Friday, 14 July 2017

ఫ్లైబోర్డ్స్ ప్రయాణం



ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న నేటి ప్రపంచంలో మానవుడు తనకు నచ్చిన విధంగా  ఆటలాడుతూ ఆనందాన్ని పొందుతున్నాడు. గాల్లో ఎగరుతూ...  నీటిలో తేలుతూ...  ఇలా మానవుడు తనకు నచ్చిన విధంగా విన్యాసాలు చేస్తూ ఆనందాన్ని పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చిన ప్లైబోర్డ్స్ నీటిపై మానవుడు సరికొత్త విన్యాసాలు చేసేందుకు వేదికగా నిలుస్తోంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యంత్రమే ఫ్లై బోర్డ్. కొత్త కొత్త ప్రయోగాలతో సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న శాస్త్రవేత్తలు నీటిలో తేలియాడే సరికొత్త ఫ్లైబోర్డును ఆవిష్కరించారు. నదుల్లోనూ, సముద్రాల్లోనూ హైడ్రో ఫ్లయ్యింగ్  క్రీడ ఇప్పుడు అత్యంత ప్రాచూర్యం పొందుతోంది. ప్లై బోర్డు ద్వారా భారీగా ఉన్న నీరు వేగంగా నెట్టడంతో నీటి మట్టం నుంచి 50 అడుగుల ఎత్తుకు ఎగరొచ్చు.
ఫ్రాన్స్ కు చెందిన వాటర్ క్రాఫ్ట్ రైడర్ ఫ్రాంకీ జాప్టా ఈ యంత్రాన్ని 2012లో కనిపెట్టాడు. ఈ పరికరాన్ని ఉపయోగించి నీటిలోంచి ఆకాశంపైకి ఎగబాకేందుకు వీలు కలుగుతుంది. ఈ యంత్రాన్ని కనిపెట్టిన జాప్టాకు ఫ్రెంచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ పేటెంట్ కూడా అందించింది. పాదాన్ని తొక్కి ఉంచడం ద్వారా చేయిని స్టేబుల్ గా ఉంచుకోవడం ద్వారా ఈ యంత్రం పనిచేస్తోంది. నీటిలో మునిగి అమాంతంగా పైకి తేలడం ఈ యంత్రంతో సాధ్యవుతుంది. ఫ్లైబోర్డును ఉపయోగించి క్రీడాకారులు ఏవిధంగా ఆటలాడుతున్నారో మీరు ఓసారి చూడండి...
ఫ్లైబోర్డును ఉపయోగించి నీటిపై ఎన్నోరకాల విన్యాసాలు సునాయసంగా చేయోచ్చు. నీటిపై ఎగిరి గంతులేయడమే కాకుండా... తమకు నచ్చిన విధంగా ఫీట్స్ వేయోచ్చు.  నీటిలోపలకు వెళ్లడమే కాకుండా... పైకి ఒక్కపట్టున లేచి నిలబడొచ్చు. ఫ్లైబోర్డుకు సంబంధించి జాప్టాపై కేసు వేసిన ప్రత్యర్థి జెట్లేవ్ తర్వాత కేసు ఉపసంహరించుకున్నాడు.  ఇప్పటి వరకు 2500 పైగా ఫ్లై బోర్డ్ యంత్రాలను జాప్టా విక్రయించారు. ఫ్లైబోర్డు ఆన్ లైన్లో అమ్మకానికి దొరుకుతాయ్. వీటి ధర సుమారుగా రూ.  7 నుంచి 8 లక్షల వరకు ఉంటుంది. ఫ్లైబోర్డు ఛాంపియన్ షిప్ పోటీలు తొలిసారిగా ఖతార్ రాజధాని దోహాలో జరిగాయ్. గోవా తీరంలోనూ ఫ్లైబోర్డ్ విన్యాసాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయ్. ఇక కృష్ణా పుష్కరాల్లోనూ ఫ్లైబోర్డ్ విన్యాసాలు యాత్రికులను ఆకట్టుకున్నాయ్. 

No comments:

Post a Comment