రాంగ్ అండ్ ఫాల్స్ వర్మ
విచ్చలవిడి తనానికి పరాకాష్ట . పర్వర్షన్ కు ప్రతిరూపం. బీభత్స కాండకు కేరాఫ్ అడ్రస్. వికృత, విపరీత కామెంట్లకు చిరునామా. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడతాడు. ఏదైనా తప్పుకాదంటాడు. తాను చెప్పిందే కరక్టు... చూపించేదే నిజమంటాడు. అమ్మాయంటే సెక్స్ మాత్రమే అన్నది ఆయన ఫిలాసఫీ. తానేం తీసినా జనం అదే చూస్తారనుకుంటాడు. చూస్తున్నారు కాబట్టి... తన ఆలోచనే కరెక్టన్నది ఆయన ఉద్దేశం. ఆయన మరెవరో కాదు... ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ. రక్త చరిత్ర తీస్తాడు... ఐస్ క్రీమ్ అంటూ పులిహార మాటలు చెప్తాడు. చిన్న పిల్లల మనుసలు కలుషితమయ్యేలా సన్నీ లియెన్ సినిమా తీస్తాడు. చరిత్రకు కొత్త నిర్వచనాలు చెప్తాడు. ఎన్టీఆర్ చరిత్ర అంటూ మరో బయోపిక్ తీసేందుకు సిద్ధమయ్యాడు. దేనికైనా రెడీ... ఏం చేసేందుకైనా సిద్ధమంటారు. తాజాగా డ్రగ్స్ కేసులో పోలీసులు ఓవరాక్షన్ అంటూ తన బాధను ట్వీటి చేతులు కాల్చుకున్నాడు. మానవత్వమన్న మాటకు అర్థం తెలియని ఆర్జీవీ మానవత్వం గురించి, సినీ జనం గురించి మనకెవరికీ తెలియని కహానీలు విన్పిస్తాడు. రాంగ్ రూట్లో వెళ్తూ... అంతా రైట్ రైట్ అంటున్న దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ విశృంఖలత్వంపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలతో చలికాచుకుంటాడు. కాదు టైమ్ పాస్ చేస్తాడు. కాదు డబ్బులు సంపాదిస్తాడు. తన చుట్టూ ఉన్నవారికి కాసులు పంట పండిస్తాడు. జనం సినిమా పిచ్చి... ఆర్జీవీకి మనీ మిషన్. ఉదయం నిద్ర లేచిన మొదలు ఆర్జీవీ అబద్ధాలతో కాలం గడిపేస్తాడు. అవే అసత్యాలతో దిన చర్యను ముగించేస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అబద్ధాలు... అర్ధ సత్యాలతో తన పబ్బం గడిపేసుకుంటాడు. తనకు, తన సినిమాలకు ప్రచారం కోసం పకడ్బంధీ ప్రణాళికను మాత్రం సెట్ చేసుకుంటాడు. స్ట్రయిట్ గా ఫ్రాంక్ గా మాట్లాడతానంటూ కుండబద్ధలు కొడుతూనే... అన్నీ అబద్ధాలే చెప్తారంటూ ఆయన గురించి తెలిసిన వారు ఇట్టే చెప్పేస్తారు. ఆయన గురించి తెలిసినవారు ఆయన అబద్ధాల కోరంటారు. నోరు తెరిస్తే అబద్ధం... నిద్రపోయే వరకు అసత్యాలతో కాలం గడిపేస్తారని చెబుతారు. బాధ్యతారహితంగా ప్రవర్తించడంలో రాముకు మించిన వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తనకు బాధ్యత ఉంది కాబట్టి ఓటేయనని చెప్పే ధైర్యం వర్మ ఒక్కడికే ఉంటుంది. నాకు నచ్చిన విధంగా సినిమాలు తీస్తాను. చూస్తే చూడండి లేదంటే లేదు. మిమ్మల్ని ఎవర్నీ కూడా సినిమా చూడాలంటూ కోరడం లేదని కరకండీగా చెబుతాడు. చూడటం, చూడకపోవడం మీ ఇష్టమంటూ కుండబద్ధలు కొడతాడు వర్మ. జనానికి సినిమా ఎందుకు నచ్చదో నాకెలా తెలుస్తుందంటూ కలరింగ్ ఇస్తాడు. నచ్చాల్సిన అవసరం కూడా లేదంటాడు. సినిమాలు తీయడం నా పని... నా పని నేను చూసుకుంటూ పోతా... చూసే వారు చూస్తారు. చూడని వారు చూడరంటాడు. నిజాయితీ నిలువెత్తు నిదర్శనం నేనేనని కూడా చెప్పేసుకుంటాడు. ఎవరికీ అంతబట్టని రీతి రామ్ గోపాల్ వర్మది. అసహజ ప్రవర్తనకు, ఎవరూ ఆలోచించని విధంగా ఆలోచించడం వర్మకు మాత్రమే సొంతమని చెప్పాలి. రోజూ నిద్ర లేచింది మొదలు పోర్న్ చిత్రాలను చూడటంతో మొదలుపెడతానంటాడు. ఇలా ఏ డైరెక్టర్ కూడా చెప్పడం. పైపెచ్చు తనకు పోర్న్ సినిమాలే చోదక శక్తి అంటాడు. తన పక్కన అమ్మాయి ఉన్నా... పోర్న్ తో వచ్చే కిక్కే వేరంటాడు. తనకు పోర్న్ చూస్తే కిక్కెక్కుతుందని... అది అమ్మాయితో కమిట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయని... ఈజీగా అనుభూతి కలగాలంటే అందుకు పోర్న్ ఒక్కటే పరిష్కారమంటాడు. ఎనర్జీ రావాలంటే చూడక తప్పదని కూడా చెప్తాడు. ఎన్ని గంటలకు నిద్రపోయినా... ఉదయం ఆరు గంటలకే రాముడు మంచిబాలుడిలా లేస్తానంటాడు. పోర్న్ చూడడం వల్ల ఎండార్ఫిన్ కెమికల్ రిలీజ్ అయ్యి... రోజంతా ఫుల్ యాక్టివ్ గా పనిచేసుకుపోతానంటాడు. నిస్తేజం పోయి ఉత్తేజం ఆవరిస్తుందంటాడు. థెరపీలాగా పోర్న్ వీడియోలు పనికొస్తున్నాయంటాడు. జీవితంలో ఏదో సాధించాలనుకొని ఏదో సాధించానని... తనకు మిగతా వారికి చాలా తేడా ఉంటుందని... తనంత నిఖార్సైన మనిషి ఇంకొకరుండరని చెబుతాడు. అదే సమయంలో వివాహ జీవితంతో విసిగిపోయి విడాకులు తీసుకునన్నానంటాడు. రాము పెళ్లి కూడా బలవంతంగా జరిగిందని... ఆ పెళ్లి విషయంలోనే రంగా అండ్ కో రామును హెచ్చరించారని కూడా బెజవాడ జనం చెప్పుకుంటుంటారు. అప్పట్నుంచి ఒక సామాజికవర్గంతో అంటీ అంటనట్టుగా రాము వ్యవహరిస్తూ ఉంటారట. హీరోయిన్లను సినిమా అంతా ఒకరకంగా చూపించి... పది నిమిషాలు ఎక్స్ పోజింగ్ చూపిస్తే తప్పంటున్నార... అసభ్యంగా చూపించాల్సిన సందర్భంలో అలా కాకుండా మరోలా ఎలా చూపిస్తామంటూ లెక్చర్లిచ్చేస్తాడు. అలా చూపిస్తే వచ్చే నష్టమేంటంటాడు. అసలు ఉద్దేశాన్ని గమనించకుండా పది నిమిషాల గురించే మాట్లాడుకుంటారేంటంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. ఎందుకంటే తనకు ఉన్న జబ్బు అందరికీ ఉంటుందనుకుంటాడు. ఓవరాల్ గా ఇక్కడ రాము గురించి చెప్పాలంటే... ఉత్తినే పబ్లిసిటీ పొందాలి. అందుకు మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో బహు బాగా తెలుసిన మాష్టర్ రామ్ గోపాల్ వర్మ. నిత్యం సంచలనాలు సృష్టించాలి. ఎవరూ మాట్లాడని టాపిక్స్ మాట్లాడాలి. అందరికీ తెలిసిన విషయాలను అందరికంటే భిన్నంగా చెప్పాలి. చెప్పడంలోనూ భిన్నత్వం చూపించాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వర్మకు పేరు రావాలి... జనంలో పేరు నానుతూ ఉండాలి. అందరూ ఆయన గురించే మాట్లాడుకోవాలి. అందరూ ఆయన లేవనెత్తిన అంశాల గురించే చర్చించుకోవాలి. పబ్లిసిటీని క్రియేట్ చేయడంలో దిట్ట అయిన రాము... రూపాయి ఖర్చు పెట్టకుండా తన పబ్లిసిటీ, సినిమా ప్రచారం రెండు చేసేసుకుంటాడు.
తనకు అమ్మాయిలు, సెక్స్ అంటే పిచ్చి అంటూ కూడా చెబుతాడు. ఇంటర్మీడియెట్ నుంచే హీరోయిన్ల తొడలు చూడటానికి సినిమాలకు వెళ్లేవాడనంటాడు. బోడి స్టోరీల కోసం సినిమాలకు వెళ్లేవాడిని కాదంటూ కూడా కుండబద్ధలు కొడతాడు. వర్మ మాదిరిగా... దేశంలో మరే డైరెక్టర్ కూడా ఇంతలా మాట్లాడడు. ఎందుకంటే డైరెక్టర్ అనే వాడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాడు. ఇష్టానుసారం మాట్లాడాలంటే ఎన్నో విషయాలు అడ్డొస్తాయ్. ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారోనని దర్శక, నిర్మాతలు భావిస్తారు. కానీ వర్మకు మాత్రం అస్సలవేమీ పట్టవు. శ్రీదేవి, సిల్క్ స్మితను అందాలను చూసి పెద్దయ్యానని... ఇప్పుడు అలాంటి యాంగిల్ లో సినిమాలకు వచ్చేవారంటారని అంటాడు. అవి చూడటానికే సినిమాలకు వస్తారని కలరింగ్ ఇస్తాడు. అందుకే అవి చూపించడమే పనిగా పెట్టుకున్నాడు. అవే చూపిస్తున్నానంటాడు. తన సినిమాలు పది మంది చూస్తే చాలులే అనుకొని సినిమాలు తీస్తాడు వర్మ. ఇదే తరహాలో ప్రముఖ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి షార్ట్ ఫిల్మ్ తీసి..... సన్నీ లియోన్ గురించి ఎవరికీ తెలియని విషయాలు కూడా చెప్పేస్తాడు. అయితే ఇక్కడ డ్రామా పండిస్తాడు. 20 ఏళ్ల యువతి నేనెందుకు సన్నిలియోన్ కాకూడదు అన్న పాయింట్ ఆధారంగా.. తల్లిదండ్రులతో వాదించడాన్ని సినిమా తీశాడు. నా కూతురు సన్నిలియోన్ కావాలనుకుంటుంది అనే టైటిల్ పెట్టాడు. పోర్న్ స్టార్ అయితే తప్పేంటి అనే కూతురు ప్రశ్నిస్తూ... తల్లిదండ్రులతో గొడవపడటాన్ని... ఎమోషనల్ డ్రామాగా పండించాడు. తల్లిదండ్రుల ప్రతి ప్రశ్నకు అమ్మాయి ఇచ్చే సమాధానం.. సెక్స్ అంటే ఫ్యాషన్ అని అమ్మాయి సమర్ధించుకునే విధానాన్ని చూపించి... యువతలకు వెర్రిక్కిస్తాడు. మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహ్తీ హై అంటూ సన్నీలియోన్ గురించి ప్రపంచానికి తెలియని విషయాలన్నింటినీ చూసేలా రెచ్చగొడ్తాడు. రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై స్టార్ హీరో పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించాడు. రామ్ గోపాల్ వర్మ 50ఏళ్ళు పై బడిన వ్యక్తి. పెళ్ళైన కూతుర్ని పెట్టుకొని ఫోర్నో గ్రఫీ సినిమాలను కలక్ట్ చేసుకుంటాను అన్న వ్యక్తి మాటలపై ఏం మాట్లాడగలమని వ్యాఖ్యానించారు. ఒక రోజు నన్ను ఎత్తోచ్చు ఒక రోజు నన్ను తగ్గించవచ్చు ,వీళ్ళందరకి సమాధానం చెప్పుకొనే స్థితిలో నేను లేను అని పవన్ తేల్చేశారు. తన సినిమాల విషయంలో దిగజరలేదని... తనకు చేతనైనా సినిమాలు తీస్తున్నానంటాడు. తాను దిగజారి సినిమాలేవీ కూడా చేయడం లేదని... ఇండియాలో పోర్న్ సినిమాలు చేయలేమని... నగ్నంగా ఉండే అందాన్ని చూడటమే ఇష్టమంటాడు. నలుగురిలో మాట్లాడుకోలేని విషయాలను గర్వంగా స్ట్రయిట్ గా చెబుతున్నానంటాడు. ఇక మహిళా దినోత్సవం రోజు సెలబ్రిటీలంతా.. అమ్మ, కూతురు, భార్య ఫొటోలు పెట్టి శుభాకాంక్షలు చెబుతుంటే వర్మ మాత్రం మహిళలంతా సన్నీలియోన్ ను చూసి నేర్చుకోవాలి. మగవాళ్లందరి తరఫున మహిళలకు ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే విషెస్ చెబుతున్నా. ఏడాదిలో ఒక రోజు ఉమెన్స్ డే పాటించాలి. అయితే ఈ రోజంతా పురుషులేం చేస్తారో నాకు తెలియదు. మహిళలందరూ సన్నీ లియోన్ లా పురుషులకు ఆనందం పంచాలి. మగాళ్లకు ఆమెలా ఆనందం పంచాలంటూ ట్వీట్ చేసి నాలుక్కరుచుకున్నాడు. వర్మ చేసిన ట్వీట్ కు వ్యతిరేకంగా మహిళలు కేసులు నమోదు చేయడంతో వెనెక్కి తగ్గాడు. ముంబైలో మహిళా సంఘాలు చెప్పులతో కొడతామనే సరికి దిగొచ్చాడు. ముంబైలో అతడి కార్యకలాపాలను స్తంభింపజేస్తామని బాలీవుడ్ కార్మిక వర్గాలు కూడా హెచ్చరించాయి. తన వ్యాఖ్యలతో బాధ పడిన వారందరికీ సారీ చెబుతూనే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తనను హెచ్చరించిన వారికి మాత్రం ఈ క్షమాపణ వర్తించదంటూ ఓవరాక్షన్ చేస్తాృడు. భారతదేశంలో అందరూ మడికట్టుకొని ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారని అందుకే... ఇక్కడ నిర్భయ లాంటి ఉదంతాలెన్నో జరగుతున్నాయని... అదే అఫీషయల్ గా పోర్న్ ఉన్న చోట్ల ఎక్కడా కూడా సెక్స్యువల్ క్రైమ్స్ పెద్దగా జరగడం లేదని అంటాడు. సైంటిఫిక్ గా కూడా ఇదే విషయం ప్రూవయ్యిందంటాడు. ఇలా నోటికి అడ్డూ అదుపు లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయ్. ఎవరేమనుకంటే నాకేంటంటూ తన ఇష్టానుసారం వ్యవహరిస్తాడు.
రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కరలేని సంచలన సినిమాల దర్శకుడు. ఆయన ఎన్నో సంచలన చిత్రాలను మరెవరూ తీయలేరన్నట్టుగా తీశాడు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దాడు. అదంతా ఘనం. వర్తమానంలో వర్మ ఇప్పుడో వైఫల్యాలకు చిరునామాగా మారాడు. కాదు కాదు. వివాదాలకు కేంద్రబిందువయ్యాడు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్శీని కెలుక్కుంటూ... నిత్యం వార్తల్లో ఉండేందుకు ట్వీట్ లతో పోటెత్తుతాడు. అటు సినిమానే కాకుండా... తనకు సంబంధం లేని ఎన్నో విషయాలపై వివాదాస్పదన వ్యాఖ్యలు చేస్తాడు. కాంట్రవర్శీ లేకుంటే నిద్రపట్టదేమోనన్నట్టుగా వ్యవహిరిస్తుంటాడు. రామ్ గోపాల్ వర్మ 1962 ఏప్రిల్ 7న జన్మించాడు. దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు, హిందీ భాషల్లో అనేక సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు, నిర్మించాడు. శివ సినిమాతో తెలుగుతెరను షేక్ చేశాడు. తర్వాత హిందీ సినిమా రంగీలాతో సంచలనం సృష్టించాడు. వర్మ కార్పోరేషన్ పేరుతో భారీ చిత్రాలను, లో బడ్జెట్ సినిమాలను రూపొందించాడు. మొన్నటి వరకు సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత సినిమా పేర్లతో కామెడీ చేయడం మొదలు పెట్టాడు. ఎక్కడ కాంట్రవర్శీ ఉంటే అక్కడ ఆ సినిమాలు తీసి పబ్బం గడుపుకోవడం మొదలుపెట్టాడు. ఇటీవల ఆయన తీసిన సినిమాలు జీవిత కథలు, లేదంటే బూతు సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయ్. సినిమాల పేర్లతోనే పబ్లిసిటీని పొందేలా ప్రచారం చేస్తూ వాటిని మార్కెటింగ్ చేసుకోవడం వర్మకు అలవాటైన విద్య. బాలీవుడ్ లో వరుస ఫ్లాపులతో ఇక టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన వర్మ గడిచిన పదేళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా విజయవంతమైన సినిమా తీయలేదు. ఆయన ఇటీవల తీస్తున్న సినిమా పేర్లను చూసినప్పుడు ఎవరికైనా ఆయనకు కొంచెం లూజేమోనని అన్పిస్తోంది. సినిమా టైటిళ్లతోనే రాము సంచలనం సృష్టిస్తాడు. ప్రచారం ద్వారా ఆ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తాడు. సినిమా చూడాలని చెప్పడం ద్వారా... సినిమా జనం వచ్చేలా చేస్తాడు. విరుద్ధ భావాలతో తలతిక్కల మనిషిలా వ్యవహిరస్తాడు. తనకు అత్యంత ఇష్టమైన సినిమా, అమ్మాయి రెంటిండీని ఎవరూ చూపించని విధంగా చూపిస్తాడు వర్మ. ఇక్కడ సినిమా, మగువ రెండూ వేరు వేరు కాదండోయ్... సినిమాలోనే మగువను తన ఇష్టానుసారం చూపించేస్తాడు. అందుకే సన్నీ లియోన్ తో సినిమా ఎందుకు తీయకూడదంటాడు. ఇంకా నయం షార్ట్ ఫిల్మ్ తో సరిపెట్టేశాడు. అది సిల్వర్ స్క్రీన్ పై తీస్తే యువత ఎంతలా చెడిపోయేవారో. అదే సమయంలో గన్స్ అండ్ థైస్ అంటూ సినిమాలను తెరకెక్కిస్తాడు. తుపాకులు, తొడలు అంటూ అసభ్యకరమైన సీరిస్ తో యువతను మరింతగా చెడగొట్టాలని చూస్తాడు. అందరూ సినిమా హిట్టయితే సంతోషపడతారు. ఫట్టయితే బాధపడతారు. అయితే వర్మకు మాత్రం ఇవేమీ ఉండవ్. ఎందుకంటే తన తీసే సినిమా లో బడ్జెట్. డబ్బులు పోవడం పెద్దగా ఉండదు. వచ్చేదే కానీ పోయేదేమీ ఉండదు. పేరు ఎటు తిరిగి పోతుంది. డబ్బన్నా రానివ్వండి అని అనుకుంటాడు. చీకు, చింతా, దిగులు, నిరుత్సాహం రాముకు దరిచేరవు. అంతా సిల్వర్ స్క్రీన్ పైనే ఏదైనా చూసుకోవాలనుకునే వర్మ... యాడ్ ఫిల్మ్ తీస్తారా అని అడిగితే... అదే డబ్బుతో సినిమానే తీస్తానంటాడు. తనకి తిక్క ఉందని ఆయనకు ఆయనే చెప్పుకుంటారు. తిక్క ఉంటే అతనిని నమ్మి నిర్మాతలు కోట్ల రూపాయలు ఎలా పెట్టుబడి పెతరాన్నది కూడా ఆశ్చర్యమే. సినీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు అతనితో కలసి ఎలా పనిచేస్తారని చాలా మంది అనుకుంటుంటారు. టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ లోనూ సినిమాలు తీయగలగడం విశేషం. అయితే ఏ సినిమాకైనా అదే బ్యాగ్రౌండ్... అదే స్టోరీ ఉంటాయని... కొత్తదనమన్నదే అస్సలు ఉండదని కూడా చెబుతారు. సినిమాలు సమాజాన్ని మార్చవనేది వర్మ కఛ్చితమైన అభిప్రాయం. అందుకే సామాజిక ప్రయోజనం కోసం తాను సినిమాలు తీయను అని చెబుతాడు. అతనితో కొద్ది సేపు మాట్లాడిన తరువాత చాలా మందికి తాము తెలుసుకోవలసింది చాలా ఉన్నదన్న ఫీలింగ్ కలిగిస్తాడు. ఏం కావాలో తెలుసు. ఏం చేస్తున్నాడో తెలుసు. ఏం చేయాలో తెలుసు. సినిమా జీవితంపై స్పష్టత ఉంది. సినిమా నిర్మాణం పట్ల అంకిత భావం ఉంది. ప్రతి విషయంలో కచ్చితమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాడు. ఎదుటి వారికి నచ్చినా... నచ్చకపోయినా నాకేంటిలే అనుకుంటాడు. ఇలాంటి లక్షణాలున్నా... వర్మ... లౌక్యం లేనివాడేమోనని అందరూ అనుకుంటారు. అయితే తనకు ఉన్న లౌక్యంతో సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నాడు. దిగజారి సినిమాలు తీస్తున్నా... డబ్బులు పోవులే సినిమాలు తీస్తామంటూ నిర్మాతలు వస్తూనే ఉంటారు. పిచ్చి ముదిరింది... తలకు రోకలి చుట్టమన్నాట్ట వెనకటికో పెద్ద మనిషి. ఇప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి అలాగే తయారవుతోంది. నానాటికీ తీసికట్టు నామం బొట్టు అన్నట్లు... బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి చేరిన వర్మ... ఇక్కడ అయోమయం పరంధామల్లా మారిపోయాడు. కాస్త పెద్ద సినిమాలు చేసి, అక్కడి నుంచి చిన్న సినిమాలకు, ఆపై షార్ట్ ఫిలిం దిగజారాడు. ఎక్కిన మెట్లన్నీ తానే దిగుతూ నేలబారు మనిషైపోయాడు. కెరీర్ లో ఎత్తుపల్లాలు ఎవరికైనా కామనే అయినప్పటికీ వర్మ మాత్రం దివాల్ కోర్ ట్వీట్లతో అందరినీ కెలుగుతున్నాడు. ఇష్టమన్నవారిని పొగడం... ఇష్టం లేని వారిని తెగడతం ఆర్జీవీకి వెన్నతో పెట్టిన విద్య. భావప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా... అనీ వినాయకుడిపైనా అవాకులు, చవాకులు ట్వీట్ చేస్తాడు. దేవుళ్లను తెలంగాణ, ఆంధ్ర అంటూ విభజిస్తాడు. రామ్ గోపాల్ వర్మను తిట్టడానికి తెలుగులో ఉన్న అన్ని పదాలు చాలక మీడియా ఇంగ్లిషు, హిందీ పదాలను సైతం ఉపయోగిస్తుందంటే అతిశయోక్తి కాదు. తిక్కలోడు, చపలచిత్తం కలిగినవాడు, మూర్ఖుడు, అసాంఘీక శక్తి, పబ్లిసిటీ పిచ్చోడు, అజ్ఞాని, స్త్రీలంటే గౌరవంలేనివాడు, నైతిక విలువలు లేనివాడని, హింసాత్మక చిత్రాలు తీస్తాడని... అట్టర్ ఫ్లాప్ చిత్రాలు తీస్తాడంటారు. మొండివాడు, పొగరుబోతు, తెలివితక్కువ వాడు, నాస్తికుడు, స్వార్థపరుడు, ఉన్మాది, అహంభావి, చపల స్వభావుడు, పెద్దల పట్ల గౌరవంలేని వ్యక్తని, మంచీ మర్యాద తెలియదని, సభ్యతలేనివాడని, ఓవరాక్షన్ గాడని అంటారు. ఇటీవల ఒక డైరెక్టర్ తెలుగులో పెట్టిన ఇడియట్, రోగ్, బద్మాష్, పోకిరి, తుంటరి, లోఫర్, దేశముదురు లాంటివి పెట్టేలేమోనని చెప్పొచ్చు. ఇవి విని కూడా నవ్వుకొని ఎంజాయ్ చేయడం వర్మకే సాధ్యం.
తాజాగా వర్మ టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ భూతంపైనా వింత వైఖరి ప్రదర్శిస్తున్నాడు. మానవత్వం లేకుండా విచారణ సాగిస్తున్నారంటూ సిట్ పై చిందులేశాడు. మీడియాలో వార్తలు లీకవుతున్నయో కూడా చెప్పాల్సి ఉంటుందంటూ రంకెలు వేశాడు. సినిమావాళ్లకు ఫ్యామిలీలు ఉన్నాయంటూ... ఇష్టానుసారం నేరాలు అంటగడుతున్నారంటూ వాపోయాడు. కాదు కాదు నోరు పారేసుకున్నాడు. టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో సినీ తారలను ప్రశ్నిస్తున్న తీరుపై వర్మ విచారం వ్యక్తం చేశాడు. సిట్ అధికారులు పూరి జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా అంటూ... ట్వీట్ చేశాడు. తెలుగు మీడియా, అకున్ సభర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తోందంటూ ట్వీటాడు. అకున్ సభర్వాల్ తో రాజమౌళి బాహుబలి 3 తీయాలేమోనంటూ చెప్పాడు. సభర్వాల్ సమగ్రతను ఎవరు అనుమానించటం లేదని... . కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరమంటూ ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా డ్రగ్స్ విచారణ అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమందిని విచారిస్తున్న తీరుతో మొత్తం తెలంగాణా ప్రతిష్టకే భంగం కలిగిందంటూ ఫేస్‌బుక్ ద్వారా చెప్పాడు. డ్రగ్స్ వ్యవహారం కారణంగా పంజాబ్ రాష్ట్రం కంటే దారుణమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని.. ముంబై వాసులు అంటున్నారని వర్మ అన్నాడు. విచారణ అంటూనే లేనిపోని లీకులను బయటకు ఇస్తుండటాన్ని వర్మ ఖండించాడు. సభర్వాల్ మానవత్వం లేని మనషని, డ్రగ్స్ కేసుల్లో ఉన్నవారి పేర్లను మీడియాకు లీక్ చేశాడంటూ ఆయన విమర్శించాడు. అయితే వర్మ కామెంట్లపై అకున్ సభర్వాల్ స్పందించాడు. తమపై ఇష్టా రాజ్యంగా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే తాము డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టంచేశారు. కేవలం సినిమా వాళ్లనే టార్గెట్ చేసినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడలేమని, అందరికీ పిల్లలున్నారని, తాము అలాంటి పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో చేయమని స్పష్టంచేశారు. మరోవైపు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలైంది. సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌శాఖ విచారణకు ఆటంకం కలిగించేలా వర్మ వ్యాఖ్యలు చేశారని, ఇలా వ్యాఖ్యలు చేయడం శిక్షార్హమేనని న్యాయవాది రంగప్రసాద్ రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. డ్రగ్స్ కేసుతో వర్మకు సంబంధం లేదని, అయినా ఎక్సైజ్ అధికారులను కించపరిచేవిధంగా, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా వర్మ వ్యాఖ్యలు చేశారని రంగప్రసాద్ తెలిపారు. టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్, మా అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేం లేదని, వర్మ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ముందుకొచ్చి వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ కేసుకు ఒరిగేదేం లేదు. ఈ కేసులో నోటీసులు అందుకున్న సెలబ్రిటీలకు, విచారణ చేపట్టిన అధికారులకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు. సిట్ విచారణ ద్వారా త్వరలోనే నిజనిజాలు వెల్లడవుతాయి. ఈ కేసుపై ఇండస్ట్రీ వారితో పాటు బయటివారు ఏం మాట్లాడినా అబద్దాలు నిజాలు కావు. నిర్దోషులుగా ఉన్న వ్యక్తులను దోషులుగా నిరూపించడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు. డ్రగ్స్ మాఫియా కేసులో చిత్ర పరిశ్రమనే టార్గెట్ చేశారనడం సరికాదని రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఈ కేసులో సిట్ అదికారులు అందరినీ విచారణ చేస్తున్నారని చెప్పాడు. అందులో భాగంగానే సినీ నటులు విచారణకు హాజరవుతున్నారని పోసాని తెలిపారు. విచారణకు హాజరైన వారిలో కొందరు బ్లడ్ శాంపిల్స్ ఎందుకు ఇవ్వడం లేదనేది వాళ్ల వ్యక్తిగత విషయమన్నారు. అదే తనను అడిగితే స్వచ్ఛందంగా బ్లడ్ శాంపిల్ ఇస్తానని, ప్రభుత్వం సిగరెట్లు, మద్యాన్ని నిషేధించాలని పోసాని విజ్ఞప్తి చేశారు. మొత్తంగా తన పని తాను చేసుకోకుండా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న బడాయి మాటలు మొత్తం ఇండస్ట్రీపై నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తున్నాయ్. విచ్చలవిడిగా వ్యవహరించే ఆర్జేవీ తన మాటలను తనకు మాత్రమే కాకుండా వ్యవస్థలకు ఆపాదిస్తే ఎంతటి ఉపద్రవాలైనా రావొచ్చనడంలో సందేహం లేదు.
ఆర్జీవీ ఇప్పుడో ఎక్సపైర్ అయిన దర్శకుడు. ఆయన సినిమాల్లో విషయం లేదు. స్టోరీలో కథ లేదు. స్క్రీన్ ప్లేలో మ్యాటర్ లేదు. ఓవరాల్ గా సినిమాలో సీన్ లేదు. అందుకే ట్వీట్టర్లో ట్వీట్ అంటూ చెలరేగిపోతున్నాడు. విషయమున్న సినిమాలు తీయాలన్న కసీ ఆర్జీవీలో లేదు. పబ్బం గడుపుకోవడం... టైమ్ పాస్ చేయడం... మసిపూసి మారేడుకాయ చేయడమే వర్మకు తెలిసింది. తన చెప్పిందే నిజం కాబోలని జనం అనుకోవాలన్న ఇజం వర్మది. వంద మందిలో ఒక్కరు తనను అభిమానించినా అదే పదివేలనుకుంటాడు. వినీ వాళ్లు వెర్రోళ్లతై చెప్పేవాడు ఆర్జీవీ అన్న నానుడి వచ్చే రోజుల్లో వైరల్ అవుతుందేమో... వర్మ ట్వీట్ చేసినా, కామెంట్ చేసినా వదిలేయడం ఒక్కటే ఇప్పుడు మీడియా చేయాల్సింది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.

No comments:
Post a Comment