Sunday, 30 July 2017

పాకిస్థాన్‌కు శ్రీలంక గతే!




దిల్లీ: వడ్డీ వ్యాపారి... మొదట కొంచం డబ్బు ఇస్తాడు... అనంతరం అవసరానికి మళ్లీ ఇస్తాడు... చివరకు మనం కట్టకపోతే వడ్డీతో పాటు అసలు మొత్తానికి దొంగ లెక్కలు వేసి మన దగ్గర ఉన్న స్థిరాస్తులను తన పేరుపై రాయించుకుంటాడు. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను చూస్తుంటాం. అయితే ప్రపంచంలోని బీదదేశాలకు అభివృద్ధి పేరుతో రుణాలను ఇచ్చి కొంతకాలానికి అక్కడ ఉన్న విలువైన ప్రాజెక్టులను తక్కువ మొత్తానికి లీజుకు తీసుకునే దేశాలు వస్తున్నాయి. వీటితో చైనా అగ్రభాగంలో ఉండటం గమనార్హం.
అభివృద్ధి పేరుతో...
కొన్నేళ్ల కిందట శ్రీలంకకు చైనా భారీ ఆర్థికసాయం అందించేందుకు ముందుకువచ్చింది. మౌలిక నిర్మాణాలకు రుణాలను ఇస్తామన్న చైనా ప్రకటనలకు శ్రీలంక అప్పటి అధ్యక్షుడు మహీందా రాజపక్స అంగీకరించారు. ఆయన సొంత నియోజకవర్గం హంబన్‌టొట సముద్రతీరంలో ఉండటంతో అక్కడ భారీ నౌకాశ్రయం నిర్మిస్తామని చైనీయులు ప్రకటించారు. తీరా నిర్మాణం పూర్తయింది అయితే అనుకున్నంతగా ఆదాయం రాకపోవడంతో 99 సంవత్సరాల పాటు హంబన్‌టొట నౌకాశ్రయంతో పాటు సమీపంలోని వేలాది ఎకరాలను భూములను చైనీయులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదరడం గమనార్హం. చైనా కుయుక్తులను గమనించిన స్థానికులు వేలాదిమంది ఆందోళన చేసినా ఫలితం లేకుండాపోయింది.
పాక్‌లోనూ...
వన్‌బెల్ట్‌ వన్‌ రోడ్‌ పేరిట పాక్‌లోని గ్వదర్‌ నుంచి చైనాలోని కష్గర్‌ వరకు చైనా-పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ అనే రహదారిని చైనా నిర్మించింది. ఈ ప్రాజెక్టుతో పాక్‌ రూపురేఖలు మారిపోతాయని నమ్మించి ఏకంగా 65 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల రుణాన్ని అందించింది. కానీ ఇందుకు భిన్నంగా రహదారి ద్వారా చైనా ఆధిపత్యం చలాయించడం గమనార్హం. ప్రాజెక్టు పరిరక్షణ పేరుతో ఏకంగా వేలమంది సైనికులను ఆ మార్గంలో మోహరించడం గమనార్హం. చైనా నుంచి కోట్లాది డాలర్ల విలువైన సరుకులు రహదారి ద్వారా పాక్‌ మార్కెట్‌లోకి వచ్చిపడుతున్నాయి. దీంతో స్థానిక తయారీదారులకు, వ్యాపారులకు దిక్కుతోచడం లేదు. ఇక స్వల్ప వడ్డీరేట్లంటూ వూదరగొడుతున్న చైనా వడ్డీ రేటు ఎక్కువగా ఉంటోందని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ప్రపంచబ్యాంకు రుణాల వడ్డీ కంటే చైనా వడ్డీరేట్లు ఎక్కువగా ఉండటం విశేషం. చైనా నుంచి రుణాలు పొందిన దేశాలు క్రమేణా రుణవూబిలో చిక్కుకుంటున్నాయి. పాక్‌కు కూడా కొన్నిరోజులకు శ్రీలంక గతే పడుతుందని పాక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నాపాక్‌ సర్కారు పట్టించుకోకపోవడం లేదు.

pakistan

మత్తులో జోగుతున్నదెవరు?

గంజాయి దమ్ము కొడితేనో; నల్లమందు, హెరాయిన్‌, కొకైన్‌ లాంటివి సేవిస్తేనో మాత్రమే ఎవరైనా మత్తులో కూరుకుపోతారని అమాయకంగా తలపోసేవారికి కనువిప్పు కలిగించే చేదునిజాలివి. ఒకటి కాదు, రెండు కాదు... కొత్తరకం మత్తుకారకాల విస్తృతి, వైవిధ్యం గమనిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ జాబితాలో ఎన్నదగ్గ ఉదాహరణ ‘ఫెన్సిడిల్‌’. కావడానికి అది దగ్గుమందేగాని, మత్తు కలిగించడంలో చురుకైంది. వైద్యుల సిఫార్సు లేనిదే ఔషధ దుకాణాల నిర్వాహకులు ఫెన్సిడిల్‌ను విక్రయించకూడదు. ఆ మందు తయారీకి అవసరమైన ప్రధాన మూలకం కోడీన్‌ ఫాస్ఫేట్‌ మాదకద్రవ్యాల కేంద్ర విభాగం (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌) అనుమతి లేనిదే ఎవరికీ లభించరాదని నిబంధనలు సెలవిస్తున్నాయి. ఆ జాగ్రత్తల్ని గాలికొదిలేసి ఉత్పత్తి, విక్రయాలు విచ్చలవిడిగా రెచ్చిపోవడం నడుస్తున్న చరిత్ర.
ఆమధ్య భారీయెత్తున ఫెన్సిడిల్‌ సీసాల్ని తరలిస్తున్న లారీనొకదాన్ని బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. దగ్గుమందు భూరి నిల్వల తరలింపులో తెలుగు రాష్ట్రాల పేర్లు బయటపడ్డాయి. గుంటూరు, భీమవరం, నర్సరావుపేట, విజయవాడ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, మెదక్‌, కరీంనగర్‌లకు వాటిని సరఫరా చేస్తున్నట్లు దొంగబిల్లులు సృష్టించిన బాగోతం వెల్లడైంది. ఆ నకిలీ బిల్లుల్లో పేర్కొన్న మేరకు, మొత్తం సరకు విలువ దాదాపు రూ.300కోట్లు. గుట్టుచప్పుడు కాకుండా అటువంటి లారీలు ఇప్పటికెన్ని నిర్దేశిత లక్ష్యాలకు నిక్షేపంగా చేరిపోయాయో ఎవరికెరుక? పొరపాటునో గ్రహపాటునో దొరికిపోయిన కేటుగాళ్ల లోగుట్టుమట్ల కూపీలాగే బాధ్యతను ఔషధ నియంత్రణ సంస్థ రెండేళ్లక్రితం సీఐడీకి దఖలుపరచినా, ఇప్పటిదాకా విచారణ వేగం పుంజుకోలేదు. సీఐడీ చేతులెత్తేసిన కేసును కేదస(సీబీఐ)కి అప్పగించాలంటూ ఔషధ నియంత్రణ సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసిందంటున్నారు. చతికిలపడ్డ పరిశోధన ఎప్పటికి తిరిగి మొదలై ఒక కొలిక్కి వస్తుందో తెలీదు!
దేశంలో ఏటా ఆరున్నర కోట్లకు పైగా ఫెన్సిడిల్‌ దగ్గుమందు సీసాలు తయారవుతున్నాయి. గణాంకాల ప్రకారం, అందులో తెలుగురాష్ట్రాలకు చేరుతున్నవి సుమారు 66లక్షల సీసాలు. ఇదంతా బిల్లుల మాయాజాలమే. అసలు ధర దాదాపు రూ.70 అయినా అంతకు నాలుగు నుంచి పదింతల వరకు ధర పలుకుతున్న ఇతర రాష్ట్రాలకు, పొరుగుదేశాలకు సింహభాగం సరకును తరలించేస్తున్నారు. దగ్గుమందుకు ఎందుకింత గిరాకీ అనే ప్రశ్నకు వచ్చే జవాబు ఎవరినైనా దిమ్మెరపరచక మానదు. మద్యనిషేధం ప్రకటించిన బిహార్‌ మీదుగా బంగ్లాదేశ్‌కు సరఫరాలు జోరెత్తుతున్నాయి. మద్యానికి ప్రత్యామ్నాయంగా దగ్గుమందు వాడకం ఇంతలంతలయ్యేకొద్దీ అక్రమ రవాణాదారులకు లాభాల పంట విపరీతమవుతోంది. పొడిదగ్గు వూపిరి సలపనివ్వ కుండా ప్రాణాలు తోడేస్తున్న ప్పుడు వైద్యుల పర్యవేక్షణలో రెండు లేదా మూడు రోజులకన్నా ఎక్కువ వాడ కూడని మందు ఫెన్సిడిల్‌! మోతాదు మించి వినియోగిస్తే మగతలో జోగుతారు. దానికి అలవాటు పడ్డారా- రోగ నిరోధక శక్తి క్షీణించి, కాలేయ సంబంధ వ్యాధులు కోరచాస్తాయి. అటువంటి ‘మందు’ ఒక్క బిహార్‌లోనే ఏటా కోటి సీసాలకుపైగా అమ్ముడవు తోంది. ఈశాన్య భారతంలో పాన్‌బడ్డీలు, పచారీ కొట్లలోనూ ఫెన్సిడిల్‌ విక్రయాలు అడ్డూఆపూ లేకుండా సాగుతున్నాయి. నేపాల్‌, మియన్మార్‌, బంగ్లాదేశ్‌లకు ఇదమిత్థంగా తరలుతున్న సరకెంతో ఎవరూ నిక్కచ్చిగా చెప్పగల పరిస్థితి లేదు. రాజస్థాన్‌, దిల్లీ, హైదరాబాదులతో పాటు ఇతర నగరాలు, పట్టణాల పేర్లూ వినిపిస్తున్న దృష్ట్యా- చూస్తూ వూరుకుంటే మేస్తూ పోయిన సామెతను నిజం చేయడంలో మత్తు మాఫియా ప్రావీణ్యం ఎనలేనిదని అంగీకరించక తప్పదు.
ఫెన్సిడిల్‌ ఒక్కటేనా? వూపిరి, ఛాతీ సమస్యల నుంచి తాత్కాలిక ఉపశమనానికి ఉపకరించే ఎఫిడ్రిన్‌ సైతం కోట్ల రూపాయల మత్తు వ్యాపారానికి అనువైన సాధనమవు తోంది. మత్తుకు అలవాటుపడి చౌక ప్రత్యామ్నాయాలకు వెంపర్లాడుతున్నవారికి మరిన్ని సులువైన పరిష్కారాలు ఇట్టే లభిస్తున్నాయి. టైపింగ్‌ పొరపాట్లు సరిదిద్దేందుకు ఉపయోగించే వైటెనర్లు, గోళ్ల రంగు తొలగించడానికి వాడే నెయిల్‌ పాలిష్‌ రిమూవర్లు సైతం ‘విశేష ఆదరణ’ పొందుతున్నాయి. నిన్న కాక మొన్న మెదక్‌ జిల్లా ఖాజీపేటలో రూ.25 లక్షల విలువైన అల్ఫ్రాజోలం పట్టుబడింది. అది కల్తీకల్లులో కలిపే మత్తుమందు! పొలంలో పాడిగేదెల పెంపకం కోసమంటూ వేసిన షెడ్డులో గప్‌చుప్‌గా అల్ఫ్రాజోలం తయారీ యంత్రాలు అమర్చి అక్కడ లక్షల రూపాయల సరకు తయారు చేస్తున్నట్లు యాదృచ్ఛికంగా వెల్లడైంది. నిఘా యంత్రాంగం నిష్ఠగా జోగడం అయాచిత వరమై, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకెన్ని చోట్ల ఆ తరహా ‘కుటీర పరిశ్రమలు’ వర్ధిల్లుతున్నాయో ఏమో!
నిఘా, నియంత్రణ వ్యవస్థలు జావగారిన దశలో నిషేధాస్త్ర ప్రయోగం నిష్ప్రయోజకం కాకుండా ఉంటుందా? దేశంలో విరివిగా ఉపయోగించే రెండు దగ్గుమందులు ఫెన్సిడిల్‌, కోరెక్స్‌ సహా 350 రకాల ఔషధాల ఉత్పత్తి, విక్రయాలపై పదహారు నెలల క్రితం విధించిన నిషేధమే అందుకు దాఖలా. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా మందుల నాణ్యత అంతంతమాత్రమేనని, నకిలీ రకాలకూ కొదవ లేదని నిగ్గుతేల్చిన కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనం- ఎక్కడికక్కడ వేళ్లూనుకున్న అవ్యవస్థనే కళ్లకు కడుతోంది. అసలు ఉపయోగించరానివి, దీర్ఘకాలం వాడితే ప్రమాదకరమయ్యే ఔషధాల్ని ఏళ్ల తరబడి జనం నెత్తిన రుద్దిన పాపం, నిషేధాంక్షల అమలులో విఫలమైన నేరం- నియంత్రణ సంస్థల ఖాతాలోనే జమపడతాయి. కోడీన్‌ ఫాస్ఫేట్‌ వితరణ గాడి తప్పడంలో స్వీయబాధ్యతను కేంద్ర మాదక ద్రవ్య నిరోధక మండలి దులపరించుకోజాలదు. నిషేధాన్ని తుంగలో తొక్కి వందల కోట్ల రూపాయల వ్యాపారం యథేచ్ఛగా సాగించుకునేలా అక్రమ ముఠాలకు వెసులుబాటు కల్పించడంలో, భారత ఔషధ ప్రధాన నియంత్రణాధికారి (డీసీజీఐ) పాత్రా తక్కువేమీ కాదు. ఈ బహుముఖ వైఫల్యాలే- నిషేధిత ఔషధాలు, హానికారక పదార్థాల ఉత్పత్తి, సరఫరాల రూపేణా సంఘవిద్రోహ శక్తులకు ఎడాపెడా లాభాల పంట పండిస్తున్నాయి. యువత పెద్దయెత్తున మత్తుకు బానిసలయ్యేందుకు శాయశక్తులా పుణ్యం కట్టుకుంటున్నాయి.
మోతాదుకు మించిన మత్తు పదార్థం కలిపినట్లు పరీక్షల్లో వెల్లడైతే ఎన్డీపీఎస్‌ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌) చట్టం ప్రకారం ఆ సంస్థపై బెయిలుకు వీల్లేని కేసు నమోదు చేయగల అవకాశముంది. అటువంటి నిబంధనలూ చెల్లని కాసులవుతున్నాయంటే, అధికార సిబ్బంది పనితీరును అవినీతితోపాటు భిన్నాంశాలు ప్రభావితం చేస్తున్నాయనడంలో తప్పేముంది?
మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాలపై ‘సిట్‌’ విచారణ కేసుల దగ్గరే ఆగిపోదని, శాశ్వత ప్రాతిపదికన నిఘా నియంత్రణ వ్యవస్థ నెలకొల్పుతామని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది. మాదక మహమ్మారి అణచివేతను లక్షించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎక్సైజ్‌ అధికారులతో కూడిన కార్యదళం (టాస్క్‌ఫోర్స్‌) అవతరింప జేస్తామని ఆంధ్రప్రదేశ్‌ సర్కారు అంటోంది. వ్యవస్థాగతమైన కంతల్ని పూడ్చి, చౌక ప్రత్యామ్నాయాల లభ్యతనూ కట్టడి చేసే విస్తృత వ్యూహం జాతీయస్థాయిలో పదును తేలితేనేగాని- జాతి మూలగను జుర్రేస్తున్న మత్తు విపత్తుకు విరగడ ప్రక్రియ వేగం పుంజుకోదు. ఏమంటారు?
- బాలు

marriage details

ఏ జంటకైనా పెళ్ళి ముడివేసేందుకు బంధుమిత్రుల సమక్షంలో వేడుక నిర్వహిస్తారు. అతిథులందరి సమక్షంలో జరిగే వివాహ ఉత్సవం ద్వారా వారికి భార్యాభర్తల హోదా కట్టబెడతారు. క్రమంగా ఈ వివాహ ఉత్సవాలు కేవలం కుటుంబ సభ్యులకే పరిమితమవుతున్నాయి. ప్రేమ వివాహమైతే అది ప్రేమికులకు మాత్రమే సంబంధించినదిగా మారుతోంది. ఏ గుడిలోనో, మరోచోటో దండలు మార్చుకుని వారు దంపతులైపోతున్నారు. వివాహం ఏదైనా సవ్యంగా సాగినన్నాళ్లూ ఎలాంటి సమస్యా ఉండదు. దంపతుల మధ్య వివాదాలు మొదలైనప్పుడే వివాహ బంధానికి చట్టబద్ధ గుర్తింపు ఎంత అవసరమో ఎరుకపడుతుంది. చట్టబద్ధ వివాహమే దంపతుల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది వివాహం రిజిస్ట్రేషన్‌ చేయించు కోవాలంటూ కొన్ని రాష్ట్రాల్లో చట్టాలున్నప్పటికీ అవి అమలవుతున్న దాఖలాలు లేవు. గడచిన కొంతకాలంగా వివిధ కేసుల విచారణలో భాగంగా వివాహానికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తోంది. ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి రాష్ట్రాలన్నింటికీ వర్తించేలా కేంద్ర ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని జాతీయ న్యాయ కమిషన్‌ సైతం సలహా ఇచ్చింది.
పెరుగుతున్న దాంపత్య వివాదాలు
భారత్‌లో లింగ విచక్షణ మరీ దారుణంగా ఉందనడంలో మరోమాట లేదు. బాల్య వివాహాలు, బహుభార్యత్వం, గృహహింస వంటి సమస్యలు దేశ సామాజిక ముఖచిత్రాన్ని వికృతంగా మార్చేస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించి దేశాన్ని సంస్కరణల బాటపట్టించాల్సిన అవసరం ఉరుముతోంది. దేశంలో విస్తరించిన ఈ తరహా సామాజిక అనాచారాలను నిషేధిస్తూ ఎన్నో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. ఆ చట్టాలను ఉల్లంఘించిన వారికి తీవ్ర శిక్షలనూ ఖరారు చేశారు. మోసపూరితంగా చేసుకునే పెళ్ళిళ్లకు, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలంటే చట్టబద్ధ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. అందుకోసం పటిష్ఠమైన చట్టాన్ని పట్టాలకెక్కించడం అనివార్యం. దాంపత్య వివాదాలకు సంబంధించిన పలు కేసులు కోర్టులకు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్నాయి. వరకట్న వేధింపుల కేసులూ లెక్కకు మిక్కిలిగా కోర్టులకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా మోసపూరిత వివాహాలకు సంబంధించిన కేసులే అధికం. దేశవ్యాప్తంగా మహిళలు దాఖలు చేసిన క్రిమినల్‌ కేసులు 13 లక్షల దాకా ఉండగా అందులో దాంపత్య, లైంగిక వేధింపుల కేసులే మిక్కిలిగా ఉన్నాయి. ఒక్క కేరళలోనే దాంపత్య వివాదాలతో ముడివడిన సుమారు 52వేల కేసులు పెండింగులో ఉన్నాయి. చట్టబద్ధ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి కాకపోవడంతో కేరళ మహిళాలోకం మోసాల బారినపడుతోంది. విలువలేని వివాహాలతో మహిళలు సామాజిక గుర్తింపుతోపాటు చట్టభద్రతనూ కోల్పోతున్నారు. అయితే విదేశాల్లో ఉంటున్న భారతీయులే అత్యధికంగా ఈ తరహా మోసాల బారినపడుతుండటం గమనార్హం!
మతాధికారుల సమక్షంలో జరిగే వివాహ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఇండియన్‌ క్రిస్టియన్‌ వివాహ చట్టం-1872లో నిబంధనలు పొందుపరచారు. సాధారణ క్రైస్తవులు, భారత స్థానిక క్రైస్తవ వివాహాల నమోదుకు ప్రత్యేక నిబంధనలున్నాయి. ముస్లిముల వివాహానికి సంబంధించి 1880నాటి ఖాజీ చట్టం అమలులో ఉంది. ఖాజీల ఆధ్వర్యంలో ఈ వివాహాలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఖాజీలను నియమించే అధికారం ఉంటుంది. పెళ్ళి (నిఖా) పూర్తయ్యాక సంపూర్ణ వివరాలతో కూడిన ‘నిఖా నామా’(వివాహ ఒప్పంద పత్రం)పై దంపతులతోపాటు మరో ఇరువురు సాక్షులతోనూ ఖాజీ సంతకం చేయిస్తారు. నిఖా నామా ఓ ప్రతిని ఖాజీ భద్రపరుస్తారు. ఈ నిఖా నామాను వివాహ రిజిస్ట్రేషన్‌లకు ఆధారంగా సమర్పించవచ్చు. 1909నాటి ఆనంద్‌ వివాహ చట్టం సిక్కుల పెళ్ళిళ్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తుంది. ఇది 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం, 1955నాటి హిందూ వివాహ చట్టం పరిధిలో ఉంటుంది. ఈ చట్టానికి 2012లో సవరణ తీసుకువచ్చారు. హిందూ వివాహ చట్టంనుంచి బయటికి వచ్చి ఆనంద్‌ చట్టం కింద సిక్కుల వివాహాలను రిజిస్ట్రేషన్‌ చేసుకొనేందుకు ఆ సవరణ అవకాశం ఇస్తోంది. పార్సీ వివాహ, విడాకుల చట్టం-1936లోని సెక్షన్‌-12 ప్రకారం మత గురువులు నిర్దిష్ట కాలావధిలోగా రిజిస్ట్రార్‌కు సంబంధిత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ మేరకు వివాహాన్ని ధ్రువీకరించకపోయినా, వివరాలను రిజిస్ట్రార్‌కు అందజేయకపోయినా ఆ మతగురువు మూడు నెలల సాధారణ జైలుశిక్ష, జరిమానా అనుభవించాల్సి ఉంటుంది. 1954నాటి ప్రత్యేక వివాహ చట్టం మతాలతో నిమిత్తం లేకుండా వివాహం చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. కులాంతర వివాహల నిమిత్తం తీసుకువచ్చిన ఈ చట్టంలోని సెక్షన్‌-15 ప్రకారం పెళ్ళిళ్లను రిజిస్టర్‌ చేయించాల్సి ఉంటుంది. 1955నాటి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌-8 కింద రిజిస్ట్రేషన్‌ జరగాలి. ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. విదేశాల్లోని భారతీయుల వివాహాల నిమిత్తం 1969లో విదేశీ వివాహ చట్టం అమలులోకి వచ్చింది. ఆ చట్టం విదేశీయులను పెళ్లి చేసుకోవడానికి భారతీయులకు అనుమతిస్తోంది. సీమా వర్సెస్‌ అశ్వనికుమార్‌ కేసులో సుప్రీంకోర్టు 2006, 2007, 2008ల్లో వెలువరించిన ఆదేశాల మేరకు అనేక రాష్ట్రాలు తప్పనిసరి వివాహ రిజిస్ట్రేషన్‌ చట్టం తీసుకువచ్చాయి. హరియాణా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మేఘాలయ, దిల్లీతోపాటు పలు రాష్ట్రాలు చట్టాలు రూపొందించాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల్లోనే రిజిస్ట్రేషన్‌లకు వీలు కల్పిస్తూ నిబంధనలు జతచేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ చట్టం 2002లోనే ప్రభుత్వం తీసుకువచ్చింది. చట్టం తీసుకువచ్చి దానికి నిబంధనలను రూపొందించినప్పటికీ అమలు మాత్రం కాలేదు. శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో బాల్యవివాహాలు జరుగుతున్న అంశాన్ని ‘సుమోటో’గా తీసుకున్న మానవ హక్కుల కమిషన్‌ అప్పటి ఛైర్మన్‌ జస్టిస్‌ బి.సుభాషణరెడ్డి నేతృత్వంలో అక్కడ శిబిరం నిర్వహించింది. బాల్య వివాహాలను అరికట్టడానికి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా ఉండాలని భావించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం 2006 ఏప్రిల్‌ 12న వివాహ నమోదు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ను ఈ చట్టం అమలుకు రిజిస్ట్రార్‌గా నియమించింది. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు రిజిస్ట్రార్‌లుగా వ్యవహరిస్తారని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నియామకాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అప్పటి మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌, ప్రస్తుత లోకాయుక్త ఛైర్మన్‌ జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వివాహాల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను వివిధ శాఖలకు అప్పగించడం వల్ల సమన్వయం ఉండకపోవడంతో ఆచరణలోకి రావడంలేదన్నారు. మొత్తం బాధ్యతను రిజిస్ట్రేషన్‌ శాఖకు అప్పగించాలని అభిప్రాయపడ్డారు. తాలూకా, జిల్లా స్థాయిల్లో రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వివాహాల నమోదుకు ఓ విభాగం ఏర్పాటు చేస్తే మెరుగైన ఫలితాలుంటాయన్నారు.
కేంద్రీకృత వ్యవస్థ అవసరం
జనన, మరణాలు, వివాహ నమోదు చట్టం, భారతీయ క్రిస్టియన్‌ వివాహ చట్టం, పార్సి వివాహ, విడాకుల చట్టం, హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం ఇలా పలు చట్టాలున్నప్పటికీ నమోదైన వివాహాల వివరాలన్నీ ఒకేచోట లభ్యమయ్యే వెసులుబాటు కల్పించలేదు. మతాలు, సంప్రదాయలకు అతీతంగా అన్ని తెగలవారి వివాహాల వివరాలు తెలుసుకోవడానికి పటిష్ఠమైన వ్యవస్థ లేదు. ప్రత్యేక వివాహ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఓ విధానం తీసుకువచ్చారు. దంపతులు ప్రధానంగా తమకు కావాల్సిన మతానికి సంబంధించిన చట్టం ఎంపిక చేసుకోవడానికి ఇది వీలు కల్పించింది. అంటే ప్రధానంగా మతాన్ని ఎంచుకోవడానికే ఈ విధానం ఉపయోగపడింది. మతంతో సంబంధం లేకుండా వివాహాల రిజిస్ట్రేషన్‌ అవసరం చాలా ఉంది.
చాలా దేశాల్లో వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించాలన్న చట్టం ఉంది. అయితే విస్తీర్ణం, జనాభా, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉండటంతో అలాంటి చట్టం అమలు అంత సులభం కాదని జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ప్రస్తుత న్యాయ కమిషన్‌ కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఈనెల 4న అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. అయితే అమలు చేయడం కష్టమన్న కారణం ఈ తరహా చట్టంలోని ప్రయోజనాలను విస్మరించలేమనీ పేర్కొంది. కొత్త చట్టం తీసుకువస్తే గతంలో ఉన్న సివిల్‌, క్రిమినల్‌ నిబంధనలను మెరుగ్గా అమలు చేయాలనీ అభిప్రాయపడింది. నూతన చట్టం ద్వారా కొత్త హక్కులు ఇవ్వాల్సిన అవసరంలేదని పేర్కొన్న న్యాయస్థానం- ఇప్పటికే ఉన్న చట్టాల్లో దంపతులకు ఉన్న హక్కులు సక్రమంగా అమలయ్యేలా చూస్తే చాలని వ్యాఖ్యానించింది. ఇప్పటికే పలు చట్టాలున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌లకే పరిమితమయ్యేలా మరో కొత్త చట్టం అవసరం లేదని సూచించింది. కుటుంబ చట్టాన్ని మొత్తంగా సంస్కరించాలన్న అంశం జోలికి వెళ్ళకుండా- కేవలం వివాహాలకు రిజిస్ట్రేషన్‌ను తప్పని చేయడంపైనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జనన, మరణాలకు రిజిస్ట్రార్‌ బాధ్యత వహించిన పద్ధతిలోనే- పెళ్ళిళ్ల నమోదుకు సంబంధించీ వారికే బాధ్యత దఖలుపరచాలని సూచించింది. నిర్దిష్ట సమయంలో జనన, మరణాలు నమోదు చేయకపోతే జరిగిన జాప్యానికి రుసుము వసూలు చేసే పద్ధతిని సవరణ బిల్లులో చేర్చాలంది. తమ ప్రాంత పరిధిలో జరిగిన వివాహం నమోదు కాని పక్షంలో దాన్ని ‘సుమోటో’గా తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేసే అధికారాన్ని పంజాబ్‌ చట్టం రిజిస్ట్రార్‌కు కట్టబెడుతోంది. ఇదే తరహా నిబంధనను కేంద్ర చట్టంలోనూ తీసుకురావాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏ దేశంలో పెళ్ళి చేసుకున్నా దంపతుల్లో్ల ఒకరు భారతీయులైతే, రిజిస్ట్రార్‌ సంతృప్తి చెందితే రిజిస్టర్‌ చేయడానికి వీలుగా దిల్లీ చట్టంలో ఉన్న నిబంధన కేంద్ర చట్టంలో చేర్చితే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడింది. వివాహాల రిజిస్ట్రేషన్‌కు కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరంలేదని జనన, మరణాల చట్టం 1969లో వివాహ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తూ సవరణ తీసుకురావాలని సిఫారస్సు చేసింది. పెళ్ళి రిజిస్ట్రేషన్‌పై గ్రామాల్లో, పంచాయతీల్లో జాగృతపరచాలంది. రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ చట్టసవరణ తీసుకువస్తే సగటు మహిళలు ఎదురొంటున్న పలు సమస్యలకు తెరదించినట్లే!
- దండు నారాయణరెడ్డి

Wednesday, 26 July 2017

రామ్ గోపాల్ వర్మకు పిచ్చి ముదిరింది

రాంగ్ అండ్ ఫాల్స్ వర్మ
విచ్చలవిడి తనానికి పరాకాష్ట . పర్వర్షన్ కు ప్రతిరూపం. బీభత్స కాండకు కేరాఫ్ అడ్రస్. వికృత, విపరీత కామెంట్లకు చిరునామా. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడతాడు. ఏదైనా తప్పుకాదంటాడు. తాను చెప్పిందే కరక్టు... చూపించేదే నిజమంటాడు. అమ్మాయంటే సెక్స్ మాత్రమే అన్నది ఆయన ఫిలాసఫీ. తానేం తీసినా జనం అదే చూస్తారనుకుంటాడు. చూస్తున్నారు కాబట్టి... తన ఆలోచనే  కరెక్టన్నది ఆయన ఉద్దేశం. ఆయన మరెవరో కాదు... ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ. రక్త చరిత్ర తీస్తాడు... ఐస్ క్రీమ్ అంటూ పులిహార మాటలు చెప్తాడు. చిన్న పిల్లల మనుసలు కలుషితమయ్యేలా సన్నీ లియెన్ సినిమా తీస్తాడు. చరిత్రకు కొత్త నిర్వచనాలు చెప్తాడు. ఎన్టీఆర్ చరిత్ర అంటూ మరో బయోపిక్ తీసేందుకు సిద్ధమయ్యాడు. దేనికైనా రెడీ... ఏం చేసేందుకైనా సిద్ధమంటారు. తాజాగా డ్రగ్స్ కేసులో పోలీసులు ఓవరాక్షన్ అంటూ తన బాధను ట్వీటి చేతులు కాల్చుకున్నాడు. మానవత్వమన్న మాటకు అర్థం తెలియని ఆర్జీవీ మానవత్వం గురించి, సినీ జనం గురించి మనకెవరికీ తెలియని కహానీలు విన్పిస్తాడు. రాంగ్ రూట్లో వెళ్తూ... అంతా రైట్ రైట్ అంటున్న దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ విశృంఖలత్వంపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలతో చలికాచుకుంటాడు. కాదు టైమ్ పాస్ చేస్తాడు. కాదు డబ్బులు సంపాదిస్తాడు. తన చుట్టూ ఉన్నవారికి కాసులు పంట పండిస్తాడు. జనం సినిమా పిచ్చి...  ఆర్జీవీకి మనీ మిషన్. ఉదయం నిద్ర లేచిన మొదలు ఆర్జీవీ అబద్ధాలతో కాలం గడిపేస్తాడు. అవే అసత్యాలతో దిన చర్యను ముగించేస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అబద్ధాలు... అర్ధ సత్యాలతో తన పబ్బం గడిపేసుకుంటాడు. తనకు, తన సినిమాలకు ప్రచారం కోసం పకడ్బంధీ ప్రణాళికను మాత్రం సెట్ చేసుకుంటాడు. స్ట్రయిట్ గా ఫ్రాంక్ గా మాట్లాడతానంటూ కుండబద్ధలు కొడుతూనే... అన్నీ అబద్ధాలే చెప్తారంటూ ఆయన గురించి తెలిసిన వారు ఇట్టే చెప్పేస్తారు. ఆయన గురించి తెలిసినవారు ఆయన అబద్ధాల కోరంటారు. నోరు తెరిస్తే అబద్ధం... నిద్రపోయే వరకు అసత్యాలతో కాలం గడిపేస్తారని చెబుతారు. బాధ్యతారహితంగా ప్రవర్తించడంలో రాముకు మించిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తనకు బాధ్యత ఉంది కాబట్టి ఓటేయనని చెప్పే ధైర్యం వర్మ ఒక్కడికే ఉంటుంది. నాకు నచ్చిన విధంగా సినిమాలు తీస్తాను. చూస్తే చూడండి లేదంటే లేదు. మిమ్మల్ని ఎవర్నీ కూడా సినిమా చూడాలంటూ కోరడం లేదని కరకండీగా చెబుతాడు. చూడటం, చూడకపోవడం మీ ఇష్టమంటూ కుండబద్ధలు కొడతాడు వర్మ. జనానికి సినిమా ఎందుకు నచ్చదో నాకెలా తెలుస్తుందంటూ కలరింగ్ ఇస్తాడు. నచ్చాల్సిన అవసరం కూడా లేదంటాడు. సినిమాలు తీయడం నా పని... నా పని నేను చూసుకుంటూ పోతా... చూసే వారు చూస్తారు. చూడని వారు చూడరంటాడు.  నిజాయితీ నిలువెత్తు నిదర్శనం నేనేనని కూడా చెప్పేసుకుంటాడు. ఎవరికీ అంతబట్టని రీతి రామ్ గోపాల్ వర్మది. అసహజ ప్రవర్తనకు, ఎవరూ ఆలోచించని విధంగా ఆలోచించడం వర్మకు మాత్రమే సొంతమని చెప్పాలి. రోజూ నిద్ర లేచింది మొదలు పోర్న్ చిత్రాలను చూడటంతో మొదలుపెడతానంటాడు. ఇలా ఏ డైరెక్టర్  కూడా చెప్పడం. పైపెచ్చు తనకు పోర్న్ సినిమాలే చోదక శక్తి అంటాడు. తన పక్కన అమ్మాయి ఉన్నా...   పోర్న్  తో వచ్చే కిక్కే వేరంటాడు. తనకు పోర్న్ చూస్తే కిక్కెక్కుతుందని... అది అమ్మాయితో కమిట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయని... ఈజీగా అనుభూతి కలగాలంటే అందుకు పోర్న్ ఒక్కటే పరిష్కారమంటాడు. ఎనర్జీ రావాలంటే చూడక తప్పదని కూడా చెప్తాడు. ఎన్ని గంటలకు నిద్రపోయినా... ఉదయం ఆరు గంటలకే రాముడు మంచిబాలుడిలా లేస్తానంటాడు. పోర్న్ చూడడం వల్ల ఎండార్ఫిన్ కెమికల్ రిలీజ్ అయ్యి... రోజంతా ఫుల్ యాక్టివ్ గా పనిచేసుకుపోతానంటాడు. నిస్తేజం పోయి ఉత్తేజం ఆవరిస్తుందంటాడు. థెరపీలాగా పోర్న్ వీడియోలు పనికొస్తున్నాయంటాడు. జీవితంలో ఏదో సాధించాలనుకొని ఏదో సాధించానని... తనకు మిగతా వారికి చాలా తేడా ఉంటుందని... తనంత నిఖార్సైన మనిషి ఇంకొకరుండరని చెబుతాడు. అదే సమయంలో వివాహ జీవితంతో విసిగిపోయి విడాకులు తీసుకునన్నానంటాడు. రాము పెళ్లి కూడా బలవంతంగా జరిగిందని... ఆ పెళ్లి విషయంలోనే రంగా అండ్ కో రామును హెచ్చరించారని కూడా బెజవాడ జనం చెప్పుకుంటుంటారు. అప్పట్నుంచి ఒక సామాజికవర్గంతో అంటీ అంటనట్టుగా రాము వ్యవహరిస్తూ ఉంటారట. హీరోయిన్లను సినిమా అంతా ఒకరకంగా  చూపించి... పది నిమిషాలు ఎక్స్ పోజింగ్ చూపిస్తే తప్పంటున్నార... అసభ్యంగా చూపించాల్సిన సందర్భంలో అలా కాకుండా మరోలా ఎలా చూపిస్తామంటూ లెక్చర్లిచ్చేస్తాడు. అలా చూపిస్తే వచ్చే నష్టమేంటంటాడు. అసలు ఉద్దేశాన్ని గమనించకుండా పది నిమిషాల గురించే మాట్లాడుకుంటారేంటంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. ఎందుకంటే తనకు ఉన్న జబ్బు అందరికీ ఉంటుందనుకుంటాడు.  ఓవరాల్ గా ఇక్కడ రాము గురించి చెప్పాలంటే... ఉత్తినే పబ్లిసిటీ పొందాలి. అందుకు మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో బహు బాగా తెలుసిన మాష్టర్ రామ్ గోపాల్ వర్మ. నిత్యం సంచలనాలు సృష్టించాలి. ఎవరూ మాట్లాడని టాపిక్స్ మాట్లాడాలి. అందరికీ తెలిసిన విషయాలను అందరికంటే భిన్నంగా చెప్పాలి. చెప్పడంలోనూ భిన్నత్వం చూపించాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్మకు పేరు రావాలి...  జనంలో పేరు నానుతూ ఉండాలి. అందరూ ఆయన గురించే మాట్లాడుకోవాలి. అందరూ ఆయన లేవనెత్తిన అంశాల గురించే చర్చించుకోవాలి. పబ్లిసిటీని క్రియేట్ చేయడంలో దిట్ట అయిన రాము...  రూపాయి ఖర్చు పెట్టకుండా తన పబ్లిసిటీ, సినిమా ప్రచారం రెండు చేసేసుకుంటాడు.
తనకు అమ్మాయిలు, సెక్స్ అంటే పిచ్చి అంటూ కూడా చెబుతాడు. ఇంటర్మీడియెట్ నుంచే హీరోయిన్ల తొడలు చూడటానికి సినిమాలకు వెళ్లేవాడనంటాడు. బోడి స్టోరీల కోసం సినిమాలకు వెళ్లేవాడిని కాదంటూ కూడా కుండబద్ధలు కొడతాడు. వర్మ మాదిరిగా... దేశంలో మరే డైరెక్టర్ కూడా ఇంతలా మాట్లాడడు. ఎందుకంటే డైరెక్టర్ అనే వాడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడు. ఇష్టానుసారం మాట్లాడాలంటే ఎన్నో విషయాలు అడ్డొస్తాయ్. ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారోనని దర్శక, నిర్మాతలు భావిస్తారు. కానీ వర్మకు మాత్రం అస్సలవేమీ పట్టవు. శ్రీదేవి, సిల్క్ స్మితను అందాలను చూసి పెద్దయ్యానని... ఇప్పుడు అలాంటి యాంగిల్ లో సినిమాలకు వచ్చేవారంటారని అంటాడు. అవి చూడటానికే సినిమాలకు వస్తారని కలరింగ్ ఇస్తాడు. అందుకే అవి చూపించడమే పనిగా పెట్టుకున్నాడు. అవే చూపిస్తున్నానంటాడు. తన సినిమాలు పది మంది చూస్తే చాలులే అనుకొని సినిమాలు తీస్తాడు వర్మ. ఇదే తరహాలో ప్రముఖ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి షార్ట్ ఫిల్మ్ తీసి..... సన్నీ లియోన్ గురించి ఎవరికీ తెలియని విషయాలు కూడా చెప్పేస్తాడు. అయితే ఇక్కడ డ్రామా పండిస్తాడు.  20 ఏళ్ల యువతి నేనెందుకు సన్నిలియోన్ కాకూడదు అన్న పాయింట్ ఆధారంగా.. తల్లిదండ్రులతో వాదించడాన్ని సినిమా తీశాడు. నా కూతురు సన్నిలియోన్ కావాలనుకుంటుంది అనే టైటిల్ పెట్టాడు. పోర్న్ స్టార్ అయితే తప్పేంటి అనే కూతురు ప్రశ్నిస్తూ... తల్లిదండ్రులతో గొడవపడటాన్ని... ఎమోషనల్ డ్రామాగా పండించాడు. తల్లిదండ్రుల ప్రతి ప్రశ్నకు అమ్మాయి ఇచ్చే సమాధానం.. సెక్స్ అంటే ఫ్యాషన్ అని అమ్మాయి సమర్ధించుకునే విధానాన్ని చూపించి... యువతలకు వెర్రిక్కిస్తాడు. మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహ్తీ హై అంటూ సన్నీలియోన్ గురించి ప్రపంచానికి తెలియని విషయాలన్నింటినీ చూసేలా రెచ్చగొడ్తాడు. రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై స్టార్ హీరో పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించాడు. రామ్ గోపాల్ వర్మ 50ఏళ్ళు పై బడిన వ్యక్తి.  పెళ్ళైన కూతుర్ని పెట్టుకొని ఫోర్నో గ్రఫీ సినిమాలను కలక్ట్ చేసుకుంటాను అన్న వ్యక్తి మాటలపై ఏం మాట్లాడగలమని వ్యాఖ్యానించారు. ఒక రోజు నన్ను ఎత్తోచ్చు ఒక రోజు నన్ను తగ్గించవచ్చు ,వీళ్ళందరకి సమాధానం చెప్పుకొనే స్థితిలో నేను లేను అని పవన్ తేల్చేశారు. తన సినిమాల విషయంలో దిగజరలేదని... తనకు చేతనైనా సినిమాలు తీస్తున్నానంటాడు. తాను దిగజారి సినిమాలేవీ కూడా చేయడం లేదని... ఇండియాలో పోర్న్ సినిమాలు చేయలేమని...  నగ్నంగా ఉండే అందాన్ని చూడటమే ఇష్టమంటాడు. నలుగురిలో మాట్లాడుకోలేని విషయాలను గర్వంగా స్ట్రయిట్ గా చెబుతున్నానంటాడు. ఇక మహిళా దినోత్సవం రోజు సెలబ్రిటీలంతా.. అమ్మ, కూతురు, భార్య ఫొటోలు పెట్టి శుభాకాంక్షలు చెబుతుంటే వర్మ మాత్రం మహిళలంతా సన్నీలియోన్ ను చూసి నేర్చుకోవాలి. మగవాళ్లందరి తరఫున మహిళలకు ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే విషెస్ చెబుతున్నా. ఏడాదిలో ఒక రోజు ఉమెన్స్ డే పాటించాలి. అయితే ఈ రోజంతా పురుషులేం చేస్తారో నాకు తెలియదు. మహిళలందరూ సన్నీ లియోన్ లా పురుషులకు ఆనందం పంచాలి. మగాళ్లకు ఆమెలా ఆనందం పంచాలంటూ ట్వీట్ చేసి నాలుక్కరుచుకున్నాడు. వర్మ చేసిన ట్వీట్ కు వ్యతిరేకంగా మహిళలు కేసులు నమోదు చేయడంతో వెనెక్కి తగ్గాడు. ముంబైలో మహిళా సంఘాలు చెప్పులతో కొడతామనే సరికి దిగొచ్చాడు. ముంబైలో అతడి కార్యకలాపాలను స్తంభింపజేస్తామని బాలీవుడ్ కార్మిక వర్గాలు కూడా హెచ్చరించాయి. తన వ్యాఖ్యలతో బాధ పడిన వారందరికీ సారీ చెబుతూనే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తనను హెచ్చరించిన వారికి మాత్రం ఈ క్షమాపణ వర్తించదంటూ ఓవరాక్షన్ చేస్తాృడు. భారతదేశంలో అందరూ మడికట్టుకొని ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారని అందుకే... ఇక్కడ నిర్భయ లాంటి ఉదంతాలెన్నో జరగుతున్నాయని... అదే అఫీషయల్ గా పోర్న్ ఉన్న చోట్ల ఎక్కడా కూడా సెక్స్యువల్ క్రైమ్స్ పెద్దగా జరగడం లేదని అంటాడు. సైంటిఫిక్ గా కూడా ఇదే విషయం ప్రూవయ్యిందంటాడు. ఇలా నోటికి అడ్డూ అదుపు లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయ్. ఎవరేమనుకంటే నాకేంటంటూ తన ఇష్టానుసారం వ్యవహరిస్తాడు.
రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కరలేని సంచలన సినిమాల దర్శకుడు. ఆయన ఎన్నో సంచలన చిత్రాలను మరెవరూ తీయలేరన్నట్టుగా తీశాడు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దాడు. అదంతా ఘనం. వర్తమానంలో వర్మ ఇప్పుడో వైఫల్యాలకు చిరునామాగా మారాడు. కాదు కాదు. వివాదాలకు కేంద్రబిందువయ్యాడు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్శీని కెలుక్కుంటూ... నిత్యం వార్తల్లో ఉండేందుకు ట్వీట్ లతో  పోటెత్తుతాడు. అటు సినిమానే కాకుండా... తనకు సంబంధం లేని ఎన్నో విషయాలపై వివాదాస్పదన వ్యాఖ్యలు చేస్తాడు. కాంట్రవర్శీ లేకుంటే నిద్రపట్టదేమోనన్నట్టుగా వ్యవహిరిస్తుంటాడు. రామ్ గోపాల్ వర్మ 1962 ఏప్రిల్ 7న జన్మించాడు. దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు, హిందీ భాషల్లో అనేక సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు, నిర్మించాడు. శివ సినిమాతో తెలుగుతెరను షేక్ చేశాడు. తర్వాత హిందీ సినిమా రంగీలాతో సంచలనం సృష్టించాడు. వర్మ కార్పోరేషన్ పేరుతో భారీ చిత్రాలను, లో బడ్జెట్ సినిమాలను రూపొందించాడు.  మొన్నటి వరకు సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ  ఆ తర్వాత సినిమా పేర్లతో కామెడీ చేయడం మొదలు పెట్టాడు. ఎక్కడ కాంట్రవర్శీ ఉంటే అక్కడ ఆ సినిమాలు తీసి పబ్బం గడుపుకోవడం మొదలుపెట్టాడు. ఇటీవల ఆయన తీసిన సినిమాలు జీవిత కథలు, లేదంటే బూతు సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయ్. సినిమాల పేర్లతోనే పబ్లిసిటీని పొందేలా ప్రచారం చేస్తూ వాటిని మార్కెటింగ్ చేసుకోవడం వర్మకు అలవాటైన విద్య. బాలీవుడ్ లో వరుస ఫ్లాపులతో ఇక టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన వర్మ గడిచిన పదేళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా విజయవంతమైన సినిమా తీయలేదు. ఆయన ఇటీవల తీస్తున్న సినిమా పేర్లను చూసినప్పుడు ఎవరికైనా ఆయనకు కొంచెం లూజేమోనని అన్పిస్తోంది. సినిమా టైటిళ్లతోనే రాము సంచలనం సృష్టిస్తాడు. ప్రచారం ద్వారా ఆ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తాడు.  సినిమా చూడాలని చెప్పడం ద్వారా...  సినిమా జనం వచ్చేలా చేస్తాడు. విరుద్ధ భావాలతో తలతిక్కల మనిషిలా వ్యవహిరస్తాడు. తనకు అత్యంత ఇష్టమైన సినిమా, అమ్మాయి రెంటిండీని ఎవరూ చూపించని విధంగా చూపిస్తాడు వర్మ. ఇక్కడ  సినిమా, మగువ రెండూ వేరు వేరు కాదండోయ్... సినిమాలోనే మగువను తన ఇష్టానుసారం చూపించేస్తాడు. అందుకే సన్నీ లియోన్ తో సినిమా ఎందుకు తీయకూడదంటాడు.  ఇంకా నయం షార్ట్ ఫిల్మ్ తో సరిపెట్టేశాడు. అది సిల్వర్ స్క్రీన్ పై తీస్తే యువత ఎంతలా చెడిపోయేవారో. అదే సమయంలో గన్స్ అండ్ థైస్ అంటూ సినిమాలను తెరకెక్కిస్తాడు. తుపాకులు, తొడలు అంటూ అసభ్యకరమైన సీరిస్ తో యువతను మరింతగా చెడగొట్టాలని చూస్తాడు. అందరూ సినిమా హిట్టయితే సంతోషపడతారు. ఫట్టయితే బాధపడతారు. అయితే వర్మకు మాత్రం ఇవేమీ ఉండవ్. ఎందుకంటే తన తీసే  సినిమా లో బడ్జెట్. డబ్బులు పోవడం పెద్దగా ఉండదు. వచ్చేదే కానీ పోయేదేమీ ఉండదు. పేరు ఎటు తిరిగి పోతుంది. డబ్బన్నా రానివ్వండి అని అనుకుంటాడు.  చీకు, చింతా, దిగులు, నిరుత్సాహం రాముకు దరిచేరవు. అంతా సిల్వర్ స్క్రీన్ పైనే ఏదైనా చూసుకోవాలనుకునే వర్మ... యాడ్ ఫిల్మ్ తీస్తారా అని అడిగితే... అదే డబ్బుతో సినిమానే తీస్తానంటాడు. తనకి తిక్క ఉందని ఆయనకు ఆయనే చెప్పుకుంటారు. తిక్క ఉంటే అతనిని నమ్మి నిర్మాతలు కోట్ల రూపాయలు ఎలా పెట్టుబడి పెతరాన్నది కూడా ఆశ్చర్యమే. సినీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు అతనితో కలసి ఎలా పనిచేస్తారని చాలా మంది అనుకుంటుంటారు. టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ లోనూ సినిమాలు తీయగలగడం విశేషం. అయితే ఏ సినిమాకైనా అదే బ్యాగ్రౌండ్... అదే స్టోరీ ఉంటాయని... కొత్తదనమన్నదే అస్సలు ఉండదని కూడా చెబుతారు. సినిమాలు సమాజాన్ని మార్చవనేది వర్మ కఛ్చితమైన అభిప్రాయం. అందుకే సామాజిక ప్రయోజనం కోసం తాను సినిమాలు తీయను అని చెబుతాడు. అతనితో కొద్ది సేపు మాట్లాడిన తరువాత చాలా మందికి తాము తెలుసుకోవలసింది చాలా ఉన్నదన్న ఫీలింగ్ కలిగిస్తాడు. ఏం కావాలో తెలుసు. ఏం చేస్తున్నాడో తెలుసు. ఏం చేయాలో తెలుసు. సినిమా జీవితంపై  స్పష్టత ఉంది. సినిమా నిర్మాణం పట్ల అంకిత భావం ఉంది.  ప్రతి విషయంలో కచ్చితమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాడు. ఎదుటి వారికి నచ్చినా... నచ్చకపోయినా నాకేంటిలే అనుకుంటాడు. ఇలాంటి లక్షణాలున్నా... వర్మ... లౌక్యం లేనివాడేమోనని అందరూ అనుకుంటారు. అయితే తనకు ఉన్న లౌక్యంతో సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. దిగజారి సినిమాలు తీస్తున్నా... డబ్బులు పోవులే సినిమాలు తీస్తామంటూ నిర్మాతలు వస్తూనే ఉంటారు. పిచ్చి ముదిరింది... తలకు రోకలి చుట్టమన్నాట్ట వెనకటికో పెద్ద మనిషి. ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి అలాగే తయారవుతోంది. నానాటికీ తీసికట్టు నామం బొట్టు అన్నట్లు... బాలీవుడ్ నుంచి  టాలీవుడ్ కి చేరిన వర్మ... ఇక్కడ అయోమయం పరంధామల్లా మారిపోయాడు.  కాస్త పెద్ద సినిమాలు చేసి, అక్కడి నుంచి చిన్న సినిమాలకు, ఆపై షార్ట్ ఫిలిం దిగజారాడు. ఎక్కిన మెట్లన్నీ తానే దిగుతూ నేలబారు మనిషైపోయాడు. కెరీర్ లో ఎత్తుపల్లాలు ఎవరికైనా కామనే అయినప్పటికీ వర్మ మాత్రం దివాల్ కోర్ ట్వీట్లతో అందరినీ కెలుగుతున్నాడు. ఇష్టమన్నవారిని పొగడం... ఇష్టం లేని వారిని తెగడతం ఆర్జీవీకి  వెన్నతో పెట్టిన  విద్య.  భావప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా... అనీ వినాయకుడిపైనా అవాకులు, చవాకులు ట్వీట్ చేస్తాడు. దేవుళ్లను తెలంగాణ, ఆంధ్ర అంటూ విభజిస్తాడు. రామ్ గోపాల్ వర్మను తిట్టడానికి తెలుగులో ఉన్న అన్ని పదాలు చాలక మీడియా ఇంగ్లిషు, హిందీ పదాలను సైతం ఉపయోగిస్తుందంటే అతిశయోక్తి కాదు. తిక్కలోడు, చపలచిత్తం కలిగినవాడు, మూర్ఖుడు,  అసాంఘీక శక్తి, పబ్లిసిటీ పిచ్చోడు, అజ్ఞాని, స్త్రీలంటే గౌరవంలేనివాడు, నైతిక విలువలు లేనివాడని, హింసాత్మక చిత్రాలు తీస్తాడని... అట్టర్ ఫ్లాప్ చిత్రాలు తీస్తాడంటారు. మొండివాడు, పొగరుబోతు,  తెలివితక్కువ వాడు, నాస్తికుడు, స్వార్థపరుడు, ఉన్మాది,  అహంభావి, చపల స్వభావుడు,  పెద్దల పట్ల గౌరవంలేని వ్యక్తని,  మంచీ మర్యాద తెలియదని, సభ్యతలేనివాడని, ఓవరాక్షన్ గాడని అంటారు. ఇటీవల ఒక డైరెక్టర్ తెలుగులో పెట్టిన ఇడియట్, రోగ్, బద్మాష్, పోకిరి, తుంటరి, లోఫర్, దేశముదురు లాంటివి పెట్టేలేమోనని చెప్పొచ్చు. ఇవి విని కూడా నవ్వుకొని ఎంజాయ్ చేయడం వర్మకే సాధ్యం.
తాజాగా వర్మ టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ భూతంపైనా వింత వైఖరి ప్రదర్శిస్తున్నాడు. మానవత్వం లేకుండా విచారణ సాగిస్తున్నారంటూ సిట్ పై చిందులేశాడు. మీడియాలో వార్తలు లీకవుతున్నయో కూడా చెప్పాల్సి ఉంటుందంటూ రంకెలు వేశాడు. సినిమావాళ్లకు ఫ్యామిలీలు ఉన్నాయంటూ... ఇష్టానుసారం నేరాలు అంటగడుతున్నారంటూ వాపోయాడు. కాదు కాదు నోరు పారేసుకున్నాడు. టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో సినీ తారలను ప్రశ్నిస్తున్న తీరుపై వర్మ విచారం వ్యక్తం చేశాడు. సిట్ అధికారులు పూరి జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా అంటూ... ట్వీట్ చేశాడు.  తెలుగు మీడియా,  అకున్ సభర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తోందంటూ ట్వీటాడు.  అకున్ సభర్వాల్ తో రాజమౌళి బాహుబలి 3 తీయాలేమోనంటూ చెప్పాడు. సభర్వాల్ సమగ్రతను ఎవరు అనుమానించటం లేదని... . కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరమంటూ  ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా డ్రగ్స్ విచారణ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమందిని విచారిస్తున్న తీరుతో మొత్తం తెలంగాణా ప్రతిష్టకే భంగం కలిగిందంటూ ఫేస్‌బుక్ ద్వారా చెప్పాడు. డ్రగ్స్ వ్యవహారం కారణంగా పంజాబ్ రాష్ట్రం కంటే దారుణమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని.. ముంబై వాసులు అంటున్నారని వర్మ అన్నాడు. విచారణ అంటూనే లేనిపోని లీకులను బయటకు ఇస్తుండటాన్ని వర్మ ఖండించాడు. సభర్వాల్ మానవత్వం లేని మనషని, డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారి పేర్లను మీడియాకు లీక్ చేశాడంటూ ఆయన విమర్శించాడు. అయితే వర్మ కామెంట్లపై అకున్ సభర్వాల్ స్పందించాడు. తమపై ఇష్టా రాజ్యంగా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సభర్వాల్‌ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే తాము డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టంచేశారు. కేవలం సినిమా వాళ్లనే టార్గెట్‌ చేసినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడలేమని, అందరికీ పిల్లలున్నారని, తాము అలాంటి పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో చేయమని స్పష్టంచేశారు. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్‌ వర్మపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సంచలనం రేపుతున్న డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా వర్మ వ్యాఖ్యలు చేశారని, ఇలా వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమేనని న్యాయవాది రంగప్రసాద్‌ రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌ వేశారు. డ్రగ్స్‌ కేసుతో వర్మకు సంబంధం లేదని, అయినా ఎక్సైజ్ అధికారులను కించపరిచేవిధంగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వర్మ వ్యాఖ్యలు చేశారని రంగప్రసాద్‌ తెలిపారు. టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్,  మా అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేం లేదని, వర్మ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ముందుకొచ్చి వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ కేసుకు ఒరిగేదేం లేదు. ఈ కేసులో నోటీసులు అందుకున్న సెలబ్రిటీలకు, విచారణ చేపట్టిన అధికారులకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు. సిట్ విచారణ ద్వారా త్వరలోనే నిజనిజాలు వెల్లడవుతాయి. ఈ కేసుపై ఇండస్ట్రీ వారితో పాటు బయటివారు ఏం మాట్లాడినా అబద్దాలు నిజాలు కావు. నిర్దోషులుగా ఉన్న వ్యక్తులను దోషులుగా నిరూపించడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు. డ్రగ్స్‌ మాఫియా కేసులో  చిత్ర పరిశ్రమనే టార్గెట్‌ చేశారనడం సరికాదని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఈ కేసులో సిట్‌ అదికారులు అందరినీ విచారణ చేస్తున్నారని చెప్పాడు. అందులో భాగంగానే సినీ నటులు విచారణకు హాజరవుతున్నారని పోసాని తెలిపారు. విచారణకు హాజరైన వారిలో కొందరు బ్లడ్‌ శాంపిల్స్‌ ఎందుకు ఇవ్వడం లేదనేది వాళ్ల వ్యక్తిగత విషయమన్నారు. అదే తనను అడిగితే స్వచ్ఛందంగా బ్లడ్‌ శాంపిల్‌ ఇస్తానని, ప్రభుత్వం సిగరెట్లు, మద్యాన్ని నిషేధించాలని పోసాని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా తన పని తాను చేసుకోకుండా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న బడాయి మాటలు మొత్తం ఇండస్ట్రీపై నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తున్నాయ్. విచ్చలవిడిగా వ్యవహరించే ఆర్జేవీ తన మాటలను తనకు మాత్రమే కాకుండా వ్యవస్థలకు ఆపాదిస్తే ఎంతటి ఉపద్రవాలైనా రావొచ్చనడంలో సందేహం లేదు.
  ఆర్జీవీ ఇప్పుడో ఎక్సపైర్ అయిన దర్శకుడు. ఆయన సినిమాల్లో విషయం లేదు. స్టోరీలో కథ లేదు. స్క్రీన్ ప్లేలో మ్యాటర్ లేదు. ఓవరాల్ గా సినిమాలో సీన్ లేదు. అందుకే ట్వీట్టర్లో ట్వీట్ అంటూ చెలరేగిపోతున్నాడు.  విషయమున్న సినిమాలు తీయాలన్న కసీ ఆర్జీవీలో లేదు. పబ్బం గడుపుకోవడం... టైమ్ పాస్ చేయడం... మసిపూసి మారేడుకాయ చేయడమే వర్మకు తెలిసింది. తన చెప్పిందే నిజం కాబోలని జనం అనుకోవాలన్న ఇజం వర్మది. వంద మందిలో ఒక్కరు తనను అభిమానించినా అదే పదివేలనుకుంటాడు. వినీ వాళ్లు వెర్రోళ్లతై చెప్పేవాడు ఆర్జీవీ అన్న నానుడి వచ్చే రోజుల్లో వైరల్ అవుతుందేమో... వర్మ ట్వీట్ చేసినా, కామెంట్ చేసినా వదిలేయడం ఒక్కటే ఇప్పుడు మీడియా చేయాల్సింది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.

Tuesday, 25 July 2017

డ్రాగన్ లెటెస్ట్ ఫోకస్

నమస్తే...
ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్ కు స్వాగతం...

( ) భారత్, చైనా మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. భారత్ ను దారిలోకి తెచ్చుకునేందుకు చైనా శతధా ప్రయత్నిస్తుంటే... ఆ దేశ మీడియా భారత్ పై విషం చిమ్ముతోంది. అదే సమయంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. డోక్లామ్ నుంచి చైనా బలగాలను వెనక్కి వెళ్లేవరకు భారత్ బలగాలు వెనక్కి వెళ్లవని డ్రాగన్ కు భారత్ తేల్చి చెప్పింది. మొత్తం వ్యవహారాన్ని ఇరుదేశాలు పరిష్కరించుకోవాలంటూ అమెరికా హితవు పలుకుతోంది. గురువారం నుంచి జరగనున్న బ్రిక్స్ దేశాల సదస్సులో డోక్లామ్ పై రెండు దేశాలు చర్చించుకునే అవకాశం కన్పిస్తోంది. అయితే తప్పు చేస్తోంది తనైనాప్పటికీ చైనా మాత్రం వెనక్కితగ్గడం లేదు. అదే సమయంలో ఎంత వరకైనా అంటూ భారత్ సై అంటోంది. చైనాతో సమానంగా భారత్ బలగాలు లేనప్పటికీ... చైనాను ఢీకొట్టే సత్తా ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. కయ్యానికి డ్రాగన్ కాలు దువ్వుతుంటే చూస్తూ ఊర్కోమన్న సంకేతాలను భారత్ ఇస్తోంది. చైనాతో సమరానికి సై అంటోంది. రెండు దేశాల మధ్య మాటల యుద్ధం అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో చైనా, భారత్ బలగాల లెక్కలేంటి? యుద్ధ సన్నాహాలపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్

స్టోరీ 1
ఓవైపు ఆర్థిక శక్తి. మరోవైపు బలమైన సైన్యం. అణ్వాయుధ సంపత్తి. ఇలా చైనా ఆసియాలో తనను  మించినవారు మరొకరు ఉండకూడదన్న పద్ధతిలో సైన్యాన్ని ఆధునీకరిస్తూ ముందుకు సాగుతోంది. అయితే భారత్ కూడా తక్కువేమీ కాదు. చైనా అంత సైనిక సంపత్తి, అణ్వాయుధ సంపత్తి భారత్ వద్ద లేకపోయినా... భారత్ తనను రక్షించేందుకు సైన్యాన్ని, అణ్వస్త్రాలను సిద్ధం చేసుకొంది. రెండు దేశాల మధ్య సైనిక సంపత్తి బలాబలాలను ఓ సారి తెలుసుకుందా.
వాయిస్
డోక్లామ్‌ ప్రాంతంలో భారత్‌, చైనా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్టంభన.. రెండు దేశాల మధ్య సంక్షోభాన్ని పెంచుతోంది. భారత్ భద్రతకు ముప్పు కలిగించేలా చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత సైన్యం గట్టిగా అడ్డుకోవడంతో వివాదం రాజుకొంది. చైనా డొక్లామ్ నుంచి వెనుతిరేగేవరకు అక్కడ్నుంచి కదలకూడదని భారత్ భీష్మించుకొంది. నేరుగా భారత్ పై కాలుదువ్వని చైనా... ఆ దేశ మీడియా ద్వారా రోజుకో విధంగా గాండ్రిస్తూనే ఉంది. 1962లో రెండు దేశాల నడుమ జరిగిన యుద్ధంలో భారత్‌పై పైచేయి  సాధించామంటూ గూర్తుచేస్తోంది. అయితే అప్పటి భారత్ కు నేటి భారత్ కు ఎంతో తేడా ఉందని భారత్ చైనాకు గట్టి బదులే ఇచ్చింది. భారత్ డొక్లామ్ నుంచి వెనక్కి తగ్గకపోతే యుద్ధం తప్పదంటూ హెచ్చరిస్తోంది.
వాయిస్
ఓవైపు దుష్ట పాకిస్తాన్ మరోవైపు కపట చైనా రెండు వైపుల నుంచి భారత్ ను ఇరుకునపెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. భారత్ పై ఉన్న ద్వేషానికి పాకిస్తాన్ కశ్మీర్ లోని కొంత భాగాన్ని సమర్పయామి కూడా చేసుకొంది. తన వల్ల కాదని... అందుకు చైనా కరెక్ట్ అంటూ భారత్ పైకి ఎగదోస్తోంది. అయితే చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ చాకచక్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. చైనా అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని పాకిస్తాన్ కు బదిలీ చేస్తుందన్న విషయం ప్రపంచానికి మొత్తం తెలిసిన విషయమే. ఓవైపు తీవ్రవాదంతో భారత్ లో చిచ్చు రాజేస్తున్న పాకిస్తాన్... చుట్టూ ఉన్న దేశాల భూభాగాలను కబలించేందుకు ఆబాగా చూస్తున్న చైనాతో ప్రమాదం పొంచి ఉంది. దశాబ్దాలుగా జోరుగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న చైనా.. తన వనరుల్లో గణనీయమైన భాగాన్ని సైనిక విస్తరణకు, ఆధునికీకరణకు కేటాయిస్తోంది. భారీగా సైనిక శక్తిని పెంచుకుంటోంది. ఒకప్పుడు భారత్‌, చైనాల సైనిక సామర్థ్యాల్లో వైరుద్ధ్యం ఒక మోస్తరుస్థాయిలో ఉండేది. ఇప్పుడు అది బాగా పెరిగింది. ఆలస్యంగా మేల్కొన్న భారత్‌ కూడా సైనిక ఆధునికీకరణపై దృష్టి పెట్టింది. ఏటేటా తన పాటవాన్ని పెంచుకుంటోంది.
వాయిస్
ఓవైపు చైనా కాలుదువ్వుతుంటే... మరోవైపు భారత్ వైపు పాకిస్తాన్ ను రెచ్చగొట్టాలన్న కుట్ర కూడా డ్రాగన్ మదిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గ్వాదర్‌ రేవు నుంచి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ద్వారా చైనాలోకి ‘సీపెక్‌’ పేరిట ఒక ఎకనామిక్ కారిడార్ ను నిర్మించడాన్ని కూడా భారత్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌.. ఏకకాలంలో రెండు దేశాల సైన్యాలతో తలపడాల్సిన  ప్రమాదం ఉందన్న సంకేతాలను రక్షణ నిపుణులు వివరిస్తున్నారు.  చైనా చాన్నాళ్ల నుంచే సైన్యం ఆధునీకీకరణ చేపట్టింది. చుట్టు ఉన్న దేశాలను నయానో భయానో తమదారిలోకి తెచ్చుకోవాలన్న కుట్రతో డ్రాగన్ భారీగా బడ్జెట్ లను రక్షణ కోసం కేటాయించింది. అదే సమయంలో భారత్ ఎంతగా ఆధునీకీకరణవైపు అడుగులు వేస్తున్నా... అవి అంతంత మాత్రంగానే ఉన్నాయ్. బోఫోర్స్‌ కుంభకోణం దరిమిలా... 30 ఏళ్లపాటు శతఘ్నుల కొనుగోళ్ల ప్రక్రియకు విఘాతం కలిగింది. అయితే మోదీ సర్కారు ఏలుబడిలో భారత్ అమెరికా నుంచి M777 శతఘ్నులు సైన్యానికి అందుబాటులోకి వచ్చా్య్.
వాయిస్
ఆధునిక యుద్ధంలో వైమానిక దళానిది చాలా కీలక పాత్ర. శత్రు స్థావరాలపై భారీగా మెరుపు దాడులు చేయడానికి, శత్రు యుద్ధవిమానాలతో ముఖాముఖీ తలపడి కూల్చడానికి, నిఘా వేయడానికి, సహాయ చర్యలకు, ప్రత్యేక బలగాలను శత్రు స్థావరాల వద్ద సిబ్బందిని జారవిడవడం ద్వారా వాయు శక్తి ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తుంది. యుద్ధ ఫలితాన్ని ఎయిర్ ఫోర్స్ పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. భారత వైమానిక దళం.. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్దది. గగనతలంపై ఆధిపత్యాన్ని సమకూర్చిపెట్టే సుఖోయ్‌-30MKI  వంటి యుద్ధవిమానాలు భారత్ వద్ద  ఉన్నాయి. మరింత అధునాతనమైన రాఫేల్‌ యుద్ధవిమానాలు త్వరలో మన అమ్ములపొదిలో చేరబోతున్నాయి. భారత్ కు ఫైటర్ యుద్ధ విమానాలు 676 ఉండగా, చైనాకు 1271 ఉన్నాయ్. దాడి చేయగల సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాలు భారత్ వద్ద 809 ఉండగా, చైనా వద్ద 1385 ఉన్నాయ్. ఇక రవాణా చేయడానికి పనికివచ్చే విమానాలు 857 ఉండగా, చైనా వద్ద 782 ఉన్నాయ్. అదే సమయంలో శిక్షణ కోసం వినియోగించే విమానాలు భారత్ వద్ద 323 ఉండగా, చైనా వద్ద 352 సిద్ధంగా ఉన్నాయ్. భారత్ వద్ద సిద్ధంగా ఉన్న యుద్ధ విమానాలు 2102. చైనాకు అందుబాటులో ఉన్నవి 2955. గాల్లో దాడి చేసే సామార్థ్యం ఉన్న హెలికాప్టర్లు 27 ఉన్నాయ్. చైనా వద్ద ఇలాంటివి 206 ఉన్నాయ్. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునేందుకు ఉపకరించే హెలికాప్టర్లు భారత్ వద్ద 666 ఉండగా, చైనా వద్ద 912 ఉన్నాయ్.
వాయిస్
భారత్‌కు 7516 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీరం ఉంది. దీనికితోడు మన అంతర్జాతీయ వాణిజ్యం కూడా ఎక్కువ భాగం సముద్రం నుంచి సాగుతోంది. భారత్ ఆధీనంలో పలు దీవులు కూడా ఉన్నాయి. అందువల్ల సముద్రం నుంచి పొంచి ఉండే ముప్పుల నుంచి రక్షణ పొందడానికి, సాగరంలోని ప్రత్యేక ఆర్థిక మండలిని రక్షించుకోవడానికి సమర్థ నౌకాదళం మన చేతిలో ఉంది. ప్రస్తుతం భారత నౌకాదళం.. ప్రపంచంలోనే ఐదోస్థానంలో ఉంది. 1971 భారత్‌-పాక్‌ యుద్ధంలో నౌకాదళం కీలక పాత్ర పోషించింది. కరాచీ రేవుపై దాడి చేసి, పాక్‌ వెన్నులో దడ పుట్టించింది. హిందు మహా సముద్ర ప్రాంతంలో భారత్‌కు వ్యూహాత్మక ఆధిపత్యాన్ని అందించడంలో నౌకాదళానిదే కీలక పాత్ర. ఇక విమానవాహక నౌకలు భారత్, చైనా వద్ద ఒక్కటి మాత్రమే ఉన్నాయ్. ఇక జలంతర్గాములు...  ఫ్రిగేట్లు భారత్ వద్ద 14 ఉండగా, చైనా వద్ద 51 ఉన్నాయ్. విధ్వంసక నౌకలు ఇండియాలో 11 ఉంటే, డ్రాగన్ వద్ద 35 ఉన్నాయ్. చిన్న స్థాయి యుద్ధనౌకలు కార్వెట్లు భారత్ వద్ద 23 ఉండగా, చైనా వద్ద 35 ఉన్నాయ్. గస్తీ నౌకలు భారత్ చేతిలో 139 ఉండగా, చైనా వద్ద 220 వరకు ఉన్నాయ్. అణ్వాయుధాలు ఉపయోగించే సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు భారత్ వద్ద 2 ఉంటే, చైనా వద్ద 7 ఉన్నాయ్. సంప్రదాయ జలాంతర్గాముల విషయంలో చైనాదే పైచేయిగా ఉంది. భారత్ వద్ద 13 ఉంటే, అవి చైనా వద్ద 60 ఉన్నాయ్.
వాయిస్
భారత త్రివిధ దళాల్లో సైన్యానిదే వెన్నెముక. సంక్లిష్టమైన దేశ సరిహద్దులను రక్షించడంలోను, అంతర్గత భద్రతను రక్షించడంలోను పదాతి దళానిది కీలక పాత్ర.  ఇటీవల కాలంలో భారత సైన్యం రాటుదేలింది. ప్రపంచంలో మూడో పెద్ద సైనికశక్తిగా భారత్ నిలుస్తోంది. మన సైన్యంలో 35 డివిజన్లు, 13 కోర్‌లు ఉన్నాయి. చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి 90 వేల మంది సైనికులతో పర్వత ప్రాంత దాడి దళాన్ని భారత్ సిద్ధం చేసింది. సైన్యం విషయంలోనూ డ్రాగన్ దే పైచేయి. భారత్ కు 13,25,000 సైన్య సంపత్తి ఉండగా, చైనా వద్ద 23,35,000 సంపత్తి ఉంది. రిజర్వ్ దళాలు భారత్ వద్ద 21,43,000. చైనా రిజర్వ్ దళాలు 23 లక్షలు. యుద్ధ ట్యాంకులు 4,426. చైనా యుద్ధ ట్యాంకులు 6457. సాయుధ పోరాటంలో కీలకమైన శకటాలు భారత్ వద్ద 6704 ఉంటే, చైనా వద్ద 4788 ఉన్నాయ్. రిమోట్ శతఘ్నులు భారత్ వద్ద 290 ఉంటే, చైనా వద్ద 1710 ఉన్నాయ్. వాహనానికి అనుసంధానించే శతఘ్నులు భారత్ వద్ద 7414 ఉండగా, చైనా వద్ద 6246 ఉన్నాయ్. రాకెట్ ను ప్రయోగించే వ్యవస్థలు భారత్ వద్ద 292 ఉంటే, చైనా వద్ద 1770 ఉన్నాయ్.
వాయిస్
ఆర్మ్స్‌ కంట్రోల్‌ అసోసియేషన్‌ అంచనా ప్రకారం భారత్‌ వద్ద 130 అణువార్‌హెడ్లు ఉన్నాయి. అణ్వాయుధ నిల్వల విషయంలో మన దేశం ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. నేల మీద సముద్రం మీద నుంచి, సాగరగర్భంలో నుంచి అణు వార్‌హెడ్లను చేరవేసే అనేక రకాల క్షిపణులు భారత్ అమ్ములపొదిలో ఉన్నాయి. దాదాపు 16వేల కిలోమీటర్ల పరిధి కలిగిన సూర్య అనే ఖండాంతర క్షిపణిని భారత్‌ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇక భారత్ వద్ద అణు వార్ హెడ్లు 130 ఉండగా, చైనా వద్ద 260 ఉన్నాయ్. క్రూయిజ్ క్షిపణులు 400 భారత్ శక్తికాగా, చైనా వద్ద అవి 3వేలు ఉన్నాయ్. బాలిస్టిక్ క్షిపణులు 5వేలు భారత్ అమ్ములపొదిలో ఉంటే... చైనా వద్ద 13 వేల బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయ్.
వాయిస్
మొత్తంగా చైనా చాన్నాల్ల నుంచే సైన్యం ఆధునీకరణతో ఆసియాలో సూపర్ పవర్ గా ఎదగాలన్న కసితో అడుగులు ముందుకేస్తూ వచ్చింది. చైనా యుద్ధానికి కాలుదువ్వితే పరిస్థితి మరోలా ఉండటం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే యుద్ధం కేవలం సైనికుల మధ్య జరగదు. అన్ని రకాలుగా జరగడం ఖాయమనుకోవాలి. భారత్ పైకి పాకిస్తాన్ ను ఎగదోస్తున్న చైనా... భారత్ పై యుద్ధం విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయ్. భారత్ పై యుద్ధం చేసి గెలవడమంటే అది అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.

స్టోరీ 2
భారత్ తో విశాలమైన సరిహద్దు కలిగిన చైనాకు డొక్లామ్ ప్రాంతం కొరకరాని కొయ్యలా మారింది. భూటాన్ మద్దతుతో డొక్లామ్ రక్షణ బాధ్యతలో దశాబ్దాల తరబడి భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే చైనా మాత్రం డొక్లామ్ పై పట్టు కోసం రోడ్లు, మౌలిక వసతుల కల్పనంటూ కుట్రలు పన్నుతూనే ఉంది. మొన్నటి వరకు చైనా విషయంలో పెద్దగా సీరియస్ గా వ్యవహరించని భారత్ మోదీ అధికారం చేపట్టాక క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. చైనా తగ్గ తగ్గంటూ హెచ్చరికలు పంపిస్తోంది.
వాయిస్
పాకిస్తాన్ విషయంలో చూసిచూడనట్టుగా భారత్ వ్యవహరించడానికి అనేక పరిస్థితులు కలిసి వస్తున్నాయ్. అదే సమయంలో చైనా విషయంలో భారత్ చూసీచూడనట్టుగా వ్యవహరించే వీలు అస్సలే లేదు. ఎందుకంటే డ్రాగన్ బూసలతో విషం చిమ్ముతుంది. అయినదానికీ కానిదానికి భారత్ ను శత్రుదేశంగా చూపిస్తూ విచ్చలవిడితనానికి పరాకాష్టగా వ్యవహరిస్తోంది. డొక్లామ్ ప్రాంతంలోకి చొరబడిందే కాక... అక్కడ్నుంచి భారత్ వెళ్లిపోవాలంటూ కుయుక్తులు పన్నుతోంది. ఇలాంటి తరుణంలో భారత్ ఇంత వరకు గట్టిగా రియాక్ట్ అయిన దాఖలాలు అస్సలే కన్పించడం లేదు. విదేశాంగ కార్యదర్శి ఒక్కసారి మాట్లాడారు. రక్షణ మంత్రి హోదాలో అరుణ్ జైట్లీ భారత్ పాత భారత్ కాదని సంకేతాలిచ్చారు. ఇవి చిన్నవేమీకానప్పటికీ... చైనా మీడియా దూకుడు, చైనా రక్షణ శాఖ అత్సుత్సాహం ఎక్కువవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పంథా మార్చుకోవాలి. దెబ్బకు దెబ్బ ఇక్కడ ప్రామాణికం కాకపోయినప్పటికీ... చైనా విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహాన్ని విదేశాంగ నిపుణులు గత రెండు నెలలుగా వివరిస్తూనే ఉన్నారు.
వాయిస్
డోక్‌లామ్‌ పీఠభూమిలో అక్రమంగా రహదారి నిర్మాణం చేపట్టిన చైనా ప్రయత్నాలను భారత్‌ గట్టిగా అడ్డుకుని నిలవడంతో సంక్షోభం మొదలైంది. వేల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న ఇరు దేశాల మధ్య అప్పుడప్పుడూ సైనికపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయ్. 2010-17 మధ్య కాలంలో ఉభయ పక్షాల సరిహద్దుల్లో 2,500 చొరబాటు ఘటనలు జరిగాయి. వీటిలో చైనా నుంచి జరుగుతున్నవే అధికం. పాకిస్తాన్ భారత్ భూభాగంలో అడుపెట్టడానికి సహసించడం తక్కువనే చెప్పాలి. భారత్‌, భూటాన్‌, చైనాల మధ్య ఉన్న డోక్‌లామ్‌ ట్రైజంక్షన్‌ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. ఈ ప్రాంతంపై భూటాన్‌, చైనాల మధ్య వివాదం ఎప్పట్నుంచో కొనసాగుతోంది. భారత్‌కు భూటాన్‌తో సుదీర్ఘకాలంగా రక్షణ ఒప్పందం కొనసాగుతోంది. చైనాతో భారత్‌కు విశాలమైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు రేఖ పొడవునా ఒక్క డోక్‌లామ్‌ ప్రాంతంలోనే భౌగోళికంగా చైనాకంటే బాగా భారత్‌ది పైచేయిగా ఉంది. ఈ ప్రాంతంలో భూటాన్‌, ఇండియాల మధ్య చైనా ఇరుక్కుపోయినట్టుగా కన్పిస్తుంది. ఈ ప్రాంతంలో చైనా పట్టు సాధిస్తే ఈశాన్య ప్రాంతాన్ని భారత్‌తో కలుపుతున్న ‘కోడి మెడ’ చికెన్‌ నెక్‌ పై పట్టుసాధించేందుకు బీజింగ్‌ దళాలకు అవకాశం దక్కుతుందన్న అభిప్రాయాన్ని రక్షణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. డోక్‌లామ్‌లో చైనా దళాలకు భారత్‌ గట్టిగా అడ్డుచెప్పడానికి అసలు కారణమిదే. జీ-20 సమావేశంలో ఇరు దేశాధినేతలు ఒకరిపై మరొకరు ప్రశంసించుకోవడంతో... డొక్లామ్ వద్ద ఉద్రిక్తత తగ్గుతుందని అందరూ భావించారు. చైనా ఎంతకు వెనక్కి తగ్గకపోవడం... భారత్ అదే పొజిషన్లో కొనసాగుతుండటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయ్.
వాయిస్
చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్రబల శక్తిగా ఎదుగుతోంది. గతంలోలా దిగుమతులు చేసుకునే పరిస్థితి నుంచి స్వయంసావలంబన దిశగా అడుగులు వేస్తోంది. దాంతోపాటు పెద్ద ఎత్తున ఉత్పత్తి మార్కెట్లో ప్రపంచదేశాలకు సవాల్ విసిరుతోంది. ఎక్కడ చూసినా చైనా ఉత్పత్తుల వెల్లువెత్తుతోంది. దక్షిణ చైనా సముద్రంపైనా చైనా ఆధిపత్యం ప్రదర్శించాలని కపట నాటకాలను ఆడుకూనే ఉంది. వస్తు ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు మధ్యధరా, హిందూ మహా సముద్రాల ద్వారానే సాగిస్తూ... ఆసియా దేశాలను పెద్దగా ఖాతరు చేయని పరిస్థితిలో చైనా కన్పిస్తోంది. 18 లక్షలకోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను ఐరోపా మార్కెట్లకు చేరవేస్తూ...  చైనా పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యాన్ని సముపార్జిస్తుందని... విదేశీ వ్యవహారాల నిపుణులు మహేంద్రబాబు కురువ రాజ్ న్యూస్ కు వివరించారు. అదే సమయంలో భారత్ తో సహా పలు ఆసియా దేశాలు, రోడ్డు, రైలు మార్గాల ద్వారానూ ఎగుమతులను డ్రాగన్ చేస్తోంది. చైనాకు 18 దేశాలతో సరిహద్దు సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్‌ నాయకత్వం మితిమీరిన దూకుడు ప్రదర్శిస్తూ అమెరికా ఆగ్రహానికి గురవుతూనే ఉంది. అదే సమయంలో పాకిస్తాన్ కు జమ్మూ, కాశ్మీర్ విషయంలోనూ, తీవ్రవాదం విషయంలోనూ సహకరిస్తూ... భారత్ పైకి పాక్ ఎగదోస్తోంది. భూటాన్‌ను భారత్ పైకి ఉసిగొల్పుతూ... ఆ దేశాన్ని మచ్చిక చేసుకునేందుకు కుట్రలు పన్నుతోంది. భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో రేవులు, రోడ్లు నిర్మాణాలంటూ ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించాలన్న రాజ్యకాంక్షతో రగిలిపోతోంది. తాము ఎవరి దాయదాక్షాణ్యలపై ఆధారపడాల్సిన పనిలేదన్న అతి విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తోంది. ఆసియా పెద్దన్ననంటూ చుట్టూ ఉన్న దేశాలపై సవాళ్లు విసురుతోంది. అమెరికా ఆధిపత్యాన్ని అంతమొందించి... తన ప్రపంచ పెద్దన్న పాత్రలో ఇమిడిపోవాలని దాహం చైనాలో ఎక్కువవుతోంది.
వాయిస్
అమెరికా అధ్యక్షుడిగా నేలబారు నాయకుడి పీఠం అధిరోహించడంతో... ప్రపంచదేశాలపై పైచేయి సాధించాలని రష్యా, చైనా తహతహలాడుతున్నాయ్. ట్రంప్ వ్యవహారశైలితో ప్రపంచదేశాల్లో అమెరికా చులకనైతే ఆ స్థానాన్ని దక్కించుకోవాలని... మరోసారి నెంబర్ 1 స్థానాన్ని చేజిక్కించుకోవాలని రష్యా భావిస్తోంది. అదే సమయంలో చైనా కూడా ట్రంప్ తన కొంపను కొల్లేరు చేసుకుంటారని... అది తమకు అడ్వాంటేజ్ గా మారుతుందని చైనా ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉంది. అదే సమయంలో గల్ఫ్ దేశాలు ఒకరిపై ఒకరు కొట్లాడుకోవడం, ఐరోపా దేశాలు అస్థిరత్వంతో కొట్టుమిట్టాడుతునన్న నేపథ్యంలో... పరిస్థితులన్నీ తమకే అనుకూలమవుతాయని ఆదేశం కలలుగంటోంది.  అందుకే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ తో ప్రపంచ మొత్తాన్ని చేరుకోవాలని డ్రాగన్ పావులు కదుపుతోంది. ఇదంతా నాణానికి ఒకవైపే. నాణానికి రెండో వైపు కూడా చాలా సినిమా ఉందన్న విషయాన్ని చైనా మీడియా, చైనా పాలకులు మరిచిపోతున్నారు.
వాయిస్
గడిచిన పదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న భారత్... ఆసియాతోపాటు, ప్రపంచంలోనే కీలక ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తోంది. ప్రపంచాన్ని చుట్టే వన్ బెల్ట్ వన్ రోడ్... బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు అస్సలు మద్దతివ్వకుండా భారత్ చైనాను దూరం పెట్టింది. వన్ బెల్ట్ వన్ రోడ్డుతో ఆసియా దేశాలను ఆర్థికంగా చిదిమేయాలన్న డ్రాగన్ పన్నాగాన్ని భారత్ నిలువరించింది. చైనా ప్రాజెక్టుకు ఏ దశలోనూ మద్దతు చెప్పలేదు. ప్రపంచ వ్యాప్తంగా అందివస్తున్న అవకాశాలను అదిమిపట్టుకొని, విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ... సరళీకరణ ఆర్థిక విధానాలతో భారత్ దూసుకుపోతున్న పరిస్థితులను చైనా నిశితంగా గమనిస్తోంది. భారత్‌ ఆర్థిక ఎదుగుదలను సహించలేని చైనా... సందర్భం వచ్చిన ప్రతీసారి భారత్ కు ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తూనే ఉంది. పాకిస్తాన్ భారత్ పై ఇష్టానుసారం వ్యవహిరించేందుకు, తీవ్రవాదాన్ని ఎగదోసేందుకు నిధులు, ఆయుధాలను అందిస్తోంది. అదే సమయంలో అణు సరఫరా దేశాల బృందంలో భారత్‌ చేరికను ప్రతిఘటిస్తోంది. చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్ కారిడార్ తో సరిహద్దుల్లో అలజడిన రేపుతూ... భారత్ ను అస్థికపర్చాలని ప్రయతిస్తోంది. ఆ క్రమంలోనే సిక్కిం భూభాగ సరిహద్దుల్లో ఉన్న డొక్లామ్ పై చైనా కన్నుుపడింది. యుద్ధరంగంలోకి దూకి చైనాతో ప్రత్యక్షయుద్ధం చేయాలని కొందరు, భారత్‌లోకి దిగుమతి కాకుండా చైనా వస్తువులపై పూర్తి నిషేధం విధించాలని ఇంకొందరు సూచిస్తున్నారు.
వాయిస్
ఇటీవల సనాతన హిందూవాదులు చైనా ఉత్పత్తులను నిషేధించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే భారత్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఇరుదేశాల సభ్య దేశాలుగా భాగస్వాములైనందున... ఏ దేశమూ మరోదానిపై ఏకపక్షంగా ఆంక్షలు విధించడం అయ్యేపనికాదు. డోక్‌లామ్‌లో భూటాన్‌, చైనాల మధ్య తలెత్తిన ప్రతిష్టంభన విషయంలో... థింపూ నాయకత్వం తరఫున భారత్‌ జోక్యం చేసుకుంటోంది. ఈ విషయంలో ప్రభుత్వం జాగురకతో వ్యవహిరంచాలి.  బీజింగ్‌ బెదిరింపులకు, హెచ్చరికలకు ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచబోమన్న స్పష్టతనూ భారత్ నాయకత్వం ఇవ్వాల్సి ఉంటుంది. సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు దౌత్యపరమైన పరిష్కారాలు విషయంలో భారత్ కీలకంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా భారత్‌ ఇప్పుడున్న దానికంటే బలమైన ఆర్థిక, సైనిక శక్తిగా రూపాంతరం చెందాలి.  భవిష్యత్తులో మనవైపు చూడాలంటేనే చైనా వంటి దేశాలు బెంబేలెత్తిపోయేలా భారత్‌ రాటుతేలాలి. ఒకవేళ చైనా యుద్ధానికే తెగబడితే, దానివల్ల ఆ దేశానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పొరుగుదేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకునే దేశంగా చైనాకు చెడ్డపేరు ఉంది. భారత్‌తో సమరానికి దిగితే బీజింగ్‌ ప్రతిష్ట పాతాళానికు చేరుకుంటుంది.
వాయిస్
ఏదిఏమైనా అణ్వస్త్ర బలానికీ భారత్‌ మరింత పదునుపెట్టాలి. చైనా వెనక్కి తగ్గితే ఆ ప్రభావం పాకిస్తాన్ పైనా ఎక్కువగా ఉంటుంది. భారత్ చైనాను కట్టడి చేయగలిగితే... పాక్ భూతం కోరలు పీకినట్టే. భారత అమ్ములపొదిలోని అగ్ని-4ను ఈశాన్య రాష్ట్రాలనుంచి ప్రయోగిస్తే బీజింగ్‌, షాంఘైల దాకా చేరుతుంది. అగ్ని-5 ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే అయిదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను సైతం ఛేదించవచ్చు. అణ్వస్త్ర సంపన్నమైన రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే... పరిణామాలను ఎవరూ ఊహించలేరు.

స్టోరీ 3
చైనా విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. చైనా ముప్పును ముందుగానే పసిగట్టినప్పటికీ... చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంలో భారత్ ఉంది. డోక్లామ్ విషయంలో ఇప్పటికిప్పుడు తేలేది కాకపోవడంతో చైనా మీడియా భారత్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు లంఖిస్తోంది. భారత్ ను నిలువరించేందుకు ఎన్ని ప్రయత్నాలైనా చేయాలన్న ఉద్దేశంలో డ్రాగన్ భూతం కన్పిస్తోంది. ఒక అబద్ధాన్ని పది సార్లు చెబితే నిజమైపోతుందన్న దీమాతో డ్రాగన్ కుట్రలు పన్నుతోంది.
వాయిస్
చైనాలో గురువారం నుంచి జరగనున్న బ్రిక్స్ దేశాల సమావేశాలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరుకానున్నారు. బ్రిక్స్ దేశాల భద్రత-సవాళ్ల అంశంపై బీజింగ్ లో కీలక సమావేశం ఈనెల 27, 28 తేదీల్లో జరగనుంది. అజిత్ దోవల్, చైనా భద్రతా సలహాదారుతో చర్చల విషయంలోనూ క్లారిటీ కన్పించడం లేదు. డోక్లామ్ విషయంలో వాదించడానికి చైనా వద్ద ఏమీ లేదు. డోక్లామ్ ఏరియా నుంచి చైనా బలగాలు ఉపసంహరించుకునేవారకు, అక్కడ్నుంచి కదిలేది లేదని భారత్ తెగేసి చెప్పడంతో ఇరు వర్గాల చర్చలు పాజిటివ్ వాతావరణంలో జరగడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. భారత్ పై ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్న చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ బ్రిక్స్ సదస్సులో దోవల్, చైనా అధికారులతో చర్చించడం వల్ల సమస్య పరిష్కారం అయిపోదంటూ చెప్పడం ద్వారా భారత్ ను మరింత ఎగదోస్తోంది.
వాయిస్
మరోవైపు రెండు పక్షాల సైనికులు డోక్లామ్ నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారానే డోక్లామ్ సమస్య పరిష్కారం అవుతుందన్న అభిప్రాయాన్ని సుష్మ వ్యక్తం చేశారు. అయితే చైనా మాత్రం తమ బలగాలు డోక్లామ్ నుంచి కదిలేదే లేదని చెబుతోంది. అదే సమయంలో భారత్ మాత్రం డోక్లామ్ నుంచి తప్పుకోవాల్సిందేనంటూ  చైనా రక్షణ శాఖ తేల్చిచెబుతోంది. అదే సమయంలో భారత్‌ తమ గురించి తక్కువ అంచనా వేసుకోవద్దని, భ్రమల్లో ఉండొద్దంటూ చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి వు కియాన్‌ హెచ్చరించారు. పర్వతాన్ని కదిలించడం తేలికేమోగానీ, పీపుల్ లిబరేషన్‌ ఆర్మీని కదిలించడం మాత్రం చాలా కష్టమంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారు. భూటానా భూభాగాన్ని తమ భూభాగంగా చెబుతూ...  భారత సైన్యం తమ దేశానికి చెందిన భూభాగం డాంగ్‌లాంగ్‌ను దాటిందంటూ దురుసు వ్యాఖ్యలు చేస్తోంది.
వాయిస్
అదే సమయంలో ఇరు దేశాల మధ్య సందిగ్దతను తొలగించేందుకు అమెరికా ముందుకొస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో చైనా ఓవరాక్షన్ అంతకంతకూ పెరుగుతోంది. భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది. ఇరు దేశాల మధ్య చర్చల్ని అమెరికా ప్రోత్సహిస్తుందని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గ్యారీ రాస్‌ చెప్పారు. ఈ వివాదంలో అమెరికా ఎవరికి మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాలు నేరుగా సమస్య పరిష్కరించుకోవాలనే కోరుతున్నామని, ఈ అంశంపై అమెరికాకు ఎలాంటి అభిప్రాయాలు లేవని రాస్‌ పేర్కొన్నారు.
వాయిస్
మరోవైపు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై బ్రిక్స్ సదస్సులో క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది. వ్యూహాలను అమలు చేయడంలో దిట్టయిన అజిత్ దోవల్ చైనాను డోక్లామ్ విషయంలో కట్టిడి చేస్తారని భారత్ భావిస్తోంది. చైనాకు ఎంత మాత్రం సంబంధంలేని భూభాగంలో కాలుదువ్వుతున్న వైనాన్ని విడమర్చి చెప్పాలన్న ప్రణాళికను భారత్ రూపొందిస్తోంది. మరోవైపు దోవల్‌ చైనా పర్యటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు ఉపయోగపడుతుందని చైనా విశ్లేషకుడు మా జిలాయ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్జియామెన్‌లో నగరంలో జరిగే బ్రిక్స్‌ అధినేతలు సదస్సుకు సన్నాహకంగా ఎన్‌ఎస్‌ఏ అధినేతల భేటీ నిర్వహిస్తున్నారు.

ఎండ్ యాంకర్
తప్పు చేస్తున్నామన్న  విషయం చైనాకు చాలా బాగా తెలుసు. అయితే డోక్లామ్ పీఠభూమిపై ఉన్న వివాదాన్ని తమకు అనుకూలంగా మలచుకొని భారత్ ను ఆసియా ఖండంలో నిలువరించాలన్న దుష్టపన్నాగంతో సాగిస్తున్న కుట్రలకు మోదీ సర్కారు బదులివ్వాలి. ముల్లను ముల్లుతోనే తీయాలన్న డ్రాగన్ కుట్రలను అదే రీతిలో తీయాలి. చైనా విషయంలో మోదీ సర్కారు నిద్ర లేవాలి. డ్రాగన్ ను చీల్చి చెండాడాలి. ప్రత్యక్ష యుద్ధమంటూ కాలుదువ్వుతున్న చైనా రాజేస్తున్న డోక్లామ్ కల్లోలాన్ని తుదముట్టించే ప్రణాళికతో అడుగులు వేయాలి. తప్పు చేస్తున్న చైనాను ప్రపంచవేదికలపై వేలెత్తి చూపించాలి. అందుకు బ్రిక్స్ దేశాల సహాయాన్ని తీసుకోవాలి. గురువారం జరగనున్న సదస్సులో చైనా దుర్నీతిని సభ్య దేశాల కల్లకు కట్టాలి. చైనాను ఏకాకిని చేసే ప్రణాళిక దైత్యపరంగా అమలు చేయాలి. చైనా సైతం భారత్ పై విద్వేషాన్ని అంతకంతకూ పెంచుతున్న కపట నాటకానికి తెరదించాలి. ఇదీ ఇవాళ్టి ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్. మరో కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం... నమస్కారం...  

చైనా, భారత్ బలాబలాలు

http://www.eenadu.net/exclusive-news/eenadu-exclusive-news.aspx?item=ems42

Friday, 21 July 2017

చైనా

చైనాకు ముకుతాడు వేసేలా...
రు దేశాల మధ్య విభేదాలు వివాదాలుగా ప్రజ్వరిల్లకూడదన్నది భారత్‌ విధానం. పంచశీల స్ఫూర్తికి అడుగడుగునా గొడుగుపట్టి తక్కిన దేశాలన్నింటితో సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుకోవాలన్నదే భారత విదేశాంగ విధాన అంతస్సూత్రం! నెహ్రూ జమానాలో ఇండియాతో కలిసి పంచశీల ప్రవచించిన చైనా 1962లో భారత్‌పై యుద్ధభేరి మోగించి నిజనైజాన్ని ఎండగట్టుకొంది. అయిదున్నర దశాబ్దాల తరవాత డోక్‌లామ్‌ విభేదాల నేపథ్యంలో సిక్కిం సరిహద్దుల్లో నెల రోజులకు పైగా వివాదాల నెగళ్లను ఎగదోస్తోంది. ఉన్నచోటు నుంచి భారత్‌ బలగాలు వైదొలగితేనే దౌత్యపర సంప్రతింపులకు దారులు తెరచుకొంటాయని చైనా అధికార యంత్రాంగం స్పష్టీకరించడంతో, మోదీ ప్రభుత్వం తన వైఖరిని రాజ్యసభాముఖంగా తేటపరచింది. భారత్‌, చైనా, భూటాన్‌ల మధ్యగల త్రికూడలి స్థితిగతుల్ని ఏకపక్షంగా మార్చడానికి బీజింగ్‌ ప్రయత్నిస్తోందన్న విదేశాంగ మంత్రి సుష్మ- దానివల్ల ఇండియా భద్రతకు పెను సవాలు ఎదురవుతుందని వివరించారు. వివాదాస్పద ప్రాంతం నుంచి చైనా బలగాలు కూడా వెనక్కి మళ్ళినప్పుడే సానుకూల వాతావరణంలో చర్చలకు మార్గం సుగమమవుతుందని వెల్లడించారు. త్రికూడలి వద్ద సరిహద్దుల్ని ఉమ్మడిగా ఖరారు చెయ్యాలంటూ భారత్‌, భూటాన్‌, చైనాల మధ్య 2012లో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందాన్ని గుర్తుచెయ్యడం ద్వారా, చైనా సైన్యం హద్దు మీరిందనీ విశదపరచారు. డోక్‌లామ్‌ వివాదం మొదలైన వెంటనే భారత సరిహద్దులకు సమీపంగా ఉన్న టిబెట్‌ పర్వత పీఠభూమిలో చైనా సైన్యం యుద్ధవిన్యాసాల్ని సాగించినట్లు ఆ దేశ సైనిక పత్రిక వెల్లడించింది. చైనాపట్ల భారత్‌ విధానాన్ని హిందూ జాతీయవాదం పక్కదారి పట్టిస్తుంటే, దాన్ని నిలువరించేందుకు ఇండియాలోని వ్యూహకర్తలు, రాజకీయ నేతలు ఎలాంటి విజ్ఞతనూ ప్రదర్శించడం లేదంటూ చైనా ప్రభుత్వ పత్రిక అవాకులూ చెవాకులూ పేలింది. హద్దులెరుగని విస్తరణ కాంక్షతో బీజింగ్‌ రెచ్చిపోతున్నా భారత్‌ సంయమనశీలంతోనే వ్యూహాత్మకంగా చైనా దూకుడుకు పగ్గాలేయాలి!
సామ దాన భేద దండోపాయాలతో చిన్నాచితకా దేశాలను తన ఉక్కుపిడికిట్లో బంధించడం జనచైనాకు ఆది నుంచీ అలవాటు. తాను స్వాయత్తం చేసుకొన్న టిబెట్‌కు- భూటాన్‌, లడఖ్‌, నేపాల్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అయిదూ చేతివేళ్లు అని చైనా విశ్వసిస్తున్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు! కాబట్టే 1998 దాకా భూటాన్‌ను సర్వసత్తాక దేశంగా చైనా గుర్తించలేదు. చైనాతో భూటాన్‌కు ఉత్తర దిశగా రెండు చోట్ల, నైరుతి దిక్కున డోక్‌లామ్‌ పరగణాకు సంబంధించీ దశాబ్దాలుగా భూవివాదాలున్నాయి. ఆర్థిక సంస్కరణల దరిమిలా భారత్‌ పుంజుకొంటోందని గ్రహించి డోక్‌లామ్‌ పరగణాను తనకు అప్పగించేస్తే, ఉత్తర దిక్కు భూమిపై హక్కుల్ని వదులుకొంటామని 1996లోనే భూటాన్‌కు చైనా ప్రతిపాదించింది. ఇప్పటికి ఇరవై నాలుగు పర్యాయాలు జరిగిన చర్చల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండగా- భారత్‌ నుంచి భూటాన్‌ను దూరం చెయ్యడానికి డ్రాగన్‌ శతథా ప్రయత్నిస్తూనే ఉంది. టిబెట్‌తో పాటు తనను కూడా చైనా కబళిస్తుందేమోనన్న బెదురుతో భూటాన్‌ 1949లోనే ఇండియాతో స్నేహ ఒప్పందం కుదుర్చుకొంది. భారత్‌ మార్గదర్శకత్వంలోనే భూటాన్‌ తక్కిన ప్రపంచ దేశాలతో దౌత్యసంబంధాలు ఏర్పరచుకోవాలని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించి పరస్పరం సన్నిహిత సహాయ సహకారాలతో మెలగాలని ఒడంబడిక నిర్దేశిస్తోంది. వాస్తవానికి చైనా పక్కా రహదారి నిర్మాణానికి తెగించిన భూభాగం భూటాన్‌ పరిధిలోనిదే అయినా, మిత్రధర్మాన్ని మన్నించి, అంతకుమించి సిలిగురి క్యారిడార్‌ దాకా చైనా చొచ్చుకురావడం స్వీయభద్రతకు పెనుముప్పుగా భావించీ- ఇండియా అక్కడ తన దళాల్ని మోహరించింది. భారత్‌, చైనా బలగాలు రెండూ నిష్క్రమించి యథాపూర్వ స్థితి నెలకొంటేనే కదా... శాంతి చర్చలు ప్రారంభించగలిగేది!
ఇండియాకు ప్రధానంగా ముప్పు చైనా నుంచే పొంచి ఉందని పందొమ్మిదేళ్ల క్రితం రక్షణమంత్రిగా జార్జి ఫెర్నాండెజ్‌ బహిరంగంగా చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ‘ముత్యాలహారం’ మాదిరిగా ఇండియా చుట్టూ ఉన్న దేశాల్లో పాగా వేస్తున్న చైనా- టిబెట్‌లో అణ్వస్త్ర నిల్వలు పెట్టి, మియన్మార్‌లో లక్షల మంది సైన్యానికి సాయుధ శిక్షణ గరపుతోందన్న ఫెర్నాండెజ్‌ ఆనాటి వ్యాఖ్యలు, గుర్తించి తీరాల్సిన ప్రమాద సంకేతాలుగా నేడు కళ్లకు కడుతున్నాయి. 440కోట్ల మంది జనావళి ఉజ్జ్వల భవిత కోసమంటూ చైనా నాయకగణం మొదలుపెట్టిన ఒకే బెల్టు-ఒకే రోడ్డు (ఓబీఓఆర్‌) ప్రాజెక్టు లోగుట్టుమట్లను పసిగట్టిన ఇండియా, భూటాన్లు అందులో భాగస్వామ్యానికి ససేమిరా అన్నాయి. ఆ కడుపుమంటతోనే చైనా సిక్కిం సరిహద్దుల్లో తాజా వివాద కుంపటి రాజేసింది. మిత్ర దేశమంటూ భూటాన్‌ పక్షాన భారత్‌ బలగాల్ని దింపితే పాకిస్థాన్‌కు దన్నుగా కశ్మీరులో తమ సైన్యం కాలిడవచ్చునంటూ చైనా మీడియా మంటల్ని ఎగదోస్తోంది. కశ్మీర్‌ వివాదంలో మధ్యవర్తిత్వం వహిస్తామన్న బీజింగ్‌ తాజా ప్రతిపాదన ఇండియాను ఇరుకున పెట్టే వ్యూహంలో అంతర్భాగం. దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనపై శివాలెత్తిపోవడం, సిక్కిం స్వాతంత్య్రాన్ని ప్రస్తావించడం చైనా ఆభిజాత్య దురహంకారం! టిబెట్‌, తైవాన్‌, దక్షిణ చైనా సముద్రాల వివాదంపై చైనా సార్వభౌమత్వమంటూ ఒంటి కాలిమీద లేచే బీజింగ్‌- డోక్‌లామ్‌ పైనా అదే పదబంధంతో విరుచుకుపడుతోంది. అంతర్జాతీయ వేదికలపై చైనా మకురుతనాన్ని, విస్తరణ కాంక్షల చీకటి కోణాల్ని ఎండగట్టి, నిప్పులు చిమ్ముతున్న డ్రాగన్‌ను గట్టిగా నిలువరించే వ్యూహానికి మోదీ సర్కారు సానపట్టాలి. జాతి భద్రతతో ముడివడిన ఈ కీలకాంశంలో అఖిల పక్షాలూ ఒక్కతాటిపైకొచ్చి కేంద్రానికి దన్నుగా నిలవాలి!

Friday, 14 July 2017

హైదరాబాద్ ల్యాండ్ స్కామ్ ఓవరాల్


హైదరాబాద్ ఇప్పుడు భూబాకాసురల కబంధహస్తాల్లో చిక్కుకొంది. ఒకదాని తర్వాత ఒకటిగా వెలుగుచూస్తున్న భూదందాలు ఇప్పుడు భాగ్యనగర భవిష్యత్ ను ప్రశ్నిస్తున్నాయ్. దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ భూమాఫియా కోరల్లో చిక్కుకొని విలవిలాడుతోంది. మియాపూర్ భూస్కామ్ తో ఒక్కసారిగా వెలుగుచూసిన ఈ భూస్కామ్ ల పరంపరం ఒకటి  తర్వాత ఒకటి వెలుగులోకి వస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టాక ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న భూకంపాలు... ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయ్.  ప్రభుత్వ పెద్దల అండదండలతో గోల్డ్ స్టోన్ ప్రసాద్ సాగించిన మియాపూర్ భూవిలయం... ఇప్పుడు మరెన్నో కోరలు చాచి... ప్రభుత్వ యంత్రాంగాలను ప్రశ్నిస్తోంది. తాజాగా దీపక్ రెడ్డి భూకబ్జాలు ప్రభుత్వ యంత్రాంగాల వైఫల్యాలను కళ్లకుకడుతున్నాయ్. సామాన్యుడు వేల కోట్ల రూపాయల అఫిడవిట్లు సమర్పిస్తే... మన యంత్రాంగాలు ఏళ్ల తరబడి మొద్దు నిద్ర వహించాయ్. ఇక టీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కుటుంబ సభ్యుల భూకొనుగోల్లు.... స్కామ్ తీవ్రతను కళ్లకు కడుతున్నాయ్. ఇక తాజాగా రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ భూదాహం విచ్చలవిడి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఒకరేమో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతల అల్లుడు. మరొకరు టీఆర్ఎస్ పార్టీ నెంబర్ 2. ఇంకొకరు.... రాజకీయంగా అపరచాణిక్యుడు. అయితే... నగరంలోని భూదందాలపై సర్కారు ఉక్కుపాదం మోపాతున్నామంటోంది. రిజిస్ట్రేషన్లు రద్దు చేశామంటోంది. పాపమంతా అధికారులదేనంటోంది. నిప్పులేనిది పోగరాదు... అందుకే విపక్షాలు మొత్తం భూమాఫియాపై సీబీఐ విచారణ కోరుతున్నాయ్. నగరంలో జరుగుతున్న భూస్కామ్ లపై రాజ్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్...
ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు. పెద్దల సభకు ఎన్నికైన పెద్ద మనిషి.  పెద్ద మనిషి తరహాగా ఉండి వ్యవహారాలు నడపాల్సిన నాయకుడు కబ్జాకోరయ్యాడు. వేల కోట్ల రూపాయల స్థలాలను అప్పనంగా కొట్టేయడంలో అరితేరిపోయాడు. ఒకటా రెండా ఏకంగా డజను కేసుల్లో దోషిగా ఉన్నాడు.  చట్టంలో ఉన్న లొసుగులతో వేల కోట్ల రూపాయల భూములను భోంచేస్తున్నాడు. భూమిపై ఆయన కన్నుపడిందో ఇక అంతే సంగతులు. రాజధానిలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇష్టానుసారంగా దీపక్ భూములను భొంచేశాడు.  దీపక్ రెడ్డి భూబాగోతం వివరాలను ఓ సారి చూద్దాం.
దీపక్ రెడ్డి ఒకటీ ఆరా భూములను కాజేయడు. ఏదైనా ఆయనకు గ్రాండ్ గా కన్పించాలి. భూములను భోంచేసేందుకు ఆయన కడుపు మాత్రం పేద్దగా మారిపోతుంది. ఒకటా... రెండో ఏకంగా వందల ఏకరాలను కబ్జా చేసి భోంచేస్తాడు. దారిలోకి వస్తే అధికారులకు పదో పరకో ఇస్తాడు. లేదంటా ఆయన బ్యాగ్రౌండ్ చెప్పేస్తాడు. జేసీ గారి కుటుంబానికి వారసుడ్నంటాడు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పరపతి ఉందంటాడు. అనుకూలంగా ఉంటే ఓకే... లేకుండా డబుల్ ఓకే అంటాడు. భూమి లిటిగేషన్లో ఉంటే చాలు మానోడు వాలిపోతాడు. రెండు వర్గాలుగా చీలిపోయి భూమి మాదంటే మాదంటూ ఇద్దరితో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో పిటిషన్ వేయిస్తాడు. ఎవరికో ఒకరికి భూమి ధారదత్తం అయిపోతుందన్న సింపుల్ గేమ్ ప్లాన్ దీపక్ రెడ్డిది. ఆ తర్వాత కొన్నాళ్లకు భూమిని తనపై రాయించేసుకుంటాడు. ఇదీ దీపక్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ స్టైల్. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పెద్దల సభకు ఎన్నికన జేసీ వారి అల్లుడు దీపక్... చేసేవన్నీ కూడా గబ్బు పనులే. దీపక్ రెడ్డి అక్రమాల క్రమాన్ని ఓ సారి చూద్దాం... బంజారాహిల్స్ లో భూమిని కొట్టేసేందుకు ఎలా గేమ్ ఆడాడో మీరూ చూడండి.  హైదరాబాద్ లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్ కమల్ అనే శరణార్థికి చెందిన బంజారాహిల్స్ లోని 3.37 ఎకరాల భూమిని, 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అయితే, 2008లో ఆ భూమిని అక్బర్ మొహినుద్దీన్ అన్సారీ, ఖాజా మొహినుద్దీన్ అన్సారీ అనే వ్యక్తులు కొనుగోలు చేశారని దీపక్ రెడ్డి తరపు న్యాయవాది శైలేష్ సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆ భూమిని వారి నుంచి దీపక్ రెడ్డి కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలను తయారు చేశారు. తమ భూమిని ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కబ్జా చేశారంటూ ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో న్యాయవాది శైలేష్ ఫిర్యాదు చేశాడు. మొత్తం పరిణామాలు తెలుసుకున్న అసలు భూమి వారసులు... కేసు పూర్వాపరాలు తెలుసుకొని మేల్కొనేసరికి యవ్వారం చాలా దూరం వెళ్లిపోతుంది. స్థలాన్ని కొట్టేయాలని దీపక్ అండ్ కో ట్రై చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న  చౌదరి తరఫు ప్రతినిధి, రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను ఆ కోర్టులో సమర్పించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చౌదరి తరపు ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. న్యాయవాది శైలేష్ సహా దీపక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదీ బంజారాహిల్స్ కేసుకు సంబంధించి కేసు. ఆ తర్వాత సమాచారం తెలుసుకున్న దీపక్ రెడ్డి...  చౌదరి బ్రదర్స్ ఇంటికి వెళ్లి వారిని బెదిరించడం, పోలీసుల విచారణలో దురుసుగా వ్యవహరించడం వంటి కేసులు దీపక్ రెడ్డి పై గతంలో నమోదయ్యాయి.
ఇక ఆసిఫ్ నగర్ లో రూ.165 కోట్ల విలువ చేసే భూములను అక్రమంగా కొట్టేసేందుకు న్యాయవాది శైలేష్ పథకం పన్నగా... దీపక్ రెడ్డి ఆర్థిక  సహకారం అందిస్తూ... స్క్రీన్ ప్లే... డైరెక్షన్ చేశారు. అసిఫ్ నగర్ లో ఓ సొసైటీకి చెందిన భూమి తమదేనంటూ సుమారు ఏడేళ్ల క్రితం శైలేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, ప్రభుత్వానికి చెందిన వంద ఎకరాల భూమిని నిజాం నవాబ్ తమకు ఇనాంగా ఇచ్చారంటూ కోర్టుకు కొన్ని పత్రాలను శైలేష్ కోర్టుకు సమర్పించేశారు. ఈ క్రమంలో సొసైటీ సభ్యులు అసలు పత్రాలను న్యాయస్థానానికి సమర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములు శైలేష్ వి కావని పోలీసుల ప్రాథమిక ఆధారాల్లో తేలింది. శైలేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో పారిపోయాడు. అనుకూలంగా ఉంటే ఒకలా... వ్యతిరేకంగా ఉంటే మరోలా కార్యాచరణను ముందుగానే పకడ్బంధీగా అమలు చేసే దీపక్...  శైలేష్ ను సొసైటీ సభ్యులు అపహరించారంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. శైలేష్ ను తప్పించేందుకు అల్లిన కట్టుకథగా చివరకు పోలీసులు విచారణలో తేలుతుంది. అలాగే, మెహదీపట్నం బోజగుట్టలోని భూ వివాదంలో గతంలో దీపక్‌ రెడ్డిపై ఆసిఫ్‌ నగర్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీపక్‌ రెడ్డి, శైలేంద్ర సక్సేనా మరో ముగ్గురు కలిసి హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లోని విలువైన భూములపై కన్నేశారు. గుడిమల్కాపూర్‌ పరిధిలోని బోజగుట్ట ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన 78 ఎకరాల ఈనాం భూములను సొంతం చేసుకునేందుకు శైలేంద్ర సక్సేనా సారథ్యంలో మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. నిజాం నవాబుల నుంచి బహుమతిగా పొందిన భూములవి. నగరం విస్తరిస్తుండడంతో వాటి విలువ కూడా భారీగా పెరిగింది. ఆ భూముల హక్కుదారులు పాకిస్థాన్‌లో ఉన్నారు. నకిలీ పేర్లు, వ్యక్తులు, చిరునామాలతో నకిలీ గుర్తింపు కార్డులు, ఫోర్జరీ పత్రాలను సృష్టించి న్యాయస్థానం ద్వారా ఆ భూములను కొట్టేయాలని దీపక్ రెడ్డి అండ్ పావులు కదిపుతుంది. ఈనాం భూములు తమవేనంటూ రెండు వర్గాలు వేర్వేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించేలా చక్రం తిప్పాడు. న్యాయస్థానానికి సమర్పించిన డాక్యుమెంట్లు పాతవని నమ్మించేందుకు రసాయనాలను ఉపయోగించారు. ఆ భూముల వివరాలను గుర్తించాలంటూ న్యాయస్థానం రెవెన్యూ శాఖను ఆదేశించడంతో అసలు డొంక కదిలింది. వాళ్లు సమర్పించిన డాక్యుమెంట్లన్నీ నకిలీ, ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లని రెవెన్యూ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే రెవిన్యూ అధికారులు ఆసిఫ్‌ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు -2లో సుమారు 2.40 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కాజే సేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రెండు కేసుల్లో ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డిని ఐదో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సీసీఎస్‌ పోలీసులు నోటీసులు జారీ చేసినా స్పందన కరవైంది. మరో కీలక నిందితుడు శైలేంద్ర సక్సేనా పోలీసుల కన్నుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. రెండు నెలల కిందట పాతబస్తీలోని శైలేంద్ర ఇంట్లో తనిఖీలకు వెళ్లిన సమయంలో అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడు. వీరి కదలికలపై నిఘా ఉంచిన సీసీఎస్‌ పోలీసులు ఎట్టకేలకు మంగళవారం రాత్రి దీపక్‌ రెడ్డి, శేలైంద్ర, శ్రీనివా‌స్ లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు.
దొంగ ఎంత గ్రేట్ గా స్కెచ్ వేసినా ఎక్కడో చోట దొరికిపోతాడు. అవును ఇక్కడ కూడా దీపక్ రెడ్డి అలాగే దొరికిపోయాడు. ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగానే దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగలిగారు. అఫిడవిడ్ లో ఒకలా... విచారణలో మరోలా చెప్పడం కూడా దీపక్ రెడ్డి మొత్తం కేసులో దొరికిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి టీడీపీ తరఫున దీపక్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. జేసీ సోదరులైన ప్రభాకర్ రెడ్డికి... దీపక్ రెడ్డి స్వయంగా అల్లుడు. ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా పని చేసిన అధికారికి సైతం దీపక్ రెడ్డి సమీప బంధువు.  2012 ఎన్నికల్లో దీపక్‌ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకు దాదాపు రూ.7000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆయన పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.  భూ కబ్జాల కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్టు కావడం వెనుక పోలీసులు చాలా పకడ్బందీగానే వ్యవహరించారు. ఏ భూ కబ్జాల కేసుల విషయమై పోలీసులు నోటీసులు పంపించారో ఆ నోటీసులతో తనకు సంబంధం లేదంటూ దీపక్ రెడ్డి వ్యవహరించినట్టు పోలీసులు నిర్ధారించారు.  అయితే ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ పోలీసులకు కీలకమైన ఆధారంగా మారింది. హైదరాబాద్ నగరంలో వేలాది కోట్ల రూపాయాల విలువైన భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న దీపక్ రెడ్డి తన చేయితో తన కన్నునే పొడుచుకొన్నాడు. ఈ మేరకు పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ ఆయనను బుక్ చేశారు. నకిలీ పత్రాలను సృష్టించడమే కాకుండా , ఆ పత్రాల సహయంతో విలువైన భూములను కబ్జా చేయడం, వాటిపై హక్కులను దక్కించుకొని ఎక్కువ రేటుకు విక్రయించేవాడు దీపక్ రెడ్డి. బినామీ వ్యక్తుల సహాయంతో వేలాది ఎకరాల భూమిని దీపక్ రెడ్డి సొంతం చేసుకొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.  ఈ విషయమై దీపక్ రెడ్డి భూ కుంభకోణానికి సంబంధించిన సమగ్రంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. నోటీసులిస్తే సంబంధంలేదంటూ తప్పించుకొనే ప్రయత్నం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిపై భూ కబ్జాల కేసులకు సంబంధించి సీసీఎస్ పోలీసులు ఆయనకు మూడు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారంటూ పోలీసులు వద్ద బుకాయించాడు.  అయితే ఈ కేసుల విషయంలో ఆయన కోర్టు నుండి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దీపక్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్ తో పాటు ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ పై కూడా పోలీసులు కన్నేశారు. ఎన్నికల అఫిడవిట్ లో దీపక్ రెడ్డి ప్రస్తావించిన స్థిర, చర ఆస్తుల వివరాలను పరిశీలిస్తే ఆధారాలు దొరుకుతాయని పోలీసులు భావించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాసి దీపక్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ ను తీసుకొన్నారు. ఏ స్థలాలలకు సంబంధించి కబ్జాలతో తనకు సంబంధం లేదని చెప్తున్నారో...  ఆ వివరాలన్నీ అఫిడవిట్లో ఉన్నాయి. దీపక్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతో... బోగస్ డాక్యుమెంట్ల నెంబర్లను కూడా ఇచ్చారని పోలీసులు నిర్ధారించారు. ఈ అఫిడవిట్ ఆధారంగా దీపక్ రెడ్డిపై చర్యలు తీసుకొన్నారు.
2012 నాటికే దీపక్ రెడ్డిపై పలు ఫిర్యాదులు పోలీసులకు అందాయి. బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం, భూకబ్జాలకు సంబంధించినవి  ఈ కేసులు.ఈ ఏడాది మార్చిలో ఒక ఫోర్జరీ కేసు కూడా ఆయన మీద నమోదయ్యాయి.  అలాగే, ఫోర్జరీ డాక్యుమెంట్లతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లో 3.37 ఎకరాలను ఆక్రమించినట్లు దీపక్‌ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే, 2012లోనే ఆయన 6200 ఎకరాలకు సంబంధించిన 11 సివిల్‌ వివాదాల్లో ఇరుక్కుని ఉన్నారు. దీపక్ రెడ్డి గ్యాంగ్ పై మరో కేసు నమోదు బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీపక్ రెడ్డి గ్యాంగ్ పై ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న 898.3 చదరపు గజాల స్థలంపై బోగస్ డాక్యుమెంట్లను సృష్టించి తన పేరుపై మార్చుకొన్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ స్థలం బాలయ్య అనే వ్యక్తి యజమాని అంటూ దీపక్ రెడ్డి, శైలేష్ సక్సేనాలు నకిలీ సర్టిపికెట్లు సృష్టించారు. బాలయ్య అనే వ్యక్తి రాధాకృష్ణ ఠాకూర్ కు 16.4.1987 లో భూములను విక్రయించినట్టు డ్యాక్యుమెంట్లను సృష్టించారు. మావూరి శివభూషణాన్ని రాధాకృష్ణ ఠాకూర్ గా మార్చాడు. 8.11.2006 లో ఠాకూర్ ఈ స్థలాన్ని దీపక్ రెడ్డి పేరుత్ సేల్ కమ్ జీపీఏ చేశారు. కొన్ని మార్పుల కోసం 2008 మార్చిలో దీపక్ రెడ్డి పేరుతోనే మరో ర్యాటిఫికేషన్ డీడ్ చేయించారు. ఈ పత్రాలపై న్యాయవాది సక్సేనా సాక్షి సంతకం చేశారు. ఈ పత్రాలను చూపి ఓ బ్యాంకు నుండి రూ.6 కోట్లను లోన్ గా తీసుకొన్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  శైలేష్ సక్సేనాలకు సంబంధించిన ఆయుధ లైసెన్సులపై సీసీఎస్ పోలీసులు దృష్టి సారించారు.  శైలేష్ సక్సేనాకు 2011 లో ఆయుధ లైసెన్స్ మంజూరైంది. ఆయన రెండు ఆయుధాలను కొనుగోలు చేశారు. నేరచరితులకు ఆయుధ లైసెన్సులు మంజూరు చేయకూడదన్న నిబంధన మేరకు...  శైలేష్ ఆయుధ లైసెన్స్ ను రద్దు చేయాలని సిఫారస్ చేస్తూ మొఘల్ పురా ఉన్నతాధికారులు పోలీసులకు లేఖ పంపారు.
దీపక్ రెడ్డికి తనను పోలీసులు అరెస్టు చేస్తున్నారన్న విషయం తెలియదా... ఒకవేళ విచారణ చేసినా... తన మార్క్ ట్రిక్స్ తో పోలీసులు కన్నుగప్పొచ్చనుకున్నారా? ఏపీ ప్రభుత్వం తనను కాచుకుంటుందనుకున్నారా... అయితే మొత్తం వ్యవహారంలో అంతా తెలిసీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకానీ, పోలీసులు గానీ ష్... గప్ చుప్ లా ఎందుకుండిపోయారు? దీపక్ రెడ్డిని అరెస్టు చేయాలంటే బలమైన ఆధారాలు కావాలి. ఇప్పటికే ఎన్నో కేసుల్లో పోలీసుల కన్నుగప్పి తప్పించుకుంటున్న దీపక్ విషయంలో పోలీసులు ఎంతో పకడ్బంధీ వ్యూహాన్ని అమలు చేశారు. మొత్తం వ్యవహారంలో ఏపీ ఎలా రియాక్ట్ అవుతుందో పరిశీలిస్తూ ముందడుగేశారు. దీపక్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సీసీఎస్ పోలీసులు సేకరించారు.  ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులకు అందించడంతో కేసు విచారణ ముందుకు సాగింది.  హైదరాబాద్ సెంట్రల్ క్రెం స్టేషన్ అభ్యర్థన మేరకు దీపక్ రెడ్డి గురించి సమగ్ర సమాచారాన్ని ఆంధ్ర అధికారులు అందించినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. అధికార పార్టీ ఎమ్మెల్సీ గురించి తెలంగాణా ప్రభుత్వం ఆంధ్ర అధికారుల సహాయంతో కూపీలాగుతున్నపుడు అది ప్రభుత్వపెద్దలకు కచ్చితంగా  తెలిసే అవకాశం ఉంది. అయితే దీపక్ రెడ్డి అరెస్టు అయ్యే వరకు ఎక్కడా కూడా ఈ విషయం ఎక్కడా లీక్ కాలేదంటే... దీపక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోవాలనుకొంది. ఇప్పటికే  దివాకర్ ట్రావెల్స్ పై విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం అనవసరమైన తలనొప్పి ఎందుకన్న భావనలోకి వెళ్లింది.   మరోవైపు ఓటుకు నోటు కేసు వ్యవహారం కూడా ఉండటంతో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు.
ఇండియాలో బహుశా ఏ రాజకీయ నాయకుడూ... పేర్కొనంతా అస్తుల విలువ ఎన్నికల అఫిడవిట్ లో దీపక్ రెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం ఉపఎన్నికల సందర్భంగా దీపక్  రెడ్డి సుమారు రూ. 7 వేల కోట్ల ఆస్తుల లెక్కను విప్పాడు. 2009-10 అసెస్మెంట్ ఇయర్ లో  ఆదాయం కేవలం రు. 3.27 లక్షలుగా చూపించారు. ఆయన భార్య ఆదాయం కూడా... రూ. 1.98 లక్షలు మాత్రమే. దీపక్ రెడ్డి అరెస్టుకు అంధ్రా అధికారులు సహకరించడం, ఇది బయటకు పొక్కకుండా రహస్యంగా దాచడం వెనక  బలమయిన రాజకీయ కారణాలున్నాయంటున్నారు. దీపక్ రెడ్డి బాగా రాజకీయ, డబ్బు ప్రాబల్యం ఉన్ననేత.  రాయదుర్గం నేమకల్ దగ్గిర మైనింగ్, క్రషింగ్ వ్యాపారాలు ఉన్నాయి. జేసీ బ్రదర్స్ అల్లుడు. అంతా బాగానే ఉన్నప్పటికీ... రాయదుర్గంలో స్థానికంగా ఉన్న నాయకత్వ సమస్యల విషయంలో కూడా... దీపక్ అరెస్టు విషయాన్ని ఏపీ పెద్దగా పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉంది. కాలవ శ్రీనివాసులు ముఖ్యమంత్రికి చాలా ఇష్టుడయిన నాయకుడు.  కాలవ శ్రీనివాసులు స్థానాన్ని డబ్బుతో అస్థిరపరిచేందుకు దీపక్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడన్న అనుమానాలు పార్టీ వర్గాలు ఉన్నాయ్. ఇప్పటికే జిల్లాలో రెడ్డి సమాజికవర్గం నుంచి పల్లె రఘునాథరెడ్డిని తప్పించి కాలువకు సీఎం చంద్రబాబునాయుడు మంత్రి పదవి కట్టబెట్టారు.
కొసమెరుపేంటంటే... భూ కబ్జా కేసులో తనను కుట్ర పూరితంగా ఇరికించారని చెబుతున్నారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బెయిల్ పై వచ్చాక అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పుకొస్తున్నాడు.
మరోవైపు టీఆర్ఎస్ పార్టీ కీలక నేత కె కేశవరావు కుటుంబ సభ్యులకు సంబంధించి మరో భూలావాదేవీ ఇప్పుడు సంచలనమవుతోంది. వందల కోట్ల రూపాయాల విలువైన భూములను కేకే కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్టర్ కావడం... దాని వెనుక గోల్డ్ స్టోన్ ప్రసాద్ హస్తమున్నట్టుగా వార్తలు వస్తున్నాయ్. అయితే కేకే మాత్రం తాను అన్నీ నిర్ధారించుకున్నాకే భూములు కొనుగోలు చేశానంటున్నారు.
మరో  భూ స్కాం వెలుగులోకి వచ్చింది... ఈసారి అధికార పార్టీ సీనియర్ నాయకుడు కె.కెశవరావు భూ వివాదంలో చుక్కుకున్నారు. ప్రభుత్వ భూములను కె.కె తన కుటుంబ సభ్యుల పేర్లపై  రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చర్చనీయంశమవుతోంది.  కె.కె కుటుంబ సభ్యులకు ఇబ్రహీంపట్నంలోని దుండుమైలారం లో రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటకు పొక్కింది. అయితే కేశవరావు మాత్రం ఇది ప్రభుత్వ భూమి కాదరని కోర్టు, కలెక్టర్ ఆదేశాల మేరకే భూములు కొనుగొలు చేశానంటూ దబాయిస్తున్నాడు. భూముల కొనుగోలుకు సంబందించి డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు.  మియాపూర్ భూ స్కాం నిందితులతో పోలీసులు విచారణ తీవ్రతరం చేశారు. రాజధానిలో ఎక్కడెక్కడ  భూములు కబ్జా అయ్యేయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో గోల్డ్ స్టోన్ పార్థసారధి నోరు విప్పడంతో కె.కె కుటుంబం భూ స్కాం బయటపడింది. ఇబ్రహీంపట్నం దండుమైలారంలో ప్రభుత్వ భూమిని గోల్డ్ స్టోన్ కంపెనీ దొంగ పత్రాలతో చేసిన బాగోతం బయటకు పొక్కింది. సర్వే నెంబర్ 36లోని 50 ఎకరాల భూమిని గోల్ట్ స్టోన్ కంపెనీ జీపీఏ చేసుకొంది. గోల్డ్ స్టోన్ ప్రతినిధులు 50 ఎకరాలలో 38 ఎకరాల ప్రభుత్వ భూమిని కేశవరావు తన కుమారై గద్వాల విజయలక్ష్మీ, కొడలు జ్యోత్స్న, కంచర్ల నవజ్యోతిల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. దీని దర్యాప్తు చేపట్టిన అధికారులు కేశవరావు కుటుంబ సభ్యులకు రిజిస్టేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ సాలేహా ఖాదీర్ ను సస్పెండ్ చేయడంతో అసలు కథ బయటపడింది. తీగలాగితే డొంక కదిలినట్టుగా గోల్డ్ స్టోన్ భూబాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయ్.  ఇబ్రహీంపట్నం దండుమైలారం హఫీజ్ పూర్ లో 2244 ఎకరాల అసైండ్ భూమి ఉంది.  అప్పటి ప్రభుత్వం 1965 లో ప్రభుత్వం 422 ఎకరాల భూమిని పట్టాలతో ప్రజలకు పంచి ఇచ్చింది. ఆ తరువాత గోల్డ్ స్టోన్ కంపెనీ దీని పై కన్నేసింది. సర్వే నెంబర్ 36 యొక్క భూమిని వివరాలను సేకరించింది. ఖాళీగా ఉన్న 50 ఎకరాల భూమిని గోల్డ్ స్టోన్ కంపెనీ అక్రమంగా జీపీఏను చేసుకొంది.
50 ఎకరాల భూమిని 36 ఎకరాలను కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ, కోడలు జ్యోత్స్న, కంచర్ల నవజ్యోతి,  గోల్డ్ స్టోన్ కంపెనీ ప్రతినిధులు 2015లో రిజిస్టేషన్ చేయాల్సిందిగా దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే మొత్తం వ్యవహారం తెలిసిన నాటి సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి ఈ దరఖాస్తును పక్కనబెట్టారు. భూలావాదేవీలో అవకతవకలు ఉన్నాయన్న అనుమానంతో పెండింగ్ లో పెట్టారు. ఆ భూమిపై కన్నేసిన బడాబాబులు... ఆ తర్వాత భూమిని తమ పరం చేసుకునే పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేశారు. ఆయనపై బదిలీ వేటేసి... సీనియర్ అసిస్టెంట్ సాలేహా ఖదీర్ ద్వారా...  పెండిగ్ లో ఉన్న వ్యవహారాన్ని చక్కబెట్టేసుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు ఖదీర్ అక్రమంగా రిజిస్టేషన్ చేశాడని గుర్తించి ఆయనపై సస్పెన్షన్ వేటేశారు. అంతా తెలిసిన కేశవరావు మాత్రం తాము అంతా రూల్స్ ప్రకారమే వ్యవహరించాంటూ భూకొనుగోలును వెనకేసుకొస్తున్నారు. మొత్తం వ్యవహారమంతా ఇంతలా బట్టబయలైనా... కేశవరావు మాత్రం తమ కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కొనుగోలు చేయలేదని...   హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించాకే కొనుగోలు చేశామంటూ చెబుతున్నారు. కోర్టు అదేశాల మేరకే ఈ భూమిని రిజిస్టేషన్ చేయించుకున్నామంటున్నారు. అయితే కేశవరావుకు భూములను జీపీఏ చేసిన గోల్డ్ స్టోన్ కంపెనీకి, కేశవరావుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో ఎంతో చర్చ నడుస్తోంది. రాజకీయంగా కేశవరావు ఎదుగుదలకు గోల్డ్ స్టోన్ పాత్ర చాలా పెద్దదేనని వారి గురించి తెలిసినవారు చెప్తారు.
అధికారం మీ కేరాఫ్ అడ్రస్ అయితే వారు మీకు వొంగి వొంగి సలామ్ చేస్తారు. చట్టం వీరికి ఇష్టమొచ్చినట్టుగా ఫ్లెక్సీగా మారుతోంది. సామాన్యులకు చట్టం చట్టంలానే పనిచేస్తోంది... అయితే అసామాన్యులకు  మాత్రం చుట్టమైపోతోంది. అధికార పార్టీ నేత డి శ్రీనివాస్ వ్యవహారంలోనూ ఇదే జరిగింది. ప్రభుత్వ భూముల పేరుతో ఎవ్వరికీ కూడా రిజిస్టర్ చేయని భూములు మన ఘనత వహించిన నాయకుడికి మాత్రం దర్జాగా రిజిస్ట్రేషన్ చేసేస్తారు.   తెలంగాణలో భూకంప తీవ్రత సునామీలా మారుతోంది. ఏవైపు నుంచి ఏ సంక్షోభం వస్తుందో అర్థం కాక అధికార పార్టీకి వణుకిపోతోంది. ఇప్పటికే మియాపూర్ స్కామ్ ఆ తర్వాత కేకే భూముల వ్యవహారంతో ప్రభుత్వానికి తలబొప్పి కట్టగా... తాజాగా రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ భూమాయ ఇప్పుడు సంచలనం రెకెత్తిస్తోంది. డీఎస్ పేరు ఎప్పుడు ఎన్నికల సీట్లు కేటాయింపు సమయంలోనే బయటకు వచ్చేది. రెండుసార్లు పీసీసీ చీఫ్ గా ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరి... గులాబీ పార్టీలో చక్రం తిప్పుతూ భూస్కామ్ లో చిక్కుకున్నారు.
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ భూమిని డీఎస్ కొనుగోలు చేశారు. గతంలో ఈ భూమిని కొనుగోలు చేసేందుకు పలువురు ప్రయత్నించినా... అవి ప్రభుత్వ భూములని చెప్పిన అధికారులు... డీఎస్ కొనుగోలు చేసేసరికి... ఎస్ చెప్పేశారు.  మేడ్చల్ మండలం గిర్మాపూర్ గ్రామ పరిధిలోని గౌడవెల్లి - రాయిలాపూర్ రోడ్డులో సర్వే నెంబరు 221లో 8.9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. నాటి ప్రధాని ఇందిరా గాంధీ... గిర్మాపూర్ గ్రామంలోని భూమిని  నిరుపేదలకు పంచిపెట్టారు. అయితే ఈ భూమిని 1972-73లలో అదే గ్రామానికి చెందిన బొక్క యాదిరెడ్డి అనే రైతు కొనుగోలు చేశాడు. మూడేళ్ల తర్వాత యాదిరెడ్డి నుంచి... ఆ భూములను సోదరుడు రాజిరెడ్డి కొనుగోలు చేశాడు.  ఆయన మృతి చెందిన తర్వాత ఆ భూములు సాయిరెడ్డి.. బల్వంత్ రెడ్డి.. రఘుపతిరెడ్డి పేర్ల మీద తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా దఖలుపడే ఆస్తి హక్కుగా 'విరాసత్' చేశారు. అయితే గిర్మాపూర్ భూములు అసైన్డ్ భూములు కావడంతో వాటిని అనుభవించవచ్చుగానీ... అమ్మడానికి మాత్రం అవకాశం ఉండదు. అసైన్డ్ భూమి మీద హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. ఇతరులకు అమ్మే హక్కు ఉండదు. అందుకే భూములను కొనుగోలు చేసినప్పటికీ అవి కాగితాలపైనే ఉంటాయి కానీ రికార్డుల్లో మాత్రం ఉండవు.  అసైన్డ్ దారుల నుంచి చేతులు మారిన భూమిని వెనక్కి తీసుకునేందుకు అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ తలనొప్పి మాకెందుకనుకున్న వారసులు... ఆ భూమిని అమ్మేస్తే పోలా అనుకొని... రాజ్యసభ సభ్యుడు డీఎస్... ఆయన అనుచరుడు ఎ.వి. సత్యనారాయణ రావుకు 2015లో అమ్మేశారు.
వారసులకు భూమి కేటాయించినప్పుడే... ఆ తరహా విధానం చెల్లదంటూ తేల్చిచెప్పిన రిజిస్ట్రేషన్ అధికారులు... డీఎస్ కు మాత్రం భూములను కట్టబెట్టేశారు. ఆయన ప్రభుత్వంలో పెద్ద మనిషి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితుడు కావడంతో... రిజిస్ట్రేషన్ చకచకా చేసేశారు. డీఎస్ పేరిట నాలుగు ఎకరాలు.. ఎ.వి. సత్యనారాయణ పేరిట రెండు ఎకరాలు రిజిస్ట్రేషన్ ను మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తతంగాన్ని పూర్తి చేశారు.  అనంతరం ఈ ఏడాది జనవరిలో...  భూములు మావేనన్నట్టుగా అధికారం కట్టబెట్టే... 'మ్యుటేషన్' కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ చేయటానికి ససేమిరా అన్నారు. చేతులు మారిన అసైన్డ్ భూముల్ని వెనక్కి తీసుకునేందుకు మరోసారి నోటీసులు జారీ చేశారు. దీంతో విషయం బయటకు పొక్కింది. డీఎస్ నాడు ఎకరాన్ని రూ. 14 లక్షలకు కొనుగోలు చేయగా... ఇప్పుడా భూమి... కోటి రూపాయల వరకు పలుకుతోంది. ప్రభుత్వ భూములు పక్కదారి పట్టే అవకాశం లేదంటూ సీఎం కేసీఆర్ కుండబద్ధలు కొడుతున్నప్పటికీ... ఇక్కడ ఎవరి ఇష్టానుసారం వారు... తమ పనులను చక్కబెట్టేసుకుంటున్నారు.
రాజధానిలో రోజుకో భూస్కామ్ జరుగుతుంటే... విచారణపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు...  వరుసగా ఒకదాని తర్వాత ఒకటి స్కామ్ బయటకు వస్తున్నా... ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేయడం... అరెస్టులతో మొత్తం వ్యవహారాన్ని సరిపెట్టుస్తున్నారా? సీఐడీతోగానీ, సీబీఐతోగానీ విచారించాలన్న విమర్శలకు సర్కారు ఎందుకు ముందుకు రావడం లేదు.  మియాపూర్ భూకుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మియాపూర్ పరిధిలో ఇంతటి స్కామ్ చేస్తున్నారంటే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగదు అంటూ అందరూ చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం... కుంభకోణాన్ని కనుక్కున్నదే మేమంటూ సమాధానమిస్తోంది. అయితే విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి కదా... విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తోందంటూ విపక్షాలు మండిపడుతున్నాయ్. ఇప్పటికే మియాపూర్ స్కామ్ కు సంబంధించి ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీలు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నాయ్.  స్పాట్
నగరంలో జరుగుతున్న భూకుంభకోణాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించదని కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబడుతున్నారు. ప్రభుత్వ పెద్దల పాత్ర ఉండటం వల్లే మొత్తం వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ్ చేస్తున్నారంటూ పార్టీ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికే మియాపూర్ భూములను సందర్శించి దోషులను శిక్షించాలంటూ ఫిర్యాదులు సైతం చేశారు.
మియాపూర్ భూకుంభకోణం వెలుగుచూసి మూడు వారాలు అవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతవరకు దానిపై స్పందించకపోవడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపడుతోంది. ప్రభుత్వంలో పెద్దలెవరి అండదండలు లేకుండా ఇంత పెద్ద భూకుంభకోణం జరపడం సాధ్యం కాదని...  ఆ పార్టీ నేతలు రమణ, రేవంత్ రెడ్డి స్పస్ష్టం చేస్తున్నారు.  సీఎం కేసీఆర్ పేషీలో పనిచేస్తున్న ఒకవ్యక్తి ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు సమీప బంధువని... వారే తెర వెనుక ఉండి ఈ కధ అంతా నడిపించారని విమర్శించారు.  ఎంసెట్ లీకేజ్ కేసును, తరువాత నయీం కేసులను ముఖ్యమంత్రి కేసీఆర్ అటకెక్కించేశారు. ఇప్పుడు మియాపూర్ కేసూ కూడా అంటూ వారు విమర్శిస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన మియాపూర్‌ భూ కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అధికారులపై సస్పెన్షన్‌తో ఏమీ కాదని, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్‌ చేశారు. భూ కుంభకోణానికి పాల్పడిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ అన్నారు.  దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన దీన్ని సీబీఐకి కాకుండా సీఐడీకి అప్పగించడంలో రహస్యమేంటని ప్రశ్నించారు. రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేసి, మరి కొంతమంది రిజిస్ట్రార్లను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
భూకుంభకోణాలతో వేల కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే... ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోందని... టీజీఏసీ కన్వీనర్ కోదండరామ్ దుయ్యబట్టారు.
అధికార పార్టీ నేతల అండదండలతో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు గద్దల్లా తన్నుకుపోతున్నా పాలకులు ఉదాసీనంగా ఉండటాన్ని టీజేఏసీ మండిపడుతోంది. కబ్జాకోరులు రాబందుల్లా సర్కారు భూములపై వాలిపోతున్నా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని టీ జేఏసీ నేతలు నిర్ణయించారు. మియాపూర్ భూకుంభకోణంపై ప్రభుత్వం మౌనం వహించడంతో  ప్రతిపక్షాలు మండిపడుతున్నాయ్.  అయితే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి... సమస్య లేకపోయినప్పటికీ... జనంలో మాత్రం అనుమానాలు మొదలయ్యాయ్. అద్భుతంగా పనిచేస్తున్నామంటూ టీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ...  అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయ్. మియాపూర్ భూకుంభకోణంపై ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవడం మంచిదన్న అభిప్రాయం ఎక్కువవుతోంది.
మరోవైపు  ప్రభుత్వం మాత్రం... మొత్తం భూ లావాదేవీలు ఏవీ కూడా ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పద్ధతి ప్రకారం జరగలేదని స్పష్టం చేస్తోంది. మియాపూర్, బాలానగర్, ఇబ్రహీపట్నం, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో జాగీరు భూములపై హక్కులు సంపాదించడానికి కొంతమంది చేసిన ప్రయత్నం వల్ల ఎక్కడా ఖజానాకు రూపాయి కూడా నష్టం కలగలేదని, గజం భూమి అన్యాక్రాంతం కాలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అదే సమయంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని... సీబీఐ విచారణ ఎంత మాత్రం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్లు జరిగే విధానంలోనే లోపముందని, ఈ వ్యవహారంలో ప్రక్షాళన జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.  మియాపూర్‌, బాలానగర్‌, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో తప్పుడు భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా శిక్షించి తీరుతామంటూ...  ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.  ఇటీవల జరిగిన పరిణామాలను ఒక అవకాశంగా తీసుకుని రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అధికారులను ఆదేశించినట్టుగా ప్రకటనలో తెలిపింది. జాగీర్ భూములపై హక్కు పత్రాలు సృష్టించుకుని ప్రభుత్వ భూములను కాజేయాలని చూసే ప్రయత్నాలను అన్ని కోణాల నుంచి ఎదుర్కోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. సుప్రీంకోర్టులో వీటికి సంబంధించిన కేసులు నడుస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టుకు పూర్తి వివరాలు అందించాలని సీఎం చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే నేరుగా వివరాలు పంపి, కేసు విచారణ సందర్భంగా పూర్వాపరాలను పరిగణలోకి తీసుకునే విధంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మియాపూర్ లో 810 ఎకరాల ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు లిటిగేషన్ రైట్స్ కల్పిస్తూ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవానికి ఇది భూమి బదలాయింపు... ట్రాన్సఫర్ ఆఫ్ ల్యాండ్ అని రిజిస్ట్రేషన్ కాదని... లిటిగేషన్ రైట్స్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రమేనని ప్రభుత్వం వివరించింది.  ఒక వేళ అది భూ బదలాయింపు రిజిస్ట్రేషనే అయితే, మొత్తం భూమి విలువకు రిజిస్ట్రేషన్ చార్జి రూ. 415 కోట్లు చెల్లించాల్సి ఉండేదని... ఈ రిజిస్ట్రేషన్ కోసం రూ.60 లక్షలు మాత్రమే ఫీజుగా వసూలు చేశారని... ఎంతో కొంత కట్టాలి అన్నట్లు కట్టారు తప్ప...  ఈ చార్జి  ప్రాతిపదికన కాదని ప్రభుత్వం నిర్ధారించింది.  ఇక ఈ  భూమిని  స్థిరాస్తి...  ఇమ్మూవబుల్ ప్రాపర్జీగా  రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందని... అంటే భూమి బదలాయింపు రిజిస్ట్రేషన్ బుక్ 1లో చేయాల్సి ఉన్నా...  చరాస్తిగా... మూవబుల్ ప్రాపర్టీగా  బుక్ 4లో రిజిష్టర్ చేశారని అందువల్లే ఈ రిజిస్ట్రేషన్ కు ఏమాత్రం విలువలేదని ప్రభుత్వం చెప్పింది. సివిల్ కోర్టుల నుంచి హైకోర్టు వరకు ఎక్కడా వారి వాదన నెగ్గలేదు. దీంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ కేసులో వాదనకు బలం చేకూరడానికి ఈ హక్కు పత్రాలు సంపాదించడానికి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన అధికారిని, బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మియాపూర్ తో పాటు మరో ఏడు గ్రామాల భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిష్టర్ చేసిన వ్యవహారం కూడా ఇలాగే ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ కూడా భూమి బదలాయింపు రిజిస్ట్రేషన్ జరగలేదని... భూమిపై లిటిగేషన్ హక్కులకు రిజిస్ట్రేషన్ జరిగింది. కేవలం రూ.8లక్షలు తీసుకుని మొక్కుబడి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయ్. మియాపూర్ తరహాలోనే ఇక్కడ కూడా వ్యవహరించినట్టుగా ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో మియాపూర్, మరియు 7 గ్రామాలు అని పేర్కొన్నారు తప్ప ఆ గ్రామాల పేర్లు రాయలేదు. ఎన్ని ఎకరాలో రాయలేదు. పైగా ఇవి కూడా ప్రభుత్వ భూములే కాబట్టి, ఈ రిజిస్ట్రేషన్ కూడా చెల్లదని.... ఇక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి నష్టం జరగలేదని.... ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాలేదని స్పష్టం చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్టుగా పేర్కొంది. పై రెండు ప్రాంతాల్లోనే కాకుండా, మిగతా చోట్ల జరిగిన వ్యవహారంపై కూడా పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.  జాగీరు భూములు రద్దయిప్పటికీ... ఇంకా వాటిపై హక్కులున్నాయని పత్రాలు సృష్టించుకోవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి కొందరు సబ్ రిజిస్ట్రార్లు సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదని, ఎంతటి వారినైనా శిక్షించి తీరుతుందని సీఎం స్పష్టం చేశారు. జాగీరు భూములు రద్దయ్యాయని, వాటిపై ప్రభుత్వానికే తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులుండవని సీఎం స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా, మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ వ్యవహారంలో కుంభకోణం ఏమీలేదని, ఎక్కడా ప్రభుత్వానికి నష్టం కలగలేదని ప్రభుత్వం నిర్ధారించుకున్నది. అయితే ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొంతమంది అవకతవకలకు పాల్పడినట్లు కూడా వివరించింది.
హైదరాబాద్ లో బయటపడుతున్న భూకుంభకోణాలు ఒక్కొక్కటిగా బెంబేలెత్తిస్తున్నాయ్.  మొన్న మియాపూర్ ల్యాండ్ స్కామ్, ఆ తర్వాత దీపక్ రెడ్డి వ్యవహారం, నిన్న కేకే భూముల కొనుగోలు వ్యవహారం... తాజాగా రాజ్యసభ్యుడు డీఎస్ అసైన్డ్ భూముల కొనుగోలు  ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేల కోట్ల రూపాయల విలువ చేసే భూస్కాములు బయటపడుతూనే ఉన్నాయ్. పవర్ ముందు సాగలబడే అధికారులతో ప్రభుత్వ పెద్దలు తమ పనులు కానీచ్చేస్తున్నారు.  కాసులిస్తే... ఏదైనా జరిగిపోతుందన్న అభిప్రాయం కలిగించేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏం జరగలేదంటూ... కేవలం అధికారుల తప్పుతోనే ఇవి జరిగాయంటూ సర్దిచెప్పే  ప్రయత్నం చేస్తోంది. అంటే ప్రభుత్వ పెద్దలకు ఇందులో ఎలాంటి పాత్ర లేదన్న అభిప్రాయాన్ని సర్కారు వ్యక్తం చేస్తోంది. అయితే ఎకౌంటబులిటీ ఉండాల్సిన నేతలు... ఇష్టానుసారం వ్యవహరిస్తే... అది మియాపూర్, బాలానగర్, ఇబ్రహీంపట్నం భూమాయలవుతాయ్. మేడ్చల్ దందాలూ అవుతాయ్. అధికారుల కనుసన్నల్లో... పాలకులను అంటకాగుతూ జరుగుతున్న స్కామ్ లకు ఫుల్ స్టాప్ పడకుంటే కేసీఆర్ సర్కారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా సిజేరియన్లు

130 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ.... 130 కోట్ల జనాభా... ఒక్కో మనిషికి లక్ష రూపాయలన్నమాట...  ఇదీ భారత ఆర్థిక వ్యవస్థ బలం... మన దేశ జనాభా బలం. ఇప్పుడు దేశమంతా ఒకటే మంత్రాన్ని జపిస్తోంది. ఒకే దేశం... ఒకే పన్ను... ఒకటే మార్కెట్... ఇదీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వస్తు సేవల పన్ను జి.ఎస్.టి ద్వారా తీసుకొచ్చిన సరికొత్త విధానం...  ఎన్నాళ్లో వేచిన ఉదయం... దేశమంతా ఒకటే పన్ను విధానం దేశంలో అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అర్ధరాత్రి వస్తు సేవల పన్నును రాష్ట్రపతి, ప్రధాని మీటనొక్కి అమల్లోకి తెచ్చారు. వన్ నేషన్... వన్ ట్యాక్స్... వన్ మార్కెట్ దేశ ప్రజలకు  ఏవిధంగా మేలు చేస్తుంది... దేశంలో సమూల మార్పులకు దోహదకారిగా ఎలా నిలవబోతుందన్నదానిపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్...  జీఎస్టీలో అపోహలు ఎక్కువ... క్లారిటీ తక్కువ...
జీఎస్టీ ఇప్పుడో బ్రహ్మపదార్థంలా మారింది. వస్తు సేవల పన్ను ద్వారా ఏం జరుగుతుందోనన్న అపోహ చాలా మందిలో ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీఎస్టీ విషయంలో అపోహలెక్కువ... క్లారిటీ తక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  రోజు గడిచే కొద్దీ జీఎస్టీకి సంబంధించి అందరికీ ఫుల్ క్లారిటీ రానుంది. జీఎస్టీ ద్వారా దీర్ఘకాలంలో ప్రజలకు ఎంతో మేలు కలగనుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ ద్వారా... తాత్కాలికంగా ఇబ్బందులున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే దీర్ఘకాలంలో జీఎస్టీ ద్వారా ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ఆర్థిక శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. జీఎస్టీ ద్వారా సామాన్యుడికి ఎంతో మేలు జరుగుతుందన్నది వారి భావన. దాదాపు రెండు దశాబ్దాల నుంచి కసరత్తు చేసిన జీఎస్టీ.. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చేసింది. నాటి ప్రధాని వాజ్ పేయి జమానా నుంచి జీఎస్టీ అమలు చేయాలన్న లక్ష్యం ప్రభుత్వ పెద్దల్లో ఉంది. తాజాగా అమలు ద్వారా ప్రధాని నరేంద్రమోదీకి క్రెడిట్ దక్కుతోంది. అయితే జీఎస్టీ అమలకు సంబంధించి అపోహలు ఎక్కువగా ఉన్నాయ్. కేంద్రం రాష్ట్రాలను కేంద్రం గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే... జీఎస్టీని వ్యతిరేకించే వారు... ఆదాయమంతా కేంద్రానికే దక్కుతుంది... రాష్ట్రాలు... కేంద్రాన్ని బిచ్చమడుక్కోవాలన్న వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవానికి ఇది ఎంత మాత్రం కరెక్టు కాదు...
అయితే ప్రతిపక్షాలు గుడ్డిగా జీఎస్టీని వ్యతిరేకించడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయ్. తెలుగు సినిమా డైలాగు మాదిరిగా ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు నాయకుడన్న చందంగా... ప్రతిపక్షం వ్యవహరించలేదన్న అభిప్రాయం ఉంది. మోదీని ఎదుర్కోవాలి కాబట్టి ఎదుర్కోవడమన్నది కరెక్టు కాదని... ప్రతిపక్షాలు తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని ఆర్థిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. మోదీని ఎదుర్కోవడంలో విఫలమైన... కాంగ్రెస్ పార్టీ మమత ట్రాప్ లో పడిపోయిందన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ ట్రాప్ లో లెఫ్ట్ పార్టీ లు కూడా పడ్డాయన్న వాదన కూడా విన్పిస్తోంది. కొంత మంది అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వాటన్నింటికీ సమాధానం దొరకాలంటే మరో ఆరు నెలల పాటు వెయిట్ చేయాల్సిందేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ప్రపంచంలోని మెజార్టీ దేశాలన్నీ జీఎస్టీని ఎప్పట్నుంచో అమలు చేస్తున్నాయ్. జీఎస్టీ వల్ల లాభం లేకుంటే వారంతా అది చేయరు కదా... జీఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల పన్ను చెల్లింపు సులభతరమవుతుందని... వ్యాపారులు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే వీలు కలుగుతుందని అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు భారత్ తీసుకున్న తాజా నిర్ణయం... దేశ ఆర్థిక వ్యవస్థకు నవ పథాన్ని ఆవిష్కృతం చేస్తుందని చెప్పొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. తాజా జీఎస్టీ నిర్ణయం ద్వారా... పలు రకాల పన్ను బాధలు తప్పబోతున్నాయ్.  పన్నులు ఎగ్గొట్టేవారి సంఖ్య భారీగా తగ్గుతుంది. ప్రభుత్వ యంత్రాంగాలు నిజాయితీతో వ్యవహరిస్తే... దేశంలో ప్రభుత్వం చెబుతున్న మార్పు స్పష్టంగా వస్తుంది. జీడీపీలో 2 శాతం వృద్ధి సాధ్యమవుతుంది. లోటును తగ్గించుకోని... దేశ ఆర్థిక వ్యవస్థ పటుత్వాన్ని సాధించడం జరుగుతుంది. వస్తు సేవల పన్ను... జీఎస్టీ ద్వారా కార్పోరేట్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. అది తప్పన్న అభిప్రాయాన్ని ఆర్థికరంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కార్పోరేట్స్ కు బెనిఫిట్ చేయడానికి జీఎస్టీ తీసుకురాలేదని... తాజా చట్టం ముందు... దేశంలో అందరూ... ఒకటేనన్న అభిప్రాయాన్ని కూడా విన్పిస్తుంది. ఇప్పటి వరకు బడా బడా కార్పోరేట్స్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను... అనేక మార్గాల ద్వారా  ఎగ్గొడుతున్నారని...  వారి సంఖ్య జీఎస్టీ అమలుతో...  తగ్గబోతుందని చెబుతున్నారు. పన్ను చెల్లింపు పద్ధతిలో ఇప్పుడు విస్తృతమైన పారదర్శకత పెరుగుతుందన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది. జీఎస్టీ అమలు ద్వారా... కార్పోరేట్ శక్తులైనా... నెలసరి జీతం తీసుకునే వ్యక్తి అయినా... వారి వారి ట్యాక్స్ స్లాబులోకి వస్తారు. ఇప్పటి వరకు వ్యక్తిగత పన్ను ఏవిధంగానైతే కడుతున్నారో... అదే విధంగా వారి వారి పరిశ్రమలకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది.  మరోవైపు చేనేత పరిశ్రమ కుదేలవుతుందన్న అభిప్రాయాన్ని వస్త్రవ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేనేతకు వంద శాతం పన్ను  మినహాయింపు లభిస్తూ వచ్చింది. అయితే తాజా నిబంధనలతో రూ. 20 లక్షల పైబడి వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు మాత్రమే పన్ను పరిధిలోకి వస్తారు. అందులోనూ రూ. 75 లక్షల వరకు వ్యాపారం చేసే వారు కేవలం 1 శాతం మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి వ్యాపారం చేసే వర్గాలు 5 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే రూ. 20 లక్షల స్లాబులో ఉన్నవారు... అందుకు తగిన విధంగా ఆదాయపన్నుశాఖ వారికి బిల్లులను ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం ఇబ్బందికర పరిణామని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పన్ను చెల్లించని వారికి అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. ఇప్పటి వరకు చిన్న చిన్న వస్త్రవ్యాపారులు రికార్డులన్నీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తం చేసేవారు. అయితే అలాంటి వారు కూడా రికార్డుల లెక్కలతో ఐటీవారికి అందిస్తే సరిపోతుంది. రికార్డుల్లో ఆధార్, ప్యాన్ అందిస్తే వారే లెక్కలు చూసుకుంటారు. అలాంటి వారికి పన్ను భారం ఎంత మాత్రం ఉండదు. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న వస్త్ర వ్యాపారులు ఒక్కసారిగా ఈ పద్ధతికి అలవాడు పడటం కష్టమన్న అభిప్రాయం కూడా ఉంది. గతంలో నోట్ల రద్దు తర్వాత ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే నాటి గాయాలు మానుతున్నాయ్. ఇప్పుడు జీఎస్టీ పేరుతో వ్యాపారులు, సామాన్యుడి బెదిరిపోతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా... ప్రజలను కాపాడాల్సింది పాలకులే. నోట్ల రద్దు సమయంలో  ఎలాంటి అప్రమత్తత లేకుండా చేయడం వల్ల ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయితే... ఇప్పుడు జీఎస్టీ ద్వారా సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తుసేవల పన్ను అమలుకు సంబంధించి తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ...దీర్ఘకాలంలో గణనీయంగా ప్రయోజనాలుంటాయన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తక్షణం అమలు చేయడం ద్వారా...  మొదట్లో కొన్ని వర్గాలు ఇబ్బందిపడే ప్రమాదం ఉన్నప్పటికీ...  అవగాహన లోపంతో నష్టాలు కూడా వస్తాయన్న అనుమానాలు ఉన్నాయ్.  తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భాగీరథ విషయంలో జీఎస్టీ అమలుతో పలు సమస్యలు వస్తాయని భావించింది. అయితే రోజులు గడిచేకొద్దీ... ప్రభుత్వ పెద్దలు క్లారిటీతో అడుగులు వేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సైతం మద్దతిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. నాటికీ... నేటికీ అయ్యే ఖర్చులో పెద్ద తేడా ఏమీ ఉండదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందన్న అభిప్రాయం ఉంది. జీఎస్టీ రాక ముందు... సెంట్రల్ వ్యాట్, స్టేట్ వ్యాట్ గా పన్ను విధించేవారు. ఇప్పుడు జీఎస్టీ అమలయ్యాక...  ఇంటిగ్రేటెడ్ జీఎస్టీగా నిర్ణయించారు. స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ కలిపి ఇంటిగ్రేట్ గా ఒక పూల్ గా వెళ్తుంది. అయితే కేంద్రమే మొత్తం కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదన్న అభిప్రాయాన్ని నిపుణులు వివరిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు హక్కులను హరించడం సాధ్యం కాదన్న వర్షన్ ను వారు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రకారం... ఆయా రాష్ట్రాల వాటాలను ఇప్పటికే లెక్కగట్టారు. దాని ప్రకారం రాష్ట్రాలకు నిధుల చెల్లింపు జరుగుతుంది.

అందరి మదిలో ఒకటే... లాభం జరిగితే మనకే జరగాలి... నష్ట జరిగితే పక్కోడికి జరగాలి... ఇదీ ఎవరైనా అనుకునేదే. అయితే... జీఎస్టీ ఆర్థిక తీవ్రవాదాన్ని తుదముట్టిస్తుందని కేంద్రం చెబుతోంది. అయితే...  జీఎస్టీ ద్వారా మనకు పడే భారమేంటి? జీఎస్టీ అమలు కాక ముందు మనం చెల్లిస్తున్న మొత్తానికి ఇప్పుడు మనం కోల్పోతున్న  లెక్కలేంటి? సామాన్యుడుకు ఒరిగేదేంటి?
స్థానిక మీడియా, జాతీయ మీడియా జీఎస్టీ గురించి పుంకాను పుంకాలుగా వార్తలు అందిస్తోంది. వాటిలో ఎక్కువగా ప్రజలకు, మరీ ముఖ్యంగా కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అంటూ వార్తలు వస్తున్నాయ్. వాటికి సంబంధించిన వివరాలు ఓ సారి చూద్దాం... ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ పరిధి ఎక్కువ శాతం 5 శాతం పన్ను కిందకే వచ్చినట్టుగా తెలుస్తోంది. పేద వర్గానికి చెందిన ప్రజలతోపాటు, సామాన్యుడికి మ్యాగ్జిమమ్ బెనిఫిట్ కలుగుతుందని చెబుతున్నారు. పేద ప్రజలకు వారి హక్కుగా జీఎస్టీని విశ్లేషిస్తున్నారు. దేశంలోని చిన్నస్థాయి వర్తకులకు జీఎస్టీతో ఎలాంటి ప్రమాదం లేదన్నది కూడా ఘంటాపధంగా వివరిస్తున్నారు. పరిశ్రమ వర్గాలకు మేలు జరుగుతున్న విషయాలను ఓసారి పరిశీలిస్తే... రిజిస్ట్రేషన్ కు సంబంధించిగానీ, డ్యూటీ చెల్లింపులుగానీ, ఐటీ రిటర్న్స్ దఖలు చేయడం, రిఫండ్లను వెనక్కి తీసుకోవడం తేలిక కానుంది. పన్ను చెల్లింపుకు సంబంధించి తయారీదారు, సరుకును సప్లై చేసే వ్యక్తి, రిటైల్ వ్యాపారి అంటూ మూడు రకాల పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. పన్ను చెల్లింపుల్లో సరళీకరణ మూలంగా... అంతర్జాతీయ మార్కెట్లోకి దేశం నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలకు వస్తువులను అందించడానికి వర్తకులకు ఎంతగానో అనువుగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఇకపై ఒకటే రిజిస్ట్రేషన్ కింద వస్తువులు, సేవలను ఒకటే పాన్ నెంబర్ కింద అందించవచ్చు. మొత్తం చెల్లింపుల్లో సగం  రాష్ట్రానికి సగం కేంద్రానికి దక్కుతుంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ మూలంగా ఎంతో మేలు జరగుతుంది. దేశమంతా ఒకటే మార్కెట్ విధానం అమల్లోకి వస్తుంది. భారతదేశం తయారీ రంగంలో వినూత్న ఆవిష్కరణలు జరిగే వేదిక అవుతుంది. పెట్టుబడుల రాక పెరుగుతుంది. మొత్తంగా పెట్టుబడుల రాక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కారణమైతే... దేశంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది.
తయారీ రంగం నుంచే ఉద్యోగాల కల్పన జరిగితే... దేశం వేగంగా వృద్థి చెందుతుంది. అదే సమయంలో పన్ను చెల్లింపు తేలిక అవుతోంది. అనేక విధాలుగా కడుతున్న పన్నులు చెల్లింపు  అవసరం ఉండదు. వస్తువులపైనా, సేవలపైనా వేసే పన్ను సరళతరమవుతుంది. కొన్ని రకాల మినహాయింపులతో తేలిక పన్నువిధానం అమల్లోకి వచ్చేస్తోంది. శాంతియుతంగా చట్టాలు  అమల్లోకి  రావడం ద్వారా... దేశమంతటా ఒకటే విధానం అమలవుతుంది. పన్ను యంత్రాంగం సైతం సమర్థవంతంగా పనిచేయడానికి జీఎస్టీ చేయూతనిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు 200 రకాల చట్టాలతో పలు నిబంధనలు అమల్లో ఉన్నాయ్. అవన్నీ ఇప్పుడు ఒకటే వ్యవస్థ జీఎస్టీ కిందకు వస్తాయ్. మద్యం తప్పించి దేశంలోని అన్ని రకాల వస్తువులు జీఎస్టీ పరిధిలోకి వస్తాయ్. దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న వస్తుసేవల పన్ను...  జీఎస్టీ... ఆయా రాష్ట్రా వాణిజ్య పన్నుల శాఖ స్వరూపాన్నే మార్చేస్తుంది. శాఖ పేరే మారిపోయి వస్తుసేవల పన్ను శాఖ ముందుకు ఆయా రాష్ట్రాల పేరు రానుంది. జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి పన్ను విధించే అధికారం లేని నేపథ్యంలో వాణిజ్య పన్నులు అనే పదాన్ని తొలగించి.. జీఎస్టీ శాఖగా నామకరణం చేస్తారు. దేశంలో జీఎస్టీని అమలు చేయాలన్న ఆలోచన 1986-87లో మొదలైంది. ఆ ఆలోచన అప్పటికే 34 దేశాల్లో అమల్లో ఉండగా... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో జీఎస్టీ అమలవుతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం జీఎస్టీ అమలు చేయడం లేదు. అక్కడ రాష్ట్రాలదే పన్ను వసూలులో కీలక పాత్ర.  బ్రిజిల్ లో 4-25 శాతం, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో 20 శాతం, చైనాలో 17 శాతం, మెక్సికోలో 16 శాతం, దక్షిణాఫ్రికాలో 14 శాతం, ఆస్ట్రేలియాలో 10 శాతం, జపాన్,స్విట్జర్లాండ్ లో 8 శాతం, థాయ్ లాండ్ లో 7 శాతం, మలేసియాలో 6 శాతం, కెనడాలో 5 శాతం పన్ను వసూలు చేస్తున్నారు.  ప్రపంచంలో తొలిసారి జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్. జీఎస్టీ వచ్చినా... ఆ పన్ను వస్తుంది... ఈ పన్ను వస్తుంది అన్న అనుమానం చాలా మందికి కలుగుతుంది.  అయితే ద్వారా ఏఏ పన్నులు పొతున్నాయో ఒక్కసారి పరిశీలిస్తే...  ప్రస్తుతం కేంద్రం ఆయా వస్తువులు,  సేవలకు సంబంధించి విధిస్తున్న పన్నులు...  కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఔషధాలు, సౌందర్య సాధనాలపై వేసే ఎక్సైజ్ సుంకాలు, అనదపు ఎక్సైజ్ సుంకాలను జౌళి, వాటి ఉత్పత్తులపై విధిస్తు్న్నారు. సీవీడీగా పిలిచే... అదనపు కస్టమ్స్ సుంకాలు, ప్రత్యేక అదనపు కస్టమ్స్ సుంకాలు, సర్వీస్ ట్యాక్స్, వస్తు, సేవలపై కేంద్రం విధించే సర్ ఛార్జులు, సెస్సులు ఇకపై ఉండవు. అదే సమయంలో జీఎస్టీ మూలంగా రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు ఇకపై పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. రాష్ట్ర విధించే పన్నులు... విలువ ఆధారిత పన్ను వ్యాట్, కేంద్ర అమ్మకం పన్ను, విలాస సుంకం, ప్రవేశ సుంకాలు, వినోదపు పన్ను, ప్రకటనలపై విధించే పన్ను, కొనుగోలు సుంకం, లాటరీలు, పందాలు, జూదాలపై విధించే పన్నులు పూర్తిగా పోతాయ్. ఆర్థికంగా దేశమంతా ఒక యూనిట్ కిందకు జీఎస్టీ తీసుకొస్తుంది. సరుకులు, సేవలకు సంబంధించి స్వేచ్ఛా వాణిజ్యం సాధ్యమవుతుంది. పెరిగే పోటీతత్వం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులు లభ్యమవుతాయ్.  ఉత్పత్తిదారులు... వినియోగదారులది దేశమంతా ఒకటే మాట... ఒకటే బాటగా ఉంటుంది. దేశమంతా ఒకటేనన్న భావన కలుగుతుంది. జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది.

జీఎస్టీ ద్వారా వస్తువుల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతున్నాయ్. నిత్యవసర వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే...  జీఎస్టీ ద్వారా పెరుగుతున్న వస్తువుల ధరలు ఏంటి? తగ్గుతున్న వస్తువుల ధరలు ఏంటి? ఎవరు ఎంత చెప్పినా క్లారిటీ రావడం లేదా... అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మేం చేస్తున్నాం...
వస్తు, సేవల పన్ను, జీఎస్టీ అమలు ద్వారా పన్నుల శ్లాబులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. 5 శాతం, 12 శాతం 18 శాతం, 28 శాతంగా నాలుగు రకాలుగా పన్నులు వసూలు జరుగుతుంది. అయితే కీలక నిత్యవసర వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు రాకుండా వాటి విషయంలో ఇప్పటి వరకు ఉన్న కొన్ని పన్నులను పూర్తిగా ఎత్తివేశారు. అంటే ఇప్పటి వరకు పాల ఉత్పత్తులు, ఇతర నిత్యవసర వస్తువులపై ఉన్న స్వల్ప పన్నులు కూడా ఇకపై ఉండబోవన్నమాట. జీఎస్టీ అమలుతో పలు వస్తువుల రేట్లు పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయా రేట్ల తయారీ సంస్థలు రేట్లు పెరగకుండా... తమ ఆదాయాన్నే తగ్గించుకుంటాయని స్పష్టం చేస్తున్నాయ్. ఇప్పటికే ద్విచక్రవాహనాలు సంస్థలు, భారీ వాహనాల తయారీ సంస్థలు రెట్లను తగ్గిస్తున్నాయని చెప్పాయ్. హీరో, హోండా సంస్థలు ద్విచక్రవాహనాలపై రూ. 3 వేల నుంచి 5 వేల వరకు తగ్గింపు ప్రకటించాయ్. తాజాగా అదే దారిలో సెల్ ఫోన్ తయారీ సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్టుగా పేర్కొన్నాయ్. మొన్నటి వరకు ఇంపోర్ట్ చేసుకున్న సెల్ ఫోన్ ధరలపై 5 శాతం వ్యాట్, ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని విధించేవారు. అయితే ఇప్పుడు జీఎస్టీ కింద 12 శాతం పన్నును ప్రతిపాదించారు. అంటే ట్యాక్స్ డబుల్ అయ్యింది. అయితే వినియోగదారులు ఎక్కడ తమ సెల్ ఫోన్లు కొనుగోలు చేయరన్న బెంగలో ఉన్న కంపెనీలు...  తామే లాభాలను తగ్గించుకుంటామంటూ ముందుకు వచ్చాయ్. జీఎస్టీ కారణంతో తమ ధరలను పెంచబోమని శాంసంగ్‌, షియోమి, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్‌, లావా కంపెనీలు చెప్పాయి. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్.ఎం.సి.జి) ఉత్పత్తులలోని 81 శాతానికి పైగా ఉత్పత్తులకు 18 శాతం పన్నుగా నిర్ణయించారు.  వీటి పన్ను గతంలో 22 నుంచి 24 శాతం వరకు ఉంది. ఈ మేరకు నాలుగు నుంచి 6 శాతం మేర ఉత్పత్తుల ధరలను ఆయా కంపెనీలు వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరల్లో మార్పులు వినియోగదారులకు  తాజా తగ్గింపు వల్ల ఉత్పత్తులకు గిరాకి పెరుగుతుందని... ఆర్థిక వృద్ధికి కారణమవుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పెయింట్లు, షాంపూలు, డిటర్జంట్లపై మాత్రం 28 శాతం పన్ను విధించారు. ఇవి ఎఫ్.ఎం.సి.జీ ఉత్పత్తుల్లో 19 శాతం ఉన్నాయ్. సిమెంటుకు జీఎస్‌టీనీ 28 శాతంగా నిర్ణయించారు. గతంలో సిమెంట్‌పై పరోక్ష పన్నుల కింద 24- 25 శాతం వరకు వసూలు చేసేవారు. బొగ్గురేటుపై పన్ను తగ్గించినందు వల్ల సిమెంట్ ధరల్లో పెద్దగా వ్యాత్యాసం రాదన్న అభిప్రాయం విన్పిస్తోంది. నిర్మాణాలపై జీఎస్‌టీ రేటు 18 శాతంగా నిర్ణయించినా, భూమి విలువను మినహాయిస్తున్నందున, చెల్లించేది 12 శాతమే ఉండనుంది. ఇక తయారీ రంగం లో వస్తున్న మార్పులు అలా ఉంటే... కీలకమైన సేవల రంగంలో... దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కన్పిస్తోంది. గతంలో అన్ని రకాల సేవలపై 15 శాతం పన్ను విధించేవారు. జీఎస్‌టీలో సేవలపై 5%, 12%, 18%, 28% చొప్పున పన్ను రేట్లను ఖరారు చేశారు. టెలికాం, ఆర్థిక సేవలపై 18 శాతం  పన్ను విధించారు. గతంతో పోలిస్తే 3 శాతం ఎక్కువ.  ఇక బ్యాంకింగ్ సేవలతో జనం జేబులుకు చిల్లుల పడటం ఖాయం. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులపైనా, ఇన్సూరెన్స్ ప్రీమియమ్లపైనా బిల్లులు తడిసిమోపడవనున్నాయ్. ఇప్పటి వరకు ఆ పన్ను 15 శాతంగా ఉండగా... ఇకపై అది 18 శాతానికి  పెరగుతుంది. క్రెడిట్ కార్డును పది వేల రూపాయల బిల్లు వస్తే ఇకపై 18 శాతం పన్నుతో రూ. 180 టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక ఇన్సూరెన్స్ ప్రీమియమ్లకు సైతం అదే విధంగా ఛార్జి వసూలు చేస్తారు. రూ. 20 వేల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవారు రూ. 360 టాక్స్ కట్టాల్సిందే.  రవాణా సేవలపై జీఎస్‌టీని 5 శాతం విధించనున్నారు. ఇది విమానయాన సంస్థలకు కలిసొచ్చే పరిణామం. అంతక్రితం ఉన్న 15 శాతంతో పోలిస్తే పన్ను భారం గణనీయంగా తగ్గుతుండటమే కారణం. సినిమా టిక్కెట్లపై జీఎస్‌టీని అత్యధిక స్లాబైన 28 శాతంగా నిర్ణయించారు. గతంలో సినిమా టికెట్లపై సేవా పన్నుతో పాటు వినోదపు పన్ను కింద 28 శాతం నుంచి 100 శాతం వరకు ఉండేది.  పైవ్‌ స్టార్‌ హోటళ్ల సేవలను కూడా 28 శాతం స్లాబ్‌లోకి చేర్చారు. ఎలక్ట్రానిక్ వస్తువులపై 28 శాతం పన్ను ఖరారు చేశారు. గతంలో గృహోపకరణాలపై 23 శాతం పన్ను ఉండగా... అది 5 శాతం మేర పెరగనుంది. టీవీలు, ఫ్రిజ్ లు, ఏసీల ధరలు 2 నుంచి 5 శాతం మేర పెరిగే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలపై కంపెనీలపై కంపెనీలు 5 శాతం మేరకు ఆదాయాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారంపై జీఎస్టీని 3 శాతంగా నిర్ణయించారు. గతంలో అన్ని రకాల పన్నులు కలుపుకొని 12.4 శాతంగా ఉన్న పన్ను... ఇప్పుడు 14 శాతమవుతోంది. దాంతో బంగారు అభరణాలపై ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయ్. పాల ఉత్పత్తులు కూడా తగ్గే అవకాశం కన్పిస్తుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించాయ్. త్వరలో ఇతర పాల ఉత్పత్తుల సంస్థలు సైతం ధరలు తగ్గించే అవకాశం ఉంది. జీఎస్టీ ప్రభావంతో కార్ల ధరలు కిందకి దిగొస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ తన కార్ల ఎక్స్‌షోరూం ధరలన్నింటి పైనా 3 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు కార్లపై 28 శాతం కంటే పన్ను ఉండటం వల్ల...  జీఎస్టీ అమలు తర్వాత కార్ల రేట్లు కొంత మేర తగ్గబోతున్నాయ్. ఆల్టో, స్విఫ్ట్‌, డిజైర్‌, ఐ20 ఎలైట్‌ వంటి కార్లపై కనీసంగా రూ.6,500 నుంచి .. రూ.15వేల వరకు ధరలు తగ్గబోతున్నాయ్.  ప్రస్తుతం ఈ కార్లపై 31.4 శాతం పన్ను రేట్లు ఉండగా.. వాటిని జీఎస్టీ రేటు కింద 29 శాతానికే తీసుకొచ్చారు. మిడ్‌ సైజు కార్లపై పన్ను రేట్లు ​కూడా 3.6 శాతం మేర తగ్గుతున్నాయ్. హోండా సిటీ, హ్యుందాయ్‌ వెర్నా, మారుతీ సియాజ్‌, ఫోక్స్‌వాగన్‌ వెంటో వంటి సెడాన్ల ధరలు కనీసం 30వేల రూపాయల వరకు తగ్గనున్నాయ్. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వంటి కంపెనీలు ఇప్పటికే రూ.1.25 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.
సింపుల్ గా చెప్పాలంటే... రెడీ మేడ్ దుస్తులపై ఇప్పటి వరకు ఉన్న 12 శాతం పన్ను బదులు 5 శాతం పన్ను వసూలు చేస్తారు. హెయిర్ ఆయిల్, టూత్ పేస్టులు, సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు, బర్త్ డే కేకుల రేట్లు గతం కంటే తగ్గుతాయ్. 28 శాతం నుంచి 18 శాతానికి పన్ను తగ్గుతోంది. టీ, కాఫీ పౌడర్  రేట్లు 11 శాతం మేర తగ్గుతాయ్. చక్కరె పన్ను 5 శాతం స్లాబులో మారుతోంది. చెప్పులు, బూట్ల ధరలు కూడా కొంత తగ్గుతాయ్. రూ. 500 లోపు ఉన్న వాటిపై 5 శాతమే పన్ను విధిస్తున్నారు. ఫర్నిచర్ 29 శాతం నుంచి 12 శాతం పరిధిలో వస్తోంది. ఫోన్లు 6 శాతం నుంచి 12 శాతానికి మారుతున్నాయ్. బైకుల రేట్లు కొంత వరకు దిగొస్తాయ్. ఖరీదైన కార్ల ధరలు తగ్గుతున్నాయ్.
దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చే జీఎస్టీ విషయంలో విభేదాలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయ్. కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు జీఎస్టీ ప్రారంభ కార్యక్రమాన్ని నిషేధిస్తే... ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సమర్థించాయ్.  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై పోరు సాగించిన విపక్షాలు జీఎస్టీ విషయంలో మాత్రం చీలిపోయాయ్. కాంగ్రెస్ పార్టీ జీఎస్టీని వీలైనంత త్వరగా అమలు చేయాలని చాన్నాళ్ల క్రితమే ప్రయత్నించింది. అయితే తాజాగా జీఎస్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దేశానికి అత్యంత  కీలకమైన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది... అమలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వ్యవహరించకూడదన్న అభిప్రాయం విన్పిస్తోంది. పెద్ద నోట్ల రద్దు మాదిరిగానే జీఎస్‌టీని దూరదృష్టి లేకుండా అమలు చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్  దుయ్యబట్టారు. జీఎస్‌టీని కాంగ్రెస్ మొదటి నుంచి బలపరుస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే దీనిని అసమర్థ, మతిలేని ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక, దూరదృష్టి, సంస్థాగత సన్నద్ధత లేకుండా అమలు చేస్తోందన్నారు. మరోవైపు జీఎస్‌టీ పన్నుపై కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం పెదవి విరిచారు. ఇప్పుడు అమల్లోకి వచ్చింది  జీఎస్‌టీ కాదని... నిపుణులు తయారు చేసిన ముసాయిదా ప్రకారం లేదని...  ద్రవ్యోల్బణంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తే... ఇప్పుడే అదే పార్టీలు జీఎస్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ముందు వరుసలో ఉండటం విశేషం. విపక్షంలో కీలక నేతగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అందరికంటే ముందు వరసులో అద్వానీ పక్క సీట్లో కూర్చోవడం విశేషం. అదే సమయంలో బీఎస్పీ, ఎస్పీ పార్టీ నేతలు సైతం హాజరయ్యారు. ఇక మాజీ ప్రధాని దేవగౌడ సైతం ప్రధాన వేదికపై కూర్చోవడం విశేషం. జీఎస్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసిన పార్టీల్లో కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, లెఫ్ట్, డీఎంకే, ఎన్సీ, ఆర్జేడీతోసహా కొన్ని చిన్న చితకా పార్టీలున్నాయ్. బెంగాల్ సీఎం మమత బెనర్జీ... జీఎస్టీ అమలును తూర్పారబడుతున్నారు. జీఎస్టీ చారిత్ర తప్పిదమంటూ మమత బెనర్జీ మండిపడుతున్నారు. జీఎస్టీ బదులు దేశమంతటికీ సమగ్రమైన బిల్లు తీసుకొస్తే సరిపోయేదన్న అభిప్రాయాన్ని ఆమె విన్పిస్తున్నారు. మొత్తం జీఎస్టీపై రాజకీయ పార్టీల్లో విభేదాలు స్పష్టంగా కన్పించాయ్. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంటోంది. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని... దేశానికి సంబంధించి విషయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. నిజమే.... జీఎస్టీ కేంద్ర ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చే బిల్లు అనడంలో ఎంత మాత్రం అనుమానం లేదు.
కంపెనీలకు అన్ని లాజిక్కులూ తెలుసు. జీఎస్టీ ద్వారా కేంద్రం 5, 12, 18, 28 శాతమంటూ ట్యాక్సులను తీసుకొస్తే... కార్పోరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులు అమ్ముకోడానికి 5, 10, 15, 25 శాతం డిస్కౌంట్లంటూ వినియోగదారులను ఊరిస్తున్నాయ్. రండి బాబు రండి  ఇంతకంటే చౌక బేరం ఇక లేదంటూ జనాలకు గాలం వేస్తున్నాయ్.