గంట పసుపు మంట
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్ తీసుకుంటున్నాయ్. వందల కోట్ల రూపాయల విశాఖ భూస్కామ్ వ్యవహారంలో మంత్రులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. మంత్రి ఆధ్వర్యంలోనే భూకబ్జాలు జరుగుతున్నాయని జిల్లా మంత్రే స్వయంగా విమర్శలు గుప్పిస్తుంటే... ప్రభుత్వం మాత్రం విచారణ అంటూ కాలం గడిపేస్తోంది. వైజాగ్ భూస్కామ్ అంశంపై విపక్షాలు ఆందోళన తీవ్రతరం చేస్తుంటే... ఆ అంశాన్ని పక్కకుబెట్టేలా... మంత్రుల మధ్య మాటల యుద్ధం రాజుకుంటుంది. ఒక మంత్రిపై విమర్శలు గుప్పిస్తూ... ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సీఎంకు లేఖ రాస్తారు. ఇదంతా అదృష్టశక్తుల ప్రమేయంతోనేనంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయ్. అక్రమాలపై ఉక్కపాదం మోపుతామంటూ సీఎం గర్జిస్తారు. విపక్షాలు మాత్రం సీఎం చంద్రబాబే కుట్రదారంటూ విమర్శిస్తాయ్. మంత్రి గంటా సీఎం చంద్రబాబునాయుడుకు సంధించిన లేఖ... భూమాయకు సంబంధించి రేగుతున్న విమర్శలపై రాజ్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయానికి తెలుగుదేశం పార్టీ తెరదీస్తోంది. శత్రువులు... మిత్రులయ్యారంటూ నిన్నటి వరకు కలరింగ్ ఇచ్చిన పచ్చ పార్టీ ఇప్పుడు వారి మధ్య యుద్ధం జరుగుతుందన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. మిత్రులే నేడు మరోసారి శత్రువులుగా మారారంటూ మరో స్క్రీన్ ప్లే తెరపైకి తీసుకొచ్చారు. వైజాగ్ లో భూఅక్రమణలకు సంబంధించి అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంటే... తాజాగా అయ్యన్న వర్సెస్ గంటా విమర్శలంటూ కొత్త డ్రామాను మొదలుపెట్టారు. ఆయన ఒకనాడు అయ్యన్న నీడలో రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత అయ్యన్నను మించిపోయాడు. ఈ పార్టీ... ఆ పార్టీ అన్న చందంగా కాకుండా... అన్ని పార్టీల నేతలతోనూ... సన్నిహిత సంబంధాలు నెరపి... వైజాగ్ లో తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. ఆయన ఏపీ కీలక మంత్రి గంటా శ్రీనివాసరావు. మరో కీలక మంత్రి నారాయణకు వియ్యంకుడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వీర విధేయుడు. అధికార పార్టీలో ఉంటూనే ప్రతిపక్ష పార్టీతోనూ సఖ్యత కలిగిన నాయకుడు. రాష్ట్ర రాజకీయాలతోపాటు, వైజాగ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న గంటా శ్రీనివాసరావుకు సొంత జిల్లాలో మరో మంత్రి అయ్యన్నపాత్రుడు కొరకరాని కొయ్యలా ఉన్నారు. జిల్లాలో దూసుకుపోతున్న గంటా... భూకబ్జాలకు పాల్పడుతున్నాడంటూ మంత్రి అయ్యన్న విమర్శలతో ఒక్కసారిగా వైజాగ్ లో అలజడి రేగింది. అయితే తనపై మంత్రి అసత్య ప్రచారం చేస్తున్నాడని... సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి గంటా లేఖ సంధించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఓవైపు విశాఖలో జరిగిన భూమాయకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన తీవ్రతరం చేస్తుంటే... మరోసారి అయ్యన్న... శీనన్న మధ్య యుద్ధమంటూ లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తాయ్. ప్రజలు ఎంతో కష్టపడి భూములు కొనుక్కుంటుంటే.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు వాటిని కబ్జా చేస్తున్నారని, అలాంటి వారిని వైజాగ్ నుంచి తరిమి తరిమి కొట్టాలని మంత్రి అయ్యన్నపాత్రుడు పిలుపినిస్తారు. ఈ వ్యాఖ్యలు తమను ఉద్దేశించి చేసినవేనవిగా గంటా వర్గం భావించింది. విశాఖలో బయటపడిన రెండు వేల కోట్ల రూపాయల భూకుంభకోణంపై విపక్షాలు సైతం మండిపడుతున్నాయ్. కుంభకోణాలన్నీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే నడుస్తు్న్నాయని... అయితే ఏమీ తెలియదన్నట్టుగా సర్కారు పెద్దలు వ్యవహరిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయ్. అయితే ప్రతి విషయంలోనూ గంటా శ్రీనివాసరావును అయ్యన్నపాత్రుడు టార్గెట్ చేయడం కూడా పార్టీ పెద్దలకు రుచించడం లేదు.
తనపై మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలతో వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుందని మంత్రి గంటా భావించారు. భూకుంభకోణానికి సంబంధించి సీబీఐతోగానీ, సీఐడీతోగానీ విచారించాలంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రిని గంటా కోరారు. పనిలోపనిగా... అయ్యన్న వ్యాఖ్యలతో విశాఖ ప్రతిష్ట దెబ్బతింటుందని కూడా గంటా తన లేఖలో సీఎంకు వివరించారు. నిరాధార ఆరోపణలతో విశాఖ ప్రతిష్ఠ దెబ్బతింటోందని... హుద్‌హుద్ తో కళ తప్పిన విశాఖను శ్రమించి అభివృద్ధి చేస్తుంటే... ఇలాంటి వ్యాఖ్యలతో విశాఖపై మచ్చపడుతోందని ముఖ్యమంత్రిగా మీరు ఎంత కష్టపడుతున్నప్పటికీ... ఇమేజ్ డామేజ్ అయిపోతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. విశాఖలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించి అంతర్జాతీయ ఖ్యాతి, పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తున్నారని అయితే ఇలాంటి విమర్శలతో జనం దృష్టి అభివృద్ధిపై కాకుండా... విమర్శలపైనే కేంద్రీకృతం అవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 30 వేల మంది పేదలకు భూమి పట్టాలిచ్చిన విషయం కూడా తాజా ఆరోపణలతో మసకబారిపోతుందని ఆయన లేఖలో చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే... నాపై ఉన్న కోపంతో అయ్యన్నపాత్రుడు... పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడంటూు సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో గంటా వివరించాడు. ఓవరాల్ గా తాను జిల్లాలో పార్టీకి రక్షకుడిగా ఉన్నానని... తనే పార్టీని కాపాడుతున్నానని... అయ్యన్న పార్టీని గబ్బు పట్టిస్తున్నాడన్న సందేశాన్ని సీఎంకు పంపించారు మంత్రి గంటా.
అయితే మొత్తం వ్యవహారంలో గంటా వర్సెస్ అయ్యన్న లెక్కలు ఏంటి? ఒకసారి విభేదాలున్నాయాంటారు? మరోసారి విభేదాల్లేవంటారు? సీం చెప్పారు కాబట్టి సర్దుకుపోతున్నామంటారు? అసలు విశాఖలో ఉన్న ఇద్దరు మంత్రుల మధ్య అసలు స్టోరీ ఏంటి? గంటాను లక్ష్యంగా చేసుకొని మంత్రి అయ్యన్నపాత్రుడు మూడేళ్లుగా విమర్శలు చేస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని... ఎన్నికల సమయంలో టీడీపీ గూటికి చేరుకున్న గంటాపై అయ్యన్న నేరుగా విమర్శలు గుప్పించేవాడు. ఒకప్పటి తన శిష్యుడు... రాజకీయాన్ని కార్పోరేట్ వ్యవస్థగా మార్చి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నది ఆయన విమర్శ. మొత్తం వ్యవహారంలో తనను పూచికపుల్లగా చేసినట్టుగా చేస్తారన్నది ఆయన అభిప్రాయం. జిల్లాలో ఎవరున్నా... లేకున్నా... పార్టీని కాచుకు వస్తున్నానని... అయినప్పటికీ... గంటా తన ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నాడని అయ్యన్న ప్రధాన విమర్శ. ఇక తాజాగా లభించిన భూస్కామ్ లో గంటాపై అయ్యన్న తీవ్రస్థాయిలో దుయ్యబట్టాడు. విశాఖలోకి ఎక్కడ్నుంచో వచ్చిన రాజకీయ నాయకులు... దోచేసుకుంటున్నారన్నది ఆయన విమర్శ. అయితే గంటా మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఎక్కడా కూడా అయ్యన్న విమర్శలకు డైరెక్ట్ గా సమాధానం చెప్పిన గంటా తాజాగా లేఖతో కలకలం రేపారు. గంటా బిజినెస్ మెన్ పొలిటీషియన్ గా చాలా విషయాల్లో స్పందించీ...స్పందించనట్టుగా వ్యవహరిస్తుంటారు. అయితే తాజా లేఖ పథకం ప్రకారమే లీకైందన్న అభిప్రాయం మీడియాలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి జిల్లాలో అయ్యన్నపాత్రుడు సీనియర్ నాయకుడిగా ఉన్నప్పటికీ... గంటా మాటే అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, పార్టీ వర్గాల్లోనూ ప్రముఖంగా విన్పిస్తోంది. అధినాయకుడి మనసెరిగి పార్టీ నేతలు సైతం గంటా బాటలో నడుస్తుంటారు. ఈ పరిణామాలన్నీ కూడా అయ్యన్న పరపతిని తగ్గిస్తున్నాయ్. తనపై గంటా పెత్తనమేంటన్న రీతిలో అయ్యన్న విమర్శలు గుప్పిస్తుంటాయ్. గంటా ఏ కార్యక్రమం చేసినా సరే వాటిపై అయ్యన్న విమర్శలు కచ్చితంగా ఉంటాయ్. విశాఖ ఉత్సవ్‌లో సాంస్కృతిక కార్యక్రమాల్లోని స్థానికులకు అవకాశం కల్పించడం లేదంటూ అయ్యన్న పరోక్షంగా గంటాపై విమర్శలు చేశారు. అయ్యన్న విమర్శలతో గంటా స్థానిక కళాకారులకు కొంత మేర అవకాశం కల్పించారు. అయినప్పటికీ అయ్యన్న మాత్రం విశాఖ ఉత్సవాలకు మాత్రం హాజరు కాలేదు. ఉత్సవాలంటూ కోట్ల ఖర్చు పెడుతున్నారని... నర్సీపట్నంలో వ్యవసాయ ప్రదర్శనకు నిధుల్లేవంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రన్న కానుకల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసే కన్నా... కొత్త పథకాల ప్రారంభించొచ్చంటూ ఆయన విమర్శించారు. ఇలా ఇద్దరి మధ్య వార్ పతాక స్థాయిలోకి వెళ్తుండటంతో... సీఎం ఇద్దరు నేతలను పిలిచీ సయోధ్య వళ్లించారు. ఒకరి నియోజకవర్గాల్లో ఒకరు పర్యటించాలన్న సూచనతో... గంటా నర్సీపట్నం వెళ్లి కార్యక్రమంలో పాల్గొని భోజనం కూడా చేసి వచ్చారు. ఇటీవల మహానాడు కార్యక్రమాన్ని సైతం ఇద్దరు నేతలు విజయవంతం చేశారు. స్పాట్
వాస్తవానికి విశాఖలో భూకుంభకోణానికి సంబంధించి విపక్షాలు మండిపడుతున్నాయ్. సిట్ అంటూ విచారణను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని... వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. విశాఖ భూముల కబ్జాపై కచ్చితంగా సీబీఐ దర్యాప్తు చేయాలని... భూకబ్జాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హస్తం ఉందని చెప్పారు. లక్ష ఎకరాల భూకబ్జా దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని అన్నారు. ప్రతిపక్షాలు, మంత్రలు, మీడియా, మిత్రపక్షమైనా బీజేపీ కోరుతున్నా బాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మొత్తం వ్యవహారమంతా ఇలా జరుగుతుంటే... తాజాగా సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి గంటా లేఖ రాశారంటూ మరో సంచలనం రేగుతోంది. అయితే సీఎంకు రాసిన లేఖపై గంటా ఇంత వరకు నోరుమెదపలేదు. అయ్యన్న మాత్రం విభేదాల్లేవంటూ చెప్తూనే... విశాఖ భూమాయపై విచారణ జరపాలని ఇద్దరం కోరుకుంటున్నామమని చెబుతున్నారు.
సీఎం చంద్రబాబునాయుడు మాత్రం భూముల వ్యవహారంలో అక్రమార్కులను వదిలేది లేదంటారు. చట్ట ప్రకారం ముందుకెళ్లాలంటారు. ఓవైపు చట్టం తన పని తాను చేసుకుంటుంటే... సీఎంకు గంటా రాసిన లేఖ బయటకు రావడం మొత్తం వ్యవహారమంతా సీఎం కనుసన్నల్లో జరిగిందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. విశాఖలో జరుగుతున్న స్కాములకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతోంది. వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములను అప్పనంగా కొట్టేయాలన్న కుట్రను భగ్నం చేశామని ప్రభుత్వం చెబుతుంటే... స్కామ్ స్టర్లు టీడీపీ నేతలేనన్న విమర్శను ప్రతిపక్షాలు చేస్తున్నాయ్. విశాఖ స్వచ్ఛంద సంస్థల సైతం భూమాయ అంతా ప్రభుత్వ పెద్దల వ్యవహారమంటూ పెదవి విరుస్తున్నాయ్. అయితే విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. భూకుంభకోణంలో ఎంతటి పెద్దవారున్నప్పటికీ వదలొద్దంటూ కలెక్టర్, జేసీ, ఇతర అధికారులకు తేల్చిచెప్పారు. మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. భీమునిపట్నంతో సహా విశాఖలోని పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతోనే భూముల కబ్జాలు జరుగుతున్నాయని మంత్రి అయ్యన్నపాత్రుడు కుండబద్దలు కొట్టారు.
లక్ష ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కనిపించకుండా పోయాయని, రికార్డులు మాయం చేశారని, కొన్ని చోట్ల రికార్డులను తారుమారుచేశారని స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా వెల్లడించారు. పెద్ద ఎత్తున విశాఖ భూములకు సంబంధించి కబ్జా ఆరోపణలు వస్తున్నప్పటికీ... నోరు విప్పని మంత్రి గంటా అకస్మాత్తుగా బుధవారం సీఎంకు లేఖ రాయడంతో పాటు దాన్ని మీడియాకు లీకు చేశారు. తనకు విభేదాలు లేవని ఆయన గురువారం స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు మంత్రి గంటా రాసిన లేఖలో తన పేరు ఎందుకు పేర్కొన్నారో తెలియదని అన్నారు. తన వల్ల ప్రభుత్వ ప్రతిష్ట తగ్గడం కాదు పెరిగిందని చెప్పారు. అయితే మొత్తం స్కామ్ తీవ్రతరమవుతుంటే... సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూమాయ వ్యవహారం సైడ్ చేస్తూ... సిట్ అంటూ కాలం గడిపేస్తున్నారన్న విమర్శలను విపక్షాలు విన్పిస్తున్నాయ్. మంత్రి గంటా లేఖ కూడా సీఎం వ్యూహంలో భాగమేనని... కావాలనే మీడియాకు లీకులిచ్చి... భూమాయ పక్కకు జరిగేలా... ఇద్దరి నేతల మధ్య విభేదాలు హైలెట్ అయ్యాలా వ్యవహరిస్తున్నారన్న విమర్శను విపక్షాలు చేస్తున్నాయ్. గంటాపై ఎప్పుడూ అయ్యన్న విమర్శలే మీడియాకు వార్తలుగా వస్తాయి... తప్పించి విమర్శలను గంటా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవ్. ఎందుకంటే ఆయనకు సీఎం వద్ద పరపతి ఎక్కువ. అయితే ఇప్పుడు భూములకు సంబంధించి విమర్శలతో గంటా సీఎం లేఖ రాయడమంటే... దీని వెనుక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మరొకరిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖలో భూములు కేంద్రంగా జరుగుతున్న స్కాంలు బెంబేలెత్తిస్తున్నాయ్. ప్రభుత్వ భూములను కాజేందుకు ప్రజా ప్రతినిదులు, అధికారులు, బడా బాబులు కుమ్మక్కు సాగిస్తున్న అరచకాలకు అంతే లేకుండా పోతోంది. జిల్లా మంత్రి విశాఖలో భూ అక్రమాలు జరిగాయి అంటూ బహిరంగానే, పోలీస్, రెవెన్యూ శాఖలను తప్పు పట్టడంతో ప్రతిపక్షాలకు కొత్త ఊపు వచ్చింది. ప్రభుత్వం సైతం మొత్తం భూమాయకు సంబంధించి క్లారిటీ ఇవ్వాలి. మంత్రి అయ్యన్న చెబుతున్న మాటల్లో నిజమెంతో నిగ్గు తేల్చాలి. గంటా చెబుతున్నట్టుగా సీఐడీ, సీబీఐ విచారణకైనా ఆదేశించాలి. కాలయపాన వల్ల వైజాగ్ భూస్కామ్ అంశం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది.
మొత్తంగా వైజాగ్ భూమాయ ఇప్పుడు కొత్త ట్విస్టులు తీసుకుంటోంది. భూమాయపై దర్యాప్తు చేయాలని ఇద్దరు మంత్రులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుతారు. అక్రమార్కుల అంతు చూడాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశిస్తారు. వందల కోట్ల రూపాయలు భూములు మాత్రం అప్పన్నంగా కొట్టేస్తారు. ఇందుకు నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తూ మాయ చేస్తారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలిసి కూడా... ప్రభుత్వం ప్రేక్షపాత్ర వహిస్తోంది. దోషులను శిక్షించాల్సిన పాలకులు... దోషులతో అంటకాగితే నిజాలు మరుగునపడే ప్రమాదం ఉంది.

No comments:
Post a Comment