Friday, 14 July 2017

బ్యూరోక్రసీ వర్సెస్ డొమొక్రసీ

అధికారం తలకెక్కితే శంకర్ నాయక్ లు శంకర్ దాదాలవుతారు... పొగురు ఇంటిపేరైతే... వారు బెజవాడ రౌడీలవుతారు... రూల్స్ మాట్లాడితే బదిలీ వేటుతో శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. రాజకీయం మత్తులో నేతలు విపరీత చర్యలకు తెగబడుతున్నారు.  మరోవైపు నేతలు అధికారం తలకెక్కి వ్యవస్థలపై దాడులకు తెగబడుతుంటే... మేమేం తక్కువంటూ బ్యూరోక్రాట్లు శివాలెత్తిపోతున్నారు.
బ్యూరోక్రాట్ల అధికార దాహం సామాన్యుడ్ని తొక్కేస్తోంది. అది మహబూబాబాద్ ఘటన కావొచ్చు... బెజవాడలో అధికార పార్టీల కండకావరం కావొచ్చు... ఎక్కడ చూసినా ఇదే తంతు. ఇటీవల అధికార పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూపీ పోలీస్ అధికారిపై బదిలీ వేటుపడుతుంది.  చట్టాలను చేసేవారు వాటిని చుట్టాలుగా మార్చుకుంటున్నారు. వాటిని అమలు చేయాల్సిన వారు... వారికి అనుకూలంగా మలచుకుంటున్నారు. ఇద్దరూ ప్రజా సేవకులే... సేవ పేరుతో జనంతో గేమ్స్ ఆడుకుంటున్నారు. పవర్ కోసం పంచాయితీలకు దిగుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తంతు.
అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్... జిల్లా కలెక్టర్ ను చేయి బట్టుకొని లాక్కెళ్లాలని చూసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఎమ్మెల్యే తీరుతో కలెక్టర్ ఒక్కసారిగా షాక్ కు గర్యాయరు.  ఎమ్మెల్యే వ్యవహారతీరు తెలిసినవారు పెద్దగా ఈ విషయంపై షాక్ కు గురవకపోయినా... రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎమ్మెల్యే తీరుపై తీవ్ర చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే అధికారం తలకెక్కిన ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... సాగిస్తున్న ఆరాచకానికి మహబూబాబాద్ వేదికయ్యింది. ఆయన మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అధికార పార్టీ నేత. తొలిసారి ఎమ్మెల్యే... అయితే అధికారం చేతిలో ఉందకదా... ఏం చేసినా... ఎవరేం చేస్తారన్న ధీమాతో... ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... దుందుడుకు వైఖరితో దూసుకుపోతున్నాడు...  ఒకసారి కాదు... రెండు సార్లు కాదు... ఇప్పటికే లెక్కలేననన్ని సార్లు తన ప్రవర్తనతో కలెక్టర్ ను ఇతర అధికారులను వేధించాడు. గట్టిగా మాట్లాడితే... తనకు కలెక్టర్ చెల్లెలితో సమానమంటాడు. ఇద్దరిదీ ఒకే క్యాస్టు అంటాడు.  నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడు. విపరీత చేష్టలతో కింది స్థాయి అధికారుల జీవితాలతో ఆటలాడుకుంటాడు.  తాజాగా...  సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పైనే రుబాబు ప్రదర్శించి... తన బుద్ధిని బయటపెట్టుకున్నాడు. కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రీతి మీనాను అనేక రకాలుగా పలుసార్లు అవమానించాడు శంకర్ నాయక్. ఎన్నో ఆరోపణలతో ఇప్పటికే నియోజకవర్గంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్...భూ సెటిల్మెంట్లు, దందాలతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాడన్న అభిప్రాయం జిల్లాలో నెలకొంది. తాజాగా...  మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతి మీనాను తీవ్రం అవమానించాడు. కలెక్టర్ చేయి పట్టుకొని అనాగరికంగా వ్యవహరించి... అవమానానికి గురిచేశాడు. ఇప్పటికే ఎమ్మెల్యే ప్రవర్తనతో విసుగు చెందిన కలెక్టర్‌...  ఎమ్మెల్యే ప్రవర్తనపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనను చేయితో తాకాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో చోటుచేసుకున్న ఘటన ప్రభుత్వ వర్గాల్లో పెను ప్రకంనపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే తీరుపై చాన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్న కలెక్టర్ ప్రీతి... హరితహారంలో ఘటన తర్వాత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై ఇప్పటికే పలు ఫిర్యాదు నేపథ్యంలో... ఐఏఎస్‌ అధికారుల సంఘం సీరియస్ గా తీసుకొంది. అధికారుల సంఘం కీలక నేతలు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి... ఎమ్మెల్యే వ్యవహారశైలిపై పూర్తి సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే చరిత్ర మొత్తాన్ని తూర్పారబట్టారు. తక్షణం చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య ఆధ్వర్యంలో ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అత్యవసరంగా సమావేశమై ఈ ఘటనను ఖండించింది. కలెక్టర్‌కే ఇలా జరిగిందంటే సాధారణ ఉద్యోగుల పరిస్థితేమిటని సచివాలయంలో పలువురు అధికారులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం మూడోవిడత కార్యక్రమాన్ని మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం ఆవరణలో బుధవారం మంత్రి చందూలాల్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తున్న సమయంలో ఈ లొల్లి జరిగింది. మొక్కలు నాటడం పూర్తయ్యాక స్టేజీ వద్దకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ కలెక్టర్‌ ప్రీతి మీనా చేయి పట్టుకొని ముందుకు పదండంటూ లాక్కెల్లినంత పనిచేశారు. ఎమ్మెల్యే బహిరంగంగా అందరి ముందు చేయి పట్టుకోవడంతో... కలెక్టర్ హతాశయురాలయ్యారు.  ఎమ్మెల్యే తీరుపై మీనా మండిపడ్డారు. ‘ఐ యామ్‌ కలెక్టర్‌.. బీ ఇన్‌ యువర్‌ లిమిట్‌’అంటూ శంకర్ ను హెచ్చరించారు. అయితే సభా వేదిక వద్ద సైలంట్ గా ఉన్న కలెక్టర్... సమావేశం పూర్తయినవెంటనే... జేసీ దామోదర్‌రెడ్డి, డీపీఆర్‌ఓ ఆయూబ్‌ అలీని పిలిచి ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును వివరించి... ఎమ్మెల్యేను ఉపేక్షించరాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుకు సంబంధించి... పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. మీడియాలో తీసిన ఫొటోలు, వీడియో క్లిప్పింగుల కోసం ఆరా తీశారు. ఎమ్మెల్యే తన చేయిపట్టుకున్న ఫొటోలను సంపాదించి.. ఐఏఎస్‌ల సంఘానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీని కూడా పిలిచి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మహబూబాబాద్ లో ఎమ్మెల్యే వ్యవహారశైలిపై అధికారలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా అధికారులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  అదే సమయంలో...  ఎమ్మెల్యే ప్రవర్తన గురించిన వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ను కలిసి క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులతో ఎమ్మెల్యే అమర్యాదగా మాట్లాడతారని...   ఫిర్యాదులు సీఎం చెవిన పడ్డాయ్.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి చందూలాల్‌, ఎంపీ సీతారాంనాయక్‌ రంగంలోకి దిగి కలెక్టరుతో చర్చించారు. గంటన్నరపాటు సంప్రదింపులు జరిపి... కలెక్టర్ ను శాంతింపజేశారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగబోవని... తమది పూచీ అని చెప్పినట్టు సమాచారం.  మంత్రి, ఎంపీ చర్చలు జరుపుతున్నంత సేపు... ఎమ్మెల్యే... శంకర్‌నాయక్‌ కలెక్టరు ఇంటి బయటే ఉన్నారు. లోపలి నుంచి కబురు రావడంతో ఇంట్లోకి వెళ్లిన ఆయన ఆమెకు క్షమాపణ చెప్పి పది నిమిషాల్లో తిరిగి బయటకొచ్చారు. ఆమె తనకు సోదరితో సమానమని, అనుకోకుండా చేయి తగిలి ఉండొచ్చంటూ విలేకరుల వద్ద వివరణ ఇచ్చారు. కలెక్టరు ఫిర్యాదు మేరకు శాసనసభ్యుడు శంకర్‌నాయక్‌పై పోలీసులు మహబూబాబాద్‌ ఠాణాలో కేసు నమోదు చేశారు.  అరెస్టు చేసినంత వరకు బాగానే ఉన్నా... ఎమ్మెల్యే బెయిల్ పై బయటకు రావడం... ఆమె చెల్లిలితో సమానమంటూ చెప్పడం... పైపెచ్చు... ఇద్దరం కూడా ఎస్టీలే అంటూ చెప్పడం ద్వారా మొత్తం వ్యవహారాన్ని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్కటి మాత్రం స్పష్టం ఎమ్మెల్యే తీరు, కలెక్టర్ విషయంలో అలా ఉంటే... మిగతా వారి విషయంలో ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. సీఎం కేసీఆర్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి ఎమ్మెల్యేతో క్షమాపణలు చెప్పించినా... ఇలాంటి వారికి సంఘ బహిష్కారం జరిగితే తప్పించే మార్పు రాదు.
ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రేదశ్ లోనూ అధికార టీడీపీ నేతలు దాడి చేశారు. రవాణా శాఖ కమిషనర్ గా బాధ్యతలు వ్యవహరిస్తున్న ఐజీ బాలసుబ్రమణ్యంను గల్లా పట్టుకున్నంత పనిచేశారు. వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తూ... మేమంటే లెక్కలేదా అంటూ అవమానానికి గురిచేశారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, మరో ఎమ్మెల్సీ కలసి రవాణా శాఖ కార్యాలయంపై దాడికి తెగబడిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమయ్యింది. ఏపీలో అధికార పార్టీ నేతలు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంపై దండయాత్ర చేశారు. ముగ్గురు త్రిమూర్తుల మాదిరిగా కమిషనర్ ను నానాదుర్భాషలాడి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గలీజు పని చేస్తా కూడా... తమ మాట కమిషనర్ వినడం లేదంటూ విమర్శలు గుప్పించారు.  గడ్డి తింటున్నావ్...  గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావంటూ ఎంపీ కేశినేని నాని కమిషనర్ పై విరుచుకుపడితే... ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా ...? ఏం బతుకు నీది అంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను దుర్భాషలాడాడు. మేం ప్రజాప్రతినిధులం... మాకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ... ముగ్గురు ప్రజాప్రతినిధులు చెలరేగిపోయారు.
మార్చి 25న జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్‌ హౌసింగ్‌బోర్డు చైర్మన్‌ నాగుల్‌ మీరా, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ , సుమారు  200 మంది కార్యకర్తలతో  కమిషనర్‌ను విజయవాడ నడిరోడ్డుపై అరాజకీయం చేశారు.  సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం ను రెండుగంటలకుపైగా...  నిలబెట్టి మరీ నానా బూతులు తిట్టారు. కమిషనరే క్షమాపణ చెప్పాలంటూ  ఘెరావ్‌ చేసినంత పనిచేశారు. అక్కడే ఉన్న పోలీస్, రవాణా శాఖ అధికారులు ఎంతగా చెప్పినా... వినకుండా నోటికి ఇష్టమొచ్చిన భాషతో దారుణంగా అవమానించారు. ట్రావెల్స్ వ్యవహారాల్లో రవాణా కమిషనర్ తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ ఎంపీ కేశినేని నాని చాన్నాళ్లుగా విమర్శిస్తూ వచ్చారు. అయితే ఎంపీ బెదిరింపులకు లొంగని కమిషనర్ రూల్ ప్రకారం వ్యవహరించారు. అయితే తన ప్రత్యర్థి ట్రావెల్ విషయంలో జరిగిన ఘటనను తమకు అనూలంగా మలచుకోవాలన్న దురాలోచనతో... కమిషనర్ కార్యాలయంపై నాని అండ్ టీం దాడికి దిగారు. ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సుపై నివేదికను తాము చెప్పినట్లు రూపొందించాలని వారు కోరినట్టుగా సమాచారం. అయితే...  నివేదిక ఎలా తయారు చేయాలో అలా చేస్తాం.  ఒత్తిడి తేవడం సరికాదంటూ... కమిషనర్‌ తేల్చిచెప్పడంతో మొత్తం గొడవకు కారణమయ్యింది. ఇక రంగంలోకి నేరుగా కేశినేని నాని దిగారు. తనక్కొడే వస్తే ఏం బాగుంటుంది మొత్తం గ్యాంగ్ అంతటినీ తీసుకొస్తే ప్రభావం ఎక్కువ ఉంటుందన్న అభిప్రాయంతో... నగరంలోని నేతలందరినీ తీసుకొచ్చాడు. వాహనం దిగిన కమిషనర్‌ను టీడీపీ కార్యకర్తలు అంతా చుట్టు ముట్టి కదలనీయకుండా చేశారు. నేను వస్తు న్నానని తెలిసి వెళ్లి పోతున్నావా...ఏం టీడీపీ ఎంపీ అంటే ఆ మాత్రం గౌరవం, భయం లేవా...? అంతా నీ ఇష్టమేనా?’ అంటూ విరుచుకుపడ్డాడు. మొత్తం వ్యవహారంపై కమిషనర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంటుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.  సీఎం సీరియస్సయ్యారంటూ టీడీపీ నేతలు కామెంట్స్ తో మొత్తం ఘటనంతా వెనక్కి జరిగిపోయింది. అయితే ప్రభుత్వ పెద్దల హామీలతో ఆయన సైలెంటైపోయారు. ముఖ్యమంత్రి జోక్యంతో... నేతలు  కమిషనర్ కు క్షమాపణలు చెప్పడంతో ఇష్యూను క్లోజ్ చేసేశారు.  తన సుధీర్ఘకాలం కెరీర్ లో ఇలాంటి తరహా ఘటన ఎన్నడూ చూడలేదన్న అభిప్రాయాన్ని బాలసుబ్రమణ్యం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో  ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై హైకోర్టు స్పందించే పరిస్థితి వచ్చింది. రాజకీయనేతలు ఇష్టారాజ్యం వ్యవహరించడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయవాడలో జరిగిన యాగీని మరచిపోకముందే...  అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్టులో వీరంగం సృష్టించాడు. ఆలస్యంగా వచ్చిందే కాక... బోర్డింగ్ పాస్ ఇవ్వాలంటూ సిబ్బందిపై రుబాబు ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా ప్రింటర్ ను నెలకేసి కొట్టినంత పని చేశాడు. తాను ఎంపీనని... తనకు స్పెషల్ పవర్స్ ఉన్నాయంటూ శివాలెత్తాడు.  విశాఖ విమానాశ్రయం తన సొంత ఇళ్లున్నట్టుగా ఇష్టానుసారం వ్యవహరించాడు. బోర్డింగ్‌ పాస్‌ ఎందుకివ్వరంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిని దుర్భాషలాడాడు. తనకు పాస్ ఎందుకివ్వరంటూ... సిబ్బందిని గదిమాడు.  ప్రింటర్‌ను పక్కకు లాగి అవతల పడేయాలనుకున్నాడు...  విమానం బయలుదేరే సమయానికి 40 నిమిషాల ముందు మాత్రమే ఇస్తామని....  బోర్డింగ్‌ కౌంటర్‌ మూసేశామంటూ అధికారులు చెప్పేసరికి... రెచ్చిపోయి వీరంగం సృష్టించాడు. తాను ఎంపీనని బోర్డింగ్‌ పాస్‌ జారీ చేయాల్సిందేనంటూ  సిబ్బందిపై హూంకరించాడు. ఒకరకంగా ఆదేశించాడు. అయితే జేసీ ఆదేశాలను మాత్రం సిబ్బంది పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నడుచుకుంటామని... ఎంపీకో న్యాయం... మరొకరికో న్యాయం ఉండదని... ఎవరికైనా నిబంధనలు... నిబంధనలేనంటూ తేల్చి చెప్పారు. సిబ్బంది నిబంధనల గురించి మాట్లాడుతుంటే... జేసీ దివాకర్ రెడ్డి మాత్రం సహించలేకపోయాడు. ఏదైనా ఉంటే మేనేజర్ ను సంప్రదించాలంటూ ఉద్యోగి ఎంపీ దివాకర్ రెడ్డికి స్పష్టం చేశాడు. అయితే సిబ్బందితో ఎంపీ వాగ్వాదానికి దిగాడు. బెదింపులకు పాల్పడ్డాడు. తనపై నిషేదం విధించడం అక్రమమంటూ కోర్టును సైతం ఆశ్రయించాడు.
నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వహించిన ఓ మహిళా పోలీసు అధికారిణికి సరిగ్గా వారం రోజులు తిరక్కుండానే బదిలీ ఉత్తర్వులు చేతికి వచ్చాయి. అదీ కూడా స్వచ్ఛమైన, నీతివంతమైన, పారదర్శక పాలన అందిస్తానంటూ ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఏలుబడిలో. అధికార పార్టీ నేతలను కట్టడి చేసిన యూపీ పోలీస్ అధికారిపై బదిలీ వేటు పడింది. నిజాయితీ గల ఓ పోలీస్ అధికారి.... అధికారంలో ఉన్న పార్టీ నేతలతో ఢీ కొనడం....  నేతల అహం దెబ్బతింది.  నిజాయితీ గల అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు. యూపీ మహిళా పోలీసు అధికారి శ్రేష్ట ఠాగూర్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఉత్తర ప్రదేశ్ కు  బులంద్ షహర్ కు చెందిన మహిళా పోలీస్ అధికారికి స్ట్రిక్ట్ గా ఉంటారన్న అభిప్రాయం ఉంది. రూల్స్ బేఖాతరు చేస్తే ఎవరినైనా సహించరని... చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారన్న పేరు ఉంది. అయితే...   అధికారంలో ఉన్న పార్టీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకొన్న ఆమెపై బదిలీ వేటు పడింది. యోగి సర్కార్  శ్రేష్ట ఠాగూర్  బహ్ రైచ్ కు బదిలీ చేసి అధికార బలాన్ని చాటుకొంది.  యూపీలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ధీమాతో నిబంధనలను ఉల్లింఘించేందుకు ప్రయత్నించిన బీజేపీ నేత ప్రమోద్ కుమార్ కు...   ఠాగూర్ ఘాటుగా సమాధానం చెప్పడం సంచలనం కలిగించింది. బీజేపీ నేతల ఆగడాలపై  శ్రేష్ట ఠాకూర్ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఠాకూర్ పై ప్రశంసలు జల్లు కురిసింది.
సరైన పత్రాలు లేకుండా వాహనాన్ని నడుపుతున్న బీజేపీ నాయకుడు ప్రమోద్ ను  అడ్డుకుని ఠాగూర్ జరిమానా విధించారు. తాను బీజేపీ నేతనంటూ సదరు వ్యక్తి రుబాబు ప్రదర్శించడంతో... ఇరువురి మధ్య తీవ్ర  వాగ్వాదం చోటుచేసుకొంది. పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని...  సీఎంతో  లెటర్ రాయించుకుని వస్తే తనిఖీలు చేయనని  శ్రేష్ట ఠాకూర్... బీజేపీ నేతకు  తెగేసి చెప్పడంతో మొత్తం వ్యవహారం చినికిచినికి గాలివానలో మారింది.  రాత్రింబవళ్లు కుటుంబాలను వదిలి ఉద్యోగాలు చేస్తూ ఎందుకు ఇబ్బందిపెడతారంటూ ఆమె రాజకీయ నేతలపై మండిపడ్డారు. స్పాట్
మొత్తం ఘటనతో కంగుతిన్న స్థానిక బీజేపీ నేతలు... వ్యవహారాన్ని పార్టీ అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లారు. 11 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీ నేరుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకొళ్లి... పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోకుంటే... తాము జిల్లాలో చులకనైపోతామని వాపోయారు. ఇక స్థానిక నేతల డిమాండ్ కు తలొగ్గిన ప్రభుత్వం... పోలీస్ అధికారికి బదిలీ వేటుతో బహుమానమిచ్చింది. అధికార పార్టీ నేతలతో పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి కూడా...  బాధ్యతలను నిజాయితీగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్ మహిళా పోలీసు అధికారి శ్రేష్ట ఠాగూర్‌పై బదిలీ వేటు పడింది.
బీజేపీ నేత ప్రమోద్ కుమార్‌కు శ్రేష్ట ఠాగూర్ ఇటీవల ముచ్చెమటలు పట్టించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాన్ని నడుపుతున్న ఆయనను అడ్డుకుని జరిమానా విధించారు. అయితే తాను బీజేపీ నేతనని, తన భార్య బులంద్‌షహర్ జిల్లా పంచాయితీ సభ్యురాలని ప్రమోద్ దబాయించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రమోద్ ఫోన్ చేయడంతో అక్కడకు చేరుకున్న బీజేపీ క్యాడర్ శ్రేష్ట ఠూగూర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులకు తనిఖీలు చేసే అధికారం లేదని లెటర్ రాయించుకుని వస్తే తనిఖీలు వదిలేస్తామని శ్రేష్ట ఠాకూర్ తెగేసి చెప్పడంతో మొత్తం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు యూపీలో యోగి సర్కారు అధికారంలోకి వచ్చాక యాదవ్ కులానికి చెందిన అధికారులను టార్గెట్ గా చేసుకుంటున్నారంటూ... ట్వీట్ చేసిన అధికారి హిమాన్షు కుమార్ పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.  ప్రత్యేకించి కొన్ని కులాల వారినే శిక్షించాలని అధికారులపై డీజీపీ కార్యాలయం ఎందుకు ఒత్తిడి చేస్తున్నదని హిమాన్షు ప్రశ్నించారు. ఆయన ట్వీట్ దెబ్బతో...  డీజీపీ కార్యాలయంలో పని చేస్తున్న ఆయనను  క్రమశిక్షణా చర్యల కింద సస్పెండ్‌ చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
అదే తెలంగాణా, అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఉత్తర ప్రదేశ్ అయినా... అధికార పార్టీ నేతలదే మాట కావాలన్నదే ఉద్దేశం, లక్ష్యం కన్పిస్తోంది. తమ మాట ఇంటే ఒకలా... మాట వినకుంటే మరోలా ప్రభుత్వం అధికారులపై జులం ప్రదర్శిస్తోంది. అయితే కొన్నిసార్లు అధికారులు సరిపెట్టుకుంటూ పోతే కొన్నిసార్లు రివర్స్ అవుతున్నారు. కొన్నిసార్లు ప్రభుత్వాలు అవసరార్థం చర్యలు తీసుకుంటున్నట్టు కన్పిస్తున్నా... చాలా సార్లు రాజకీయానిదే పైచేయిగా నిలుస్తోంది.

ప్రభుత్వానికి అధికార యంత్రాంగం కళ్లు, చెవులు. ఆయా వ్యవస్థల్లోని  లోపాలను సరిదిద్దేందుకు యంత్రాంగాలు... ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాయ్. ప్రజలకు మేలు చేసేందుకు యంత్రాంగాలు...  కొన్ని సార్లు ప్రభుత్వ పెద్దల మాటలను సైతం వినీ విననట్టుగా... చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుంటాయ్. అయితే...  రాష్ట్రంలోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ల వ్యవహారశైలి... ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. కీలక విషయాల్లో ముగ్గురు ఐపీఎస్ లు వ్యవహరించిన తీరు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేస్తోంది.  ఇప్పటి వరకు అధికారులను వేధించిన రాజకీయ నేతలు స్టోరీలు వింటే... బ్యూరోక్రసీతో రాజకీయనేతలను తలదన్నేలా వ్యవహరిస్తున్న ముగ్గురు ఐపీఎస్ ల స్టోరీ ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కెరీర్ లో ఎంతో పేరు గడించారు. ఐపీఎస్ పదవికే వన్నెతెచ్చారు. నిక్కచ్చిగా వ్యవహరిస్తూ... భేషజాలకు పోకుండా పాలనలో భాగంగా ఉన్నారన్న అభిప్రాయం వారిపై ప్రజల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ, అధికార పార్టీ వర్గాల్లోనూ విన్పిస్తోంది. అయితే ఇప్పుడా ముగ్గురి పేర్లు చెబితే చాలు... అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు హడిలిపోతారు. అంటే వారిని చూసి భయపడిపోతున్నారని కాదు... వారు తీసుకునే నిర్ణయాలతో ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరోస్తుందనన్న బెంగ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఆ ముగ్గురుని చూస్తుంటే టీఆర్ఎస్ నేతలకు ఎక్కడ లేని చిరాకు కలుగుతుంది.  ఆ ముగ్గురు ఐపీఎస్ ల వ్యవహాశైలితో ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు కూడా ప్రజల్లోకి చెడుగా వెళ్తున్నాయన్న వర్రీ ప్రభుత్వ వర్గాల్లో  కన్పిస్తోంది. ముగ్గురు ఐపీఎస్ ల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేసేందుకు మంత్రులు కాచుక్కొని కూర్చున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో  పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వారిలో కొందరికి కీలక శాఖలను అప్పగించారు. పోలీసింగ్ లో మంచి పేరుతెచ్చుకున్న ఐపీఎస్ లు పాలనలో  అంతకంటే ఎక్కువగా ఇమేజ్ తెచ్చుకుంటారని సీఎం భావించారు. కానీ వారు ప్రభుత్వ ఇమేజ్ ను మంట గలుపుతున్నారనే అభిప్రాయాలు అధికార పార్టీలో విన్నిస్తున్నాయి. హైదరాబాద్ డ్రగ్ మాఫియా విషయంలో అకున్ సబర్వాల్ తీరుని స్వయంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బాహాటంగా తప్పుబట్టారు. విచారణ పేరుతో ప్రభుత్వానికి సబర్వాల్ చెడ్డపేరు తెస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసారు.  సొంత ఇమేజీని పెంచుకునేందుకు సబర్వాల్ విద్యాశాఖపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. డీజీపీ సైతం సబర్వాల్ విషయంలో కడియం అభిప్రాయాలను సమర్ధించినట్టు సమాచరం.
కొన్ని నెలల క్రితం సివిల్ సప్లై శాఖ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న సీవీ అనంద్ విషయంలో ఆ శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు మరికొందరు మంత్రులు ఆగ్రహంగా ఉన్నారు. ఆనంద్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో మంత్రి ఈటెలతో కలిసి పనిచేశారు. అయితే కొద్ది రోజుల తర్వాత... మంత్రిని కాదని... తనే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారట.  లెటెస్ట్ గా ...  సీవీ ఆనంద్...  ప్రగతి భవన్ కు మాత్రమే సమాచారం ఇవ్వడానికి పరిమితమయ్యారన్న  ప్రచారం ఉంది. కీలక నిర్ణయాల విషయంలోనూ... సీవీ ఆనంద్ కనీసం మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాలు వ్యక్తమవుతోంది. ఆకస్మిక తనిఖీల పేరుతో ఆనంద్ జిల్లాల పర్యటనలతో హల్ చల్ చేయడంపై కొందరు మంత్రులు ఆగ్రహంగా ఉన్నారు. తమ సొంత జిల్లాలో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా రాజకీయ నేత మాదిరి పర్యటించడం ఏంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక మరో ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్.. కొన్ని రోజుల క్రితం వరకు ఆ పేరును ముఖ్యమంత్రి చాలా సందంర్భాల్లో  స్వయంగా పొగిడేవారు. కానీ ఇప్పుడా పేరునే తన వద్ద ప్రస్తావించవద్దంటూ సీఎం అధికారులకు సూచించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూల్ కు జాతీయ గుర్తింపు తెచ్చారని ఐపీఎస్ ప్రవీణ్ కు...   సీఎం వద్ద ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ గురుకులాల టీచర్ల నియామకం విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం వివాదస్పదం కావడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది. దీంతో సీఎం  స్వయంగా రంగంలోకి దిగి వివాదానికి తెర దించారు. గురుకులాల టీచర్ల నియామకంలో అర్హతలు ఎలా ఉండాలో నిర్ణయించే బాధ్యత కమిషనర్ హోదాలో ఉన్న ప్రవీణ్ కు సిఎం అప్పగించారు. కానీ ప్రవీణ్ మాత్రం టీచర్ పోస్టుల కోసం పరీక్ష రాసే అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలనే నిబంధన పెట్టడంతో... ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది.  తీవ్ర విమర్శలు రావడంతో చివరికి సిఎం జోక్యం చేసుకుని అర్హతలను తగ్గించారు.  పాలనలో ఐఏఎస్ ల మాదిరిగా... ఐపీఎస్ లు వ్యవహరించడం జరగదన్న అభిప్రాయాన్ని  సీనియర్ ఐఏఎస్  అధికారులు వ్యక్తం చేస్తున్నారు.  పోలీసుల నిర్ణయాలు వక్రీకరించడం సహజమేనన్న  అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో ఎలా వ్యవహరించాలో వారికి పెద్దగా తెలియదని... కీలక శాఖాలను పోలీసు అధికారులకు అప్పగించడం వల్ల  ఆ శాఖాలపై వారు పోలీసింగ్ చేయడంతో  ఫలితాలు వికటించడం సహజమేనని కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా అటు రాజకీయ నాయకులు..  ఐదేళ్లపాటు ప్రజలు తమను పాలించే లైసెన్స్ ఇచ్చారని చెలరేగిపోతున్నారు. తమకు ఇష్టం వస్తే ఒకలా... ఇష్టం లేకుంటే మరోలా వ్యవహరిస్తూ... ప్రభుత్వ యంత్రాంగాలను ప్రశ్నిస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులతో కలిసి మెలసి పాలన సాగిస్తుంటే మరికొందరు వివాదాలకు  కేంద్ర బిందువులవుతున్నారు. పాలనకు వన్నె తేవాల్సిన నేతలు... ఆ ముసుగులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే... కొందరు నేతలు... ప్రజలతో ఎన్నుకున్న నాయకుల విషయంలో చులకనభావనతో ఉంటున్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలైన రెండు వర్గాల ఘర్షణ ప్రమాదంలో పడుతోంది. 

గుర్ఖాలాండ్ ఆందోళనలు

గుర్ఖా ఫైట్

ఓవైపు చైనా అలజడి. మరోవైపు గుర్ఖాల ఫైటింగ్... సిక్కిం ప్రజల బతుకు పోరు ఇప్పుడు బెంగాల్ సరిహద్దుల్లో విపరీత పరిస్థితులకు కారణమవుతున్నాయ్. బెంగాల్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ గుర్ఖాలాండ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయ్. తమను బెంగాల్ ప్రభుత్వం రెండో స్థాయి పౌరులుగా అవమానిస్తుందంటూ గుర్ఖా మెజార్టీ ప్రాంతాల్లో అలజడి రాజ్యమేలుతుంటే... మా బతుకులు సంగతేంటంటూ... సిక్కిం ప్రజలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. గుర్ఖా అల్లర్లతో నష్టపోయిన 60 వేల కోట్ల రూపాయల కోసం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామంటూ ఆ రాష్ట్రం చేస్తున్న హెచ్చరికలు ఈశాన్య భారతంలో కల్లోలానికి కారణవుతోంది.  దీదీ సర్కారు తీసుకున్న బెంగాల్ భాష తప్పనిసరి నిబంధనే గుర్ఖా ఉద్యమానికి ఊపిరిలూదితే... తమ జీవితాల్లో గుర్ఖా ఉద్యమం విధ్వంసం సృష్టిస్తోందని సిక్కిం ప్రజలు వాపోతున్నారు. వందేళ్ల చరిత్రగల గుర్ఖా సమస్యకు కేంద్రం చర్యలు తీసుకోవాలని నాయకులు బిమల్ గురాంగ్ గాండ్రిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పున్నట్టుగా గుర్ఖాలు సాగిస్తున్న ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధనకు కీలక మలుపు అవుతుందన్న అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో నెలకొంది.

వందేళ్ల డిమాండ్. తాము బెంగాలీలకు వేరని... తమను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని గుర్ఖాలు వరుస ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఉంటేనే తమ జీవితాల్లో వెలుగులు పూస్తాయని గుర్ఖాలు ఆందోళన బాట పడుతూనే ఉన్నారు. గుర్ఖాలాండ్ గురించి ఓ సారి తెలుసుకుందాం. డార్జిలింగ్‌ పర్వత ప్రాంతంతో పాటు సిలిగురి, జల్‌పాయ్‌గురిలోని కొన్ని ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ నూటపదేళ్లుగా ఉంది. తాము భారతదేశంలో నివసిస్తున్నప్పటికీ... తమకంటూ ప్రత్యేక రాష్ట్రం లేనందువల్ల ఇప్పటికీ తమను నేపాలీలంటూ పిలుస్తున్నారని... గుర్ఖా తెగ ప్రజలు ఆందోళనబాట పట్టారు. భాష, సాంస్కృతికపరమైన వైవిధ్యాల కారణంగా తమకూ ఒక రాష్ట్రం ఉండాలని వీరు బలంగా కోరుకుంటున్నారు.  డార్జిలింగ్ హిల్స్ లో ఉన్న గుర్ఖా తెగ ప్రజలు స్వయంప్రతిపత్తితో రాష్ట్రాన్ని దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. భాషా, సంస్కృతి ఆధారంగా తాము బెంగాలీలకు వేరన్న భావనను అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలను అక్కడి ప్రజలు చేపట్టారు. భారత్ లో ఉన్న నేపాలీ భాష మాట్లాడే ప్రజలు ఉండే భాగాలనే గుర్ఖాలాండ్ గా పిలుస్తారు. 1986-88 మధ్య గుర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలోనూ, 2007 నుంచి గుర్ఖా జన్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాలు నిరంతరం సాగుతూనే ఉన్నాయ్.
వందేళ్ల క్రితం నుంచే డార్జిలింగ్ , సిలిగురి, దోర్స్ ప్రాంతాల్లో నివశించే ప్రజలందరూ తమను ప్రత్యేకంగా చూడాలని...  ప్రత్యేక పాలన వ్యవస్థ తమకు కావాలని... అందుకు ప్రభుత్వాలు సహకరించాలని కోరుతూ వచ్చారు. పాలనా సంస్కరణల నిమిత్తం 1907లో భారత్‌లో పర్యటించిన మోర్లీ– మింటో ప్యానల్‌కు ప్రత్యేక గూర్ఖాలాండ్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ను విన్పించారు. 1952లో నాటి భారత ప్రధాని నెహ్రూకు ఆలిండియా గూర్ఖా లీగ్‌ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ వినతిపత్రం ఇచ్చింది. తొలి ఎస్సార్సీ ఏర్పాటు సమయంలో గుర్ఖాలాండ్ రాష్ట్రం ఆవిశ్యకత గురించి ప్రస్తావించినా... చిన్న రాష్ట్రాలను ఇందిరాగాంధీ వ్యతిరేకించడంతో...  ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ల ఆందోళనలు తగ్గాయ్.  రాజీవ్‌గాంధీ హయాంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ హింసాత్మక మార్గంలోకి మళ్లింది. తొలుత ప్రత్యేక పాలన విభాగాన్ని కోరుకున్న గుర్ఖాలు... ఆ తర్వాత రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం దిశగా ఆందోళన మొదలుపెట్టారు.  తమకు రాజ్యాంగ పరమైన రక్షణలు కావాలంటూ ఆందోళన సాగించారు. ఆ తర్వాత 1980 నుంచి సుభాష్ గీసింగి ఉద్యమబాట పట్టాడు. మాజీ సైనికుడు, రచయిత కావడంతో... సుభాష్... గుర్ఖాల్లో మరోసారి ఉద్యమాన్ని రగిలించాడు. ఆయన నాయకత్వంలోనే తొలిసారిగా  గుర్ఖాలాండ్ అంటూ ఉద్యమం మొదలైంది. ఆయన ఆధ్వర్యంలోనే గుర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఏర్పడింది.  1986–88 మధ్య జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 1,200 మంది పౌరులు చనిపోయారు. 1988 ఆగష్టు 22న ఉద్యమకారులకు, కేంద్రానికి, బెంగాల్‌ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరి... ఈ ప్రాంత పరిపాలన కోసం డార్జిలింగ్‌ గూర్ఖా హిల్‌ కౌన్సిల్‌ (డీజీహెచ్‌ఎస్‌) ఏర్పాటైంది. షీఘింగ్‌ 2008 దాకా డీజీహెచ్‌ఎస్‌కు నేతృత్వం వహించారు. బిమల్‌ గురుంగ్‌ నేతృత్వంలోని జీజేఎం బలమైన శక్తిగా ఎదగడంతో ఘీషింగ్‌ డార్జిలింగ్‌ను వదిలి వెళ్లారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా జ్యోతిబసు ఉన్న సమయంలో డార్జిలింగ్ గుర్ఖా హిల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. స్వయంప్రతిపత్తిగల సంస్థగా డీజీహెచ్సీని రాష్ట్రం లోపల నిర్ణయాధికారాన్ని దాఖలుపరిచేలా చేశారు. అయినప్పటికీ 2007లో మరోసారి బిమల్ గురాంగ్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం రాజుకొంది. అప్పటి వరకు గుర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ లో పనిచేస్తున్న బిమల్ గురాంగ్  గుర్ఖా జన్ ముక్తి మోర్చా జీజేఎం ఏర్పాటు చేశాడు. రెండేళ్ల పాటు ఉధృతంగా ఆందోళనలు చేసిన దరిమిలా... స్వతంత్ర ప్రతిపత్తి గల గుర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) ఏర్పాటుకు జీజేఎం అంగీకరించింది. గురాంగ్ ప్రస్తుతం జీటీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తొలుత మమత సర్కారుతో సఖ్యతగా ఉన్న జీటీఏ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందేనంటూ నినదిస్తోంది. అయితే 2013 చివర్లో తెలంగాణ ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జీటీఏ చీఫ్‌గా గురుంగ్‌ రాజీనామా చేసి... మమతతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా కావాలనే డిమాండ్‌ తిరిగి ఎత్తుకున్నారు. తాము బెంగాల్ లో నివశిస్తున్నప్పటికీ... అక్కడి ప్రజలు... తమను రెండో రకం పౌరులుగా ట్రీట్ చేస్తున్నారని... వారు చెబుతున్నారు. గుర్ఖాలాండ్ గా చెబుతున్న  మొత్తం ప్రాంతంలో 14 లక్షల మంది జనాభా ఉన్నారు.  గుర్ఖాలాండ్ కు గుండెకాయ డార్జిలింగ్. డార్జిలింగ్ గుర్ఖాలకు జీవన స్రవంతి. డార్జిలింగ్‌ ప్రాంత చరిత్ర అంటే సిక్కిం, నేపాల్, భూటాన్, బెంగాల్, బ్రిటన్‌లతో సంబంధం కలిగి ఉంటుంది. అసలు డార్జిలింగ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే  వింతగా అనిపిస్తుంది. డోర్జి అంటే మెరుపులు. లింగ్‌ అంటే ప్రాంతం. అంటే మెరుపుల నేల. పేరుకు తగ్గట్టు ఇప్పుడే నిజంగానే అది ఉరుములు, మెరుపుల నేలగా అలరారుతోంది. ఇప్పుడు ఆ నేల మీదే ఉద్యమం ఉరుముతోంది.

గుర్ఖాల ఉద్యమానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయ్. ప్రస్తుత ఆకాంక్షలకు సిక్కిం మద్దతిస్తన్నప్పటికీ...  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంత వీజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజా ఉద్యమానికి రాజకీయ ఆధిపత్యమే కారణమా? బెంగాల్ ను తిరుగులేకుండా పాలిస్తున్న మమత... గుర్ఖాలపై ఎందుకు కాఠిన్యం చూపుతున్నారు? బెంగాలీలపై ఉన్న ప్రేమ గుర్ఖా ప్రజలపై మమతకు లేదా? రాజకీయ కారణలేమైనా ఉన్నాయా? మొత్తం వ్యవహారంలో కేంద్రం వ్యూహాలేమైనా ఉన్నాయా? నిజానికి డార్జిలింగ్‌ సిక్కిం ప్రాంతానికి చెందినది. నేపాల్‌కీ, సిక్కింకు మధ్య ఇది తటస్థ రాజ్యంగా కూడా ఉండేది. అయితే తరువాత ఇది నేపాల్‌ లో విలీనం కావడానికి అంగీకరించింది. తరువాత బ్రిటిష్‌ ఇండియాలోకి మారింది. ఆ వెంటనే... డార్జిలింగ్ సిక్కిం పాలనలోకి మారింది. 1835లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి కానుకగా సమర్పించడానికే ఈ మార్పు జరిగింది. కానీ సిక్కిం ఆ పని చేసినందుకు ఆనాడు నేపాల్, భూటాన్‌లు ఆగ్రహించాయి. ఇలాంటి భూభాగాన్ని విదేశీయులకు ధారాదత్తం చేయడం దారుణమని సిక్కింపై నిప్పులు చెరిగాయ్. 1851 నాటికే ఇక్కడి ఆదాయం యాభైవేల రూపాయలు. ఇది నేపాల్, భూటాన్‌ల మీద ఆధిపత్యం కొనసాగించడానికి అనువైన వ్యూహాత్మక ప్రదేశం. టిబెట్, సిక్కింల గుండా జరిగే వాణిజ్యానికి కూడా ఈ ప్రాంతమే కీలకం. వీటితో పాటు వేసవి విడిదిగా కూడా ఆంగ్లేయులు దీనిని విశేషంగా ఇష్టపడేవారు. ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌కు చెందిన డాక్టర్‌ ఆర్థర్‌ కాంప్‌బెల్‌ ఇక్కడ శానెటోరియాలు, ఆరోగ్య కేంద్రాలుగా వినియోగించుకునేవారు. డెబ్బయ్‌కి తక్కువ కాకుండా ఆంగ్లేయుల కుటుంబాలు ఇక్కడకు తరలివచ్చాయి. తరువాత ఇక్కడి తేయాకు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది కూడా. ఆ ఘనత కూడా కాంప్‌బెల్‌కే దక్కుతుంది. అతడు అంతకు ముందు చైనాలో పనిచేసేవాడు. అక్కడ నుంచి డార్జిలింగ్‌ కొండలలోకి వస్తూ కూడా తేయాకు విత్తనాలు తెచ్చారు. అదే అక్కడ అపారమైన సంపదగా రూపొందింది. వేల ఎకరాలకు విస్తరించింది. స్వతంత్ర భారతదేశంలో ప్రాంతాల విలీన చట్టం మేరకు 1954లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో విలీనం చేశారు. అప్పుడే ఒక జిల్లాగా దీనిని ఏర్పాటు చేశారు.
ఇందులో డార్జిలింగ్‌ పట్టణం, పరిసరాలు, కుర్సియాంగ్‌ కలింపాంగ్, సిలిగురిలోని తెరాయి భూభాగం ఆ జిల్లాలో చేర్చారు. 1950లో టిబెట్‌ మీద చైనా దాడి తరువాత, ఆ ప్రాంతానికి చెందిన వారిలో చాలామంది డార్జిలింగ్‌ జిల్లాకే తరలి వచ్చారు. ఆ తరువాతే ఈ ప్రాంత స్థానికులలో తాము నిర్లక్ష్యానికి గురయ్యామన్న భావన ఆరంభమైంది. అదే తరుచుగా ఆందోళనల రూపంలో బయటపడేది. ముఖ్యంగా మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమపై ఆధిపత్యం చలాయిస్తున్నారని అక్కడి కొండవాసులు భావించిన ప్రతిసారి ఇలాంటి ఆందోళనలు చోటు చేసుకునేవి. ఈ మొత్తం ఉదంతంలో కొన్ని ఇతర కీలక అంశాలు కూడా కనిపిస్తాయి. ఆందోళనకారులు ప్రతిపాదిస్తున్న గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్రంలో డార్జిలింగ్‌ జిల్లా, కలింపాంగ్‌ జిల్లా, సిలిగురి పరిధిలోని ప్రాంతాలు, తెరాయి, అలీపుర్దార్‌ పరిధిలోని దొవర్స్, జల్పాయిగురి జిల్లాలను కలపాలని కోరుతున్నారు. కానీ ఈ ప్రాంత జనాభాల నిష్పత్తులను పరిశీలిస్తే చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో గూర్ఖా జనాభా 35 శాతం మాత్రమే. ఇంకా ఆదివాసీలు 20 శాతం, బెంగాలీలు 15 శాతం, రాజ్‌బంగీసిస్‌ 25 శాతం, టోటాలు, మెచ్‌లు, ఇతరులు 5 శాతం ఉన్నారు. ఇంత వైరుధ్యంలో, జాతుల మేళవింపులో ప్రత్యేక గూర్ఖాలాండ్‌ ఏర్పాటును వీరంతా స్వాగతిస్తారన్న అభిప్రాయం కూడా లేదు. అలాగే షెర్పాలు, భుటియాలు, లెప్చాలు, ఇతర తెగల వారు కూడా గూర్ఖాలు చెబుతున్న స్వయం పాలనకు మొగ్గు చూపడం లేదు.
గూర్ఖాలాండ్‌ ఏర్పాటుకూ, డార్జిలింగ్‌ను సిక్కింలో విలీనం చేయాలన్న ప్రతి పాదనకూ సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్, సిక్కిం క్రాంతికార్‌ మోర్చా తమ మద్దతు తెలియచేయడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ రెండు ఆకాంక్షలు కూడా ఆ రెండు ప్రాంతాల చరిత్రతో ముడిపడి ఉన్నవే. ఎందుకంటే మొదట చెప్పుకున్నట్టు డార్జిలింగ్‌ ఒకప్పుడు సిక్కింలో అంతర్భాగమే. ఇవాళ డార్జిలింగ్‌ కొండలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ప్రత్యేక గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని కొండప్రాంత ప్రజలు నిర్ద్వంద్వంగా కోరుతున్నారు. కానీ ఏ ఒక్క జాతీయ పార్టీ ఇందుకు అనుకూలంగా లేదు.  ఆఖరికి బీజేపీ కూడా ఇదే బాటలో నడుస్తున్నది. 2009 నుంచి 2014 వరకు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ పార్టీ ఇచ్చిన ప్రతి ఎన్నికల ప్రణాళికలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. గూర్ఖాలాండ్‌ గురించి తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. ఇప్పుడు డార్జిలింగ్‌ జిల్లాలో ఉన్న బీజేపీ శాఖలన్నీ జాతీయ నాయకత్వంపైన కాలు దువ్వుతున్నాయి. దీనితో సమస్యకు పరిష్కారం మరింత క్లిష్టంగా మారింది.
నిజానికి ప్రస్తుతం డార్జిలింగ్‌ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితికి రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ఆరాటమే కారణం. ప్రతిపాదిత గూర్ఖాలాండ్‌ ప్రాంతంలో బిమల్‌ గురుంగ్‌ మాటకు తిరుగులేదు. అయితే మమత ఈ ప్రాంతంలో పట్టుకోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇతర ఆదివాసీలైన లెప్చాలు, తమంగ్స్, భూటియాలు, షెర్పాలు, మంగర్లను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించారు. కలింపాంగ్‌ను జిల్లాగా చేస్తున్నట్లు ప్రకటించారు. మేలో జరిగిన నాలుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో... మిరిక్‌ మున్సిపాలిటీని తృణమూల్‌ గెలుచుకుంది. పర్వతప్రాంతాల్లో తమకు పెట్టని కోటలుగా ఉన్నచోట్ల తృణమూల్‌ ఖాతాలు తెరవడం, మిరిక్‌కు కైవసం చేసుకోవడాన్ని... తన ఆధిపత్యానికి సవాల్‌గా గురుంగ్‌ భావించారు. బెంగాలీ తప్పనిసరి అనే మమత నిర్ణయాన్ని సాకుగా తీసుకొని ఆందోళనలకు పిలుపిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ సెంటిమెంటును తెరపైకి తెచ్చి ఉద్యమిస్తే ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం ద్వారా పట్టు నిలుపుకోవాలనేది గురుంగ్‌ ఆలోచన.
ఉత్తర బెంగాల్‌లోని ఆరు జిల్లాలు కూచ్‌ బెహార్, అలీపూర్‌దౌర్, జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్‌ 2014– 2016 మధ్యకాలంలో బీజేపీ బాగా బలపడింది. 42  అసెంబ్లీ స్థానాలున్న ఈ జిలాల్లో బీజేపీ ఎదుగుదలను దీదీ ముప్పుగా భావిస్తున్నారు. డార్జిలింగ్‌ చుట్టుపక్కల కొండప్రాంతాల్లోనే ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు మద్దతు ఉంటుందని, మైదాన ప్రాంతాల్లోని బెంగాలీ ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తారు కాబట్టి వీరి మద్దతు తృణమూల్‌కు లభిస్తుందని మమత లెక్క. బెంగాల్‌ విభజనకు మమత మొదటి నుంచి వ్యతిరేకమే. ఎన్డీయే భాగస్వామి అయిన జీజేఎం మద్దతుతోనే 2014లో బీజేపీ డార్జిలింగ్‌ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. బీజేపీ నేతలు గుర్ఖాలాండ్‌కు మద్దతు పలికారు. చిన్నరాష్ట్రాలకు బీజేపీ సూత్రప్రాయంగా అనుకూలమన్న వాదనను మరోసారి విన్పించారు.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని  బీజేపీ ప్రస్తావించింది. బీజేపీపై విభజనకు అనుకూలమనే అస్త్రాన్ని వదిలి...  కమలం పార్టీని దెబ్బతీయాలని దీదీ చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతమైతే బీజేపీ ఇరకాటంలో పడుతుంది. బెంగాల్‌ బీజేపీ నేతలు విభజనను బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు మిత్రపక్షం జేజీఎం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. గూర్ఖాలాండ్‌కు మొగ్గితే ఉత్తరప్రదేశ్‌లో, మహారాష్ట్రలో విదర్భ నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వస్తాయి కాబట్టి బీజేపీ ఏమీ తేల్చదు. పైగా బెంగాల్లో బలపడాలని కమలనాథులు చాలాకాలంగా పావులు కదుపుతున్నారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసే గూర్ఖాలాండ్‌ విభజనను ఇప్పట్లో పట్టించుకోరు. ఇలా రాజకీయ పార్టీలు ఎవరి లెక్కల్లో వారున్నారు. పాపం అమాయక ఆదివాసీలే సెంటిమెంట్‌తో రోడ్డెకుతున్నారు. కొండప్రాంత ప్రజలు ఈసారి తాడోపేడో తేల్చుకుంటే తప్ప పోరాటం విరమించరాదని భీష్మించుకు కూర్చున్నాయ్. స్వయం పాలన కోసం దశాబ్దాలుగా తాము చేస్తున్న డిమాండ్‌ను ఎలాగైనా సాధించుకోవాలని పోరాట సంస్థలు భావిస్తున్నాయి. అయితే జాతీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు ఈ అంశం నుంచి ఎంత రాజకీయ లబ్ధి పొందవచ్చునో చూస్తున్నాయి. సంఖ్యాబలం మీద ఆధారపడి ఉండే రాజకీయ పార్టీలు అందుకోసం స్థాని కుల ఆకాంక్షలను నీరు కార్చడం అనివార్యంగా కనిపిస్తున్నది.
  గుర్ఖా ఉద్యమం చల్లారినట్టే చల్లారి అంతకంతకూ ఎందుకు పెరుగుతోంది. దీదీ తీసుకున్న బెంగాలీ అమలు నిర్ణయమే తాజా అల్లర్లకు కారణమా? పశ్చిమ బెంగాల్ లో తిరుగులేని ఆధిపత్యంతో  పాలిస్తున్న దీదీకి తాజా ఉద్యమం సవాళ్లు విసిరుతోంది. అక్కున చేర్చుకున్న దీదీపై గుర్ఖాలు ఎందుకు ఉద్యమిస్తున్నారు. గుర్ఖాలాండ్ లో అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయ్?
వేసవిలోనూ చల్లగా ఉండే పర్వతప్రాంతం డార్జిలింగ్‌ ఉడుకుతోంది. ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్‌ కావాలనే డిమాండ్‌తో ఇక్కడి ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగారు. గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో నిరవధిక బంద్‌కు గుర్ఖా జనముక్తి మోర్చా ...  జీజేఎం పిలుపినివ్వడం... మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా...  ప్రభుత్వం ఆర్మీని పిలిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. తాజా ఆందోళనకు ప్రధాన కారణం...  ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు బెంగాలీని తప్పనిసరి చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే.  మొదటి లాంగ్వేజీగా...  ఎవరి మాతృభాషను వారు తీసుకున్నప్పటికీ సెకండ్, థర్డ్ లాంగ్వేజీల్లో బెంగాలీ తప్పనిసరంటూ మమత కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే నేపాలీ మాతృభాషగా ఉన్న గూర్ఖాలు.. బెంగాలీతో మాకేమవసరమంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ ఆధిపత్యంలోని డార్జిలింగ్‌లో హింసాత్మక ఆందోళనలకు దిగారు. ఈనెల 8న మమత సర్కారు డార్జిలింగ్‌లో కేబినెట్‌ సమావేశాన్ని సైతం వారు అడ్డుకోవాలని  ప్రయత్నించారు. మమత గోబ్యాక్‌ అంటూ పోలీసులపై దాడి చేసి...  వాహనాలను తగులబెట్టారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు...  లాఠీచార్జీ, భాష్పవాయువు ప్రయోగం చేశారు.  గుర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో జూన్ 15 నుంచి నుంచి నిరవధిక బంద్‌ను పాటిస్తున్నారు. గుర్ఖాపై నిర్ణయం వచ్చే వరకు బంద్ కొనసాగిస్తామని జీజేఎం నాయకుడు బిమల్‌ గురుంగ్‌ ప్రకటించారు.
ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అత్యవసర సర్వీసులు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఏవీ పనిచేయవని ఆందోళనకారులు స్పష్టం చేశారు. పర్యాటకంతో విలసిల్లిన డార్జిలింగ్ పూర్తి స్థాయిలో స్తభించిపోయింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.  జీజేఎం సమ్మెకు పిలుపిచ్చినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉన్నాయ్.
మమత బెదిరింపుల నేపథ్యంలో... తాజా ఆందోళనకు ప్రభుత్వ ఉద్యోగులు విధులకు  దూరంగా ఉండాలని కోరినట్టుగా జీజేఏం చెబుతోంది.  విధులకు హాజరుకాకపోవడాన్ని మాత్రం సహించబోమని బెంగాల్ సర్కారు స్పష్టం చేసింది. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని మమత గుర్ఖా నాయకులు తేల్చిచెప్పారు. ప్రభుత్వాన్ని అనవసరంగా ఇరుకునపెట్టేలా ఆందోళనలు దిగితే... ఊరుకునేది లేదని మమత తేల్చిచెప్పారు. విధులకు రాకపోతే ఉద్యోగుల రికార్డుల్లో ‘సర్వీసు బ్రేక్‌’గా పరిగణిస్తామంటూ హెచ్చరించారు.

గుర్ఖా ఉద్యమ నేపథ్యంలో సిక్కిం విలవిలలాడిపోతోంది. ఆర్థికంగా సిక్కిం చిన్నభిన్నమైపోతోంది. గుర్ఖా ఉద్యమం దెబ్బకు జీవితాలు అతలాకుతలమైపోతున్నాయంటూ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు గుర్ఖాలు... మరోవైపు చైనా దూకుడుతో సిక్కిం ప్రజల జీవితాల్లో చీకటి అలుముకుంటోంది. గుర్ఖా ఆందోళనలతో తమ రాష్ట్రం పరిస్థితి అంతకంతకూ దయనీయంగా మారుతోందని సిక్కిం భావిస్తోంది. ఆర్థికంగా తమ ప్రజల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయ్. సిక్కిం ప్రజల ఆదాయ వనురు పర్యాటకం. గుర్ఖా ఆందోళనల నడుమ పర్యాటకం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సిక్కిం పర్యటించే ప్రజలు కూడా... ముందుకు రాకపోవడంతో... హోటళ్లన్నీ బంద్ అయిపోయాయ్. ఉపాధి లేక, ప్రజలు విలవిలలాడుతున్నారు. పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే సిక్కిం పెను సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయంగా కన్పిస్తోంది.  నెల రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ విచారం వ్యక్తం చేశారు. తమ ప్రజల పరిస్థితి దుర్భరంగా మారుతోందని... తింటానికి తిండి కూడా కరువయ్యే పరిస్థితి దాపురించిందని ఆయన వాపోయారు. సమస్యకు కారణమైన గుర్ఖాల వ్యవహారాన్ని కేంద్రం తేల్చాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. కేంద్రం గుర్ఖా అల్లర్లపై తక్షణం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి సిక్కింతో ఉన్న ఏకైక రోడ్డు మార్గమైన జాతీయ రహదారి 10 బెంగాల్‌లోని కల్లోల ప్రాంతంలో ఉంది. ఎన్‌హెచ్‌ 10 గత 30 ఏళ్లుగా సిక్కిం రాష్ట్ర వీక్‌ పాయింట్‌గా మారిందని చామ్లింగ్ విచారం వ్యక్తం చేశారు. గుర్ఖా ఉద్యమం చెలరేగిన ప్రతిసారీ తమ రాష్ట్రం భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని ఈ నేపథ్యంలో కేంద్ర ఇప్పటికైనా ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని తన లేఖ ద్వారా తేల్చిచెప్పారు. కేంద్రం సత్వరమే ఈ విషయమై జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించని పక్షంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగించడానికి తాము ఉన్నతస్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధమని సిక్కిం సీఎం చామ్లింగ్ పేర్కొన్నారు. గత ముప్ఫై ఏళ్లుగా గుర్ఖాలాండ్‌ ఉద్యమం వల్ల సిక్కిం రూ. 60 వేల కోట్లు నష్టపోయిందని... కేంద్రం జోక్యం చేసుకోకపోతే... న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తప్ప చేసేదేమీ లేదని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
సిక్కిం రాష్ట్రం భౌగోళికంగా చైనా, భూటాన్, నేపాల్ రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉండటంతో ఓవైపు విదేశాల నుంచి దాడుల ముప్పు ఉండగా.. మరోవైపు పొరుగురాష్ట్రం బెంగాల్‌లో జరుగుతున్న ఆందోళన కారణంగా సిక్కిం సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, వస్తు సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని... రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయని... సామాన్యుడి బతకలేన పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. కేవలం చైనా, బెంగాల్‌ల మధ్య నలిగిపోవడానికి సిక్కిం రాష్ట్రం భారత భూభాగంలో ఐక్యం కాలేదని ప్రకటనలో పేర్కొన్నారు.
గుర్ఖా సంక్షోభం దేశానికి ఓ సరికొత్త సవాల్ విసిరుతోంది. ఒక రాష్ట్రం సమస్య మరో రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలోకి నెడుతోంది. ఓవైపు డ్రాగన్ బుసలు కొడుతుంటే... మరోవైపు గుర్ఖాల అలజడితో తమ జీవితాలు చిన్నాభిన్నమైపోతున్నాయంటూ సిక్కిం కన్నీరు పెట్టుకుంటోంది. మూడు దశాబ్దాల ఉద్యమంలో 60 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని... కేంద్రం మొత్తం వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని కోరుతోంది. మరోవైపు బెంగాల్ సీఎం మమత మాత్రం గుర్ఖాల ఉద్యమం త్వరలోనే సమసిపోతుందని... ఆందోళనకారుల కుట్రతో అలజడి రేపుతున్నారని తేల్చిచెబుతున్నారు. ఢిల్లీ నుంచి కూడా గుర్ఖా ఆందోళనపై ఎలాంటి ప్రకటనలు రాకపోవడం కూడా ఉద్యమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయ్. ఇప్పటికే చైనాతో అలజడి రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గుర్ఖా ఆందోళనలను చూసిచూడనట్టుగా వ్యవహరిస్తోంది. అయితే తక్షణం గుర్ఖా ఉద్యమాన్ని కట్టిడిచేసేలా..గుర్ఖాల్లో విస్వాసం పాదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కదలాలి.

చైనా భూదాహం

డ్రాగన్ భూదాహం

చైనాకు ఆకలి ఎక్కువవుతోంది. పట్టనంత తిని... ఆరాయించుకోవాలని ఆ దేశం తహతహలాడుతోంది. మింగలేక ఎక్కిళొస్తున్నా...  ఇంకా ఇంకా... తినాలన్న కాంక్ష  డ్రాగన్ లో  ఎక్కువైపోతోంది.   ప్రపంచ పెద్దన్న అమెరికాను మించి పోవాలనన్న లక్ష్యంతో  దురాక్రమణలకు కాలుదువ్వుతోంది. ఆర్థికంగా ప్రపంచాన్నే శాసించే స్థాయికి చేరుకున్నామని భావిస్తున్న డ్రాగన్ ఇప్పుడు... చుట్టూ ఉన్న దేశాలను నయానోభయానో తన దారిలోకి తెచ్చుకోవాలని కుట్ర పన్నుతోంది. ఇప్పటి వరకు వ్యాపార వాణిజ్యంతో పొరుగు దేశాలపై పెత్తనం చెలాయిస్తున్న డ్రాగన్ పొరుగు దేశాల భూములను కబళించి...  ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని కుట్రలు పన్నుతోంది. చేపకు వానపాము ఎరవేసినట్టుగా... చిన్న దేశాలకు కావాల్సిన ముడి సరకులును అందిస్తూ... వారి భూభాగాన్ని ఆక్రమించి... ఆ భూభాగంతోనే ప్రపంచదేశాలన్నింటిపైనా ఆధిపత్యం చేలాయించాలన్న కుతంత్రాన్ని చైనా అమలు చేస్తోంది. హంకాంగ్ పై కర్రపెత్తనం, తైవాన్ ను అదుపులో పెట్టుకోవడం, టిబెట్ ను ఆక్రమించడం, సౌత్ చైనా సముద్రాన్ని తను ఆధీనంలోకి తీసుకోవడం... ఇలా తనకు నచ్చిన రీతిలో ఇష్టారాజ్యంగా చైనా వ్యవహరిస్తున్న చైనా ఆగడాలపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్.
చైనా మాఫియా డాన్ల అవతారం ఎత్తుతోంది. తనకు నచ్చితే ఓలా... నచ్చకపోతే మరోలా... మాట వింటే ఓలా... మాట వినకపోతే ఓలా... సరెండర్ అయితే ఓలా... సరెండర్ కాకపోతే మరోలా వ్యవహరిస్తూ... చుట్టూ ఉన్న దేశాల విషయంలో డ్రాగన్ కుట్రకోణంతో చూస్తోంది. ఓవైపు అంతర్జాతీయ చట్టాలను భేఖాతరు చేసి దక్షిణ చైనా సముద్రంపై పెత్తనం చెలాయిస్తున్న చైనా తాజాగా డొక్లామ్ ను కబళించాలని చూస్తోంది. చైనా... అమెరికా తరహాలో తనే ప్రపంచానికి పెద్దన్నగా మారిపోవాలన్న ఉద్దేశంతో వ్యవహరిస్తోంది. ఇప్పటికే చైనా ఆధీనంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైనా హాంకాంగ్ కొనసాగుతోంది. సుధీర్ఘకాలం బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న హాంకాంగ్ ఎట్టకేలకు చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి... ఆ దేశంలో భాగమైంది. అయినప్పటికీ... స్వతంత్ర ఆర్థిక వ్యవస్థగా నిలబడుతోంది. అదే సమయంలో తైవానా కూడా అంతే... చైనా ఆధీనంలో ఉన్నప్పటికీ... ప్రపంచదేశాలన్నింటితోనూ ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. రెండు దేశాలు పూర్తి పరిపాలనను తమ ఆధీనంలోనే ఉంచుకున్నాయ్. ఓవరాల్ గా రెండు దేశాలు చైనా కంట్రోల్ లో ఉంటాయ్. అంటే... పైకి చైనా పెత్తనమున్నప్పటికీ... అవి స్వతంత్ర దేశాలుగా వ్యవహరిస్తున్నాయ్.
దక్షిణ చైనా సముద్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని... తన మాటే నెగ్గాలని డ్రాగన్ కుట్రలు చేస్తోంది. అంతర్జాతీయ న్యాయస్థానం చైనా సముద్రం జలాల నుంచి వెళ్లిపోవాలంటూ ఎన్నిసార్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ జల నిబంధనలను గౌరవించాలని అంతర్జాతీయ న్యాయస్థానం కుండబద్ధలు కొట్టింది. ఆ  తీర్పును సైతం చైనా అపహాస్యం చేస్తోంది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ... దక్షిణ చైనాలో... మనకు అండమాన్ నికోబర్ దీవుల్లో ఏ రకంగానైతే దీవులున్నాయో... అలా దీవులను కృత్రిమంగా ఏర్పాటు చేస్తోంది డ్రాగన్. తద్వారా... ఆయా సముద్ర మార్గాలను తన గుప్పెట్లో పెట్టుకొని... ఆ మార్గాల గుండా ప్రవేశించాలంటే తన అనుమతి తప్పనిసరన్న అభిప్రాయాన్ని చైనా కల్గిస్తోంది. వాస్తవానికి అండమాన్ నికోబార్ ఐలాండ్ ప్రకృతి ద్వారా ఏర్పడ్డాయ్. అయితే చైనా దక్షిణ సముద్రంలో భూభాగాలను సృష్టిస్తూ... ప్రపంచ రవాణా వ్యవస్థను తన అదుపులో తీసుకోవాలన్న దుష్టపన్నాగాన్ని చైనా అమలు చేస్తోంది. ఎక్కడైతే అంతర్జాతీయంగా వివాదముంటుందో... అతి తనదేనంటూ చైనా వాదిస్తోంది. చుట్టుపక్కల దేశాల నుంచి ప్రతిఘటన వచ్చినా అది ఖాతరు చేయడంలేదు.
బ్రిటీష్ కాలంలో సముద్ర మార్గాలపై ఆధిపత్యం ఎవరికి ఉంటుందో... వారే ప్రపంచ దేశాలను కంట్రోల్ చేస్తారన్న అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయాన్ని వంటబట్టించుకున్న చైనా... తన చుట్టూ ఉన్న దేశాలను నయనో, భయనో తన గుప్పెట్లో ఉంచుకోవాలన్న దుర్బుద్ధిని ప్రదర్శిస్తుంటుంది. 19, 20 వ శతాబ్దాల్లో ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదించాలన్న  సామ్రాజ్యవాద కాంక్షతో వాస్కోడిగామా, కొలంబస్ తో సముద్రయానాన్ని కొనసాగించాయ్. సముద్ర మార్గాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేవి. అదే పంథాలో తను  కూడా సముద్ర మార్గాలపై పట్టు సంపాదించి ప్రపంచాన్ని శాశించేలాన్న కుతంత్రం చైనా మదిలో మెదులుతోంది.  అందులో భాగంగానే సౌత్ చైనా సీని తన ఆధీనంలో ఉంచుకునే కుట్రను పథకం ప్రకారం అమలు చేస్తోంది.
తాజాగా సిక్కిం భూభాగం సమీపంలో ఉన్న  డొక్లామ్ పై పట్టు బిగించాలని చైనా కుతంత్రాన్ని రచించింది. డొక్లామ్ ఎవరి భూభాగంలో లేకుండా వివాదస్పద స్థలంగా ఉండగా... ఆ భూభాగాన్ని సంరక్షిస్తున్న భారత్ బంకర్లను నాశనం చేయడంతోపాటు... నేరుగా... అక్కడికి భూభాగంలోకి చొచ్చుకు వచ్చింది. రోడ్లు వేస్తామంటూ... బెంగాల్ సరిహద్దుల్లోకి ప్రవేశించాలన్న దుష్టపన్నాగాన్ని చైనా అమలు చేస్తోంది. అక్కడే చైనాను భారత్ అడ్డుకుంటోంది. చైనాకు గట్టి పోటీని భారత్ ఇచ్చింది. డొక్లామ్ నుంచి భారత్ దేశంలోని కీలక రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్ పై పూర్తి దృష్టి పెట్టి... రాడర్ల సైతం మన భూభాగంపై ఉన్న రక్షణ ఏర్పాట్లన్నింటినీ తనిఖీ చేయాలన్న దుర్బుద్ధి  చైనాలో ఉంది. నిఘా రాడర్ల కోసమే డొక్లామ్ వద్ద ఉన్న బంకర్లను సైతం పడగొట్టడానికి కారణంగా విశ్లేషణలు విన్పిస్తున్నాయ్. కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్న చందంగా భూటాన్ పరిస్థితి తయారైంది. భూటాన్ కు చుట్టూ భారత్... ఎంతో దన్నుగా నిలుస్తోంది. అయితే ఇప్పటికే భూటాన్ లోని కొంత భూభాగాన్ని చైనా ఎప్పుడో ఆక్రమించింది. భూటాన్ లోని పాలకులుకు తాయిలాల ఆశలు చూపిస్తూ... ఆ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలన్న దుర్నీతి సైతం చైనా మదిలో మెదులుతోంది.
మొత్తం వ్యవహారంలో భారత్ సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి మొత్తం వ్యవహారంపై ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. అదే సమయంలో చైనా ఆర్మీ అధికార ప్రతినిధి తొలుత రెండు మాటలు మాట్లాడినప్పటికీ... ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తాజాగా విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ సైతం... ఈ విషయంపై పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదంటున్నారు. చైనా మీడియా నుంచి ప్రతికూల కథనాలు పెద్ద ఎత్తున వస్తున్న భారత్ మాత్రం ఇప్పటి వరకు డొక్లామ్ ట్రై జంక్షన్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. డొక్లామ్ గురించి ఎలాంటి అడుగు వేయాలో తెలియక కాదు... ఎలా వ్యవహరించాలో తెలిసే భారత్... సైలెంట్ గా ఉందన్న అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా, భూటాన్, ట్రై జంక్షన్ కు సంబంధించిన వివాదం ఇప్పటిది కాదు. 1890 నుంచి ఉంది. సిక్కిం-టిబెట్ బౌండరీ భూటాన్ సరిహద్దుల్లోని మౌంట్ గిప్ మోచి వద్ద మొదలవుతుంది. ట్రై జంక్షన్లో భారత్ కీలక భాగస్వామన్న  విషయాన్ని చైనా 1959లోనే చైనా అంగీకరించింది. 2012లో భారత్, చైనా రెండు దేశాలు కూడా ఈ ఒప్పందానికి సంబంధించి... భూటాన్ అభిప్రాయాన్ని గౌరవించాలని నిర్ణయించాయ్. 1890 కన్షెన్షన్ ప్రకారం భూటాన్ ఇందులో భాగస్వామి కాకపోవడంతో ఈ సమస్య అలాగే కొనసాగుతోంది. అదే సమయలో భూటాన్, చైనా 1988, 1998లో రెండు ఒప్పందాలను కుదుర్చుకున్నాయ్. 1959లో ఉన్న వాస్తవ పరిస్థితిని రెండు దేశాలు గౌరవించాలని నిర్ణయించుకున్నాయ్. ఇలా మూడు ఒప్పందాల ప్రకారం కూడా చైనా డొక్లామ్ నుంచి మౌంట్ గిప్మోచి వరకు రోడ్డు నిర్మించడం మూడు దేశాల ఒప్పందాలను ఉల్లంఘించడమే. చైనా ఒప్పందాలను బేఖాతరు చేసి... ఇప్పుడు భారత్ దురాక్రమణ చేస్తోందంటూ కల్లబొల్లి మాటలు చెప్పడం శోచనీయమన్నది భారత్ వాదన. ఎందుకు అనవసర విషయాలను చైనా లేవనెత్తుతుందో అర్థం కావడం లేదన్నది భారత్ విదేశీవ్యవహారాల శాఖకు బోధపడటం లేదని తెలుస్తోంది. చైనా అధికార పత్రిక మాత్రం భారత్ ను ఫలితం అనుభవిస్తుందంటూ కవ్వింపు కథనాలను వండివార్చుతోంది. డొక్లామ్ నుంచి భూటాన్ సరిహద్దుల్లోకి రహదారి నిర్మించాలని చైనా పదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే వాటిపై పెద్దగా ఆందోళనలు లేకపోయినప్పటికీ... డొక్లామ్ వద్ద రోడ్డు నిర్మించడంతోనే అభ్యంతరం మొదలైయింది. తమను భారత్ అడ్డుకోవడాన్ని చైనా తట్టుకోలేకపోతోంది. 1960కి ముందు భూటాన్ పశుపోషకులు చైనాకు గడ్డి పన్ను కట్టేవారు కాబట్టి ఆ భూభాగంపై తమకు హక్కు ఉందని చైనా భావిస్తోంది. అదే సమయంలో... డొక్లామ్ ను భూటాన్ ఎప్పుడో తమకు అప్పగించేసిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే ఢిల్లీ మద్దతుతోనే భూటాన్ ఇప్పుడు చైనాకు సవాలు విసిరుతుందన్న అభిప్రాయం చైనాలో వ్యక్తమవుతోంది. అయితే ఇలాంటి విషయంలో భారత్ తలదూర్చడమేంటన్నది చైనా అభిప్రాయంగా ఉంది. డొక్లామ్ అన్నది చైనా, భూటాన్ కు సంబంధించిన భూభాగమని... ఈ విషయంలో భారత్ కు ఎలాంటి సంబంధం లేదన్నది చైనా వాదన. చైనా రహదారి నిర్మాణం భారత్ కు అతిపెద్ద సవాలన్న భావనలో ప్రభుత్వం ఉంది. చైనా బలగాలు... బెంగాల్ లోని సిలిగురి కారిడార్లోకి ప్రవేశించే ప్రమాదముందని భారత్ అనుమానస్తోంది. సిలుగురి కారిడార్ నుంచే భారత్... ఈశాన్య రాష్ట్రాలతో కలసి ఉంటుంది కాబట్టే మొత్తం వ్యవహారంలో చైనా విషయంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే డొక్లామ్ ఇష్యూను కెలకడం ద్వారా... చైనా ఆలోచనలు చాలానే ఉన్నాయ్. అమెరికాతో భారత్ బలమైన ఆర్థిక, రక్షణ సంబంధాలు కలిగి ఉండటాన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. భారత్ తో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ... అవన్నీ కూడా ఐటీ ఆధారితమైనవే. అమెరికా తాజాగా భారత్ కు విక్రయిస్తున్న అత్యాధునిక డ్రోన్లు, ఇతర రక్షణ పరికరాలతో భారత్ భద్రత పటిష్టమవుతుంది. చైనాను లెక్కజేయాల్సిన రీతిలో భారత్ ఎదుగుతుందన్న అభిప్రాయం ఆ దేశంలో కలగుతోందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 1949లో చైనాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భూటాన్-భూటాన్ సరిహద్దు అంశాన్ని భూటాన్ తరుపున భారత్ ప్రస్తావించే అవకాశం మనదేశానికి ఉంది. అయితే చైనా మాత్రం భూటాన్ తో మాత్రమే మాట్లాడతామంటూ చెబుతోంది.

అలీన విధానంతో ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచిన భారత్ ను చైనా ఆది నుంచి ఇబ్బందులు పాల్జేస్తోంది. ఓవైపు పాకిస్తాన్ ను భారత్ పై ఉసిగొల్పి కపట నాటకాలాడుతోంది. చేసేది దొంగపైననప్పుడు... సైలెంట్ గా పని కానిచ్చేయడం ఎవరికైనా అలవాడే. అయితే డ్రాగన్ మాత్రం దొంగ నాటకమాడుతూ కూడా... డొక్లామ్ విషయంలో మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది. బుసలు కొడుతున్న డ్రాగన్ ను నిలువరించేందుకు భారత్ అడుగు ముందుకేయాల్సిన సమయం ఆసన్నమైంది. టాక్టిక్స్... స్ట్రాటజీ... ఎత్తులు... వ్యూహాల థీయరీని అమలు చేయాలన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
చైనా విషయంలో భారత్ ఎప్పుడూ దురాక్రమణదారుగా వ్యవహరించలేదు. చైనా మాత్రం అంతకంతకూ అదే కుట్రను ఇంప్లిమెంటే చేస్తూనే ఉంది. 1962లో భారత్ పై యుద్ధంతో తెగబడిన చైనాను నాడు కూడా... భారత్ ఎక్కడా ఆగౌరవంగా వ్యవహరించలేదు. నాడు నెహ్రూ భారత్ విధానమైన పంచశీల సుత్రాల ఆధారంగానే డీల్ చేసింది. అయితే ఒప్పందాన్ని కనీసం చైనా గుర్తించనూ లేదు. అటు అమెరికా, ఇటు రష్యా వైపు జరక్కుండా... తటస్థ విధానాన్ని వ్యవహించిన భారత్... ఆ తర్వాత రోజుల్లో కొత్తగా ఎలాంటి విధానాలను అమలు చేయలేదు. చైనా మాత్రం... ఒప్పందాలన్నింటినీ తుంగలో తొక్కి... తన నైజాన్ని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. భారత్ మాత్రం నేటికీ పంచశీల విధానాన్నే చైనా విషయంలో అమలు చేస్తోంది. చైనా మాత్రం పంచశీల ఒప్పందాలను మాత్రం ఎప్పుడూ గౌరవించలేదు.
అయితే తాజాగా చైనాను డీల్ చేయాలంటే భారత్ ఎంతో జాగురకతో వ్యవహరించాలి. టాక్టిక్స్... ఎత్తులు... స్ట్రాటజీ... వ్యూహాలను అమలు చేయడం ద్వారానే చైనా దుష్టతంత్రాన్ని కట్టిడి చేసే అవకాశం కలుగుతుంది. డొక్లామ్ లాంటివి మరో చోట రిపీటే చేసేందుకు చైనా ఎప్పుడూ తహతహలాడుతూనే ఉంటుంది. అలాంటి ఆలోచనలను మొగ్గలోనే తుంచాలంటే అందుకు అమెరికా, రష్యా మద్దతు భారత్ తప్పనిసరిగా తీసుకోవాలి. భారత్ దిగుమతులతో సుభిక్షంగా ఉన్న చైనా... భారత్ దిగుమతులను కట్టిడిచేస్తే తట్టుకొని నిలబడటం కష్టమనే చెప్పాలి. సరిహద్దుల్లో వివాదం అంతకంతకూ రేగుతున్నా... చైనా మాత్రం జీ 20 సదస్సులోనూ భారత్ పై ప్రశంసలు జల్లు కురిపించింది. అదే సమయంలో భారత్ సైతం చైనా తీరు భేష్ అంటూ సమర్థించింది. రెండు దేశాల మధ్య సమస్య జఠిలమవుతున్నప్పటికీ... అటు చైనాకానీ, ఇటు భారత్ కానీ ఆచితూచి వ్యవహరిస్తున్నాయ్. తప్పుచేస్తోందన్న విషయం చైనా పాలకులకు తెలుసు. అలాంటి సమయంలో చైనా మీడియా దురాక్రమణదారు అంటూ పెద్ద ఎత్తున భారత్ పై కథనాలను వండి వార్చుతోంది. అయితే అవి భారత్ ను ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో తప్పించే... వాస్తవ చిత్రం వేరుగా ఉంది. చైనా ఎలాంటి అడుగులు వేసినా ప్రపంచదేశాలన్నీ తప్పుబట్టడం ఖాయం. ఇప్పటికే నాడు చైనా, భారత్ మధ్య ఉన్న మెక్ మోహన్ రేఖను సైతం చైనా గౌరవించదు. ఎక్కడిక్కడ భారత్ భూభాగాలను, చుట్టూ ఉన్న భూములను కబ్జా చేస్తూ... దమననీతికి పాల్పడుతోంది.  అమెరికా, చైనా విషయంలో అనుసరిస్తున్న భారత్  వైఖరికి వంద శాతం మద్దతిస్తుంది. ఎందుకంటే చైనా దాష్టీకాలు అమెరికాకు బాగా తెలుసు. చైనా ఆగడాలపై అమెరికా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంది కూడా.  అదే సమయంలో రష్యా డ్రాగన్ కు మద్దతిస్తున్నట్టుగా కన్పిస్తున్నప్పటికీ... భారత్ విషయంలో వ్యతిరేక వైఖరిని అవలంబించే పరిస్థితి ఎంత మాత్రం ఉండదు. రష్యా , అమెరికా భారత్ వైఖరికి మద్దతిస్తుంటే... చైనా ఎంత పెద్ద మిలిటరీ ఉన్నప్పటికీ... చేయడానికి ఏమీ ఉండదు. పైపెచ్చు... మన దేశం చేసుకుంటున్న చైనా వస్తువుల దిగుమతితో ఆ దేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. అటు అమెరికా, ఇటు రష్యా మద్దతిస్తే... చైనా ఏం చేయగలుగుతుంది... ఓవైపు భారత్ కు ఎగుమతులు లేకుంటే చైనా మొబైల్, ఐటీ ఎక్స్ పోర్ట్స్ దెబ్బతినడం ఖాయం. అందుకే వారు కూడా తెగేదాకా లాగరు. మనల్ని చూసి చైనా ఇప్పటి వరకు ఎలాంటి దుస్సాహసం ప్రదర్శించకపోవడానికి కారణం... మన ఆర్థిక వ్యవస్థ చైనాకు అన్నం పెడుతోంది. చైనా నుంచి దిగుమతులు ఆగితే భారత్ కు కలిగే నష్టం కంటే... ఎగుమతులు ఆగిపోతే చైనా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టమే ఎక్కువ. ప్రపంచమంతా ఉత్తర కొరియాను ద్వేషిస్తుంటే... డ్రాగన్ మాత్రం ప్రేమ కురిపిస్తోంది. చైనా ఈశాన్య ప్రాంతంలో ఉత్తర కొరియా ఉంది. ఉత్తర కొరియా చైనాకు బొగ్గు దిగుమతి చేసి... ఆ దేశం నుంచి విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించుకుంటోంది. చైనా బొగ్గు కనకపోతే ఉత్తర కొరియా బతుకు బుగ్గే. అయినా చైనా భౌగిళిక పరిస్థితులు, అమెరికా దెబ్బకు ఉత్తర కొరియాకు మద్దతిస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ లేకుంటే... రెండు కొరియాల కలయిక జరిగితే చైనాకు అది ముప్పుగా పరిణమిస్తుంది. అందుకే చైనా... ఉత్తర కొరియాకు వీలైనంత సహకారం అందిస్తూ ముందుకు సాగుతోంది. కొరియా ఐక్యత జరిగి... కలిసిపోతే... అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా మనుగడ సాగిస్తున్న దక్షిణ కొరియా... మరింతగా చైనాపై దూకుడు చూపిస్తోంది. అమెరికా బలగాలు... చైనా సరిహద్దుల్లోకి ప్రవేశించి... చైనా భద్రతకు సవాలుగా నిలుస్తాయ్. అందుకే చైనా ఉత్తర కొరియాను ఇష్టం లేకున్నా  సహకారం అందిస్తోంది. బయటకు కన్పించిన చైనా వేరన్నది చాలా మందికి తెలియదు. సోషలిజం ముసుగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ... చైనా ఆర్థిక, సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతోంది. అందుకే తన ఆధిపత్యాన్ని సహించనివారంటే ఆ దేశానికి గిట్టదు. చైనా ఆధిపత్యానికి సలామ్ చేస్తే వారికి మద్దతుగా ఎంతకైనా దిగజారుతోంది. చైనా ఒకే పార్టీ ఆర్థిక వ్యవస్థ. కమ్యూనిస్ట్ ముసుగులో నియంతృత్వం పాలనలో సాగుతోంది. ఎన్నికలు అసలే జరగవ్. పదేళ్లకోసారి అంతర్గత ఎన్నికలు మాత్రమే జరుగుతాయ్. అది కూడా ఫార్మాలిటీయే. ప్రజస్వామ్యమన్న మాట చైనాలో విన్పించదు. ఎవరైనా కాదంటూ ఆందోళనలకు దిగితే వారిక కన్పించరు. బుల్ డోజర్లతో క్రష్ చేస్తోంది.  యూనివర్శిటీ విద్యార్థులను 1980 దశకంలో... ఎంతో మందిని పొట్టనబెట్టుకొంది. అయితే సొవియట్ యూనియన్ పతనమైతే... రాజ్య కాంక్షతో చైనా విచ్చలవిడితనం తగ్గడం లేదు. విపరీతమైన అధికారంతో విచ్చలవిడిగా అవినీతి జరగుతూ... నిత్యం చైనా వార్తల్లో నిలుస్తోంది. అమెరికాలో చైనా రాజకీయనేతలు, బ్యూరోక్రాట్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకొని... ఆస్తులు పెంచుకుంటున్నారు. ఈ విషయం అటు అమెరికాకు, చైనా రాజకీయనేతలు బాగా తెలుసు. అందుకే చైనా విషయంలో అమెరికా చేతిలో చాలా అస్త్రాలే ఉన్నాయ్.  అదే సమయంలో పాకిస్తాన్ విషయంలో చైనా...  భారత్ కు ఇబ్బంది కలిగేలా ఎంతో డ్రామా ఆడుతోంది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తుందని చైనాకు తెలియక కాదు. భారత్ ను నిలువరించేందుకు పాకిస్తాన్ బూచిని వాడుకుంటుందంతే. కశ్మీర్ లోని అక్సిన్ చిన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ను నుంచి కబళించి భారత్ పై నిఘా పెడుంది డ్రాగన్. ఇప్పుడు తాజాగా డొక్లామ్ వద్ద సిక్కింలో చొరబాటుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ప్రపంచదేశాలు చీదరించుకుంటాయని... తెలిసి... భారత్ పై ఒత్తిడి పెంచుతోంది. అదేసమయంలో భారత్ వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే... డొక్లామ్ పక్కనంతా భారత్ భూభాగమే. ఈశాన్య రాష్ట్రాలకు కీలకమైనది డొక్లామ్.

గురివింద తన కింద నలుపు ఎరుగదన్న చందంగా డ్రాగన్ వ్యవహరిస్తోంది.  ఓవైపు హాంకాంగ్ తో సఖ్యతగా మెలగలేని పరిస్థితి. తైవాన్ తో నిత్యం అనుమానాల కాపురం. మరోవైపు టిబెట్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు... చుట్టూ ఆందోళనల జడి రేగుతున్నా.... చైనా మాత్రం...  సోషలిజం ముసుగుతో కడట నాటకాలాడుతోంది. మానవ అక్రమ రవాణాలోనూ చైనా ప్రపంచదేశాల్లోనే అగ్రస్థానంలో ఉందంటే... ఆ దేశం చీకటి కోణాన్ని అర్థం చేసుకోవచ్చు. తమ దేశాల అంతరంగిక వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని అటు తైవాన్ గానీ, ఇటు చైనాగానీ సహించడం లేదు. చైనా ఆధీనంలో ఉన్పప్పటికీ హాంకాంగ్ ,తైవాన్ రెండు స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రాంతాలుగా చలామణీ అవుతున్నాయ్. చైనా ఆధిపత్యాన్ని  తైవాన్ అంగీకరిస్తున్నప్పటికీ... ఇద్దరి భూభాగాలను ఎవరి సరిహద్దుల్లో వారు గౌరవించుకోవాలన్న అభిప్రాయం ఉంది. ఇదే దశాబ్దాల తరబడి రెండు ప్రాంతాల మధ్య ఘర్షణకు కారణమవుతోంది. 1927లో చైనాలో ప్రజా తిరుగుబాటు నేపథ్యంలో చైనా, తైవాన్ ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మావో చైనాలోని జాతీయ ప్రభుత్వాన్ని పడగొట్టడంతో పరిణామాలు మారిపోయాయ్. జాతీయ నాయకులు తైవాన్ పారిపోవడం... చైనా మాదంటే మాదంటూ ఇద్దరూ పోటీ పడ్డారు. తైవాన్ లో ఉన్న నేతలు కమ్యూనిస్టులు చైనాను అన్యాయంగా అక్రమించుకున్నారని వాదిస్తారు. అదే సమయంలో బీజింగ్ లోని ప్రభుత్వం... తైవాన్ ను తమ నుంచి విడిపోయిన ప్రాంతంగా అభివర్ణిస్తారు. తైవాన్ పేరు కూడా వాస్తవానికి చైనాగానే ఉంది.
రెండు ప్రాంతాల మధ్య వివాదం... ప్రపంచ ప్రచ్ఛన్న యుద్ధానికి కారణంగా చెబుతారు. రష్యా, ఆ దేశ మద్దతు దేశాలు చైనాకు మద్దతు ప్రకటిస్తే... అమెరికా మద్దతుదారులు తైవాన్ జాతీయ వాదులకు మద్దతిస్తున్నాయ్. చైనా ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం సాధించిన తర్వాత... చైనా ఆధిపత్యాన్ని అమెరికాతో సహా మిగతా దేశాలు కూడా ఆమోదించాయ్. అప్పట్నంచి తైవాన్ తో అమెరికా సంప్రదింపులు జరపడం మానేసింది. తైవాన్ కు పూర్తి సార్వభౌమాధికారాన్ని అప్పగిస్తే... టిబెట్ లో వేర్పాటు ఆందోళనలు వస్తాయని చైనా బెంబేలెత్తిపోతోంది. తైవాన్ స్వాతంత్రం ప్రకటిస్తే యుద్ధం చేస్తామంటూ చైనా కాలుదువ్వుతోంది. 1992లో చైనాతో వన్ చైనా ఒప్పందం కురిదినప్పటికీ... తైవానీయుల్లో మాత్రం స్వాతంత్ర కాంక్ష అలాగే కొనసాగుతోంది. తైవాన్ యువత చైనా నాయకత్వంపై ఆగ్రహంతో ఉంది. ఇదే అదనుగా తీసుకొని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తైవాన్ తో సంబంధాలు నెరుపుతున్నాడు. ఆయుధాలు సైతం అమ్ముతానంటూ చేస్తున్న ప్రకటనలు...తైవాన్-చైనా మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయ్.
మరోవైపు అదే సమయంలో హాంకాంగ్ సైతం తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ చైనాకు హితవు పలుకున్నారు. బ్రిటీష్ కాలనీగా ఉన్న హాంకాంగ్... 1997లో చైనాలో విలీనమైంది. చైనాలో ఉన్న పరిస్థితులకు హాంకాంగ్ లో ఉన్న పరిస్థితులు వేరనీ... చైనాలగా... హాంకాంగ్ ప్రజలు ఉండబోరని... అక్కడి పాలకులు స్పష్టం చేస్తున్నారు. స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా హాంకాంగ్ చైనాలో భాగస్వామిగా కొనసాగుతోంది. రెండు సంస్కతృతులు వేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హాంకాంగ్ లో ఉన్న రాజకీయ వ్యవస్థపై చైనా పెత్తనాన్ని స్థానిక నాయకత్వం అంగీకరించడకపోవడంతో రెండు పక్షాల మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. చైనాలో మీడియాపై ఆంక్షలు కొనసాగుతుండగా... హాంకాంగ్ లో మాత్రం మీడియా స్వేచ్ఛ ఎక్కువ. బ్రిటీష్ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో స్వేచ్ఛ, సమానత్వాలను హాంకాంగ్ పౌరులు కోరుకుంటున్నారు. అదే సమయంలో చైనాకు ఇది ఎంత మాత్రం ఇష్టంగా ఉండటం లేదు.  హాంకాంగ్ ప్రజలను చైనా నిపుణులు కుక్కలతో పోల్చడంపై అక్కడి పౌరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక టిబెట్ అక్రమంగా ఆక్రమించుకున్నారని బౌద్ధులు ఎప్పట్నుంచో ఆందోళన నిర్వహిస్తున్నారు. భారత్ లో ప్రవాస జీవితం గడుపుతున్న దలైలామా చైనా ఆగడాలు తట్టుకోలేక భారత్ లో శరణార్థిగా జీవిస్తున్నానంటూ చెబుతున్నారు. టిబెట్లో చైనా అకృత్యాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని బౌద్ధులు మండిపడుతున్నారు. టిబెట్‌కు నిజాయతీగల అసలైన స్వయం ప్రతిపత్తి కావాలని కోరుకుంటున్నట్లు దలైలామా చెబుతారు. భారతదేశంలోని ధర్మశాల నుంచి ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని దలై లామా నడుపుతున్నారు. చైనా నుంచి టిబెటన్లు స్వేచ్ఛ పొందడానికి భారత్ సహకరించాలని... టిబెట్‌ను చైనా అన్యాయంగా ఆక్రమించుకుందని టిబెటన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  తమ ఆధ్యాత్మిక గురువు దలైలామ ప్రతినిధితో చైనా బేషరతుగా చర్చలు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. అయితే చైనా మాత్రం ఇవేమీ పట్టించుకోదు. చుట్టుపక్కల ఉన్న దేశాల్లో అలజడులు సృష్చించి చలికాచుకుంటోంది. పాకిస్తాన్ తో కల్లబొల్లి మాటలు చెప్పి కశ్మీర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించింది. భారత్ కు ఇబ్బంది కలిగించడం తమ వల్ల కాదు కాబట్టి పాకిస్తాన్ చైనా ద్వారా గూడుపుఠాని నడిపిస్తోంది. భూటాన్ చుట్టూ ఉన్న భూభాగాన్ని ఆక్రమించిన చైనా... తాజాగా డోక్లామ్ పై కన్నేసింది. దక్షిణ చైనా సముద్రంలో మితిమీరిన ఆగడాలతో తూర్పు ఆసియా దేశాలకు చికాకు కలిగిస్తోంది. భారత్ లుక్ ఈస్ట్ పాలసీ అన్న మరుక్షణమే రంగంలోకి దిగి ఆయా దేశాలను భారత్ కు దగ్గర కాకుండా అడ్డుకుంటోంది.
ప్రపంచంలోకెల్లా చైనాలోనే మానవుల అక్రమ రవాణా ఎక్కువగా సాగుతోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో రష్యా, సిరియా, ఇరాన్‌లను చైనా మించి పోయిందంటూ అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. చైనాలో మానవుల అక్రమ రవాణా, దాన్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలను పరిగణలోకి తీసుకొని మానవుల అక్రమ రవాణా సూచికలో చైనాను ‘టైర్‌ 3’ కేటిగిరీగా ప్రకటించడం సంచలనం సృష్టించింది.  చైనాలో  ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికే కాకుండా ఉత్తర కొరియా లాంటి దేశాల నుంచి మానవుల అక్రమ రవాణా ఎక్కువగా కొనసాగుతోంది. మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చైనాలో కఠిన చట్టాలు లేకపోవడం కూడా ఓ లోపమేనని అమెరికా నివేదికలో వ్యాఖ్యానించింది.
భారతదేశానికి ముప్పేదైనా పొంచి ఉందంటే.. అది కేవలం ఒక్క చైనాతో మాత్రమే... ఇది ఎప్పుడో వివేకానందుడు మనకు చేసిన హెచ్చరిక. అవును ఇది నిజం. తప్పు తనవైపు ఉన్నా... మనవైపు వేలిత్తి చూపుతూ... డ్రాగన్ దుష్ట పన్నాగానికి తెరదీస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అదిపెద్ద భూభాగాన్ని కలిగిన చైనా... ఆసియా ఖండంలో చేస్తున్న ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. సౌత్ చైనా సముద్రాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం ద్వారా...  సముద్ర రవాణాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. తాజాగా సిక్కింలోని డోక్లామా వరకు రోడ్డు మార్గాన్ని వేసి... భారత్ లో చొరబడేందుకు కుటిలయత్నం చేస్తోంది. డ్రాగన్ భూదాహానికి కారణం ప్రపంచ దేశాలను తన చెప్పుచేతుల్లోకి తీసుకోవాలన్న దురుద్దేశమే. దశాబ్దాల తరబడి ప్రపంచ దేశాల హక్కులను గౌరవించే సమున్నత ఆశయం కలిగిన భారత్ ను డ్రాగన్ ప్రత్యక్షంగానూ... పరోక్షంగానూ ఇరుకునపెట్టాలని చూస్తోంది. ప్రపంచానికి పెద్దన్న కావాలన్న దురుద్దేశంతో డ్రాగన్ సాగిస్తున్న యుద్ధం మనల్నే కాదు... ఆధిపత్యం పేరుతో చుట్టూ ఉన్న దేశాల ప్రజల హక్కులను కాలరాస్తోంది. 

భారత్ జట్టు కోచ్ ఎంపిక-ట్విస్ట్ లు

క్రికెట్ లెక్కలు
క్రికెట్ ఆటపై లెక్కలు ఎప్పుడూ పక్కాగా ఉండవ్. నచ్చితే అందలం... నచ్చకుంటే అధఃపాతాళం క్రికెట్లో ఆటలో ఎప్పుడూ అంతే. క్రికెట్ అంటేనే కాసులు గలగలలు. క్రికెట్ ఆట కోసం పరితపించిన కుంబ్లే ఇప్పుడు స్టాండ్స్ లో కూర్చుంటే... జాలీ బాయ్ క్రికెట్ కోచ్ గా ఖరారయ్యాడు. ప్లేబాయ్... భారత్ జట్టుకు  క్రికెట్ కోచ్ గా ఎంపికైపోయాడు. అయితే మొన్నటి వరకు కోచ్ గా ఉన్న కుంబ్లే ఒక్కడే బాధ్యతలు చేపట్టినప్పటికీ...  ఇప్పుడు కొత్తగా నలుగురు కోచ్ లు భారత్ జట్టుతో కలిసి పనిచేయబోతున్నారు.  ముందుగా కోచ్ కు మాత్రమే ఇంటర్వ్యూలు కోరిన బీసీసీఐ, క్రికెట్ అడ్వైజరీ కమిటీ సూచనలకు తలొగ్గి బ్యాటింగ్ , బౌలింగ్ కోచ్ లను నియమించింది.
కోచ్ ఎవరో ఖరారు కాలేదంటూ బీసీసీఐ పెద్దలు గప్ చుప్ అంటున్న సమయంలోనే మీడియాలో కోచ్ ఖరారంటూ వార్తలు రావడం సంచలనం సృష్టించింది.  పెద్దల లెక్కలు కుదరడంతో ప్రకటన వచ్చేసింది. ఆట ఎప్పుడూ   క్రీడాకారులు ఆడేవారు. అయితే కొచ్చే ఫ్రేమ్ లో ఇప్పుడు ఆడేందుకు కోచ్ లు సిద్ధమయ్యారని చెప్పుకోవాలి. భారత్ జట్టు కోచ్ ఎంపిక తాజా పరిణామాలపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్

కోచ్ ఎంపిక కాలేదని... కోచ్ ఎన్నుకోవడానికి టైమ్ కావాలని... కోచ్ నియామకం అంత వేగంగా తీసుకునేది కాదంటూ సెలక్షన్ కమిటీ సభ్యుడు, భారత మాజీ కెప్టెన్ గంగూలీ ప్రకటన చేసిన 24 గంటలు గడవకముందే.... కోచ్ గా రవిశాస్త్రిని ఎంపిక చేస్తూ... బీసీసీఐ ప్రకటన చేసింది. రవిశాస్త్రి టీంఇండియా కోచ్ నియామకం... దారి తీసిన మొత్తం పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం...
భారత్ జట్టు కోచ్ ఎంపిక చాలా గందరగోళానికి కారణమయ్యింది. గెలుపు మాంత్రికుడుగా పేరొందిన అనిల్ కుంబ్లే కోచ్ గా కొనసాగుతున్న సమయంలోనే... కోచ్ కావాలంటూ ప్రకటన వచ్చి సంచలనం సృష్టించింది.
అప్పటి వరకు కుంబ్లే, కోహ్లీ మధ్య పెద్దగా లొల్లి లేదనకుంటున్న సమయంలో... అకస్మాత్తుగా ఇద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడిందంటూ వార్తలు వచ్చాయ్. అదే సమయంలో కుంబ్లే, కోహ్లీ మధ్య సయోధ్య కోసం రెండు వైపుల నుంచి ప్రయత్నాలు జరిగినప్పటికీ... అవి ఫలించలేదు. ఇద్దరి మధ్య గ్యాప్ ను అంతకంతకూ పెంచాయ్. గ్యాప్ తగ్గలేనంత పెరగడంతో... కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకున్నాడు. వెస్టిండీస్ టూర్ వరకు కొనసాగాలంటూ బోర్డు చెప్పినప్పటికీ... కుంబ్లే వాటిని ఖాతరు చేయలేదు. కోచ్ ఎంపిక పనిలో నిమగ్నమైన క్రికెట్ అడ్వైజరీ కమిటీ... వేట మొదలుపెట్టింది. దిగ్గజ క్రీడాకారులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ జట్టు కోచ్ ఎంపిక విషయంలో సుధీర్ఘ కసరత్తు చేశారు.
ఈనెల 10న కోచ్ పదవికి ఇంటర్వ్యూలు జరగ్గా టీం ఇండియా కోచ్ ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు. అయితే కోచ్ ప్రకటన మాత్రం రాలేదు. కోచ్ ఎంపిక ఇప్పటికిప్పుడు అయ్యేది కాదనన అభిప్రాయాన్ని గంగూలీ విన్పించాడు. అయితే బోర్డు మాత్రమే... క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఆలోచనతో విభేదించింది. కోచ్ పదవి ఇక ఎంత మాత్రం ఖాళీగా ఉండరాదన్న నిర్ణయానికి వచ్చింది. మీర ఎవరిని సెలక్ట్ చేశారో చెప్పాలంటూ సీఏసీ సభ్యులను బోర్డు విస్పష్టంగా కోరింది. ఎందుంకేట...  కోచ్ ఎంపిక విషయాన్ని ఎక్కువ కాలం సస్పెన్స్ లో ఉంచాలని బోర్డు భావించలేదు. అది జట్టుకు, ఆటగాళ్లకు మంచిది కాదనన అభిప్రాయంలో బోర్డు ఉంది.
ప్రకటన చేయడానికి ముందే వచ్చిన లీకులతో అప్రమత్తమైన క్రికెట్ పాలన మండలి... ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో రవిశాస్త్రిని భారత్ జట్టు కోచ్‌గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం రాత్రి ప్రకటించింది. మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఎంపికకాగా.. విదేశీ పర్యటనలకు రాహుల్‌ ద్రవిడ్‌ బ్యాటింగ్‌ సలహాదారుగా నియమించినట్టుగా పేర్కొంది. గతంలో భారత్ జట్టుకు టీం డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి తొలిసారిగా జట్టుకు కోచ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కోచ్ ఎంపికకు సంబంధించి కూలంకుషంగా చర్చించింది. మంగళవారం క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ , భారత్ జట్టు కెప్టెన్ కోహ్లీతో వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. మొత్తం కోచ్ ఎంపిక ప్రాసెస్ కు సంబంధించిన సమాచారాన్ని కోహ్లీతో సభ్యులు చర్చించారు. శాస్త్రి, సెహ్వాగ్ గురించి ముగ్గురు సభ్యులు కోహ్లీతో చర్చించారు. అయితే అప్పటి వరకు తన అభిప్రాయాన్ని బలంగా రుద్దని కోహ్లీ... కోచ్ గా తమకు రవిశాస్త్రే కావాలని పట్టుబట్టారు. దాంతో ఇక సీఏసీ సభ్యులకు మరో నిర్ణయం చెప్పడానికి అవకాశం లేకుండాపోయింది.  క్రికెట్ అడ్వైజరీ కమిటీకి కోచ్ ఎంపిక అంత వీజీగా ముగియలేదు. శాస్త్రి, సెహ్వాగ్ మధ్య గట్టి పోటీ వచ్చిందన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే కెప్టెన్ కోహ్లీ రవిశాస్త్రి విషయంలో మొగ్గుచూపడంతో... ఇక అందరూ కోహ్లీ నిర్ణయానికి మొగ్గు చూపారు.
కోచ్ ఎంపికగా రవిశాస్త్రి విషయంలో క్రికెట్ మండలిలో కీలకంగా వ్యవహరిస్తున్న గంగూలీకి కొన్ని అభ్యంతరాలున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో టెండుల్కర్,  గంగూలీ ని కన్విన్స్ చేసినట్టుగా చెబుతున్నారు. సచిన్ మొదట్నుంచి జట్టు సభ్యుల కోరికను మన్నించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాడు.  2019 ఐసీసీ వరల్డ్ కప్ వరకు రవిశాస్త్రి టీం కోచ్ గా వ్యవహరించనున్నట్టు బీసీసీఐ తేల్చి చెప్పింది. బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ను ఎంపిక చేయాలంటూ రవిశాస్త్రి ప్రతిపాదించగా... గంగూలీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్టుగా సమాచారం.  అయితే అప్పటి వరకు శాస్త్రిని, తీవ్రంగా విభేదిస్తున్న మాజీ కెప్టెన్ గంగూలీ... తెరపైకి బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ లను తీసుకొచ్చాడు. బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను, బ్యాటింగ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ అవసరమన్న అభిప్రాయాన్ని బీసీసీఐకి కలిగించాడు.  జహీర్ జట్టుకు ఇప్పుడెంతో అవసరమన్న అభిప్రాయాన్ని గంగూలీ కుండబద్ధలు కొట్టాడు. అదే సమయంలో బంగార్ ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్ గా ఉన్నప్పటికీ...  భారత్ జట్టు విదేశీ టూర్ల సమయంలో అందుబాటులో ఉండాలని కోరింది.
జట్టుకు జహీర్ ఖాన్ సేవలు ఎంతో అవసరమని గంగూలీ కమిటీ ముందు స్పష్టంగా చెప్పాడు. కోచ్ విషయంలో సౌరవ్ ఏవిధంగా రాజీ ధోరణి అనుసరించే... అదే విధంగా... బౌలింగ్ కోచ్ విషయంలోనూ గంగూలీ నిర్ణయాన్ని కమిటీ సభ్యులు ఆమోదించినట్టుగా తెలుస్తోంది. జహీర్ ఖాన్ ఇప్పుడు జట్టులో ఉనన సభ్యులందరితో మంచి సంబంధాలు కలిగి ఉండటం.... బౌలింగ్ విషయంలో అసాధారణ పాఠవాలు కలిగి ఉండటం కూడా కలిసొచ్చిన పరిణామంగా చెప్పవచ్చు.  
గెలిచిందెవరు... నిలిచిందెవరు... కోచ్ గా రవిశాస్త్రిని నియమించుకోవాలని పంతం పడుతున్న కోహ్లీ ఎట్టకేలకు తన మాటే నెగ్గించుకున్నాడు. కోచ్ ఎంపిక సలహా మండలిని కాదని... బోర్డు పెద్దల ద్వారా తన మాటకే జై కొట్టించుకున్నాడు కోహ్లీ. ఓవరాల్ గా  క్రికెట్ పెద్దలు కెప్టెన్ మాటకే విలువిచ్చారు. రవిశాస్త్రి నియామకానికి పచ్చజెండా  ఊపారు.
కోహ్లీ ఇప్పుడు దూకుడు మీద ఉన్న భారత్ జట్టు నాయకుడు. కోహ్లీ విజయాల సారధిగా నిలిచిపోవాలని కలలు గంటున్నాడు. గత ఏడాదిగా భారత్ జట్టు ఎన్నో విజయాల్లో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. మరెన్నో పరాజయాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. అయితే కోహ్లీ కోచ్ కుంబ్లే విషయంలో అనేక రిజర్వేషన్లన్నట్టుగా కన్పించింది. కుంబ్లే స్ట్రిక్ట్ గా ఉంటాడని... కుంబ్లే కోచింగ్ తీరుపై జట్టు సభ్యులంతా గుస్సాగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే కోచ్ గా కుంబ్లే రికార్డు స్థాయిలో సాధించిన విజయాలు పక్కకపోయే విభేదాలు ముందుకు వచ్చాయ్.
అప్పటి వరకు కుంబ్లే, కోహ్లీ మధ్య సఖ్యత కుదుర్చాలని చూసిన బీసీసీఐ, సీఏసీ సభ్యులు లెక్కలు ఫలింలేదు. ఇద్దరి మధ్య అసాధారణ రీతిలో గ్యాప్ ఉందన్న అభిప్రాయం నెలకొనడంతో ఇక బోర్డు సభ్యులంతా చేసేదేం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. కోచ్ ఎంపికకు గడువును పొడిగించారు. అప్పటి వరకు రేసులో ఉన్న సెహ్వాగ్, టామ్ మూడీ పేర్లు ప్రముఖంగా విన్పించాయ్. రవిశాస్త్రి బరిలోకి దిగడంతో ఇద్దరు వెనక్కిపోయారు. అయితే సెహ్వాగ్ విషయంలో గంగూలీ ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ...సచిన్ వారించడంతో దాదా వెన్కకి తగ్గాడు. అదే సమయంలో శాస్త్రికి చెక్ పెట్టేందుకు కొత్త ఫార్మూలాను బయటకు తీశాడు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న లెక్కను
గంగూలీ ఇంప్లిమెంట్ చేశాడు. బౌలింగ్ కోచ్ గా తనకు అనుకూలడని రవిశాస్త్రి రికమండ్ చేయడంతో... ఆ ప్రతిపాదనపై సౌరవ్ కస్సుమ్నాడు. జహీర్ ను అనుకోకుండా జట్టు టీంలోకి తీసుకొచ్చాడు. సాధారణంగా...  జట్టు కూర్పు విషయంలో కెప్టెన్, కోచ్ కీలకం. వారి చెప్పిందే జరుగుతుంది. అయితే ఇప్పుడు జహీర్ రోల్ ఎలా ఉంటుందన్న అభిప్రాయం క్రీడా వర్గాల్లో నెలకొంది.
జహీర్ ఖాన్ జట్టులోకి రావడం ఎంతో బలమన్న అభిప్రాయం బీసీసీఐలోనూ ఉంది. అందుకే దాదా నిర్ణయానికి బోర్డు పెద్దలు ఠక్కున ఓటేశారు. 38 ఏళ్ల జహీర్ ఖాన్ 92 టెస్టు మ్యాచ్ లలో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. 200 వన్డే మ్యాచ్ లు ఆడిన జహీర్ 282 వికెట్లను పడగొట్టాడు. టెస్టుల్లో 311 వికెట్లను కూలగొట్టాడు. ప్రస్తుతం ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కెప్టెన్, బౌలింగ్ కోచ్ గా జహీర్ నేతృత్వం వహిస్తున్నాడు.  అయితే అదే సమయంలో రవిశాస్త్రి అధికారాలను క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఏవిధంగా పరిమితి విధిస్తుందంటూ కామెంటేటర్ హర్ష భోగ్లా ట్విట్ చేయడం విశేషం. విదేశీ పర్యటనల్లో బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ ఉంటే... రవిశాస్త్రి టీం డైరెక్టర్ బాధ్యతలు తప్ప చేయడానికి ఏమీ ఉండదన్న అభిప్రాయాన్ని భోగ్లే వ్యక్తం చేశాడు.  ఇదే అభిప్రాయాన్ని మరికొంత మంది నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు.  అయితే... జహీర్ ఎంపికకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ... ప్రస్తుతం భారత్ జట్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్లందరికీ... ఎంతగానో ఉపయోగపడతాడంటూ... వ్యాఖ్యానించడం విశేషం. గత రెండేళ్లుగా జహీర్ ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నట్టుగా కితాబిచ్చాడు.
గతంలో భారత్ జట్టు డైరెక్టర్ గా కొనసాగుతున్న సమయంలో...  కోచ్ గా ఎంపిక కావాలన్న కృతనిశ్చయంతో ఉన్న రవిశాస్త్రి ఆశలపై క్రికెట్ అడ్వైజరీ కమిటీ నీళ్లు చల్లింది. అదే సమయంలో భారత్ జట్టుకు సుధీర్ఘకాలం కుంబ్లే కోచ్ గా ఎంపికవుతాడని భావిస్తున్న తరుణంలో... జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండు యాధృచ్ఛికమే అనుకోవాలి. గతంలో ఇంటర్వ్యూకు హాజరు కాలేదని శాస్త్రి విషయంలో గంగూలీ వీటో చెప్పాడు. రవిశాస్త్రి కోచ్ కావాలన్న కృతనిశ్చయం లేదని... నాన్ సీరియస్ మనిషంటూ నిప్పులు చెరిగాడు. బ్యాంకాక్ లో వేసవి విడిదిలో ఉన్న రవిశాస్త్రి నాడు హాజరు కాకపోవడం కూడా సంచలనం సృష్టించింది. అయితే కుంబ్లే, కోహ్లీ మధ్య మనస్పర్థలు అంతకంతకూ ఎక్కువవుతుండటంతో... మళ్లీ తెరపైకి రవిశాస్త్రి వచ్చేశాడు. జట్టు కోచ్ విషయంలో కుంబ్లేను కూడా దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరగా... కోచ్ రేసులో కుంబ్లే కూడా నిలిచాడు. అయితే ముందుగా కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు చేయలేదు. ఓవైపు కుంబ్లే, కోహ్లీ మధ్య వివాదం, కోచ్ దరఖాస్తుకు సమయం పెంచడంతో రంగంలోకి  శాస్త్రి దిగాడు.
ఆటగాళ్లు ఆడింద ఆట... పాడింది పాట కావాలంటే... జట్టుకు రవిశాస్త్రే కరెక్టన్న అభిప్రాయం విన్పించింది. శాస్త్రి పలు వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా... కెప్టెన్ గాను మంచి గుర్తింపే ఉంది. మాజీ కెప్టెన్ ధోనీతోనూ,  కోహ్లీతో రవిశాస్త్రికి ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా అడ్వాంటేజ్ గా చెప్పుకోవాలి.

కోచ్ ఎంపిక విషయంలో నాటకీయ పరిణామాలెన్నో చేటుచేసుకున్నాయ్. భిన్న వర్గాలుగా ఉన్న ఇద్దరు ఒకే నిర్ణయం తీసుకోవడం ఎప్పుడూ సాధ్యం కాదు.... అయితే గంగూలీని దారిలోకి తెచ్చేందుకు కోహ్లీ వాడిన బాణం సచిన్ టెండుల్కర్...  కోచ్ ఎంపిక ఎంతో అనూహ్యంగా జరిగింది. హెడ్ కోచ్ కు తోడు తోక కోచ్ ల అంశంపై ఇప్పుడు క్రీడావర్గాల్లో ఆసక్తికర చర్చ జరగుతోంది.
ఉత్కంఠ డ్రామా తర్వాత కోచ్ గా రవి శాస్త్రి ఎంపికపై భారత్ జట్టు మాజీ ఆటగాళ్లు అభినందనలు తెలిపారు.  ట్రేజర్ బుల్లెట్ అంటూ రవిశాస్త్రికి అభినందనలు వెల్లువెత్తాయ్. కోచ్ గా రవిశాస్త్రి తొలి విదేశీ పర్యటన శ్రీలంకతో ఆటబోతోంది. మూడు టెస్టు మ్యాచులు, ఐదు వన్డే మ్యాచులతోపాటు, ఒక ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లతో జులై 26 నుంచి ప్రారంభం కాబోతోంది.  జహీర్ ను టీం బౌలింగ్ కోచ్ గా నియమించడం తనకు సంతోషాన్నిచ్చిందని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. తాజా బాధ్యతల్లో విజయంసాధించాలని కోరుకుంటున్నానన్నాడు. ఆల్ రౌండర్ సురేష్ రైనా సైతం జహీర్, రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ కు అభినందనలు తెలిపాడు. ముగ్గురి నేతృత్వంలో టీం ఇండియా మంచి ఫలితాలు రాబడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అదే సమయంలో కుంబ్లేకు జహీర్ ఖాన్, ద్రవిడ్ అవసరం లేకపోయిందని... రవిశాస్త్రికి మాత్రం ఇద్దరి అవసరం ఉందంటూ శిషిర్ హట్టాంగ్డే పేర్కొన్నాడు. ఇక జహీర్ ను బౌలింగ్ కోచ్ గా నియమించడం అద్భుతమంటూ మాజీ భారత్ జట్టు బ్యాట్సమెన్ మహ్మద్ ఖైప్ అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి నేతృత్వంలో టీం పనితీరు మెరుగవ్వాలని కోరుకుంటున్నట్టుగా చెప్పాడు. ఇకనైనా టీం సభ్యులు క్రికెట్ పై ఫోకస్ పెట్టాలని చురకలంటించాడు.
టీం ఇండియాకు త్రిమూర్తులు కలయిక బలాన్నిస్తుందని రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ అసోసియేషన్ సైతం రవిశాస్త్రి, జహీర్ కు  అభినందనలు తెలియజేసింది. 2005 నుంచి టీం ఇండియా కోచ్ గా ఎంపిక కావాలని ప్రయత్నిస్తున్న టామ్ మూడీ నిరీక్షణకు తెరపడలేదన్న అభిప్రాయాన్ని క్రికెట్ ప్రియులు వ్యక్తం చేశారు.  టీం ఇండియా ప్రధాన కోచ్‌ ఎవరవుతారన్న ఉత్కంఠ నెలకొన్నప్పటికీ... బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ ఎంపిక అనూహ్య పరిణామంపై క్రీడాభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. భారతదేశానికి సేవలందించిన అత్యుత్తమ బౌలర్లలో జహీర్ కు మంచి పేరుంది. పదునైన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించాడు. ధోని నాయకత్వంలో భారత్ జట్టు టెస్టు జట్టుల్లో నెంబర్ 1 కావడంలో జహీర్ పాత్ర కీలకమైనది. జహీర్ తాను బౌలింగ్ లో రాటుదేలుతున్న సమయంలో జట్టులోని సహచర బౌలర్లకు మార్గనిర్దేశం చేసేవాడు. అయితే గాయాల కారణంగా... జట్టుకు కీలక సమయంలో నాయకత్వం వహించలేకపోయాడు జహీర్.
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా కెరీర్ ప్రారంభించిన రవిశాస్త్రి అనతికాలంలోనే జట్టుకు ఆల్ రౌండర్ గా విశేష సేవలందించాడు. 1981 లో న్యూజీలాండ్ తో టెస్టుల సందర్భంగా జట్టులోకి ప్రవేశించాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంలో జోష్ చూపించే శాస్త్రి, ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోవడంలో మాత్రం తడబడేవాడు. రవిశాస్త్రి ఆటగాడిగా, టీం ఇండియా కెప్టెన్ గా అద్భుత  ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. 151 టెస్టు మ్యాచ్ లు ఆడిన శాస్త్రి 3830 పరుగులు చేశాడు. టెస్టుల్లో 35.79 సగటు కలిగి ఉన్నాడు. ఆ రోజుల్లో టీం ఇండియాకు కొరతగా ఉన్న ఆల్ రౌండర్ల సమస్యను కొంత వరకు శాస్త్రి తీర్చాడని చెప్పవచ్చు. 150 వన్డే మ్యాచులలో ఆడిన శాస్త్రి మొత్తం 3108 పరుగులు సాధించాడు. 129 వికెట్లను కూల్చాడు. వన్డేల్లో శాస్త్రి సగటు 36.4గా ఉంది. టెస్టు మ్యాచుల ప్రారంభంలో 10 నెంబర్ ఆటగాడిగా బరిలో దిగేవాడు.
1985 ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్ లో శాస్త్రి తొలిసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీరిస్ లో 182 పరుగులు సాధించిన శాస్త్రి, 8 వికెట్లను కూల్చి... అద్భుత ప్రదర్శనకు గాను ఆడి గార్ ను అందుకున్నాడు. 1984-85 రంజీ సీజన్లో ముంబయ్ తరపున ఆడిన శాస్త్రి ఢిల్లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 91 పరుగులకు 8 వికెట్లు కూల్చి రికార్డు సృష్చించాడు. చాలా కెప్టెన్ల వద్ద డిప్యూటీగా పనిచేసిన శాస్త్రి  1987-88లో తొలిసారిగా వెస్టిండీస్ పై మద్రాస్ లో జరిగిన మ్యాచ్ లో జట్టును విజేతగా నిలిపాడు. క్రికెటర్ గా స్వార్థపరుడన్న అభిప్రాయం చాలా మంది రవిశాస్త్రి గురించి విన్పించేవారు. ఎవరైనా జిడ్డు ఆడాలంటే అది రవిశాస్త్రి తర్వాతేనన్న అభిప్రాయం దేశంలో నెలకొంది. అయితే ఆ తర్వాత రోజుల్లో హార్డ్ హిట్టింగ్ విషయంలోనూ కొంత విజయం సాధించాడని చెప్పవచ్చు. మొకాలి నెప్పితో జట్టు నుంచి రవిశాస్త్రి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. 1992లో 30 ఏళ్ల వయసులోనే క్రికెట్ కు శాస్త్రి గుడ్ బై చెప్పాడు.
అయితే జట్టుకు గుడ్ బై చెప్పిన రవిశాస్త్రి, క్రికెట్ పై ఉన్న మమకారంతో కామెంటేటర్ గా విశేష గుర్తింపు పొందాడు. 2007లో రవిశాస్త్రిని తాత్కాలిక టీం ఇండియా కోచ్ గా బీసీసీఐ నియమించింది. గ్రెగ్ చాపెల్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో రవిశాస్త్రి కొంతకాలం కోచ్ గా సేవలందించాడు. 2014లో టీం ఇండియా డైరెక్టర్ గా మళ్లీ జట్టులోకి వచ్చాడు. 2016 ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసే వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగాడు.  
డంకన్‌ ఫ్లెచర్‌ ప్రధాన కోచ్‌గా ఉండగానే 2014 నుంచి 2016 వరకు టీమ్‌డైరెక్టర్‌గా వ్యవహరించిన శాస్త్రి... ఆటగాళ్ల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆటగాళ్లకు ఫ్రీడమ్ ఇవ్వడం... వారితో కరుగా మాట్లాడటం కూడా శాస్త్రికి తాజాగా కోచ్ ఎంపికలో కలిసొచ్చిందని చెప్పవచ్చు. రవిశాస్త్రి బాధ్యతల నుంచి పారిపోడని, విమర్శలకు వెరవడు, మాతో ఉంటే... మాలో ఉత్సాహం ఉంటుందంటూ కోహ్లీ... రవిశాస్త్రి గురించి అనేకమార్లు  చెప్పాడు కూడా.
ఊహాగానాలకు, ఉత్కంఠకు తెరదించుతూ టీం ఇండియా కోచ్‌ రేసులో చివరికి రవిశాస్త్రే గెలిచాడు. గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ...  కుంబ్లే స్థానంలో అతణ్ని ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. జట్టు డైరెక్టర్‌గా పనిచేసిన శాస్త్రికి ఆటగాళ్లతో మంచి సమన్వయం ఉంది. గంగూలీ మొత్తం వ్యవహారాన్ని కొంత పెండింగ్ లో ఉంచడంతో...  వినోద్‌ రాయ్‌ నేతృత్వంలోని బీసీసీఐ పరిపాలకుల కమిటీ రంగంలో దిగి...  కోహ్లీతో మాట్లాడి కొత్త కోచ్‌ తక్షణం ప్రకటించాలని కోరింది. సెహ్వాగ్‌ గట్టిపోటీ దారుగా నిలిచినా చివరికి శాస్త్రికే పదవి దక్కింది. సీఏసీ శాస్త్రి, వీరూలతో పాటు టామ్‌ మూడీ, రిచర్డ్‌ పైబస్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను కూడా ఇంటర్వ్యూ చేసింది. 2019 ప్రపంచకప్‌ వరకు కొత్త కోచ్‌లు పదవుల్లో ఉంటారు.  ద్రవిడ్‌ కొన్ని నిర్దేశిత విదేశీ పర్యటనలకు బ్యాటింగ్‌ సలహాదారుగా పని చేస్తాడు.
కొత్త కోచ్‌ నియామకంపై సీఏసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై ఇంకా చర్చిస్తోంది. అందరి లాగే మాకు కూడా కొత్త కోచ్‌ ఎవరో తెలుసుకోవాలనుంది. తప్పుడు సమాచారం ఇవ్వొద్దంటూ... అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి చెప్పడం... మీడియా కథనాల్లో నిజం లేదని చెప్పిన కొద్దిసేపటికే... కోచ్ ఎంపిక విషయంలో మీడియా వార్తలే నిజమయ్యాయ్. క్రికెట్‌ సలహా కమిటీ సిఫారసు మేరకే రెండేళ్ల కాలానికి, అంటే 2019 వరకు రవిశాస్త్రిని ప్రధాన కోచ్‌గా, జహీర్‌ ఖాన్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించాం. భారత జట్టు విదేశీ పర్యటనలకు.. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలకు వెళ్లినపుడు ద్రవిడ్‌ బ్యాటింగ్‌ సలహాదారుగా వ్యవహరిస్తాడని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా పేర్కొన్నారు.
రాహుల్‌ ద్రవిడ్‌ను విదేశీ పర్యటనల కోసం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ సలహాదారుగా నియమించారన్న సమాచారం బయటికి రాగానే.. ప్రస్తుతం బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న బంగర్‌పై వేటు పడినట్లే అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ బంగర్‌ను ఆ పదవిలో కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది.  ద్రవిడ్ కేవలం కీలకమైన విదేశీ పర్యటనలకు మాత్రమే అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చింది.
జట్టుకు కోచ్ ప్రాధాన్యత 1990లకు ముందు పెద్దగా లేదనే చెప్పాలి. కోచ్ లేకుండానే భారత్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకొంది. అయితే 1990 తర్వాత క్రికెట్ లో పెరిగిన వేగాన్ని అందుకునేందుకు క్రికెట్ దేశాలన్నీ కోచ్ అస్త్రాన్ని వదలాయ్. భారత్ సైతం అంతకు ముందు టీం మేనేజర్ తో సరిపెట్టేది. అయితే 1990లో తొలిసారిగా బిషన్ సింగ్ బేడీని కోచ్ గా బీసీసీఐ ప్రకటించింది. మొదట్లో జట్టుకు కోచ్ లేకుండానే రంగంలోకి దిగిన భారత్ జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తరహాలో కోచ్ నియామకానికి పచ్చజెండా ఊపింది. జట్టులో ఉత్తేజాన్ని నింపి విజయాలు సాధించేందుకు కోచ్ కీలకమన్న అభిప్రాయానికి బోర్డు వచ్చింది. తొలుత స్వదేశీ కోచ్ కు జై కొట్టిన బీసీసీఐ 2 వేలు సంవత్సరం తర్వాత విదేశీ కోచ్ ఎక్సెపిరిమెంట్లు చేసింది. భారత్ జట్టుకు ఇప్పటి వరకు 15 మంది కోచ్ లుగా బాధ్యలు నిర్వర్తించారు.  అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో 1926 మే 31న భారత్ గుర్తింపు పొందగా... టెస్టు జట్టులోకి వచ్చింది 25 జూన్ 1932. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఏడు టెస్టు మ్యాచ్ లలో పాల్గొన్నప్పటికీ...  స్వాతంత్ర్యం వచ్చాక ఆస్ట్రేలియాతో భారత్ జట్టు తొలిసారిగా 1947-49లో ఆడిన మ్యాచ్ ల నుంచే ఆడిన ఆటకే ప్రాధాన్యత సంతరించుకొంది. 1983లో భారత్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకున్న తర్వాత క్రికెట్ ప్రపంచంలో భారత్ ధ్రువతారగా ఆవిర్భవించింది. తొలుత భారత్ జట్టుకు మేనేజర్ మాత్రమే ఉండేవాడు. అయితే కోచ్ వేట 1991 తర్వాత మొదలైంది. 1990లో తొలిసారిగా భారత్ జట్టు కోచ్ గా బిషన్ సింగ్ బేడీ నేతృత్వం వహించారు. ఆ తర్వాత  అబ్బాస్ అలీ బేగ్  1991-92 కాలంలో కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత భారత్ జట్టుకు కోచ్ గా అజిత్ వాడేకర్ వ్యవహరించాడు. ఆయన సుదీర్ఘకాలం పాటు కోచ్ గా వ్యవహరించాడు. 1992-96 మధ్య నాలుగేళ్ల పాటు కోచ్ గా కొనసాగాడు. ఆ తర్వాత సందీప్ పాటిల్ ఏడాది మాత్రమే బాధ్యతలు నిర్వర్తించాడు. పాటిల్ తర్వాత అన్షుమన్ గౌక్వాడ్ 1997-99, 2000 సంవత్సరాల్లో కోచ్ గా వ్యవహరించాడు.
భారత్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కోచ్ గా నియమించినప్పటికీ... ఆయన స్వల్ప కాలమే కోచ్ గా కొనసాగాడు.  ఆ తర్వాత న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ జాన్ రైట్ 2000 నుంచి 2005 వరకు చాన్నాళ్లు కొచ్ గా జట్టుకు సేవలందించాడు. తొలి విదేశీ కోచ్ గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కోచ్ గా వివాదాస్పదమయ్యాడు. 2005-07 మధ్య కాలంలో జట్టుకు నేతృత్వం వహించిన చాపెల్, గంగూలీ మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గమంది. ఆ తర్వాత కాలంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ గారీ కిరస్టన్ కోచ్ గా భారత్ కు చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. 1983 తర్వాత భారత్ జట్టు మరోసారి వరల్డ్ కప్ గెలవడం, ట్వంటీ 20ల్లోనూ విజయం సాధించడం విశేషం. కిరస్టన్ సలహా మేరకు డంకన్ ఫ్లెచర్ ను నాడు బీసీసీఐ కోచ్ గా కొనసాగించింది. ఆయన 2011-15 వరకు నాలుగేళ్ల పాటు కోచ్ గా సేవలందించాడు. ఆ తర్వాత రవిశాస్త్రి టీం డైరెక్టర్ గా రెండేళ్లు కొనసాగాడు. ఆ తర్వాత కోచ్ గా కుంబ్లే రంగ ప్రవేశం చేసి భారత్ జట్టును అటు టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ శిఖరాగ్రాన కూర్చోబెట్టాడు. అయితే కోచ్, కెప్టెన్ లొల్లితో... కుంబ్లే పదవికి గుడ్ బై చెప్పగా... మరోసారి రవిశాస్త్రికి జట్టుకు నేతృత్వం వహించే ఛాన్స్ ద్కకింది. ఒక్కటి మాత్రం స్పష్టం. మోడర్న్ క్రికెట్లో కోచ్ ప్రాధాన్యత పెరిగింది. అది టెస్టు మ్యాచులలో కానీవ్వండి, 50 ఓవర్ల అంతర్జాతీయ మ్యాచులకు సంబంధించి గానీ, ట్వంటీ 20 మ్యాచులకు గానివ్వండి. కోచ్ ప్రాధాన్యతలో దూసుకుపోతున్నాడు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా... కోచ్ తో కలిసి ఆయా బోర్డులు తీసుకోవాల్సిన వచ్చింది. బీసీసీఐ కూడా అదే విధంగా వ్యవహరిస్తూ వచ్చింది.  కోచ్ రాకతో క్రికెట్లో అప్పటి వరకు ఉన్న పాత పద్ధతుల స్థానంలో కొత్త పద్ధతులొచ్చాయ్. క్రికెట్లో దూకుడు అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. కొన్ని సార్లు కోచ్ లు కేక అంటూ దూసుకుపుతుంటే... మరికొన్ని సార్లు... కోచ్ ల వల్లే ఓటమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయ్. అదే పంథాలో కోచ్ లకు, కెప్టెన్లకు, జట్టు సభ్యులకు మధ్య విభేదాలు పొడచూపుతున్నాయ్. ఇవన్నీ వైఫల్యాలు ఎక్కువైనప్పుడు బయటకు వచ్చేవి. అయితే కుంబ్లే భారత్ జట్టు కోచ్ గా అద్భుత విజయాలను సొంతం చేసుకున్నప్పటికీ... ఆయన ఆటగాళ్లతో అనకువగా వ్యవహరించలేదంటూ వివాదం రేగింది.

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సీట్లు పెరిగేనా?

సీట్లు పాట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సీట్ల పెంపు హాట్ టాపిక్. సీట్లను పెంచుకొని... బలాన్ని రెండింతలు చేసుకోవాలని చంద్రులిద్దరూ తలపోస్తున్నారు. అయితే నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం రేపు రేపంటూ వాయిదా వేస్తోంది. అయితే తాజా పార్లమెంట్ సెషన్లో బిల్లును ప్రవేశపెడ్తామంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సీట్ల పెంపుతో రెండు రాష్ట్రాల్లో పాతుకుపోవాలని... రాజకీయ ప్రత్యర్థిల్ని చీల్చిచెండాడొచ్చని... చంద్ర ద్వయం ప్రణాళికలు రూపొందించుకొంది. అందుకే అన్నింటా మద్దతిస్తున్నా... మా అభ్యర్థన ఎందుకు పట్టించుకోరంటూ కేంద్రానికి మొరపెట్టుకుంటోంది. అయితే రెండు రాష్ట్రాల్లోని విపక్షాలు... సీట్ల పెంపు నిబంధనల ప్రకారమే జరగాలంటూ స్పష్టం చేస్తున్నాయ్. బిల్లును అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెబుతుంటే... ఇద్దరు చంద్రల్లో గుబులు రేగుతోంది. సీట్ల పెంపు అంశంలో ఎవరి వాదనేంటి? ఏం జరిగే అవకాశముంది...  మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశముందన్న దానిపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్.
రెండు తెలుగు రాష్ట్రాల్లో  నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇద్దరు చంద్రులకు ప్రతిష్టాత్మకంగా మారింది. సీట్లను పెంచుకొని రాజకీయంగా బలపడి పరపతి పెంచుకోవాలని చూస్తున్న చంద్రుల ఆలోచలపై కేంద్రం ఏం చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇద్దరు చంద్రులకు లాభం కలిగే నిర్ణయానికి జై కొట్టడమా...  రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు జరిగే చర్యలకు జై కొట్టడమా ఏదో తేల్చుకోవాలన్న ఉద్దేశంలో బీజేపీ పెద్దలున్నట్టుగా తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన తక్షణం జరిగేలా ఏపీ, తెలంగాణ సీఎంలు కార్యాచరణను వేగవంతం చేశారు. ఎట్టిస్థితుల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరాలని ఇద్దరు చంద్రులు పట్టుబడుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత పార్టీలను బలోపేతం చేసుకునేందుకు ఇద్దరు చంద్రులు వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరికి ఇద్దరు నేతలు  ఇప్పుడు ఒకే  పార్టీలో కొనసాగుతున్న దరిమిలా... ఎమ్మెల్యే స్థానాల పెంపు ఒక్కటే తమకు శ్రీరామరక్ష అని రెండు పార్టీలు భావిస్తున్నాయ్. దీనికి సంబంధించి చంద్రబాబునాయుడు పలుసార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ సీట్ల పెంపు జరగుతుందని... వచ్చే 20 ఏళ్లు తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందన్న సంకేతాలను సీఎం చంద్రబాబు ఇచ్చారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కొంచెం అనుమానంతో ఉన్నట్టుగా కన్పి్స్తోంది. స్థానాల సంఖ్య పెరగాల్సిందేనని కృతనిశ్చయంతో ఉన్న కేసీఆర్... ఢిల్లీ పెద్దలను కలిసిన ప్రతి సందర్భంలోనూ...సీట్ల పెంపు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కేంద్రానికి తమ వైపు నుంచి అన్ని విధాలుగా సహకరిస్తున్నామని... సీట్ల పెంపు విషయంలో సహకరించాలని కేసీఆర్... బీజేపీ పెద్దలకు పలుసార్లు విజ్ఞప్తి చేశారు. అయితే కలిసిన ప్రతీసారి సీట్లను పెంచుతున్నామని చెబుతున్న బీజేపీ నేతలు... ఆ విషయంలో వంద శాతం క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.
బీజేపీ పెద్దల ఉద్దేశం ఒకటే కన్పిస్తోంది. తాము దేశానికి ఉపయోగపడే అంశాల విషయాల్లో టీఆర్ఎస్ పార్టీగానీ, టీడీపీగానీ సహకరిస్తున్నాయని గానీ... తమకు, పార్టీకి లబ్ధి చేకూర్చే ఒక్క విషయంలోనూ సమర్థించడం లేదు కదా అన్న ఫీలింగ్ లో బీజేపీ పెద్దలు ఉన్నారు. ఢిల్లీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి బీజేపీ పెద్దలు తాజాగా చర్చించారు. సీట్ల పెంపు జరిగితే... మనకు వచ్చే లాభమేంటన్న అభిప్రాయాన్ని... బీజేపీలో సీట్ల పెంపు కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్న నేతను...  పార్టీ కీలక నేతలు అడిగినట్టు సమాచారం. పార్టీకి ఉపయోగం ఉండాలన్నదే బీజేపీ పెద్దల అంతరంగం. రాజకీయ పరమైన విషయమని... ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలన్నది వారి ఉద్దేశంగా కన్పిస్తోంది. అయితే సదరు బీజేపీ నేత మాత్రం... ఇద్దరు చంద్రులు మనకు ఎంతగానో సహకరిస్తున్నారు... వారు నిధుల గురించి, పథకాల గురించి అడగడం లేదు కదా... సీట్ల పెంపు గురించే కదా... ఇది చేస్తే మనకు వచ్చే ఇబ్బందేముందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు వల్ల బీజేపీకి అంతిమంగా ఏదైనా లాభం ఉందా... లేదా అన్న కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఆ చర్చలో వచ్చిన అభిప్రాయమేమంటే... సీట్ల పెంపు వల్ల ఎక్కువ శాతం ఉపయోగం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమైంది. లాభం కంటే నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉందన్న వర్షన్ ప్రముఖంగా విన్పించింది.
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతికూలత వ్యక్తమవుతుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ఆ విషయాన్ని బీజేపీ లైట్ గా తీసుకుంటున్న సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఏపీలో దుకాణం మూసేసిన నేపథ్యంలో... వారు చేయడానికి ఏమీ ఉండదన్న అభిప్రాయాన్ని బీజేపీ స్థానిక నేతలు వ్యక్తం చేస్తున్నారు.  బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ సహకరించినా... సహకరించకపోయినా... నష్టం లేదు... పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ భావిస్తోంది.  ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో...  బీజేపీ  పరిస్థితి కూడా అంతే. ఇద్దరికీ ఏపీలో పెద్దగా స్టేక్స్ లేవు. కాకుంటే... బీజేపీకి ఢిల్లీలో ఉన్న బలం కలిసొచ్చే పరిణామం. నాడు  ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట బీజేపీ పెడచెవిన పెట్టిందని... హోదా వస్తే ఆంధ్రులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఏపీలో స్టేక్స్ ఎంత మాత్రం ఉండవని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్టీ నేతలు ఎక్కడ అవకాశముంటే ఆ పార్టీలోకి ఫిరాయించక తప్పని పరిస్థితి. అలాంటివాళ్లందరికీ...సీట్ల పెంపు వల్ల ఎక్కడో చోట అవకాశం వస్తుంది. అలాంటి వారందరికీ మనం మేలు చేయడమేంటన్న భావన కూడా బీజేపీ వర్గాల్లో ఉంది. మోదీ అభివృద్ధి నినాదం ముందు మరే విషయాలు కూడా కన్పించవని... ఆంద్రప్రదేశ్ అభివృద్ధిలో తమ పాత్ర కీలకమని బీజేపీ భావిస్తోంది. ఎయిర్ పోర్టుల ఆధునికరణ అంత తమ వల్లే జరిగిందని... గతంలో శంషాబాద్ మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయమైతే... ఇప్పుడు విజయవాడ, తిరుపతి, వైజాగ్ మూడు చోట్ల పగలు, రాత్రులు విమానాలు తిరుగుతున్నాయని... అంతర్జాతీయ విమానాల రాకపోకలతో కళకళలాడుతున్నాయని... బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు.
రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు జరిగితే... అది ప్రజలకు ఎంత మాత్రం లాభం చేకూర్చదని... దాని వల్ల ఇద్దరు చంద్రులకే లాభం జరుగుతుందన్న బెంగ కూడా బీజేపీ పెద్దల్లో ఉంది. పైపెచ్చు. సీట్ల పెంపుదలకు సంబంధించి ఆర్ఎస్ఎస్ పెద్దలు సైతం... నిబంధనల ప్రకారం వెళ్లాలని... అనవసర తలనొప్పులు ఎందుకన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగాకూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఢిల్లీ లాబీయింగ్ లో కీలకంగా ఉన్న ఇద్దరు చంద్రులు ఏదైనా అనూహ్య పరిణామాల నేపథ్యంలో సీట్ల పెంపు ప్రతిపాదకు గ్రీన్ సిగ్నల్ వేయించుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా విన్పిస్తోంది. లోక్ సభకు సాధారణ ఎన్నికలు   2018 నవంబర్ లో వస్తాయన్న హింట్స్ ను కొంత మంది బీజేపీ నేతలు ఇస్తున్నారు. అలాంటి సమయంలో హడావుడి నిర్ణయాలు ఎందుకు... 2023లో చూసుకోవచ్చు కదా... అన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. సీట్ల పెంపుదలకు సంబంధించి ఏపీ సీఎం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. సీట్ల పెంపు జరిగి తీరుతుందని... పార్టీ నేతలు మరింత కష్టపడాలని అనేక సమావేశాల్లో పార్టీ నేతలను ఉద్దేశించి బాబు చెప్తూ వస్తున్నారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా జరిగి తీరుతుందని... పార్టీ నేతలు అందుకు సిద్ధంగా ఉండాలని బాబు స్పష్టం చేశారు.  పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో..... టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించుకుందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశముందని బాబు నేతలకు వివరించారు.  దీంతో రాష్ట్రశాసనసభ స్థానాలు 225కి పెరుగుతాయన్నారు.  గతంలో అనుకున్నట్లుగా దీని కోసం రాజ్యాంగ సవరణ అవసరం లేదని, పార్లమెంటు అనుమతితో ఒక ఉత్తర్వు తీసుకొస్తే సరిపోతుందని ఈ సందర్భంగా  సుజనా చౌదరి చెప్పడం విశేషం.  జిల్లాతో సంబంధం లేకుండా... లోక్‌సభ నియోజకవర్గాల వారీగా... రెండేసి సీట్లను పెంచుతారు. ఇప్పటికే ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి 7 అసెంబ్లీ స్థానాలుండగా...  9 సీట్లుగా పెరుగుతాయని పార్టీ ఆశాభావంతో ఉంది.
జూలై 17వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టేందుకు పావులు కదపాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. నియోజకవర్గాల పెంపు బిల్లుకు సంబంధించి కేబినెట్‌ నోట్‌ను న్యాయవిభాగం ఇప్పటికే సిద్ధం చేసినట్లు, పీఎంవో ఆదేశాల కోసం కేంద్ర హోంశాఖ ఎదురుచూస్తున్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రస్తావించారు. సీట్ల పెంపుపై కేంద్రానికి ప్రతిసారీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఏదో ఒక సాంకేతిక కారణం చూపి వాయిదా వేస్తున్నారని, వర్షాకాల సమావేశాల్లో వచ్చేందుకు తమ తరఫు నుంచి ప్రయత్నిస్తామని చంద్రబాబు.. కేసీఆర్‌కు చెప్పినట్లు తెలిసింది. ప్రధాని మోదీని కలిసినప్పుడు సీట్ల పెంపు అంశాన్ని మరోసారి ప్రస్తావించాలని కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం. గత నెల 23న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.
అదే సమయంలో...  టీఆర్‌ఎస్‌ ఎంపీల ద్వారా సీట్ల పెంపు బిల్లు గురించి సీఎం కేసీఆర్...  హోంమంత్రి రాజ్‌నాథ్‌తో  ప్రస్తావించాలంటూ పార్టీ నేతలకు సూచించారు. వర్షాకాల సమావేశాల్లో బిల్లుకు ఆమోద ముద్ర పడకపోతే 2019 ఎన్నికలలోపు పునర్విభజన ప్రక్రియ ముగియడం కష్టమేనని ఎన్నికల కమిషన్‌ వర్గాలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అడుగులు వేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు.  నియోజకవర్గాల పునర్విభజన అంశం పార్లమెంటు సమావేశాల్లోనే అటో.. ఇటో తేలిపోతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడుతున్నరు. సీట్ల నిర్ణయాన్ని బట్టే... ఎన్నికల ప్రణాళిక ఉంటుందని నేతలుక ఆయన స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారం లోక్‌సభ, శాసనసభ సాధారణ ఎన్నికలు 2019లో జరగాల్సి ఉన్నా... ఎప్పుడొస్తాయన్నదానిపై క్లారిటీ లేదన్న భావనను సీఎం కేసీఆర్ విన్పించినట్టుగా తెలుస్తోంది. పునర్విభజన జరగాలంటే... ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టి ఉండాల్సిందని... అడుగు ముందుకు పడటం వల్ల క్లారిటీ మిస్సవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. తనకు ఉన్న సంకేతాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జూలైలో మొదలవుతుందని ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి భేషరతుగా మద్దతు తెలిపిన వైసీపీ నేతలు మాత్రం సీట్ల పెంపు జరగదని ధీమాగా ఉన్నారు. సీట్ల పెంపును వాయిదా వేయాల్సిందిగా తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారని, ప్రధాని హామీ మేరకే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ ఎన్డీఏకు బేషరతు మద్దతు ప్రకటించిందని చెబుతున్నారు.  రాజ్యాంగ సవరణ అవసరమైన నియోజకవర్గాల పెంపు అంశాన్ని రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ అసలు పట్టించుకొనే పరిస్థితే లేదని పరిశీలకులు చెబుతున్నారు.  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల పెంపును అక్కడి బీజేపీ రాష్ట్ర నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ అందుకు సుముఖంగా లేదు. తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా మారుతుందని, బీజేపీకి తీవ్ర నష్టం చేస్తుందని ఆ పార్టీ నేతలు అధిష్టానానికి విన్నవించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా ఇతర పార్టీలనుంచి అనేకమందిని టీఆర్‌ఎస్‌ తన పార్టీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేందుకు హామీ ఇచ్చి ఉందని, నియోజకవర్గాల పెంపుతో అదనంగా వచ్చే స్థానాల్లో వారందరికీ అవకాశం కల్పించాలన్నది టీఆర్‌ఎస్‌ ఉద్దేశమని అధిష్టానానికి వివరించారు. పెంపు టీఆర్‌ఎస్‌కు అనుకూలిస్తుందని, అదే సమయంలో నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాల్లో మార్పులు జరిగితే బీజేపీకి నష్టం కలుగుతుందని ఆ పార్టీ నేతలు స్పష్టంచేశారు.
నిబంధనల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగదన్న అభిప్రాయం స్పష్టంగా కన్పిస్తోంది. కేంద్ర మంత్రులు అనేకసార్లు పార్లమెంట్ సాక్షిగా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు ఎన్నో అడ్డుంకులు ఎదురవుతున్నాయన్న అభిప్రాయాన్ని కేంద్రం చెబుతూ వచ్చింది. అయితే అదే సమయంలో బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదింపజేయబోతున్నామంటూ కూడా తేల్చిచెబుతున్నాయ్. ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లను 225కు పెంచాలని, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 సీట్లను 153కు పెంచాలని చట్టంలో ఉంది. అయితే గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు, చేర్పులు చేయకుండా యూపీఏ సర్కారు సీలింగ్ పెట్టింది.  దీంతో విభజన చట్టంలో ఉన్న నియోజక వర్గాల పెంపు అమలుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. సీట్లను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని అటర్నీ జనరల్ కూడా కేంద్రానికి నివేదిక ఇచ్చారు. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని ఏజీ నివేదిక  ఇచ్చినా, మరికొందరు నిపుణలు వేరే మార్గాలను సూచిస్తున్నారు. అయితే తమవి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కాబట్టి రాజ్యాంగసవరణ చేయాల్సిన అవసరం లేదని తెలుగు రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి... గడిచిన రెండేళ్లలో పార్లమెంట్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలుమార్లు పార్లమెంటు వేదికగానే ప్రకటించింది. పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు ఇస్తూ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని పేర్కొంది.  వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి కేంద్ర హోంశాఖ పంపిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగంలోని 170 అధికరణను సవరించాల్సిందేనని అటార్నీ జనరల్‌ కూడా అభిప్రాయపడ్డారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహీర్‌ తెలియజేశారు. ఇదే అభిప్రాయాన్ని... టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కేంద్రం స్పష్టం చేసింది.  ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలంటే 170 (3) అధికరణకు సవరణలు చేయాల్సిందేనని, మరో దారి లేదని కేంద్రం తేల్చిచెప్పింది.  ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
అసెంబ్లీ సీట్ల పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ అందింది గానీ.. ఇప్పట్లో సీట్లు పెంచే అవకాశం ఏ రాష్ట్రంలోనూ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170 (3) అధికరణం ప్రకారం, 2026 జనాభా లెక్కలు వచ్చేంత వరకు ఏ రాష్ట్రంలోనూ అసెంబ్లీ సీట్లు పెంచడం సాధ్యం కాదని రాజ్యసభలో సభ్యుడు టి.జి.వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్ సమాధానమిచ్చారు. మరో సందర్భంలో టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్  లిఖిత పూర్వక  సమాధానమిచ్చారు. రాజ్యాంగపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం అటార్నీ జనరల్ వివరణ కోరగా, తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు కుదరదని కేంద్రానికి అటార్నీ జనరల్ నివేదిక ఇచ్చారు. నియోజక వర్గాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని అటార్నీ జనరల్ చెప్పారని వివరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 క్లాజ్‌ 3 ప్రకారం 2026 తరువాత అందుబాటులోకి వచ్చే మొదటి జనాభా లెక్కల ప్రకారం మాత్రమే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచగలమని, ఈ లోగా అసెంబ్లీ సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని అటార్నీ జనరల్‌ తన నివేదికలో స్పష్టం చేశారు. దీంతో... రాజ్యాంగ సవరణతో పని లేకుండా ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 26కు సవరణ చేస్తే సరిపోతుందని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మొదటి నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చాయ్. మరోవైపు  సీట్ల పెంపుపై కసరత్తు జరుగుతోందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో  బిల్లు పెడతామన్న అభిప్రాయాన్ని  హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ కూడా చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలని విభజన చట్టంలో ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ అంశం సంచలనం సృష్టించడంతో వెంటనే రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ రాజ్యాంగ సవరణ అవసరమన్నారని, అవసరం లేదని కొంత మంది నిపుణులు అంటున్నారని తెలిపారు. దీనిపై హోం, ఆర్థిక మంత్రులతో మాట్లాడినట్లు వెంకయ్య తెలిపారు. కేబినెట్ నోట్ తయారవుతోందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారని, న్యాయ విభాగం సలహా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణకు వెనుకాడబోమని వెంకయ్య స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. ఆ తర్వాత సీట్ల పెంపు గురించి ఆలోచించండి. ముందుగా ప్రత్యేక హోదాపైనా, రైల్వే బోర్డుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాకే... పార్లమెంట్లో సీట్ల పెంపు బిల్లు పెట్టాలంటూ కాంగ్రెస్ లింకు పెడుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో కలిసిన 17 రాజకీయ పార్టీలు సైతం పార్లమెంట్లో సీట్ల పెంపు బిల్లుకు వ్యతిరేకంగా వ్యవహరించే కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తోంది.
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లును రానున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఏపీ, తెలంగాణ సీఎంలు ఒత్తిడి పెంచుతుంటే.. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో సీట్ల పెంపును చేర్చిన కాంగ్రె స్‌ పార్టీ తన వైఖరి ప్రకటించింది.  ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌లాంటి ముఖ్యమైన హామీలను నెరవేర్చాకే సీట్ల పెంపు బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఏకపక్షంగా పార్లమెంటులో బిల్లు పెడితే వ్యతిరేకిస్తామని ఆ పార్టీ తేల్చి చెప్పింది. ఓవైపు  సీట్ల పెంపుకు సంబంధించి చంద్రబాబునాయుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా కన్పిస్తుంటే... కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతోంది.
ఈ బిల్లును అడ్డుకోవడానికి యుపీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు  ప్రతిపక్షాల మద్దతు కూడగట్టాలన్న వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రాజ్యసభలో సీట్ల పెంపును అడ్డుకోవాలని రఘువీరారెడ్డి చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓకే చెప్పారు.  యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్‌కు మద్దతునిస్తున్న 17 పార్టీలను సీట్ల పెంపు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయడానికి ఒప్పించగలిగితే రాజ్యసభలో బిల్లు వీగిపోతుందని రాహుల్‌కు రఘువీరా సూచించారు. లోక్‌సభలో బిల్లును పాసు చేయించుకోడానికి తగిన బలం ఉన్న ఎన్డీఏ పక్షాలకు...  రాజ్యసభలో మాత్రం ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ బలంగా విన్పిస్తోంది. బీజేపీ నేతలు సైతం ఇదే అభిప్రాయంలో ఉన్నారు. రాజ్యసభలో అధికార ఎన్డీయే కన్నా ప్రతిపక్షాల బలమే ఎక్కువ. అధికార పక్షానికి 77 మంది ఎంపీలుండగా, యూపీఏకి 84, ఇతర పార్టీల్లో  82 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌కోవింద్‌కు మద్దతునిస్తున్న పార్టీల బలబలాలను కలుపుకొంటే రాజ్యసభలో ఆ పక్షం బలం 118కి చేరుకుంటున్నప్పటికీ... యూపీఏ మిత్రపక్షాల బలం 125 దాకా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు బిల్లు పార్లమెంటు ముందుకొస్తే బీహార్‌, కేరళ, బెంగాల్  రాష్ట్రాల ఎంపీలు కూడా తమ రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు నిర్ణయం తీసుకోవాలంటూ...  డిమాండ్లను విన్పించే అవకాశం కూడా ఉందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయ్. దేశం మొత్తానికి అవసరమైన విషయాల్లో నిర్ణయం తీసుకోడానికి బీజేపీ సంకోచించదు. అయితే నియోజకవర్గాల సీట్ల పెంపు ఇష్యూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే సంబంధించినది. ఇలాంటి విషయంలో ఏకాభిప్రాయం ఉంటే అడుగు ముందుకు వేయడం వీజీకానీ... భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో అడుగు ముందుకు వేయడం సమంజసం కాదన్న అభిప్రాయం ఉంది. తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన విషయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంగీకరించే ప్రసక్తే లేదని చెబుతోంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీట్ల పెంపుదలకు ఒప్పుకునే పనిలేదని... రాజకీయ కప్పదాట్ల కోసం సీట్ల పెంపు చేస్తారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తోంది. అందుకే జగన్ ఎన్నికల కార్యాచరణ ప్రకటించి... పాదయాత్రకు సైతం సిద్ధమైపోతున్నారన్న అభిప్రాయం ఆ పార్టీ  వర్గాల నుంచి విన్పిస్తోంది. ఓవైపు ఇద్దరు చంద్రులు ఒత్తిడి తేస్తున్నా... వ్యతిరేకిస్తున్న వారు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో  ప్రధాని మోదీ సీట్ల పెంపు బిల్లును ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారన్న మీమాంసం కూడా రాజకీయా వర్గాల్లో ఉంది. అయితే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం సీట్ల పెంపు బిల్లును ఎలాగైనా సరే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి  తీరుతామని చెబుతున్నారు. కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలు ఇప్పటికే బిల్లును తయారుచేశాయని.. ఇక అడ్డంకులు తలెత్తబోవని భావిస్తున్నానన్నారు. విభజన బిల్లులో సీట్లపెంపును ప్రస్తావించిన కాంగ్రెస్‌ ఇప్పుడు అడ్డుకుంటామనడం విడ్డూరంగా ఉందన్నారు.
సీట్ల పెంపు ఇప్పుడు చంద్రులకు ప్రతిష్టాత్మకమైంది. పార్టీలోకి ఆహ్వానించిన నేతలకు ఎన్నికల్లో సీట్లిచ్చి గౌరవించుకోవాలని ఇద్దరు చంద్రులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే సీట్ల పెంపు బాల్ ఢిల్లీ కోర్టులో ఉంది. రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు జరిగితే కేంద్రానికి ఒనగూరేదేంటి... బిల్లుతో జనాలకు జరిగే మేలంటన్న అభిప్రాయంలో బీజేపీ పెద్దలున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బిల్లును అడ్డుకొని తీరుతామని తేల్చి చెబుతోంది. ఏపీలో ప్రతిపక్ష వైసీపీ...  సీట్ల పెంపుకు గ్రీన్ సిగ్నలివ్వడమంటే... కప్పదాట్లను బలపర్చడమేనంటోంది. తెలంగాణలో రెండు వైరి పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయ్. మరోవైపు ఇద్దరికీ ఆమోదయోగ్యమైన విషయంలో మనమెందుకు తాత్సారం చేయాలన్న అభిప్రాయం కూడా బీజేపీ నేతల్లో ఉంది. రెండు చోట్ల కూడా పార్టీ ప్రభావం తక్కువే కదా... ఇద్దరు నేతలు కేంద్రానికి మద్దతిస్తున్నప్పుడు మనమెందుకు అడ్డుకోవాలన్న అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే సీట్ల పెంపు విషయం మోదీ చేతుల్లో మాత్రమే ఉంది. ఆయన ఎస్ అంటే పాసవుతుంది... నో అనుకుంటే పెండింగ్ లో ఉంటుంది.