అటు ట్రంప్... ఇటు కిమ్. ఇద్దరూ ఇద్దరే... దూకుడుతో రెచ్చగొడతారు... ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. ఒకరి స్థాయి పెద్దది... ఇంకొకరి స్థాయి చిన్నది తేడా ఇంతే... ఇద్దరూ కూడా వారి వారి దేశాలతోపాటు ప్రపంచాన్ని సైతం కలవరపెడుతున్నారు. మా జోలికెస్తే అమెరికానే కాదు... ప్రపంచం మొత్తాన్ని తుదముట్టాస్తామంటూ ఉత్తర కొరియా గర్జిస్తుంటే... పెద్దన్న పాత్ర పోషించాల్సిన అమెరికా మాత్రం ఇంకొంచెం రెచ్చగొడుతూ యుద్ధానికి సై అంటోంది. పూటకో మాట రోజుకో రకమైన చేష్టలతో అమెరికన్లను బెంబేలెత్తిస్తున్న ట్రంప్... ఉత్తర కొరియా విషయలో ఏం చేస్తారోనన్న బెంగ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. కిమ్, ట్రంప్ చివరికి ప్రపంచానికి ఏ గతి పట్టిస్తారోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇద్దరి నడుమ చైనా ఆడుతున్న డ్రాగన్ గేమ్స్ మరింత కల్లోలానికి కారణమవుతున్నాయ్... కొరియా... కొరివి ఓ వైపు ట్రంప్ కంపు మరోవైపు రెచ్చిపోతుంటే ఏం జరుగుతుంది...
మూడో ప్రపంచ యుద్ధం పొంచి ఉన్నట్టు కన్పిస్తోంది. కొరియా కొడుతున్న బుసులు... అమెరికా రాజేస్తున్న మంటలు కొరియా ద్వీపకల్పంలో యుద్ధావాతావరణాన్ని సృష్టిస్తున్నాయ్. అణ్వాయుధాలే దేశ సొత్తుగా ముందుకు సాగుతున్న ఉత్తర కొరియా... దక్షిణ కొరియాపై ఒంటికాలుతో లేస్తుండటం... అమెరికాను రంగంలోకి దించేస్తోంది. కిమ్ అరుపులు... ట్రంప్ రంకెలు ఇప్పుడు కొత్త యుద్ధం దిశగా పరిణామాలను తీసుకెళ్తున్నాయ్.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించనంత కాలం ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు... డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా వచ్చిన దగ్గర్నుంచి మారిపోతున్నాయ్. మొన్న సిరియా... నిన్న ఆప్ఘనిస్తాన్... రేపు కొరియాపై దాడులే తథ్యమన్న రీతిలో అమెరికా పెద్దల వ్యాఖ్యలు విన్పిస్తున్నాయ్. ట్రంప్ ఏ క్షణానికి ఏం చేస్తాడోనంటూ ప్రపంచం హడలిపోతోంది. అదే సమయంలో అమెరికాపై ఒంటికాలుపై లేస్తున్నఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మిసైల్ వదిలితే ఏమవుతుందోనన్న బెంగ ప్రపంచానికి పట్టుకొంది.
కొరియా ద్వీపకల్పంలో గత నెల రోజుల నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఏప్రిల్ 17న ఉత్తర కొరియాపై చేసిన ప్రకటన కొనసాగింపుగా పరిణామాలు మారిపోతున్నాయ్. ట్రంప్ సహనాన్ని పరీక్షించవద్దని పెన్స్ ఉత్తర కొరియాను హెచ్చరించారు. సిరియాపై వైమానిక దాడిని, అఫ్గానిస్థాన్‌లో ఐఎస్ పై మదర్ ఆఫ్ ఆల్ బాంబుతో చేసిన దాడిని మర్చిపోవద్దంటూ ఉత్త పెద్దలకు అమెరికా సందేశాన్ని పంపించేసింది.
ఉత్తర కొరియా ఆరో అణ్వస్త్ర పరీక్ష ఏప్రిల్ 16న క్షిపణి పరీక్ష విఫలమైనా, దూకుడు తగ్గించదనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో ఉంది. గత పదేళ్లలో ఆ దేశం అయిదు సార్లు అణ్వస్త్ర పరీక్షలు జరిపి ప్రపంచ దేశాల నిరసనకు, అమెరికా ఆగ్రహానికి గురైంది. అయినా ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ అన్ ఎవరినీ ఖాతరు చేయలేదు. ఒకవైపు తమ దేశ ప్రజలు ఆకలి చావులతో చస్తున్నా... అవేమీ పట్టించుకోకుండా అంతకంతకూ శక్తిమంతమైన అణు బాంబుల తయారీకి సంపదను వెచ్చిస్తున్నారు. అమెరికాపైనే అణ్వస్త్రాలు కురిపిస్తానంటూ బెదిరిస్తున్నారు.
సిరియా, అఫ్గానిస్థాన్‌ల తరహాలో ఉత్తర కొరియా దారికి వస్తుందనుకోవడం అమెరికా భ్రమ మాత్రమే అనుకోవాలి. అమెరికా దాడులకు బెదరకుండా, ఆత్మరక్షణ పేరిట మరిన్ని అణుబాంబులను సమకూర్చుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మాటవరసకు యుద్ధమే వచ్చి ఉత్తర కొరియా చిత్తుగా ఓడి కిమ్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందనుకున్నా, అంతకుముందు అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ల మీద ఉత్తర కొరియా సైతం అణు బాంబులు, క్షిపణులు ప్రయోగించడం ఖాయం. దక్షిణ కొరియా రాజధాని సియోల్ భస్మీపటలమై ఆ దేశం సర్వనాశనమవుతుంది. ఈ సంగతి అమెరికాకూ తెలుసు.
అయితే దక్షిణ కొరియా అంటే అది తనేనన్న అభిప్రాయం అమెరికాలో ఉంది. ఎందుకంటే తన మిత్రదేశాలపై ఇతరుల దాడిని అమెరికా చీల్చిచెండాతుంది. న్యూక్లియర్ అంబ్రెల్లాతో మిత్ర దేశాలపై దాడంటే అది తనపై జరిగే దాడిగా భావిస్తూ... వారికి గుణపాఠం చెప్తామన్న సిద్ధాంతంతో అమెరికా పనిచేస్తోంది. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్ తో అమెరికా... దక్షిణ కొరియా రక్షణ గోడను నిర్మిస్తోంది. ఈ సంవత్సరాంతానికి ఇది పూర్తి స్థాయిలో పనిచేస్తుందని దక్షిణ కొరియా అంచనా వేస్తోంది.
ఆయన రూటే సెపరేటు... ఎవరి మాట వినడు. ఎవరినీ నమ్మడు... తన మన ఆ విషయంలో మినహాయింపు లేదు. తన వారసత్వాన్ని ప్రశ్నించే వారెవరూ మిగలకూడదు. తనను విమర్శించే ఏ దేశమూ నిలువకూడదు. అది ఆఖరి సవతి సోదరుడైనా... మిత్ర దేశం చైనా అయినా... ఈ విషయంలో తన పంతమే నెగ్గాలి... ఇదే దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ అసలు ఉద్దేశం.
కిమ్ తనకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు తప్పించి ఎవరినీ ఇన్వాల్వ్ చేయరు. ఉత్తర కొరియా విషయంలో చైనా ఎలా వ్యవహరించాలో అర్థం కాక సతమతమైపోతున్నాడు.
మిగతా ప్రపంచ దేశాలకు ఉత్తర కొరియాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అన్నీ చోట్ల అమెరికా అనుకున్న విధంగా పరిణామాలు జరిగితే... కొరియాలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిణామాలున్నాయ్. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ విషయంలోనూ, లిబియా అధ్యక్షుడు గడాఫీ విషయంలోనూ అమెరికా ఎలా వ్యవహరించిందో కిమ్ కు బాగా తెలుసు. అందుకే ఎవరి మాట కూడా వినకుండా తన దారేదో తనే డిసైడ్ చేసుకునేట్టుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు.
చిన్న కిమ్‌కి ప్రస్తుతం 33 ఏళ్లు. అచ్చు తన తాత కిమ్ ఇల్ సంగ్ పోలికల కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. చదువు కూడా అంతంత మాత్రమే ఉండటంతో తండ్రి తన వద్దే ఉంచేసుకొని రాజకీయాలు వళ్లించాడు.
ఉత్తర కొరియాకు నచ్చజెప్పడం చైనా వల్ల కూడా కాదా... ఉత్తర కొరియాకు ఎన్నో విధాలుగా చైనా సహకరిస్తూ వస్తోంది. కొంత మంది ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తే కిమ్ దారిలోకి వస్తాడని చెబుుతున్నారు. అయితే... వాస్తవంలో కిమ్ ఆ విషయంలోనూ వెనుకడుగేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఎందుకంటే చైనా అత్యంత భద్రత కల్పించిన... కిమ్ సవతి సోదరుడ్ని సైతం కిమ్ అంతమొందిస్తే... చైనా కిమ్మనలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న కిమ్ మనుషుల చేతిలో సవతి సోదరుడు హతమయ్యారు. ఒక్క 2017లోనే ఏడు క్షిపణి పరీక్షలు జరిపినా చైనా కిక్కురుమనలేదు.
ఉత్తర కొరియాపై అమెరికా దాడి చేయడానికి ఎందుకు సంశయిస్తోంది? ఉత్తర కొరియాకు ఎందుకు పెద్దన్న పెద్దగా ఢీకొడుతోంది. కొరియా ధైర్యమేంటి? అమెరికాకు ఉన్న సంశమేంటి? మొత్తం వ్యవహారంలో చైనా ఆడుతున్న గేమేంటి?
నాలుగు కారణాల రీత్యా ఉత్తర కొరియా ను ఎవరూ ఎటాక్ చేయలేరని సుస్పష్టంగా చెప్పొచ్చు. అమెరికాకు సియోల్ భయం వెంటాడుతోంది. సియోల్ దక్షిణ కొరియా రాజధాని. ఉత్తర కొరియా ఆర్టిలరీ గన్స్ పరిధిలో ఉన్న నగరం... పది లక్షల జనాభా... ఏ మాత్రం కవ్వించినా సియోల్ పై ఉత్తర కొరియా అణ్యాయుధ దాడికి దిగొచ్చు... మందుగుండుతో మంటపెట్టేయోచ్చు. ప్రపంచ పటం లో సియోల్ నగరం లేకుండా చేసే పెను ప్రమాదం ఉంది.
రెండో విషయం జపాన్.. ఉత్తర కొరియాను అమెరికా కవ్విస్తే... జపాన్ పైనా దాడికి దిగి ప్రమాదం ఉంది. ఈ రెండు దేశాలు కూడా అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్నాయ్.
దక్షిణ కొరియా వద్ద గానీ, జపాన్ వద్ద గానీ అణ్వాయుధాలు లేవు... ఉత్తర కొరియాను ఈ రెండు దేశాలూ ఏమీ చేయలేవు... ఒకవేళ ఏదైనా బాంబులు వేయాలనుకున్నా... ఉత్తర కొరియా వెంటనే యుద్ధానికి దిగితే జపాన్, దక్షిణ కొరియా విలవిలలాడిపోవాల్సిందే... అదే అమెరికాకు పెద్ద భయంగా ఉంది. ఉత్తర కొరియా అమెరికా నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికీ... పెద్ద ఎత్తున అణ్వాయుధాలను సమకూర్చుకుంటోంది. క్షిపణి పరీక్షలను ఉధృతం చేస్తోంది. వచ్చే రెండేళ్లలో అమెరికా భూభాగాన్ని తాకే మిసైళ్లను రూపొందించాలని కిమ్... ఆదేశ శాస్త్రవేత్తలకు ఆదేశాలిచ్చారు. సృష్టి ఆరంభం నుంచి అమెరికా ప్రపంచ దేశాలపై దాడులకు తెగబడిందే కానీ... అమెరికాపై ఎవరూ కూడా దాడి చేయలేదు. కేవలం హవాయి దీవులపై మాత్రమే దాడి చేయడం జరిగింది. తాజాగా కొరియా రూపొందిస్తున్న క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్తే అమెరికాకు ముప్పు తప్పకపోవచ్చు. అమెరికా ఏం చేయలేదని చెప్పడానికి కారణమేమంటే... ఒకసారి కొరియా వెపన్స్ వాడటం మొదలుపెడితే... దక్షిణ కొరియా కకావికలమైపోతుంది.
దక్షిణ కొరియాను క్షిపణుల నుంచి రక్షించేందుకు థాడ్ టెక్నాలజీ డిఫెన్స్ సిస్టమ్ ను అమెరికా మోహరించింది. అయితే అవి కేవలం మిసైళ్లను అడ్డుకుంటుంది. అయితే అవి అణ్వాయుధాలను మాత్రం అడ్డుకోలేవు. ఉత్తర కొరియా అండర్ గ్రౌండ్, గుహల్లో పెద్ద ఎత్తున వెపన్స్ ఉన్నాయ్. వాటిని గుర్తించడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. విజిబుల్ గా కన్పించకపోవడంతో... వాటి విషయంలో కొంత గందరగోళమైతే ఉంది.
కొరియా విషయంలో చైనాకు ఉన్న భయాలేంటి? ప్రపంచ ఆర్థిక సామ్రాజ్య విజేతగా నిలవాలన్న లక్ష్యంతో దూసుకుపోతున్న చైనాకు కొరియా సమస్యల విషయంలో ఉన్న సొంత ఆలోచనలేంటి? కొరియా విషయంలో ఏదైనా జరగరానికి జరిగితే... చైనా ఆధిత్యం చాప్టర్ గల్లవుతుందన్న బెంగ ఏమైనా ఉందా?
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కొరియా ద్వీపకల్పం జపాన్ కంట్రోల్ లో ఉండేది. అయితే ఆ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో... కొరియాలోని రెండు భాగాలు రెండు దేశాల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. నార్త్ నుంచి సౌత్ వరకు రష్యా ఆధీనంలోకి తీసుకుంటే... సౌత్ నుంచి నార్త్ వరకు భూభాగాన్ని అమెరికా స్వాధీనం చేసుకొంది. రష్యా అండదండలున్న భూభాగం... ఉత్తర కొరియాగా ఉండగా... అమెరికా మద్దతిచ్చిన భూభాగం... దక్షిణ కొరియాగా ఉంది. సోవియట్ బ్లాక్, అమెరికా బ్లాక్ గా రెండు కొరియా దేశాలు ఉండేవి. ఉత్తర కొరియా ప్రజలు రెండు దేశాలు కలవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ... దక్షిణ కొరియా ప్రజలు మాత్రం... ఎవరి అభివృద్ధి వారిదే... ఇక కలయిక అవసరం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రష్యా ప్రమేయం తగ్గిన తర్వాత... ఉత్తర కొరియా విషయంలో చైనా కీలక పాత్ర పోషిస్తోంది.
ఇక కొరియాను నిలబెడుతుంది చైనా... ఉత్తర కొరియా జీవనవిధానం మొత్తం చైనా ఇచ్చే డబ్బులతో నడుస్తుంది. కొరియా బొగ్గు తీసుకుని ఆ దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని చైనా అందిస్తోంది. ఆ డబ్బుతోనే కొరియా జీవనం సాగుతుంది. అయితే ఆ మొత్తంలోనే మేజర్ పోర్షన్ ను కొరియా అణ్వాయుధాలు అభివృద్ధి పర్చడానికి, క్షిపణి ప్రయోగాలకు వినియోగిస్తోంది.
అయితే అమెరికా మాత్రం చైనాపై ఒకటే ఒత్తిడి చేస్తోంది. కొరియాకు ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయోద్దని... గట్టి హెచ్చరికలు పంపిస్తోంది. అయితే... చైనా ఉత్తర కొరియాకు సాయం చేయడానికి రెండు కారణాలున్నాయ్. యుద్ధం మొదలైతే చైనా ప్రావిన్సులకు కొరియా శరణార్థులు విచ్చలవిడిగా పెరుగుతారు. ఇప్పటికే ఆర్థికంగా చిన్నాభిన్నమైన కొరియా సరిహద్దులు... వచ్చే శరణార్థులను స్వాగతించలేవు.
అదే సమయంలో అమెరికా ఆధిపత్యాన్ని అడ్డుకోడానికి నిలబడ్డ ఒక్క ఆసియా సింహ కిమ్ అన్న భావన చైనాలో ఉంది. కిమ్ ను అంతమొందిస్తే... తిరిగి ఉమ్మడి కొరియా ఏర్పడితే అది చైనాకు కంటగింపుగా మారుతుంది. ఇప్పటి వరకు దక్షిణ కొరియా సముద్రజలాల్లో ఉన్న అమెరికా ఆయుధ వ్యవస్థ అంతా చైనా సరిహద్దుల్లోకి మరలతుంది. అంటే ఒకరకంగా చైనాపై ఎక్కుపెట్టే అస్త్రాలుగా అవి మారతాయ్. ఇలాంటి పరిస్థితి చైనా కోరుకుదు కదా... అందుకే కిమ్ కు చైనా ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తోంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనుకుంటున్న చైనా... అందుకు శిఖండిగా ఉత్తర కొరియాను వినియోగిస్తోంది.
కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయ్. అణుపరీక్షకు ఉత్తర కొరియా సిద్ధమంటూ గ్రాండిస్తుటే... ఉత్తర కొరియాపై తీవ్ర చర్యలు దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. చేతనైతే కట్టడి చేయండి, లేదంటే మేం రంగంలోకి దిగుతామంటూ ట్రంప్ చైనాకు పంపిన హెచ్చరికలతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తే... అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదంటూ ఉత్తర కొరియా గర్జిస్తోంది. నిత్యం యుద్ధానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాను కంట్రోల్ లో పెట్టడానికి నికి నడుం కట్టారు.1950-53 కొరియా యుద్ధం తర్వాత ఉత్తర కొరియా విషయంలో అమెరికా ఇంత దూకుడుగా వ్యవహరించటం ఇదే తొలిసారి. ఇటీవల రసాయన ఆయుధాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై సిరియాపై తోమహక్ మిస్సైళ్లతో అమెరికా దాడిచేసింది. అఫ్ఘనిస్థాన్‌లోని తాలిబూన్ మూకలపై అతిపెద్ద నాన్-నూక్లియర్ బాంబుతో దాడి చేసిన ఘటనలు తర్వాత ఉత్తర కొరియా దిశగా అడుగులు పడతాయేమోనన్న అభిప్రాయం ఎక్కువుతోంది. అమెరికాపై కాలుదువ్వే ఉత్తర కొరియాను దారికి తేవాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ కు ఇటీవల భేటీలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు చైనా ఏవిధంగానూ ఉత్తర కొరియా విషయంలో స్పందించకపోవడంపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గుర్రుగా ఉంది. అమెరికాపై అణు దాడి చేస్తామంటూ బుసలు కొడుతున్న కొరియా... అమెరికాపై అణు బాంబు చేసినట్టుగా చూపించే చిత్రాలతో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది.
కొరియా ద్వీపకల్పంలోని జపాన్, దక్షిణ కొరియా దేశాలకు బాసటగా నిలిచే అమెరికా... ఉత్తర కొరియా చేస్తున్న యుద్ధ తంత్రలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అమెరికా యుద్ధ విమాన వాహకనౌక యూఎస్‌ఎస్ కార్ల్ విన్సన్ దక్షిణ కొరియాకు రక్షణగా వచ్చింది. దక్షిణ కొరియాలోని సైనిక బలగాన్ని బలోపేతం చేయడంతోపాటు... ఉత్తర కొరియా విషయంలో అనుసరించాల్సిన వైఖరిపైనా అమెరికా ప్రణళికలు సిద్ధం చేసుకొంది.
మాజీ సోవియట్ యూనియన్ సహకారంతో ఉత్తర కొరియా తన అణు పరిశోధనలు 1950 నుంచే ప్రారంభించింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన రెండేళ్లకు 1993లో ప్రపంచ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) నుంచి ఉత్తర కొరియా తప్పుకుంది. ఆ తర్వాత ఉత్తర కొరియా అణ్వస్త్ర పాఠవాన్ని పెంచుకునేందుకు పాకిస్తాన్ పై ఎక్కువగా ఆధారపడింది. పాకిస్తాన్ అణ్వస్త్ర పరిజ్ఞానానికి చైనా సహకరిస్తుంటే... చూసీ చూడనట్టుగా వ్యవహరించిన అమెరికాకు చేదు నిజం తర్వాత తెలిసింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉత్తర కొరియా వద్ద ఏముంది... ఏం చేసుకొని ఆ దేశం అంతలా రెచ్చిపోతోంది. రోగ్ దేశమంటూ ప్రపంచ దేశాలన్ని తూ... అంటున్నా... తాను మాత్రం తన పని చేసుకుపోతోంది. ఉత్తర కొరియా వద్ద ఉన్న మిలిటరీ, అణ్వస్థ్ర సామార్థ్యమెంత? ఉత్తర కొరియా అమెరికాను చేరుకగల అణ్వస్త్రాలున్నాయా... లేక అమెరికా మిత్రు దేశాలనే టార్గెట్ చేసే ప్రమాదం ఉంది?
అమెరికా నుంచి ప్రతిఘటన ఎదురైన పక్షంలో ఉత్తర కొరియా ఏం చేస్తుంది? తిరిగి అమెరికా మీద దాడులు చేస్తుందా? అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా? అలా జరగకపోవచ్చు. కానీ పొరుగున ఉన్న దక్షిణ కొరియాను లక్ష్యంగా చేసుకొని పెను దాడికి దిగుతుంది. దక్షిణ కొరియాపై దాడి చేయటం అంటే అమెరికా మీద దాడి చేసినట్లేనని కిమ్ సర్కారు భావిస్తోంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్, ఉత్తర- దక్షిణ కొరియా దేశాల సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. దాదాపు 45 శాతం జనాభా దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఉంది.
జపాన్ లో సునామీ వస్తే ప్రపంచ దేశాల్లో ఐటీ ఆధారిత ఉపకరణాల రేట్లు విపరీతంగా పెరిగాయ్. ఇప్పుడు గృహోపకరణాలకు కీలకంగా ఉన్న దక్షిణ కొరియాపై దాడి జరిగితే ఆసియాతోపాటు, పలు ఆఫ్రికా, ఐరోపా దేశాలు విలవిల్లాడాల్సిందే. ఉత్తర కొరియా సైనిక సత్తాను ఓరి పరిశీలిస్తే... వివిధ ప్రాంతాలను చేరుకోగల మిసైళ్లు ఉత్తర కొరియా వద్ద వెయ్యి వరకు ఉన్నాయి. హాసాంగ్ 5, హాసాంగ్ 6 మిసైళ్లు దక్షిణ కొరియాను భస్మీపటలం చేయగలవు. ఇక మధ్యశ్రేణి నోడాంగ్ మిసైళ్లు జపాన్ లోని టార్గెట్లను చేరుకోగలవు. ఇక అత్యాధునిక మిసైళ్లైన ముసదాన్ అమెరికా మిలిటరీ బేస్ గౌమ్ ను చేరుకోగలవని అంచనా వేస్తున్నారు. నోడాంగ్ క్షిపణి వెయ్యి కి.మీ రేంజ్, తాయ్పోడాంగ్ 2,200 కి.మీ రేంజ్, ముసాడాన్ 4 వేల కి.మీ, తాయ్పోడాంగ్ 2-6 వేల కి.మీ రేంజ్ భూభాగాన్ని చేరుకోగలవు.
ఉత్తర కొరియా వద్ద 15 లక్షల ఆర్మీ బలగాలు ఉన్నాయి. 6 లక్షల రిజర్వ్ బలగాలున్నాయ్. 3500 యుద్ధ ట్యాంకులున్నాయి. యుద్ధం చేసేందుకు కావాల్సిన 21 వేల ఆర్టిలరీ ట్యాంకర్లు కొరియా అమ్ములపొదిలో ఉన్నాయ్. వెయ్యి యుద్ధ విమానాలు, 2500 రాకెట్ లాంచర్లు సైన్యం వద్ద ఉన్నాయి. 72 సబ్ మెరైన్లు, 400 పెట్రో వెసల్స్ ను సన్నద్ధం చేసుకొంది. 18 ఏళ్లు దాటిన వారందరూ విధిగా సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో అది 18 ఏళ్లు ఉండగా... ఇప్పడది 13 ఏళ్లకు కుదించారు. మహిళలు సైతం మిలిటరీలో పనిచేసేలా నిబంధనలు విధించారు. 23 ఏళ్ల వయసు వచ్చే లోగా కొంత కాలమైనా వారి దేశానికి సేవలందించాలి. ప్రతి వెయ్యి మందిలో 48 మంది సైన్యంలో సభ్యులుగా ఉంటారు.
ఉత్తర కొరియా చేతిలో 15 నుంచి 20 వరకూ అణు వార్‌హెడ్లు ఉంటాయని అంచనా. దాదాపు రూ.65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను రక్షణ కోసం ఖర్చు చేస్తోంది. ఉత్తర కొరియా జీడీపీ 25 బిలియన్ డాలర్లు... 2015 గణాంకాల ప్రకారం తలసరి ఆదాయం 1,000 డాలర్లుగా ఉంది. అదే సమయంలో అభివృద్ధి చెందిన దక్షిణ కొరియా తలసరి ఆదాయం 25,976 డాలర్లు. 2013 లెక్కల ప్రకారం జీడీపీ 1.3 ట్రిలియన్ డాలర్లు... శంలో 90 శాతం మంది ప్రజలకు అంతర్జాలం సదుపాయం అందుబాటులో ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలు హ్యూండాయ్, ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామి సంస్థలైన శ్యామ్‌సంగ్, ఎల్‌జీ దక్షిణ కొరియా కంపెనీలే. ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలు సియోల్‌లో ఉండటంతో... ఉత్పాత్తం జరిగితే వాటి పరిస్థితేంటన్న అభిప్రాయం ఎక్కువగా ఉంది. చైనాకు దీటుగా నౌకా నిర్మాణం, గనుల తవ్వకం, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో దక్షిణ కొరియా గొప్ప అభివృద్ధి సాధించింది. 2006 అక్టోబరు 9న తొలిసారిగా అణు పరీక్ష నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. 2006 నుంచి 2016 సెప్టెంబరు మధ్యకాలంలో అయిదుసార్లు అణుపరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు ఆరోదఫా అణు పరీక్షకు సిద్ధమవుతోంది. ఇక రసాయన ఆయుధాలను సైతం ఉత్తర కొరియా తయారు చేస్తోందన్న అమెరికా చెబుతోంది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ 2-సంగ్ 105వ జయంత్యుత్సవాల సందర్భంగా దేశ సైనికులు, యుద్ధట్యాంకులు, ఇతర ఆయుధ సంపత్తితో భారీ పరేడ్ నిర్వహించారు. పరేడ్‌లో తొలిసారిగా సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు ప్రదర్శించారు. ట్రంప్ సైకో అవతారమెత్తారా... ఎప్పుడు ఎలా ఏం మాట్లాడతాడో కూడా తెలియదా... పూటకోలా ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నాడు... అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాను ట్రంప్ ఇరుకునపడేస్తున్నాడా? ఇప్పటికే దేశంలో వివాదాస్పద నిర్ణయాలకు కారణమవుతున్న ట్రంప్ ఇప్పుడు కొరియాపై రాజే అగ్గి ప్రపంచాన్ని అంటుకుంటుందా? విచ్చలవిడి వ్యాఖ్యలతో, ఇష్టానుసారం వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో విపత్తును సృష్టించబోతున్నారా... ఇరాక్, ఆప్ఘనిస్తాన్ లా కొరియాను టార్గెట్ చేస్తారా... అయితే ఆ రెండు దేశాలకు... ఉత్తర కొరియాకు ఉన్న తేడా తెలిసిందా? ఉత్తర కొరియాపై ఓ సారి చర్యలంటాడు. మరోసారి చర్చలంటాడు. ఇంకోసారి మరోలా రియాక్ట్ అవుతాడు. వైట్ హౌజ్ వర్గాలకే అంతుబట్టని ట్రంప్... కొరియా విషయంలో దూకుడుగా వెళ్తే జరిగే ప్రమాదం అమెరికా పెద్దలకు తెలియంది కాదు... అయితే ఇవన్నీ తెలియకుండానే ఇష్టానుసారం మాట్లాడిన ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు... ఉత్తర కొరియాతో చర్చలకు సై అంటున్నారు. పనికిమాలినవాడు కిమ్ అంటూ రోత పుట్టించేలా మాట్లాడిన ట్రంప్... ఆ తర్వాత సైలంటవ్వాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేశాడు.
రష్యా సైతం అమెరికాపై విరుచుకుపడుతోంది. కొరియాపై యుద్ధమంటే ఆషామాషీ కాదంటూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు పంపించాడు. పైకి అమెరికాకు అనుకూల వైఖరి అవలంబిస్తున్నట్టు కన్పిస్తున్న చైనా సైతం అమెరికా విషయంలో స్పష్టతతో ఉంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసేలా కిమ్ సర్కారుకు మద్దతివ్వడం. కిమ్ ప్రకటనలు ఒకసారి సరైనవేనన్న భావను అమెరికాను వ్యతిరేకించే వారి నుంచి విన్పించే మాట. ఆసియాపై పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అడ్డుకుంటున్న ఒక్క మగాడు కిమ్ అంటూ వారు ప్రశంసిస్తారు. చైనా, ఇండియా కూడా అమెరికాకు ఆధిపత్యం ముందు తలవంచుతున్న పరిస్థితుల్లో ఆసియాలో కిమ్ ఉన్ లేకపోతే... మొత్తం పరిణామాలన్నీ అమెరికాకు అనుకూలంగా మారిపోతాయ్. అందుకే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ ను డైరెక్ట్ గా సమర్థించకపోయినప్పటికీ ఇన్ డైరెక్ట్ గా సమర్థించేవారు ఎక్కువుతున్నారు. అయితే మానవాళిని ఉనికి ప్రశ్నిస్తున్న కిమ్ లాంటి వారికి మద్దతివ్వడమంటే కొరివితో తలగొక్కున్నట్టేనన్న అభిప్రాయం కూడా సర్వత్రా ఉంది.

No comments:
Post a Comment