ఇష్టమొచ్చిన భాషతో దారుణంగా అవమానించారు. ట్రావెల్స్ వ్యవహారాల్లో రవాణా కమిషనర్ తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ ఎంపీ కేశినేని నాని చాన్నాళ్లుగా విమర్శిస్తూ వచ్చారు. అయితే ఎంపీ బెదిరింపులకు లొంగని కమిషనర్ రూల్ ప్రకారం వ్యవహరించారు. అయితే తన ప్రత్యర్థి ట్రావెల్ విషయంలో జరిగిన ఘటనను తమకు అనూలంగా మలచుకోవాలన్న దురాలోచనతో... కమిషనర్ కార్యాలయంపై నాని అండ్ టీం దాడికి దిగారు. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుపై నివేదికను తాము చెప్పినట్లు రూపొందించాలని వారు కోరినట్టుగా సమాచారం. అయితే... నివేదిక ఎలా తయారు చేయాలో అలా చేస్తాం. ఒత్తిడి తేవడం సరికాదంటూ... కమిషనర్ తేల్చిచెప్పడంతో మొత్తం గొడవకు కారణమయ్యింది. ఇక రంగంలోకి నేరుగా కేశినేని నాని దిగారు. తనక్కొడే వస్తే ఏం బాగుంటుంది మొత్తం గ్యాంగ్ అంతటినీ తీసుకొస్తే ప్రభావం ఎక్కువ ఉంటుందన్న అభిప్రాయంతో... నగరంలోని నేతలందరినీ తీసుకొచ్చాడు. వాహనం దిగిన కమిషనర్‌ను టీడీపీ కార్యకర్తలు అంతా చుట్టు ముట్టి కదలనీయకుండా చేశారు. నేను వస్తు న్నానని తెలిసి వెళ్లి పోతున్నావా...ఏం టీడీపీ ఎంపీ అంటే ఆ మాత్రం గౌరవం, భయం లేవా...? అంతా నీ ఇష్టమేనా?’ అంటూ విరుచుకుపడ్డాడు. మొత్తం వ్యవహారంపై కమిషనర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీఎం సీరియస్సయ్యారంటూ టీడీపీ నేతలు కామెంట్స్ తో మొత్తం ఘటనంతా వెనక్కి జరిగిపోయింది. అయితే ప్రభుత్వ పెద్దల హామీలతో ఆయన సైలెంటైపోయారు. ముఖ్యమంత్రి జోక్యంతో... నేతలు కమిషనర్ కు క్షమాపణలు చెప్పడంతో ఇష్యూను క్లోజ్ చేసేశారు. తన సుధీర్ఘకాలం కెరీర్ లో ఇలాంటి తరహా ఘటన ఎన్నడూ చూడలేదన్న అభిప్రాయాన్ని బాలసుబ్రమణ్యం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై హైకోర్టు స్పందించే పరిస్థితి వచ్చింది. రాజకీయనేతలు ఇష్టారాజ్యం వ్యవహరించడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయవాడలో జరిగిన యాగీని మరచిపోకముందే... అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్టులో వీరంగం సృష్టించాడు. ఆలస్యంగా వచ్చిందే కాక... బోర్డింగ్ పాస్ ఇవ్వాలంటూ సిబ్బందిపై రుబాబు ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా ప్రింటర్ ను నెలకేసి కొట్టినంత పని చేశాడు. తాను ఎంపీనని... తనకు స్పెషల్ పవర్స్ ఉన్నాయంటూ శివాలెత్తాడు. విశాఖ విమానాశ్రయం తన సొంత ఇళ్లున్నట్టుగా ఇష్టానుసారం వ్యవహరించాడు. బోర్డింగ్ పాస్ ఎందుకివ్వరంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిని దుర్భాషలాడాడు. తనకు పాస్ ఎందుకివ్వరంటూ... సిబ్బందిని గదిమాడు. ప్రింటర్‌ను పక్కకు లాగి అవతల పడేయాలనుకున్నాడు... విమానం బయలుదేరే సమయానికి 40 నిమిషాల ముందు మాత్రమే ఇస్తామని.... బోర్డింగ్ కౌంటర్ మూసేశామంటూ అధికారులు చెప్పేసరికి... రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు. తాను ఎంపీనని బోర్డింగ్ పాస్ జారీ చేయాల్సిందేనంటూ సిబ్బందిపై హూంకరించాడు. ఒకరకంగా ఆదేశించాడు. అయితే జేసీ ఆదేశాలను మాత్రం సిబ్బంది పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని... ఎంపీకో న్యాయం... మరొకరికో న్యాయం ఉండదని... ఎవరికైనా నిబంధనలు... నిబంధనలేనంటూ తేల్చి చెప్పారు. సిబ్బంది నిబంధనల గురించి మాట్లాడుతుంటే... జేసీ దివాకర్ రెడ్డి మాత్రం సహించలేకపోయాడు. ఏదైనా ఉంటే మేనేజర్ ను సంప్రదించాలంటూ ఉద్యోగి ఎంపీ దివాకర్ రెడ్డికి స్పష్టం చేశాడు. అయితే సిబ్బందితో ఎంపీ వాగ్వాదానికి దిగాడు. బెదింపులకు పాల్పడ్డాడు. తనపై నిషేదం విధించడం అక్రమమంటూ కోర్టును సైతం ఆశ్రయించాడు.
నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వహించిన ఓ మహిళా పోలీసు అధికారిణికి సరిగ్గా వారం రోజులు తిరక్కుండానే బదిలీ ఉత్తర్వులు చేతికి వచ్చాయి. అదీ కూడా స్వచ్ఛమైన, నీతివంతమైన, పారదర్శక పాలన అందిస్తానంటూ ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఏలుబడిలో. అధికార పార్టీ నేతలను కట్టడి చేసిన యూపీ పోలీస్ అధికారిపై బదిలీ వేటు పడింది. నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి.... అధికారంలో ఉన్న పార్టీ నేతలతో ఢీ కొనడం.... నేతల అహం దెబ్బతింది. నిజాయితీ గల అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు. యూపీ మహిళా పోలీసు అధికారి శ్రేష్ట ఠాగూర్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఉత్తర ప్రదేశ్ కు బులంద్ షహర్ కు చెందిన మహిళా పోలీస్ అధికారికి స్ట్రిక్ట్ గా ఉంటారన్న అభిప్రాయం ఉంది. రూల్స్ బేఖాతరు చేస్తే ఎవరినైనా సహించరని... చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారన్న పేరు ఉంది. అయితే... అధికారంలో ఉన్న పార్టీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకొన్న ఆమెపై బదిలీ వేటు పడింది. యోగి సర్కార్ శ్రేష్ట ఠాగూర్ బహ్ రైచ్ కు బదిలీ చేసి అధికార బలాన్ని చాటుకొంది. యూపీలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ధీమాతో నిబంధనలను ఉల్లింఘించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత ప్రమోద్ కుమార్ కు... ఠాగూర్ ఘాటుగా సమాధానం చెప్పడం సంచలనం కలిగించింది. బీజేపీ నేతల ఆగడాలపై శ్రేష్ట ఠాకూర్ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఠాకూర్ పై ప్రశంసలు జల్లు కురిసింది.
సరైన పత్రాలు లేకుండా వాహనాన్ని నడుపుతున్న బీజేపీ నాయకుడు ప్రమోద్ ను అడ్డుకుని ఠాగూర్ జరిమానా విధించారు. తాను బీజేపీ నేతనంటూ సదరు వ్యక్తి రుబాబు ప్రదర్శించడంతో... ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది. పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని... సీఎంతో లెటర్ రాయించుకుని వస్తే తనిఖీలు చేయనని శ్రేష్ట ఠాకూర్... బీజేపీ నేతకు తెగేసి చెప్పడంతో మొత్తం వ్యవహారం చినికిచినికి గాలివానలో మారింది. రాత్రింబవళ్లు కుటుంబాలను వదిలి ఉద్యోగాలు చేస్తూ ఎందుకు ఇబ్బందిపెడతారంటూ ఆమె రాజకీయ నేతలపై మండిపడ్డారు. స్పాట్
మొత్తం ఘటనతో కంగుతిన్న స్థానిక బీజేపీ నేతలు... వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లారు. 11 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ నేరుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొళ్లి... పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోకుంటే... తాము జిల్లాలో చులకనైపోతామని వాపోయారు. ఇక స్థానిక నేతల డిమాండ్ కు తలొగ్గిన ప్రభుత్వం... పోలీస్ అధికారికి బదిలీ వేటుతో బహుమానమిచ్చింది. అధికార పార్టీ నేతలతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి కూడా... బాధ్యతలను నిజాయితీగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్ మహిళా పోలీసు అధికారి శ్రేష్ట ఠాగూర్‌పై బదిలీ వేటు పడింది.
బీజేపీ నేత ప్రమోద్ కుమార్‌కు శ్రేష్ట ఠాగూర్ ఇటీవల ముచ్చెమటలు పట్టించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాన్ని నడుపుతున్న ఆయనను అడ్డుకుని జరిమానా విధించారు. అయితే తాను బీజేపీ నేతనని, తన భార్య బులంద్‌షహర్ జిల్లా పంచాయితీ సభ్యురాలని ప్రమోద్ దబాయించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రమోద్ ఫోన్ చేయడంతో అక్కడకు చేరుకున్న బీజేపీ క్యాడర్ శ్రేష్ట ఠూగూర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని లెటర్ రాయించుకుని వస్తే తనిఖీలు వదిలేస్తామని శ్రేష్ట ఠాకూర్ తెగేసి చెప్పడంతో మొత్తం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు యూపీలో యోగి సర్కారు అధికారంలోకి వచ్చాక యాదవ్ కులానికి చెందిన అధికారులను టార్గెట్ గా చేసుకుంటున్నారంటూ... ట్వీట్ చేసిన అధికారి హిమాన్షు కుమార్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రత్యేకించి కొన్ని కులాల వారినే శిక్షించాలని అధికారులపై డీజీపీ కార్యాలయం ఎందుకు ఒత్తిడి చేస్తున్నదని హిమాన్షు ప్రశ్నించారు. ఆయన ట్వీట్ దెబ్బతో... డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్న ఆయనను క్రమశిక్షణా చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
అదే తెలంగాణా, అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఉత్తర ప్రదేశ్ అయినా... అధికార పార్టీ నేతలదే మాట కావాలన్నదే ఉద్దేశం, లక్ష్యం కన్పిస్తోంది. తమ మాట ఇంటే ఒకలా... మాట వినకుంటే మరోలా ప్రభుత్వం అధికారులపై జులం ప్రదర్శిస్తోంది. అయితే కొన్నిసార్లు అధికారులు సరిపెట్టుకుంటూ పోతే కొన్నిసార్లు రివర్స్ అవుతున్నారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు అవసరార్థం చర్యలు తీసుకుంటున్నట్టు కన్పిస్తున్నా... చాలా సార్లు రాజకీయానిదే పైచేయిగా నిలుస్తోంది.
ప్రభుత్వానికి అధికార యంత్రాంగం కళ్లు, చెవులు. ఆయా వ్యవస్థల్లోని లోపాలను సరిదిద్దేందుకు యంత్రాంగాలు... ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాయ్. ప్రజలకు మేలు చేసేందుకు యంత్రాంగాలు... కొన్ని సార్లు ప్రభుత్వ పెద్దల మాటలను సైతం వినీ విననట్టుగా... చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుంటాయ్. అయితే... రాష్ట్రంలోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ల వ్యవహారశైలి... ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. కీలక విషయాల్లో ముగ్గురు ఐపీఎస్ లు వ్యవహరించిన తీరు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేస్తోంది. ఇప్పటి వరకు అధికారులను వేధించిన రాజకీయ నేతలు స్టోరీలు వింటే... బ్యూరోక్రసీతో రాజకీయనేతలను తలదన్నేలా వ్యవహరిస్తున్న ముగ్గురు ఐపీఎస్ ల స్టోరీ ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కెరీర్ లో ఎంతో పేరు గడించారు. ఐపీఎస్ పదవికే వన్నెతెచ్చారు. నిక్కచ్చిగా వ్యవహరిస్తూ... భేషజాలకు పోకుండా పాలనలో భాగంగా ఉన్నారన్న అభిప్రాయం వారిపై ప్రజల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ, అధికార పార్టీ వర్గాల్లోనూ విన్పిస్తోంది. అయితే ఇప్పుడా ముగ్గురి పేర్లు చెబితే చాలు... అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు హడిలిపోతారు. అంటే వారిని చూసి భయపడిపోతున్నారని కాదు... వారు తీసుకునే నిర్ణయాలతో ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరోస్తుందనన్న బెంగ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆ ముగ్గురుని చూస్తుంటే టీఆర్ఎస్ నేతలకు ఎక్కడ లేని చిరాకు కలుగుతుంది. ఆ ముగ్గురు ఐపీఎస్ ల వ్యవహాశైలితో ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు కూడా ప్రజల్లోకి చెడుగా వెళ్తున్నాయన్న వర్రీ ప్రభుత్వ వర్గాల్లో కన్పిస్తోంది. ముగ్గురు ఐపీఎస్ ల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు మంత్రులు కాచుక్కొని కూర్చున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వారిలో కొందరికి కీలక శాఖలను అప్పగించారు. పోలీసింగ్ లో మంచి పేరుతెచ్చుకున్న ఐపీఎస్ లు పాలనలో అంతకంటే ఎక్కువగా ఇమేజ్ తెచ్చుకుంటారని సీఎం భావించారు. కానీ వారు ప్రభుత్వ ఇమేజ్ ను మంట గలుపుతున్నారనే అభిప్రాయాలు అధికార పార్టీలో విన్నిస్తున్నాయి. హైదరాబాద్ డ్రగ్ మాఫియా విషయంలో అకున్ సబర్వాల్ తీరుని స్వయంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బాహాటంగా తప్పుబట్టారు. విచారణ పేరుతో ప్రభుత్వానికి సబర్వాల్ చెడ్డపేరు తెస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసారు. సొంత ఇమేజీని పెంచుకునేందుకు సబర్వాల్ విద్యాశాఖపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. డీజీపీ సైతం సబర్వాల్ విషయంలో కడియం అభిప్రాయాలను సమర్ధించినట్టు సమాచరం.
కొన్ని నెలల క్రితం సివిల్ సప్లై శాఖ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న సీవీ అనంద్ విషయంలో ఆ శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు మరికొందరు మంత్రులు ఆగ్రహంగా ఉన్నారు. ఆనంద్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో మంత్రి ఈటెలతో కలిసి పనిచేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత... మంత్రిని కాదని... తనే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారట. లెటెస్ట్ గా ... సీవీ ఆనంద్... ప్రగతి భవన్ కు మాత్రమే సమాచారం ఇవ్వడానికి పరిమితమయ్యారన్న ప్రచారం ఉంది. కీలక నిర్ణయాల విషయంలోనూ... సీవీ ఆనంద్ కనీసం మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాలు వ్యక్తమవుతోంది. ఆకస్మిక తనిఖీల పేరుతో ఆనంద్ జిల్లాల పర్యటనలతో హల్ చల్ చేయడంపై కొందరు మంత్రులు ఆగ్రహంగా ఉన్నారు. తమ సొంత జిల్లాలో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా రాజకీయ నేత మాదిరి పర్యటించడం ఏంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక మరో ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్.. కొన్ని రోజుల క్రితం వరకు ఆ పేరును ముఖ్యమంత్రి చాలా సందంర్భాల్లో స్వయంగా పొగిడేవారు. కానీ ఇప్పుడా పేరునే తన వద్ద ప్రస్తావించవద్దంటూ సీఎం అధికారులకు సూచించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్ కు జాతీయ గుర్తింపు తెచ్చారని ఐపీఎస్ ప్రవీణ్ కు... సీఎం వద్ద ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ గురుకులాల టీచర్ల నియామకం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం వివాదస్పదం కావడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది. దీంతో సీఎం స్వయంగా రంగంలోకి దిగి వివాదానికి తెర దించారు. గురుకులాల టీచర్ల నియామకంలో అర్హతలు ఎలా ఉండాలో నిర్ణయించే బాధ్యత కమిషనర్ హోదాలో ఉన్న ప్రవీణ్ కు సిఎం అప్పగించారు. కానీ ప్రవీణ్ మాత్రం టీచర్ పోస్టుల కోసం పరీక్ష రాసే అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టడంతో... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. తీవ్ర విమర్శలు రావడంతో చివరికి సిఎం జోక్యం చేసుకుని అర్హతలను తగ్గించారు. పాలనలో ఐఏఎస్ ల మాదిరిగా... ఐపీఎస్ లు వ్యవహరించడం జరగదన్న అభిప్రాయాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్ణయాలు వక్రీకరించడం సహజమేనన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో ఎలా వ్యవహరించాలో వారికి పెద్దగా తెలియదని... కీలక శాఖాలను పోలీసు అధికారులకు అప్పగించడం వల్ల ఆ శాఖాలపై వారు పోలీసింగ్ చేయడంతో ఫలితాలు వికటించడం సహజమేనని కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా అటు రాజకీయ నాయకులు.. ఐదేళ్లపాటు ప్రజలు తమను పాలించే లైసెన్స్ ఇచ్చారని చెలరేగిపోతున్నారు. తమకు ఇష్టం వస్తే ఒకలా... ఇష్టం లేకుంటే మరోలా వ్యవహరిస్తూ... ప్రభుత్వ యంత్రాంగాలను ప్రశ్నిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులతో కలిసి మెలసి పాలన సాగిస్తుంటే మరికొందరు వివాదాలకు కేంద్ర బిందువులవుతున్నారు. పాలనకు వన్నె తేవాల్సిన నేతలు... ఆ ముసుగులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే... కొందరు నేతలు... ప్రజలతో ఎన్నుకున్న నాయకుల విషయంలో చులకనభావనతో ఉంటున్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలైన రెండు వర్గాల ఘర్షణ ప్రమాదంలో పడుతోంది.

No comments:
Post a Comment