యాంకర్: అలంకారప్రియుడైన తిరుమల శ్రీ వేంకటశ్వర స్వామి
వారు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవుడని...భక్తకోటికి తెలిసిన విషయం....అయితే ఆ
బ్రహ్మండ తేజోమయుడికి అలంకరించే అభరణాలెన్ని, ఆ స్వామి పేరిట ఉన్న స్థిర..చర
ఆస్తులెన్ని.. అపర కుబేరుల నుండి సామాన్య భక్తుల వరకూ ఆ దేవదేవుడి నుండి అందే సహాయాలెన్నో
తెలుసుకోవాలని పిస్తోందా.. ఇక ఆలస్యం ఎందుకు వెంకన్న ఐశ్వర్యంపై స్పెషల్ స్టోరీ
చూడండి..
వాయిస్
ఓవర్ : ఏడు కోండలపై ఆనంద నిలయంలో కోలువైయున్న వేంకన్న కలియుగ ప్రత్యేక్ష దేవంగా
భక్త కోటిని కటాక్షిస్తున్న హైందవ దివ్య దామం తిరుమల క్షేత్రం...ఈ ఆధ్యాత్మిక క్షేత్ర వైభవాన్ని పోగ్గడానికి, అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి
వైభోగాన్ని కీర్తించడానికి పదాలు చాలవన్నది పురాణ ఇతిహాసాల మాట.. స్వామివారి సేవలో
తరంచిన ఎందరో పురుషులు, పుణ్యపురుషులు సైతం స్వామి వారి వైభవాన్ని తమ కీర్తనల్లోనూ, గంధ్రాల్లోనూ పోందుపరిచారు.. రోజుకోక్క
అలంకారంతో భక్తులను దర్శన భాగ్యం కల్పించే శ్రీనివాసుడి వెలకట్టలేని వజ్ర , వైడూర్యాలు పోదిగిన ఆభరణాలు
ఎన్నో..నిత్యం కళ్యాణం..పచ్చ తోరణంగా వీరాజిల్లుతున్న శేషాద్రి నిలయుడైన శ్రీనివాసుడు ఇక్కడ స్వయంబుగా
వెలసాడు.. భక్తులు శ్రీ వేంకటేశ్వరుడని, శ్రీనివాసుడని, సప్తగిరీశుడని,ఏడు కోండలవాడని,బాలజీ అని ఇలా ఏ పేరు పెట్టి పిలిచిన పలికే దైవంగా.. కోరిన కోర్కేలు
తీర్చే కోనేటి రాయుడిగా.. భక్తుల చేంత ఆరాధింపబడుతున్నాడు.. ప్రతి నిత్యం వేలాది
మంది భక్తులు వివిధ రూపాల్లో తిరుమలకి చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు ఎంతో
భక్తి భావంతో స్వామి వారికి వారి వారి
స్తోమతను బట్టి కానుకలు సమర్పించుకుంటారు. కోందరైతే బంగారు ఆభరణాలు..మరి కోందరు
నగదు..మరి కోందరైతే తలనీలాలతో పాటుగా
నిలువు దోపిడి ఇస్తుంటారు.. ఇలా అనేక
రూపంలో వారి వారి భక్తి భావంను వివిధ రూపాల్లో స్వామి వారికి కానుకల రూపంలో సమర్పించుకుంటుంటారు. ఇది ఇలా ఉంటే స్వామి
వారికి భక్తుల భక్తి రసం అంటే ఎంతో
ప్రీతి.. అందుకే భక్తులు మనస్సు
అంతా శ్రీవారిని ధ్యానం చేస్తూ ఆయన నామస్మరణలతో కోండకు చేరుకుని ఆయన్ను
దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఆనందనిలయంలోని వేంకటాచలపతి క్షణ కాలం దర్శనం
కోసం భక్త జనం పరితప్పించి పోతుంటారు.. దేవ దేవుని క్షణకాల దర్శనం కోసం వేల
కిలోమీటర్లు నడుచుకుంటూ ఎన్నో వ్యయ ప్రాయసలు ఒర్చుకుంటూ కలియుగ ప్రత్యేక్ష దైవం
శ్రీనివాసుని పాదాలను దర్శించుకుంటే మోక్షం సిద్దిస్తుందని భక్తుల విశ్వాసం..
వాయిస్
ఓవర్ : ఆనంద నిలయంలో ఆ వేంకటేశుడి
మూలవిరాట్టు అలంకరణకు ఉపయోగించే అతి ముఖ్యమైన 120 ఆభరణాలు అయితే ఉత్సవమూర్తులైన
శ్రీదేవీభూదేవీ సమేత శ్రీమలయప్పస్వామి అలంకారానికి 383 ఆభరణాలు వినియోగిస్తున్నారు.. ఇక
ప్రత్యేక వేడుకల్లో స్వామి ఊరేగే రథాలు, వాహనాలన్నీ స్వర్ణమయమే అంతటి వైభవం ఉన్న శ్రీనివాసుని మూలమూర్తికి
అలంకరించే తిరుఅభరణాలు మూడు సెట్లు
ఉన్నాయి.. వాటిలో ప్రస్తుతం వినియోగించేవి రెండు సెట్లు,... స్వర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, నుపురాళ్లు, పగడాలు, కాంచిగుణం, ఉదరబంధం, దశావతర హారం, చిన్నకంఠాభరణం, పెద్ద కంఠాభరణం, బంగారు పులిగోరు హారం, ఆరుమూరల చంద్రహారం, సువర్ణ యగ్నోపవితం, సాధరణ యగ్నోపవితం, తులసీ పత్రహారం, చతుర్భుజ లక్ష్మీహారం, అష్టోత్తరశతనామ హారం, సూర్యకఠారీ, వైకుంఠభహస్తం, కటిహస్తం, కడియాలు, కరభూషాలు, కడియాలు భూజదండభూషాలు, నాగాభరణాలు, భూజకీర్తులు, కర్ణపత్రాలు, చక్రం, శంఖం, ఆకాశరాజు కీరీటం, సాలగ్రామహారం, రత్నకీరీటం, మేరుపచ్చ, రత్నమయ శంఖుచక్రాలు, రత్నమయ కర్ణపత్రాలు, రత్నమయ వైకుంఠ కటిహస్తాలు, రత్నమయ మకరకంఠి, స్వర్ణపీతాంబరాలు, ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీకృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, అంజనేయుడు, స్వామివారి సేనాధిపతి
విష్వక్సేనులువారు, ఆలయంలోని
పరివార దేవతమూర్తులకు అలంకరించే అభరణాలతో కలిపి మొత్తం ఒక సెట్టుకి 242 ఐటమ్స్ ఉంటాయి.. ఒక సెట్టు బరువు 2700 కేజీల పైచిలుకు ఉంటుంది... వినియోగం
లేనిది మరోక సెట్ ఉంది.. ఇవే కాకుండా పురాణ కాలంలో రాజులు మహారాజులు నుండి ఇప్పటి
వరకు సమర్పించిన అభరణాలన్నీ అన్ని కలిపితే 50 టన్నుల బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి..
వాయిస్
ఓవర్ : ఇవే కాకుండా బంగారు, వజ్రాలు, వైడుర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, పచ్చలు, కెంపులు, నీలం, ముత్యాలు పొదిగిన అభరణాలు శ్రీవారి
బొక్కసం(ఖజానా)లో ఉన్నాయి.. మహారాణి సామవాయి కాలం నుండి స్వామి వారికి విరాళంగా
అందిన అభరణాలు లిస్టు ఇది.. ఈ రెండు వేల సంవత్సరాల్లో వీటిని మార్చాల్సిన అవసరం ఏ
సందర్భములోనూ రాలేదు... బంగారమే కాదు... వెండి కూడా చాలానే ఉంది... భక్తులు కానుకలుగా
హుండిలో సమర్పించిన ముడి వెండి 20 టన్నులు, అభరణాలు, పూజా
పాత్రలు ఉద్దరేణి,హారతి
పల్లెం, ప్రసాద గంగళాల తదితర వస్తువుల రూపంలో
మరో 5 టన్నుల ఉన్నాయి... బంగారు అభరణాలే
కాదు బంగారు నిల్వలు కూడా స్వామి వారికి మెండుగా ఉన్నాయి... భక్తజనం.. అలాగే
మనసంతా భక్తిని నింపుకొని.. ముడుపులు కట్టుకునీ.. మొక్కులు మొక్కుకునీ.. చివరికి
స్వామికి అసమానమైన స్వర్ణాభరణాలను కానుకలుగా సమర్పించుకుంటారు మరికొందరు. ఇలా భక్తులు నిలువుదోపిడీ, స్వర్ణాభరణాల రూపంలో అర్పించుకుంటున్న
బంగారు కానుకలే.. ఆ వెంకన్న సామికి సగటున రోజుకు 2 కేజీలు.. అంటే ఏడాదికి దాదాపు 700 కేజీలు బంగారం పెరుగుతూ..ఇప్పటికి 9,752 కేజీల వరకూ బంగారం ఉంది.. అపరంజి
బంగారు బిస్కెట్లు ఎస్.బి.ఐ,ఇండియన్ ఓవర్ సీస్ , పంజాబ్ నేషనల్, టిటిడి ఖజానా వివిధ బ్యాంకుల్లో నిల్వలుగా ఉన్నాయి. వాటి ద్వారా
సంవత్సరానికి తగ్గ అపరంజి బంగారు వడ్డీ
రూపంలో టీటీడీ ఖాతాలో జమవుతొంది. బిస్కెట్ల రూపంలో బ్యాంకు డిపాజిట్లుగా ఉన్న
బంగారంతా..సామన్యభక్తుల హుండిలో సమర్పించిన బంగారు అభరణాలను కరిగించినవే... ఇలా
బ్యాంక్ లో డిపాజిట్ చేసిన బంగారు వివరాలు
ఇలా ఎస్.బి.ఐలో 5,387,ఇండియన్
ఓవర్ సిస్ బ్యాంక్ లో 1,938, ఇక టిటిడి ఖజానాలో నిల్వ ఉన్న బంగారం 2,427 కేజీలు ఉందని, మొత్తం 9,752
కేజీల బంగారం ఉన్నట్లు ఇటీవల్ల తిరుపతిలో టిటిడి ప్రకటించింది..
వాయిస్
ఓవర్: మన దేశంలోనే కాదు.. విదేశాలో కూడా స్వామి వారికి స్థిర,చర ఆస్తులు లెక్కకు మించి ఉన్నాయి.. మన
దేశంలో ఎన్ని స్థిరాస్తులు ఉన్నయో టీటీడీ దగ్గర లెక్కలు లేవు.. అయితే సంపన్న దేవుడైన శ్రీవారికి మాత్రమే15టన్నుల శ్రీగంధం నిల్వలు ఉన్నాయి. ఈ 15 టన్నుల వినిమయం తరువాతి అవసరాల కోసం, 40 ఏకరాల్లో శ్రీగంధం తోటను టీటీడీ
పెంచుతొంది. ఇంతే కాదు గజ, తురగ, ఆశ్వాలే
కాకుండా అరుదైన పునుగు పిల్లి, కస్తూరి మృగం తదితర అంతరించి పోతున్న జంతువులు కూడా నిత్యం స్వామి
వారి సేవలో తరిస్తున్నాయి.. స్వామి వారికి భక్తుల నుండి వచ్చే కానుకలు, విరాళాలు, ఆస్తులు, ఆయనకు మాత్రమే పరిమితమైన అరుదైన వృక్ష, జంతు సంపదలతో వరల్ట్స్ రిచెస్ట్ గాడ్
గా పేరొందిన తిరుమల శ్రీవారు....సామన్య భక్తులకు కడుపు నిండా భోజనం
పెడుతాడు..కొండపైన మామూలు రోజుల్లో 50 వేల మందికి రద్దీ రోజుల్లో
లక్ష మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతొంటొంది. ఇందుకోసం యేటా వంద
కోట్ల రూపాయలు టీటీడీ ఖర్చు చేస్తుండగా....అందులో డెభై ఐదు కోట్ల రూపాయలు కేవలం
వడ్డీ రూపంలోనే టీటీడీ అన్నదానం ట్రస్టు నుండి వస్తొంది. ట్రస్టులో ప్రస్తుతం 1100 కోట్ల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్స్
ఉన్నాయి. ఇదే కాదు వ్యాధితో భాదపడుతూ, వైద్యం చేసుకునే స్తోమత లేని భక్తులకు కూడా స్వామి వారు అపన్నహస్తమనే
చెప్పుకొవాలి... గుండె, ముత్రపిండాలు ట్రాన్స్ ప్లాంటేషన్, న్యూరాలాజీ, డైయలసీస్ తదితర నెఫ్రాలాజీ రోగులకు
ఉచిత చికత్సను టీటీడీ అందిస్తోంది. స్వామి నుండి అందే ఉచిత వైద్యానికి వచ్చే ఐదు
సంవత్సరాలుకు సరిపడ్డ ప్రణాళిక, కేటాయింపులు సిద్ధంగా ఉన్నాయి....టీటీడీ వారు స్వయంగా నడుపుతున్న
బర్డ్ ఆసుపత్రిలో పోలియో, ఆర్థో, స్పైన్
శస్త్ర చికత్సల కోసం రెండేళ్లకు అవసరమైన రోగులు వేచి
ఉన్నారంటే.....అర్ధమవుతొందా....ఆ దేవుదేవుడ్ని సేవించేందుకే కాదు...ఆ స్వామి నుండి
సేవలందుకునేందుకు కూడా డిమాండ్ ఎంత ఉందో ....
" మాతర్నమామి కమలే ! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హ్రుత్కమల వాసిని! విశ్వమాత:
వాయిస్
ఓవర్ : ఈ వెంకటాచలపతికి ( శ్రీనివాసుడు) అనే మరో ప్రసిద్ద నామం ఉంది. శ్రీ అంటే
దయాస్వరూపిణి ,
ప్రేమమయి అయిన శ్రీ మహాలక్ష్మియే.
ఆమెను నివాసంగా కలవాడే ఈ శ్రీనివాసుడు .తిరుమల శ్రీవారి హ్రుదయం మీద ముందుకు
చోచ్చుకుని వచ్చి ఆశీనురాలైంది అలిమేలుమంగ.. ఆ అమ్మ శ్రీవారి ఒళ్ళో ఊరికే కూర్చో లేదు.. ఆమె
ముందుగా భక్తులందరి, బిడ్డలందరి
ప్రార్ధనల్ని,
కోరికల్ని, కష్టాల్ని, వేదనల్ని, దు:ఖాల్ని ముందుగా తాను వింటుంది. ఆ
వేంటనే తండ్రికి వినిపిస్తుంది.. కేవలం వినిపించడమే కాదు.. ఆ స్వామి వారిని ఒత్తిడి
చేస్తుంది. అమ్మ వారి మాటను కాదన లేక.. ఆమె మాటకు కట్టుబడి ఆ శ్రీనివాసుడు మనందరి
కోరికలను తీరుస్తూ వరాలను గుప్పిస్తున్నాడు. పాపాలను పోగోట్టుతున్నాడు. దు:ఖాలను, కష్టాలను తోలగిస్తన్నాడు. తద్వారా సుఖ
సంపదలను ప్రసాదిస్తున్నాడు... అంతే గాక తిరుమల స్వామి వారు ప్రతి రోజు వేద గోషలతో
ఇలా కీర్తింపబడుతున్నాడు.. అందుకే కోర్కెలు తీర్చే కోనేటి రాయుడుగా.. ఏడు కోండల్లో
కోలువైయున్న శ్రీనివాసుడి భక్తులు ఆయనకు వివిధ రూపాల్లో భారీగా ముడుపులు
చెల్లించుకుంటుంటారు..
బైట్ః
వేణుగోపాల దీక్షితులు, ఆలయ
ప్రధాన అర్చకులు, ఆగమ
సలహాదారులు.
No comments:
Post a Comment