Friday, 14 July 2017

ka 52,ka 62


KA52
అధునాతనమైన ఆయుధాలతో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే రష్యా తన ఆయుధాగారంలో మరో రెండు అస్త్రాలను చేర్చింది. కమావ్ కేఎ-52 ఎటాక్ హెలికాప్టర్ ను రష్యా రూపొందించింది. ఇప్పటికే గగనతలం నుంచి ప్రయోగించే ఆయుధాల్లో తిరిగులేని రష్యా తాజాగా రూపొందించిన ఈ హెలికాప్టర్...  శత్రుమూకలపై పోరాటాలు చేయడానికి సైన్యానికి ఎంతగానో ఉపకరిస్తుంది. పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకోని టార్గెట్లు రీచ్ కావడానికి ఇది సహకరిస్తుంది. నావీ తోపాటు యుద్ధ క్షేత్రంలో కాలుమోపే... సైన్యం సైతం ఈ హెలికాప్టర్ ను వినియోగించుకోవచ్చు. ఈ హెలికాప్టర్ ను జల మార్గం ద్వారా యుద్ధం చేసేందుకు ఉపయోగించాలని తయారు చేశారు. అయితే ఇది సైన్యం సర్జికల్స్ తరహా దాడులు చేయడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కమావ్ కేఎ-52 రాకతో అత్యంత ప్రసిద్ధి చెందిన అడ్మిరల్ కుజెన్ట్సవ్ ఎయిర్ క్రాఫ్ నుంచి శత్రువులపై ఏకధాటిగా ఆయుధాలను ప్రయోగించవచ్చు.


KA62
మరోవైపు రష్యా మరో అధునాతన హెలికాప్టర్ ను విజయవంతంగా ప్రయోగించింది. ప్రోగ్రస్ అరిసినెవ్ ఏవియేషన్ కంపెనీకి చెందిన కట్టింగ్ ఎడ్జ్ KA-62 హెలికాప్టర్ తొలి ట్రయల్ ను విజయవంతమైంది. హెలికాప్టర్ ఎలా పనిచేస్తోందన్నదానికి సంబంధించి సైన్యం పూర్తి పరిశోధన చేయబోతోంది. ట్రయల్ మోడల్ కు చెందిన అన్ని పరీక్షలను ఈ విమానం అధిగమించిందని... త్వరలోనే ఇది సైన్యానికి అందుబాటులోకి వస్తుందని రష్యన్ హెలికాప్టర్స్ డైరెక్టర్ ఆండ్రీ బొగెన్సికీ  తెలిపారు. KA-62 హెలికాప్టర్ గంటకు 110 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రతిష్టాత్మకమైన ఈ హెలికాప్టర్ సైన్యానికి ఎంతగానో ఉపకరిస్తుందని రష్యా మిలిటరీ భావిస్తోంది. రష్యా ఉపాధ్యక్షుడు డిమిత్రి రోజోజిన్  హెలికాప్టర్ ట్రయల్ రన్ ఫుటేజిని తన ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేయడం విశేషం. ఈ హెలికాప్టర్ ను సరుకు రవాణా, కొండ ప్రాంతాల్లో పనుల కోసం, అత్యవసర పరిస్థితుల నుంచి ప్రజలను రక్షించడం కోసం, రెస్య్కూ ఆపరేషన్లు, పెట్రోలింగ్,  వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి వినియోగించవచ్చు. తీవ్రవాదులు ఏరివేతలో ఈ యుద్ధ విమానం ఎంతగానో సహకరిస్తుంది. 

జీఎస్టీ అమలు రోజు స్టోరీ

130 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ.... 130 కోట్ల జనాభా... ఒక్కో మనిషికి లక్ష రూపాయలన్నమాట...  ఇదీ భారత ఆర్థిక వ్యవస్థ బలం... మన దేశ జనాభా బలం. ఇప్పుడు దేశమంతా ఒకటే మంత్రాన్ని జపిస్తోంది. ఒకే దేశం... ఒకే పన్ను... ఒకటే మార్కెట్... ఇదీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వస్తు సేవల పన్ను జి.ఎస్.టి ద్వారా తీసుకొచ్చిన సరికొత్త విధానం...  ఎన్నాళ్లో వేచిన ఉదయం... దేశమంతా ఒకటే పన్ను విధానం దేశంలో అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అర్ధరాత్రి వస్తు సేవల పన్నును రాష్ట్రపతి, ప్రధాని మీటనొక్కి అమల్లోకి తెచ్చారు. వన్ నేషన్... వన్ ట్యాక్స్... వన్ మార్కెట్ దేశ ప్రజలకు  ఏవిధంగా మేలు చేస్తుంది... దేశంలో సమూల మార్పులకు దోహదకారిగా ఎలా నిలవబోతుందన్నదానిపై ఇన్ సైడ్ స్పెషల్ రిపోర్ట్...  జీఎస్టీలో అపోహలు ఎక్కువ... క్లారిటీ తక్కువ...
జీఎస్టీ ఇప్పుడో బ్రహ్మపదార్థంలా మారింది. వస్తు సేవల పన్ను ద్వారా ఏం జరుగుతుందోనన్న అపోహ చాలా మందిలో ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీఎస్టీ విషయంలో అపోహలెక్కువ... క్లారిటీ తక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  రోజు గడిచే కొద్దీ జీఎస్టీకి సంబంధించి అందరికీ ఫుల్ క్లారిటీ రానుంది. జీఎస్టీ ద్వారా దీర్ఘకాలంలో ప్రజలకు ఎంతో మేలు కలగనుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ ద్వారా... తాత్కాలికంగా ఇబ్బందులున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే దీర్ఘకాలంలో జీఎస్టీ ద్వారా ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ఆర్థిక శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. జీఎస్టీ ద్వారా సామాన్యుడికి ఎంతో మేలు జరుగుతుందన్నది వారి భావన. దాదాపు రెండు దశాబ్దాల నుంచి కసరత్తు చేసిన జీఎస్టీ.. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అమల్లోకి వచ్చేసింది. నాటి ప్రధాని వాజ్ పేయి జమానా నుంచి జీఎస్టీ అమలు చేయాలన్న లక్ష్యం ప్రభుత్వ పెద్దల్లో ఉంది. తాజాగా అమలు ద్వారా ప్రధాని నరేంద్రమోదీకి క్రెడిట్ దక్కుతోంది. అయితే జీఎస్టీ అమలకు సంబంధించి అపోహలు ఎక్కువగా ఉన్నాయ్. కేంద్రం రాష్ట్రాలను కేంద్రం గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే... జీఎస్టీని వ్యతిరేకించే వారు... ఆదాయమంతా కేంద్రానికే దక్కుతుంది... రాష్ట్రాలు... కేంద్రాన్ని బిచ్చమడుక్కోవాలన్న వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవానికి ఇది ఎంత మాత్రం కరెక్టు కాదు...
అయితే ప్రతిపక్షాలు గుడ్డిగా జీఎస్టీని వ్యతిరేకించడంపై విమర్శలు ఎక్కువవుతున్నాయ్. తెలుగు సినిమా డైలాగు మాదిరిగా ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు నాయకుడన్న చందంగా... ప్రతిపక్షం వ్యవహరించలేదన్న అభిప్రాయం ఉంది. మోదీని ఎదుర్కోవాలి కాబట్టి ఎదుర్కోవడమన్నది కరెక్టు కాదని... ప్రతిపక్షాలు తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని ఆర్థిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. మోదీని ఎదుర్కోవడంలో విఫలమైన... కాంగ్రెస్ పార్టీ మమత ట్రాప్ లో పడిపోయిందన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ ట్రాప్ లో లెఫ్ట్ పార్టీ లు కూడా పడ్డాయన్న వాదన కూడా విన్పిస్తోంది. కొంత మంది అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే వాటన్నింటికీ సమాధానం దొరకాలంటే మరో ఆరు నెలల పాటు వెయిట్ చేయాల్సిందేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ప్రపంచంలోని మెజార్టీ దేశాలన్నీ జీఎస్టీని ఎప్పట్నుంచో అమలు చేస్తున్నాయ్. జీఎస్టీ వల్ల లాభం లేకుంటే వారంతా అది చేయరు కదా... జీఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల పన్ను చెల్లింపు సులభతరమవుతుందని... వ్యాపారులు దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే వీలు కలుగుతుందని అంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇప్పుడు భారత్ తీసుకున్న తాజా నిర్ణయం... దేశ ఆర్థిక వ్యవస్థకు నవ పథాన్ని ఆవిష్కృతం చేస్తుందని చెప్పొచ్చన్న అభిప్రాయం కలుగుతోంది. తాజా జీఎస్టీ నిర్ణయం ద్వారా... పలు రకాల పన్ను బాధలు తప్పబోతున్నాయ్.  పన్నులు ఎగ్గొట్టేవారి సంఖ్య భారీగా తగ్గుతుంది. ప్రభుత్వ యంత్రాంగాలు నిజాయితీతో వ్యవహరిస్తే... దేశంలో ప్రభుత్వం చెబుతున్న మార్పు స్పష్టంగా వస్తుంది. జీడీపీలో 2 శాతం వృద్ధి సాధ్యమవుతుంది. లోటును తగ్గించుకోని... దేశ ఆర్థిక వ్యవస్థ పటుత్వాన్ని సాధించడం జరుగుతుంది. వస్తు సేవల పన్ను... జీఎస్టీ ద్వారా కార్పోరేట్లకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. అది తప్పన్న అభిప్రాయాన్ని ఆర్థికరంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కార్పోరేట్స్ కు బెనిఫిట్ చేయడానికి జీఎస్టీ తీసుకురాలేదని... తాజా చట్టం ముందు... దేశంలో అందరూ... ఒకటేనన్న అభిప్రాయాన్ని కూడా విన్పిస్తుంది. ఇప్పటి వరకు బడా బడా కార్పోరేట్స్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను... అనేక మార్గాల ద్వారా  ఎగ్గొడుతున్నారని...  వారి సంఖ్య జీఎస్టీ అమలుతో...  తగ్గబోతుందని చెబుతున్నారు. పన్ను చెల్లింపు పద్ధతిలో ఇప్పుడు విస్తృతమైన పారదర్శకత పెరుగుతుందన్న అభిప్రాయం బలంగా విన్పిస్తోంది. జీఎస్టీ అమలు ద్వారా... కార్పోరేట్ శక్తులైనా... నెలసరి జీతం తీసుకునే వ్యక్తి అయినా... వారి వారి ట్యాక్స్ స్లాబులోకి వస్తారు. ఇప్పటి వరకు వ్యక్తిగత పన్ను ఏవిధంగానైతే కడుతున్నారో... అదే విధంగా వారి వారి పరిశ్రమలకు సంబంధించిన బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది.  మరోవైపు చేనేత పరిశ్రమ కుదేలవుతుందన్న అభిప్రాయాన్ని వస్త్రవ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేనేతకు వంద శాతం పన్ను  మినహాయింపు లభిస్తూ వచ్చింది. అయితే తాజా నిబంధనలతో రూ. 20 లక్షల పైబడి వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు మాత్రమే పన్ను పరిధిలోకి వస్తారు. అందులోనూ రూ. 75 లక్షల వరకు వ్యాపారం చేసే వారు కేవలం 1 శాతం మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి వ్యాపారం చేసే వర్గాలు 5 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే రూ. 20 లక్షల స్లాబులో ఉన్నవారు... అందుకు తగిన విధంగా ఆదాయపన్నుశాఖ వారికి బిల్లులను ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం ఇబ్బందికర పరిణామని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పన్ను చెల్లించని వారికి అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. ఇప్పటి వరకు చిన్న చిన్న వస్త్రవ్యాపారులు రికార్డులన్నీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తం చేసేవారు. అయితే అలాంటి వారు కూడా రికార్డుల లెక్కలతో ఐటీవారికి అందిస్తే సరిపోతుంది. రికార్డుల్లో ఆధార్, ప్యాన్ అందిస్తే వారే లెక్కలు చూసుకుంటారు. అలాంటి వారికి పన్ను భారం ఎంత మాత్రం ఉండదు. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న వస్త్ర వ్యాపారులు ఒక్కసారిగా ఈ పద్ధతికి అలవాడు పడటం కష్టమన్న అభిప్రాయం కూడా ఉంది. గతంలో నోట్ల రద్దు తర్వాత ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే నాటి గాయాలు మానుతున్నాయ్. ఇప్పుడు జీఎస్టీ పేరుతో వ్యాపారులు, సామాన్యుడి బెదిరిపోతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా... ప్రజలను కాపాడాల్సింది పాలకులే. నోట్ల రద్దు సమయంలో  ఎలాంటి అప్రమత్తత లేకుండా చేయడం వల్ల ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయితే... ఇప్పుడు జీఎస్టీ ద్వారా సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తుసేవల పన్ను అమలుకు సంబంధించి తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ...దీర్ఘకాలంలో గణనీయంగా ప్రయోజనాలుంటాయన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ తక్షణం అమలు చేయడం ద్వారా...  మొదట్లో కొన్ని వర్గాలు ఇబ్బందిపడే ప్రమాదం ఉన్నప్పటికీ...  అవగాహన లోపంతో నష్టాలు కూడా వస్తాయన్న అనుమానాలు ఉన్నాయ్.  తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భాగీరథ విషయంలో జీఎస్టీ అమలుతో పలు సమస్యలు వస్తాయని భావించింది. అయితే రోజులు గడిచేకొద్దీ... ప్రభుత్వ పెద్దలు క్లారిటీతో అడుగులు వేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సైతం మద్దతిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. నాటికీ... నేటికీ అయ్యే ఖర్చులో పెద్ద తేడా ఏమీ ఉండదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందన్న అభిప్రాయం ఉంది. జీఎస్టీ రాక ముందు... సెంట్రల్ వ్యాట్, స్టేట్ వ్యాట్ గా పన్ను విధించేవారు. ఇప్పుడు జీఎస్టీ అమలయ్యాక...  ఇంటిగ్రేటెడ్ జీఎస్టీగా నిర్ణయించారు. స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ కలిపి ఇంటిగ్రేట్ గా ఒక పూల్ గా వెళ్తుంది. అయితే కేంద్రమే మొత్తం కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదన్న అభిప్రాయాన్ని నిపుణులు వివరిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు హక్కులను హరించడం సాధ్యం కాదన్న వర్షన్ ను వారు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘంలో ప్రకారం... ఆయా రాష్ట్రాల వాటాలను ఇప్పటికే లెక్కగట్టారు. దాని ప్రకారం రాష్ట్రాలకు నిధుల చెల్లింపు జరుగుతుంది.

అందరి మదిలో ఒకటే... లాభం జరిగితే మనకే జరగాలి... నష్ట జరిగితే పక్కోడికి జరగాలి... ఇదీ ఎవరైనా అనుకునేదే. అయితే... జీఎస్టీ ఆర్థిక తీవ్రవాదాన్ని తుదముట్టిస్తుందని కేంద్రం చెబుతోంది. అయితే...  జీఎస్టీ ద్వారా మనకు పడే భారమేంటి? జీఎస్టీ అమలు కాక ముందు మనం చెల్లిస్తున్న మొత్తానికి ఇప్పుడు మనం కోల్పోతున్న  లెక్కలేంటి? సామాన్యుడుకు ఒరిగేదేంటి?
స్థానిక మీడియా, జాతీయ మీడియా జీఎస్టీ గురించి పుంకాను పుంకాలుగా వార్తలు అందిస్తోంది. వాటిలో ఎక్కువగా ప్రజలకు, మరీ ముఖ్యంగా కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ అంటూ వార్తలు వస్తున్నాయ్. వాటికి సంబంధించిన వివరాలు ఓ సారి చూద్దాం... ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ పరిధి ఎక్కువ శాతం 5 శాతం పన్ను కిందకే వచ్చినట్టుగా తెలుస్తోంది. పేద వర్గానికి చెందిన ప్రజలతోపాటు, సామాన్యుడికి మ్యాగ్జిమమ్ బెనిఫిట్ కలుగుతుందని చెబుతున్నారు. పేద ప్రజలకు వారి హక్కుగా జీఎస్టీని విశ్లేషిస్తున్నారు. దేశంలోని చిన్నస్థాయి వర్తకులకు జీఎస్టీతో ఎలాంటి ప్రమాదం లేదన్నది కూడా ఘంటాపధంగా వివరిస్తున్నారు. పరిశ్రమ వర్గాలకు మేలు జరుగుతున్న విషయాలను ఓసారి పరిశీలిస్తే... రిజిస్ట్రేషన్ కు సంబంధించిగానీ, డ్యూటీ చెల్లింపులుగానీ, ఐటీ రిటర్న్స్ దఖలు చేయడం, రిఫండ్లను వెనక్కి తీసుకోవడం తేలిక కానుంది. పన్ను చెల్లింపుకు సంబంధించి తయారీదారు, సరుకును సప్లై చేసే వ్యక్తి, రిటైల్ వ్యాపారి అంటూ మూడు రకాల పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. పన్ను చెల్లింపుల్లో సరళీకరణ మూలంగా... అంతర్జాతీయ మార్కెట్లోకి దేశం నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలకు వస్తువులను అందించడానికి వర్తకులకు ఎంతగానో అనువుగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఇకపై ఒకటే రిజిస్ట్రేషన్ కింద వస్తువులు, సేవలను ఒకటే పాన్ నెంబర్ కింద అందించవచ్చు. మొత్తం చెల్లింపుల్లో సగం  రాష్ట్రానికి సగం కేంద్రానికి దక్కుతుంది.
దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ మూలంగా ఎంతో మేలు జరగుతుంది. దేశమంతా ఒకటే మార్కెట్ విధానం అమల్లోకి వస్తుంది. భారతదేశం తయారీ రంగంలో వినూత్న ఆవిష్కరణలు జరిగే వేదిక అవుతుంది. పెట్టుబడుల రాక పెరుగుతుంది. మొత్తంగా పెట్టుబడుల రాక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కారణమైతే... దేశంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది.
తయారీ రంగం నుంచే ఉద్యోగాల కల్పన జరిగితే... దేశం వేగంగా వృద్థి చెందుతుంది. అదే సమయంలో పన్ను చెల్లింపు తేలిక అవుతోంది. అనేక విధాలుగా కడుతున్న పన్నులు చెల్లింపు  అవసరం ఉండదు. వస్తువులపైనా, సేవలపైనా వేసే పన్ను సరళతరమవుతుంది. కొన్ని రకాల మినహాయింపులతో తేలిక పన్నువిధానం అమల్లోకి వచ్చేస్తోంది. శాంతియుతంగా చట్టాలు  అమల్లోకి  రావడం ద్వారా... దేశమంతటా ఒకటే విధానం అమలవుతుంది. పన్ను యంత్రాంగం సైతం సమర్థవంతంగా పనిచేయడానికి జీఎస్టీ చేయూతనిస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు 200 రకాల చట్టాలతో పలు నిబంధనలు అమల్లో ఉన్నాయ్. అవన్నీ ఇప్పుడు ఒకటే వ్యవస్థ జీఎస్టీ కిందకు వస్తాయ్. మద్యం తప్పించి దేశంలోని అన్ని రకాల వస్తువులు జీఎస్టీ పరిధిలోకి వస్తాయ్. దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న వస్తుసేవల పన్ను...  జీఎస్టీ... ఆయా రాష్ట్రా వాణిజ్య పన్నుల శాఖ స్వరూపాన్నే మార్చేస్తుంది. శాఖ పేరే మారిపోయి వస్తుసేవల పన్ను శాఖ ముందుకు ఆయా రాష్ట్రాల పేరు రానుంది. జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి పన్ను విధించే అధికారం లేని నేపథ్యంలో వాణిజ్య పన్నులు అనే పదాన్ని తొలగించి.. జీఎస్టీ శాఖగా నామకరణం చేస్తారు. దేశంలో జీఎస్టీని అమలు చేయాలన్న ఆలోచన 1986-87లో మొదలైంది. ఆ ఆలోచన అప్పటికే 34 దేశాల్లో అమల్లో ఉండగా... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో జీఎస్టీ అమలవుతోంది. అయితే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం జీఎస్టీ అమలు చేయడం లేదు. అక్కడ రాష్ట్రాలదే పన్ను వసూలులో కీలక పాత్ర.  బ్రిజిల్ లో 4-25 శాతం, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో 20 శాతం, చైనాలో 17 శాతం, మెక్సికోలో 16 శాతం, దక్షిణాఫ్రికాలో 14 శాతం, ఆస్ట్రేలియాలో 10 శాతం, జపాన్,స్విట్జర్లాండ్ లో 8 శాతం, థాయ్ లాండ్ లో 7 శాతం, మలేసియాలో 6 శాతం, కెనడాలో 5 శాతం పన్ను వసూలు చేస్తున్నారు.  ప్రపంచంలో తొలిసారి జీఎస్టీని అమలు చేసిన దేశం ఫ్రాన్స్. జీఎస్టీ వచ్చినా... ఆ పన్ను వస్తుంది... ఈ పన్ను వస్తుంది అన్న అనుమానం చాలా మందికి కలుగుతుంది.  అయితే ద్వారా ఏఏ పన్నులు పొతున్నాయో ఒక్కసారి పరిశీలిస్తే...  ప్రస్తుతం కేంద్రం ఆయా వస్తువులు,  సేవలకు సంబంధించి విధిస్తున్న పన్నులు...  కేంద్ర ఎక్సైజ్ సుంకం, ఔషధాలు, సౌందర్య సాధనాలపై వేసే ఎక్సైజ్ సుంకాలు, అనదపు ఎక్సైజ్ సుంకాలను జౌళి, వాటి ఉత్పత్తులపై విధిస్తు్న్నారు. సీవీడీగా పిలిచే... అదనపు కస్టమ్స్ సుంకాలు, ప్రత్యేక అదనపు కస్టమ్స్ సుంకాలు, సర్వీస్ ట్యాక్స్, వస్తు, సేవలపై కేంద్రం విధించే సర్ ఛార్జులు, సెస్సులు ఇకపై ఉండవు. అదే సమయంలో జీఎస్టీ మూలంగా రాష్ట్రాలు విధిస్తున్న పన్నులు ఇకపై పూర్తిగా నిర్మూలించడం జరుగుతుంది. రాష్ట్ర విధించే పన్నులు... విలువ ఆధారిత పన్ను వ్యాట్, కేంద్ర అమ్మకం పన్ను, విలాస సుంకం, ప్రవేశ సుంకాలు, వినోదపు పన్ను, ప్రకటనలపై విధించే పన్ను, కొనుగోలు సుంకం, లాటరీలు, పందాలు, జూదాలపై విధించే పన్నులు పూర్తిగా పోతాయ్. ఆర్థికంగా దేశమంతా ఒక యూనిట్ కిందకు జీఎస్టీ తీసుకొస్తుంది. సరుకులు, సేవలకు సంబంధించి స్వేచ్ఛా వాణిజ్యం సాధ్యమవుతుంది. పెరిగే పోటీతత్వం ద్వారా వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువులు లభ్యమవుతాయ్.  ఉత్పత్తిదారులు... వినియోగదారులది దేశమంతా ఒకటే మాట... ఒకటే బాటగా ఉంటుంది. దేశమంతా ఒకటేనన్న భావన కలుగుతుంది. జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా కేంద్రం ప్రకటించింది.

జీఎస్టీ ద్వారా వస్తువుల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతున్నాయ్. నిత్యవసర వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే...  జీఎస్టీ ద్వారా పెరుగుతున్న వస్తువుల ధరలు ఏంటి? తగ్గుతున్న వస్తువుల ధరలు ఏంటి? ఎవరు ఎంత చెప్పినా క్లారిటీ రావడం లేదా... అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మేం చేస్తున్నాం...
వస్తు, సేవల పన్ను, జీఎస్టీ అమలు ద్వారా పన్నుల శ్లాబులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. 5 శాతం, 12 శాతం 18 శాతం, 28 శాతంగా నాలుగు రకాలుగా పన్నులు వసూలు జరుగుతుంది. అయితే కీలక నిత్యవసర వస్తువుల ధరల్లో ఎలాంటి మార్పు రాకుండా వాటి విషయంలో ఇప్పటి వరకు ఉన్న కొన్ని పన్నులను పూర్తిగా ఎత్తివేశారు. అంటే ఇప్పటి వరకు పాల ఉత్పత్తులు, ఇతర నిత్యవసర వస్తువులపై ఉన్న స్వల్ప పన్నులు కూడా ఇకపై ఉండబోవన్నమాట. జీఎస్టీ అమలుతో పలు వస్తువుల రేట్లు పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయా రేట్ల తయారీ సంస్థలు రేట్లు పెరగకుండా... తమ ఆదాయాన్నే తగ్గించుకుంటాయని స్పష్టం చేస్తున్నాయ్. ఇప్పటికే ద్విచక్రవాహనాలు సంస్థలు, భారీ వాహనాల తయారీ సంస్థలు రెట్లను తగ్గిస్తున్నాయని చెప్పాయ్. హీరో, హోండా సంస్థలు ద్విచక్రవాహనాలపై రూ. 3 వేల నుంచి 5 వేల వరకు తగ్గింపు ప్రకటించాయ్. తాజాగా అదే దారిలో సెల్ ఫోన్ తయారీ సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్టుగా పేర్కొన్నాయ్. మొన్నటి వరకు ఇంపోర్ట్ చేసుకున్న సెల్ ఫోన్ ధరలపై 5 శాతం వ్యాట్, ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీని విధించేవారు. అయితే ఇప్పుడు జీఎస్టీ కింద 12 శాతం పన్నును ప్రతిపాదించారు. అంటే ట్యాక్స్ డబుల్ అయ్యింది. అయితే వినియోగదారులు ఎక్కడ తమ సెల్ ఫోన్లు కొనుగోలు చేయరన్న బెంగలో ఉన్న కంపెనీలు...  తామే లాభాలను తగ్గించుకుంటామంటూ ముందుకు వచ్చాయ్. జీఎస్టీ కారణంతో తమ ధరలను పెంచబోమని శాంసంగ్‌, షియోమి, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్‌, లావా కంపెనీలు చెప్పాయి. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్.ఎం.సి.జి) ఉత్పత్తులలోని 81 శాతానికి పైగా ఉత్పత్తులకు 18 శాతం పన్నుగా నిర్ణయించారు.  వీటి పన్ను గతంలో 22 నుంచి 24 శాతం వరకు ఉంది. ఈ మేరకు నాలుగు నుంచి 6 శాతం మేర ఉత్పత్తుల ధరలను ఆయా కంపెనీలు వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ ధరల్లో మార్పులు వినియోగదారులకు  తాజా తగ్గింపు వల్ల ఉత్పత్తులకు గిరాకి పెరుగుతుందని... ఆర్థిక వృద్ధికి కారణమవుతుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పెయింట్లు, షాంపూలు, డిటర్జంట్లపై మాత్రం 28 శాతం పన్ను విధించారు. ఇవి ఎఫ్.ఎం.సి.జీ ఉత్పత్తుల్లో 19 శాతం ఉన్నాయ్. సిమెంటుకు జీఎస్‌టీనీ 28 శాతంగా నిర్ణయించారు. గతంలో సిమెంట్‌పై పరోక్ష పన్నుల కింద 24- 25 శాతం వరకు వసూలు చేసేవారు. బొగ్గురేటుపై పన్ను తగ్గించినందు వల్ల సిమెంట్ ధరల్లో పెద్దగా వ్యాత్యాసం రాదన్న అభిప్రాయం విన్పిస్తోంది. నిర్మాణాలపై జీఎస్‌టీ రేటు 18 శాతంగా నిర్ణయించినా, భూమి విలువను మినహాయిస్తున్నందున, చెల్లించేది 12 శాతమే ఉండనుంది. ఇక తయారీ రంగం లో వస్తున్న మార్పులు అలా ఉంటే... కీలకమైన సేవల రంగంలో... దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కన్పిస్తోంది. గతంలో అన్ని రకాల సేవలపై 15 శాతం పన్ను విధించేవారు. జీఎస్‌టీలో సేవలపై 5%, 12%, 18%, 28% చొప్పున పన్ను రేట్లను ఖరారు చేశారు. టెలికాం, ఆర్థిక సేవలపై 18 శాతం  పన్ను విధించారు. గతంతో పోలిస్తే 3 శాతం ఎక్కువ.  ఇక బ్యాంకింగ్ సేవలతో జనం జేబులుకు చిల్లుల పడటం ఖాయం. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులపైనా, ఇన్సూరెన్స్ ప్రీమియమ్లపైనా బిల్లులు తడిసిమోపడవనున్నాయ్. ఇప్పటి వరకు ఆ పన్ను 15 శాతంగా ఉండగా... ఇకపై అది 18 శాతానికి  పెరగుతుంది. క్రెడిట్ కార్డును పది వేల రూపాయల బిల్లు వస్తే ఇకపై 18 శాతం పన్నుతో రూ. 180 టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక ఇన్సూరెన్స్ ప్రీమియమ్లకు సైతం అదే విధంగా ఛార్జి వసూలు చేస్తారు. రూ. 20 వేల ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవారు రూ. 360 టాక్స్ కట్టాల్సిందే.  రవాణా సేవలపై జీఎస్‌టీని 5 శాతం విధించనున్నారు. ఇది విమానయాన సంస్థలకు కలిసొచ్చే పరిణామం. అంతక్రితం ఉన్న 15 శాతంతో పోలిస్తే పన్ను భారం గణనీయంగా తగ్గుతుండటమే కారణం. సినిమా టిక్కెట్లపై జీఎస్‌టీని అత్యధిక స్లాబైన 28 శాతంగా నిర్ణయించారు. గతంలో సినిమా టికెట్లపై సేవా పన్నుతో పాటు వినోదపు పన్ను కింద 28 శాతం నుంచి 100 శాతం వరకు ఉండేది.  పైవ్‌ స్టార్‌ హోటళ్ల సేవలను కూడా 28 శాతం స్లాబ్‌లోకి చేర్చారు. ఎలక్ట్రానిక్ వస్తువులపై 28 శాతం పన్ను ఖరారు చేశారు. గతంలో గృహోపకరణాలపై 23 శాతం పన్ను ఉండగా... అది 5 శాతం మేర పెరగనుంది. టీవీలు, ఫ్రిజ్ లు, ఏసీల ధరలు 2 నుంచి 5 శాతం మేర పెరిగే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. ఎలక్ట్రానిక్ పరికరాలపై కంపెనీలపై కంపెనీలు 5 శాతం మేరకు ఆదాయాలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారంపై జీఎస్టీని 3 శాతంగా నిర్ణయించారు. గతంలో అన్ని రకాల పన్నులు కలుపుకొని 12.4 శాతంగా ఉన్న పన్ను... ఇప్పుడు 14 శాతమవుతోంది. దాంతో బంగారు అభరణాలపై ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయ్. పాల ఉత్పత్తులు కూడా తగ్గే అవకాశం కన్పిస్తుంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ధరలు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించాయ్. త్వరలో ఇతర పాల ఉత్పత్తుల సంస్థలు సైతం ధరలు తగ్గించే అవకాశం ఉంది. జీఎస్టీ ప్రభావంతో కార్ల ధరలు కిందకి దిగొస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ తన కార్ల ఎక్స్‌షోరూం ధరలన్నింటి పైనా 3 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు కార్లపై 28 శాతం కంటే పన్ను ఉండటం వల్ల...  జీఎస్టీ అమలు తర్వాత కార్ల రేట్లు కొంత మేర తగ్గబోతున్నాయ్. ఆల్టో, స్విఫ్ట్‌, డిజైర్‌, ఐ20 ఎలైట్‌ వంటి కార్లపై కనీసంగా రూ.6,500 నుంచి .. రూ.15వేల వరకు ధరలు తగ్గబోతున్నాయ్.  ప్రస్తుతం ఈ కార్లపై 31.4 శాతం పన్ను రేట్లు ఉండగా.. వాటిని జీఎస్టీ రేటు కింద 29 శాతానికే తీసుకొచ్చారు. మిడ్‌ సైజు కార్లపై పన్ను రేట్లు ​కూడా 3.6 శాతం మేర తగ్గుతున్నాయ్. హోండా సిటీ, హ్యుందాయ్‌ వెర్నా, మారుతీ సియాజ్‌, ఫోక్స్‌వాగన్‌ వెంటో వంటి సెడాన్ల ధరలు కనీసం 30వేల రూపాయల వరకు తగ్గనున్నాయ్. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ వంటి కంపెనీలు ఇప్పటికే రూ.1.25 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.
సింపుల్ గా చెప్పాలంటే... రెడీ మేడ్ దుస్తులపై ఇప్పటి వరకు ఉన్న 12 శాతం పన్ను బదులు 5 శాతం పన్ను వసూలు చేస్తారు. హెయిర్ ఆయిల్, టూత్ పేస్టులు, సబ్బులు, చాక్లెట్లు, బిస్కెట్లు, బర్త్ డే కేకుల రేట్లు గతం కంటే తగ్గుతాయ్. 28 శాతం నుంచి 18 శాతానికి పన్ను తగ్గుతోంది. టీ, కాఫీ పౌడర్  రేట్లు 11 శాతం మేర తగ్గుతాయ్. చక్కరె పన్ను 5 శాతం స్లాబులో మారుతోంది. చెప్పులు, బూట్ల ధరలు కూడా కొంత తగ్గుతాయ్. రూ. 500 లోపు ఉన్న వాటిపై 5 శాతమే పన్ను విధిస్తున్నారు. ఫర్నిచర్ 29 శాతం నుంచి 12 శాతం పరిధిలో వస్తోంది. ఫోన్లు 6 శాతం నుంచి 12 శాతానికి మారుతున్నాయ్. బైకుల రేట్లు కొంత వరకు దిగొస్తాయ్. ఖరీదైన కార్ల ధరలు తగ్గుతున్నాయ్.
దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చే జీఎస్టీ విషయంలో విభేదాలు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయ్. కాంగ్రెస్, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు జీఎస్టీ ప్రారంభ కార్యక్రమాన్ని నిషేధిస్తే... ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సమర్థించాయ్.  ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై పోరు సాగించిన విపక్షాలు జీఎస్టీ విషయంలో మాత్రం చీలిపోయాయ్. కాంగ్రెస్ పార్టీ జీఎస్టీని వీలైనంత త్వరగా అమలు చేయాలని చాన్నాళ్ల క్రితమే ప్రయత్నించింది. అయితే తాజాగా జీఎస్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దేశానికి అత్యంత  కీలకమైన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది... అమలు చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా వ్యవహరించకూడదన్న అభిప్రాయం విన్పిస్తోంది. పెద్ద నోట్ల రద్దు మాదిరిగానే జీఎస్‌టీని దూరదృష్టి లేకుండా అమలు చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్  దుయ్యబట్టారు. జీఎస్‌టీని కాంగ్రెస్ మొదటి నుంచి బలపరుస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే దీనిని అసమర్థ, మతిలేని ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక, దూరదృష్టి, సంస్థాగత సన్నద్ధత లేకుండా అమలు చేస్తోందన్నారు. మరోవైపు జీఎస్‌టీ పన్నుపై కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం పెదవి విరిచారు. ఇప్పుడు అమల్లోకి వచ్చింది  జీఎస్‌టీ కాదని... నిపుణులు తయారు చేసిన ముసాయిదా ప్రకారం లేదని...  ద్రవ్యోల్బణంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తే... ఇప్పుడే అదే పార్టీలు జీఎస్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ముందు వరుసలో ఉండటం విశేషం. విపక్షంలో కీలక నేతగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అందరికంటే ముందు వరసులో అద్వానీ పక్క సీట్లో కూర్చోవడం విశేషం. అదే సమయంలో బీఎస్పీ, ఎస్పీ పార్టీ నేతలు సైతం హాజరయ్యారు. ఇక మాజీ ప్రధాని దేవగౌడ సైతం ప్రధాన వేదికపై కూర్చోవడం విశేషం. జీఎస్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసిన పార్టీల్లో కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, లెఫ్ట్, డీఎంకే, ఎన్సీ, ఆర్జేడీతోసహా కొన్ని చిన్న చితకా పార్టీలున్నాయ్. బెంగాల్ సీఎం మమత బెనర్జీ... జీఎస్టీ అమలును తూర్పారబడుతున్నారు. జీఎస్టీ చారిత్ర తప్పిదమంటూ మమత బెనర్జీ మండిపడుతున్నారు. జీఎస్టీ బదులు దేశమంతటికీ సమగ్రమైన బిల్లు తీసుకొస్తే సరిపోయేదన్న అభిప్రాయాన్ని ఆమె విన్పిస్తున్నారు. మొత్తం జీఎస్టీపై రాజకీయ పార్టీల్లో విభేదాలు స్పష్టంగా కన్పించాయ్. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంటోంది. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని... దేశానికి సంబంధించి విషయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. నిజమే.... జీఎస్టీ కేంద్ర ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చే బిల్లు అనడంలో ఎంత మాత్రం అనుమానం లేదు.
కంపెనీలకు అన్ని లాజిక్కులూ తెలుసు. జీఎస్టీ ద్వారా కేంద్రం 5, 12, 18, 28 శాతమంటూ ట్యాక్సులను తీసుకొస్తే... కార్పోరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులు అమ్ముకోడానికి 5, 10, 15, 25 శాతం డిస్కౌంట్లంటూ వినియోగదారులను ఊరిస్తున్నాయ్. రండి బాబు రండి  ఇంతకంటే చౌక బేరం ఇక లేదంటూ జనాలకు గాలం వేస్తున్నాయ్.

జీఎస్టీ

దేశమంతా ఒకే బాదుడు

దేశ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావం చూపే నిర్ణయం. దేశంలో ఇకపై ఒకటే పన్ను. ఒకే విధానం. ఎక్కడకెళ్లినా... ఒకటే ధర. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటూ కేంద్రం తీసుకొస్తున్న గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్...  జీఎస్టీ ఇప్పుడో సంచలనం. దేశంలో ఉన్న పన్ను ఉగ్రవాదానికి చెరమగీతం పాడేందుకే కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతోంది. అయితే జీఎస్టీ విషయంలో ఎంతో అలజడి రేగుతోంది. ఎవరికి లాభం... ఎవరికి నష్టం...  దీనిపైనే చర్చంతా జరుగుతోంది. తాజా బిల్లుతో నాకేంటి... నీకేంటంటూ జనం చెవులు కొరుక్కుంటున్నారు. రోజూ వాడే మందుల ధరలు పెరుగుతాయా... అని ఒకరు భయపడుతుంటే.. ఆధునిక సమాజంలో వినియోగిస్తున్న ఫ్యాషన్ ట్రెండ్స్ ధరల పరిస్థితేంటంటూ మరికొందరు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీతో లాభమూ... నష్టమూ?  ఏం జరుగుతుందోనన్న బెంగ ఎక్కువుతోంది. మధ్యతరగతి గీతకు కొంచెం పైబడి ఉన్న వ్యక్తికి మాత్రం జీఎస్టీ షాక్ తప్పదన్న సంకేతాలను పరిశ్రమ వర్గాలు విన్పిస్తున్నాయ్. షాపింగ్ లంటూ బాజర్లకెళితే జేబులు గుల్లేనంటున్నారు. ఎగువ మధ్యతరగతి వర్గాలకు మాత్రం బాదుడు తప్పవంటోంది.  క్యాష్ ట్రాన్సక్షన్స్ కు కాలం చెల్లడంతో... బంగారం కొనడం అమ్మడం కూడా కష్టమైపోనుంది. రియల్ వర్గాల్లోనూ తాజా నిర్ణయం ఎలాంటి  ప్రభావం చూపుతుందోనన్న బెంగ ఎక్కువుతోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇప్పుడు ఒక అంతుబట్టని బ్రహ్మపదార్థంలా మారుతోంది. జీఎస్టీతో కొత్తగా వచ్చే మార్పులేంటి? ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్రం జీఎస్టీని ఎందుకు తీసుకొస్తుంది. ? ఇంత‌కుముందు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ‌స్తువుపై ప‌న్ను రేటు ఒక్కో విధంగా ఉండేది. ఒకసారి జీఎస్టీ వ‌స్తే ఇందులో ఏక‌రూప‌త... అంటే ఒకే విధమైన పన్ను విధానం వ‌స్తుంది. జీఎస్టీ ప‌న్ను రేటు ఒకేలా ఉన్న వ‌సూలు విధానం రాష్ట్ర భుత్వాల‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మూడు నియంత్రణా వ్యవస్థల ద్వారా పన్ను వసూలు జరుగుతుంది. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంటిగ్రేడెట్ జీఎస్టీ.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల వసూళ్ల ప్రక్రియ సులభతరం అవుతుందన్న ఉద్దేశంతో జీఎస్టీని  కేంద్రం తీసుకువస్తోంది. దేశ వ్యాప్తంగా ఏకరూప పన్ను విధానం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని కేంద్రం వాదిస్తోంది. ఒక్కో రాష్ట్రంలో  ఒక్కో విధంగా ఇకపై పన్నులు ఉండవని... ఏ వస్తువుపైనా, ఏ సేవైనా సరే ఒకే విధమైన పన్ను పద్ధతి అమల్లోకి వస్తోందని పేర్కొంటోంది.
ప్రస్తుతం వివిధ సంస్థలపైనా, ఆయా వ్యక్తులపైనా వసూలు చేస్తున్న పలు రకాల పన్నులకు బదలు ఒకటే పన్నును జీఎస్టీ రూపంలో  వసూలు చేయబోతున్నారు. తాజా నిర్ణయం ద్వారా పన్నుల ఎగవేతను చాలా వరకూ అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. పన్నుల భారం తగ్గుతుంది కాబట్టి వర్తకులు, వ్యాపారస్థులు కూడా ఎగవేతకు ఆలోచించచకుండా... నిజాయితీగా పన్నులు చెల్లిస్తారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో వివిధ రకాల పన్నులు వసూలు చేసేందుకు అయ్యే వ్యయం కూడా తగ్గుతుంది. ప్రభుత్వ ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుంది.
ప్రస్తుతం దేశంలో ఆయా వ్యక్తులు పలు రకాల పన్నులను చెల్లిస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్,  కౌంటర్వెయిలింగ్ డ్యూటీ, స్పెషల్ కౌంటర్వెయిలింగ్ డ్యూటీ, వాల్యూ యాడెడ్ ట్సాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ , ఆక్ట్రాయ్, ఎంటర్ టైన్మెంట్ ట్యాక్,  ఎంట్రీ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్, లాటరీలపై వేసే పన్నులు ఇలా...  రకరకాల ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేకుండా కేవలం ఒకేటా ట్యాక్స్ ను చెల్లించేందుకు అవకాశం కల్పిస్తోంది జీఎస్టీ.  రకరకాల పన్నుల స్థానంలో ఒకటే ట్యాక్స్ తో పాటుగా కస్టమర్ ఎంత పన్ను చెల్లిస్తున్నాడో కూడా ఈజీగా తెలుసుకునే వీలుకలుగుతుంది.
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌, పన్ను చెల్లింపు, రీఫండ్‌ చాలా సులువు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే పరోక్ష పన్ను రేటు అమలు అయ్యేందుకు జీఎస్‌టీ వీలుకల్పిస్తోంది. ఆదాయపన్ను అంచనాలను సైతం ముంబయిలో ఉన్న వ్యక్తి పాట్నాలో చెల్లించవచ్చు. హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి ఢిల్లీలో పన్ను చెల్లించవచ్చు. ఇలా ఎవరు ఎక్కడైనా సరే పన్ను చెల్లించుకోవచ్చు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్న పన్ను సైతం ఉండదు. అన్ని చోట్ల కూడా యూనివర్శల్ పన్ను రాబోతోంది. ఒక వస్తువును ఎక్కడ కొనుగోలు చేసినా ఒకే ధర ఉంటుంది. ఇప్పటి మాదిరిగా ప్రాంతాన్ని, పన్ను రేటును బట్టి వస్తువు ధర మారిపోయే పరిస్థితి ఇకపై ఉండదు. ఎక్కడ ఎవరు ఏ వస్తువు కొన్నా ఒకే విధంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆయా వస్తువుల రేట్లు కూడా ఒకే విధంగా ఉండబోతున్నాయన్నమాట.
అన్ని వస్తువులు, సేవలపై జీఎస్‌టీ ఉంటుంది. మద్యం, ముడి చమురు, హైస్పీడ్‌ డీజిల్‌, పెట్రోలు, సహజ వాయువు, విమాన ఇంథనం పై జీఎస్‌టీ పన్ను ఉండదు. ఆయా వస్తువుల కేటగిరీలోను బట్టి నాలుగు స్లాబుల్లో పన్ను వసూలు చేస్తున్నారు. అంతిమ సేవ, వ‌స్తు అమ్మకం, విక్రయం లేదా వినిమ‌యం ఎక్కడ జ‌రిగితే అక్కడ ప‌న్ను ఉండేలా జీఎస్టీని రూపొందించారు. దేశం లోప‌ల జ‌రిగే ప్రతి వ‌స్తు, సేవ పన్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. ఇంత‌కుముందు అంత‌రాష్ట్ర స‌ర‌ఫ‌రాల మ‌ధ్య చాలా తేడాలు ఉండేవి. వాటిపై ప‌న్ను నిర్ణయాధికారంలో తేడాలుండేవి. అయితే జీఎస్టీ వచ్చిన త‌ర్వాత రాజ్యాంగ స‌వ‌ర‌ణ ప్రకారం నిర్ణయించిన రేట్లు అమ‌ల‌వ్వాల్సిందే.

జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ విధానంలో పన్నుల విధానం ఎలా ఉండబోతుందని అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయ్. జీఎస్టీ మండ‌లి సూచించిన దాని ప్రకారం నాలుగంచెల ప‌న్ను వ్యవ‌స్థ కేంద్రం అమ‌లు చేస్తుంది. ఇందులో 5%, 12%, 18%, 28% ప‌న్నులు... నాలుగు రకాలుగా ఈ పన్నులు ఉంటాయి. నిత్యవసర వ‌స్తువుల‌ను జీఎస్టీ నుంచి మిన‌హాయించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయా వస్తువుల పన్నుల ధరలు ఎలా ఉండబోతున్నాయో ఓసారి చూద్దాం... అతి సామాన్యుడికి మాత్రం జీఎస్టీ పన్ను పోటు ఉండదు. మధ్యతరగతి వారికి ఓ మోస్తరు పోటు ఉంటుంది. ఎగువ మధ్యతరగతి వర్గాలు, సంపన్న వర్గాలకు జీఎస్టీ కొంచెం మేదం... కొంచెం ఖేదంగా చెప్పుకోవచ్చు. సుఖాన్ని కలిగించే సౌకర్యాలకు పన్ను బాదుడు ఒక రేంజ్లో ఉంటే.. విలాసాల మీద మోజున్న వారికి మాత్రం చుక్కలు కనిపించేలా ఫిక్స్ చేశారు. తాజా జీఎస్టీ బాదుడు ప్రకారం నిరుపేదకు ఓకే కానీ..దిగువ.. మధ్యతరగతి వారికి ఇబ్బందిగా మారితే.. ఎగువ మధ్యతరగతి వారికి మాత్రం దిమ్మ తిరిగిపోతుంది.
ఖజానాకు భారీ ఆదాయాన్ని తీసుకొచ్చేలా భారీగా పన్నుల అమలు విషయంలో సంస్కరణలను కేంద్రం ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం పన్నులు లేని వస్తువులను ఓసారి చూస్తే... ఆహార ధాన్యాలు, పాలు పాల ఉత్పత్తులకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చారు. బియ్యం, గోధుమలు ఇతర ఆహార ధాన్యాలు, పాలు, పెరుగు,  కోడిగుడ్లు, ప్యాకింగ్ చేయని పన్నీరు, తేనె, కూరగాయలు, పండ్లు, గోధుమపిండి, బెల్లం, శనగపిండి, మైదా,  బ్రెడ్, వెజిటబుల్ ఆయిల్స్, ఉప్పు, బొట్లు, కుంకుమ, గాజులు, అప్పడాలు, స్టాంపులు, జుడీషియల్ డాక్యుమెంట్లు,  ప్రింట్ చేసిన పుస్తకాలు, గాజులు, చేనేత వస్తువులు, గర్భనిరోధకాల విషయంలో ఇప్పటి వరకు ఎలా ఉందో... అదే పద్ధతి కంటిన్యూ అవుతుంది. ఇక 5 శాతం పన్ను పరిధిలోకి వస్తున్న వస్తువుల వివరాలను చూస్తే... అత్యవసర వస్తువులైనప్పటికీ... కచ్చితంగా మనం రోజూ వినియోగించే వస్తువులనే చెప్పాలి. చక్కెర, టీ, కాఫీ, వంట నూనెలు, బొగ్గు, పాలపొడి, పిల్లలకిచ్చే పాలపొడులు,  కండెన్సడ్ పాలు, ప్యాక్ చేసిన పన్నీర్, న్యూస్ పేపర్లు, గొడుగులు,  కిరోసిన్,  ఎల్ పీజీ, చీపుళ్లు,  వెన్న,  నిల్వ ఉంచే కూరగాయలు,  మసాలా వస్తువులు, చేప మాంసం, పిజ్జా బ్రెడ్, పండ్ల రసాలు, సగ్గుబియ్యం,  మందులు,  స్టెంట్ లు, లైఫ్ బోట్ లు ఉన్నాయ్. ఇప్పటి వరకు ఈ వస్తువులకు ఆయా రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పన్ను వసూలు చేస్తున్నారు. అయితే ఈ వస్తువులపై పన్ను ఇప్పుడు కొత్త పన్నుకు పెద్ద తేడా లేదన్న అభిప్రాయం ఉంది.  రూ. 500 లోపు ఉన్న చెప్పులపై మాత్రం 5 శాతం పన్ను విధిస్తారు.  పెట్రోల్ ను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించడంతో విమానం.. రైళ్లు.. బస్సు టికెట్లు తక్కువ పన్ను శ్లాబ్ లోనే ఉంటాయి.
12 శాతం పన్ను వసూలు చేసే వస్తువుల విషయంలో మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపెట్టనుంది. ఇప్పటి వరకు మధ్యతరగతి ప్రజలు అవసరాలుగా భావిస్తూ వచ్చారు. ఇకపై ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి మిడిల్ క్లాస్ ప్రజలు సైతం ఆలోచించుకోవాల్సిందే...  వెన్న,  నెయ్యి,  మొబైల్ ఫోన్ లు,  జీడిపప్పు,  బాదంపప్పు, సాస్ లు,  ఫ్రూట్ జ్యూస్ లు,  ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు, అగరుబత్తి, ఫ్రోజెన్ మాంసాహారం, యానిమల్ ఫాట్,  మిక్సర్లు, ఆయుర్వేద మందులు, పళ్లపొడి, కుట్టు మిషన్లు, కలర్ పుస్తకాలు ఈ కేటగిరీలో ఉంటాయ్.
ఇక 18 శాతం పన్ను విధించే వస్తువులు చూస్తే... వాటికి ఇంత ఘనం పన్ను ఉందా అనుకుంటాం. ఎందుకంటే మనం వాటికి ఎంత చెల్లిస్తున్నామో కూడా పట్టించుకోం. అయితే ఆయా వస్తువులకు ఇప్పుడు జీఎస్టీ బోర్డు 18 శాతం మేర పన్ను విధిస్తోంది. హెయిర్ ఆయిల్స్, సబ్బులు, టూత్ పేస్టులు, పాస్తా, కార్న్ ఫ్లేక్స్,  జామ్ లు, ఐస్ క్రీమ్ లు, టాయిలెట్ పేపర్,  ఫేసియల్ టిష్యూలు, ఐరన్, స్టీల్,  ఫౌంటెన్ పెన్నులు, మినరల్ వాటర్, కెమెరాలు, స్పీకర్లు, ఎన్వలప్ కవర్లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలు, వస్తువులను తయారు చేసే యంత్ర సామగ్రి, పరిశ్రమ వర్గాలు ఉపయోగించే వస్తువులు, టెలికాం సేలవలు, ఫైనాన్షియల్ సేవలు వినియోగించాలంటే చేతి చమురు వదలాల్సిందే... ఈ వస్తువుల పేర్లు చెబితే కొన్నిసార్లు అవసరాలుగా ఉంటాయ్. మరికొన్ని సార్లు విలాసాలుగా అన్పిస్తా్య్. ఈ తరహా వస్తువులకు వేస్తున్న పన్ను 28 శాతం. వంద రూపాయలకు వస్తువు కొనుగోలు చేస్తే పన్ను కట్టాలి. అంటే వెయ్యికి 280 రూపాయలు. పదివేలకు 2800 పన్ను కట్టాలి. ఈ కేటగిరిలో ఉన్నవి కార్లు, మోటర్ సైకిళ్లు, సిమెంట్, చూయింగ్ గమ్, కస్టర్డ్ పౌడర్, పాన్ మషాలా, పర్ఫ్యూమ్ లు,  షాంపూ,  మేకప్ సామగ్రి,  బాణాసంచా, వాషింగ్ మిషన్లు,  పెయింట్లు, డియోడరెంట్లు, షేవింగ్ క్రీమ్ లు, హెయిర్ డై, వెండింగ్ మిషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు,  డిష్ వాషర్లు, హెయిర్ క్లిప్పర్లు, ఏసీలు,  ఫ్రిజ్ లు, చాక్లెట్లు, చాక్లెట్ కోటెడ్ వేఫర్స్,  సన్ స్క్రీన్ లోషన్లు, షాంపూలు, ఆప్టర్ షేవ్ లోషన్లు,  రేజర్ బ్లేడ్లు, పింగాణీ సామగ్రి, పిస్టల్స్,  రివాల్వర్లు, ఫాక్స్ మిషిన్లు, రిస్ట్ వాచ్ లు, ఇన్సులేటెడ్ కాపర్ వైర్లు, స్టార్ హోటళ్లు,  రేస్ బెట్టింగ్ లు,  క్లబ్ లు, సినిమా టికెట్లు ఉన్నాయ్. పై కేటగిరిలోని అంశాలు కొన్నిసార్లు విలాసాలుగా అన్పించినా మరికొన్ని సార్లు అవసరాలుగా ఉంటాయి. చిన్న ఇళ్లు కట్టుకోవాలనుకున్న వ్యక్తికి సిమెంట్ ధర అవసరం. అదే నాలుగైదు బిల్డింగులు ఉన్నవారు కట్టుకుంటే అది విలాసం కిందకు వస్తుంది. మారిపోతున్న జీవన విధానంలో సామాన్యుడు  కనీసం మోటర్ సైకిల్ కొనుగోలు చేయలేని విధంగా ట్యాక్స్ దారుమన్న అభిప్రాయం ఉంది. ఇక సామాన్యుడు సేదదీరే బుల్లితెర పన్ను  ఇకపై 28 శాతమంటే సినిమా టికెట్ల రేటులు తడిసిమోపెడు అవ్వబోతున్నాయ్.   హోటల్ బిల్లులు కూడా మోతమోగించనున్నాయ్. రెస్టారెంట్లో తినాలన్నా... హోటల్ లో బస చేయాలన్నా ఇకపై 28 శాతం పన్ను కట్టాల్సిందే.
ఇక జనం మానుకోవాల్సిన వాటిపై జీఎస్టీ నడ్డివిరిగేలా పన్నులు విధిస్తోంది.  సిగార్ ల మీద 109 శాతం, పొగాకు ఉత్పత్తుల మీద సుంకాలు కలుపుకొని 45 శాతం పన్ను, పాన్ మసాలాలపై సుంకాలతో కలిపి మొత్తం 44.8 శాతం పన్ను,  శీతల పానీయాలపై  31.36 శాతం పన్ను విధిస్తున్నారు. ఇక  350 సీసీ సామర్థ్యం ఉన్న బైక్ ల మీద సుంకాలతో కలిపి 28.84 శాతం పన్ను విధించారు. అదే సమయంలో మధ్యతరగతి ప్రజలు వాడే లగ్జరీ కార్లపై 32.2 శాతం పన్ను విధిస్తున్నారు. ఇక అతి ముఖ్యమైన  రియల్ ఎస్టేట్ విషయంలో జీఎస్టీ పన్ను 12 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. ఆందోళన అవసరం లేదని... ఇప్పుడున్న ఇతర రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీలకు సమానంగానే   పన్ను ఉంటుందన్న అభిప్రాయాన్ని రియల్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. జీఎస్టీలో రియల్ వర్గాల పై వేసే పన్నుకు సంబంధించి భూమి వాల్యూ తీసేసి 12 శాతంగా ఉంచాలంటూ రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయ్. భూమి ఆధారంగా 12 శాతం వసూలు చేస్తే రియాల్ ఎస్టేట్ బిజినెస్ కష్టతరమవుతుందని వారు చెబుతున్నారు. జీఎస్టీకి వసూలు చేస్తున్న 12 శాతాన్ని రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి వసూలు చేయాలని క్రెడాయ్ వర్గాలు పేర్కొంటున్నాయ్.  ప్రస్తుతం 6 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. బిల్డింగ్ మెటీరియల్ కొనుగోలు సందర్భంగా చెల్లిస్తున్న పన్నులను ఇన్ పుట్ ట్యాక్స్ ను  తిరిగి చెల్లించడం ద్వారా ఓవరాల్ గా పన్ను 12 శాతం లోపు ఉండాలన్నది వారి నిశ్చాతాభిప్రాయం. వడ్డీరేట్లు తగ్గడం ద్వారా రియల్ బిజినెస్ జోరందుకుంటుందని భావిస్తున్నారు.

కొత్తగా అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను...  జీఎస్టీ బిల్లును బాలీవుడ్ స్వాగతించినప్పటికీ...  దేశ వ్యాప్తంగా సినీరంగంపై 28 శాతం స్లాబ్ రేట్ విధించడంపైనే పరిశ్రమ వర్గాల్లో అంసతృప్తి వ్యక్తమవుతోంది. సినీ పరిశ్రమ విషయంలో ఇప్పటివరకు అమలులో వున్న ఎంటర్‌టైన్‌మెంట్, సర్వీస్ టాక్సుల స్థానంలో...   28శాతం స్లాబ్ రేట్ అమలులోకి రానుంది. తాజా స్లాబ్ పై బాలీవుడ్ ఖుషీగా ఉంటే దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల సినీ వర్గాలు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయ్. దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషా చిత్రాలపై వినోదం పన్ను సున్నాకే పరిమితం కాగా, బెంగాలీ సినిమాలపై రెండు శాతం, తెలుగులో చిన్న సినిమాలకు ఏడు నుంచి 18 శాతం వరకు వసూలు చేస్తున్నారు. తాజాగా ఆ భారం 28 శాతం కానుంది.  సినిమాహాళ్ల టికెట్ల ధరలు దారుణంగా పెరిగి సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమాలపై ముంబయ్ లో 40 శాతం ట్యాక్స్ ఉంది. వారికి  అది ఇప్పుడు 28 శాతానికి తగ్గిపోనుంది. అంటే 12 శాతం మేర బాలీవుడ్ సినిమాలకు భరోసా కలగనుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో టాలీవుడ్ తో సహా... ఇతర భాషల ఇండస్ట్రీలపై 28 శాతం పన్ను పడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సినిమాలపై పన్ను 18 శాతంగా మాత్రమే ఉంది. అయితే అన్ని పన్నులు ఎత్తివేసినా తమపై రాష్ట్ర ప్రభుత్వ పన్ను పడితే మనుగడ సాగించడం కష్టమన్నది సినీ వర్గాల వాదన. జీఎస్టీకి తోడు మరే ట్యాక్సు ఉండకూడాదన్నది కేంద్రం వాదన. రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు శాతం పన్ను విధిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమా మనుగడ కష్టసాధ్యమవుతుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ... పన్నులను మూడు రకాలుగా విధించాలంటూ కోరుకుంటోంది. ఇతర రాష్ట్రాల్లో నిర్మాణమైన తెలుగేతర సినిమాలకు ఒకరకంగా... ప్రాంతీయ చిత్రాలకు మరో రకంగా ట్యాక్స్ వేస్తూ...  వంద థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకు మరోరకమైన ట్యాక్స్... వేయాలని నిర్మాతలు కోరుతున్నారు. ఒకవేళ వారిపై కూడా 28 శాతం ట్యాక్స్  వేస్తే ఇతర ఖర్చులు అన్నీ పోను వందకు రూ. 40 కూడా మిగలవన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. స్లాబుల రూపంలో ట్యాక్స్ విధిస్తే మంచిదని... పెద్ద సినిమాలకు ట్యాక్స్ వేసుకోవడం వల్ల ఇబ్బంది కలగదని వారు చెబుతున్నారు. జీఎస్టీ బిల్లుని తాము స్వాగతిస్తున్నప్పటికీ... సినీపరిశ్రమపై విధించిన 28 శాతం లెవీనే తాము వ్యతిరేకిస్తున్నామని స్టార్ హీరో కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఈ రేటుని సగానికి తగ్గించి 12-15 శాతం పన్ను విధించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. అలా జరగని పక్షంలో తాను సినీపరిశ్రమకి గుడ్‌బై చెప్పడానికైనా వెనుకాడనని స్పష్టంచేశారు కమల్. ఈ జీఎస్టీ స్లాబ్ రేటుపై స్పందించిన ఫిలిం అండ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ అధ్యక్షుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఇప్పటికే పైరసీ బారినపడి కుదేలవుతున్న సినీపరిశ్రమపై ఈ స్లాబ్ రేటు ఊహించని షాక్‌ని ఇచ్చిందన్నారు సిద్ధార్థ్ రాయ్ కపూర్. ఈ స్లాబ్ రేటుని కేవలం 5శాతానికే పరిమితం చేయాల్సిందిగా తాము ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ, ప్రభుత్వం టికెట్‌పై 28శాతం స్లాబ్ రేట్ వసూలు చేయాలనుకోవడం బాధాకరం అని కపూర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
వస్తు, సేవల పన్ను విషయంలో పలు  రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తవుతున్నాయ్. ఇప్పటికే ఢిల్లీ, బెంగాల్ ప్రభుత్వాలు తాము జీఎస్టీని ఆమోదించలేమని... మరికొంత కాలం కావాలంటూ కేంద్రానికి తేల్చిచెప్పాయ్. అదే సమయంలో జీఎస్టీతో రాష్ట్రాల పరిస్థితేంటన్న బెంగ పలు రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరుక ఖజానాపై ఉన్న అజమాయిషీ పోతుందన్న బెంగ రాష్ట్రాల్లో ఎక్కువుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రం మాత్రం దేశంలోనే జీఎస్టీ బిల్లును ఆమోదించిన రాష్ట్రంగా నిలిచింది. జీఎస్టీ విషయంలో పలు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయం నెలకొంది. పన్ను వసూలుకు సంబంధించి వస్తున్న ఆలోచనలతో ఆయా ప్రభుత్వాల్లో గందరగోళంలో ఉన్నాయ్. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం దేశంలోనే అందరికంటే ముందుగా జీఎస్టీ బిల్లును ఆమోదించడం విశేషం. అదే సమయంలో సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులను పన్ను నుంచి మినహాయించాలని, తక్కువ పన్ను శ్లాబ్‌లోకి తీసుకురావాలని కేంద్రంపై తెలంగాణ సర్కారు ఒత్తిడి తెచ్చింది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసి రిజిస్ట్రేషన్ల ప్రక్రియతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటరీకరణ, బ్యాంకులతోను ప్రభుత్వం సంప్రదించింది.
వచ్చే నెల 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ జీఎస్టీ బిల్లును ఆమోదించాలి. ఇప్పటివరకు 24 రాష్ర్టాలు బిల్లును ఆమోదించగా ఇంకా ఏడు రాష్ర్టాలు ఆమోదించాల్సి ఉంది. తెలంగాణ తర్వాత పదిహేను రోజులకు బీహార్, ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ర్టాలైన రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, హర్యానా, గోవా.. ఇలా మొత్తం 24 రాష్ర్టాలు ఎస్‌జీఎస్టీ బిల్లును ఆమోదించాయి. తాజాగా ఈ నెల 5న మణిపూర్ ఆమోదించింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వస్తున్నందువల్ల తప్పనిసరిగా ఈ నెలాఖరుకల్లా మేఘాలయ, పంజాబ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, జమ్ముకాశ్మీర్ రాష్ర్టాలు ఆమోదించాల్సి ఉంది. జమ్ముూ కాశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు ఉంది. జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయడం కష్టసాధ్యమేనని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర జీఎస్టీ బిల్లును ఆమోదిస్తుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్నందువల్ల విధిగా పశ్చిమబెంగాల్ సైతం రాష్ట్ర జీఎస్టీ బిల్లును ఆమోదించాలి.  మరోవైపు జీఎస్టీకి సంబంధించి రాజకీయ సంక్షోభమూ పొంచి ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. కేంద్రమే అన్ని విషయాల్లో పెద్దన్న పాత్ర పోషించనుందన్న అభిప్రాయ కలుగుతోంది. ఇప్పటి వరకు స్థానిక పన్నులను ఆయా రాష్ట్రాల తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వసూలు చేసుకునేవి. ఇకపై ఆ పన్నులు ఉండవు. ఆ అధికారం రాష్ట్రాలకు ఉండదు. అన్నీ కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చేస్తున్నాయ్. దీంతో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా... ప్రజలకు తాయిలాలివ్వాలన్న కూడా సమస్యనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక బంగారం కొనుగోలు చేసే వారికి ఇప్పుడు ట్యాక్స్ బాధ పెద్దగాలేకపోయినప్పటికీ... బంగారు ఇష్టానుసారం మాత్రం కొనుగోలు చేసే పరిస్థితి మాత్రం ఉండదు. బంగారాన్ని ఇకపై ఎవరూ కూడా రెండు లక్షలకు మించి కొనుగోలు చేసే అవకాశం ఉత్పన్నం కాదు. ఎందుకంటే రెండు లక్షలకంటే ఎక్కువ ట్రాన్సక్షన్ చేస్తే మీపై ఐటీ వేట మొదలైనట్టే... బంగారం విషయంలో పెద్దగా ఆందోళన అవసరం లేదన్న అభిప్రాయాన్ని జీఎస్టీ ద్వారా కలిగించినప్పటికీ... బంగారానికి సంబంధించి ప్రత్యక్షంగా... పరోక్షంగా ఉన్న సమస్యలతో కొనుగోళ్లు పెద్ద ఎత్తున నిలిచిపోయే అవకాశముందని బంగారు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇష్టానుసారంగా బంగారం ఇకపై అమ్మడానికి...గానీ కొనడానికి గానీ నిబంధనలు అంగీకరించవని... కొన్న బంగారమంతా లెక్కలతో సహా చెప్పాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయ్.
బంగారాన్ని కొనుగోలు చేయడమంటే ఒకరకంగా రిస్క్ కిందే చెప్పాలి. కేవలం ఇది శాలరీ ఎంప్లాయిస్ కు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయా జీతాలు నేరుగా కంపెనీ బ్యాంక్ ఎకౌంట్ నుంచి ఉద్యోగులకు చేరితే సమస్య ఉండదు. అయితే పలువురు ఆదాయం నేరుగా నగదు కింద లభిస్తుండంటం కూడా ఇందుకు ఇబ్బందికరమైన విషయం. ఇప్పటికే కేంద్రం రెండు లక్షల కంటే నగదు ట్రాన్సక్షన్లను రద్దు చేసింది. ఎవరైనా రెండు లక్షల రూపాయల కంటే నగదు లావాదేవీ జరిగిపే సమాచారం తెలియజేయాల్సిందిగా ఐటీ శాఖ ప్రకటనలు కూడా ఇచ్చింది. తీసుకున్నవారు... ఇచ్చినవారిపైనా కేసులు కత్తి వేలాడుతోంది. కేవలం వైట్ మనీతో మాత్రమే కొనుగోలు చేసేవారు బంగారాన్ని తమకు నచ్చిన విధంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అప్పుచేసి పప్పుకూడు చందంగా చాలా మంది పెళ్లిళ్ల సందర్భంగా అప్పోసొప్పో జేసి కుటుంబాల్లో కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. వారు కూడా ఇకపై ఇష్టానుసారంగా అప్పులు చేయడానికి కూడా సాధ్యపడదు. ఇప్పటికే నోట్ల రద్దు తర్వాత క్రెడిట్ సమస్యలు ఎక్కువై... అప్పులు ఇచ్చే వారు కూడా తగ్గిపోతున్న పరిస్థితి. కేంద్ర నిబంధనలు అన్ని విధాలుగా ఎకౌంట్ బులిటీని తీసుకొస్తున్నాయ్. ఎవరిష్టానుసారం వారు ఎలాబడితే అలా చేయడానికి కూడా ఇకపై కుదరదు. బంగారం రేటు పెరగకపోయినప్పటికీ... బంగారాన్ని కొనుగోలు చేయడం మాత్రం కూసంత కష్టమే.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాల గురించి చర్చించుకునేవారు... మాకు ప్లస్సేంటి? మైనస్సేంటి? అన్న అంశాలను బేరీజు వేసుకొని తమ కొనుగోళ్లు జరిపేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న జీఎస్టీతో ఏ వర్గాలకు లాభం? ఏ వర్గాలకు నష్టం? నోట్ల రద్దు సందర్భంగానూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... పేదల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ గట్టిగా చెప్పారు. తాజాగా జీఎస్టీతోనూ తాము పేదల పక్షమని... పేదలకు జీఎస్టీ వల్ల    భారీగా మేలు జరుగుతుందని కేంద్రం వాదిస్తోంది. ఎగువ, ఉన్నత స్థాయి వర్గాల వారికి జీఎస్టీ వల్ల వడ్డన ఉన్నప్పటికీ... దిగువ మధ్యతరగతి ప్రజలకు లాభసాటిగా ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. ఉదాహరణకు నెలకు పది వేల రూపాయల ఆదాయం సంపాదించే వ్యక్తికి తాజా జీఎస్టీ బిల్లుతో కొంత మేర లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా రోజూ ఉపయోగించే నిత్యవసర వస్తువులను పన్ను నుంచి మినహాయించడం వారికి కలిసివచ్చే అవకాశం. వాటిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న స్వల్ప పన్నులు కూడా ఇకపై ఉండవ్. దీని ద్వారా నెలసరి వినియోగంలో ఖర్చు 5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక 20 వేల నుంచి 30 వేల ఆదాయం సంపాదించే వ్యక్తులకు సంబంధించి తాజా జీఎస్టీతో పెద్దగా లాభనష్టాలేవీ ఉండవని కూడా చెబుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన పలు రకాల స్లాబుల్లో వీరు ఉపయోగించే వస్తువులకు ఆల్టర్ నేటివ్స్ కూడా ఉండటంతో వారు తమకు మేలు కలిగించే వస్తువులను ఉపయోగించే అవకాశం ఉంది. వీరు వినియోగించే వస్తువులన్నీ కూడా నిత్యవసర వస్తువులతోపాటు, 5శాతం, 12 శాతం స్లాబుల్లో ఉన్నాయ్. వీరు నిత్యం ఉపయోగించే ఆహారపదార్థాల ధరల్లో ఇప్పుడున్న పన్నులకు కొంచెం అటూ ఇటూగా  ఇక 5 శాతం పన్ను పరిధిలోకి వస్తున్న వస్తువుల వివరాలను చూస్తే... అత్యవసర వస్తువులైనప్పటికీ... కచ్చితంగా మనం రోజూ వినియోగించే వస్తువులనే చెప్పాలి.
ముఖ్యంగా... చక్కెర, టీ, కాఫీ, వంట నూనెలు, బొగ్గు, పాలపొడి, పిజ్జా బ్రెడ్, పండ్ల రసాలు ఈ కేటగిరిలో ఉన్నాయ్. ఇప్పటి వరకు అవసరాలుగా ఉన్న కొన్ని వస్తువులు విలాసాల సరసన చేరిపోతున్నాయ్. 12 శాతం పన్ను వసూలు చేసే వస్తువుల విషయంలో మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపెట్టనుంది. వెన్న,  నెయ్యి,  మొబైల్ ఫోన్ లు,  జీడిపప్పు,  బాదంపప్పు, సాస్ లు,  ఫ్రూట్ జ్యూస్ లు ఈ కేటగిరిలో ఉన్నాయ్. ఇక 30 వేల నుంచి 50 వేల మధ్య సంపాదించే వారికి మాత్రం  రెడీ మేడ్ వాయింపుడు ఎక్కువవుతోంది. వారు ఇకపై ఇప్పుడు చెల్లిస్తున్న మొత్తానికి కనీసం 5 నుంచి పది శాతం మేర అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వారు ఆయా వస్తువుల కొనుగోలు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి రావచ్చు. ట్యాక్స్ ఎక్కువగా ఉన్న వస్తువులు అంటే 28 శాతం ట్యాక్స్ అప్లై అయ్యే పలు వస్తువుల కొనుగోళ్లు తగ్గే అవకాశం కూడా ఉంది.
అయితే కార్పోరేట్ కంపెనీలు వ్యవహరించే ధోరణిబట్టి కూడా ఆయా వస్తువుల ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వివిధ పన్నుల తక్కువగా ఉండటం వల్లే కొన్నిరకాల కాస్మోటిక్స్ తక్కువ ధర ఉన్నప్పటికీ... తాజా నిర్ణయం వాటి రేటు బాగా పెరిగే అవకాశం ఉంది. వంద రూపాయలకు 28రూపాయల పన్ను... కార్లు, మోటర్ సైకిళ్లు, గృహోపకరణాలు, డియోడరెంట్లు, షేవింగ్ క్రీమ్ లు, స్టార్ హోటళ్లు, సినిమా టికెట్ల రేట్లు పెరగనున్నాయ్. కామన్ మ్యాన్ గా మనం ఆదాయ‌పు ప‌న్ను,  సేవా ప‌న్ను గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. త‌యారీ మొద‌లుకొని వ‌స్తు,సేవ‌ల అమ్మకాల ద‌శ వ‌ర‌కూ మ‌నం ప‌న్ను మీద ప‌న్ను క‌డుతూనే ఉంటాం. అయితే వాటన్నింటినీ మనం అంతగా పట్టించుకోం. జీఎస్టీ ఒక పార‌ద‌ర్శక‌త ప‌న్ను వ్యవ‌స్థను తీసుకువ‌స్తోంది. ప్రతి ద‌శ‌లోనూ వ‌స్తు,సేవ చేతులు మారేముందు ఒక వ్యక్తి, సంస్థ చెల్లించే ప‌న్ను ఎంతో అంద‌రికీ తెలిసే వ్యవ‌స్థను ఏర్పటవుతోంది. దీని వల్ల పలు వస్తువుల ధరలు బాగా తగ్గే అవకాశమూ ఉంది.
నెలకు పది వేల జీతం సంపాదించే వ్యక్తికి కొత్తగా జీఎస్టీతో ఎంతోకంత లాభం కలుగుతుంది. ఇక 10 నుంచి 25 వేల మధ్య జీతం సంపాదించే వ్యక్తికి నోలాస్ నో గెయిన్. ఇక 25 వేల నుంచి 50 వేల వరకు నెల జీతం సంపాదించే వ్యక్తికి మాత్రం ఖర్చు బారీగా పెరిగే అవకాశం ఉంది. రెడీ మేడ్... రెడీ టు ఈట్... వస్తవులన్నీ కూడా తడిసిమోపడవుతాయ్.  ఉన్నతస్థాయి వర్గాల వారికి ఖేదం తప్పదు. బంగారం కొనడం చాలా కష్టం కావొచ్చు. వైద్య పరికరాల ధరల్లో పెద్దగా తేడా లేదు. అయితే దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలుపై ఇప్పుడు గందరగోళం నెలకొంది. పన్నుల తీవ్రవాదాన్ని నిరోధించేందుకు తాము జీఎస్టీ తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. అయితే రాష్ట్రాలు మాత్రం స్వేచ్ఛ కోల్పోతామని బెంబెలెత్తిపోతున్నాయ్. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏమనుకుంటారో అని ఓకే చెప్పిన పలు రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు స్వేచ్ఛగా ఉన్న తాము... వచ్చే రోజుల్లో కేంద్రం కనుసన్నల్లోకి వెళ్లిపోతామేమోనన్న భయంవారికి పట్టుకొంది. జీఎస్టీతో ఇప్పటికిప్పుడు సమూల మార్పులైతే రావు కానీ... అమలు చేయడమే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పెద్ద సవాలు. ఇప్పటికే  బెంగాల్, ఢిల్లీ సర్కార్లు కేంద్రంపై విమర్శలదాడి పెంచేస్తున్నాయ్. జీఎస్టీ అమలు జులై1 నుంచి సాధ్యం కాదని తెగేసి చెబుతున్నాయ్.

గోరక్షకులపై దాడులు... మోదీ హెచ్చరికలు


గోరక్షలు దేశ పరువు తీస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నారు. జాతిని జాగృతం చేయాల్సిన గోరక్షలు భక్షకులుగా మారిపోయారు. భారతదేశ్ సంస్కృతిని చిన్నాభిన్నం చేస్తున్నారు. గోవులను రక్షిస్తున్నామంటూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. గోవధ పేరుతో దేశాన్ని ముక్కలు చేస్తున్నారు. మత ప్రాతిపదికను దేశాన్ని విభజిస్తున్నారు. మూడేళ్లుగా సాగుతున్న విద్వేషాల పరంపరపై ప్రధాని మోదీ గట్టి హెచ్చరికలు పంపించారు. గోరక్షణ పేరుతో హత్యలేంటంటూ నినదించారు. చట్టాన్ని ఎవరూ చేతులోకి తీసుకోరాదంటూ గర్జించారు. అయితే ఇప్పటికే ఎంతో ఆలస్యం జరిగిపోయింది. ప్రపంచదేశాల దృష్టిలో భారతదేశం పలుచనైపోతోంది. సనాతన హిందూ సంస్కృతిని ప్రపంచదేశాలకు నేర్పిన భారత్...  ఇప్పుడు గోరక్షకుల చేతిలో చిన్నబుచ్చుకోవడం దేశానికి, మన ప్రజలకు  ఎంత మాత్రం మంచిది కాదు. నాట్ ఇన్ మై నేమ్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియా గోరక్షకుల ఆగడాలపై సమరభేరి మోగిస్తోంది. మోదీ హెచ్చరికలతో కట్టుదప్పిన గోరక్షకుల అదుపులోకి వచ్చేనా? అమాయకుల ప్రాణాలు నిలిచేనా? నాలుగు పదాల సందేశం ఇప్పుడు నాలుగు దిక్కులా ప్రజ్వరిల్లుతోంది... నిశ్శబ్ద విప్లవం జనం గుండెలను తాకుతోంది.
ఇదా.. గో రక్షణ?  గో రక్షణ పేరుతో హత్యలు చేస్తారా? ఇలాంటి ఘటనలు  ఎంతో బాధకలిగిస్తున్నాయ్... చట్టాన్ని చేతుల్లో తీసుకునే హక్కు ఎవరికీ లేదు... ఇలాంటి హింస గాంధీజీ సిద్ధాంతాలకు విరుద్ధం... మహాత్మాగాంధీ నడయాడిన సబర్మతీ ఆశ్రమం వద్ద నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇది...
గో సంరక్షణ పేరిట అమాయకులను హతమార్చడం ఆమోదయోగ్యం కాదని ప్రధాని నరేంద్రమోదీ తేల్చిచెప్పారు.  చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదని తేల్చిచెప్పారు. మహాత్మాగాంధీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. గోవుపై భక్తి పేరుతో హింసకు పాల్పడుతూ... కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని... ఇది ఆదర్శాలకు పూర్తిగా విరుద్ధమని మోదీ చెప్పారు. ఆవుల్ని రక్షించే ముసుగులో అమాయకులను చిత్రవధ చేయడం, హింసకు పాల్పడడం ద్వారా సాధించేదేమీ లేదని ఆయన అన్నారు. అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న గోరక్షకుల చర్యలు...  విచారాన్ని, బాధను కలిగిస్తున్నాయని మోదీ అన్నారు.
మహాత్మాగాంధీ అహింసను  ప్రబోధిస్తే... కొందరు దుర్మార్గులు... తమ చర్యలతో దేశానికి మచ్చ కలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహాత్ముడితోపాటు, ఆయన అనుచరుడు వినోబా భావే గోవుల్ని ఆరాధించారని... వాటి పరిరక్షణ కోసం పాటు పడ్డారని... ఆవుల్ని ఎలా పరిరక్షించుకోవాలన్న విషయానికి సంబంధించి ఒక మార్గాన్ని చూపించారనీ మోదీ అన్నారు. గోవుల పేరిట మనుషుల్ని చంపడాన్ని మహాత్ముడు కూడా ఆమోదించబోరని తెలిపారు. ఆవుల రక్షణ గురించి భారత రాజ్యాంగం కూడా చెబుతోంది. అంతమాత్రాన ఒక వ్యక్తిని చంపడానికి మనకు హక్కు ఉన్నట్లేనా? ఆవుల్ని ఆరాధించడమంటే ఇదేనా? వాటిని రక్షించుకోవడం ఇలాగేనా అంటూ ఆయన ధ్వజమెత్తారు. హింస ద్వారా ఏ సమస్యకు పరిష్కారం లభించదని...  సమాజంలో హింసకు తావు లేదనీ చెప్పారు. మతాల వారీగా చీలిపోవడాన్ని అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో ఒక రోగి చనిపోతే అతని బంధువులు ఆఆసుపత్రిని కాల్చేస్తున్నారని...   వైద్యులపై దాడులు చేస్తున్నారని ఇలాంటి వాటి వల్ల చనిపోయినవారు తిరిగిరారని... వైద్యులపై నమ్మకం ఉంచాలని మోదీ చెప్పారు. మరోవైపు  రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే... కొంతమంది ఆగ్రహంతో రోడ్డెక్కి వాహనాల్ని ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా... ఎవరికి తోచిన విధంగా వారు... చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఆమోదించబోమని ఆయన అన్నారు. గాంధీ కలలు కన్న భారతదేశాన్ని సాకారం చేయడానికి అంతా కలిసి పనిచేయాలన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ ఓవైపు గో సంరక్షణ అంటూ సబర్మతీ ఆశ్రమం వద్ద నుంచి సందేశమిస్తుంటే... మరోవైపు గోరక్షకుల పేరుతో అల్లరిమూకలు మరో ప్రాణాన్ని  బలిగొన్నాయ్. ఓవైపు ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తుంటే.. ఆకతాయిలు మాత్రం ఇష్టారాజ్యంగా అమాయకులను వధిస్తూనే ఉన్నాయ్.  గో సంరక్షణ పేరుతో మనుషుల్ని చంపడం ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన కొద్ది గంటలకే ఝార్ఖండ్‌లో మరో హత్య జరిగింది. బీఫ్‌ తీసుకెళ్తున్నాడని ఆరోపిస్తూ.. ఓ వ్యక్తిపై దాడి చేశారు కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై చంపేశారు. అలీముద్దిన్‌ అనే వ్యక్తి తన కారులో వెళ్తుండగా.. గ్రామ శివారులో కొందరు వ్యక్తులు అడ్డుకొని...  అలీముద్దిన్‌ను కారు నుంచి దింపి తీవ్రంగా కొట్టారు. బీఫ్‌ను తరలిస్తున్నాడని ఆరోపిస్తూ.. అతడి కారుకు నిప్పటించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగానే.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.  గతవారం ఢిల్లీ నుంచి హర్యానా వెళుతున్న ముస్లిం యువకుడు జునైద్ ఖాన్ పై దాడి, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నెల 22న రంజాన్ పండుగకు అవసరమైన షాపింగ్ చేసుకుని రైలులో సొంత ఊరికి వెళుతున్న జునైద్‌ను బీఫ్ తీసుకెళుతున్నాడని ఆరోపిస్తూ అల్లరిమూక దాడి చేసి కత్తిపోట్లకు పాల్పడటంతో మరణించాడు. ఆ హత్య జరిగిన మరుసటి రోజే ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు సినీ నిర్మాత సబా దివాన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పిలుపునిచ్చారు. నాట్ ఇన్ మై నేమ్ అనే పేరుతో ఆమె చేసిన పోస్ట్ అందరినీ ఆలోచింపజేసింది. ఆ పోస్ట్ స్ఫూర్తిగా బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌తోపాటు దేశంలోని 11 నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. లండన్, టొరంటో, బోస్టన్, కరాచీ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయని దివాన్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. జునైద్‌పై దాడి ఘటనలో ఢిల్లీకి చెందిన ప్రభుత్వోద్యోగి సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్  ఫరీదాబాద్ ఎస్పీ కమల్‌దీప్ గోయల్ తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు 20 ఏళ్లలోపు వారే.

ఇవాళ ఈ పరిస్థితి నాకు వచ్చింది... రేపు మీకు రావొచ్చు... మరో రోజు  ఇంకెవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురు కావొచ్చు. సోషల్ మీడియాలో మొదలైన ఉద్యమం...  ఇప్పుడు నాట్ ఇన్ మై నేమ్ అంటూ దేశంలోని ప్రధాన పట్టణాల్లో నిరసనలు వేదిక అవుతోంది.  పాలకులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. మొల్లగా మొదలైన ఉద్యమం ఇప్పుడు ప్రధాన నగరాలను ప్రభావితం చేస్తోంది.
దేశంలో దళితులు, మైనారిటీలు,  అమాయకులపై మతం, సంస్కృతి,  ఆవు పేరుతో జరుగుతున్న దాడులకు  నిరసనగా మేధావులు, సెలబ్రిటీలు... మౌనదీక్ష  నిర్వహించారు. ప్రభుత్వానికి, విధానాలకు వ్యతిరేకంగా... దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయ్. అవన్నీ కూడా నాట్  ఇన్ మై  నేమ్ పేరుతో జరుగుతున్నాయ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా... నినాదాలు లేవూ...  ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు.. అంతా నిశ్చబ్దం. ఒక్క  ప్లకార్డ్ పై NOT IN MY NAME అనే అక్షరాలు మాత్రమే కన్పిస్తాయ్. స్పాట్
నాట్ ఇన్ మై నేమ్ అంటే.. నాపై ఈరోజు దాడి జరగకపోవచ్చు.. ఏదో ఒక రోజు.. ఏదో ఒక కారణంతో నాపై దాడి జరగొచ్చు. ఇప్పుడు నేను వ్యతిరేకించకపోతే.. రేపు నా వంతు కూడా రావచ్చు. అందుకే ఈ మౌన నిరసన అని అర్థం. వర్గం, మతం, వర్ణం అంటే ద్వేషం పెంచుకున్నవాళ్లే దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారనేది మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్న మాట. సోషల్ మీడియాలో పుట్టిన స్లోగన్.. ఇప్పుడు నడి రోడ్డుపై ఆందోళనలు చేస్తోంది. ఎక్కడా విధ్వంసాలు లేవు.. గొడవలు లేవు.. ఘర్షణలు అస్సలే లేవు. దేశంలో జరుగుతున్న అల్లరిమూకల దాడులకు నిరసనగా... ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పదాల సందేశం ఇప్పుడు నాలుగు దిక్కులా ప్రజ్వరిల్లుతోంది... నిశ్శబ్ద విప్లవం జనం గుండెలను తాకుతోంది. స్పాట్
దేశంలో అసహనం, విద్వేష దాడులతో...  మతం కారణంగానూ... ఇతర కారణాలతో జరుగుతున్న ఆందోళనలు శృతి మించి మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయ్.  మతం పేరుతో జరుగుతున్న మారణహోమం అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయ్. ఇలాంటి ఘటనలపై  సోషల్ మీడియాలో పుట్టిన ఈ నినాదం.. ఇప్పుడు హోరెత్తుతోంది. మానవతావాదులు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు.. నాట్ ఇన్ మై నేమ్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పాట్
ఎవరూ ఎవర్నీ పిలవలేదు. ఎవరికీ ఆహ్వానాలు లేవు. రాజకీయనాయకులు వచ్చినా... ఆందోళనకారులకు సంఘీభావం చెప్పడం... వెళ్లడం మాత్రమే. అయినా సరే NOT IN MY NAME ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాయి పలు పార్టీలు. హిందూ తీవ్రవాదాన్ని అంతమొందించాలి. బ్రాహ్మనిజాన్ని అడ్డుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఆందోళనల్లో  సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీలతోపాటు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భాగస్వాములయ్యారు. సోషల్ మీడియాలో పుట్టిన ఈ ఉద్యమం.. ఇప్పుడు ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ వరకు విస్తరించింది. నిరసనతో కూడిన నిశ్శబ్దం. ఆహారం పేరుతోనో, ఆవు పేరుతోనో, ఇంకో పేరుతోనో, మరేదైనా పేరుతోనో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై నోరు విప్పాలంటూ నిశ్శబ్దంతో నిరసనని పాటించారు హైదరాబాదీలు. మానవ హక్కులు కాలరాయొద్దంటూ మానవతావాదులు  ఒక్కరొక్కరుగా ట్యాంక్‌బండ్‌పైకి ఆందోళనబాటపట్టారు. స్పాట్
అందరి మాట ఒక్కటే మొత్తం గోరక్షణ పేరుతో జరగుతున్న అరాచకాలకు బీజేపీ పెద్దల అండదండలున్నాయన్నది వారి అభిప్రాయం.  బీజేపీ ప్రభుత్వాలు గోరక్షకులకు దన్నుగా నిలవడంతో... వారు చేస్తున్న కార్యక్రమాల్లో హింస రాజ్యమేలుతోందని... అది చివరకు ప్రాణాలను బలితీసుకుంటుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే కాబోలు ప్రధాని మోదీ సైతం స్పందించారు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది... మోదీ ఇప్పుడు తన మాటలను చేతల్లో చూపించాలి.
గోరక్షణ అంటే ఏంటి? అసలు గోరక్షణ ఎవరు చేస్తున్నారు... రాజకీయ గోరక్షణ చేస్తుందెవరు? గోరక్షణ ముసుగు వేసుకుందెవరు? దేశంలోనే అతిపెద్ద బీఫ్ మార్కెట్ తో ఉత్తరప్రదేశ్ ఎంత మందికి ఉపాధి చూపిస్తే... నేడు యూపీలోనూ బీఫ్ బ్యాన్ మొదలైంది. బీఫ్ తిన్నారంటూ సెలబ్రిటీలపైనా రాళ్లు వేసే విష సంస్కృతి మొదలైంది. మరోవైపు  కేంద్రం జంతువధ చట్టా్న్ని సైతం తీసుకొచ్చి... మొత్తం బీఫ్ పాలిటిక్స్ కు తెరదీసింది.   హిందువులు గోవును పరమపవిత్రమైనదిగా భావిస్తారు. గోమాతగా ఆవుకు పూజలు, పునస్కారాలు చేస్తూ.. పవిత్ర కార్యంగా తలుస్తారు. గృహప్రవేశం చేసినా... ముందుగా గోమాతను లోపలకి పంపించి... గోమాత ఆశీస్సులు తీసుకుంటారు. గోవుకు మొక్కితో కష్టాలు  తొలగిపోతాయని నమ్ముతారు. గోవు చుట్టూ ప్రదక్షణ చేస్తే పాపాలు తొలగిపోతాయని... మంచి జరుగుతుందని తలుస్తారు. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి గోరక్షకుల పేరుతో దాడులు పెచ్చరిల్లాయ్.
ఒకరా... ఇద్దరా...  ఏకంగా 25 మందిని... గోరక్షకుల  పేరుతో...  బీఫ్ తింటున్నారని బలితీసుకుంటున్నారు. మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే 97 శాతం ఘటనలు జరిగినట్టుగా రికార్డులు స్పష్టం చేస్తు్న్నాయ్. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, హర్యానా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయ్. ఇప్పటి వరకు ఈ తరహా దాడులు 63 జరగ్గా... 24 మంది మైనార్టీలు ప్రాణాలు కోల్పోయారు. 124 మంది గాయపడ్డారు. ఈ  గణాంకాలను ఇండియా స్పెండ్ విడుదల చేసింది. దాడులు ఎక్కువగా  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది.
మరోవైపు గోరక్షకులకు దన్నుగా ఉండేలా...  బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గోమాంస నిషేధ చట్టాలను తీసుకొస్తున్నాయన్న విమర్శ ఎక్కువవుతోంది. దేశవ్యాప్తంగా ఈ గోమాంస విక్రయాలను నిరోధించేందుకు కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్‌ యాక్ట్‌  చట్టాన్ని ఆశ్రయించింది. ఆ చట్టంలో 22వ నిబంధన కింద పశువుల సంతలో పశువులను వ్యవసాయ అవసరాల కోసమే తీసుకుంటున్నట్లు కొనుగోలు, విక్రయదారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ ఆంక్షలు తీసుకొచ్చారు. అదే చట్టంలోని 11వ సెక్షన్‌  ఈ నిబంధన ప్రకారం అనవసరంగా హింసించనంత కాలం ఆహారం కోసం జంతువులను చంపడం తప్పు కాదని కూడా ఉంది. అయినా... దేశవ్యాప్తంగా గోమాంసం నిషేధించాలనే ఆరెస్సెస్‌ డిమాండ్‌ను అమలు చేయడానికి కేంద్రం తెలివిగా వ్యవహరిస్తుందన్న విమర్శలు విన్పిస్తున్నాయ్. గోమాంసం నిషేధం, కబేళాల నిషేధం రాష్ట్రాల పరిధిలోని అంశం కావంతో కేంద్రం జంతువులను క్రూరత్వం నుంచి రక్షించే చట్టం నిబంధనలను ఆశ్రయించింది. ఆ చట్టం కింద పశుమాంసం క్రయవిక్రయాలను గానీ, కబేళాలను గానీ నిషేధించే హక్కు లేకపోవడం వల్ల కేంద్రం మధ్యేమార్గాన్ని అనుసరించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్రమే గోమాంసాన్ని నిషేధించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. నిషేధం వల్ల వచ్చే పర్యవసనాలను కూడా పరిశీలించాలి. దేశంలో గోమాంసం, దాని సంబంధిత పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్న నాలుగైదు కోట్ల మంది రోడ్డున పడతారని ప్రాథమిక అంచనాలు తెలియజేస్తున్నాయి. యూపీలో మాంసం పరిశ్రమ స్తంభించిపోవడం వల్ల ఏడాదికి 56 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతుందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు 18-19 శాతం ముస్లింలతోపాటు వారిలో మాంసం వ్యాపారం చేసే ఖురేషీ, కసాయీ అనే కులాలవారు ఉన్నారు. దేశంలో వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహార ఉత్పత్తులు ఎగుమతుల అభివృద్ధి సంస్థ...  అనుమతితో నడుస్తున్న ఆధునిక యాంత్రిక జంతు వధశాలలు 75 ఉంటే, వాటిలో 42 యూపీలోనే పనిచేస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ సహా దేశం నుంచి బీఫ్‌ పేరుతో ఎగుమతి అయ్యేదంతా గేదె మాంసమే. మొత్తం మాంసం ఎగుమతుల్లో అధిక భాగం గేదె మాంసమే. 2011–12లో దేశంలో ఉత్పత్తి అయిన పాలలో దాదాపు 53 శాతం గేదెలదయితే, మిగిలిన 47 శాతం ఆవులది. వాటి యజమానుల్లో దాదాపు 80 శాతం ముస్లింలే. స్థానిక ఖురేషీ ముస్లింలు కూడా కొన్ని ఆధునిక కబేళాలు నిర్వహించడమేగాక, ఎస్పీ, బీఎస్సీ టికెట్లపై పార్లమెంటు, యూపీ అసెంబ్లీ, కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. 2010-14 మధ్య కాలంలో యూపీఏ సర్కారు గేదెల కోడె దూడల పెంపకానికి ఓ పథకం రూపొందించింది. దూడలను ఏడాదిపాటు పెంచడానికి రుణాలు సమకూర్చడమేగాక, అవి పెరిగాక ఆధునిక కబేళాలకు పంపడానికి సర్కారు ఈ స్కీము కింద సాయమందించేది. ఫలితంగా గేదె మాంసం కబేళాల నుంచి ఉత్పత్తి, ఎగుమతులు పెరిగాయి. 2016 ఏప్రిల్‌-ఆగస్టు నాలుగు నెలల కాలంలో దేశంలో మొత్తం వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారపదార్ధాల ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ కారా బీఫ్‌ వాటా 23 శాతానికి పెరిగింది. తాజాగా యూపీ సీఎం ఆదిత్యా నాథ్‌ యోగి తీసుకున్న గోమాంస నిషేధంతో సింహాలకు బీఫ్‌ బదులు మటన్‌, చికెన్‌ పెడుతున్నారు.గొడ్డు మాంసం దొరకకపోవడంతో... అధికారులు మటన్‌, చికెన్‌ అందజేస్తున్నారు. అయితే, దీని కారణంగా అక్కడి ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ భారం పడుతోందని అధికారులు అంటున్నారు. ఒక్కో సింహానికి రోజుకు సగటున 10కిలోల గొడ్డుమాంసం పెట్టాల్సి ఉంటుంది. స్పాట్
ఇటీవల నటి కాజోల్...  గోమాంసం బీఫ్ తిని పైగా ఆ వీడియోను అప్‌లోడ్ చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ నటి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. మీరు ఊహించింది, ప్రచారం చేసింది తప్పు... వీడియోలో ఉన్న డిషెష్ లో మీరు చూసింది బఫెలో మాంసం దున్నపోతుదని... దానిపై ఎలాంటి నిషేధం లేదంటూ చెప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు.  అదే సమయంలో నటి కాజోల్‌కు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ మద్దతుగా నిలిచారు. బీఫ్‌ తింటున్న ఓ వీడియోను పోస్ట్‌ చేస్తే...  చివరికి తాను తిన్నది గేదె మాంసమని వివరణ ఇచ్చేవరకూ పరిస్థితి వచ్చిందని మమత తెలిపారు. దేశంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్న మమత, కొందరు వ్యక్తులు ఇతరులు ఏం తినాలో నిర్దేశిస్తున్నారని విమర్శించారు.
దేశ వ్యాప్తంగా బీఫ్‌ అమ్మకాలు, కబేళాల విషయంలో బీజేపీ చాలా సీరియస్‌గా ఉండగా అదే పార్టీకి చెందిన నేత మాత్రం బీఫ్‌కు అనుకూలంగా ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే చౌక ధరలకే బీఫ్‌ లభించేలా ఏర్పాట్లు చేస్తామని, కబేళాలను కూడా చట్టబద్ధం చేస్తామంటూ మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్‌ మారక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే తరహా వ్యాఖ్యలను కేరళ బీజేపీ నేత చేశారు. వ్యక్తిగతంగా గోవధను అంగీకరించకపోయినా... కేరళ చట్టాలు బీఫ్‌ తినేందుకు అనుమతిస్తాయని... క్వాలిటీ బీఫ్‌ అందుబాటులో ఉంంచుతానని... కబేళాలను ఎలాంటి సమస్యలు లేకుండా నడిపిస్తానంటూ   కేరళకు చెందిన బీజేపీ నేత ఎన్‌ శ్రీప్రకాశ్‌  చెప్పారు.  అంటే ఓటు ముందు బీఫ్ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతుందన్నమాట. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చాక 2015 సెప్టెంబర్‌ ఆఖరులో యూపీలోని దాద్రీ పట్టణంలో ఆవు మాంసం ఇంట్లో దాచారనే ఆరోపణతో మహ్మద్‌ అఖ్లక్‌ సాయిఫీ అనే 52 ఏళ్ల వ్యక్తిని ఓ గుంపు దాడి చేసి చంపింది. నాటి నుంచి నేటి వరకు బీఫ్ పేరుతో పలు హిందూ సంస్థల మైనార్టీలకు బెదిరింపులు కొనసాగిస్తున్నాయ్. అనుమానం వచ్చిన తర్వాత... అందుకు బీఫ్ ముసుగు తొడిగి... అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నాయ్. నాటి నుంచి బీఫ్ పేరుతో దేశంలో ఏదో ఒక మూలన జరుగుతున్న ఘటనల్లో పెద్ద ఎత్తున అమాయకులు ఆస్తులు కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు.
మైనార్టీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో పలు ముస్లిం సంఘాల పెద్దలు సైతం... గోమాంసాన్ని మానేయాల్సిందిగా పిలుపునిస్తున్నారు. రాజస్థాన్ అజ్మీర్ దర్గాకు చెందిన ప్రముఖ మత గురువు సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీఖాన్  ముస్లింలందరూ గో మాంసాన్ని తినడం మానేయాలని సూచించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. ఇతర మతస్తుల విశ్వాసాలను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముస్లింలకు మత గురువు సూచించారు. హిందువులకు పవిత్రమైన ఆవును చంపకూడదని.. గో మాంసాన్ని తినడం మానేసి హిందూ సోదరుల మత విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని ముస్లింలకు పిలుపునిచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గో మాంసాన్ని నిషేధించిన అనంతరం పలు రాష్ట్రాల సీఎంలూ ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.
పశువులను కబేళాలకు తరలించకుండా నిరోధించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని మంటకలుపుతోందని మండిపడుతున్నాయి. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ వివరణ ఇస్తూ ఆహారం కోసం జంతువులను హతమార్చడాన్ని నిషేధించలేదని, జంతువులను హింస నుంచి రక్షించే చట్టం కిందనే ఆంక్షలు తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. ఇదంతా నాణానికి ఒకవైపు ఉంటే... ఇటీవల కాశ్మీర్ లో గుంపు చేతిలో చనిపోయిన డిప్యూటీ ఎస్పీ హత్యకు  కూడా పండిత్ అన్న పేరే కారణంగా విన్పిస్తోంది. తన విధులు బాధ్యతతో నిర్వర్తిస్తున్న డీఎస్పీ హిందువన్న అభిప్రాయంతోనే... అక్కడ ఉన్న మరో వర్గం ప్రజలు అతనని అంతమొందించినట్టుగా చెబుతున్నారు. మత ప్రాతిపదికన ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యానికి చికిత్స కట్టుదిట్టంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేశంలో మత ప్రాతిపదికన అలజడి ఇప్పుడు ఎంతో మాత్రం సహేతుకం కాదు. మతం పేరుతో దేశం ఇప్పటికే రెండు ముక్కలైంది. మరోసారి అలాంటి స్థితిని ఎదుర్కోడానికి ఎంత మాత్రం సిద్ధంగా లేదు. ప్రధాని మోదీ ఇప్పుడు కీలకంగా వ్యహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతీ రోగానికి చికిత్స చేస్తున్న మోదీ... గోరక్షణ అంటూ సాగుతున్న దురాగతాలను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదు... నిందితులను కాపాడుతున్న  హిందూ సంస్థలపై ఉక్కుపాదం మోపాలి. దేశ ప్రతిష్టను మంటగలుపుతున్న దుర్మార్గుల కోరలు పీకాలి. దుష్ట శిక్షణ మొదలు పెడితే... శిష్ట రక్షణ మొదలవుతుంది. చర్యలు తీసుకోవాల్సిన పెద్దలు అడుగు ముందుకేస్తే... విధ్వంసకారులు రెండడుగులు వెనక్కి వేస్తారు. అప్పుడు అమాయకుల ప్రాణాలు కాపాడగలుగుతాం. ఇది ఇవాళ్టి ఇన్ సైడ్... మరో కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం...

బంగారం బంగారమే

వన్నె తగ్గనిది... విలువ తగ్గనిది... అంతకంతకూ పెరిగేది... 365 రోజులు గిరాకి కలిగి ఉండేది బంగారం ఒక్కటే.  అవును బంగారం ప్రపంచాన్ని శాసిస్తోంది. జనంలో బంగారానికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ధర పెరిగినా బంగారాన్ని కొనుగోలు చేయడం మాత్రం తగ్గడం లేదు.  బంగారంపై పిచ్చి ఇండియన్లకు మాత్రమే కాదు... బంగారంపై ప్రేమ, మమకారం, అవసరం ప్రపంచ దేశాలకు ఎక్కువవుతోంది. బంగారు నిల్వలపై ప్రపంచ దేశాల కన్నుపడింది. ఎంతైతే  డబ్బు దాచుకుంటారో... అంత మొత్తానికి సమానంగా బంగారాన్ని కొనుగోలు చేయాలని జనం భావిస్తున్నారు. డబ్బుకంటే బంగారం రూపానికే ఎక్కువ వాల్యూ ఉంటుందన్న అభిప్రాయం జనంలో ఉంది.  బంగారం లాంటి జీవితం... బంగారు భవిష్యత్.....  బాబు బంగారమంటూ మన జీవితాల గురించి  బంగారం  ప్రభావం ఎంతో ఉంటుంది. గోల్డ్ ఈజ్ గోల్డ్ స్పెషల్ రిపోర్ట్...
బంగారం ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువ గిరాకీ ఉన్న ఖనిజం. అయితే బంగారం నిల్వలలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తక్కువ పరిణామంలోనే ఉన్నాయ్. అనాధిగా బంగారం ఆఫ్రికా ఖండంలో...  ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో లభించేది.  అక్కడి గనుల నుంచి పెద్ద ఎత్తున బంగార నిల్వలు ప్రపంచ వ్యాప్తంగా తరలి వచ్చేవి.   బంగారం, రాగి  క్రీస్తు పూర్వం 5000 ఏళ్ళ క్రితమే కనుగొన్నారు భూమి పై ఉన్న ఏడు ఖండాల్లోనూ బంగారు నిక్షేపాలను కనుగొన్నారు.  ప్రపంచంలో బంగారు నాణాలను తొలిసారిగా వాడుకలోకి తెచ్చిన ఘనత ప్రాచీన గ్రీకు ప్రాంతానికి చెందిన లిడియా రాజు కింగ్ క్రిస్ కు దక్కుతుంది.  క్రీస్తు పూర్వం 540 ప్రాంతంలో స్వచ్ఛమైన బంగారు నాణాలను వాడుకలోకి తెచ్చాడు.
హేమం, కనకం, స్వర్ణం ఇలా పలు పేర్లతో బంగారాన్ని పిలుచుకుంటాం.  బంగారు ఒక అరుదైన ఖనిజం. అత్యంత ఖరీదైన వస్తువు. బంగారంతో అద్భుతమైన ఆభరణాలు తయారు చేయవచ్చు...  ఆయా వ్యక్తులు సైతం తమ వద్ద ఉన్న బంగారాన్ని బట్టి ధనికులుగా చెలామణీ అవుతున్నారు. బంగారాన్ని బట్టి ఆ దేశ సంపదను అంచనా వేస్తారు.  బంగారు నిల్వల ఆధారంగానే ఆ దేశ కరెన్సీని ముద్రిస్తుంది. అందుకే బంగారం ధర ప్రపంచమంతా ఒకే మాదిరిగా ఉంటుంది. ఒకచోట ఒకలా... మరో చోట మరోలా బంగారం ధరల్లో వ్యత్యాసం ఉండదు.
బంగారం అతి తక్కువ ప్రమాణంలో నేల పొరలల్లో  నిక్షిప్తమై ఉంటుంది. భూమిలో బంగారం ప్రధానంగా రెండు రకాలుగా లభిస్తుంది. ప్రథమ శ్రేణి, లోడ్ నిల్వలు  ద్వితీయ శ్రేణి నిల్వలను ప్లసెర్ అంటారు. ఈజిప్టులో ఫారోల కాలంలో బంగారాన్ని గనుల నుంచి తవ్వేవారు. ఆ బంగారం అవసరానికి తగినంతగా లభించనప్పుడు యెమెన్,  దక్షిణాఫ్రికాలో అన్వేషణ కొనసాగించారు. అయితే బంగారు గనుల్లో పనిచేసే వారి జీవితం దుర్భరంగా ఉంటుంది.  గనుల్లో తవ్వకాలతో కార్మికులు కాలుష్యం బారినపడి... దీర్ఖకాలంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం భూమి మీదా వాడుక లో ఉన్న బంగారం 20 శాతం మాత్రమేనని మరో 80 శాతం భూ గర్భం లోనే ఇంకా నిక్షిప్తమై ఉందని శాస్త్ర వేత్త ల అంచన.  భూమి పై ఉన్న అన్ని సముద్రాల అట్టడుగునా దాదాపు 2 కోట్ల టన్నుల వరకు బంగారం ఉంటుందని శాస్త్ర వేత్తల అభిప్రాయపడుతున్నారు. ఇతర గ్రహాల్లోనూ బంగారం అవశేషాలను కనిపెట్టినట్టుగా చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు గనుల నుంచి తవ్వి తీసిన మొత్తం బంగారంలో దాదాపు సగం బంగారం ఒకే ఒక్క ప్రదేశం నుంచి దొరికింది.  ఆ ప్రదేశమే దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్స్ రాండ్ . ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల పలుచని రేకులా సాగ గొట్టవచ్చును. బంగారం భౌతిక గుణగణాలు నిజంగా విశ్మయాన్ని కలిగిస్తాయ్.  అత్యంత పలుచని రేకులుగా సాగే అద్భుతమైన భౌతిక ధర్మాన్ని బంగారం కలిగి ఉంది.  వెంట్రుకల  కన్నా సన్నని తీగెలుగా బంగారం సాగుతుంది. ఒక ఔన్సు బంగారం అంటే 28 గ్రాముల బంగారాన్ని 50 మైళ్ళ పొడవున్న తీగెను చేయవచ్చట.  కేవలం ఒకగ్రాము భారమున్న బంగారాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యం గల రేకుగా సాగతీయోచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్వ కాలంలో బంగారాన్ని మారకంగా వినియోగించేవారు.  బంగారంనుండి ఎక్కువగా నాణేలు, ఆభరణాలు తయారు చేయుటకు ఉపయోగించడం జరిగేది. 1930నుండి బంగారపు నాణేల చలామణిని ఆగిపోయింది. 2012 నాటికి లక్షా 74 వేల 100  టన్నుల బంగారం ప్రపంచం వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యింది

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా పెరుగుతూ వచ్చాయ్. బంగారం ధర ఎన్నాళ్లకు రెట్టింపు అవుతోంది. బంగారం డిమాండ్ వచ్చే రోజుల్లో కొనసాగుతోంది... పడిపోతుందా... బంగారం డిమాండ్ ఎందుకు తగ్గుతోంది. బంగారం విషయంలో భారతీయులకు క్రేజ్ ఎక్కువ. అయితే భారతదేశంలో లభిస్తున్న బంగారం చాలా తక్కువనే చెప్పాలి. భారతీయులు కొనుగోలు చేస్తున్న బంగారమంతా ప్రపంచ  దేశాల నుంచి దిగుమతి చేసుకునేదే...  బంగారాన్ని అంతర్జాతీయ రేట్లు ఆధారంగా విక్రయిస్తారు. కొనుగోళ్లు జరుపుతారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ఒకే రకమైన ధరను కలిగి ఉంటుంది.  బంగారం ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుంది. 1925లో పది గ్రాముల బంగారం ధర రూ 18.75 పైసలు. 1950లో పది గ్రాముల బంగారం ధర రూ. 99.18 పైసలు... 1975లో పది గ్రాముల బంగారం ధర రూ. 540. అదే 2000 సంవత్సరంలో పది గ్రాముల బంగారం ధర రూ. 4400. అదే ప్రస్తుతం రూ. 29,000గా ఉంది.  బంగారం ధరలు అంతకంతకు పెరుగుతుండగా... రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల బంగారం కొనుగోలు చేయడంతో  దాని ధర పలానా విధంగా పెరిగిందని సంతోషించవచ్చు. దేశ ప్రజలు బంగారం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్న పలు చర్యల మూలంగా 13 ఏళ్ల కనిష్ట స్థాయికి ఇండియాలో బంగారం డిమాండ్ తగ్గింది. 2016లో గోల్డ్ డిమాండ్ 580 టన్నులుగా ఉంది. అది ఈ ఏడాది 34 శాతం తగ్గినట్టుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2003 తర్వాత ఇలాంటి పరిస్థితి చూడటం ఇదే మొదటి  సారిగా గోల్డ్ ఎక్సపర్ట్స్ చెబుతున్నారు. 2016 బంగారం వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు వచ్చినట్టుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.
2016లో గోల్డ్ దిగుమతులు 498 టన్నులుగా ఉంది. 2015 నుంచి నెలకు 60 టన్నుల గోల్డ్ దిగుమతులు జరుగుతున్నాయ్.  అయితే 2020 నాటికి భారతదేశంలో బంగారం డిమాండ్ 850 నుంచి 950 టన్నుల వరకు ఉంటుందని వరల్డ్ గోల్డ కౌన్సిల్ పేర్కొంది.  2010లో భారతదేశంలో గోల్డ్ డిమాండ్ 1006 టన్నులుగా ఉంది. 2011లో 986 టన్నులుగా ఉంది. 2012లో ఆ సంఖ్య 864 టన్నులుగా ఉంది. 2013లో 975 టన్నులుగా ఉంది. 2014లో బంగారం డిమాండ్ 811 టన్నులు ఉంది. 2015లో 858 టన్నులు ఉంది. 2016లో అది 580 టన్నులకు పడిపోయింది. బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోడానికి కారణం... 2016 బడ్జెట్లో 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ వేయడమన్న అభిప్రాయాన్ని పరిశ్రమవర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. దీనికి నిరసనగా 42 రోజులపాటు ఆందోళన కూడా చేశారు.   దేశీయంగా బంగారు దొరకడం తక్కువకావడంతో... ఎక్కువ శాతం బంగారాన్ని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

భారతదేశంలో బంగారు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతోంది. మనం వాడుతున్న బంగారమంతా బయట నుంచి వచ్చేదేనా? కర్ణాటకలో తప్పించి మిగతా చోట్ల దొరికే బంగారం అంతంత మాత్రమేనా? ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో సింహ భాగం భార‌త్‌, చైనా దేశాల నుంచే జ‌రుగుతోంది. ప్రపంచంలో ని బంగారం లో దాదాపు 11 శాతం భారతదేశంలో ని మహిళా ల వద్ద ఆభరణాల రూపం లోనే ఉంది. ఈ ఆభరణాల పరిమాణంత అమెరికా , జర్మని , స్వీట్లర్జాండ్ , ఐ ఎం ఎఫ్ ల మొత్తం బంగారు నిల్వల కంటే చాలా ఎక్కువ. అంత‌ర్జాతీయంగా ప‌సిడి ధ‌ర‌లు మార‌డంలో వీటి ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌త కొద్ది నెల‌లుగా ఈ రెండు దేశాల్లో వినియోగం త‌గ్గుతోంది. ఆర్థిక ప‌రిస్థితులు  ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో బంగారం త‌దిత‌ర సాధనాల్లో పెట్టుబ‌డి దిశ‌గా కొనుగోళ్లు జ‌రిపేవారు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత బంగారం అమ్మాకాలపైనా ప్రభావం చూపింది. అమ్మకాలు తగ్గినప్పటికీ... బంగారం ధర మాత్రం అదే విధంగా కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా దొరుకుతున్న బంగారు నిల్వల్లో దేశంలో దొరుకుతున్న బంగారం నిల్వలకు చాలా తక్కువగా లభిస్తున్నాయ్. మెజార్టీ మొత్తం బయట దేశాల నుంచే మనం కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రపంచంలో లభించే గోల్డ్ నిల్వల్లో మెజార్టీ మన దేశంలో వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచ వ్యాప్తంగా 116.5 మిలిటన్ టన్నుల ఖనిజాలుండగా...   22.4 మిలియన్ టన్నుల బంగారం నిల్వలున్నాయి. అదే సమయంలో భారతదేశంలో ఉన్న గోల్డ్ నిల్వలు కేవలం ఒక శాతంగానే ఉన్నాయన్న అంచనా ఉంది.  దక్షిణాఫ్రికా మనకంటే 60 సార్లు అధికంగా ఉత్పత్తి చేయగలిగితే, కెనడా 22 సార్లు, ఆస్ట్రేలియా 5 సార్లు మన కంటే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయగలుగుతున్నాయ్. అయితే బంగార నిల్వలను వెలికితీయడం ఏటికేడు తగ్గుతూ వస్తోంది. దేశంలో బంగారు అందుబాటులో ఉన్నప్పటికీ... 1999-2000 సంవత్సరాల మధ్య అది 2,586 కేజీలుగా ఉంది. 2002-03 నాటికి అది 3,049 కేజీలకు చేరింది.  భారతదేశంలో బంగారం నిల్వలు ఎక్కువగా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్, హుట్టి గోల్డ్ ఫీల్డ్, ఆంధ్రప్రదేశ్ లోని రామగిరి గోల్డ్ ఫీల్డ్ లో  ఉన్నాయ్.  కర్ణాటకలో 42 వేల కేజీల బంగారు లభ్యవుతుందని అంచనా వేస్తున్నారు. అది దేశంలోని 88.7 శాతంతో సమానం. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని రామగిరి వద్ద పెద్ద మొత్తంలో బంగారు నిల్వలున్నాయ్. జార్ఖండ్, కేరళలోనూ బంగారం లభ్యవుతోంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెద్ద ఎత్తున గోల్డ్ నిల్వలున్నాయ్.  రిజర్వ్ బ్యాంక్ చేతి వద్ద  1312.5 బిలియన్ రూపాయల బంగారు నిల్వలున్నాయి. ఆ నిల్వల ఆధారంగానే కరెన్సీ ముద్రణ జరుగుతుంది.
భారతదేశంలోని దేవాలయాల్లో కుప్పలుతెప్పలుగా బంగారం నిల్వలున్నాయన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి దేవాలయంలో బంగారు కోటాను కోట్ల విలువ  కలిగినది ఉన్నదని అంటారు. అదే సమయంలో టీటీడీ వద్ద భారీగా బంగారం నిల్వలున్నట్టుగా చెబుతున్నారు. అసలు భారతదేశంలోని దేవాలయాల్లో బంగారు నిల్వలు ఏ మేరకు ఉన్నాయ్.
భారతదేశంలో ఇష్టదైవానికి బంగారం సమర్పిస్తే మంచి జరుగుతుందన్న అభిప్రాయం భక్తుల్లో ఎక్కువగా ఉంది. అందుకే వారి ఇష్టదైవాలను స్మరిస్తూ... ఆయా ఆలయాలకు భక్తుల బంగారు నగలు, బంగారు వస్తువులను సమర్పించుకుంటారు. ఇలా సమర్పించుకున్న బంగారు నిల్వలు దేశంలోని కీలక ఆలయాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయ్. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 7 వేల కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయ్. మార్కెట్లో ఆ బంగారం విలువ విలువ సుమారు రూ.1,800 కోట్లుగా ఉంది. ముంబయి... సిద్ధివినాయక గణపతి మందిరం 160 కిలోల బంగారు ఆభరణాలున్నాయ్. షిర్డి సాయిబాబా మందిరం 384 కిలోలు గుజరాత్‌ సోమనాథ్‌ మందిరం 35 కిలోలు, విజయవాడ కనకదుర్గ ఆలయం 110 కిలోల బంగారం నిల్వలున్నాయ్. ఇక కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలోని  నేలమాళిగల్లో దాగిన అపారసంపద బయట పడింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే ఇక్కడి సంపద, నిక్షేపాలపై సుప్రీం పర్యవేక్షణ ఉండటంతో... ఇక్కడ సంపదపై పూర్తి స్థాయి ఆధారాలు లభ్యం కాలేదు.
బంగారంపై ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి నిపుణులు ఏం చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడాకి సంబంధించి అందుతున్న సూచనలేంటి? బంగారం విషయంలో కామన్ మ్యాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.  బంగారమంటే స్త్రీలకు మొజు. బంగారమంటే మహిళలు పడిచస్తారు. బంగారు ఆభరణాలు ధరించాలని... బంగారాన్ని తగినంతగా సమకూర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. ఫంక్షన్లకు వెళ్లాలంటే బంగారు లేకుండా వెళ్లనే వెళ్లరు. బంగారు ధరించడం ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా మహిళలు భావిస్తారు.  భారతీయ సంస్కృతి ప్రకారం పండుగ, పెళ్లిళ్లంటే గుర్తుకొచ్చేది బంగారం మాత్రమే. అందుకే భారత దేశంలో బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు ఏమాత్రం తగ్గట్లేదని సర్వేలో తేలింది. భారతీయులు ఏడాదికి 700-900 టన్నుల వరకు బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. చెప్పాలంటే బంగారం వినియోగంలో భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. బంగారం నిల్వలను, కొనుగోళ్లను భారతీయ వివాహ వ్యవస్థ పెంచుతోంది. ఈ క్రమంలో 18వేల టన్నుల బంగారాన్ని భారతీయులు ధరించుకుని తిరుగుతున్నారని సర్వే తేల్చింది. దీని విలువ అక్షరాల 60 లక్షల కోట్లు. అమెరికా, యూరప్, స్విజ్ బ్యాంకుల కంటే భారత రిజర్వ్ బ్యాంక్‌ ఇతరత్రా బ్యాంకుల్లో దాచే బంగారాన్ని లెక్కకు తీసుకోకుండా, గృహస్థుల వద్ద మాత్రం 950 బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంటుందని అంచనా
అయితే బంగారం పెట్టుబడుల వెనుక పెద్ద ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పటికీ భారతీయ కుటుంబాలు బంగారాన్ని అమ్ముకునేందుకు ఇష్టపడట్లేదని, అందుకే భారత్‌లో బంగారం నిల్వ శాతం పెరిగిపోతోందని సర్వే తెలిపింది. రూపాయి బలహీన పడటానికి బంగారు వినియోగం పెరగడమే కారణమని, ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత భారత్ బంగారాన్నే అధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డీమానిటైజేషన్ తర్వాత అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ ప‌థ‌క‌మైన ఎస్‌పీడీఆర్ నుంచి గ‌త నెల రోజులుగా ఇన్వెస్ట‌ర్లు 75 ట‌న్నుల బంగారానికి స‌మాన‌మైన పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌న దేశంలో అన్ని ర‌కాల బంగారం కొనుగోళ్లు బాగా ప‌డిపోయాయి. దీంతో ఈ సంవ‌త్స‌రం కూడా బంగారు దిగుమతులు 500 ట‌న్నులు మించ‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.  డాల‌ర్ ప్ర‌భావం డాల‌ర్ ప్రభావం అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌ల‌ను డాల‌ర్ల మార‌కంలో నిర్ణ‌యిస్తారు. ఇత‌ర క‌రెన్సీల‌తో పోలిస్తే డాల‌ర్ విలువ పెరిగితే బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయి. డాల‌రు మార‌కం విలువ బ‌ల‌హీన‌ప‌డితే బంగారం పెరుగుతుంది.
శుభ సూచికకు చిహ్నం  బంగారం... బంగారమంటే ఒక అభిమానం... ఒక ధైర్యం... ఒక భరోసా... ఒక ధీమా... బంగారం లాంటి జీవితం... బంగారం లాంటి మనిషి... బంగారం లాంటి వ్యవస్థ... బంగారాన్ని ఇలా అనేక విధాలుగా మనం పిలుచుకుంటాం... అంతెందుకు ఎవరైనా పోటీలో విజేతగా నిలిస్తే బంగారు పతకాన్ని బహూకరిస్తాం... ఇంతట మహిమాన్వితమైన బంగారం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం... బంగారానికి బంగారమే సరిపోతుంది. బంగారం లాంటి మాట చెప్పావ్ అంటారు... బంగారం అంటూ వ్యక్తులను పిలుచుకుంటారు... బంగారంతో తయారైన కప్పులను గిఫ్టులుగా ఇస్తారు. ఆయా రాజుల పాలన సువర్ణయుగంగా పిలుస్తారు. బంగారంతో తయారు చేసిన ట్రోఫీలను బహూకరిస్తారు. ఒలింపిక్స్ తో గెలిచిన వారికి గోల్డ్ మెడల్స్ ను ఇస్తారు. కొంత మంది విగ్రహాలకు బంగారపు పూత పూస్తారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఎమ్మీ అవార్డులు, బ్రిటీష్ అకాడెమీ అవార్డులు అన్నీంట్లో కూడా బంగారపు పూత ట్రోఫీలను అందిస్తారు.
ప్రఖ్యాత అర్ధశాస్త్ర నిపుణులు అరిస్టాటిల్ సైతం కొన్ని విషయాల్లో బంగారు భావన పదాన్ని ఉపయోగించారు. యువతకు బంగారు భవిత రాబోతుదంటూ అభివర్ణిస్తారు. అభివృద్ధి సూచికగా కూడా బంగారాన్ని కొలుస్తారు. కాపురం బంగారంలా ఉందని... మా పిల్లల జీవితాలు బంగారంగా ఉన్నాయంటూ కూడా చెప్తారు. గోల్డెన్ ఇయర్స్, గోల్డెన్ ఏజ్ అంటూ జీవిత ఘట్టాలను వివరిస్తారు. క్రైస్తవంలోనూ, జూడాయిజంలోనూ బంగారం దైవత్వంతో కూడినదని చెబుతారు. అంతెందుకు పెళ్లిళ్లలోనూ, ఎంగేజ్మెంట్ల సందర్భంగానూ బంగారు ఉంగారాలను తొడుగుతారు. బంగారు కీరిటమంటూ కీర్తిస్తారు. గోల్డెన్ ఛాన్స్ అంటూ అవకాశం గురించి చెబుతారు. గెల్డెన్ అవర్ అని వ్యక్తి ప్రాణాన్ని నిలెబట్టే సమయంగానూ చెప్తారు. మొన్నటి వరకు భారత్ నెంబర్ వన్... ఇప్పుడు గోల్డ్ వినియోగంలో చైనా నెంబర్ వన్...  బంగారానికి తుప్పు పట్టదు... చిలుము పట్టదు...  బంగారం బంగారమే...

బంగారం... బంగారమే. బంగారం ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది. బంగారంతో సాటి గల వస్తువు ఇంత వరకు భూమిపై లేదు. బంగారం కంటే ఖరీదైన వస్తువులున్నప్పటికీ బంగారం మంది అవి దిగదుడుపే.  బంగారంతో ఏదీ కూడా సరిసమానం కాదు. గత రెండేళ్లుగా బంగారం దిగుమతులు భారత్ లో తగ్గినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. అయితే 2017లో తిరిగి భారతదేశంలోనూ పెద్ద ఎత్తున దిగుమతులు పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారంపై భారీగా ప్రభావం చూపినప్పటికీ అది ఈ ఏడాది చివరకు పుంజుకుంటుందన్న అంచనాను పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. ఇదీ ఇవాళ్టి స్పెషల్ రిపోర్ట్

బంగారం బంగారమే

వన్నె తగ్గనిది... విలువ తగ్గనిది... అంతకంతకూ పెరిగేది... 365 రోజులు గిరాకి కలిగి ఉండేది బంగారం ఒక్కటే.  అవును బంగారం ప్రపంచాన్ని శాసిస్తోంది. జనంలో బంగారానికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ధర పెరిగినా బంగారాన్ని కొనుగోలు చేయడం మాత్రం తగ్గడం లేదు.  బంగారంపై పిచ్చి ఇండియన్లకు మాత్రమే కాదు... బంగారంపై ప్రేమ, మమకారం, అవసరం ప్రపంచ దేశాలకు ఎక్కువవుతోంది. బంగారు నిల్వలపై ప్రపంచ దేశాల కన్నుపడింది. ఎంతైతే  డబ్బు దాచుకుంటారో... అంత మొత్తానికి సమానంగా బంగారాన్ని కొనుగోలు చేయాలని జనం భావిస్తున్నారు. డబ్బుకంటే బంగారం రూపానికే ఎక్కువ వాల్యూ ఉంటుందన్న అభిప్రాయం జనంలో ఉంది.  బంగారం లాంటి జీవితం... బంగారు భవిష్యత్.....  బాబు బంగారమంటూ మన జీవితాల గురించి  బంగారం  ప్రభావం ఎంతో ఉంటుంది. గోల్డ్ ఈజ్ గోల్డ్ స్పెషల్ రిపోర్ట్...
బంగారం ప్రపంచ వ్యాప్తంగా అతి ఎక్కువ గిరాకీ ఉన్న ఖనిజం. అయితే బంగారం నిల్వలలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా తక్కువ పరిణామంలోనే ఉన్నాయ్. అనాధిగా బంగారం ఆఫ్రికా ఖండంలో...  ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో లభించేది.  అక్కడి గనుల నుంచి పెద్ద ఎత్తున బంగార నిల్వలు ప్రపంచ వ్యాప్తంగా తరలి వచ్చేవి.   బంగారం, రాగి  క్రీస్తు పూర్వం 5000 ఏళ్ళ క్రితమే కనుగొన్నారు భూమి పై ఉన్న ఏడు ఖండాల్లోనూ బంగారు నిక్షేపాలను కనుగొన్నారు.  ప్రపంచంలో బంగారు నాణాలను తొలిసారిగా వాడుకలోకి తెచ్చిన ఘనత ప్రాచీన గ్రీకు ప్రాంతానికి చెందిన లిడియా రాజు కింగ్ క్రిస్ కు దక్కుతుంది.  క్రీస్తు పూర్వం 540 ప్రాంతంలో స్వచ్ఛమైన బంగారు నాణాలను వాడుకలోకి తెచ్చాడు.
హేమం, కనకం, స్వర్ణం ఇలా పలు పేర్లతో బంగారాన్ని పిలుచుకుంటాం.  బంగారు ఒక అరుదైన ఖనిజం. అత్యంత ఖరీదైన వస్తువు. బంగారంతో అద్భుతమైన ఆభరణాలు తయారు చేయవచ్చు...  ఆయా వ్యక్తులు సైతం తమ వద్ద ఉన్న బంగారాన్ని బట్టి ధనికులుగా చెలామణీ అవుతున్నారు. బంగారాన్ని బట్టి ఆ దేశ సంపదను అంచనా వేస్తారు.  బంగారు నిల్వల ఆధారంగానే ఆ దేశ కరెన్సీని ముద్రిస్తుంది. అందుకే బంగారం ధర ప్రపంచమంతా ఒకే మాదిరిగా ఉంటుంది. ఒకచోట ఒకలా... మరో చోట మరోలా బంగారం ధరల్లో వ్యత్యాసం ఉండదు.
బంగారం అతి తక్కువ ప్రమాణంలో నేల పొరలల్లో  నిక్షిప్తమై ఉంటుంది. భూమిలో బంగారం ప్రధానంగా రెండు రకాలుగా లభిస్తుంది. ప్రథమ శ్రేణి, లోడ్ నిల్వలు  ద్వితీయ శ్రేణి నిల్వలను ప్లసెర్ అంటారు. ఈజిప్టులో ఫారోల కాలంలో బంగారాన్ని గనుల నుంచి తవ్వేవారు. ఆ బంగారం అవసరానికి తగినంతగా లభించనప్పుడు యెమెన్,  దక్షిణాఫ్రికాలో అన్వేషణ కొనసాగించారు. అయితే బంగారు గనుల్లో పనిచేసే వారి జీవితం దుర్భరంగా ఉంటుంది.  గనుల్లో తవ్వకాలతో కార్మికులు కాలుష్యం బారినపడి... దీర్ఖకాలంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం భూమి మీదా వాడుక లో ఉన్న బంగారం 20 శాతం మాత్రమేనని మరో 80 శాతం భూ గర్భం లోనే ఇంకా నిక్షిప్తమై ఉందని శాస్త్ర వేత్త ల అంచన.  భూమి పై ఉన్న అన్ని సముద్రాల అట్టడుగునా దాదాపు 2 కోట్ల టన్నుల వరకు బంగారం ఉంటుందని శాస్త్ర వేత్తల అభిప్రాయపడుతున్నారు. ఇతర గ్రహాల్లోనూ బంగారం అవశేషాలను కనిపెట్టినట్టుగా చెబుతున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు గనుల నుంచి తవ్వి తీసిన మొత్తం బంగారంలో దాదాపు సగం బంగారం ఒకే ఒక్క ప్రదేశం నుంచి దొరికింది.  ఆ ప్రదేశమే దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్స్ రాండ్ . ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల పలుచని రేకులా సాగ గొట్టవచ్చును. బంగారం భౌతిక గుణగణాలు నిజంగా విశ్మయాన్ని కలిగిస్తాయ్.  అత్యంత పలుచని రేకులుగా సాగే అద్భుతమైన భౌతిక ధర్మాన్ని బంగారం కలిగి ఉంది.  వెంట్రుకల  కన్నా సన్నని తీగెలుగా బంగారం సాగుతుంది. ఒక ఔన్సు బంగారం అంటే 28 గ్రాముల బంగారాన్ని 50 మైళ్ళ పొడవున్న తీగెను చేయవచ్చట.  కేవలం ఒకగ్రాము భారమున్న బంగారాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యం గల రేకుగా సాగతీయోచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్వ కాలంలో బంగారాన్ని మారకంగా వినియోగించేవారు.  బంగారంనుండి ఎక్కువగా నాణేలు, ఆభరణాలు తయారు చేయుటకు ఉపయోగించడం జరిగేది. 1930నుండి బంగారపు నాణేల చలామణిని ఆగిపోయింది. 2012 నాటికి లక్షా 74 వేల 100  టన్నుల బంగారం ప్రపంచం వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యింది

ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా పెరుగుతూ వచ్చాయ్. బంగారం ధర ఎన్నాళ్లకు రెట్టింపు అవుతోంది. బంగారం డిమాండ్ వచ్చే రోజుల్లో కొనసాగుతోంది... పడిపోతుందా... బంగారం డిమాండ్ ఎందుకు తగ్గుతోంది. బంగారం విషయంలో భారతీయులకు క్రేజ్ ఎక్కువ. అయితే భారతదేశంలో లభిస్తున్న బంగారం చాలా తక్కువనే చెప్పాలి. భారతీయులు కొనుగోలు చేస్తున్న బంగారమంతా ప్రపంచ  దేశాల నుంచి దిగుమతి చేసుకునేదే...  బంగారాన్ని అంతర్జాతీయ రేట్లు ఆధారంగా విక్రయిస్తారు. కొనుగోళ్లు జరుపుతారు. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ఒకే రకమైన ధరను కలిగి ఉంటుంది.  బంగారం ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుంది. 1925లో పది గ్రాముల బంగారం ధర రూ 18.75 పైసలు. 1950లో పది గ్రాముల బంగారం ధర రూ. 99.18 పైసలు... 1975లో పది గ్రాముల బంగారం ధర రూ. 540. అదే 2000 సంవత్సరంలో పది గ్రాముల బంగారం ధర రూ. 4400. అదే ప్రస్తుతం రూ. 29,000గా ఉంది.  బంగారం ధరలు అంతకంతకు పెరుగుతుండగా... రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల బంగారం కొనుగోలు చేయడంతో  దాని ధర పలానా విధంగా పెరిగిందని సంతోషించవచ్చు. దేశ ప్రజలు బంగారం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చేస్తున్న పలు చర్యల మూలంగా 13 ఏళ్ల కనిష్ట స్థాయికి ఇండియాలో బంగారం డిమాండ్ తగ్గింది. 2016లో గోల్డ్ డిమాండ్ 580 టన్నులుగా ఉంది. అది ఈ ఏడాది 34 శాతం తగ్గినట్టుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2003 తర్వాత ఇలాంటి పరిస్థితి చూడటం ఇదే మొదటి  సారిగా గోల్డ్ ఎక్సపర్ట్స్ చెబుతున్నారు. 2016 బంగారం వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు వచ్చినట్టుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.
2016లో గోల్డ్ దిగుమతులు 498 టన్నులుగా ఉంది. 2015 నుంచి నెలకు 60 టన్నుల గోల్డ్ దిగుమతులు జరుగుతున్నాయ్.  అయితే 2020 నాటికి భారతదేశంలో బంగారం డిమాండ్ 850 నుంచి 950 టన్నుల వరకు ఉంటుందని వరల్డ్ గోల్డ కౌన్సిల్ పేర్కొంది.  2010లో భారతదేశంలో గోల్డ్ డిమాండ్ 1006 టన్నులుగా ఉంది. 2011లో 986 టన్నులుగా ఉంది. 2012లో ఆ సంఖ్య 864 టన్నులుగా ఉంది. 2013లో 975 టన్నులుగా ఉంది. 2014లో బంగారం డిమాండ్ 811 టన్నులు ఉంది. 2015లో 858 టన్నులు ఉంది. 2016లో అది 580 టన్నులకు పడిపోయింది. బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోడానికి కారణం... 2016 బడ్జెట్లో 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ వేయడమన్న అభిప్రాయాన్ని పరిశ్రమవర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. దీనికి నిరసనగా 42 రోజులపాటు ఆందోళన కూడా చేశారు.   దేశీయంగా బంగారు దొరకడం తక్కువకావడంతో... ఎక్కువ శాతం బంగారాన్ని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

భారతదేశంలో బంగారు ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతోంది. మనం వాడుతున్న బంగారమంతా బయట నుంచి వచ్చేదేనా? కర్ణాటకలో తప్పించి మిగతా చోట్ల దొరికే బంగారం అంతంత మాత్రమేనా? ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో సింహ భాగం భార‌త్‌, చైనా దేశాల నుంచే జ‌రుగుతోంది. ప్రపంచంలో ని బంగారం లో దాదాపు 11 శాతం భారతదేశంలో ని మహిళా ల వద్ద ఆభరణాల రూపం లోనే ఉంది. ఈ ఆభరణాల పరిమాణంత అమెరికా , జర్మని , స్వీట్లర్జాండ్ , ఐ ఎం ఎఫ్ ల మొత్తం బంగారు నిల్వల కంటే చాలా ఎక్కువ. అంత‌ర్జాతీయంగా ప‌సిడి ధ‌ర‌లు మార‌డంలో వీటి ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంది. గ‌త కొద్ది నెల‌లుగా ఈ రెండు దేశాల్లో వినియోగం త‌గ్గుతోంది. ఆర్థిక ప‌రిస్థితులు  ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో బంగారం త‌దిత‌ర సాధనాల్లో పెట్టుబ‌డి దిశ‌గా కొనుగోళ్లు జ‌రిపేవారు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత బంగారం అమ్మాకాలపైనా ప్రభావం చూపింది. అమ్మకాలు తగ్గినప్పటికీ... బంగారం ధర మాత్రం అదే విధంగా కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా దొరుకుతున్న బంగారు నిల్వల్లో దేశంలో దొరుకుతున్న బంగారం నిల్వలకు చాలా తక్కువగా లభిస్తున్నాయ్. మెజార్టీ మొత్తం బయట దేశాల నుంచే మనం కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రపంచంలో లభించే గోల్డ్ నిల్వల్లో మెజార్టీ మన దేశంలో వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.  ప్రపంచ వ్యాప్తంగా 116.5 మిలిటన్ టన్నుల ఖనిజాలుండగా...   22.4 మిలియన్ టన్నుల బంగారం నిల్వలున్నాయి. అదే సమయంలో భారతదేశంలో ఉన్న గోల్డ్ నిల్వలు కేవలం ఒక శాతంగానే ఉన్నాయన్న అంచనా ఉంది.  దక్షిణాఫ్రికా మనకంటే 60 సార్లు అధికంగా ఉత్పత్తి చేయగలిగితే, కెనడా 22 సార్లు, ఆస్ట్రేలియా 5 సార్లు మన కంటే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయగలుగుతున్నాయ్. అయితే బంగార నిల్వలను వెలికితీయడం ఏటికేడు తగ్గుతూ వస్తోంది. దేశంలో బంగారు అందుబాటులో ఉన్నప్పటికీ... 1999-2000 సంవత్సరాల మధ్య అది 2,586 కేజీలుగా ఉంది. 2002-03 నాటికి అది 3,049 కేజీలకు చేరింది.  భారతదేశంలో బంగారం నిల్వలు ఎక్కువగా కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్, హుట్టి గోల్డ్ ఫీల్డ్, ఆంధ్రప్రదేశ్ లోని రామగిరి గోల్డ్ ఫీల్డ్ లో  ఉన్నాయ్.  కర్ణాటకలో 42 వేల కేజీల బంగారు లభ్యవుతుందని అంచనా వేస్తున్నారు. అది దేశంలోని 88.7 శాతంతో సమానం. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని రామగిరి వద్ద పెద్ద మొత్తంలో బంగారు నిల్వలున్నాయ్. జార్ఖండ్, కేరళలోనూ బంగారం లభ్యవుతోంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెద్ద ఎత్తున గోల్డ్ నిల్వలున్నాయ్.  రిజర్వ్ బ్యాంక్ చేతి వద్ద  1312.5 బిలియన్ రూపాయల బంగారు నిల్వలున్నాయి. ఆ నిల్వల ఆధారంగానే కరెన్సీ ముద్రణ జరుగుతుంది.
భారతదేశంలోని దేవాలయాల్లో కుప్పలుతెప్పలుగా బంగారం నిల్వలున్నాయన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి దేవాలయంలో బంగారు కోటాను కోట్ల విలువ  కలిగినది ఉన్నదని అంటారు. అదే సమయంలో టీటీడీ వద్ద భారీగా బంగారం నిల్వలున్నట్టుగా చెబుతున్నారు. అసలు భారతదేశంలోని దేవాలయాల్లో బంగారు నిల్వలు ఏ మేరకు ఉన్నాయ్.
భారతదేశంలో ఇష్టదైవానికి బంగారం సమర్పిస్తే మంచి జరుగుతుందన్న అభిప్రాయం భక్తుల్లో ఎక్కువగా ఉంది. అందుకే వారి ఇష్టదైవాలను స్మరిస్తూ... ఆయా ఆలయాలకు భక్తుల బంగారు నగలు, బంగారు వస్తువులను సమర్పించుకుంటారు. ఇలా సమర్పించుకున్న బంగారు నిల్వలు దేశంలోని కీలక ఆలయాల్లో పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయ్. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 7 వేల కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయ్. మార్కెట్లో ఆ బంగారం విలువ విలువ సుమారు రూ.1,800 కోట్లుగా ఉంది. ముంబయి... సిద్ధివినాయక గణపతి మందిరం 160 కిలోల బంగారు ఆభరణాలున్నాయ్. షిర్డి సాయిబాబా మందిరం 384 కిలోలు గుజరాత్‌ సోమనాథ్‌ మందిరం 35 కిలోలు, విజయవాడ కనకదుర్గ ఆలయం 110 కిలోల బంగారం నిల్వలున్నాయ్. ఇక కేరళలోని అనంతపద్మనాభస్వామి ఆలయంలోని  నేలమాళిగల్లో దాగిన అపారసంపద బయట పడింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే ఇక్కడి సంపద, నిక్షేపాలపై సుప్రీం పర్యవేక్షణ ఉండటంతో... ఇక్కడ సంపదపై పూర్తి స్థాయి ఆధారాలు లభ్యం కాలేదు.
బంగారంపై ఇన్వెస్ట్మెంట్ కు సంబంధించి నిపుణులు ఏం చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయడాకి సంబంధించి అందుతున్న సూచనలేంటి? బంగారం విషయంలో కామన్ మ్యాన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.  బంగారమంటే స్త్రీలకు మొజు. బంగారమంటే మహిళలు పడిచస్తారు. బంగారు ఆభరణాలు ధరించాలని... బంగారాన్ని తగినంతగా సమకూర్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. ఫంక్షన్లకు వెళ్లాలంటే బంగారు లేకుండా వెళ్లనే వెళ్లరు. బంగారు ధరించడం ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా మహిళలు భావిస్తారు.  భారతీయ సంస్కృతి ప్రకారం పండుగ, పెళ్లిళ్లంటే గుర్తుకొచ్చేది బంగారం మాత్రమే. అందుకే భారత దేశంలో బంగారం ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు ఏమాత్రం తగ్గట్లేదని సర్వేలో తేలింది. భారతీయులు ఏడాదికి 700-900 టన్నుల వరకు బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. చెప్పాలంటే బంగారం వినియోగంలో భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. బంగారం నిల్వలను, కొనుగోళ్లను భారతీయ వివాహ వ్యవస్థ పెంచుతోంది. ఈ క్రమంలో 18వేల టన్నుల బంగారాన్ని భారతీయులు ధరించుకుని తిరుగుతున్నారని సర్వే తేల్చింది. దీని విలువ అక్షరాల 60 లక్షల కోట్లు. అమెరికా, యూరప్, స్విజ్ బ్యాంకుల కంటే భారత రిజర్వ్ బ్యాంక్‌ ఇతరత్రా బ్యాంకుల్లో దాచే బంగారాన్ని లెక్కకు తీసుకోకుండా, గృహస్థుల వద్ద మాత్రం 950 బిలియన్ డాలర్ల విలువైన బంగారం ఉంటుందని అంచనా
అయితే బంగారం పెట్టుబడుల వెనుక పెద్ద ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కష్టాల్లో ఉన్నప్పటికీ భారతీయ కుటుంబాలు బంగారాన్ని అమ్ముకునేందుకు ఇష్టపడట్లేదని, అందుకే భారత్‌లో బంగారం నిల్వ శాతం పెరిగిపోతోందని సర్వే తెలిపింది. రూపాయి బలహీన పడటానికి బంగారు వినియోగం పెరగడమే కారణమని, ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత భారత్ బంగారాన్నే అధికంగా భారత్ దిగుమతి చేసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
డీమానిటైజేషన్ తర్వాత అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ ప‌థ‌క‌మైన ఎస్‌పీడీఆర్ నుంచి గ‌త నెల రోజులుగా ఇన్వెస్ట‌ర్లు 75 ట‌న్నుల బంగారానికి స‌మాన‌మైన పెట్టుబ‌డుల‌ను వెన‌క్కు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మ‌న దేశంలో అన్ని ర‌కాల బంగారం కొనుగోళ్లు బాగా ప‌డిపోయాయి. దీంతో ఈ సంవ‌త్స‌రం కూడా బంగారు దిగుమతులు 500 ట‌న్నులు మించ‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.  డాల‌ర్ ప్ర‌భావం డాల‌ర్ ప్రభావం అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌ల‌ను డాల‌ర్ల మార‌కంలో నిర్ణ‌యిస్తారు. ఇత‌ర క‌రెన్సీల‌తో పోలిస్తే డాల‌ర్ విలువ పెరిగితే బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయి. డాల‌రు మార‌కం విలువ బ‌ల‌హీన‌ప‌డితే బంగారం పెరుగుతుంది.
శుభ సూచికకు చిహ్నం  బంగారం... బంగారమంటే ఒక అభిమానం... ఒక ధైర్యం... ఒక భరోసా... ఒక ధీమా... బంగారం లాంటి జీవితం... బంగారం లాంటి మనిషి... బంగారం లాంటి వ్యవస్థ... బంగారాన్ని ఇలా అనేక విధాలుగా మనం పిలుచుకుంటాం... అంతెందుకు ఎవరైనా పోటీలో విజేతగా నిలిస్తే బంగారు పతకాన్ని బహూకరిస్తాం... ఇంతట మహిమాన్వితమైన బంగారం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం... బంగారానికి బంగారమే సరిపోతుంది. బంగారం లాంటి మాట చెప్పావ్ అంటారు... బంగారం అంటూ వ్యక్తులను పిలుచుకుంటారు... బంగారంతో తయారైన కప్పులను గిఫ్టులుగా ఇస్తారు. ఆయా రాజుల పాలన సువర్ణయుగంగా పిలుస్తారు. బంగారంతో తయారు చేసిన ట్రోఫీలను బహూకరిస్తారు. ఒలింపిక్స్ తో గెలిచిన వారికి గోల్డ్ మెడల్స్ ను ఇస్తారు. కొంత మంది విగ్రహాలకు బంగారపు పూత పూస్తారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, ఎమ్మీ అవార్డులు, బ్రిటీష్ అకాడెమీ అవార్డులు అన్నీంట్లో కూడా బంగారపు పూత ట్రోఫీలను అందిస్తారు.
ప్రఖ్యాత అర్ధశాస్త్ర నిపుణులు అరిస్టాటిల్ సైతం కొన్ని విషయాల్లో బంగారు భావన పదాన్ని ఉపయోగించారు. యువతకు బంగారు భవిత రాబోతుదంటూ అభివర్ణిస్తారు. అభివృద్ధి సూచికగా కూడా బంగారాన్ని కొలుస్తారు. కాపురం బంగారంలా ఉందని... మా పిల్లల జీవితాలు బంగారంగా ఉన్నాయంటూ కూడా చెప్తారు. గోల్డెన్ ఇయర్స్, గోల్డెన్ ఏజ్ అంటూ జీవిత ఘట్టాలను వివరిస్తారు. క్రైస్తవంలోనూ, జూడాయిజంలోనూ బంగారం దైవత్వంతో కూడినదని చెబుతారు. అంతెందుకు పెళ్లిళ్లలోనూ, ఎంగేజ్మెంట్ల సందర్భంగానూ బంగారు ఉంగారాలను తొడుగుతారు. బంగారు కీరిటమంటూ కీర్తిస్తారు. గోల్డెన్ ఛాన్స్ అంటూ అవకాశం గురించి చెబుతారు. గెల్డెన్ అవర్ అని వ్యక్తి ప్రాణాన్ని నిలెబట్టే సమయంగానూ చెప్తారు. మొన్నటి వరకు భారత్ నెంబర్ వన్... ఇప్పుడు గోల్డ్ వినియోగంలో చైనా నెంబర్ వన్...  బంగారానికి తుప్పు పట్టదు... చిలుము పట్టదు...  బంగారం బంగారమే...

బంగారం... బంగారమే. బంగారం ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది. బంగారంతో సాటి గల వస్తువు ఇంత వరకు భూమిపై లేదు. బంగారం కంటే ఖరీదైన వస్తువులున్నప్పటికీ బంగారం మంది అవి దిగదుడుపే.  బంగారంతో ఏదీ కూడా సరిసమానం కాదు. గత రెండేళ్లుగా బంగారం దిగుమతులు భారత్ లో తగ్గినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. అయితే 2017లో తిరిగి భారతదేశంలోనూ పెద్ద ఎత్తున దిగుమతులు పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారంపై భారీగా ప్రభావం చూపినప్పటికీ అది ఈ ఏడాది చివరకు పుంజుకుంటుందన్న అంచనాను పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయ్. ఇదీ ఇవాళ్టి స్పెషల్ రిపోర్ట్

ర్యాన్సమ్ వేర్

దొంగా దొంగా వచ్చేడే అన్ని దోచుకుపోయాడే అంటూ నిన్నటి వరకు వార్తలను మనం వింటూ వచ్చాం... అయితే ఇప్పుడు ఎక్కడో దూరాన కూర్చొన్న అగంతకుడు మన నెట్టింట్లోకి చొరబడి మనల్ని నిండా దోచేస్తున్నాడు. మన కంప్యూటర్లను, దాంట్లోని కీలక సమాచారాన్ని చూసుకోడానికి, బ్రౌజ్ చేయడానికి వీళ్లేకుండా ఎన్క్రిప్ట్ చేసేస్తున్నాడు. అంటే ఒకరకంగా మన ఇంటికి వాడే తాళం వేసేస్తున్నాడు. అప్పటి వరకు మనకు కావాల్సిన సమాచారాన్ని, కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకున్న వ్యవస్థలను ఇకపై మనం చూడలేమన్నమాట. మన కంప్యూటర్ ఉన్నప్పటికీ...  అది మూలపడిన సామాను తరహానే. ఇదే అదను చేసుకొని మీ కంప్యూటర్ తాళం ఓపెన్ చేయాలంటే సొమ్ములు కావాలంటూ... హ్యాకర్ల డిమాండ్లు మొదలవుతాయ్. ఇంత మొత్తంలో సొమ్ములిస్తేనే డిక్రిప్ట్ చేస్తామంటూ  బెంబేలెత్తిస్తారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ర్యాన్సమ్ వేర్ అసలు ఎలా వస్తుంది?  ఈ వైరస్ చూపిస్తున్న ప్రభావమేంటి? దీని బారినపడితే ఇక దుకాణాలు మూసుకోవాల్సిందేనా? ఇప్పటికే ఎన్నో జబ్బులతో సుస్తి చేసిన భారతదేశానికి ఈ ర్యాన్సమ్ వేర్ అంటుకుంటే కొంపలు కోల్లేరేనా?
తాళం వేసిన ఇంటిని దోచేసుకోవడం దొంగతనం...  అదే ఇంట్లో ఉన్న కంప్యూటర్లు, సెల్ ఫోన్లను అగంతకులు వేసే లాకే ర్యాన్సమ్ వేర్. వాన్నాక్రై...  యూజ‌ర్ల కంప్యూట‌ర్లలోకి, స్మార్ట్‌ఫోన్ల‌లోకి చొర‌బ‌డి విలువైన డేటాను హ్యాకర్లు దొంగిలించేస్తారు. ప్ర‌పంచ దేశాల‌ను భ‌య‌పెడుతోన్న ఈ వైరస్ పేరే  వాన్నా క్రై  . ర్యాన్‌స‌మ్ వేర్...
ర్యాన్‌స‌మ్ వేర్ ఏదైన‌ప్పటికీ అది చేసే ప‌ని ఒక్క‌టే. యూజ‌ర్ల కంప్యూట‌ర్లలోకి చొర‌బ‌డి వాటిని లాక్ చేస్తుంది. ఆ త‌రువాత కొంత డ‌బ్బు చెల్లిస్తే గానీ కంప్యూట‌ర్ అన్‌లాక్ కాదు, అని మెసేజ్ చూపుతుంది.  ర్యాన్సమ్‌వేర్ వైరస్ కంప్యూటర్‌లో ప్రవేశించిన మరుక్షణం సిస్టమ్ మానిటర్‌పైన స్పష్టంగా ‘మీ కంప్యూటర్‌ను లాక్ చేశాం’ అనే మెసేజ్ కనిపిస్తుంది. దీన్ని అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్ మావద్ద ఉందని చెబుతున్న సైబర్ నేరగాళ్లు గరిష్టంగా మూడు రోజుల గడువు ఇస్తూ 100 నుంచి 300 డాలర్ల వరకు మొత్తాన్ని బిట్ కాయిన్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ వైర‌స్ బారిన ప‌డ్డవారు చేసేది లేక స‌ద‌రు హ్యాక‌ర్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించి కంప్యూట‌ర్‌ను అన్ లాక్ చేసుకుంటారు. ఈ ర్యాన్‌స‌మ్ వేర్ స్పెయిన్‌, యూర‌ప్‌లోని కొన్ని ప్రాంతాల్లో గ‌త శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత ప్రపంచంలోని 150 దేశాల్లోని ప‌లు కంప్యూట‌ర్ల‌లోకి ఈ ర్యాన్‌స‌మ్ వేర్ చొర‌బ‌డింది. దీంతో కంప్యూట‌ర్ల‌న్నీ స్ట్ర‌క్ అయిపోయాయి.
ఇప్పుడు మన చూస్తున్న వైరస్ విజృంభన ప్రారంభం మాత్రమే. వచ్చే రోజుల్లో దీని విశ్వరూపం దారుణంగా ఉండబోతుంది. కారణం... యాంటీ వైరస్, ఫైర్ వాల్స్ కళ్లు గప్పి... సెక్యురిటీ వ్యవస్థల కళ్లుగప్పి... ఈ ర్యాన్సమ్ వేర్ ఇళ్లలోకి వచ్చేస్తోంది. విండోస్ కంప్యూటర్లలో ఈ వ్యాధి చొరబడి కీలకమైన సమాచారాన్ని దొంకిలించేస్తోంది. కంప్యూటర్ పనిచేయకుండా చేయడంతోపాటు... మీరింత మొత్తాన్ని ఇస్తేనే మీ కంప్యూటర్ పనిచేసేలా చేస్తామంటూ హ్యాకర్లు బెంబేలెత్తిస్తున్నారు. వాన్నా క్రై వైరస్ లెక్క‌లేన‌న్ని కంప్యూట‌ర్ల‌లో చొర‌బ‌డింది. ఇంత‌వ‌ర‌కు అనుకుంటున్న‌ట్లుగా ఇంట‌ర్నెట్ కు క‌నెక్టు అయితేనే వైర‌స్ వ్యాపిస్తుంద‌న్న అంచ‌నాల‌తో అస‌లు నెట్ కు క‌నెక్టు కావ‌డానికి ముందే ప‌లు కంప్యూట‌ర్ల‌ను ఇది ఆక్ర‌మించుకోవ‌డంతో కొత్త ఆందోళ‌న మొద‌లైంది. సిస్ట‌మ్ ఆన్ చేయ‌గానే ఇది క‌నిపిస్తోందన్న బెంగ ఎక్కువవుతోంది.
మరోవైపు ర్యాన్సమ్ వేర్ ప్రమాదంతో ఇంగ్లాండ్ లోని ఆసుపత్రులు వణికిపోయాయి.  వైరస్ బారిన పడిన దేశాల జాబితాను ఓ సారి పరిశీలిస్తే... భారత్ తర్వాత, రష్యా, కజికిస్తాన్, ఇటలీ, జర్మనీ, వియత్నాం, అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, అమెరికా ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి జపాన్ కూడా వచ్చి చేరింది.
ర్యాన్సమ్ వేర్ ఇలా వస్తుంది... ఇలా వస్తుంది... ఇది ఓపెన్ చేయోద్దు... అది ఓపెన్ చేయోద్దంటూ మనకు ఇప్పుడు వాట్సప్ లోనూ, ఫేస్ బుక్కులోనూ, సోషల్ మీడియాలోనూ నెటిజెన్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే ఈ ర్యాన్సమ్ వేర్ ను పబ్లిగ్గా విక్రయించే ముఠాలున్నాయ్... కాసుల కోసం సాగుతున్న ఈ దందా ఎలా జరుగుతుందో మీరే చూడండి.
ఇప్పుడు ప్రపంచాన్ని భయపడెతున్న ర్యాన్సమ్ వేర్ అన్నది ఒక సర్వీస్ అంటే ఆశ్చర్యపడాల్సిందే... కంప్యూటర్లను దోచేసుకుంటున్న ర్యాన్సమ్ వేర్ వైరస్ ఒక సర్వీసులా అందుబాటులో ఉందన్నది చాలా మందికి తెలియదు. హ్యాకర్లు పెద్ద మెలకువలతో చేస్తారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే...  ర్యాన్సమ్ వేర్ సాఫ్ట్ వేర్ టూల్ కేవలం రూ 100 డాలర్ల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది. అంటే ఆరున్నర, 7 వేల రూపాయలకే ఇది దొరుకుతుంది.  ఈ రెడీమేడ్ టూల్ ను ఏవిధంగా వినియోగించాలో కూడా తగిన తర్ఫీదు ఇచ్చి ఈ రాన్సమ్ వేర్ ను విక్రయిస్తున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సైతం జరుగుతోంది.  ఇలా ర్యాన్సమ్ వేర్ ను కొనుగోలు చేసి... ఎవరి దగ్గర్నుంచి ర్యాన్సమ్ వసూలు చేయాలనుకుంటారో వారికి ఈ వైరస్ తో ఎటాక్ చేయడం... వారి దగ్గర్నుంచి పలానా మొత్తం ఇస్తే తప్పించి కంప్యూటర్ ను అన్ లాక్ చేయమంటూ కంప్యూటర్ సందేశాలను హ్యాకర్లు పంపిస్తున్నారు. ఇలాంటి ర్యాన్సమ్ వేర్ సాఫ్ట్ వేరు కొనుగోలు చేసిన హ్యాకర్లు... కొనుగోలుదారుకు తాము దోచేసిన మొత్తంలో సగం మొత్తాన్ని అందించాలన్న షరతును విధిస్తున్నారు. ర్యాన్సమ్ వేర్ తో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న హ్యాకర్లు కోటాను కోట్ల రూపాయలను కొల్లగొట్టేస్తున్నారు.  మనం వాడే బ్యాంక్ ఎకౌంట్ల మాదిరిగా... బిట్ కాయిన్ అడ్రస్ లు ఇచ్చి...    వాటిలో ఎమౌంట్ క్రెడిట్ చేయాల్సిందిగా ఆయా వినియోగదారులను హ్యాకర్లు డిమాండ్ చేస్తారు. బిట్ కాయిన్ అంటే అదో రకమైన నల్లధనంగా చెప్పుకోవచ్చు. చీకటి సామ్రాజ్యాలున్న పలు దేశాల్లో ఈ బిట్ కాయిన్స్ పనిచేస్తాయ్. వీటి ద్వారా హ్యాకర్లు వారికి కావాల్సిన ఉపకరణాలను... పెద్ద ఎత్తున దాడులు చేయడానికి అవసరమమైన సాఫ్ట్ వేర్ సామాగ్రిని కొనుగోలు చేస్తారని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే బిట్ కాన్ అడ్రస్ లను డీ కోడ్ చేయగా... వనా పేరుతో ఉన్న అడ్రస్ లను గుర్తించడం జరిగింది. అయితే ఈ బిట్ కాయిన్ లలోకి ఎవరు ఎంత డబ్బు వేసినా... దాని గురించి ఈజీగా తెలుసుకోవచ్చు... రెన్సమ్ వేర్ వైరస్ వ్యాప్తి చేసిన దుండగులు మూడు 3 బిట్కౌయిన్ ల అడ్రస్ లు వాడినట్టు తెలుస్తోంది. వీటిలోకి ఇప్పటి వరకు భారత కరెన్సీలో జమయిన మొత్తం రూ. 17 లక్షల లోపు మాత్రమే.
ఇది ప్రారంభమేనని... వచ్చే రోజుల్లో బెదిరింపులు మరిన్ని ఎక్కువ జరిగి ఎక్కువ మొత్తాలను డిమాండ్ చేసే ప్రమాదముందని కూడా అంటున్నారు. ఒకేసారి పెద్ద ఎత్తున సంస్థల నుంచి డబ్బు గుంజాలని ప్రయత్నం చేస్తుండటంతో ఇది సంచలనమైంది. గతంలో ఒకటి రెండు కంపెనీలైతే డబ్బులను వారి డిమాండ్ మేరకు... వారి కంపెనీల స్థాయిని బట్టి చెల్లించేవి. అయితే వన్నా క్రై పేరుతో ప్రపంచ వ్యాప్తంగా దోచేసుకోవాలని హ్యాకర్లు పన్నాగం పన్నడంతో అందరూ డబ్బు చెల్లించడాన్ని ఆపేశారు. కీలక డేటా ఉన్నవారు మాత్రమే స్పందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పోలీస్, నిఘా యంత్రాంగాలు హ్యాకర్లు డబ్బును చెల్లించొద్దంటూ స్పష్టం చేశాయ్.
ప్రపంచంలో ఎన్ని ఉపద్రవాలు వచ్చినా భారతదేశం తట్టుకొని నిలబెడుతోంది. అమెరికా ఆర్థిక మాంధ్యమైనా, చమురు సంక్షోభమైనా... తాజా... ర్యాన్సమ్ వేర్ ఉత్పాతమైనా... భారతదేశానికి ర్యాన్సమ్ వేర్ ను తట్టుకునే శక్తి ఉందా? ర్యాన్‌స‌మ్ వేర్.. టెక్నాల‌జీ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. శుక్ర‌వారం మొద‌లైన వ‌న్నా క్రై ర్యాన్‌స‌మ్ వేర్ ఎఫెక్ట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాగానే ఉన్నా ఇండియాపై పూర్తిస్థాయిలో పంజా విస‌ర‌లేదు. ఇండియాలో డిజిట‌లైజేష‌న్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాక‌పోవడం, ఆన్‌లైన్లో చేసేవాటికి స‌మాంత‌రంగా ఆఫ్‌లైన్ రికార్డ్స్ కూడా అందుబాటులో ఉండ‌డంతో హ్యాక్ చేసినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని హ్యాక‌ర్లు ఆలోచిస్తు ఉండొచ్చ‌ని టెక్నాల‌జీ నిపుణుల అంచ‌నా. అయితే దీనిపై అప్పుడే ఓ అంచ‌నాకు రాలేమని, రానున్న రోజుల్లో హ్యాక‌ర్లు ఇండియాపైనా దృష్టి పెట్టే అవ‌కాశాలు లేవు అన‌డానికి కూడా లేద‌ని చెబుతున్నారు. స్పెయిన్‌, ఇంగ్లాండ్, యూర‌ప్‌లోని ప‌లు దేశాల‌తో పోల్చితే ప్ర‌స్తుతానికి ఇండియామీద వ‌న్నా క్రై ప్ర‌భావం పెద్ద‌గా లేదనే చెప్పాలి. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం రెండు సౌత్ ఇండియా బ్యాంకులు, రెండు డిల్లీ బేస్డ్ మాన్యుఫాక్చ‌రింగ్ కంపెనీలు, ఓ ఎంఎన్‌సీ కంపెనీకి చెందిన మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్‌, ముంబై కేంద్రంగా ఉన్న ఎఫ్ఎంసీజీ మేక‌ర్ కంపెనీ హెడ్ ఆఫీస్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని కంప్యూట‌ర్లు మాత్ర‌మే ఈ వాన్న క్రైతో హ్యాక్ అయ్యాయి. భారతదేశంలో ఏ ప్రభుత్వ శాఖలోనూ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లను జరపడం లేదు. పలు చోట్ల ఆఫ్‌లైన్ యంత్రాంగాలు ప‌నిచేస్తున్నాయ్.  ఇలాంటి వాటికి కంప్యూట‌ర్లు హ్యాక్ చేసి డేటా బ్లాక్ చేసినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న అభిప్రాయంలో  హ్యాక‌ర్లు ఉన్నారు. అయితే అవుట్ డేటెడ్ కంప్యూట‌ర్ల వినియోగం ఉండటం వల్లే...  సెక్యూరిటీ అప్‌డేట్లను తీసుకోకపోవడం వల్లే కొని ప్రభుత్వ యంత్రాంగాల్లో ఉన్న కంప్యూటర్లు వైరస్ బారిన పడుతున్నాయ్.
తాజా ప‌రిణామ‌ల‌తో విండోస్ అప్ డేట్ వచ్చే వరకూ ఏపీఎంలను తెరవద్దని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది.  వాన్నా క్రై వైరస్ హ్యాకింగ్ వార్తలతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకొంది. దేశంలోని ఏటీఎంల‌లో అత్య‌ధికం విండోస్ ఎక్స్ పీతో ప‌నిచేస్తున్నాయి. దీంతో ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ఇవి హ్యాక్ కావ‌డం ఖాయ‌మ‌న్న ఆందోళ‌న‌తోనే ఆర్బీఐ ఈ సూచ‌న‌లు చేసింది. ఇప్పటికే ఏటీఎంలలో కరెన్సీ కోసం కష్టాలుపడుతున్న సామాన్యుడికి తాజాగా ర్యాన్సమ్ వేర్ ఇబ్బందులకు గురిచేస్తోంది. దేశంలో ఎక్కడా కూడా ఏటీఎంలు పనిచేయడం లేదని వినియోగదారులు చెబుతున్నారు.

వన్నా క్రై, ర్యాన్సమ్ వేర్ రెండూ చెడుగుడాడితే సెల్ ఫోన్ల పరిస్థితేంటి? సెల్ ఫోన్లు ఈ హ్యాకర్ల బారినపడే అవకాశముందా...సెల్ ఫోన్లను ఎలా రక్షించకోవాలి.. సెల్ ఫోన్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు... ప్రపంచాన్ని భయపడెతున్న ర్యాన్సమ్ వేర్ ఇప్పుడు సెల్ ఫోన్ వినియోగదారులకు చెమటలు పట్టిస్తున్నాయ్. ఎక్కడికక్కడే సెల్ ఫోన్ల వినియోగదారుల నుంచి తేలిగ్గా డబ్బులు కాజేసేందుకు హ్యాకర్లు కుట్రలు చేస్తున్నారు.  ర్యాన్సమ్‌వేర్‌ దాడులకు స్మార్టుఫోన్లేమీ మినహాయింపు కాదు.  కంప్యూటర్లతో పోల్చితే ప్రమాదం కొంత తక్కువ. అయితే ఇటీవల సెల్ ఫోన్ బాధితుల సంఖ్యా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా అడ్రాయిట్ ఆపరేటింగ్ ఫోన్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెద్దపెద్ద సంస్థలను, ప్రభుత్వ విభాగాల కంప్యూటర్లను కొల్లగొట్టి డబ్బు వసూలు చేసినట్లుగా వ్యక్తిగత ఫోన్లను హ్యాక్‌ చేసి వసూలు చేయడం గిట్టుబాటు కాదన్న ఉద్దేశంతో స్మార్టుఫోన్లపై దాడులు ఇప్పటికీ కొంత తక్కువగానే ఉన్నాయి.  సెల్ ఫోన్ వినియోగదారులు హ్యాకర్లకు డబ్బులు చెల్లించే బదులు... ఫోన్ ను రీస్టాట్ చేసుకునే వెసులుబాటు ఉండటం కూడా వీటిపై ప్రభావం పెద్దగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్లలో స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్న దేశాలలో భారదేశం రెండో స్థానంలో ఉంది.  మొబైళ్లపై ప్రభావం చూపించిన  ర్యాన్సమ్‌వేర్‌లు ఫ్యుసాబ్‌, స్మాల్‌, ప్లెటార్‌,  స్వెపెంగ్‌  ఉన్నాయి. వీటిలో స్వెపాంగ్ పెద్ద ఎత్తున బ్యాంకింగ్ పై  ప్రభావం చూపించింది.  జర్మనీ, అమెరికా, బ్రిటన్‌లలో వినియోగదారులు భారీగా నష్టపోయారు. ర్యాన్సమ్‌వేర్‌ ఈ-మెయిల్‌ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్లో మెయిళ్లు చూసుకునేవారంతా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధం లేని మెయిళ్లు, ఆకర్షించేలా గుర్తు తెలియని ఐడీల నుంచి వచ్చేవాటిని ఓపెన్ చేయోద్దని నిపుణులు తేల్చిచెబుతున్నారు.
స్మార్టుఫోన్లలో ఉంచే ముఖ్యమైన ప్రతి సమాచారాన్నీ వేరేచోట కూడా భద్రపరుచుకోవాలి. ఫోన్లో కచ్చితంగా యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. తెలియని యాప్ లను ఫ్రీ గిఫ్ట్ లు ఇస్తామంటూ వస్తున్నవాటిని అస్సలే డౌన్ లోడ్ చేసుకోవద్దు. ఇలాంటివి కచ్చితంగా ప్రమాదాన్ని కలిగిస్తాయ్. యాప్‌లకు ఓఎస్‌లకు ప్లేస్టోర్‌ల నుంచి మాత్రమే తీసుకోవాలి. సోషల్ మీడియా నుంచి వస్తున్న లింకుల జోలికి వెళ్లొద్దు.  ఇటీవల కాలంలో ఫోన్‌తోనే ఆర్థిక వ్యవహారాల బ్యాంకింగ్‌ యాప్‌ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకుల పేరుతో నకిలీ యాప్‌లు ఉండే ప్రమాదం ఉంది. బ్యాంకు వెబ్‌సైట్లోని డౌన్లోడ్‌ లింకు నుంచి అసలైన యాప్‌ తీసుకోవాలి.
వన్నా క్రై భూతాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రవేశపెట్టింది ఉత్తర కొరియా ప్రభుత్వ యంత్రాంగంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. 150 దేశాలపై ప్రభావం చూపిన ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడి ఉత్తరకొరియా నుంచే అంటుకుందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేస్తున్న కోడ్ ఆధారంగా కొరియా నుంచే ఈ వైరస్ వ్యాప్తి చెందిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయి ఆధారాలు మాత్రం లభించలేదు. ప్రపంచదేశాలను వణికిస్తున్న ర్యాన్సమ్ వేర్ లెజారస్ హ్యాకర్ గ్రూపుకు చెందినదిగా భావిస్తున్నారు. ఆ లింకు ఉత్తర కొరియాకు సంబంధించిందిగా అనుమానిస్తున్నారు. వాన్నా క్రై కోడ్ ను ఉత్తర కొరియా నటులు సైతం ఉపయోగిస్తున్నారని... థర్డ్ పార్టీ కోడ్ సైతం దాన్నుంచే వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
అయితే దాడి వెనుక ఉన్నవారెవన్న విషయాన్ని పరిశోధిస్తున్నట్టుగా వైట్ హౌజ్ ప్రకటించింది. వైబ్ సైట్లను ఎన్క్రిప్ట్ చేసి వాటిని డిక్రిప్ట్ చేయాలంటే లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్న ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఉత్తర కొరియా హ్యాకింగ్ నిపుణులే 'వాన్నా క్రై' కోడ్ రాసుంటారని అలా జరగక పోయి వుంటే, ఓ థర్డ్ పార్టీ కోడ్ ను ఉత్తర కొరియా ప్రభుత్వం, హ్యాకర్లు వాడి ఉంటారని అంటున్నారు. కాగా, వైరస్ దాడులు ఎక్కడి నుంచి జరిగాయన్న విషయాన్ని శోధిస్తున్నామని వైట్ హౌస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సలహాదారు థామస్ బోసెర్ట్ వెల్లడించారు.
2014లో సోనీ పిక్చర్స్ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థలో జరిగిన భారీ హ్యాకింగ్ కు దీనికి సంబంధాలున్నాయని అభిప్రాయాన్ని సైబర్ ఎక్సపర్ట్ వివరిస్తున్నారు. అప్పట్లో సోనీ సంస్థలో జరిగిన వైరస్ దాడి కూడా... ఉత్తర కొరియానేనని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ను హత్య చేసే పన్నాగం కథాంశంతో సోనీ సినిమాను ప్రసారం చేయగా... సోనీపై సైబర్ దాడి జరిగింది.
హ్యాకర్ల బారినపడ్డ కంప్యూటర్ వ్యవస్థలను ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలన్నది ఇప్పుడో పెద్ద సవాలు. ప్రపంచ దేశాల్లోని పలు ప్రభుత్వ యంత్రాంగాల్లో ఎప్పుడో పాతకాలం నాటి సాఫ్ట వేర్ లను వినియోగించడం కూడా అసలు సమస్యకు కారణంంగా చెబుతున్నారు. ఇప్పుడు ఆ కంప్యూటర్లు పనిచేయడం ఎలా?
ఈ జబ్బుకు ఇంత వరకు మందు కనిపెట్టలేదు. కేవలం వ్యాధి అంట కుండా టీకాలు ఏవిధంగానైతే వేస్తారో... కేవలం అదే విధంగా ఈ ర్యాన్సమ్ వేర్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు కానీ... ఉన్న వైరస్ ను తొలిగించేందుకు ఇంత వరకు ఎలాంటి చికిత్సా మార్గాలను కనిపెట్టలేదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచాన్ని గడగడలాడించిన వన్నా క్రై ర్యాన్సమ్ వేర్ ను కట్టడి చేసేందుకు 22 ఏళ్ల ఇంగ్లాండ్ సెక్యురిటీ రీసెర్చర్ అడ్డుగట్ట వేశాడు.  ర్యాన్సమ్ వేర్ శాంపిల్ ను పరిశీలించి... డొమైన్ కు కనెక్ట్ అవుతుందో  చెక్ చేశాడు. మన డొమెన్ కు సంబంధం లేని ర్యాన్సమ్ వేర్ వైరస్ ఉన్న కంప్యూటర్ కు కనెక్ట్ అవుతోందని గమనించి... ఆయా వేర్లు కంప్యూటర్లలోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా చేశాడు.
అయితే ఇప్పటి వరకు ర్యాన్సమ్ వేర్ ను అన్ లాక్ చేసే వ్యవస్థను సాప్ట్ వేర్ ప్రొగ్రామర్లు రూపొందించలేకపోయారు. అయితే పరిశోధనలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయ్. హ్యాకర్లను పట్టుకునేందుకు... సైతం ప్రభుత్వాల యంత్రాంగాలు పనిచేస్తున్నాయ్. అదే సమయంలో కంప్యూటర్ వినియోగదారులు,సెల్ ఫోన్ వినియోగదారులు...  గూల్ , మైక్రోసాఫ్ట్ అందిస్తున్న ప్యాచ్ అప్డేట్స్ చేసుకోవాలి.  నిపుణుల ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రస్తుతం ఈ రోగాని మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. నివారణ కోసం కంప్యూటర్లు వినియోగించేవారందరూ విధిగా యాంటీ వైరస్ లు ఇన్స్టాల్ చేసుకోవాలి.  సైబర్ దాడులను అరికట్టాలంటే ప్రపంచ యంత్రాంగం ఏర్పాటు పరిష్కార మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం ఎక్కడ్నుంచి ఎలా వస్తుందో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు సురక్షితమైన సాఫ్ట్ వేర్లను వాడటంతోపాటు, ఐటీ నిపుణుల సలహాలను పాటించాలి. ఇష్టానుసారం యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దు. ఆయా కంపెనీలు, బ్యాంకులు విడుదల చేసిన యాప్ లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. అది మొబైల్ డేటాగానివ్వండి, కంప్యూటర్ డేటా కానివ్వండి... ఏదైనా సరే సాఫ్ట్ కాపీ అవసరం. వాటిని ఇంటర్నెట్ కు సంబంధం లేని సిస్టమ్ లో స్టోర్ చేసుకోవడం లేదంటే సాఫ్ట్ కాపీ రూపంలోనూ భద్రపర్చుకోవాలి. వాన్నా క్రై, ర్యాన్సమ్ వేర్ భూతాలను రాకుండా చేసుకోవడం మన చేతిలోనే ఉంది.