Friday, 14 July 2017

టాయిలెట్లలో పేపరా... బిడెట్సా...


( ) తుడుచుకోవడమా... కడుక్కోవడమా... తేల్చుకోండి... అమెరికన్లకు ఆ దేశ పర్యావరణ వేత్తలు చేస్తున్న సూచన ఇది. దీంట్లో ఆశ్లీలమూ లేదు.... అసందర్భమూ లేదు... రోజూ మనం ఉపయోగించే టాయిలెట్లలో బిడెట్స్ వినియోగిస్తే పెద్ద ఎత్తున పేపర్ వినియోగాన్ని అడ్డుకోవచ్చని... తద్వారా భారీగా నిధులు దుర్వినియోగాన్ని అడ్డుకోవచ్చని అమెరికా నిపుణుల   పరిశోధనలో వెల్లడైంది.  పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతగానో సహకరిస్తుందని రుజవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
టాయిలెట్  కు వెళ్లినప్పుడు నీళ్లను వదిలి పెడుతోంది బిడెట్. ఇప్పటి వరకు కొన్ని పాశ్చాత్య దేశాలతోపాటు, అమెరికాలో ఎక్కువగా టాయిలెట్లకు వెళ్లినప్పుడు టిష్యూ  పేపర్లను వాడటం అలవాటుగా ఉంది. అయితే ఈ టిష్యూ పేపర్లను వినియోగించడం వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని... ఇప్పటికే ఎంతో నష్టం వాటిల్లిందని  మెటా ఎఫిసీయంట్ డాట్ కమ్ ఎడిటర్ జస్టిన్ థామస్ వివరిస్తున్నారు. అదే సమయంలో  టాయిలెట్లలో బిడెట్ ను వినియోగించడం ద్వారా అడవులను సంరక్షించడంతోపాటు... నీటిని పొదుపు చేయోచ్చంటూ అమెరికా నిపుణులు అంచనా వేస్తున్నారు.  టాయిలెట్లలో శుభ్రత కోసం వినియోగించే టిష్యూలు, బిడెట్స్ యూరప్, జపాన్  దేశాల్లో బాగా ప్రసిద్ధం. బాత్ రూమ్ లలో జెట్ వాటర్ ను ఉపయోగించడం ద్వారా  పర్యావరణాన్ని కాపాడొచ్చని థామస్ వివరిస్తున్నారు.  పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వచ్చే రోజుల్లో ప్రపంచమంతా ఇదే పద్ధతిని అవలంబించాలని ఆయన సూచిస్తున్నారు.  ఈ పద్దతి ద్వారా టాయ్ లెట్లలో పేపర్ వినియోగం పూర్తిగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.
ఏటా అమెరికా ప్రజలు 36.5 బిలియన్ రోల్స్ పేపర్ ను వినియోగిస్తున్నారు.  అంటే 3,650 కోట్ల రౌండ్లను పేపర్లను అమెరికన్ల టాయ్ లెట్లలో వాడుతున్నారు. ఈ రోల్స్ తయారీ కోసం మొత్తం కోటిన్నర చెట్లు అవసరమవుతాయి. ఈ పేపర్లను తయారు చేసేందుకు 47 వేల 358 కోట్ల గ్యాలెన్ల నీరు అవసరమవుతోంది. ఈ నీటిని బ్లీచింగ్ చేయడం కోసం 2 లక్షల 53 వేల టన్నుల క్లోరిన్ వినియోగించాల్సి  వస్తోంది.  ఇందుకోసం అయ్యే విద్యుత్ 17.3 టెరా వాట్ల విద్యుత్ అవసరమవుతోందని...  థామస్ తన పరిశోధనలో వెల్లడించాడు. దాంతోపాటు ఈ పేపర్లను ట్రాన్స్ పోర్ట్ చేయడానికి అయ్యే ఖర్చును కూడా తగ్గించవచ్చని స్పష్టం చేస్తున్నాడు.
ఎవరైతే బిడెట్స్ వినియోగాన్ని వ్యతిరేకిస్తారో... వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని వారికి ఎలాంటి వ్యాధుల సమస్యలు రావని కూడా వివరిస్తున్నాడు. అదే సయంలో బిడెట్స్ ను వినియోగించడం ద్వారా చాలా తక్కువ పరిణామంలో నీరు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. బిడెట్ ద్వారా వాడే నీరు గ్యాలెన్లో ఎనిమిదో వంత మాత్రమేనని వారు వివరిస్తున్నారు. ఒకసారి టాయెలెట్ కు వెళ్లడం వల్ల దాదాపు 15 లీటర్ల నీటిని వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్క పేపర్ రోల్ తయారు చేయడానికి 136 లీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 1.3 కిలో వాట్ల విద్యుత్ తోపాటు, 700 గ్రాముల చెట్టును వినియోగిస్తున్నారు. కొన్ని బిడెట్లు రూ. 36 వేల వరకు ఉండగా... రూ. 5 వేలకు లభ్యమయ్యేవి కూడా ఉన్నాయ్. టాయిలెట్లలో పేపర్ వినియోగించడంతో పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయ్. చెత్త శుభ్రం చేయడం కోసం ఇది పెద్ద ప్రహసనమే అవుతుందని మెటా ఎఫిసీయంట్ డాట్ కమ్ ఎడిటర్ జస్టిన్ థామస్ అభిప్రాయపడ్డారు.  టాయెలెట్లలో బిడెట్స్ ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. జపాన్లో ఇప్పటికే పెద్ద ఎత్తున 60 శాతం ఇళ్లలో బిడెట్స్ వినియోగిస్తున్నారని... వెనుజులాలో 90 శాతం ప్రజలు టాయ్ లెట్లలో బిడెట్స్ వాడుతున్నారని చెబుతున్నారు.
పేపర్ ను ఉపయోగించడం కంటే నీటని ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని అంటున్నారు. నీటిని ఉపయోగించడం ద్వారా  పలు అంటురోగాలను సైతం అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. టాయె లెట్లను వినియోగించిన తర్వాత సగం మంది మాత్రమే చేతులు కడుక్కుంటున్నారని... ఇది అనారోగ్యానికి కారణమవుతుందని అంటున్నారు. సో మీరు కూడా ఈ పర్యావరణ సహిత బిడెట్స్ ను వినియోగిస్తే... అటు నీరు... ఇటు ఆరోగ్యం రెండూ పదిలం చేసుకోవచ్చు.


No comments:

Post a Comment