గుర్ఖా ఫైట్
ఓవైపు చైనా అలజడి. మరోవైపు గుర్ఖాల ఫైటింగ్... సిక్కిం ప్రజల బతుకు పోరు ఇప్పుడు బెంగాల్ సరిహద్దుల్లో విపరీత పరిస్థితులకు కారణమవుతున్నాయ్. బెంగాల్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ గుర్ఖాలాండ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయ్. తమను బెంగాల్ ప్రభుత్వం రెండో స్థాయి పౌరులుగా అవమానిస్తుందంటూ గుర్ఖా మెజార్టీ ప్రాంతాల్లో అలజడి రాజ్యమేలుతుంటే... మా బతుకులు సంగతేంటంటూ... సిక్కిం ప్రజలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. గుర్ఖా అల్లర్లతో నష్టపోయిన 60 వేల కోట్ల రూపాయల కోసం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామంటూ ఆ రాష్ట్రం చేస్తున్న హెచ్చరికలు ఈశాన్య భారతంలో కల్లోలానికి కారణవుతోంది. దీదీ సర్కారు తీసుకున్న బెంగాల్ భాష తప్పనిసరి నిబంధనే గుర్ఖా ఉద్యమానికి ఊపిరిలూదితే... తమ జీవితాల్లో గుర్ఖా ఉద్యమం విధ్వంసం సృష్టిస్తోందని సిక్కిం ప్రజలు వాపోతున్నారు. వందేళ్ల చరిత్రగల గుర్ఖా సమస్యకు కేంద్రం చర్యలు తీసుకోవాలని నాయకులు బిమల్ గురాంగ్ గాండ్రిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పున్నట్టుగా గుర్ఖాలు సాగిస్తున్న ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధనకు కీలక మలుపు అవుతుందన్న అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో నెలకొంది.
వందేళ్ల డిమాండ్. తాము బెంగాలీలకు వేరని... తమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని గుర్ఖాలు వరుస ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఉంటేనే తమ జీవితాల్లో వెలుగులు పూస్తాయని గుర్ఖాలు ఆందోళన బాట పడుతూనే ఉన్నారు. గుర్ఖాలాండ్ గురించి ఓ సారి తెలుసుకుందాం. డార్జిలింగ్ పర్వత ప్రాంతంతో పాటు సిలిగురి, జల్‌పాయ్‌గురిలోని కొన్ని ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నూటపదేళ్లుగా ఉంది. తాము భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ... తమకంటూ ప్రత్యేక రాష్ట్రం లేనందువల్ల ఇప్పటికీ తమను నేపాలీలంటూ పిలుస్తున్నారని... గుర్ఖా తెగ ప్రజలు ఆందోళనబాట పట్టారు. భాష, సాంస్కృతికపరమైన వైవిధ్యాల కారణంగా తమకూ ఒక రాష్ట్రం ఉండాలని వీరు బలంగా కోరుకుంటున్నారు. డార్జిలింగ్ హిల్స్ లో ఉన్న గుర్ఖా తెగ ప్రజలు స్వయంప్రతిపత్తితో రాష్ట్రాన్ని దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. భాషా, సంస్కృతి ఆధారంగా తాము బెంగాలీలకు వేరన్న భావనను అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలను అక్కడి ప్రజలు చేపట్టారు. భారత్ లో ఉన్న నేపాలీ భాష మాట్లాడే ప్రజలు ఉండే భాగాలనే గుర్ఖాలాండ్ గా పిలుస్తారు. 1986-88 మధ్య గుర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలోనూ, 2007 నుంచి గుర్ఖా జన్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాలు నిరంతరం సాగుతూనే ఉన్నాయ్.
వందేళ్ల క్రితం నుంచే డార్జిలింగ్ , సిలిగురి, దోర్స్ ప్రాంతాల్లో నివశించే ప్రజలందరూ తమను ప్రత్యేకంగా చూడాలని... ప్రత్యేక పాలన వ్యవస్థ తమకు కావాలని... అందుకు ప్రభుత్వాలు సహకరించాలని కోరుతూ వచ్చారు. పాలనా సంస్కరణల నిమిత్తం 1907లో భారత్‌లో పర్యటించిన మోర్లీ– మింటో ప్యానల్‌కు ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను విన్పించారు. 1952లో నాటి భారత ప్రధాని నెహ్రూకు ఆలిండియా గూర్ఖా లీగ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ వినతిపత్రం ఇచ్చింది. తొలి ఎస్సార్సీ ఏర్పాటు సమయంలో గుర్ఖాలాండ్ రాష్ట్రం ఆవిశ్యకత గురించి ప్రస్తావించినా... చిన్న రాష్ట్రాలను ఇందిరాగాంధీ వ్యతిరేకించడంతో... ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల ఆందోళనలు తగ్గాయ్. రాజీవ్‌గాంధీ హయాంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ హింసాత్మక మార్గంలోకి మళ్లింది. తొలుత ప్రత్యేక పాలన విభాగాన్ని కోరుకున్న గుర్ఖాలు... ఆ తర్వాత రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం దిశగా ఆందోళన మొదలుపెట్టారు. తమకు రాజ్యాంగ పరమైన రక్షణలు కావాలంటూ ఆందోళన సాగించారు. ఆ తర్వాత 1980 నుంచి సుభాష్ గీసింగి ఉద్యమబాట పట్టాడు. మాజీ సైనికుడు, రచయిత కావడంతో... సుభాష్... గుర్ఖాల్లో మరోసారి ఉద్యమాన్ని రగిలించాడు. ఆయన నాయకత్వంలోనే తొలిసారిగా గుర్ఖాలాండ్ అంటూ ఉద్యమం మొదలైంది. ఆయన ఆధ్వర్యంలోనే గుర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఏర్పడింది. 1986–88 మధ్య జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 1,200 మంది పౌరులు చనిపోయారు. 1988 ఆగష్టు 22న ఉద్యమకారులకు, కేంద్రానికి, బెంగాల్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరి... ఈ ప్రాంత పరిపాలన కోసం డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ (డీజీహెచ్‌ఎస్) ఏర్పాటైంది. షీఘింగ్ 2008 దాకా డీజీహెచ్‌ఎస్‌కు నేతృత్వం వహించారు. బిమల్ గురుంగ్ నేతృత్వంలోని జీజేఎం బలమైన శక్తిగా ఎదగడంతో ఘీషింగ్ డార్జిలింగ్‌ను వదిలి వెళ్లారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతిబసు ఉన్న సమయంలో డార్జిలింగ్ గుర్ఖా హిల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. స్వయంప్రతిపత్తిగల సంస్థగా డీజీహెచ్సీని రాష్ట్రం లోపల నిర్ణయాధికారాన్ని దాఖలుపరిచేలా చేశారు. అయినప్పటికీ 2007లో మరోసారి బిమల్ గురాంగ్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం రాజుకొంది. అప్పటి వరకు గుర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ లో పనిచేస్తున్న బిమల్ గురాంగ్ గుర్ఖా జన్ ముక్తి మోర్చా జీజేఎం ఏర్పాటు చేశాడు. రెండేళ్ల పాటు ఉధృతంగా ఆందోళనలు చేసిన దరిమిలా... స్వతంత్ర ప్రతిపత్తి గల గుర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) ఏర్పాటుకు జీజేఎం అంగీకరించింది. గురాంగ్ ప్రస్తుతం జీటీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తొలుత మమత సర్కారుతో సఖ్యతగా ఉన్న జీటీఏ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనంటూ నినదిస్తోంది. అయితే 2013 చివర్లో తెలంగాణ ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జీటీఏ చీఫ్‌గా గురుంగ్ రాజీనామా చేసి... మమతతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా కావాలనే డిమాండ్ తిరిగి ఎత్తుకున్నారు. తాము బెంగాల్ లో నివశిస్తున్నప్పటికీ... అక్కడి ప్రజలు... తమను రెండో రకం పౌరులుగా ట్రీట్ చేస్తున్నారని... వారు చెబుతున్నారు. గుర్ఖాలాండ్ గా చెబుతున్న మొత్తం ప్రాంతంలో 14 లక్షల మంది జనాభా ఉన్నారు. గుర్ఖాలాండ్ కు గుండెకాయ డార్జిలింగ్. డార్జిలింగ్ గుర్ఖాలకు జీవన స్రవంతి. డార్జిలింగ్ ప్రాంత చరిత్ర అంటే సిక్కిం, నేపాల్, భూటాన్, బెంగాల్, బ్రిటన్‌లతో సంబంధం కలిగి ఉంటుంది. అసలు డార్జిలింగ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే వింతగా అనిపిస్తుంది. డోర్జి అంటే మెరుపులు. లింగ్ అంటే ప్రాంతం. అంటే మెరుపుల నేల. పేరుకు తగ్గట్టు ఇప్పుడే నిజంగానే అది ఉరుములు, మెరుపుల నేలగా అలరారుతోంది. ఇప్పుడు ఆ నేల మీదే ఉద్యమం ఉరుముతోంది.
గుర్ఖాల ఉద్యమానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయ్. ప్రస్తుత ఆకాంక్షలకు సిక్కిం మద్దతిస్తన్నప్పటికీ... ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంత వీజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజా ఉద్యమానికి రాజకీయ ఆధిపత్యమే కారణమా? బెంగాల్ ను తిరుగులేకుండా పాలిస్తున్న మమత... గుర్ఖాలపై ఎందుకు కాఠిన్యం చూపుతున్నారు? బెంగాలీలపై ఉన్న ప్రేమ గుర్ఖా ప్రజలపై మమతకు లేదా? రాజకీయ కారణలేమైనా ఉన్నాయా? మొత్తం వ్యవహారంలో కేంద్రం వ్యూహాలేమైనా ఉన్నాయా? నిజానికి డార్జిలింగ్ సిక్కిం ప్రాంతానికి చెందినది. నేపాల్‌కీ, సిక్కింకు మధ్య ఇది తటస్థ రాజ్యంగా కూడా ఉండేది. అయితే తరువాత ఇది నేపాల్ లో విలీనం కావడానికి అంగీకరించింది. తరువాత బ్రిటిష్ ఇండియాలోకి మారింది. ఆ వెంటనే... డార్జిలింగ్ సిక్కిం పాలనలోకి మారింది. 1835లో బ్రిటిష్ ప్రభుత్వానికి కానుకగా సమర్పించడానికే ఈ మార్పు జరిగింది. కానీ సిక్కిం ఆ పని చేసినందుకు ఆనాడు నేపాల్, భూటాన్‌లు ఆగ్రహించాయి. ఇలాంటి భూభాగాన్ని విదేశీయులకు ధారాదత్తం చేయడం దారుణమని సిక్కింపై నిప్పులు చెరిగాయ్. 1851 నాటికే ఇక్కడి ఆదాయం యాభైవేల రూపాయలు. ఇది నేపాల్, భూటాన్‌ల మీద ఆధిపత్యం కొనసాగించడానికి అనువైన వ్యూహాత్మక ప్రదేశం. టిబెట్, సిక్కింల గుండా జరిగే వాణిజ్యానికి కూడా ఈ ప్రాంతమే కీలకం. వీటితో పాటు వేసవి విడిదిగా కూడా ఆంగ్లేయులు దీనిని విశేషంగా ఇష్టపడేవారు. ఇండియన్ మెడికల్ సర్వీస్‌కు చెందిన డాక్టర్ ఆర్థర్ కాంప్‌బెల్ ఇక్కడ శానెటోరియాలు, ఆరోగ్య కేంద్రాలుగా వినియోగించుకునేవారు. డెబ్బయ్‌కి తక్కువ కాకుండా ఆంగ్లేయుల కుటుంబాలు ఇక్కడకు తరలివచ్చాయి. తరువాత ఇక్కడి తేయాకు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది కూడా. ఆ ఘనత కూడా కాంప్‌బెల్‌కే దక్కుతుంది. అతడు అంతకు ముందు చైనాలో పనిచేసేవాడు. అక్కడ నుంచి డార్జిలింగ్ కొండలలోకి వస్తూ కూడా తేయాకు విత్తనాలు తెచ్చారు. అదే అక్కడ అపారమైన సంపదగా రూపొందింది. వేల ఎకరాలకు విస్తరించింది. స్వతంత్ర భారతదేశంలో ప్రాంతాల విలీన చట్టం మేరకు 1954లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విలీనం చేశారు. అప్పుడే ఒక జిల్లాగా దీనిని ఏర్పాటు చేశారు.
ఇందులో డార్జిలింగ్ పట్టణం, పరిసరాలు, కుర్సియాంగ్ కలింపాంగ్, సిలిగురిలోని తెరాయి భూభాగం ఆ జిల్లాలో చేర్చారు. 1950లో టిబెట్ మీద చైనా దాడి తరువాత, ఆ ప్రాంతానికి చెందిన వారిలో చాలామంది డార్జిలింగ్ జిల్లాకే తరలి వచ్చారు. ఆ తరువాతే ఈ ప్రాంత స్థానికులలో తాము నిర్లక్ష్యానికి గురయ్యామన్న భావన ఆరంభమైంది. అదే తరుచుగా ఆందోళనల రూపంలో బయటపడేది. ముఖ్యంగా మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమపై ఆధిపత్యం చలాయిస్తున్నారని అక్కడి కొండవాసులు భావించిన ప్రతిసారి ఇలాంటి ఆందోళనలు చోటు చేసుకునేవి. ఈ మొత్తం ఉదంతంలో కొన్ని ఇతర కీలక అంశాలు కూడా కనిపిస్తాయి. ఆందోళనకారులు ప్రతిపాదిస్తున్న గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంలో డార్జిలింగ్ జిల్లా, కలింపాంగ్ జిల్లా, సిలిగురి పరిధిలోని ప్రాంతాలు, తెరాయి, అలీపుర్దార్ పరిధిలోని దొవర్స్, జల్పాయిగురి జిల్లాలను కలపాలని కోరుతున్నారు. కానీ ఈ ప్రాంత జనాభాల నిష్పత్తులను పరిశీలిస్తే చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో గూర్ఖా జనాభా 35 శాతం మాత్రమే. ఇంకా ఆదివాసీలు 20 శాతం, బెంగాలీలు 15 శాతం, రాజ్‌బంగీసిస్ 25 శాతం, టోటాలు, మెచ్‌లు, ఇతరులు 5 శాతం ఉన్నారు. ఇంత వైరుధ్యంలో, జాతుల మేళవింపులో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటును వీరంతా స్వాగతిస్తారన్న అభిప్రాయం కూడా లేదు. అలాగే షెర్పాలు, భుటియాలు, లెప్చాలు, ఇతర తెగల వారు కూడా గూర్ఖాలు చెబుతున్న స్వయం పాలనకు మొగ్గు చూపడం లేదు.
గూర్ఖాలాండ్ ఏర్పాటుకూ, డార్జిలింగ్‌ను సిక్కింలో విలీనం చేయాలన్న ప్రతి పాదనకూ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్, సిక్కిం క్రాంతికార్ మోర్చా తమ మద్దతు తెలియచేయడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ రెండు ఆకాంక్షలు కూడా ఆ రెండు ప్రాంతాల చరిత్రతో ముడిపడి ఉన్నవే. ఎందుకంటే మొదట చెప్పుకున్నట్టు డార్జిలింగ్ ఒకప్పుడు సిక్కింలో అంతర్భాగమే. ఇవాళ డార్జిలింగ్ కొండలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ప్రత్యేక గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని కొండప్రాంత ప్రజలు నిర్ద్వంద్వంగా కోరుతున్నారు. కానీ ఏ ఒక్క జాతీయ పార్టీ ఇందుకు అనుకూలంగా లేదు. ఆఖరికి బీజేపీ కూడా ఇదే బాటలో నడుస్తున్నది. 2009 నుంచి 2014 వరకు జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఆ పార్టీ ఇచ్చిన ప్రతి ఎన్నికల ప్రణాళికలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. గూర్ఖాలాండ్ గురించి తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. ఇప్పుడు డార్జిలింగ్ జిల్లాలో ఉన్న బీజేపీ శాఖలన్నీ జాతీయ నాయకత్వంపైన కాలు దువ్వుతున్నాయి. దీనితో సమస్యకు పరిష్కారం మరింత క్లిష్టంగా మారింది.
నిజానికి ప్రస్తుతం డార్జిలింగ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితికి రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ఆరాటమే కారణం. ప్రతిపాదిత గూర్ఖాలాండ్ ప్రాంతంలో బిమల్ గురుంగ్ మాటకు తిరుగులేదు. అయితే మమత ఈ ప్రాంతంలో పట్టుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇతర ఆదివాసీలైన లెప్చాలు, తమంగ్స్, భూటియాలు, షెర్పాలు, మంగర్లను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించారు. కలింపాంగ్‌ను జిల్లాగా చేస్తున్నట్లు ప్రకటించారు. మేలో జరిగిన నాలుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో... మిరిక్ మున్సిపాలిటీని తృణమూల్ గెలుచుకుంది. పర్వతప్రాంతాల్లో తమకు పెట్టని కోటలుగా ఉన్నచోట్ల తృణమూల్ ఖాతాలు తెరవడం, మిరిక్‌కు కైవసం చేసుకోవడాన్ని... తన ఆధిపత్యానికి సవాల్‌గా గురుంగ్ భావించారు. బెంగాలీ తప్పనిసరి అనే మమత నిర్ణయాన్ని సాకుగా తీసుకొని ఆందోళనలకు పిలుపిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ సెంటిమెంటును తెరపైకి తెచ్చి ఉద్యమిస్తే ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం ద్వారా పట్టు నిలుపుకోవాలనేది గురుంగ్ ఆలోచన.
ఉత్తర బెంగాల్‌లోని ఆరు జిల్లాలు కూచ్ బెహార్, అలీపూర్‌దౌర్, జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్ 2014– 2016 మధ్యకాలంలో బీజేపీ బాగా బలపడింది. 42 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిలాల్లో బీజేపీ ఎదుగుదలను దీదీ ముప్పుగా భావిస్తున్నారు. డార్జిలింగ్ చుట్టుపక్కల కొండప్రాంతాల్లోనే ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు మద్దతు ఉంటుందని, మైదాన ప్రాంతాల్లోని బెంగాలీ ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తారు కాబట్టి వీరి మద్దతు తృణమూల్‌కు లభిస్తుందని మమత లెక్క. బెంగాల్ విభజనకు మమత మొదటి నుంచి వ్యతిరేకమే. ఎన్డీయే భాగస్వామి అయిన జీజేఎం మద్దతుతోనే 2014లో బీజేపీ డార్జిలింగ్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. బీజేపీ నేతలు గుర్ఖాలాండ్‌కు మద్దతు పలికారు. చిన్నరాష్ట్రాలకు బీజేపీ సూత్రప్రాయంగా అనుకూలమన్న వాదనను మరోసారి విన్పించారు.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని బీజేపీ ప్రస్తావించింది. బీజేపీపై విభజనకు అనుకూలమనే అస్త్రాన్ని వదిలి... కమలం పార్టీని దెబ్బతీయాలని దీదీ చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతమైతే బీజేపీ ఇరకాటంలో పడుతుంది. బెంగాల్ బీజేపీ నేతలు విభజనను బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మిత్రపక్షం జేజీఎం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. గూర్ఖాలాండ్‌కు మొగ్గితే ఉత్తరప్రదేశ్‌లో, మహారాష్ట్రలో విదర్భ నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వస్తాయి కాబట్టి బీజేపీ ఏమీ తేల్చదు. పైగా బెంగాల్లో బలపడాలని కమలనాథులు చాలాకాలంగా పావులు కదుపుతున్నారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసే గూర్ఖాలాండ్ విభజనను ఇప్పట్లో పట్టించుకోరు. ఇలా రాజకీయ పార్టీలు ఎవరి లెక్కల్లో వారున్నారు. పాపం అమాయక ఆదివాసీలే సెంటిమెంట్‌తో రోడ్డెకుతున్నారు. కొండప్రాంత ప్రజలు ఈసారి తాడోపేడో తేల్చుకుంటే తప్ప పోరాటం విరమించరాదని భీష్మించుకు కూర్చున్నాయ్. స్వయం పాలన కోసం దశాబ్దాలుగా తాము చేస్తున్న డిమాండ్‌ను ఎలాగైనా సాధించుకోవాలని పోరాట సంస్థలు భావిస్తున్నాయి. అయితే జాతీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు ఈ అంశం నుంచి ఎంత రాజకీయ లబ్ధి పొందవచ్చునో చూస్తున్నాయి. సంఖ్యాబలం మీద ఆధారపడి ఉండే రాజకీయ పార్టీలు అందుకోసం స్థాని కుల ఆకాంక్షలను నీరు కార్చడం అనివార్యంగా కనిపిస్తున్నది.
గుర్ఖా ఉద్యమం చల్లారినట్టే చల్లారి అంతకంతకూ ఎందుకు పెరుగుతోంది. దీదీ తీసుకున్న బెంగాలీ అమలు నిర్ణయమే తాజా అల్లర్లకు కారణమా? పశ్చిమ బెంగాల్ లో తిరుగులేని ఆధిపత్యంతో పాలిస్తున్న దీదీకి తాజా ఉద్యమం సవాళ్లు విసిరుతోంది. అక్కున చేర్చుకున్న దీదీపై గుర్ఖాలు ఎందుకు ఉద్యమిస్తున్నారు. గుర్ఖాలాండ్ లో అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయ్?
వేసవిలోనూ చల్లగా ఉండే పర్వతప్రాంతం డార్జిలింగ్ ఉడుకుతోంది. ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్ కావాలనే డిమాండ్‌తో ఇక్కడి ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగారు. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో నిరవధిక బంద్‌కు గుర్ఖా జనముక్తి మోర్చా ... జీజేఎం పిలుపినివ్వడం... మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా... ప్రభుత్వం ఆర్మీని పిలిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. తాజా ఆందోళనకు ప్రధాన కారణం... ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు బెంగాలీని తప్పనిసరి చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే. మొదటి లాంగ్వేజీగా... ఎవరి మాతృభాషను వారు తీసుకున్నప్పటికీ సెకండ్, థర్డ్ లాంగ్వేజీల్లో బెంగాలీ తప్పనిసరంటూ మమత కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే నేపాలీ మాతృభాషగా ఉన్న గూర్ఖాలు.. బెంగాలీతో మాకేమవసరమంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ఆధిపత్యంలోని డార్జిలింగ్‌లో హింసాత్మక ఆందోళనలకు దిగారు. ఈనెల 8న మమత సర్కారు డార్జిలింగ్‌లో కేబినెట్ సమావేశాన్ని సైతం వారు అడ్డుకోవాలని ప్రయత్నించారు. మమత గోబ్యాక్ అంటూ పోలీసులపై దాడి చేసి... వాహనాలను తగులబెట్టారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు... లాఠీచార్జీ, భాష్పవాయువు ప్రయోగం చేశారు. గుర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో జూన్ 15 నుంచి నుంచి నిరవధిక బంద్‌ను పాటిస్తున్నారు. గుర్ఖాపై నిర్ణయం వచ్చే వరకు బంద్ కొనసాగిస్తామని జీజేఎం నాయకుడు బిమల్ గురుంగ్ ప్రకటించారు.
ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అత్యవసర సర్వీసులు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయవని ఆందోళనకారులు స్పష్టం చేశారు. పర్యాటకంతో విలసిల్లిన డార్జిలింగ్ పూర్తి స్థాయిలో స్తభించిపోయింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జీజేఎం సమ్మెకు పిలుపిచ్చినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉన్నాయ్.
మమత బెదిరింపుల నేపథ్యంలో... తాజా ఆందోళనకు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలని కోరినట్టుగా జీజేఏం చెబుతోంది. విధులకు హాజరుకాకపోవడాన్ని మాత్రం సహించబోమని బెంగాల్ సర్కారు స్పష్టం చేసింది. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని మమత గుర్ఖా నాయకులు తేల్చిచెప్పారు. ప్రభుత్వాన్ని అనవసరంగా ఇరుకునపెట్టేలా ఆందోళనలు దిగితే... ఊరుకునేది లేదని మమత తేల్చిచెప్పారు. విధులకు రాకపోతే ఉద్యోగుల రికార్డుల్లో ‘సర్వీసు బ్రేక్’గా పరిగణిస్తామంటూ హెచ్చరించారు.
గుర్ఖా ఉద్యమ నేపథ్యంలో సిక్కిం విలవిలలాడిపోతోంది. ఆర్థికంగా సిక్కిం చిన్నభిన్నమైపోతోంది. గుర్ఖా ఉద్యమం దెబ్బకు జీవితాలు అతలాకుతలమైపోతున్నాయంటూ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు గుర్ఖాలు... మరోవైపు చైనా దూకుడుతో సిక్కిం ప్రజల జీవితాల్లో చీకటి అలుముకుంటోంది. గుర్ఖా ఆందోళనలతో తమ రాష్ట్రం పరిస్థితి అంతకంతకూ దయనీయంగా మారుతోందని సిక్కిం భావిస్తోంది. ఆర్థికంగా తమ ప్రజల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయ్. సిక్కిం ప్రజల ఆదాయ వనురు పర్యాటకం. గుర్ఖా ఆందోళనల నడుమ పర్యాటకం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సిక్కిం పర్యటించే ప్రజలు కూడా... ముందుకు రాకపోవడంతో... హోటళ్లన్నీ బంద్ అయిపోయాయ్. ఉపాధి లేక, ప్రజలు విలవిలలాడుతున్నారు. పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే సిక్కిం పెను సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయంగా కన్పిస్తోంది. నెల రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ విచారం వ్యక్తం చేశారు. తమ ప్రజల పరిస్థితి దుర్భరంగా మారుతోందని... తింటానికి తిండి కూడా కరువయ్యే పరిస్థితి దాపురించిందని ఆయన వాపోయారు. సమస్యకు కారణమైన గుర్ఖాల వ్యవహారాన్ని కేంద్రం తేల్చాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. కేంద్రం గుర్ఖా అల్లర్లపై తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి సిక్కింతో ఉన్న ఏకైక రోడ్డు మార్గమైన జాతీయ రహదారి 10 బెంగాల్‌లోని కల్లోల ప్రాంతంలో ఉంది. ఎన్‌హెచ్ 10 గత 30 ఏళ్లుగా సిక్కిం రాష్ట్ర వీక్ పాయింట్‌గా మారిందని చామ్లింగ్ విచారం వ్యక్తం చేశారు. గుర్ఖా ఉద్యమం చెలరేగిన ప్రతిసారీ తమ రాష్ట్రం భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని ఈ నేపథ్యంలో కేంద్ర ఇప్పటికైనా ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని తన లేఖ ద్వారా తేల్చిచెప్పారు. కేంద్రం సత్వరమే ఈ విషయమై జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించని పక్షంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగించడానికి తాము ఉన్నతస్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధమని సిక్కిం సీఎం చామ్లింగ్ పేర్కొన్నారు. గత ముప్ఫై ఏళ్లుగా గుర్ఖాలాండ్ ఉద్యమం వల్ల సిక్కిం రూ. 60 వేల కోట్లు నష్టపోయిందని... కేంద్రం జోక్యం చేసుకోకపోతే... న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప చేసేదేమీ లేదని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
సిక్కిం రాష్ట్రం భౌగోళికంగా చైనా, భూటాన్, నేపాల్ రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండటంతో ఓవైపు విదేశాల నుంచి దాడుల ముప్పు ఉండగా.. మరోవైపు పొరుగురాష్ట్రం బెంగాల్‌లో జరుగుతున్న ఆందోళన కారణంగా సిక్కిం సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, వస్తు సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని... రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయని... సామాన్యుడి బతకలేన పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. కేవలం చైనా, బెంగాల్‌ల మధ్య నలిగిపోవడానికి సిక్కిం రాష్ట్రం భారత భూభాగంలో ఐక్యం కాలేదని ప్రకటనలో పేర్కొన్నారు.
గుర్ఖా సంక్షోభం దేశానికి ఓ సరికొత్త సవాల్ విసిరుతోంది. ఒక రాష్ట్రం సమస్య మరో రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలోకి నెడుతోంది. ఓవైపు డ్రాగన్ బుసలు కొడుతుంటే... మరోవైపు గుర్ఖాల అలజడితో తమ జీవితాలు చిన్నాభిన్నమైపోతున్నాయంటూ సిక్కిం కన్నీరు పెట్టుకుంటోంది. మూడు దశాబ్దాల ఉద్యమంలో 60 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని... కేంద్రం మొత్తం వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని కోరుతోంది. మరోవైపు బెంగాల్ సీఎం మమత మాత్రం గుర్ఖాల ఉద్యమం త్వరలోనే సమసిపోతుందని... ఆందోళనకారుల కుట్రతో అలజడి రేపుతున్నారని తేల్చిచెబుతున్నారు. ఢిల్లీ నుంచి కూడా గుర్ఖా ఆందోళనపై ఎలాంటి ప్రకటనలు రాకపోవడం కూడా ఉద్యమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయ్. ఇప్పటికే చైనాతో అలజడి రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గుర్ఖా ఆందోళనలను చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోంది. అయితే తక్షణం గుర్ఖా ఉద్యమాన్ని కట్టిడిచేసేలా..గుర్ఖాల్లో విస్వాసం పాదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదలాలి.

No comments:
Post a Comment