Monday, 30 September 2019

BRAHMOTSAVAM CURTAIN RAISER



యాంకర్:  కలియుగ వైకుంఠవాసుడు.....శ్రీనివాసుడు...ఏడాదికోకసారి జరిగే మహా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం తిరుమలలో ఎటు చూసినా అంతటా బ్రహ్మోత్సవ సందడే...!బ్రహ్మండ నాయకుడైన శ్రీవారికి బ్రహ్మోత్సవం..... ఏటా తోమ్మిది రోజులు పాటు తిరుమాడ వీధులలో 16 రకాల వాహనాల పై స్వామివారు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చే ఉత్సవం.....తిరుమల క్షేత్రంలో జాతరను తలపించేలా... భక్తజనం తరలివచ్చే వైభోత్సవమే.... శ్రీవారి బ్రహ్మోత్సవం....ఏడుకోండల పై వెలసిన శ్రీనివాసుని జన్మ నక్షత్రానికి ముగిసేలా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే స్వామివారికి నిర్వహించిన ఉత్సవమే బ్రహ్మోత్సవం...భువిపైన వైకుంఠం అన్న రీతిలో జరిగే ఆధ్యాత్మిక సంబరం.. అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది....బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చింది.....కాలక్రమేణా బ్రహ్మోత్సవాల నిర్వహాణ ఎలా మారుతూ వచ్చింది.....కోండ పై వెలసిన కోనేటి రాయుణి బ్రహ్మోత్సవాల పై  స్పెషల్ ఫోకస్...

వాయిస్: నిత్యం కళ్యాణం పచ్చతోరణంగా భాసిలుతున్న తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతునే వుంటుంది.ఎప్పుడు ఏదో ఒక ఊరేగింపు నిర్వహింపబడుతునే వుంటుంది.....వెంకటాద్రి పుణ్యక్షేత్రంలో ఏడాది పోడవునా ప్రతిరోజు పండుగే.....ప్రతి రోజు పచ్చ తోరణాలే.....ప్రతి పూటా పిండి వంటలే...పరమాన్నాలే....అలంకార ప్రియుడు...నైవేధ్య ప్రియుడు...అంత కంటే భక్తజన ప్రియుడైన శ్రీవారికి వైభవం అంతటిది.భక్తుల పాలిట కోంగుబంగారు దేవుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారికి సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు... విశేష పూజ,అష్టదళపాదపద్మారాధన, సహస్రకలషాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు..పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం,వసంతోత్సవం,జేష్ఠాభిషేకం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూంది టీటీడి.ఇలా ఏడాది పోడవునా శ్రీవారికి ఎన్నో ఉత్సవాలు,ఊరేగింపులు నిర్వహించినా.....ఏడాదికోక్కసారి తోమ్మిదిరోజులు పాటు స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తిరుమల చరిత్రలోనే అత్యంత పాముఖ్యత... వైభవాని సంతరించుకున్నాయి.వేంకటాచల క్షేత్రంలో వెలసిన తోలిరోజులలో శ్రీనివాసుడు బ్రహ్మదేవుణి పిలిచి లోకకళ్యాణార్ధం తనకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడట.....శ్రీవారి ఆజ్ఞ మేరకు బ్రహ్మ దేవుడు...శ్రీవారు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసంలోని శ్రవణా నక్షత్రంకు పూర్తి అయ్యేలా తోమ్మిది రోజులు పాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహించారట.సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ది పోంది నాటి నేటి వరకు నిరాఘాటంగా...నిరాటంకంగా కోనసాగుతునే వున్నాయి.
      విజువల్స్..................

వాయిస్: వైకుంఠంలో వుండే శ్రీమహావిష్ణువు....భక్తుల కోసం భువిలో కొలువైన పవిత్ర స్ధలం.నిత్యకళ్యాణం పచ్చతోరణమైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎనలేని ప్రత్యేకత..తొమ్మిది రోజుల పాటు ఆ దేవదేవుడే భక్తుల ముందుకు తరలివచ్చి అనుగ్రహించే..ఈ మహాత్తర ఘట్టానికి తిరుమలలో చాలా ప్రాధాన్యత వుంది.యుగయుగాలుగా ఏడుకొండల పై కొలువైన స్వామి వారికి సాక్షాత్తూ బ్రహ్మే జరిపిస్తారు కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.బ్రహ్మాండంగా జరిగే వేడుకలు కాబట్టి బ్రహ్మోత్సవాలుగా పేరొచ్చిందని మరో కధనం.ఏటా కన్యామాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణంతో ముగిసేలా ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.ఈ నెల 30వ తేది నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శ్రీవారి భక్తులను కనువిందు చేయనున్నాయి.ప్రతి రోజు రెండు వాహానాల పై ఆనంద నిలయుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
  బైట్....వేణుగోపాలదీక్షితులు  ఆలయ ప్రధాన అర్చకులు
               
వాయిస్: ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడానికి ముందే ఆలయాని పూర్తిగా శుద్ది చేస్తారు.బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు స్వామివారి ఆలయాని వివిధ సుగంధ  ధ్రవ్యాలతో శుద్ది చేసే కార్యక్రమాని కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అనే పేరుతో నిర్వహిస్తారు.అందులో భాగంగా ఈ నెల 24వ తేదిన ఆలయాని అంతా సర్వత్రా కడిగి,శుద్ది చేసిన తరువాతా స్వామివారి ఆలయాని పూలపందిళ్ళతో,మామిడి తోరణాలుతో,అరటి స్తంబాలుతో,విద్యుత్తు దీపాలతో సర్వాంగా సుందంరంగా అలంకరించారు.
 
వాయిస్: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభ సూచికగా ముందు రోజు అనగా ఈ నెల 29న ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది.ధ్వజారోహణం ముందు రోజు స్వామివారి సర్వసేనాధిపతియైన విష్వక్సేనులువారు మాడవీధులలో ఊరేగుతు ఆలయానికి నైరుతి మూలన వున్న వసంత మండపానికి ఛత్రచామర మంగళవాద్యలు,వేదమంత్రోచ్చారణలు మధ్య చేరుకోని భూమి పూజ నిర్వహిస్తారు మృత్సంగ్రహణం చేసి పుట్టుమన్ను సేకరించి ప్రదక్షిణంగా ఆలయానికి చేరుకుంటారు.ఆ రాత్రే బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణ జరుగుతుంది.నవధాన్యాలు ఎంత బాగా పెరిగితే రాష్ర్టం... దేశం అంత సుభిక్షంగా వుంటుందని విశ్వాసం.
                           
వాయిస్: అంకుర్పారణ తరువాత రోజు జరిగే ప్రధాన కార్యక్రమమే ధ్వజారోహణం.వైఖనసాగమ శాస్ర్తోక్తంగా గరుడకేతన ప్రతిష్ట,కంకణధారణ,ఆలయ ఆవరణలోను ఆలయం చుట్టు అష్టదిక్కులోను బలినివేస్తూ ఆలయ పరివార దేవతలతో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు మాడ వీధులలో ఊరేగుతు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలును ఆహ్వనిస్తారు.ఇలా దేవతలను ఆహ్వనించిన అనంతంరం శ్రీవారు ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటారు.అనంత,గరుడ,విష్వక్సేన,సుగ్రీవ,హనుమంత,అంగదులు విమాన ప్రదక్షిణంలో వున్న అంకురార్పణ మండపానికి చేరుకుంటారు.అటు తరువాతా శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారి సమక్షంలో వేదమంత్రోచ్చారణలు మంగళవాద్యాలు మ్రోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభం పై గరడపటాని ఎగురవేస్తారు.ఈ సంధర్భముగా స్వామివారికి ముద్గాలాన్నం నివేదిస్తారు.ఈ ప్రసాదాని స్వీకరిస్తే సంతానభాగ్యానికి నోచుకుంటారని ప్రతీతి.ఇక అటు తరువాతా ఆ రాత్రి నుంచే స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఉదయం,రాత్రి వేళలో తొమ్మిది రోజులు శ్రీవారు మాడవీధులలో ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు. 
                       
వాయిస్.: బ్రహ్మండనాయకుడి బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు స్వామి ఊరేగే వాహనం పెద్దశేష వాహనం.అంకురార్పణతో సంప్రదాయబద్దంగా ప్రారంభమైయే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి ఆకర్షణ విష్వక్సేనుల వారి ఊరేగింపు.విష్ణువు యొక్క సర్వసేనాధిపతి విష్వక్సేనులు.ఆయన ఊరేగింపుతో ప్రారంభమైయే తిరువీధి ఉత్సవాలు...ఆదిశేషుని తొలి వాహనంగా శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తిరు వీధుల్లో ఊరేగుతు భక్తులకు కన్నులపండుగగా  దర్శనమిస్తారు.ఆదిశేషుడు శ్రీహరి మిక్కిలి సన్నిహితుడు.రామావతారంలో లక్ష్మణుడుగా,ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్ననాయణుడుకు ఎంతో సన్నిహితంగా వున్నవాడు శేషుడు.కలియుగంలో శేషుడు గోవిందరాజస్వామిగా స్వామివారికి సన్నిహితంగా వున్నారు.అంత సన్నిహితంగా వున్న శేషుడును శ్రీవారు తన తొలి వాహనంగా చేసుకోని మాడ వీధులలో ఊరేగుతుంటే...దర్శించుకున్న భక్తులకు పశుత్వం తోలగి మానవత్వం,అందుడి దైవత్వం,ఆ పై పరమపదం సిద్ధిస్తాయని విశ్వాసం.
       
వాయిస్.:రెండోవ రోజు ఉదయం శ్రీవారు చిన్నశేషవాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.పెద్ద శేష వాహానాని ఆది శేషుడుగాను... చిన్న శేష వాహనాని వాసుకిగా భావిస్తారు భక్తులు.ఎల్లప్పుడు శేషుని పై శయనించే స్వామివారు... మళ్ళి ప్రీతితో రెండోవసారి శేషవాహనం పై భక్తులకు దర్శనమిస్తారు.పెద్దశేష వాహనం పై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తే.... చిన్నశేష వాహనం పై మలయప్పస్వామి వారు మాత్రమే ఊరేగుతు భక్తులుకు దర్శనమిస్తారు.చిన్నశేషవాహనం పై స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు యోగ సిద్ధి ఫలం లభిస్తూందని నమ్మకం.
               
వాయిస్.: రెండోవరోజు రాత్రి మలయప్పస్వామివారు వీణాపాణియైన సరస్వతి మూర్తిగా హంస వాహనం పై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.బ్రహ్మ వాహనంగా హంస ప్రసిద్ధి.అటువంటిది శ్రీనివాసుడు హంసను తన వాహనంగా చేసుకోని నాలుగు మాడ వీధులలో ఊరేగుతు భక్తులకు నయానందకరంగా దర్శనమిస్తారు స్వామివారు.హంస వాహనం పై స్వామివారిని దర్శింకుంటే అహంభావం తోలగి దాసోహం అనే భావం భక్తులలో కలుగుతుదని వారి విశ్వాసం.
                 
వాయిస్.: బ్రహ్మోత్సవాలలో మూడోవరోజు ఉదయం స్వామివారు సింహ వాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.అనంతతేజోమూర్తియైన శ్రీనివాసుడు రాక్షసుల మనస్సులో సింహంలా గోచరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.భగవంతుని యొక్క అవతారాలలో నరసింహ అవతారం నాలుగోవది.ధర్మరక్షణకై నరసింహ స్వరూపాని ధరించిన స్వామివారు ఈ ఉత్సవాలోల సింహాని అధిష్టించి రావడం దుష్టజన శిక్షణకు శిష్ట రక్షణకు సంకేతం.సింహం పరాక్రమం కలిగిన జంతువు.అది మదగజాలనే సంహరించకలదు.అటువంటి సింహానే తన వాహనంగా స్వామివారు చేసుకోవడం అంటే స్వామివారు ఎంతటి పరాక్రమం కలిగినవారో అట్టే అర్ధమవుతుంది అంటారు పండితులు.భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు...భగవంతుడు భక్తుని అనుగ్రహిస్తాడు అన్నది వాహన సేవలో అంతరార్ధం అంటారు అర్చకులు.
                 
వాయిస్.: మూడోవరోజు రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనం పై ఉభయదేవేరులతో కలిసి భక్తులకు శ్రీనివాసుడు దర్శనమిస్తారు.ముత్యాలు విలువైనవి...చల్లదనాని ప్రసాదిస్తాయి...తెల్లని కాంతులను ఇస్తూంది...సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తూవులలో ముత్యం ఒక్కటి.ఇంత ప్రాశస్తమైన ముత్యాలను పందిరిగా రూపోందించిన వాహనంలో ఏడుకోండల స్వామి మురువు గోల్పుతు ముచ్చటగా ఊరేగుతాడు.చల్లని ముత్యాల క్రింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగోట్టి,భక్తుల జీవితాలకు చల్లదనాని సమకూరుస్తూందని భక్తుల విశ్వాసం. 
                   
వాయిస్.: బ్రహ్మోత్సవాలలో నాలుగోవరోజు శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్షవాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు...అనేక విధాలైన చెట్లు సృష్టిలో వున్నాయి.అందులో మేటి కల్పవృక్షం...ఇతర వృక్షాలు తాము కాచి ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి.కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలు అన్నింటిని ప్రసాదిస్తూంది.అటువంటి కల్పవృక్షం వాహనాని అధిరోహించి శ్రీవారు తిరుమాడ వీధులలో విహరిస్తూ వుంటే భక్తులు తనివితీరా స్వామివారిని దర్శించుకుంటారు.కల్పవృక్ష వాహనం పై స్వామివారిని దర్శించుకుంటే కోరిన ఫలాలంటిని సిద్ధిస్తారని భక్తుల నమ్మకం.
                   
వాయిస్.: నాలుగోవరోజు రాత్రి శ్రీవారు సర్వభూపాల వాహనం పై విహరిస్తూ  భక్తులకు దర్శనమిస్తారు.తూర్పు దిక్కుకు ఇంద్రుడు,ఆగ్నేయానికి అగ్ని,దక్షిణానికి యముడు,నైరుతికి నిరృతి,పశ్చిమానకి వరుణుడు,వాయవ్యానికి వాయువు,ఉత్తరానికి కుబేరుడు,ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదికాల్పులై విరాజిల్లుతు వుంటారు.వీరంతా స్వామివారిని సుప్రభాతం సేవ సమయంలో సేవిస్తారని  స్వామి తెలియజేసారు.ఇక భూపాలకులందరు అధికార సంపన్నులే.... వారి అధికారం దుర్వినియోగం కాకూండా వుండాలంటే వారు భగవత్సేవాపరులై వుండాలి.అలా రాజులందరు శ్రీవారిని తమ భుజస్కంధాలు పై మోస్తారని....అలా స్వామివారి సర్వభూపాల వాహనం పై దర్శించుకుంటే రాజ్యసుఖప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వాసం.
             
వాయిస్.: ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదోవ రోజు ఉదయం ఆపద మ్రొక్కులవాడు వారు మోహిని అవతారంలో శృంగార రధసారధి దేవతగా భక్తులకు దర్శనమిస్తారు.బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహనం ఉరేగింపు వాహన మండపం నుండి ప్రారంభమైతే....ఒక్క మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది.ఆలయం నుండి బంగారు తిరుచ్చి పై మోహిని అవతరాంలో స్వామివారు...ప్రక్కనే దంతపు పల్లకి పై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో స్వామివారు వెలుపలికి వచ్చి మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.ఇక మోహిని అవతరాంలో మరో ప్రత్యేక అలంకరణ వుంటుంది.స్వామివారికి శ్రీవల్లి వూత్తురు నుండి గోదాదేవికి అలంకరించిన పుష్ప మాలాలు,చిలుకలను స్వామివారికి అలంకరిస్తారు.జగత్తు అంతా మాయా మోహానికి లోంగి వుంటుంది.ఈ జగన్నాటక సూత్రధారి తిరుమల రాయుడే...బ్రహ్మోత్సవాలలో మోహిని రూపధారియైన స్వామివారు... ప్రపంచమంతా తనమాయా విలాసమని తనకు భక్తులైన వారు మాయాను సులభంగా దాటగలరని భక్తలకు చేబుతున్నట్లుగా వుంటుందట మోహిని అవతరాం.
               
వాయిస్.: ఐదోవరోజు రాత్రి స్వామివారు గరుడ వాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.గరుడ వాహనాని దర్శించుకునేందుకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు.స్వామివారి వాహన సేవలలో గరుడ వాహనంకు ఎంతో ప్రాముఖ్యత వుంది.గరుడ వాహనం సంధర్భముగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించే మకర కంఠి,లక్ష్మికాసుల హరం,సహస్రనామ మాలలను స్వామివారి ఉత్సవమూర్తులుకు అలంకరిస్తారు.శ్రీవల్లి పుత్తూరు దేవస్థానం తరపున తులసి మాలలు,చెన్నై భక్తులు సంప్రదాయబద్ధంగా సమర్పించే నూతన గోడుగులును స్వామివారికి అలంకరిస్తారు.గరుడను వాహనంగానే కాకుండా ధ్వజారోహణం రోజున ధ్వజ మండపం పై నిలిచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వనిస్తాడు.ఉత్సవాలు జరిగినన్ని రోజులు పర్యవేక్షిస్తాడు.అంతటి ప్రాముఖ్యత కలిగిన గరుడ వాహన సేవను దర్శించుకున్న భక్తులకు జ్ఞానము,వైరాగ్యప్రాప్తి లభిస్తూందని భక్తుల విశ్వాసం.
                       
వాయిస్.: ఆరోవ రోజు ఉదయం వరద హస్తం దాల్చిన వేంకటాద్రి రాముడు హనుమంత వాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.భగవంతుని భక్తులలో హనుమంతుడు అగ్రగణ్యుడు.రామాయమంలో మారుతి స్థానం అద్వితియం.చతుర్వేద నిష్ణాతుడుగా,నవవ్యాకరణ పండితుడుగా,లంకాభీకరుడుగా ప్రసిద్దుడైన హనుమంతుడు తన వీపు పై వేంకటాద్రిని వహించి మాడ వీధులలో విహరిస్తూ వుంటే గోవిందనామ స్మరణలు మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
                     
వాయిస్.: ఆరోవ రోజు సాయంకాలం స్వర్ణరథ ఊరేగింపు నిర్వహిస్తారు.ప్రపంచంలోనే అతిపెద్దదైన స్వర్ణ రథం పై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.74 కేజిల బంగారం,2900 కేజిల రాగి,25 టన్నుల చెక్కతో తయ్యారు చేసిన 32 అడుగుల పోడవు వున్న అతి పెద్ద స్వర్ణ రథం పై ఆ ఏడుకోండల స్వామి తన ఇరువురు దేవతలతో కలసి ధగధగ మేరిసే కాంతుల మధ్య భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూంటే....ఏడుకోండలు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిపోతుంది.
                           
వాయిస్.: ఆరోవ రోజు రాత్రి శ్రీవారు గజ వాహనం పై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.గజం వాహనంగా ఆనాదిగా ప్రసిద్ధమే...శ్రీ వేంకటేశ్వర స్వామి గజవాహనం పై మాడ వీధులలో ఊరేగుతు వుంటే భక్తులు గోవిందనామ స్మరణలు మధ్య స్వామివారిని దర్శించుకుంటారు.శ్రీవారు గజ వాహనాని అధిరోహించిన రోజే కాకుండా ప్రతి రోజు బ్రహ్మోత్సవాలలో టీటీడి గజరాజులు పాలుపంచుకుంటాయి.బ్రహ్మరధం వెనుక అశ్వాలు,వృషభాలుతో పాటు ఠివిగా గజరాజులు ఊరేగింపులో నడచివస్తాయి.భక్తులు సదా శ్రీనివాసుని కోలుస్తూ శరణాగతి పోందాలన్నది ఈ వాహన సేవ ద్వారా అందించే దివ్య సందేశం.
                       
వాయిస్.: ఏడోవరోజు ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనం అధిష్టించి తేజో విరాజితుడై  భక్తులకు దర్శనమిస్తారు.సూర్యుడు తేజోనిధి,సకలరోగ నివారుకుడు...ప్రకృతికి చైతన్యప్రదాత...వర్షాలు వాటి వల్ల పెరిగే సస్యాలు.... చంద్రుడు అతని వల్ల పెరిగే ఔషదులు మొదలైనవన్ని సూర్యతేజం  వల్లనే వెలుగోందుతున్నాయి.అట్టి సూర్యప్రభను స్వామివారు తన వాహనంగా చేసుకోని మాడ వీధులలో విహరిస్తూ వుంటే భక్తులు తనివితీరా దర్శించుకుంటారు.సూర్యప్రభ వాహనం పై స్వామివారిని దర్శించుతుంటే భక్తులకు ఆరోగ్యం,ఐశ్వర్యం సిద్ధిస్తూందని నమ్మకం.
               
వాయిస్.: ఏడోవ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనం పై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.స్వామివారికి సూర్యచంద్రులు రెండు నేత్రాలు.... ఉదయం సూర్యప్రభ వాహనం పై  ఊరేగిన శ్రీహరి రాత్రి నిశాకరుడైన చంద్రప్రభ వాహనం పై భక్తులకు దర్శనమిస్తారు.చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి... సాగరుడు ఉప్పోంగుతాడు....చంద్రకాంతమణులు స్రవిస్తాయి..అదే విధంగా చంద్రప్రభ వాహనం పై స్వామివారిని చూడగానే భక్తుల మనస్సు ఉప్పోంగుతుంది..భక్తనేత్రాలు వికసిస్తాయి....ఆనందరసం భక్తుల హృదయం నుండి స్రవిస్తూంది.చంద్రుని వల్ల ఆనందం,చల్లదనం కలుగుతుంది.అదే విధంగా చంద్రప్రభ వాహనం పై స్వామివారిని దర్శించుకుంటే ఆధ్యాత్మిక,ఆదిభౌతిక,ఆధిదైవిక మనే త్రివిధ తాపాలును నివారిస్తూంది.
                   
వాయిస్.: ఎనిమిదోవ రోజు ఉదయం ఆరు గంటలకు రధోత్సవం ప్రారంభమవుతుంది.శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు మహోన్నత రథాని అధిరోహించి ఆలయ వీధులలో విహరిస్తారు.స్వామివారి రథానికి ముందుగా కళ్యాణకట్ట ఉద్యోగులు సమర్పించిన బంగారు గోడుగును అలంకరిస్తారు.దాదాపు మూడు గంటల పాటు స్వామివారి రథోత్సవం జరుగుతుంది.బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహన సేవ ముందు బ్రహ్మ రథం వుంటుంది.ఒక్క రథోత్సవానికి మాత్రం బ్రహ్మరథం వుండదు.సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే స్వామివారి రథసారధిగా వుంటారు కాబట్టి బ్రహ్మరథం లేకుండానే స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు.
         
వాయిస్.: ఎనిమిదోవ రోజు రాత్రి కల్కి అవతారంలో శ్రీవారు అశ్వ వాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.బ్రహ్మోత్సవాలలో స్వామివారి చివరి వాహన సేవ అశ్వ వాహనం.భగవంతుని అవతారాలలో పది ప్రసిద్ధమైనవి.చివరి అవతారం కల్కి అవతారం...కలియుగాంతంలో కల్కి రూపధారియైన స్వామివారు కత్తి చేతభూనిన స్వామి అశ్వ వాహనం పై దుష్ట సంహారం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
         
వాయిస్.: బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నానం తొమ్మిదోవ రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహిస్తారు.యజ్ఞం చివర అవభృధస్నానం నిర్వహించడం సంప్రదాయం.తొమ్మిది రోజులు పాటు ఒక యజ్ఞంలా నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చక్రస్నానం కు ఎంతో ప్రాముఖ్యత వుంది.ఆలయం నుండి వేకువజామున శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామితో పాటు చక్రత్తాల్వారును మాడ వీధులలో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయం వద్ద వున్న పుష్కరిణి వద్దకు తీసుకువస్తారు.పుష్కరిణి వద్ద వున్న మండపంలో ముందుగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.అటు తరువాతా చక్రత్తాల్వారుకు పుష్కరిణిలో అవభృధస్నానం ఆచరిస్తారు.వేలాది మంది భక్తులు ఆ సమయంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.
               
వాయిస్.: బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజాఅవరోహణం.తోమ్మిదోవ రోజు రాత్రి ధ్వజ స్తంభం ఏగుర వేసిన ధ్వజపట్టాని వేదమంత్రాలు,మంగళవాయద్యాలు నడుమ క్రిందకు దించడంతో బ్రహ్మోత్సవాలు శాస్ర్తోక్తంగా ముగుస్తాయి.
                 విజువల్స్...........
వాయిస్.: ఇంతటి ప్రాముఖ్యమున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకున్ని టీటీడి యంత్రాంగం గత మూడు నెలలుగా నిరంతరాయంగా ఏర్పాట్లు చేస్తావుంది.దసరా సెలవులతో పాటు తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి నెలకావ్వడంతో ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున్న భక్తులు తరలివస్తరాని అంచనా వేసిన టీటీడి అధికారగణం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తావుంది.భక్తులకు సులభతరంగా వాహనసేవ దర్శనంతో పాటు ఆరోజు కారోజే స్వామి వారి మూలవిరాట్టు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తావున్నారు.
               
వాయిస్.: మరో రెండు రోజుల్లో బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభం కానుండడంతో టీటీడి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తావున్నారు.కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్న ఫలఫుష్ప ప్రదర్శనను ఈ నెల 30వ తేది నుంచి భక్తులు సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తావున్నారు.ఇక విద్యుత్ సిబ్బంది తిరుమలతో పాటు తిరుపతి నగరాని విద్యుత్ దీపకాంతులతో దేదీపమాన్యంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.మొత్తం మీద ఈ ఏట శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సప్తగిరులకు చేరుకున్నే భక్తులకు ఇక్కడి ఏర్పాట్లు కనువిందు చేయనున్నాయి..

No comments:

Post a Comment