రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవలేమని కాంగ్రెస్ పార్టీకి తెలుసు... కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే యూపీఏ భాగస్వామ్య పక్షాలకూ చాలా స్పష్టంగా ఈ విషయం తెలుసు. అయినప్పటికీ... రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్యపక్షాలు పోటీకి దిగాయ్. అదే సమయంలో బీజేపీకి రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం నల్లేరుపై నడకేనని తెలుసు. అయినా దేశంలోని కీలక పార్టీలతో సంప్రదింపులు జరిపారు. అటు యూపీఏ, ఇటు ఎన్డీఏ పక్షాల్లో లేని పార్టీలు మాత్రం... ఎవరికి నచ్చనవారికి వారి మద్దతును ప్రకటించాయ్. అయితే విపక్షంతోనే ముందడు వేస్తానంటూ మీసం మెలేసిన నితీష్ మాత్రం బీజేపీ అభ్యర్థికే జై కొట్టాడు. ఇప్పటికే బక్కచిక్కన యూపీఏకు నితీష్ షాక్ ఇచ్చాడు. నితీష్ నిర్ణయానికి కారణం బీహార్ డ్రామానేనన్నట్టుగా తెలుస్తోంది. అటు ఎన్డీఏ... ఇటు యూపీఏ రెండు పక్షాలు కూడా రాష్ట్రపతి ఎన్నిక ద్వారా దళిత్ కార్డును తెరపైకి తీసుకొచ్చి... సచ్చీలతను నిరూపించుకునేందుకు పోటీపడుతున్నాయ్. రాష్ట్రపతి ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలేంటి? కాంగ్రెస్ పార్టీని ఒంటరి చేయాలనుకుంటున్న బీజేపీ ఎత్తుగడలేంటి? మంచి బేరం కోసం చూస్తున్న కీలక పార్టీల వ్యూహాలేంటి? రాష్ట్రపతి రాజకీయంపై రాజ్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికలను గత వైభవాన్ని పునర్నిర్మించుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ బీజేపీ నేతలు విజ్ఞప్తులు చేసినా... సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా తాము... ప్రతిపక్షం నుంచి రాష్ట్రపతి ఎన్నికకు అభ్యర్థిని నియమిస్తున్నట్టుగా ఆ పార్టీలు చెబుతున్నాయ్. తమకు బలం తక్కువ ఉన్నప్పటికీ... అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు చాలానే ఉన్నాయ్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల ద్వారా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దేశ వ్యాప్తంగా మోదీ గాలికి దెబ్బతిన్న హస్తం పార్టీ రాష్ట్రపతి ఎన్నికల ద్వారా పునర్వైభవం కోసం తహతహలాడుతోంది. మోదీ గాలికి పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కకావికలం కాగా... పలు రాష్ట్రాలు ఇప్పటికే బీజేపీ ఖాతాలో పడ్డాయ్. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం నేడు పావు వంతు కూడా లేని పరిస్థితి తలెత్తింది. అయితే కాంగ్రెస్ పార్టీ విపక్షాల మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని రాష్ట్రపతి ఎన్నికల ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మీరా కుమార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దించింది. 17 పార్టీలు మీరా కుమార్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. అయితే బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తానంటూ బీహార్ సీఎం నితీష్ కుమార్ మద్దతివ్వడంతో కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో పడింది. అందుకే యూపీఏలో కీలకంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ తో రాయబారాన్ని నడుపుతోంది. అయితే నితీష్ మాత్రం తనదారి తనదేనంటున్నాడు. అదే సమయంలో శరద్ పవార్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో క్లారిటీ ఉంది. అయితే పలు సమస్యలతో సతమతమవుతున్న శరద్ పవార్ తీసుకునే నిర్ణయం కూడా యూపీఏ మనుగడపై ప్రభావం చూపనుంది. మొత్తంగా మీరా కుమార్ కే శరద్ పవార్ పార్టీ మద్దతు పలుకుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఆలోచనలు సుస్పష్టం. ఎవరు ఎటువైపు మిగులుతారు... ఎవరు తమతో ఉంటారన్న లెక్కలే ఆ పార్టీ వేసుకుంటుంది. ఇప్పటికే అవసరార్థం పలు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో అడుగులు వేస్తున్న పలు పార్టీలు... అవసరమైతే బీజేపీ వైపు అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయ్. ప్రస్తుతం యూపీఏలో ఉన్న పార్టీలను ఓసారి పరిశీలిస్తే...కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, జేడీఎస్, బీఎస్‌పీ, సమాజ్‌వాదీపార్టీ, ఆర్‌జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, డీఎంకె, ఆర్‌ఎల్‌డీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తిమోర్చా, ఆర్‌ఎస్‌పీ, ఏఐయూడీఎఫ్. విపక్షాల బలాన్ని ఓసారి పరిశీలిస్తే... కాంగ్రెస్ పార్టీ బలం 14.62%, తృణముల్ కాంగ్రెస్ బలం 5.78%, సమాజ్ వాదీ పార్టీ బలం సమాజ్‌వాది 2.36%, సీపీఎం పార్టీ బలం 2.45%, బీఎస్పీ 0.74%, ఆర్జేడీ బలం 1.7%, డీఎంకే బలం 1.66%, ఎన్‌సీపీ బలం 1.44%, ఇక మీరా కుమార్ ను మద్దతిస్తున్న ఇతర పార్టీల బలం 2.83 % శాతంగా ఉంది. మొత్తంగా యూపీఏ భాగస్వామ్య పక్షాల ఓట్ల విలువ 3,70,804 కాగా... ఆ నిష్పత్తి శాతం 34% శాతానికి కొంచెం అటు ఇటూగా ఉంది.
కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం లేదని తెలిసి కూడా... అభ్యర్థిని నిలపడం ద్వారా తన బలానికి... అదనంగా జతవుతున్న బలమే కారణం. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభ్యర్థిని నిలపాలనుకునే ఉద్దేశం వేరు. ఉమ్మడి విపక్షాల అభ్యర్థి వేరన్నది ఆ పార్టీ అంతరంగం. 2019 ఎన్నికల నాటికి తమతో కలిసి సాగుతున్న పలు పార్టీలన్నీ కలిసి... మోదీపై యుద్ధం చేయడానికి ఇది వేదికగా కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అందుకే గెలవలేమని తెలిసి కూడా రాష్ట్రపతి పోటీ బరిలో దిగింది.
విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దిగుదామని భావించినప్పటికీ... నితీష్ కుమార్ తన దారి తను వెతుక్కోవడంతో... కాంగ్రెస్ వ్యూహం బెడిసికొడుతోంది. మరోవైపు యూపీఏలో కీలకంగా ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం సస్పెన్స్ ను కొనసాగిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యూపీఏ పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మీరాకుమార్ ను ప్రతిపాదించాయి. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవాలంటే... రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం ఒక్కటే మార్గమని యూపీఏ భాగస్వామ్యపక్షాల నేతలు ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలతోపాటు, బీఎస్పీ సైతం కాంగ్రెస్ ప్రతిపాదించిన మీరా కుమార్ కు మద్దతు ప్రకటించారు. దళితనేత ఉన్నతిని అడ్డుకోవడం సమంజసం కాదన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి చెబుతున్నారు. ఎన్డీఏ ప్రతిపాదించిన అభ్యర్థికంటే యూపీఏ ప్రతిపాదించిన అభ్యర్థి సమర్థవంతమైన వ్యక్తిగా బెహన్జీ అభిప్రాయపడ్డారు. మోదీని వ్యతిరేకించే భాగస్వామ్యపక్ష పార్టీలన్నీ జులై 17న జరగనున్న మీరా కుమార్ కు మద్దతివ్వాలని సోనియాగాంధీ పిలుపునిచ్చారు. తద్వారా ఒంటెద్దు పోకడలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపు తీసుకెళ్తున్న మోదీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ మిత్రులకు పిలుపునిచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక సిద్ధాంతపరమైన పోరాటంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయ్.
మరోవైపు విపక్షం నుంచి రాష్ట్రపతి అభ్యర్థి ఖరారైన వెంటనే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్ తో భేటీ అయ్యారు. తమకు ఉన్న బలాన్ని లెక్కలు వేసుకున్న ప్రధాన మంత్రి మోదీ... ఎన్నికలు పూర్తయ్యే వరకు జాగురకతో వ్యవహరించాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీ ప్రతిపాదించిన రామ్ నాథ్ కోవింద్ కు తమిళనాడులోని అన్నాడీఎంకే రెండు గ్రూపుల మద్దతు లభించడంతో 60 శాతానికి పైగా ఓట్లు రానున్నాయ్. మరోవైపు యూపీఏలోని రెండు కీలక పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్సీపీ మహారాష్ట్రకు చెందిన నేతలను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలంటూ పలు పేర్లు ప్రతిపాదించడంపైనా కాంగ్రెస్ పార్టీ అసహనంతో ఉంది. మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని లాలూ ప్రతిపాదించగా... బీఎస్పీ అధినేత్రి సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అంగీకరించింది. వామపక్షాలు అందుకు జై కొట్టాయ్. అయితే అప్పటి వరకు బీజేపీకి వ్యతిరేక గ్రూపులో ఉన్న నితీష్ తీరుతో యూపీఏ నేతలంతా అవాక్కయ్యారు.
రామ్ నాథ్ కోవింద్ కు మద్దతిచ్చే ఆలోచన మానుకోవాలని... బీహార్ సీఎం నితీష్ కుమార్ ను యూపీఏ పక్షాల నేతలు కోరినప్పటికీ... ఆయన అందుకు ససేమిరా చెప్పారు. కోవింద్ కు మద్దతివ్వడం ఖాయమని తేల్చేశారు. అయితే బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ పునరాలోచించుకోని... యూపీఏ అభ్యర్థికి మద్దతు పలకాలని యూపీఏ పార్టీలు విజ్ఞప్తి చేశాయ్. మరోవైపు బీహార్ కుమార్తెగా బరిలో నిలిచిన మీరా కుమార్ కు మద్దతివ్వాల్సిందిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కు విజ్ఞప్తి చేశారు. స్వయంగా కలిసి బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చే ఆలోచనను పునరాలోచించుకోవాలని సూచించారు. బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడమంటే... చరిత్రలో ఘార తప్పిదమవుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం దళిత అభ్యర్థిని నియమించినందున మీరాకు మద్దతు పలకాలని బీహార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం నితీష్ కు విజ్ఞప్తి చేశారు. అయితే నితీష్ కుమార్ పార్టీ నేతలు మాత్రం తాము బీజేపీ అభ్యర్థి కోవింద్ కు మద్దతివ్వాలని నిర్ణయించామని... నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునే అవకాశమే లేదని స్పష్టం చేశారు. బీహార్ లో దళితుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్న నితీష్ కుమార్... కోవింద్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించడం ద్వారా... తన బేస్ ను విస్తృతం చేసుకోవాలని ఆ నితీష్ పార్టీ భావిస్తోంది. బీహార్ లో యాదవేతర కులాలపై మంచి పట్టున్న నితీష్... ఇప్పుడు దళిత్ రాజకీయాలు కూడా తనకు కలిసి వస్తాయని భావిస్తుననారు. యూపీకి చెందినప్పటికీ... జాతవేతర కులానికి చెందిన రామ్ నాథ్ ను సపోర్ట్ చేస్తే తనకు ఆ వర్గానికి చెందిన ప్రజల మద్దతు లభిస్తుందని నితీష్ భావిస్తున్నారు. ఇప్పటికే లాలూ మీరా కుమార్ ను సపోర్ట్ చేయడం ద్వారా జాతవ వర్గం తనకు ప్రతికూలంగా ఉంటుందన్న అభిప్రాయం కూడా నితీష్ లో బలంగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికల ద్వారా బీహార్ లో క్యాస్ట్ పాలిటిక్స్ కు అటు లాలూ, ఇటు నితీష్ తెరదీశారు.
బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ద్వారా నితీష్ కుమార్... బీహార్ లో తనకు కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల నుంచి వస్తున్న సమస్యలకు చెక్ పెట్టే ఆలోచన చేసినట్టుగా భావించాలి. మాకు నితీష్ ద్రోహం చేస్తాడా... చేయడా అన్నది నితీష్ కుమార్ కు మాత్రమే తెలుస్తుందని లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో బీహార్ సంకీర్ణంలో మేం భాగస్వాములుగా ఉన్నాం... అది మాత్రం కొనసాగుతుందని లాలూ స్పష్టం చేశారు.
బీహార్ లో లాలూతో కలిసి సాగిస్తున్న ప్రయాణానికి నితీష్ గుడ్ బై చెప్పేందుకు రాష్ట్రపతి ఎన్నికను సోపానంగా మలుచుకుంటున్నాడు. లాలూ కంటే బీజేపీయే నయమన్న అభిప్రాయంలో నితీష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే నితీష్ వేరు దారి ఎందుకు చూసుకున్నారు. యూపీఏతో ఉన్న నితీష్ ఆలోచనల్లో వచ్చిన మార్పులేంటి? లాలూతో ట్రబుల్స్ వద్దనుకొనే మోదీ దారిలో నడుస్తున్నారా?
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి... మద్దతు ప్రకటించడం ద్వారా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. బీహార్ కు చెందిన దళిత ముఖ్యనేత మీరా కుమార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా యూపీఏ ప్రతిపాదించినప్పటికీ... నితీష్ మాత్రం విభేదించారు. నితీష్ చాలా స్మార్ట్ గా ఆలోచించి అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇప్పటికే ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా ఘట్ బంధన్ కూటమి ద్వారా బీహార్ లో పాలన సాగిస్తున్న నితీష్... ఆర్జేడీ నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలతో తనదారి తాను చూసుకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీతో గతంలో కలిసి పనిచేసిన నితీష్ కుమార్... మరోసారి అదే బాటలో పయనిస్తున్నట్టు కన్పిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీని విభేదించిన నితీష్... ప్రస్తుతం... బీజేపీకి దగ్గర కావాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కేంద్రంతో సయోధ్య కోరుకోవడం ద్వారా... బీహార్ లో తన సీటును పదిలం చేసుకోవాలన్న యోచన నితీష్ లో బలంగా ఉంది. అందులో భాగంగానే సోనియా గాంధీ నిర్వహించిన యూపీఏ భాగస్వామ్యపక్షాల లంచ్ భేటీకి సైతం నితీష్ హాజరు కాకపోవడం వ్యూహాత్మకమేనన్నది స్పష్టమవుతుంది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉందని చెప్పినప్పటికీ... నితీష్ ముందుగానే తాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గూటికి చేరాలని డిసైడైపోయినట్టుగా ఉన్నారు.
ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ను నితీష్ కుమార్ బాహాటంగా సమర్థించారు. మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించడం ద్వారా... తాను మోదీ అండ్ కోకు అనుకూలంగా ఉన్న అభిప్రాయాన్ని కలిగించాడు. విపక్షాలన్నీ ఏకమై మోదీని పెద్ద నోట్ల రద్దు విషయంలో దుమ్మెత్తిపోసినా... నితీష్ మాత్రం కేంద్ర నిర్ణయానికి జై కొట్టాడు. తాము రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో నిమిషానికో, సెకనుకోసారి నిర్ణయం మార్చుకునేది లేదని జేడీయూ కీలక నేత ఎన్సీ త్యాగి స్పష్టం చేశారు. అయితే నితీష్ నిర్ణయం చారిత్రాత్మక తప్పిదమని... లాలూ భావిస్తున్నారు.
2019 ఎన్నికలకు ముందే రాష్ట్రపతి ఎన్నికల ద్వారా రాజకీయ పునరేకీకరణ మొదలైందిగా భావించవచ్చు. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు యూపీఏ, ఎన్డీఏలో భాగస్వాములు కాకపోయినప్పటికీ... బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న భిన్న రాజకీయ పరిణామాలతో ఆ పార్టీలు ఆవిధంగా అడుగులు వేస్తున్నాయ్. తమిళనాడులో అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయ్. అటు ఎన్టీఏ, యూపీఏలో లేని తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయ్. అదే సమయంలో ఒడిసా సీఎం నితీష్ కుమార్ సైతం ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో బీజేపీ బలపర్చిన రామ్ నాథ్ కు ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకే అనుకోవాలి. మూడు పార్టీలకు గణనీయమైన సంఖ్యలో ఓట్ల విలువ ఉండటం... యూపీఏ అభ్యర్థిపై ఎన్డీఏ అభ్యర్థి సునాయాశంగా విజయం సాధించడానికి కారణమని చెప్పవచ్చు.
మీరా కుమార్ ను ప్రతిపాదించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎత్తులు విఫలమవతున్నాయా? అమిత్ షా-మోదీ ద్వయం... యూపీఏ అభ్యర్థిని చిత్తుచేసేందుకు దళిత కార్డును ప్రయోగించారా? 2014 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు 2019లో రిపీట్ కావాలన్న ఆలోచనతో బీజేపీ ఎత్తులు వేస్తోందా? అందుకు రాష్ట్రపతి ఎన్నికను రాజకీయ యుద్ధంగా మార్చుతోందా?
అగ్రవర్ణాల పార్టీగా ముద్రపడిన బీజేపీ ఆ అభిప్రాయాన్ని రోజు రోజుకు తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మోదీ, అమిత్ షా ఇందుకు సంబంధించి వ్యూహాత్మక అడుగులు వేస్తూ... కాంగ్రెస్ పార్టీని చిత్తు చేస్తూ వస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్ పార్టీని 2019 ఎన్నికల్లో దెబ్బతీయాలని ఆ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే దళిత్ కార్డును మరోసారి తెరపైకి తెచ్చింది. అంటే రెండు వర్గాలు కూడా దళిత్ కార్డ్ అస్త్రంతో లబ్ధి పొందే గేమ్ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నాయ్. ఎన్డీఏ దళిత్ కార్డుపై యూపీఏ సైతం దళిత్ కార్డును ప్రయోగిస్తోంది. దళిత్ అంశాన్ని తెరపైకి రాకుండా చూడాలని భావించిన కాంగ్రెస్ పార్టీ... చివరకు తమ వైపు నుంచి కూడా దళిత్ అభ్యర్థినే ప్రకటించాల్సిన పరిస్థితి తెచ్చుకొంది. యూపీకి చెందిన దళిత మేధావి రామ్ నాథ్ కోవింద్ ను బీజేపీ రంగంలోకి దించితే... బీహార్ కు చెందిన మరో కీలక దళిత నేత, మాజీ లోక్ సభ స్పీకర్ ను యూపీఏ బరిలోకి దించింది. స్వాతంత్ర్య సంపాదించిన తర్వాత... దేశ చరిత్రలో... రాష్ట్రపతి ఎన్నికల విషయంలో... మా దళిత్... మీ దళిత్ అంటూ కొత్త పొకడ ఆవిష్కృతమవుతోంది. దళిత్ లోనూ యూపీఏ అభ్యర్థి మీర్ కుమార్ జాతవ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే ఎన్డీఏ అభ్యర్థి జాతవేతర వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గతంలో దళిత్ రాష్ట్రపతి అభ్యర్థిగా కేఆర్ నారాయణన్ బరిలోకి దిగిన సందర్భంగా... విభిన్న పక్షాల రాజకీయ పార్టీలన్నీ కూడా మద్దతిచ్చిన సందర్భాన్ని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. నాడు శివసేన సైతం రాష్ట్రపతి అభ్యర్థి కేఆర్ కు మద్దతివ్వడం సంచలనం కలిగించింది. అయితే ఇప్పుడు దళిత్ పేరుతో మరోసారి వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ కు మద్దతివ్వడం గొప్ప విషయమంటూ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. లోక్ సభ స్పీకర్ గా మీరా కుమార్ పోటీ చేసిన సమయంలో కూడా దళిత్ కార్డును ఉపయోగించడాన్ని బీజేపీతో సహా పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయ్. ఇటీవల ప్రధాని మోదీ పలు బహిరంగ సభల్లో మా బేటీకా సర్కార్... సోనియా, రాహుల్ గాంధీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. వారసత్వ రాజకీయాలంటే జనం విసిగిపోతున్నారని స్పష్టం చేస్తున్నారు. మరోసారి జగజ్జీవన్ రామ్ వారసత్వమంటూ మీరా కుమార్ ను రంగంలోకి దించడంపైనా బీజేపీ నేతలు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఓడిపోతారని తెలిసి కూడా ఆమెను బలిపశువు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
బీజేపీ లెక్కలు క్లియర్. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుస్తామని తెలుసు. అయితే అదే సమయంలో ఎవరు ఎవరి వైపు ఉన్నారో తేల్చేయాలన్నది ఆ పార్టీ ఎత్తుగడ. రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు ద్వారా తమకు అనుకూలురెవరు? వ్యతిరేకులెవరు? ఈ లెక్క తేల్చాలనే బీజేపీ రాష్ట్రపతి ఎన్నిక కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక కోసం మోదీ-షా ద్వయం చాన్నాళ్ల నుంచే కసరత్తు చేస్తోంది. దేశ వ్యాప్తంగా బీజేపీని నిలబెట్టాలన్న లక్ష్యమే ఎజెండాగా ఆ పార్టీ అడుగులు వస్తోంది. కాంగ్రెస్ ముక్తి భారత్ అంటూ నినదిస్తున్న మోదీ, షా రాష్ట్రపతి ఎన్నికల ద్వారా ఆ పార్టీని మరింత అస్థిరపర్చాలని వ్యూహాలు రచించారు. కాంగ్రెస్ పార్టీతో అంటకాగడం వల్లే భవిష్యత్ ఉండదని... ఆ పార్టీకి నాయకత్వమే లేదన్న అభిప్రాయాన్ని కలిగించడానికి బీజేపీ నేతలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. పైకి ఏకాభిప్రాయం పేరుతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని బీజేపీ కీలక నేతలు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య చర్చలు జరిపినప్పటికీ... అవి సఫలం కావని వారికి కూడా తెలుసు. అయితే తాము ఏకాభిప్రాయం కోసం కృషి చేశామన్న అభిప్రాయాన్ని జనంలో కలిగించడం వారి ముఖ్య ఉద్దేశం. రాష్ట్రపతి ఎన్నిక కోసం బీజేపీ పెద్దలు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. దేశంలోని కీలక పార్టీ నేతలందరితో అటు మోదీ, ఇటు అమిత్ షా పలు దఫాలా చర్చలు జరిపారు. ఎన్డీఏ పక్షాలు నుంచి ఓ వైపు మద్దతు లభిస్తున్నా... యూపీయేతర పార్టీల మద్దతు పొందాలని ఆ పార్టీ నిర్ణయించింది. దాంట్లో భాగంగానే అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో సంప్రదింపులు జరిపారు. మూడు పార్టీలకు గణనీయమైన సంఖ్యలో ఓట్ల విలువ ఉండటం కూడా బీజేపీకి కలసి వచ్చిందని చెప్పవచ్చు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలకు 5.36 ఓట్ల శాతం, వైసీపీకి 1.53 ఓట్ల శాతం, టీఆర్‌ఎస్ పార్టీకి 1.99, బీజేడీకి 2.98 ఎన్డీయే అభ్యర్థికే తమ మద్దతు ప్రకటించాయి. నాలుగు పార్టీల ఓట్ల విలువ 11.86 %గా ఉంది. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు 5,37,683 ఓట్ల విలువ ఉండగా... ఆ మొత్తం 48.64% గా ఉంది. ఎన్డీఏ పక్షాలతో గెలవడానికి కొంచెం లోటు అంటే 1.36 % మాత్రమే తక్కువ ఓట్లు ఉన్నాయ్. అదే సమయంలో తటస్థ పార్టీలుగా ఉన్న ఓట్ల విలువతో కలిపితే... 60.5 శాతమవుతుంది. ఇక జేడీయు బలం 1.89 %. మొత్తంగా ఎన్డీఏ బలం 62.39 అవుతుంది.
యూపీఏ అభ్యర్థికి 34 శాతం ఓట్ల విలువ వస్తుంటే... ఎన్డీఏ అభ్యర్థికి 63 శాతానికి కొంచెం అటూ ఇటూగా ఓట్ల విలువ వస్తోంది. తద్వారా రాష్ట్రపతి అభ్యర్థిగా తాము నిలబెట్టిన రామ్ నాథ్ గోవింద్ అఖండ విజయం సాధించడం ఖాయం. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం ఓట్ల విలువ 10,98,903. దీంట్లో సగం కన్నా ఒక ఓటు ఎక్కువ 5,49,452 ఓట్లు వచ్చిన వారు గెలుస్తారు. ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి వచ్చే ఓట్ల విలువ 6,89,630 గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మోదీపై కాలుదువ్వే ఆప్ పార్టీకి .82 శాతం ఓట్ల విలువ ఉండటం విశేషం. లెక్కలు తేలిపోయాయ్. వాటిని ఇంప్లిమెంట్ చేయడమొక్కటే మిగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉన్న పలు పార్టీలను తమ ఫోల్డ్ లోకి తీసుకోవడం... జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని చెల్లాచెదురు చేసి... 2019 ఎన్నికల్లో చావుదెబ్బతీయాలని మోదీ వ్యూహాం రచించారు. అందుకు రాష్ట్రపతి ఎన్నికను ఫ్లాట్ ఫామ్ గా వినియోగించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సైతం మోదీని దెబ్బతీసేందుకు ఇదే రాష్ట్రపతి ఎన్నికను అస్త్రంగా చేసుకోవాలని భావిస్తోంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఎటువైపు ఉన్నారన్నది క్లియర్ అయిపోయింది. లెక్కలు మొత్తం పక్కాగా తెలిపోయాయ్. పోలింగ్ ఒక్కటే మిగిలి ఉంది. గెలుపెవరిదో కూడా ఇప్పటికే తెలిపోతోంది. మొన్నటి వరకు బీజేపీ మత రాజకీయాలతో సమాజాన్ని చీలుస్తుందని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ ట్రాప్ లో చిక్కుకుపోయింది. దళిత్ కార్డుకు... దళిత్ కార్డ్ అంటూ ఆ పార్టీ రామ్ నాథ్ కోవింద్ పై మీరా కుమార్ ను నిలబడితే... ఇప్పుడు అందులో సబ్ క్యాస్టులను రాజకీయంగా క్యాష్ చేసుకునేలా యూపీ, బీహార్ పాలిటిక్స్ నడుస్తున్నాయ్. లాలూ ట్రాప్ నుంచి నితీష్ ను బయటకు లాగామని బీజేపీ భావిస్తుంటే... నితీష్ తో మరికొంత కాలం కలిసే ఉండాలని లాలూ భావిస్తున్నారు. అయితే రెండు వర్గాల మధ్య స్పష్టమైన విభజన వస్తున్న నేపథ్యంలో కాపురం సాగించడం కష్టమే. యూపీ రాజకీయాల ద్వారా దేశంలోనే అతి శక్తిమంతమైన నాయకుడిగా అవతరించిన మోదీ... ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక ద్వారా తన పట్టును నిలబెట్టుకొని 2019 ఎన్నికలకు బలమైన పునాదిని ఢిల్లీలో వేస్తున్నారు.

No comments:
Post a Comment