డ్రాగన్ భూదాహం
చైనాకు ఆకలి ఎక్కువవుతోంది. పట్టనంత తిని... ఆరాయించుకోవాలని ఆ దేశం తహతహలాడుతోంది. మింగలేక ఎక్కిళొస్తున్నా... ఇంకా ఇంకా... తినాలన్న కాంక్ష డ్రాగన్ లో ఎక్కువైపోతోంది. ప్రపంచ పెద్దన్న అమెరికాను మించి పోవాలనన్న లక్ష్యంతో దురాక్రమణలకు కాలుదువ్వుతోంది. ఆర్థికంగా ప్రపంచాన్నే శాసించే స్థాయికి చేరుకున్నామని భావిస్తున్న డ్రాగన్ ఇప్పుడు... చుట్టూ ఉన్న దేశాలను నయానోభయానో తన దారిలోకి తెచ్చుకోవాలని కుట్ర పన్నుతోంది. ఇప్పటి వరకు వ్యాపార వాణిజ్యంతో పొరుగు దేశాలపై పెత్తనం చెలాయిస్తున్న డ్రాగన్ పొరుగు దేశాల భూములను కబళించి... ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని కుట్రలు పన్నుతోంది. చేపకు వానపాము ఎరవేసినట్టుగా... చిన్న దేశాలకు కావాల్సిన ముడి సరకులును అందిస్తూ... వారి భూభాగాన్ని ఆక్రమించి... ఆ భూభాగంతోనే ప్రపంచదేశాలన్నింటిపైనా ఆధిపత్యం చేలాయించాలన్న కుతంత్రాన్ని చైనా అమలు చేస్తోంది. హంకాంగ్ పై కర్రపెత్తనం, తైవాన్ ను అదుపులో పెట్టుకోవడం, టిబెట్ ను ఆక్రమించడం, సౌత్ చైనా సముద్రాన్ని తను ఆధీనంలోకి తీసుకోవడం... ఇలా తనకు నచ్చిన రీతిలో ఇష్టారాజ్యంగా చైనా వ్యవహరిస్తున్న చైనా ఆగడాలపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్.
చైనా మాఫియా డాన్ల అవతారం ఎత్తుతోంది. తనకు నచ్చితే ఓలా... నచ్చకపోతే మరోలా... మాట వింటే ఓలా... మాట వినకపోతే ఓలా... సరెండర్ అయితే ఓలా... సరెండర్ కాకపోతే మరోలా వ్యవహరిస్తూ... చుట్టూ ఉన్న దేశాల విషయంలో డ్రాగన్ కుట్రకోణంతో చూస్తోంది. ఓవైపు అంతర్జాతీయ చట్టాలను భేఖాతరు చేసి దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం చెలాయిస్తున్న చైనా తాజాగా డొక్లామ్ ను కబళించాలని చూస్తోంది. చైనా... అమెరికా తరహాలో తనే ప్రపంచానికి పెద్దన్నగా మారిపోవాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తోంది. ఇప్పటికే చైనా ఆధీనంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైనా హాంకాంగ్ కొనసాగుతోంది. సుధీర్ఘకాలం బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న హాంకాంగ్ ఎట్టకేలకు చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి... ఆ దేశంలో భాగమైంది. అయినప్పటికీ... స్వతంత్ర ఆర్థిక వ్యవస్థగా నిలబడుతోంది. అదే సమయంలో తైవానా కూడా అంతే... చైనా ఆధీనంలో ఉన్నప్పటికీ... ప్రపంచదేశాలన్నింటితోనూ ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. రెండు దేశాలు పూర్తి పరిపాలనను తమ ఆధీనంలోనే ఉంచుకున్నాయ్. ఓవరాల్ గా రెండు దేశాలు చైనా కంట్రోల్ లో ఉంటాయ్. అంటే... పైకి చైనా పెత్తనమున్నప్పటికీ... అవి స్వతంత్ర దేశాలుగా వ్యవహరిస్తున్నాయ్.
దక్షిణ చైనా సముద్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని... తన మాటే నెగ్గాలని డ్రాగన్ కుట్రలు చేస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం చైనా సముద్రం జలాల నుంచి వెళ్లిపోవాలంటూ ఎన్నిసార్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ జల నిబంధనలను గౌరవించాలని అంతర్జాతీయ న్యాయస్థానం కుండబద్ధలు కొట్టింది. ఆ తీర్పును సైతం చైనా అపహాస్యం చేస్తోంది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ... దక్షిణ చైనాలో... మనకు అండమాన్ నికోబర్ దీవుల్లో ఏ రకంగానైతే దీవులున్నాయో... అలా దీవులను కృత్రిమంగా ఏర్పాటు చేస్తోంది డ్రాగన్. తద్వారా... ఆయా సముద్ర మార్గాలను తన గుప్పెట్లో పెట్టుకొని... ఆ మార్గాల గుండా ప్రవేశించాలంటే తన అనుమతి తప్పనిసరన్న అభిప్రాయాన్ని చైనా కల్గిస్తోంది. వాస్తవానికి అండమాన్ నికోబార్ ఐలాండ్ ప్రకృతి ద్వారా ఏర్పడ్డాయ్. అయితే చైనా దక్షిణ సముద్రంలో భూభాగాలను సృష్టిస్తూ... ప్రపంచ రవాణా వ్యవస్థను తన అదుపులో తీసుకోవాలన్న దుష్టపన్నాగాన్ని చైనా అమలు చేస్తోంది. ఎక్కడైతే అంతర్జాతీయంగా వివాదముంటుందో... అతి తనదేనంటూ చైనా వాదిస్తోంది. చుట్టుపక్కల దేశాల నుంచి ప్రతిఘటన వచ్చినా అది ఖాతరు చేయడంలేదు.
బ్రిటీష్ కాలంలో సముద్ర మార్గాలపై ఆధిపత్యం ఎవరికి ఉంటుందో... వారే ప్రపంచ దేశాలను కంట్రోల్ చేస్తారన్న అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని వంటబట్టించుకున్న చైనా... తన చుట్టూ ఉన్న దేశాలను నయనో, భయనో తన గుప్పెట్లో ఉంచుకోవాలన్న దుర్బుద్ధిని ప్రదర్శిస్తుంటుంది. 19, 20 వ శతాబ్దాల్లో ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదించాలన్న సామ్రాజ్యవాద కాంక్షతో వాస్కోడిగామా, కొలంబస్ తో సముద్రయానాన్ని కొనసాగించాయ్. సముద్ర మార్గాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేవి. అదే పంథాలో తను కూడా సముద్ర మార్గాలపై పట్టు సంపాదించి ప్రపంచాన్ని శాశించేలాన్న కుతంత్రం చైనా మదిలో మెదులుతోంది. అందులో భాగంగానే సౌత్ చైనా సీని తన ఆధీనంలో ఉంచుకునే కుట్రను పథకం ప్రకారం అమలు చేస్తోంది.
తాజాగా సిక్కిం భూభాగం సమీపంలో ఉన్న డొక్లామ్ పై పట్టు బిగించాలని చైనా కుతంత్రాన్ని రచించింది. డొక్లామ్ ఎవరి భూభాగంలో లేకుండా వివాదస్పద స్థలంగా ఉండగా... ఆ భూభాగాన్ని సంరక్షిస్తున్న భారత్ బంకర్లను నాశనం చేయడంతోపాటు... నేరుగా... అక్కడికి భూభాగంలోకి చొచ్చుకు వచ్చింది. రోడ్లు వేస్తామంటూ... బెంగాల్ సరిహద్దుల్లోకి ప్రవేశించాలన్న దుష్టపన్నాగాన్ని చైనా అమలు చేస్తోంది. అక్కడే చైనాను భారత్ అడ్డుకుంటోంది. చైనాకు గట్టి పోటీని భారత్ ఇచ్చింది. డొక్లామ్ నుంచి భారత్ దేశంలోని కీలక రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్ పై పూర్తి దృష్టి పెట్టి... రాడర్ల సైతం మన భూభాగంపై ఉన్న రక్షణ ఏర్పాట్లన్నింటినీ తనిఖీ చేయాలన్న దుర్బుద్ధి చైనాలో ఉంది. నిఘా రాడర్ల కోసమే డొక్లామ్ వద్ద ఉన్న బంకర్లను సైతం పడగొట్టడానికి కారణంగా విశ్లేషణలు విన్పిస్తున్నాయ్. కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్న చందంగా భూటాన్ పరిస్థితి తయారైంది. భూటాన్ కు చుట్టూ భారత్... ఎంతో దన్నుగా నిలుస్తోంది. అయితే ఇప్పటికే భూటాన్ లోని కొంత భూభాగాన్ని చైనా ఎప్పుడో ఆక్రమించింది. భూటాన్ లోని పాలకులుకు తాయిలాల ఆశలు చూపిస్తూ... ఆ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న దుర్నీతి సైతం చైనా మదిలో మెదులుతోంది.
మొత్తం వ్యవహారంలో భారత్ సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి మొత్తం వ్యవహారంపై ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. అదే సమయంలో చైనా ఆర్మీ అధికార ప్రతినిధి తొలుత రెండు మాటలు మాట్లాడినప్పటికీ... ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తాజాగా విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ సైతం... ఈ విషయంపై పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదంటున్నారు. చైనా మీడియా నుంచి ప్రతికూల కథనాలు పెద్ద ఎత్తున వస్తున్న భారత్ మాత్రం ఇప్పటి వరకు డొక్లామ్ ట్రై జంక్షన్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. డొక్లామ్ గురించి ఎలాంటి అడుగు వేయాలో తెలియక కాదు... ఎలా వ్యవహరించాలో తెలిసే భారత్... సైలెంట్ గా ఉందన్న అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా, భూటాన్, ట్రై జంక్షన్ కు సంబంధించిన వివాదం ఇప్పటిది కాదు. 1890 నుంచి ఉంది. సిక్కిం-టిబెట్ బౌండరీ భూటాన్ సరిహద్దుల్లోని మౌంట్ గిప్ మోచి వద్ద మొదలవుతుంది. ట్రై జంక్షన్లో భారత్ కీలక భాగస్వామన్న విషయాన్ని చైనా 1959లోనే చైనా అంగీకరించింది. 2012లో భారత్, చైనా రెండు దేశాలు కూడా ఈ ఒప్పందానికి సంబంధించి... భూటాన్ అభిప్రాయాన్ని గౌరవించాలని నిర్ణయించాయ్. 1890 కన్షెన్షన్ ప్రకారం భూటాన్ ఇందులో భాగస్వామి కాకపోవడంతో ఈ సమస్య అలాగే కొనసాగుతోంది. అదే సమయలో భూటాన్, చైనా 1988, 1998లో రెండు ఒప్పందాలను కుదుర్చుకున్నాయ్. 1959లో ఉన్న వాస్తవ పరిస్థితిని రెండు దేశాలు గౌరవించాలని నిర్ణయించుకున్నాయ్. ఇలా మూడు ఒప్పందాల ప్రకారం కూడా చైనా డొక్లామ్ నుంచి మౌంట్ గిప్మోచి వరకు రోడ్డు నిర్మించడం మూడు దేశాల ఒప్పందాలను ఉల్లంఘించడమే. చైనా ఒప్పందాలను బేఖాతరు చేసి... ఇప్పుడు భారత్ దురాక్రమణ చేస్తోందంటూ కల్లబొల్లి మాటలు చెప్పడం శోచనీయమన్నది భారత్ వాదన. ఎందుకు అనవసర విషయాలను చైనా లేవనెత్తుతుందో అర్థం కావడం లేదన్నది భారత్ విదేశీవ్యవహారాల శాఖకు బోధపడటం లేదని తెలుస్తోంది. చైనా అధికార పత్రిక మాత్రం భారత్ ను ఫలితం అనుభవిస్తుందంటూ కవ్వింపు కథనాలను వండివార్చుతోంది. డొక్లామ్ నుంచి భూటాన్ సరిహద్దుల్లోకి రహదారి నిర్మించాలని చైనా పదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే వాటిపై పెద్దగా ఆందోళనలు లేకపోయినప్పటికీ... డొక్లామ్ వద్ద రోడ్డు నిర్మించడంతోనే అభ్యంతరం మొదలైయింది. తమను భారత్ అడ్డుకోవడాన్ని చైనా తట్టుకోలేకపోతోంది. 1960కి ముందు భూటాన్ పశుపోషకులు చైనాకు గడ్డి పన్ను కట్టేవారు కాబట్టి ఆ భూభాగంపై తమకు హక్కు ఉందని చైనా భావిస్తోంది. అదే సమయంలో... డొక్లామ్ ను భూటాన్ ఎప్పుడో తమకు అప్పగించేసిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఢిల్లీ మద్దతుతోనే భూటాన్ ఇప్పుడు చైనాకు సవాలు విసిరుతుందన్న అభిప్రాయం చైనాలో వ్యక్తమవుతోంది. అయితే ఇలాంటి విషయంలో భారత్ తలదూర్చడమేంటన్నది చైనా అభిప్రాయంగా ఉంది. డొక్లామ్ అన్నది చైనా, భూటాన్ కు సంబంధించిన భూభాగమని... ఈ విషయంలో భారత్ కు ఎలాంటి సంబంధం లేదన్నది చైనా వాదన. చైనా రహదారి నిర్మాణం భారత్ కు అతిపెద్ద సవాలన్న భావనలో ప్రభుత్వం ఉంది. చైనా బలగాలు... బెంగాల్ లోని సిలిగురి కారిడార్లోకి ప్రవేశించే ప్రమాదముందని భారత్ అనుమానస్తోంది. సిలుగురి కారిడార్ నుంచే భారత్... ఈశాన్య రాష్ట్రాలతో కలసి ఉంటుంది కాబట్టే మొత్తం వ్యవహారంలో చైనా విషయంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే డొక్లామ్ ఇష్యూను కెలకడం ద్వారా... చైనా ఆలోచనలు చాలానే ఉన్నాయ్. అమెరికాతో భారత్ బలమైన ఆర్థిక, రక్షణ సంబంధాలు కలిగి ఉండటాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. భారత్ తో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ... అవన్నీ కూడా ఐటీ ఆధారితమైనవే. అమెరికా తాజాగా భారత్ కు విక్రయిస్తున్న అత్యాధునిక డ్రోన్లు, ఇతర రక్షణ పరికరాలతో భారత్ భద్రత పటిష్టమవుతుంది. చైనాను లెక్కజేయాల్సిన రీతిలో భారత్ ఎదుగుతుందన్న అభిప్రాయం ఆ దేశంలో కలగుతోందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 1949లో చైనాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భూటాన్-భూటాన్ సరిహద్దు అంశాన్ని భూటాన్ తరుపున భారత్ ప్రస్తావించే అవకాశం మనదేశానికి ఉంది. అయితే చైనా మాత్రం భూటాన్ తో మాత్రమే మాట్లాడతామంటూ చెబుతోంది.
అలీన విధానంతో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచిన భారత్ ను చైనా ఆది నుంచి ఇబ్బందులు పాల్జేస్తోంది. ఓవైపు పాకిస్తాన్ ను భారత్ పై ఉసిగొల్పి కపట నాటకాలాడుతోంది. చేసేది దొంగపైననప్పుడు... సైలెంట్ గా పని కానిచ్చేయడం ఎవరికైనా అలవాడే. అయితే డ్రాగన్ మాత్రం దొంగ నాటకమాడుతూ కూడా... డొక్లామ్ విషయంలో మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది. బుసలు కొడుతున్న డ్రాగన్ ను నిలువరించేందుకు భారత్ అడుగు ముందుకేయాల్సిన సమయం ఆసన్నమైంది. టాక్టిక్స్... స్ట్రాటజీ... ఎత్తులు... వ్యూహాల థీయరీని అమలు చేయాలన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
చైనా విషయంలో భారత్ ఎప్పుడూ దురాక్రమణదారుగా వ్యవహరించలేదు. చైనా మాత్రం అంతకంతకూ అదే కుట్రను ఇంప్లిమెంటే చేస్తూనే ఉంది. 1962లో భారత్ పై యుద్ధంతో తెగబడిన చైనాను నాడు కూడా... భారత్ ఎక్కడా ఆగౌరవంగా వ్యవహరించలేదు. నాడు నెహ్రూ భారత్ విధానమైన పంచశీల సుత్రాల ఆధారంగానే డీల్ చేసింది. అయితే ఒప్పందాన్ని కనీసం చైనా గుర్తించనూ లేదు. అటు అమెరికా, ఇటు రష్యా వైపు జరక్కుండా... తటస్థ విధానాన్ని వ్యవహించిన భారత్... ఆ తర్వాత రోజుల్లో కొత్తగా ఎలాంటి విధానాలను అమలు చేయలేదు. చైనా మాత్రం... ఒప్పందాలన్నింటినీ తుంగలో తొక్కి... తన నైజాన్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. భారత్ మాత్రం నేటికీ పంచశీల విధానాన్నే చైనా విషయంలో అమలు చేస్తోంది. చైనా మాత్రం పంచశీల ఒప్పందాలను మాత్రం ఎప్పుడూ గౌరవించలేదు.
అయితే తాజాగా చైనాను డీల్ చేయాలంటే భారత్ ఎంతో జాగురకతో వ్యవహరించాలి. టాక్టిక్స్... ఎత్తులు... స్ట్రాటజీ... వ్యూహాలను అమలు చేయడం ద్వారానే చైనా దుష్టతంత్రాన్ని కట్టిడి చేసే అవకాశం కలుగుతుంది. డొక్లామ్ లాంటివి మరో చోట రిపీటే చేసేందుకు చైనా ఎప్పుడూ తహతహలాడుతూనే ఉంటుంది. అలాంటి ఆలోచనలను మొగ్గలోనే తుంచాలంటే అందుకు అమెరికా, రష్యా మద్దతు భారత్ తప్పనిసరిగా తీసుకోవాలి. భారత్ దిగుమతులతో సుభిక్షంగా ఉన్న చైనా... భారత్ దిగుమతులను కట్టిడిచేస్తే తట్టుకొని నిలబడటం కష్టమనే చెప్పాలి. సరిహద్దుల్లో వివాదం అంతకంతకూ రేగుతున్నా... చైనా మాత్రం జీ 20 సదస్సులోనూ భారత్ పై ప్రశంసలు జల్లు కురిపించింది. అదే సమయంలో భారత్ సైతం చైనా తీరు భేష్ అంటూ సమర్థించింది. రెండు దేశాల మధ్య సమస్య జఠిలమవుతున్నప్పటికీ... అటు చైనాకానీ, ఇటు భారత్ కానీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయ్. తప్పుచేస్తోందన్న విషయం చైనా పాలకులకు తెలుసు. అలాంటి సమయంలో చైనా మీడియా దురాక్రమణదారు అంటూ పెద్ద ఎత్తున భారత్ పై కథనాలను వండి వార్చుతోంది. అయితే అవి భారత్ ను ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో తప్పించే... వాస్తవ చిత్రం వేరుగా ఉంది. చైనా ఎలాంటి అడుగులు వేసినా ప్రపంచదేశాలన్నీ తప్పుబట్టడం ఖాయం. ఇప్పటికే నాడు చైనా, భారత్ మధ్య ఉన్న మెక్ మోహన్ రేఖను సైతం చైనా గౌరవించదు. ఎక్కడిక్కడ భారత్ భూభాగాలను, చుట్టూ ఉన్న భూములను కబ్జా చేస్తూ... దమననీతికి పాల్పడుతోంది. అమెరికా, చైనా విషయంలో అనుసరిస్తున్న భారత్ వైఖరికి వంద శాతం మద్దతిస్తుంది. ఎందుకంటే చైనా దాష్టీకాలు అమెరికాకు బాగా తెలుసు. చైనా ఆగడాలపై అమెరికా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంది కూడా. అదే సమయంలో రష్యా డ్రాగన్ కు మద్దతిస్తున్నట్టుగా కన్పిస్తున్నప్పటికీ... భారత్ విషయంలో వ్యతిరేక వైఖరిని అవలంబించే పరిస్థితి ఎంత మాత్రం ఉండదు. రష్యా , అమెరికా భారత్ వైఖరికి మద్దతిస్తుంటే... చైనా ఎంత పెద్ద మిలిటరీ ఉన్నప్పటికీ... చేయడానికి ఏమీ ఉండదు. పైపెచ్చు... మన దేశం చేసుకుంటున్న చైనా వస్తువుల దిగుమతితో ఆ దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. అటు అమెరికా, ఇటు రష్యా మద్దతిస్తే... చైనా ఏం చేయగలుగుతుంది... ఓవైపు భారత్ కు ఎగుమతులు లేకుంటే చైనా మొబైల్, ఐటీ ఎక్స్ పోర్ట్స్ దెబ్బతినడం ఖాయం. అందుకే వారు కూడా తెగేదాకా లాగరు. మనల్ని చూసి చైనా ఇప్పటి వరకు ఎలాంటి దుస్సాహసం ప్రదర్శించకపోవడానికి కారణం... మన ఆర్థిక వ్యవస్థ చైనాకు అన్నం పెడుతోంది. చైనా నుంచి దిగుమతులు ఆగితే భారత్ కు కలిగే నష్టం కంటే... ఎగుమతులు ఆగిపోతే చైనా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టమే ఎక్కువ. ప్రపంచమంతా ఉత్తర కొరియాను ద్వేషిస్తుంటే... డ్రాగన్ మాత్రం ప్రేమ కురిపిస్తోంది. చైనా ఈశాన్య ప్రాంతంలో ఉత్తర కొరియా ఉంది. ఉత్తర కొరియా చైనాకు బొగ్గు దిగుమతి చేసి... ఆ దేశం నుంచి విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించుకుంటోంది. చైనా బొగ్గు కనకపోతే ఉత్తర కొరియా బతుకు బుగ్గే. అయినా చైనా భౌగిళిక పరిస్థితులు, అమెరికా దెబ్బకు ఉత్తర కొరియాకు మద్దతిస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ లేకుంటే... రెండు కొరియాల కలయిక జరిగితే చైనాకు అది ముప్పుగా పరిణమిస్తుంది. అందుకే చైనా... ఉత్తర కొరియాకు వీలైనంత సహకారం అందిస్తూ ముందుకు సాగుతోంది. కొరియా ఐక్యత జరిగి... కలిసిపోతే... అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా మనుగడ సాగిస్తున్న దక్షిణ కొరియా... మరింతగా చైనాపై దూకుడు చూపిస్తోంది. అమెరికా బలగాలు... చైనా సరిహద్దుల్లోకి ప్రవేశించి... చైనా భద్రతకు సవాలుగా నిలుస్తాయ్. అందుకే చైనా ఉత్తర కొరియాను ఇష్టం లేకున్నా సహకారం అందిస్తోంది. బయటకు కన్పించిన చైనా వేరన్నది చాలా మందికి తెలియదు. సోషలిజం ముసుగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... చైనా ఆర్థిక, సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతోంది. అందుకే తన ఆధిపత్యాన్ని సహించనివారంటే ఆ దేశానికి గిట్టదు. చైనా ఆధిపత్యానికి సలామ్ చేస్తే వారికి మద్దతుగా ఎంతకైనా దిగజారుతోంది. చైనా ఒకే పార్టీ ఆర్థిక వ్యవస్థ. కమ్యూనిస్ట్ ముసుగులో నియంతృత్వం పాలనలో సాగుతోంది. ఎన్నికలు అసలే జరగవ్. పదేళ్లకోసారి అంతర్గత ఎన్నికలు మాత్రమే జరుగుతాయ్. అది కూడా ఫార్మాలిటీయే. ప్రజస్వామ్యమన్న మాట చైనాలో విన్పించదు. ఎవరైనా కాదంటూ ఆందోళనలకు దిగితే వారిక కన్పించరు. బుల్ డోజర్లతో క్రష్ చేస్తోంది. యూనివర్శిటీ విద్యార్థులను 1980 దశకంలో... ఎంతో మందిని పొట్టనబెట్టుకొంది. అయితే సొవియట్ యూనియన్ పతనమైతే... రాజ్య కాంక్షతో చైనా విచ్చలవిడితనం తగ్గడం లేదు. విపరీతమైన అధికారంతో విచ్చలవిడిగా అవినీతి జరగుతూ... నిత్యం చైనా వార్తల్లో నిలుస్తోంది. అమెరికాలో చైనా రాజకీయనేతలు, బ్యూరోక్రాట్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకొని... ఆస్తులు పెంచుకుంటున్నారు. ఈ విషయం అటు అమెరికాకు, చైనా రాజకీయనేతలు బాగా తెలుసు. అందుకే చైనా విషయంలో అమెరికా చేతిలో చాలా అస్త్రాలే ఉన్నాయ్. అదే సమయంలో పాకిస్తాన్ విషయంలో చైనా... భారత్ కు ఇబ్బంది కలిగేలా ఎంతో డ్రామా ఆడుతోంది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తుందని చైనాకు తెలియక కాదు. భారత్ ను నిలువరించేందుకు పాకిస్తాన్ బూచిని వాడుకుంటుందంతే. కశ్మీర్ లోని అక్సిన్ చిన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ను నుంచి కబళించి భారత్ పై నిఘా పెడుంది డ్రాగన్. ఇప్పుడు తాజాగా డొక్లామ్ వద్ద సిక్కింలో చొరబాటుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ప్రపంచదేశాలు చీదరించుకుంటాయని... తెలిసి... భారత్ పై ఒత్తిడి పెంచుతోంది. అదేసమయంలో భారత్ వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే... డొక్లామ్ పక్కనంతా భారత్ భూభాగమే. ఈశాన్య రాష్ట్రాలకు కీలకమైనది డొక్లామ్.
గురివింద తన కింద నలుపు ఎరుగదన్న చందంగా డ్రాగన్ వ్యవహరిస్తోంది. ఓవైపు హాంకాంగ్ తో సఖ్యతగా మెలగలేని పరిస్థితి. తైవాన్ తో నిత్యం అనుమానాల కాపురం. మరోవైపు టిబెట్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు... చుట్టూ ఆందోళనల జడి రేగుతున్నా.... చైనా మాత్రం... సోషలిజం ముసుగుతో కడట నాటకాలాడుతోంది. మానవ అక్రమ రవాణాలోనూ చైనా ప్రపంచదేశాల్లోనే అగ్రస్థానంలో ఉందంటే... ఆ దేశం చీకటి కోణాన్ని అర్థం చేసుకోవచ్చు. తమ దేశాల అంతరంగిక వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని అటు తైవాన్ గానీ, ఇటు చైనాగానీ సహించడం లేదు. చైనా ఆధీనంలో ఉన్పప్పటికీ హాంకాంగ్ ,తైవాన్ రెండు స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతాలుగా చలామణీ అవుతున్నాయ్. చైనా ఆధిపత్యాన్ని తైవాన్ అంగీకరిస్తున్నప్పటికీ... ఇద్దరి భూభాగాలను ఎవరి సరిహద్దుల్లో వారు గౌరవించుకోవాలన్న అభిప్రాయం ఉంది. ఇదే దశాబ్దాల తరబడి రెండు ప్రాంతాల మధ్య ఘర్షణకు కారణమవుతోంది. 1927లో చైనాలో ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో చైనా, తైవాన్ ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మావో చైనాలోని జాతీయ ప్రభుత్వాన్ని పడగొట్టడంతో పరిణామాలు మారిపోయాయ్. జాతీయ నాయకులు తైవాన్ పారిపోవడం... చైనా మాదంటే మాదంటూ ఇద్దరూ పోటీ పడ్డారు. తైవాన్ లో ఉన్న నేతలు కమ్యూనిస్టులు చైనాను అన్యాయంగా అక్రమించుకున్నారని వాదిస్తారు. అదే సమయంలో బీజింగ్ లోని ప్రభుత్వం... తైవాన్ ను తమ నుంచి విడిపోయిన ప్రాంతంగా అభివర్ణిస్తారు. తైవాన్ పేరు కూడా వాస్తవానికి చైనాగానే ఉంది.
రెండు ప్రాంతాల మధ్య వివాదం... ప్రపంచ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణంగా చెబుతారు. రష్యా, ఆ దేశ మద్దతు దేశాలు చైనాకు మద్దతు ప్రకటిస్తే... అమెరికా మద్దతుదారులు తైవాన్ జాతీయ వాదులకు మద్దతిస్తున్నాయ్. చైనా ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం సాధించిన తర్వాత... చైనా ఆధిపత్యాన్ని అమెరికాతో సహా మిగతా దేశాలు కూడా ఆమోదించాయ్. అప్పట్నంచి తైవాన్ తో అమెరికా సంప్రదింపులు జరపడం మానేసింది. తైవాన్ కు పూర్తి సార్వభౌమాధికారాన్ని అప్పగిస్తే... టిబెట్ లో వేర్పాటు ఆందోళనలు వస్తాయని చైనా బెంబేలెత్తిపోతోంది. తైవాన్ స్వాతంత్రం ప్రకటిస్తే యుద్ధం చేస్తామంటూ చైనా కాలుదువ్వుతోంది. 1992లో చైనాతో వన్ చైనా ఒప్పందం కురిదినప్పటికీ... తైవానీయుల్లో మాత్రం స్వాతంత్ర కాంక్ష అలాగే కొనసాగుతోంది. తైవాన్ యువత చైనా నాయకత్వంపై ఆగ్రహంతో ఉంది. ఇదే అదనుగా తీసుకొని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తైవాన్ తో సంబంధాలు నెరుపుతున్నాడు. ఆయుధాలు సైతం అమ్ముతానంటూ చేస్తున్న ప్రకటనలు...తైవాన్-చైనా మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయ్.
మరోవైపు అదే సమయంలో హాంకాంగ్ సైతం తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ చైనాకు హితవు పలుకున్నారు. బ్రిటీష్ కాలనీగా ఉన్న హాంకాంగ్... 1997లో చైనాలో విలీనమైంది. చైనాలో ఉన్న పరిస్థితులకు హాంకాంగ్ లో ఉన్న పరిస్థితులు వేరనీ... చైనాలగా... హాంకాంగ్ ప్రజలు ఉండబోరని... అక్కడి పాలకులు స్పష్టం చేస్తున్నారు. స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా హాంకాంగ్ చైనాలో భాగస్వామిగా కొనసాగుతోంది. రెండు సంస్కతృతులు వేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హాంకాంగ్ లో ఉన్న రాజకీయ వ్యవస్థపై చైనా పెత్తనాన్ని స్థానిక నాయకత్వం అంగీకరించడకపోవడంతో రెండు పక్షాల మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. చైనాలో మీడియాపై ఆంక్షలు కొనసాగుతుండగా... హాంకాంగ్ లో మాత్రం మీడియా స్వేచ్ఛ ఎక్కువ. బ్రిటీష్ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో స్వేచ్ఛ, సమానత్వాలను హాంకాంగ్ పౌరులు కోరుకుంటున్నారు. అదే సమయంలో చైనాకు ఇది ఎంత మాత్రం ఇష్టంగా ఉండటం లేదు. హాంకాంగ్ ప్రజలను చైనా నిపుణులు కుక్కలతో పోల్చడంపై అక్కడి పౌరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక టిబెట్ అక్రమంగా ఆక్రమించుకున్నారని బౌద్ధులు ఎప్పట్నుంచో ఆందోళన నిర్వహిస్తున్నారు. భారత్ లో ప్రవాస జీవితం గడుపుతున్న దలైలామా చైనా ఆగడాలు తట్టుకోలేక భారత్ లో శరణార్థిగా జీవిస్తున్నానంటూ చెబుతున్నారు. టిబెట్లో చైనా అకృత్యాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని బౌద్ధులు మండిపడుతున్నారు. టిబెట్‌కు నిజాయతీగల అసలైన స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకుంటున్నట్లు దలైలామా చెబుతారు. భారతదేశంలోని ధర్మశాల నుంచి ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని దలై లామా నడుపుతున్నారు. చైనా నుంచి టిబెటన్లు స్వేచ్ఛ పొందడానికి భారత్ సహకరించాలని... టిబెట్‌ను చైనా అన్యాయంగా ఆక్రమించుకుందని టిబెటన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆధ్యాత్మిక గురువు దలైలామ ప్రతినిధితో చైనా బేషరతుగా చర్చలు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. అయితే చైనా మాత్రం ఇవేమీ పట్టించుకోదు. చుట్టుపక్కల ఉన్న దేశాల్లో అలజడులు సృష్చించి చలికాచుకుంటోంది. పాకిస్తాన్ తో కల్లబొల్లి మాటలు చెప్పి కశ్మీర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించింది. భారత్ కు ఇబ్బంది కలిగించడం తమ వల్ల కాదు కాబట్టి పాకిస్తాన్ చైనా ద్వారా గూడుపుఠాని నడిపిస్తోంది. భూటాన్ చుట్టూ ఉన్న భూభాగాన్ని ఆక్రమించిన చైనా... తాజాగా డోక్లామ్ పై కన్నేసింది. దక్షిణ చైనా సముద్రంలో మితిమీరిన ఆగడాలతో తూర్పు ఆసియా దేశాలకు చికాకు కలిగిస్తోంది. భారత్ లుక్ ఈస్ట్ పాలసీ అన్న మరుక్షణమే రంగంలోకి దిగి ఆయా దేశాలను భారత్ కు దగ్గర కాకుండా అడ్డుకుంటోంది.
ప్రపంచంలోకెల్లా చైనాలోనే మానవుల అక్రమ రవాణా ఎక్కువగా సాగుతోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా మించి పోయిందంటూ అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. చైనాలో మానవుల అక్రమ రవాణా, దాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను పరిగణలోకి తీసుకొని మానవుల అక్రమ రవాణా సూచికలో చైనాను ‘టైర్ 3’ కేటిగిరీగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. చైనాలో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికే కాకుండా ఉత్తర కొరియా లాంటి దేశాల నుంచి మానవుల అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చైనాలో కఠిన చట్టాలు లేకపోవడం కూడా ఓ లోపమేనని అమెరికా నివేదికలో వ్యాఖ్యానించింది.
భారతదేశానికి ముప్పేదైనా పొంచి ఉందంటే.. అది కేవలం ఒక్క చైనాతో మాత్రమే... ఇది ఎప్పుడో వివేకానందుడు మనకు చేసిన హెచ్చరిక. అవును ఇది నిజం. తప్పు తనవైపు ఉన్నా... మనవైపు వేలిత్తి చూపుతూ... డ్రాగన్ దుష్ట పన్నాగానికి తెరదీస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అదిపెద్ద భూభాగాన్ని కలిగిన చైనా... ఆసియా ఖండంలో చేస్తున్న ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. సౌత్ చైనా సముద్రాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా... సముద్ర రవాణాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. తాజాగా సిక్కింలోని డోక్లామా వరకు రోడ్డు మార్గాన్ని వేసి... భారత్ లో చొరబడేందుకు కుటిలయత్నం చేస్తోంది. డ్రాగన్ భూదాహానికి కారణం ప్రపంచ దేశాలను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలన్న దురుద్దేశమే. దశాబ్దాల తరబడి ప్రపంచ దేశాల హక్కులను గౌరవించే సమున్నత ఆశయం కలిగిన భారత్ ను డ్రాగన్ ప్రత్యక్షంగానూ... పరోక్షంగానూ ఇరుకునపెట్టాలని చూస్తోంది. ప్రపంచానికి పెద్దన్న కావాలన్న దురుద్దేశంతో డ్రాగన్ సాగిస్తున్న యుద్ధం మనల్నే కాదు... ఆధిపత్యం పేరుతో చుట్టూ ఉన్న దేశాల ప్రజల హక్కులను కాలరాస్తోంది.

No comments:
Post a Comment