దొంగా దొంగా వచ్చేడే అన్ని దోచుకుపోయాడే అంటూ నిన్నటి వరకు వార్తలను మనం వింటూ వచ్చాం... అయితే ఇప్పుడు ఎక్కడో దూరాన కూర్చొన్న అగంతకుడు మన నెట్టింట్లోకి చొరబడి మనల్ని నిండా దోచేస్తున్నాడు. మన కంప్యూటర్లను, దాంట్లోని కీలక సమాచారాన్ని చూసుకోడానికి, బ్రౌజ్ చేయడానికి వీళ్లేకుండా ఎన్క్రిప్ట్ చేసేస్తున్నాడు. అంటే ఒకరకంగా మన ఇంటికి వాడే తాళం వేసేస్తున్నాడు. అప్పటి వరకు మనకు కావాల్సిన సమాచారాన్ని, కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకున్న వ్యవస్థలను ఇకపై మనం చూడలేమన్నమాట. మన కంప్యూటర్ ఉన్నప్పటికీ... అది మూలపడిన సామాను తరహానే. ఇదే అదను చేసుకొని మీ కంప్యూటర్ తాళం ఓపెన్ చేయాలంటే సొమ్ములు కావాలంటూ... హ్యాకర్ల డిమాండ్లు మొదలవుతాయ్. ఇంత మొత్తంలో సొమ్ములిస్తేనే డిక్రిప్ట్ చేస్తామంటూ బెంబేలెత్తిస్తారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ర్యాన్సమ్ వేర్ అసలు ఎలా వస్తుంది? ఈ వైరస్ చూపిస్తున్న ప్రభావమేంటి? దీని బారినపడితే ఇక దుకాణాలు మూసుకోవాల్సిందేనా? ఇప్పటికే ఎన్నో జబ్బులతో సుస్తి చేసిన భారతదేశానికి ఈ ర్యాన్సమ్ వేర్ అంటుకుంటే కొంపలు కోల్లేరేనా?
తాళం వేసిన ఇంటిని దోచేసుకోవడం దొంగతనం... అదే ఇంట్లో ఉన్న కంప్యూటర్లు, సెల్ ఫోన్లను అగంతకులు వేసే లాకే ర్యాన్సమ్ వేర్. వాన్నాక్రై... యూజర్ల కంప్యూటర్లలోకి, స్మార్ట్‌ఫోన్లలోకి చొరబడి విలువైన డేటాను హ్యాకర్లు దొంగిలించేస్తారు. ప్రపంచ దేశాలను భయపెడుతోన్న ఈ వైరస్ పేరే వాన్నా క్రై . ర్యాన్సమ్ వేర్...
ర్యాన్‌సమ్ వేర్ ఏదైనప్పటికీ అది చేసే పని ఒక్కటే. యూజర్ల కంప్యూటర్లలోకి చొరబడి వాటిని లాక్ చేస్తుంది. ఆ తరువాత కొంత డబ్బు చెల్లిస్తే గానీ కంప్యూటర్ అన్‌లాక్ కాదు, అని మెసేజ్ చూపుతుంది. ర్యాన్సమ్‌వేర్ వైరస్ కంప్యూటర్‌లో ప్రవేశించిన మరుక్షణం సిస్టమ్ మానిటర్‌పైన స్పష్టంగా ‘మీ కంప్యూటర్‌ను లాక్ చేశాం’ అనే మెసేజ్ కనిపిస్తుంది. దీన్ని అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్ మావద్ద ఉందని చెబుతున్న సైబర్ నేరగాళ్లు గరిష్టంగా మూడు రోజుల గడువు ఇస్తూ 100 నుంచి 300 డాలర్ల వరకు మొత్తాన్ని బిట్ కాయిన్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ వైరస్ బారిన పడ్డవారు చేసేది లేక సదరు హ్యాకర్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించి కంప్యూటర్‌ను అన్ లాక్ చేసుకుంటారు. ఈ ర్యాన్సమ్ వేర్ స్పెయిన్, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో గత శుక్రవారం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రపంచంలోని 150 దేశాల్లోని పలు కంప్యూటర్లలోకి ఈ ర్యాన్సమ్ వేర్ చొరబడింది. దీంతో కంప్యూటర్లన్నీ స్ట్రక్ అయిపోయాయి.
ఇప్పుడు మన చూస్తున్న వైరస్ విజృంభన ప్రారంభం మాత్రమే. వచ్చే రోజుల్లో దీని విశ్వరూపం దారుణంగా ఉండబోతుంది. కారణం... యాంటీ వైరస్, ఫైర్ వాల్స్ కళ్లు గప్పి... సెక్యురిటీ వ్యవస్థల కళ్లుగప్పి... ఈ ర్యాన్సమ్ వేర్ ఇళ్లలోకి వచ్చేస్తోంది. విండోస్ కంప్యూటర్లలో ఈ వ్యాధి చొరబడి కీలకమైన సమాచారాన్ని దొంకిలించేస్తోంది. కంప్యూటర్ పనిచేయకుండా చేయడంతోపాటు... మీరింత మొత్తాన్ని ఇస్తేనే మీ కంప్యూటర్ పనిచేసేలా చేస్తామంటూ హ్యాకర్లు బెంబేలెత్తిస్తున్నారు. వాన్నా క్రై వైరస్ లెక్కలేనన్ని కంప్యూటర్లలో చొరబడింది. ఇంతవరకు అనుకుంటున్నట్లుగా ఇంటర్నెట్ కు కనెక్టు అయితేనే వైరస్ వ్యాపిస్తుందన్న అంచనాలతో అసలు నెట్ కు కనెక్టు కావడానికి ముందే పలు కంప్యూటర్లను ఇది ఆక్రమించుకోవడంతో కొత్త ఆందోళన మొదలైంది. సిస్టమ్ ఆన్ చేయగానే ఇది కనిపిస్తోందన్న బెంగ ఎక్కువవుతోంది.
మరోవైపు ర్యాన్సమ్ వేర్ ప్రమాదంతో ఇంగ్లాండ్ లోని ఆసుపత్రులు వణికిపోయాయి. వైరస్ బారిన పడిన దేశాల జాబితాను ఓ సారి పరిశీలిస్తే... భారత్ తర్వాత, రష్యా, కజికిస్తాన్, ఇటలీ, జర్మనీ, వియత్నాం, అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, అమెరికా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జపాన్ కూడా వచ్చి చేరింది.
ర్యాన్సమ్ వేర్ ఇలా వస్తుంది... ఇలా వస్తుంది... ఇది ఓపెన్ చేయోద్దు... అది ఓపెన్ చేయోద్దంటూ మనకు ఇప్పుడు వాట్సప్ లోనూ, ఫేస్ బుక్కులోనూ, సోషల్ మీడియాలోనూ నెటిజెన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే ఈ ర్యాన్సమ్ వేర్ ను పబ్లిగ్గా విక్రయించే ముఠాలున్నాయ్... కాసుల కోసం సాగుతున్న ఈ దందా ఎలా జరుగుతుందో మీరే చూడండి.
ఇప్పుడు ప్రపంచాన్ని భయపడెతున్న ర్యాన్సమ్ వేర్ అన్నది ఒక సర్వీస్ అంటే ఆశ్చర్యపడాల్సిందే... కంప్యూటర్లను దోచేసుకుంటున్న ర్యాన్సమ్ వేర్ వైరస్ ఒక సర్వీసులా అందుబాటులో ఉందన్నది చాలా మందికి తెలియదు. హ్యాకర్లు పెద్ద మెలకువలతో చేస్తారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే... ర్యాన్సమ్ వేర్ సాఫ్ట్ వేర్ టూల్ కేవలం రూ 100 డాలర్ల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది. అంటే ఆరున్నర, 7 వేల రూపాయలకే ఇది దొరుకుతుంది. ఈ రెడీమేడ్ టూల్ ను ఏవిధంగా వినియోగించాలో కూడా తగిన తర్ఫీదు ఇచ్చి ఈ రాన్సమ్ వేర్ ను విక్రయిస్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సైతం జరుగుతోంది. ఇలా ర్యాన్సమ్ వేర్ ను కొనుగోలు చేసి... ఎవరి దగ్గర్నుంచి ర్యాన్సమ్ వసూలు చేయాలనుకుంటారో వారికి ఈ వైరస్ తో ఎటాక్ చేయడం... వారి దగ్గర్నుంచి పలానా మొత్తం ఇస్తే తప్పించి కంప్యూటర్ ను అన్ లాక్ చేయమంటూ కంప్యూటర్ సందేశాలను హ్యాకర్లు పంపిస్తున్నారు. ఇలాంటి ర్యాన్సమ్ వేర్ సాఫ్ట్ వేరు కొనుగోలు చేసిన హ్యాకర్లు... కొనుగోలుదారుకు తాము దోచేసిన మొత్తంలో సగం మొత్తాన్ని అందించాలన్న షరతును విధిస్తున్నారు. ర్యాన్సమ్ వేర్ తో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న హ్యాకర్లు కోటాను కోట్ల రూపాయలను కొల్లగొట్టేస్తున్నారు. మనం వాడే బ్యాంక్ ఎకౌంట్ల మాదిరిగా... బిట్ కాయిన్ అడ్రస్ లు ఇచ్చి... వాటిలో ఎమౌంట్ క్రెడిట్ చేయాల్సిందిగా ఆయా వినియోగదారులను హ్యాకర్లు డిమాండ్ చేస్తారు. బిట్ కాయిన్ అంటే అదో రకమైన నల్లధనంగా చెప్పుకోవచ్చు. చీకటి సామ్రాజ్యాలున్న పలు దేశాల్లో ఈ బిట్ కాయిన్స్ పనిచేస్తాయ్. వీటి ద్వారా హ్యాకర్లు వారికి కావాల్సిన ఉపకరణాలను... పెద్ద ఎత్తున దాడులు చేయడానికి అవసరమమైన సాఫ్ట్ వేర్ సామాగ్రిని కొనుగోలు చేస్తారని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బిట్ కాన్ అడ్రస్ లను డీ కోడ్ చేయగా... వనా పేరుతో ఉన్న అడ్రస్ లను గుర్తించడం జరిగింది. అయితే ఈ బిట్ కాయిన్ లలోకి ఎవరు ఎంత డబ్బు వేసినా... దాని గురించి ఈజీగా తెలుసుకోవచ్చు... రెన్సమ్ వేర్ వైరస్ వ్యాప్తి చేసిన దుండగులు మూడు 3 బిట్కౌయిన్ ల అడ్రస్ లు వాడినట్టు తెలుస్తోంది. వీటిలోకి ఇప్పటి వరకు భారత కరెన్సీలో జమయిన మొత్తం రూ. 17 లక్షల లోపు మాత్రమే.
ఇది ప్రారంభమేనని... వచ్చే రోజుల్లో బెదిరింపులు మరిన్ని ఎక్కువ జరిగి ఎక్కువ మొత్తాలను డిమాండ్ చేసే ప్రమాదముందని కూడా అంటున్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున సంస్థల నుంచి డబ్బు గుంజాలని ప్రయత్నం చేస్తుండటంతో ఇది సంచలనమైంది. గతంలో ఒకటి రెండు కంపెనీలైతే డబ్బులను వారి డిమాండ్ మేరకు... వారి కంపెనీల స్థాయిని బట్టి చెల్లించేవి. అయితే వన్నా క్రై పేరుతో ప్రపంచ వ్యాప్తంగా దోచేసుకోవాలని హ్యాకర్లు పన్నాగం పన్నడంతో అందరూ డబ్బు చెల్లించడాన్ని ఆపేశారు. కీలక డేటా ఉన్నవారు మాత్రమే స్పందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోలీస్, నిఘా యంత్రాంగాలు హ్యాకర్లు డబ్బును చెల్లించొద్దంటూ స్పష్టం చేశాయ్.
ప్రపంచంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా భారతదేశం తట్టుకొని నిలబెడుతోంది. అమెరికా ఆర్థిక మాంధ్యమైనా, చమురు సంక్షోభమైనా... తాజా... ర్యాన్సమ్ వేర్ ఉత్పాతమైనా... భారతదేశానికి ర్యాన్సమ్ వేర్ ను తట్టుకునే శక్తి ఉందా? ర్యాన్‌సమ్ వేర్.. టెక్నాలజీ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. శుక్రవారం మొదలైన వన్నా క్రై ర్యాన్సమ్ వేర్ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా బాగానే ఉన్నా ఇండియాపై పూర్తిస్థాయిలో పంజా విసరలేదు. ఇండియాలో డిజిటలైజేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, ఆన్‌లైన్లో చేసేవాటికి సమాంతరంగా ఆఫ్‌లైన్ రికార్డ్స్ కూడా అందుబాటులో ఉండడంతో హ్యాక్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని హ్యాకర్లు ఆలోచిస్తు ఉండొచ్చని టెక్నాలజీ నిపుణుల అంచనా. అయితే దీనిపై అప్పుడే ఓ అంచనాకు రాలేమని, రానున్న రోజుల్లో హ్యాకర్లు ఇండియాపైనా దృష్టి పెట్టే అవకాశాలు లేవు అనడానికి కూడా లేదని చెబుతున్నారు. స్పెయిన్, ఇంగ్లాండ్, యూరప్‌లోని పలు దేశాలతో పోల్చితే ప్రస్తుతానికి ఇండియామీద వన్నా క్రై ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం రెండు సౌత్ ఇండియా బ్యాంకులు, రెండు డిల్లీ బేస్డ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు, ఓ ఎంఎన్‌సీ కంపెనీకి చెందిన మాన్యుఫాక్చరింగ్ యూనిట్, ముంబై కేంద్రంగా ఉన్న ఎఫ్ఎంసీజీ మేకర్ కంపెనీ హెడ్ ఆఫీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కంప్యూటర్లు మాత్రమే ఈ వాన్న క్రైతో హ్యాక్ అయ్యాయి. భారతదేశంలో ఏ ప్రభుత్వ శాఖలోనూ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను జరపడం లేదు. పలు చోట్ల ఆఫ్‌లైన్ యంత్రాంగాలు పనిచేస్తున్నాయ్. ఇలాంటి వాటికి కంప్యూటర్లు హ్యాక్ చేసి డేటా బ్లాక్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయంలో హ్యాకర్లు ఉన్నారు. అయితే అవుట్ డేటెడ్ కంప్యూటర్ల వినియోగం ఉండటం వల్లే... సెక్యూరిటీ అప్‌డేట్లను తీసుకోకపోవడం వల్లే కొని ప్రభుత్వ యంత్రాంగాల్లో ఉన్న కంప్యూటర్లు వైరస్ బారిన పడుతున్నాయ్.
తాజా పరిణామలతో విండోస్ అప్ డేట్ వచ్చే వరకూ ఏపీఎంలను తెరవద్దని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. వాన్నా క్రై వైరస్ హ్యాకింగ్ వార్తలతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకొంది. దేశంలోని ఏటీఎంలలో అత్యధికం విండోస్ ఎక్స్ పీతో పనిచేస్తున్నాయి. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇవి హ్యాక్ కావడం ఖాయమన్న ఆందోళనతోనే ఆర్బీఐ ఈ సూచనలు చేసింది. ఇప్పటికే ఏటీఎంలలో కరెన్సీ కోసం కష్టాలుపడుతున్న సామాన్యుడికి తాజాగా ర్యాన్సమ్ వేర్ ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశంలో ఎక్కడా కూడా ఏటీఎంలు పనిచేయడం లేదని వినియోగదారులు చెబుతున్నారు.
వన్నా క్రై, ర్యాన్సమ్ వేర్ రెండూ చెడుగుడాడితే సెల్ ఫోన్ల పరిస్థితేంటి? సెల్ ఫోన్లు ఈ హ్యాకర్ల బారినపడే అవకాశముందా...సెల్ ఫోన్లను ఎలా రక్షించకోవాలి.. సెల్ ఫోన్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు... ప్రపంచాన్ని భయపడెతున్న ర్యాన్సమ్ వేర్ ఇప్పుడు సెల్ ఫోన్ వినియోగదారులకు చెమటలు పట్టిస్తున్నాయ్. ఎక్కడికక్కడే సెల్ ఫోన్ల వినియోగదారుల నుంచి తేలిగ్గా డబ్బులు కాజేసేందుకు హ్యాకర్లు కుట్రలు చేస్తున్నారు. ర్యాన్సమ్‌వేర్ దాడులకు స్మార్టుఫోన్లేమీ మినహాయింపు కాదు. కంప్యూటర్లతో పోల్చితే ప్రమాదం కొంత తక్కువ. అయితే ఇటీవల సెల్ ఫోన్ బాధితుల సంఖ్యా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా అడ్రాయిట్ ఆపరేటింగ్ ఫోన్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెద్దపెద్ద సంస్థలను, ప్రభుత్వ విభాగాల కంప్యూటర్లను కొల్లగొట్టి డబ్బు వసూలు చేసినట్లుగా వ్యక్తిగత ఫోన్లను హ్యాక్ చేసి వసూలు చేయడం గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో స్మార్టుఫోన్లపై దాడులు ఇప్పటికీ కొంత తక్కువగానే ఉన్నాయి. సెల్ ఫోన్ వినియోగదారులు హ్యాకర్లకు డబ్బులు చెల్లించే బదులు... ఫోన్ ను రీస్టాట్ చేసుకునే వెసులుబాటు ఉండటం కూడా వీటిపై ప్రభావం పెద్దగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్లలో స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న దేశాలలో భారదేశం రెండో స్థానంలో ఉంది. మొబైళ్లపై ప్రభావం చూపించిన ర్యాన్సమ్‌వేర్‌లు ఫ్యుసాబ్, స్మాల్, ప్లెటార్, స్వెపెంగ్ ఉన్నాయి. వీటిలో స్వెపాంగ్ పెద్ద ఎత్తున బ్యాంకింగ్ పై ప్రభావం చూపించింది. జర్మనీ, అమెరికా, బ్రిటన్‌లలో వినియోగదారులు భారీగా నష్టపోయారు. ర్యాన్సమ్‌వేర్ ఈ-మెయిల్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్లో మెయిళ్లు చూసుకునేవారంతా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం లేని మెయిళ్లు, ఆకర్షించేలా గుర్తు తెలియని ఐడీల నుంచి వచ్చేవాటిని ఓపెన్ చేయోద్దని నిపుణులు తేల్చిచెబుతున్నారు.
స్మార్టుఫోన్లలో ఉంచే ముఖ్యమైన ప్రతి సమాచారాన్నీ వేరేచోట కూడా భద్రపరుచుకోవాలి. ఫోన్లో కచ్చితంగా యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. తెలియని యాప్ లను ఫ్రీ గిఫ్ట్ లు ఇస్తామంటూ వస్తున్నవాటిని అస్సలే డౌన్ లోడ్ చేసుకోవద్దు. ఇలాంటివి కచ్చితంగా ప్రమాదాన్ని కలిగిస్తాయ్. యాప్‌లకు ఓఎస్‌లకు ప్లేస్టోర్‌ల నుంచి మాత్రమే తీసుకోవాలి. సోషల్ మీడియా నుంచి వస్తున్న లింకుల జోలికి వెళ్లొద్దు. ఇటీవల కాలంలో ఫోన్‌తోనే ఆర్థిక వ్యవహారాల బ్యాంకింగ్ యాప్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకుల పేరుతో నకిలీ యాప్‌లు ఉండే ప్రమాదం ఉంది. బ్యాంకు వెబ్‌సైట్లోని డౌన్లోడ్ లింకు నుంచి అసలైన యాప్ తీసుకోవాలి.
వన్నా క్రై భూతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశపెట్టింది ఉత్తర కొరియా ప్రభుత్వ యంత్రాంగంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. 150 దేశాలపై ప్రభావం చూపిన ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడి ఉత్తరకొరియా నుంచే అంటుకుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేస్తున్న కోడ్ ఆధారంగా కొరియా నుంచే ఈ వైరస్ వ్యాప్తి చెందిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయి ఆధారాలు మాత్రం లభించలేదు. ప్రపంచదేశాలను వణికిస్తున్న ర్యాన్సమ్ వేర్ లెజారస్ హ్యాకర్ గ్రూపుకు చెందినదిగా భావిస్తున్నారు. ఆ లింకు ఉత్తర కొరియాకు సంబంధించిందిగా అనుమానిస్తున్నారు. వాన్నా క్రై కోడ్ ను ఉత్తర కొరియా నటులు సైతం ఉపయోగిస్తున్నారని... థర్డ్ పార్టీ కోడ్ సైతం దాన్నుంచే వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
అయితే దాడి వెనుక ఉన్నవారెవన్న విషయాన్ని పరిశోధిస్తున్నట్టుగా వైట్ హౌజ్ ప్రకటించింది. వైబ్ సైట్లను ఎన్క్రిప్ట్ చేసి వాటిని డిక్రిప్ట్ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్న ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఉత్తర కొరియా హ్యాకింగ్ నిపుణులే 'వాన్నా క్రై' కోడ్ రాసుంటారని అలా జరగక పోయి వుంటే, ఓ థర్డ్ పార్టీ కోడ్ ను ఉత్తర కొరియా ప్రభుత్వం, హ్యాకర్లు వాడి ఉంటారని అంటున్నారు. కాగా, వైరస్ దాడులు ఎక్కడి నుంచి జరిగాయన్న విషయాన్ని శోధిస్తున్నామని వైట్ హౌస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సలహాదారు థామస్ బోసెర్ట్ వెల్లడించారు.
2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థలో జరిగిన భారీ హ్యాకింగ్ కు దీనికి సంబంధాలున్నాయని అభిప్రాయాన్ని సైబర్ ఎక్సపర్ట్ వివరిస్తున్నారు. అప్పట్లో సోనీ సంస్థలో జరిగిన వైరస్ దాడి కూడా... ఉత్తర కొరియానేనని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ను హత్య చేసే పన్నాగం కథాంశంతో సోనీ సినిమాను ప్రసారం చేయగా... సోనీపై సైబర్ దాడి జరిగింది.
హ్యాకర్ల బారినపడ్డ కంప్యూటర్ వ్యవస్థలను ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలన్నది ఇప్పుడో పెద్ద సవాలు. ప్రపంచ దేశాల్లోని పలు ప్రభుత్వ యంత్రాంగాల్లో ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట వేర్ లను వినియోగించడం కూడా అసలు సమస్యకు కారణంంగా చెబుతున్నారు. ఇప్పుడు ఆ కంప్యూటర్లు పనిచేయడం ఎలా?
ఈ జబ్బుకు ఇంత వరకు మందు కనిపెట్టలేదు. కేవలం వ్యాధి అంట కుండా టీకాలు ఏవిధంగానైతే వేస్తారో... కేవలం అదే విధంగా ఈ ర్యాన్సమ్ వేర్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు కానీ... ఉన్న వైరస్ ను తొలిగించేందుకు ఇంత వరకు ఎలాంటి చికిత్సా మార్గాలను కనిపెట్టలేదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచాన్ని గడగడలాడించిన వన్నా క్రై ర్యాన్సమ్ వేర్ ను కట్టడి చేసేందుకు 22 ఏళ్ల ఇంగ్లాండ్ సెక్యురిటీ రీసెర్చర్ అడ్డుగట్ట వేశాడు. ర్యాన్సమ్ వేర్ శాంపిల్ ను పరిశీలించి... డొమైన్ కు కనెక్ట్ అవుతుందో చెక్ చేశాడు. మన డొమెన్ కు సంబంధం లేని ర్యాన్సమ్ వేర్ వైరస్ ఉన్న కంప్యూటర్ కు కనెక్ట్ అవుతోందని గమనించి... ఆయా వేర్లు కంప్యూటర్లలోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా చేశాడు.
అయితే ఇప్పటి వరకు ర్యాన్సమ్ వేర్ ను అన్ లాక్ చేసే వ్యవస్థను సాప్ట్ వేర్ ప్రొగ్రామర్లు రూపొందించలేకపోయారు. అయితే పరిశోధనలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయ్. హ్యాకర్లను పట్టుకునేందుకు... సైతం ప్రభుత్వాల యంత్రాంగాలు పనిచేస్తున్నాయ్. అదే సమయంలో కంప్యూటర్ వినియోగదారులు,సెల్ ఫోన్ వినియోగదారులు... గూల్ , మైక్రోసాఫ్ట్ అందిస్తున్న ప్యాచ్ అప్డేట్స్ చేసుకోవాలి. నిపుణుల ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుతం ఈ రోగాని మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. నివారణ కోసం కంప్యూటర్లు వినియోగించేవారందరూ విధిగా యాంటీ వైరస్ లు ఇన్స్టాల్ చేసుకోవాలి. సైబర్ దాడులను అరికట్టాలంటే ప్రపంచ యంత్రాంగం ఏర్పాటు పరిష్కార మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం ఎక్కడ్నుంచి ఎలా వస్తుందో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు సురక్షితమైన సాఫ్ట్ వేర్లను వాడటంతోపాటు, ఐటీ నిపుణుల సలహాలను పాటించాలి. ఇష్టానుసారం యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దు. ఆయా కంపెనీలు, బ్యాంకులు విడుదల చేసిన యాప్ లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. అది మొబైల్ డేటాగానివ్వండి, కంప్యూటర్ డేటా కానివ్వండి... ఏదైనా సరే సాఫ్ట్ కాపీ అవసరం. వాటిని ఇంటర్నెట్ కు సంబంధం లేని సిస్టమ్ లో స్టోర్ చేసుకోవడం లేదంటే సాఫ్ట్ కాపీ రూపంలోనూ భద్రపర్చుకోవాలి. వాన్నా క్రై, ర్యాన్సమ్ వేర్ భూతాలను రాకుండా చేసుకోవడం మన చేతిలోనే ఉంది.

No comments:
Post a Comment