Monday, 30 September 2019

RICHEST GOD STORY



యాంకర్:  అలంకారప్రియుడైన తిరుమల శ్రీ వేంకటశ్వర స్వామి వారు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవుడని...భక్తకోటికి తెలిసిన విషయం....అయితే ఆ బ్రహ్మండ తేజోమయుడికి అలంకరించే అభరణాలెన్ని, ఆ స్వామి పేరిట ఉన్న స్థిర..చర ఆస్తులెన్ని.. అపర కుబేరుల నుండి సామాన్య భక్తుల వరకూ  ఆ దేవదేవుడి నుండి అందే సహాయాలెన్నో తెలుసుకోవాలని పిస్తోందా.. ఇక ఆలస్యం ఎందుకు వెంకన్న ఐశ్వర్యంపై స్పెషల్ స్టోరీ చూడండి..
వాయిస్ ఓవర్ :  ఏడు కోండలపై ఆనంద నిలయంలో  కోలువైయున్న వేంకన్న కలియుగ ప్రత్యేక్ష దేవంగా భక్త కోటిని కటాక్షిస్తున్న హైందవ దివ్య దామం తిరుమల క్షేత్రం...ఈ ఆధ్యాత్మిక  క్షేత్ర వైభవాన్ని పోగ్గడానికి, అలంకార ప్రియుడైన శ్రీనివాసుడి వైభోగాన్ని కీర్తించడానికి పదాలు చాలవన్నది పురాణ ఇతిహాసాల మాట.. స్వామివారి సేవలో తరంచిన ఎందరో పురుషులు, పుణ్యపురుషులు సైతం స్వామి వారి వైభవాన్ని తమ కీర్తనల్లోనూ, గంధ్రాల్లోనూ పోందుపరిచారు.. రోజుకోక్క అలంకారంతో భక్తులను దర్శన భాగ్యం కల్పించే శ్రీనివాసుడి వెలకట్టలేని వజ్ర , వైడూర్యాలు పోదిగిన ఆభరణాలు ఎన్నో..నిత్యం కళ్యాణం..పచ్చ తోరణంగా వీరాజిల్లుతున్న శేషాద్రి  నిలయుడైన శ్రీనివాసుడు ఇక్కడ స్వయంబుగా వెలసాడు.. భక్తులు శ్రీ వేంకటేశ్వరుడని, శ్రీనివాసుడని, సప్తగిరీశుడని,ఏడు కోండలవాడని,బాలజీ అని ఇలా ఏ పేరు పెట్టి పిలిచిన పలికే దైవంగా.. కోరిన కోర్కేలు తీర్చే కోనేటి రాయుడిగా.. భక్తుల చేంత ఆరాధింపబడుతున్నాడు.. ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వివిధ రూపాల్లో తిరుమలకి చేరుకుంటారు. అలా చేరుకున్న భక్తులు ఎంతో భక్తి భావంతో స్వామి వారికి  వారి వారి స్తోమతను బట్టి కానుకలు సమర్పించుకుంటారు. కోందరైతే బంగారు ఆభరణాలు..మరి కోందరు నగదు..మరి కోందరైతే  తలనీలాలతో పాటుగా నిలువు దోపిడి ఇస్తుంటారు..  ఇలా అనేక రూపంలో వారి వారి భక్తి భావంను వివిధ రూపాల్లో స్వామి వారికి కానుకల రూపంలో  సమర్పించుకుంటుంటారు. ఇది ఇలా ఉంటే స్వామి వారికి భక్తుల భక్తి రసం అంటే ఎంతో  ప్రీతి.. అందుకే  భక్తులు మనస్సు అంతా శ్రీవారిని ధ్యానం చేస్తూ ఆయన నామస్మరణలతో కోండకు చేరుకుని ఆయన్ను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఆనందనిలయంలోని వేంకటాచలపతి క్షణ కాలం దర్శనం కోసం భక్త జనం పరితప్పించి పోతుంటారు.. దేవ దేవుని క్షణకాల దర్శనం కోసం వేల కిలోమీటర్లు నడుచుకుంటూ ఎన్నో వ్యయ ప్రాయసలు ఒర్చుకుంటూ కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీనివాసుని పాదాలను దర్శించుకుంటే మోక్షం సిద్దిస్తుందని భక్తుల విశ్వాసం..   
వాయిస్ ఓవర్ :  ఆనంద నిలయంలో ఆ వేంకటేశుడి మూలవిరాట్టు అలంకరణకు ఉపయోగించే అతి ముఖ్యమైన 120 ఆభరణాలు అయితే ఉత్సవమూర్తులైన శ్రీదేవీభూదేవీ సమేత శ్రీమలయప్పస్వామి అలంకారానికి 383 ఆభరణాలు వినియోగిస్తున్నారు.. ఇక ప్రత్యేక వేడుకల్లో స్వామి ఊరేగే రథాలు, వాహనాలన్నీ స్వర్ణమయమే అంతటి వైభవం ఉన్న శ్రీనివాసుని  మూలమూర్తికి  అలంకరించే  తిరుఅభరణాలు మూడు సెట్లు ఉన్నాయి.. వాటిలో ప్రస్తుతం వినియోగించేవి రెండు సెట్లు,... స్వర్ణపద్మపీఠం, సువర్ణపాదాలు, నుపురాళ్లు, పగడాలు, కాంచిగుణం, ఉదరబంధం, దశావతర హారం, చిన్నకంఠాభరణం, పెద్ద కంఠాభరణం, బంగారు పులిగోరు హారం, ఆరుమూరల చంద్రహారం, సువర్ణ యగ్నోపవితం, సాధరణ యగ్నోపవితం, తులసీ పత్రహారం, చతుర్భుజ లక్ష్మీహారం, అష్టోత్తరశతనామ హారం, సూర్యకఠారీ, వైకుంఠభహస్తం, కటిహస్తం, కడియాలు, కరభూషాలు, కడియాలు భూజదండభూషాలు, నాగాభరణాలు, భూజకీర్తులు, కర్ణపత్రాలు, చక్రం, శంఖం, ఆకాశరాజు కీరీటం, సాలగ్రామహారం, రత్నకీరీటం, మేరుపచ్చ, రత్నమయ శంఖుచక్రాలు, రత్నమయ కర్ణపత్రాలు, రత్నమయ వైకుంఠ కటిహస్తాలు, రత్నమయ మకరకంఠి, స్వర్ణపీతాంబరాలు, ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీకృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, అంజనేయుడు, స్వామివారి సేనాధిపతి విష్వక్సేనులువారు, ఆలయంలోని పరివార దేవతమూర్తులకు అలంకరించే అభరణాలతో కలిపి మొత్తం ఒక సెట్టుకి 242 ఐటమ్స్ ఉంటాయి.. ఒక సెట్టు బరువు 2700 కేజీల పైచిలుకు ఉంటుంది... వినియోగం లేనిది మరోక సెట్ ఉంది.. ఇవే కాకుండా పురాణ కాలంలో రాజులు మహారాజులు నుండి ఇప్పటి వరకు సమర్పించిన అభరణాలన్నీ అన్ని కలిపితే 50 టన్నుల బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి..
వాయిస్ ఓవర్ :  ఇవే కాకుండా బంగారు, వజ్రాలు, వైడుర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, పచ్చలు, కెంపులు, నీలం, ముత్యాలు పొదిగిన అభరణాలు శ్రీవారి బొక్కసం(ఖజానా)లో ఉన్నాయి.. మహారాణి సామవాయి కాలం నుండి స్వామి వారికి విరాళంగా అందిన అభరణాలు లిస్టు ఇది.. ఈ రెండు వేల సంవత్సరాల్లో వీటిని మార్చాల్సిన అవసరం ఏ సందర్భములోనూ రాలేదు... బంగారమే కాదు... వెండి కూడా చాలానే ఉంది... భక్తులు కానుకలుగా హుండిలో సమర్పించిన ముడి వెండి 20 టన్నులు, అభరణాలు, పూజా పాత్రలు ఉద్దరేణి,హారతి పల్లెం, ప్రసాద గంగళాల తదితర వస్తువుల రూపంలో మరో 5 టన్నుల ఉన్నాయి... బంగారు అభరణాలే కాదు బంగారు నిల్వలు కూడా స్వామి వారికి మెండుగా ఉన్నాయి... భక్తజనం.. అలాగే మనసంతా భక్తిని నింపుకొని.. ముడుపులు కట్టుకునీ.. మొక్కులు మొక్కుకునీ.. చివరికి స్వామికి అసమానమైన స్వర్ణాభరణాలను కానుకలుగా సమర్పించుకుంటారు మరికొందరు. ఇలా  భక్తులు నిలువుదోపిడీ, స్వర్ణాభరణాల రూపంలో అర్పించుకుంటున్న బంగారు కానుకలే.. ఆ వెంకన్న సామికి సగటున రోజుకు 2 కేజీలు.. అంటే ఏడాదికి దాదాపు 700 కేజీలు బంగారం పెరుగుతూ..ఇప్పటికి 9,752 కేజీల వరకూ బంగారం ఉంది.. అపరంజి బంగారు బిస్కెట్లు ఎస్.బి.ఐ,ఇండియన్ ఓవర్ సీస్ , పంజాబ్ నేషనల్, టిటిడి ఖజానా వివిధ బ్యాంకుల్లో నిల్వలుగా ఉన్నాయి. వాటి ద్వారా సంవత్సరానికి  తగ్గ అపరంజి బంగారు వడ్డీ రూపంలో టీటీడీ ఖాతాలో జమవుతొంది. బిస్కెట్ల రూపంలో బ్యాంకు డిపాజిట్లుగా ఉన్న బంగారంతా..సామన్యభక్తుల హుండిలో సమర్పించిన బంగారు అభరణాలను కరిగించినవే... ఇలా బ్యాంక్ లో  డిపాజిట్ చేసిన బంగారు వివరాలు ఇలా ఎస్.బి.ఐలో 5,387,ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంక్ లో  1,938, ఇక టిటిడి ఖజానాలో నిల్వ ఉన్న బంగారం 2,427 కేజీలు ఉందని, మొత్తం 9,752  కేజీల బంగారం ఉన్నట్లు ఇటీవల్ల తిరుపతిలో టిటిడి ప్రకటించింది..
వాయిస్ ఓవర్: మన దేశంలోనే కాదు.. విదేశాలో కూడా స్వామి వారికి స్థిర,చర ఆస్తులు లెక్కకు మించి ఉన్నాయి.. మన దేశంలో ఎన్ని స్థిరాస్తులు ఉన్నయో టీటీడీ దగ్గర లెక్కలు లేవు..  అయితే సంపన్న దేవుడైన శ్రీవారికి మాత్రమే15టన్నుల శ్రీగంధం నిల్వలు ఉన్నాయి. ఈ 15 టన్నుల వినిమయం తరువాతి అవసరాల కోసం, 40 ఏకరాల్లో శ్రీగంధం తోటను టీటీడీ పెంచుతొంది. ఇంతే కాదు గజ, తురగ, ఆశ్వాలే కాకుండా అరుదైన పునుగు పిల్లి, కస్తూరి మృగం తదితర అంతరించి పోతున్న జంతువులు కూడా నిత్యం స్వామి వారి సేవలో తరిస్తున్నాయి.. స్వామి వారికి భక్తుల నుండి వచ్చే కానుకలు, విరాళాలు, ఆస్తులు, ఆయనకు మాత్రమే పరిమితమైన అరుదైన వృక్ష, జంతు సంపదలతో వరల్ట్స్ రిచెస్ట్ గాడ్ గా పేరొందిన తిరుమల శ్రీవారు....సామన్య భక్తులకు కడుపు నిండా భోజనం పెడుతాడు..కొండపైన మామూలు రోజుల్లో 50  వేల మందికి రద్దీ రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతొంటొంది. ఇందుకోసం యేటా వంద కోట్ల రూపాయలు టీటీడీ ఖర్చు చేస్తుండగా....అందులో డెభై ఐదు కోట్ల రూపాయలు కేవలం వడ్డీ రూపంలోనే టీటీడీ అన్నదానం ట్రస్టు నుండి వస్తొంది. ట్రస్టులో ప్రస్తుతం 1100 కోట్ల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇదే కాదు వ్యాధితో భాదపడుతూ, వైద్యం చేసుకునే స్తోమత లేని భక్తులకు కూడా స్వామి వారు అపన్నహస్తమనే చెప్పుకొవాలి... గుండె, ముత్రపిండాలు ట్రాన్స్ ప్లాంటేషన్, న్యూరాలాజీ, డైయలసీస్ తదితర నెఫ్రాలాజీ రోగులకు ఉచిత చికత్సను టీటీడీ అందిస్తోంది. స్వామి నుండి అందే ఉచిత వైద్యానికి వచ్చే ఐదు సంవత్సరాలుకు సరిపడ్డ ప్రణాళిక, కేటాయింపులు సిద్ధంగా ఉన్నాయి....టీటీడీ వారు స్వయంగా నడుపుతున్న బర్డ్ ఆసుపత్రిలో పోలియో, ఆర్థో, స్పైన్ శస్త్ర చికత్సల కోసం రెండేళ్లకు అవసరమైన రోగులు వేచి ఉన్నారంటే.....అర్ధమవుతొందా....ఆ దేవుదేవుడ్ని సేవించేందుకే కాదు...ఆ స్వామి నుండి సేవలందుకునేందుకు కూడా డిమాండ్ ఎంత ఉందో ....
"  మాతర్నమామి కమలే ! కమలాయతాక్షి!
 శ్రీ విష్ణు హ్రుత్కమల వాసిని! విశ్వమాత: 
వాయిస్ ఓవర్ : ఈ వెంకటాచలపతికి ( శ్రీనివాసుడు) అనే మరో ప్రసిద్ద నామం ఉంది. శ్రీ అంటే దయాస్వరూపిణి , ప్రేమమయి అయిన శ్రీ మహాలక్ష్మియే. ఆమెను నివాసంగా కలవాడే ఈ శ్రీనివాసుడు .తిరుమల శ్రీవారి హ్రుదయం మీద ముందుకు చోచ్చుకుని వచ్చి ఆశీనురాలైంది అలిమేలుమంగ.. ఆ అమ్మ  శ్రీవారి ఒళ్ళో ఊరికే కూర్చో లేదు.. ఆమె ముందుగా భక్తులందరి, బిడ్డలందరి ప్రార్ధనల్ని, కోరికల్ని, కష్టాల్ని, వేదనల్ని, దు:ఖాల్ని ముందుగా తాను వింటుంది. ఆ వేంటనే తండ్రికి వినిపిస్తుంది.. కేవలం వినిపించడమే కాదు.. ఆ స్వామి వారిని ఒత్తిడి చేస్తుంది. అమ్మ వారి మాటను కాదన లేక.. ఆమె మాటకు కట్టుబడి ఆ శ్రీనివాసుడు మనందరి కోరికలను తీరుస్తూ వరాలను గుప్పిస్తున్నాడు. పాపాలను పోగోట్టుతున్నాడు. దు:ఖాలను, కష్టాలను తోలగిస్తన్నాడు. తద్వారా సుఖ సంపదలను ప్రసాదిస్తున్నాడు... అంతే గాక తిరుమల స్వామి వారు ప్రతి రోజు వేద గోషలతో ఇలా కీర్తింపబడుతున్నాడు.. అందుకే కోర్కెలు తీర్చే కోనేటి రాయుడుగా.. ఏడు కోండల్లో కోలువైయున్న శ్రీనివాసుడి భక్తులు ఆయనకు వివిధ రూపాల్లో భారీగా ముడుపులు చెల్లించుకుంటుంటారు..
బైట్ః వేణుగోపాల దీక్షితులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహాదారులు.

BRAHMOTSAVAM CURTAIN RAISER



యాంకర్:  కలియుగ వైకుంఠవాసుడు.....శ్రీనివాసుడు...ఏడాదికోకసారి జరిగే మహా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాడు.ప్రస్తుతం తిరుమలలో ఎటు చూసినా అంతటా బ్రహ్మోత్సవ సందడే...!బ్రహ్మండ నాయకుడైన శ్రీవారికి బ్రహ్మోత్సవం..... ఏటా తోమ్మిది రోజులు పాటు తిరుమాడ వీధులలో 16 రకాల వాహనాల పై స్వామివారు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చే ఉత్సవం.....తిరుమల క్షేత్రంలో జాతరను తలపించేలా... భక్తజనం తరలివచ్చే వైభోత్సవమే.... శ్రీవారి బ్రహ్మోత్సవం....ఏడుకోండల పై వెలసిన శ్రీనివాసుని జన్మ నక్షత్రానికి ముగిసేలా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే స్వామివారికి నిర్వహించిన ఉత్సవమే బ్రహ్మోత్సవం...భువిపైన వైకుంఠం అన్న రీతిలో జరిగే ఆధ్యాత్మిక సంబరం.. అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది....బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చింది.....కాలక్రమేణా బ్రహ్మోత్సవాల నిర్వహాణ ఎలా మారుతూ వచ్చింది.....కోండ పై వెలసిన కోనేటి రాయుణి బ్రహ్మోత్సవాల పై  స్పెషల్ ఫోకస్...

వాయిస్: నిత్యం కళ్యాణం పచ్చతోరణంగా భాసిలుతున్న తిరుమల క్షేత్రంలో ప్రతి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతునే వుంటుంది.ఎప్పుడు ఏదో ఒక ఊరేగింపు నిర్వహింపబడుతునే వుంటుంది.....వెంకటాద్రి పుణ్యక్షేత్రంలో ఏడాది పోడవునా ప్రతిరోజు పండుగే.....ప్రతి రోజు పచ్చ తోరణాలే.....ప్రతి పూటా పిండి వంటలే...పరమాన్నాలే....అలంకార ప్రియుడు...నైవేధ్య ప్రియుడు...అంత కంటే భక్తజన ప్రియుడైన శ్రీవారికి వైభవం అంతటిది.భక్తుల పాలిట కోంగుబంగారు దేవుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారికి సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలు... విశేష పూజ,అష్టదళపాదపద్మారాధన, సహస్రకలషాభిషేకం, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు..పుష్పయాగం, పవిత్రోత్సవం, ఆణివార ఆస్థానం,వసంతోత్సవం,జేష్ఠాభిషేకం వంటి వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూంది టీటీడి.ఇలా ఏడాది పోడవునా శ్రీవారికి ఎన్నో ఉత్సవాలు,ఊరేగింపులు నిర్వహించినా.....ఏడాదికోక్కసారి తోమ్మిదిరోజులు పాటు స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తిరుమల చరిత్రలోనే అత్యంత పాముఖ్యత... వైభవాని సంతరించుకున్నాయి.వేంకటాచల క్షేత్రంలో వెలసిన తోలిరోజులలో శ్రీనివాసుడు బ్రహ్మదేవుణి పిలిచి లోకకళ్యాణార్ధం తనకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించాడట.....శ్రీవారి ఆజ్ఞ మేరకు బ్రహ్మ దేవుడు...శ్రీవారు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసంలోని శ్రవణా నక్షత్రంకు పూర్తి అయ్యేలా తోమ్మిది రోజులు పాటు వైభవంగా ఉత్సవాలను నిర్వహించారట.సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే శ్రీవారికి నిర్వహించే ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ది పోంది నాటి నేటి వరకు నిరాఘాటంగా...నిరాటంకంగా కోనసాగుతునే వున్నాయి.
      విజువల్స్..................

వాయిస్: వైకుంఠంలో వుండే శ్రీమహావిష్ణువు....భక్తుల కోసం భువిలో కొలువైన పవిత్ర స్ధలం.నిత్యకళ్యాణం పచ్చతోరణమైన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎనలేని ప్రత్యేకత..తొమ్మిది రోజుల పాటు ఆ దేవదేవుడే భక్తుల ముందుకు తరలివచ్చి అనుగ్రహించే..ఈ మహాత్తర ఘట్టానికి తిరుమలలో చాలా ప్రాధాన్యత వుంది.యుగయుగాలుగా ఏడుకొండల పై కొలువైన స్వామి వారికి సాక్షాత్తూ బ్రహ్మే జరిపిస్తారు కాబట్టి వీటికి బ్రహ్మోత్సవాలని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.బ్రహ్మాండంగా జరిగే వేడుకలు కాబట్టి బ్రహ్మోత్సవాలుగా పేరొచ్చిందని మరో కధనం.ఏటా కన్యామాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణంతో ముగిసేలా ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.ఈ నెల 30వ తేది నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శ్రీవారి భక్తులను కనువిందు చేయనున్నాయి.ప్రతి రోజు రెండు వాహానాల పై ఆనంద నిలయుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
  బైట్....వేణుగోపాలదీక్షితులు  ఆలయ ప్రధాన అర్చకులు
               
వాయిస్: ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడానికి ముందే ఆలయాని పూర్తిగా శుద్ది చేస్తారు.బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు స్వామివారి ఆలయాని వివిధ సుగంధ  ధ్రవ్యాలతో శుద్ది చేసే కార్యక్రమాని కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అనే పేరుతో నిర్వహిస్తారు.అందులో భాగంగా ఈ నెల 24వ తేదిన ఆలయాని అంతా సర్వత్రా కడిగి,శుద్ది చేసిన తరువాతా స్వామివారి ఆలయాని పూలపందిళ్ళతో,మామిడి తోరణాలుతో,అరటి స్తంబాలుతో,విద్యుత్తు దీపాలతో సర్వాంగా సుందంరంగా అలంకరించారు.
 
వాయిస్: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభ సూచికగా ముందు రోజు అనగా ఈ నెల 29న ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది.ధ్వజారోహణం ముందు రోజు స్వామివారి సర్వసేనాధిపతియైన విష్వక్సేనులువారు మాడవీధులలో ఊరేగుతు ఆలయానికి నైరుతి మూలన వున్న వసంత మండపానికి ఛత్రచామర మంగళవాద్యలు,వేదమంత్రోచ్చారణలు మధ్య చేరుకోని భూమి పూజ నిర్వహిస్తారు మృత్సంగ్రహణం చేసి పుట్టుమన్ను సేకరించి ప్రదక్షిణంగా ఆలయానికి చేరుకుంటారు.ఆ రాత్రే బ్రహ్మోత్సవాలకు నవధాన్యాలతో అంకురార్పణ జరుగుతుంది.నవధాన్యాలు ఎంత బాగా పెరిగితే రాష్ర్టం... దేశం అంత సుభిక్షంగా వుంటుందని విశ్వాసం.
                           
వాయిస్: అంకుర్పారణ తరువాత రోజు జరిగే ప్రధాన కార్యక్రమమే ధ్వజారోహణం.వైఖనసాగమ శాస్ర్తోక్తంగా గరుడకేతన ప్రతిష్ట,కంకణధారణ,ఆలయ ఆవరణలోను ఆలయం చుట్టు అష్టదిక్కులోను బలినివేస్తూ ఆలయ పరివార దేవతలతో శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు మాడ వీధులలో ఊరేగుతు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలును ఆహ్వనిస్తారు.ఇలా దేవతలను ఆహ్వనించిన అనంతంరం శ్రీవారు ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటారు.అనంత,గరుడ,విష్వక్సేన,సుగ్రీవ,హనుమంత,అంగదులు విమాన ప్రదక్షిణంలో వున్న అంకురార్పణ మండపానికి చేరుకుంటారు.అటు తరువాతా శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారి సమక్షంలో వేదమంత్రోచ్చారణలు మంగళవాద్యాలు మ్రోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభం పై గరడపటాని ఎగురవేస్తారు.ఈ సంధర్భముగా స్వామివారికి ముద్గాలాన్నం నివేదిస్తారు.ఈ ప్రసాదాని స్వీకరిస్తే సంతానభాగ్యానికి నోచుకుంటారని ప్రతీతి.ఇక అటు తరువాతా ఆ రాత్రి నుంచే స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఉదయం,రాత్రి వేళలో తొమ్మిది రోజులు శ్రీవారు మాడవీధులలో ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు. 
                       
వాయిస్.: బ్రహ్మండనాయకుడి బ్రహ్మోత్సవాలలో మొదటిరోజు స్వామి ఊరేగే వాహనం పెద్దశేష వాహనం.అంకురార్పణతో సంప్రదాయబద్దంగా ప్రారంభమైయే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి ఆకర్షణ విష్వక్సేనుల వారి ఊరేగింపు.విష్ణువు యొక్క సర్వసేనాధిపతి విష్వక్సేనులు.ఆయన ఊరేగింపుతో ప్రారంభమైయే తిరువీధి ఉత్సవాలు...ఆదిశేషుని తొలి వాహనంగా శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తిరు వీధుల్లో ఊరేగుతు భక్తులకు కన్నులపండుగగా  దర్శనమిస్తారు.ఆదిశేషుడు శ్రీహరి మిక్కిలి సన్నిహితుడు.రామావతారంలో లక్ష్మణుడుగా,ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్ననాయణుడుకు ఎంతో సన్నిహితంగా వున్నవాడు శేషుడు.కలియుగంలో శేషుడు గోవిందరాజస్వామిగా స్వామివారికి సన్నిహితంగా వున్నారు.అంత సన్నిహితంగా వున్న శేషుడును శ్రీవారు తన తొలి వాహనంగా చేసుకోని మాడ వీధులలో ఊరేగుతుంటే...దర్శించుకున్న భక్తులకు పశుత్వం తోలగి మానవత్వం,అందుడి దైవత్వం,ఆ పై పరమపదం సిద్ధిస్తాయని విశ్వాసం.
       
వాయిస్.:రెండోవ రోజు ఉదయం శ్రీవారు చిన్నశేషవాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.పెద్ద శేష వాహానాని ఆది శేషుడుగాను... చిన్న శేష వాహనాని వాసుకిగా భావిస్తారు భక్తులు.ఎల్లప్పుడు శేషుని పై శయనించే స్వామివారు... మళ్ళి ప్రీతితో రెండోవసారి శేషవాహనం పై భక్తులకు దర్శనమిస్తారు.పెద్దశేష వాహనం పై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిస్తే.... చిన్నశేష వాహనం పై మలయప్పస్వామి వారు మాత్రమే ఊరేగుతు భక్తులుకు దర్శనమిస్తారు.చిన్నశేషవాహనం పై స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు యోగ సిద్ధి ఫలం లభిస్తూందని నమ్మకం.
               
వాయిస్.: రెండోవరోజు రాత్రి మలయప్పస్వామివారు వీణాపాణియైన సరస్వతి మూర్తిగా హంస వాహనం పై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.బ్రహ్మ వాహనంగా హంస ప్రసిద్ధి.అటువంటిది శ్రీనివాసుడు హంసను తన వాహనంగా చేసుకోని నాలుగు మాడ వీధులలో ఊరేగుతు భక్తులకు నయానందకరంగా దర్శనమిస్తారు స్వామివారు.హంస వాహనం పై స్వామివారిని దర్శింకుంటే అహంభావం తోలగి దాసోహం అనే భావం భక్తులలో కలుగుతుదని వారి విశ్వాసం.
                 
వాయిస్.: బ్రహ్మోత్సవాలలో మూడోవరోజు ఉదయం స్వామివారు సింహ వాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.అనంతతేజోమూర్తియైన శ్రీనివాసుడు రాక్షసుల మనస్సులో సింహంలా గోచరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.భగవంతుని యొక్క అవతారాలలో నరసింహ అవతారం నాలుగోవది.ధర్మరక్షణకై నరసింహ స్వరూపాని ధరించిన స్వామివారు ఈ ఉత్సవాలోల సింహాని అధిష్టించి రావడం దుష్టజన శిక్షణకు శిష్ట రక్షణకు సంకేతం.సింహం పరాక్రమం కలిగిన జంతువు.అది మదగజాలనే సంహరించకలదు.అటువంటి సింహానే తన వాహనంగా స్వామివారు చేసుకోవడం అంటే స్వామివారు ఎంతటి పరాక్రమం కలిగినవారో అట్టే అర్ధమవుతుంది అంటారు పండితులు.భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు...భగవంతుడు భక్తుని అనుగ్రహిస్తాడు అన్నది వాహన సేవలో అంతరార్ధం అంటారు అర్చకులు.
                 
వాయిస్.: మూడోవరోజు రాత్రి స్వామివారు ముత్యపు పందిరి వాహనం పై ఉభయదేవేరులతో కలిసి భక్తులకు శ్రీనివాసుడు దర్శనమిస్తారు.ముత్యాలు విలువైనవి...చల్లదనాని ప్రసాదిస్తాయి...తెల్లని కాంతులను ఇస్తూంది...సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తూవులలో ముత్యం ఒక్కటి.ఇంత ప్రాశస్తమైన ముత్యాలను పందిరిగా రూపోందించిన వాహనంలో ఏడుకోండల స్వామి మురువు గోల్పుతు ముచ్చటగా ఊరేగుతాడు.చల్లని ముత్యాల క్రింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగోట్టి,భక్తుల జీవితాలకు చల్లదనాని సమకూరుస్తూందని భక్తుల విశ్వాసం. 
                   
వాయిస్.: బ్రహ్మోత్సవాలలో నాలుగోవరోజు శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై కల్పవృక్షవాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు...అనేక విధాలైన చెట్లు సృష్టిలో వున్నాయి.అందులో మేటి కల్పవృక్షం...ఇతర వృక్షాలు తాము కాచి ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి.కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలు అన్నింటిని ప్రసాదిస్తూంది.అటువంటి కల్పవృక్షం వాహనాని అధిరోహించి శ్రీవారు తిరుమాడ వీధులలో విహరిస్తూ వుంటే భక్తులు తనివితీరా స్వామివారిని దర్శించుకుంటారు.కల్పవృక్ష వాహనం పై స్వామివారిని దర్శించుకుంటే కోరిన ఫలాలంటిని సిద్ధిస్తారని భక్తుల నమ్మకం.
                   
వాయిస్.: నాలుగోవరోజు రాత్రి శ్రీవారు సర్వభూపాల వాహనం పై విహరిస్తూ  భక్తులకు దర్శనమిస్తారు.తూర్పు దిక్కుకు ఇంద్రుడు,ఆగ్నేయానికి అగ్ని,దక్షిణానికి యముడు,నైరుతికి నిరృతి,పశ్చిమానకి వరుణుడు,వాయవ్యానికి వాయువు,ఉత్తరానికి కుబేరుడు,ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదికాల్పులై విరాజిల్లుతు వుంటారు.వీరంతా స్వామివారిని సుప్రభాతం సేవ సమయంలో సేవిస్తారని  స్వామి తెలియజేసారు.ఇక భూపాలకులందరు అధికార సంపన్నులే.... వారి అధికారం దుర్వినియోగం కాకూండా వుండాలంటే వారు భగవత్సేవాపరులై వుండాలి.అలా రాజులందరు శ్రీవారిని తమ భుజస్కంధాలు పై మోస్తారని....అలా స్వామివారి సర్వభూపాల వాహనం పై దర్శించుకుంటే రాజ్యసుఖప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వాసం.
             
వాయిస్.: ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదోవ రోజు ఉదయం ఆపద మ్రొక్కులవాడు వారు మోహిని అవతారంలో శృంగార రధసారధి దేవతగా భక్తులకు దర్శనమిస్తారు.బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహనం ఉరేగింపు వాహన మండపం నుండి ప్రారంభమైతే....ఒక్క మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుండి ప్రారంభమవుతుంది.ఆలయం నుండి బంగారు తిరుచ్చి పై మోహిని అవతరాంలో స్వామివారు...ప్రక్కనే దంతపు పల్లకి పై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో స్వామివారు వెలుపలికి వచ్చి మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.ఇక మోహిని అవతరాంలో మరో ప్రత్యేక అలంకరణ వుంటుంది.స్వామివారికి శ్రీవల్లి వూత్తురు నుండి గోదాదేవికి అలంకరించిన పుష్ప మాలాలు,చిలుకలను స్వామివారికి అలంకరిస్తారు.జగత్తు అంతా మాయా మోహానికి లోంగి వుంటుంది.ఈ జగన్నాటక సూత్రధారి తిరుమల రాయుడే...బ్రహ్మోత్సవాలలో మోహిని రూపధారియైన స్వామివారు... ప్రపంచమంతా తనమాయా విలాసమని తనకు భక్తులైన వారు మాయాను సులభంగా దాటగలరని భక్తలకు చేబుతున్నట్లుగా వుంటుందట మోహిని అవతరాం.
               
వాయిస్.: ఐదోవరోజు రాత్రి స్వామివారు గరుడ వాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.గరుడ వాహనాని దర్శించుకునేందుకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు.స్వామివారి వాహన సేవలలో గరుడ వాహనంకు ఎంతో ప్రాముఖ్యత వుంది.గరుడ వాహనం సంధర్భముగా శ్రీవారి మూలమూర్తికి అలంకరించే మకర కంఠి,లక్ష్మికాసుల హరం,సహస్రనామ మాలలను స్వామివారి ఉత్సవమూర్తులుకు అలంకరిస్తారు.శ్రీవల్లి పుత్తూరు దేవస్థానం తరపున తులసి మాలలు,చెన్నై భక్తులు సంప్రదాయబద్ధంగా సమర్పించే నూతన గోడుగులును స్వామివారికి అలంకరిస్తారు.గరుడను వాహనంగానే కాకుండా ధ్వజారోహణం రోజున ధ్వజ మండపం పై నిలిచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వనిస్తాడు.ఉత్సవాలు జరిగినన్ని రోజులు పర్యవేక్షిస్తాడు.అంతటి ప్రాముఖ్యత కలిగిన గరుడ వాహన సేవను దర్శించుకున్న భక్తులకు జ్ఞానము,వైరాగ్యప్రాప్తి లభిస్తూందని భక్తుల విశ్వాసం.
                       
వాయిస్.: ఆరోవ రోజు ఉదయం వరద హస్తం దాల్చిన వేంకటాద్రి రాముడు హనుమంత వాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.భగవంతుని భక్తులలో హనుమంతుడు అగ్రగణ్యుడు.రామాయమంలో మారుతి స్థానం అద్వితియం.చతుర్వేద నిష్ణాతుడుగా,నవవ్యాకరణ పండితుడుగా,లంకాభీకరుడుగా ప్రసిద్దుడైన హనుమంతుడు తన వీపు పై వేంకటాద్రిని వహించి మాడ వీధులలో విహరిస్తూ వుంటే గోవిందనామ స్మరణలు మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
                     
వాయిస్.: ఆరోవ రోజు సాయంకాలం స్వర్ణరథ ఊరేగింపు నిర్వహిస్తారు.ప్రపంచంలోనే అతిపెద్దదైన స్వర్ణ రథం పై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.74 కేజిల బంగారం,2900 కేజిల రాగి,25 టన్నుల చెక్కతో తయ్యారు చేసిన 32 అడుగుల పోడవు వున్న అతి పెద్ద స్వర్ణ రథం పై ఆ ఏడుకోండల స్వామి తన ఇరువురు దేవతలతో కలసి ధగధగ మేరిసే కాంతుల మధ్య భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూంటే....ఏడుకోండలు గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిపోతుంది.
                           
వాయిస్.: ఆరోవ రోజు రాత్రి శ్రీవారు గజ వాహనం పై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.గజం వాహనంగా ఆనాదిగా ప్రసిద్ధమే...శ్రీ వేంకటేశ్వర స్వామి గజవాహనం పై మాడ వీధులలో ఊరేగుతు వుంటే భక్తులు గోవిందనామ స్మరణలు మధ్య స్వామివారిని దర్శించుకుంటారు.శ్రీవారు గజ వాహనాని అధిరోహించిన రోజే కాకుండా ప్రతి రోజు బ్రహ్మోత్సవాలలో టీటీడి గజరాజులు పాలుపంచుకుంటాయి.బ్రహ్మరధం వెనుక అశ్వాలు,వృషభాలుతో పాటు ఠివిగా గజరాజులు ఊరేగింపులో నడచివస్తాయి.భక్తులు సదా శ్రీనివాసుని కోలుస్తూ శరణాగతి పోందాలన్నది ఈ వాహన సేవ ద్వారా అందించే దివ్య సందేశం.
                       
వాయిస్.: ఏడోవరోజు ఉదయం శ్రీవారు సూర్యప్రభ వాహనం అధిష్టించి తేజో విరాజితుడై  భక్తులకు దర్శనమిస్తారు.సూర్యుడు తేజోనిధి,సకలరోగ నివారుకుడు...ప్రకృతికి చైతన్యప్రదాత...వర్షాలు వాటి వల్ల పెరిగే సస్యాలు.... చంద్రుడు అతని వల్ల పెరిగే ఔషదులు మొదలైనవన్ని సూర్యతేజం  వల్లనే వెలుగోందుతున్నాయి.అట్టి సూర్యప్రభను స్వామివారు తన వాహనంగా చేసుకోని మాడ వీధులలో విహరిస్తూ వుంటే భక్తులు తనివితీరా దర్శించుకుంటారు.సూర్యప్రభ వాహనం పై స్వామివారిని దర్శించుతుంటే భక్తులకు ఆరోగ్యం,ఐశ్వర్యం సిద్ధిస్తూందని నమ్మకం.
               
వాయిస్.: ఏడోవ రోజు రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనం పై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.స్వామివారికి సూర్యచంద్రులు రెండు నేత్రాలు.... ఉదయం సూర్యప్రభ వాహనం పై  ఊరేగిన శ్రీహరి రాత్రి నిశాకరుడైన చంద్రప్రభ వాహనం పై భక్తులకు దర్శనమిస్తారు.చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి... సాగరుడు ఉప్పోంగుతాడు....చంద్రకాంతమణులు స్రవిస్తాయి..అదే విధంగా చంద్రప్రభ వాహనం పై స్వామివారిని చూడగానే భక్తుల మనస్సు ఉప్పోంగుతుంది..భక్తనేత్రాలు వికసిస్తాయి....ఆనందరసం భక్తుల హృదయం నుండి స్రవిస్తూంది.చంద్రుని వల్ల ఆనందం,చల్లదనం కలుగుతుంది.అదే విధంగా చంద్రప్రభ వాహనం పై స్వామివారిని దర్శించుకుంటే ఆధ్యాత్మిక,ఆదిభౌతిక,ఆధిదైవిక మనే త్రివిధ తాపాలును నివారిస్తూంది.
                   
వాయిస్.: ఎనిమిదోవ రోజు ఉదయం ఆరు గంటలకు రధోత్సవం ప్రారంభమవుతుంది.శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారు మహోన్నత రథాని అధిరోహించి ఆలయ వీధులలో విహరిస్తారు.స్వామివారి రథానికి ముందుగా కళ్యాణకట్ట ఉద్యోగులు సమర్పించిన బంగారు గోడుగును అలంకరిస్తారు.దాదాపు మూడు గంటల పాటు స్వామివారి రథోత్సవం జరుగుతుంది.బ్రహ్మోత్సవాలలో ప్రతి వాహన సేవ ముందు బ్రహ్మ రథం వుంటుంది.ఒక్క రథోత్సవానికి మాత్రం బ్రహ్మరథం వుండదు.సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే స్వామివారి రథసారధిగా వుంటారు కాబట్టి బ్రహ్మరథం లేకుండానే స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు.
         
వాయిస్.: ఎనిమిదోవ రోజు రాత్రి కల్కి అవతారంలో శ్రీవారు అశ్వ వాహనం పై ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తారు.బ్రహ్మోత్సవాలలో స్వామివారి చివరి వాహన సేవ అశ్వ వాహనం.భగవంతుని అవతారాలలో పది ప్రసిద్ధమైనవి.చివరి అవతారం కల్కి అవతారం...కలియుగాంతంలో కల్కి రూపధారియైన స్వామివారు కత్తి చేతభూనిన స్వామి అశ్వ వాహనం పై దుష్ట సంహారం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
         
వాయిస్.: బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నానం తొమ్మిదోవ రోజు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహిస్తారు.యజ్ఞం చివర అవభృధస్నానం నిర్వహించడం సంప్రదాయం.తొమ్మిది రోజులు పాటు ఒక యజ్ఞంలా నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చక్రస్నానం కు ఎంతో ప్రాముఖ్యత వుంది.ఆలయం నుండి వేకువజామున శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామితో పాటు చక్రత్తాల్వారును మాడ వీధులలో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయం వద్ద వున్న పుష్కరిణి వద్దకు తీసుకువస్తారు.పుష్కరిణి వద్ద వున్న మండపంలో ముందుగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.అటు తరువాతా చక్రత్తాల్వారుకు పుష్కరిణిలో అవభృధస్నానం ఆచరిస్తారు.వేలాది మంది భక్తులు ఆ సమయంలో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.
               
వాయిస్.: బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం ధ్వజాఅవరోహణం.తోమ్మిదోవ రోజు రాత్రి ధ్వజ స్తంభం ఏగుర వేసిన ధ్వజపట్టాని వేదమంత్రాలు,మంగళవాయద్యాలు నడుమ క్రిందకు దించడంతో బ్రహ్మోత్సవాలు శాస్ర్తోక్తంగా ముగుస్తాయి.
                 విజువల్స్...........
వాయిస్.: ఇంతటి ప్రాముఖ్యమున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకున్ని టీటీడి యంత్రాంగం గత మూడు నెలలుగా నిరంతరాయంగా ఏర్పాట్లు చేస్తావుంది.దసరా సెలవులతో పాటు తమిళులకు అత్యంత ముఖ్యమైన పెరటాసి నెలకావ్వడంతో ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున్న భక్తులు తరలివస్తరాని అంచనా వేసిన టీటీడి అధికారగణం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తావుంది.భక్తులకు సులభతరంగా వాహనసేవ దర్శనంతో పాటు ఆరోజు కారోజే స్వామి వారి మూలవిరాట్టు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తావున్నారు.
               
వాయిస్.: మరో రెండు రోజుల్లో బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభం కానుండడంతో టీటీడి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తావున్నారు.కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్న ఫలఫుష్ప ప్రదర్శనను ఈ నెల 30వ తేది నుంచి భక్తులు సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తావున్నారు.ఇక విద్యుత్ సిబ్బంది తిరుమలతో పాటు తిరుపతి నగరాని విద్యుత్ దీపకాంతులతో దేదీపమాన్యంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు.మొత్తం మీద ఈ ఏట శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సప్తగిరులకు చేరుకున్నే భక్తులకు ఇక్కడి ఏర్పాట్లు కనువిందు చేయనున్నాయి..

Tuesday, 24 September 2019

గోపాల స్వామి కోన పై స్పెషల్ స్టోరీ..

యుగ, యుగముల చరిత్ర కలిగిన ప్రదేశం..
కృతయుగం లో నారద మహర్షి తపస్సు చేసిన పవిత్ర పుణ్య క్షేత్రం..
త్రేతా యుగం లో శ్రీ రామచంద్రమూర్తి, ద్వాపర యుగం లో పాండవులు, కలియుగం లో అయ్యవారయ్య స్వామి దర్శించుకున్న ఏకైక పుణ్యక్షేత్రం...
రేనాటి చోళ రాజులు,మట్ల రాజులు ఆలయ అభివృద్దికి విశేషమైన  సేవ చేసినట్లు చరిత్ర....
ఆ ప్రముఖ పుణ్యక్షేత్రమే అట్లూరు కొండల్లో వెలసిఉన్న గోపాల స్వామి కోన...
ఈ పుణ్య క్షేత్రం పై భారత్ టుడే ప్రత్యేక కథనం... 


యాంకర్ :
 కొండల్లో, అడవుల్లో వెలసిన ఆలయాలకు వెళ్లాలంటే భక్తులు ఉత్సాహం చూపుతారు. మరి అలాంటి పుణ్య క్షేత్రం గురుంచే మనం చెప్పుకోబోతున్నాం. వన్యప్రాణి సంరక్షణ చట్టం చట్టం 1971 రాక మునుపు నుంచి గోపాల స్వామి వంక ఎంతో ప్రసిద్ది చెందిన వైష్ణవి క్షేత్రం.  లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం గోపాల స్వామి.కడప జిల్లా ఆలయాలకు ప్రసిద్ది చెందిన కేంద్రం. ఇక్కడి కొండల్లో, కోణల్లో చాలా వరకు ఆలయాలు కనిపిస్తాయి.అటువంటి కొండల్లో కోణల్లో వెలిసినదే కొండ గోపాల స్వామి కోన. చుట్టూ పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, పెద్ద పెద్ద కొండలు గుట్టల మధ్య ప్రయాణం,ఇది కొండ గోపాల స్వామి కోన కు వెళ్ళే  మార్గం లోని అనుభూతులు. దీనికి తోడు గల గల పారే జలపాతాలు, భారీ చెట్ల మధ్య లో సవ్వడులు చేసే సెలయేర్లు అక్కడి అందాలను మరింత పెంపొందించాయి. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుందో చెప్పలేదు కదూ ... కడప జిల్లాలోని అట్లూరు సమీపం లోని లంకమల్ల అడవిలో...

వాయిస్ :
కడప నుంచి 30 కిలోమీటర్ల దూరం లో అట్లూరు గ్రామం ఉన్నది. అక్కడి  నుంచి దట్టమైన అడవి మార్గాన వెళితే గోపాల స్వామి కోన ఆలయానికి చేరుకోవచ్చు.కొండ కింద రెడ్డి పల్లె వరకు ఆటొ తిరుగుతుంటాయి. చాలా పురాతనమైన ఆలయానికి వెళ్లాలంటే దాదాపు 2 గంటల పాటు దట్టమైన అడవులలో ప్రయాణించి కొండ గోపాల స్వామి క్షేత్రానికి చేరుకోవచ్చు. గోపాల స్వామి కోన కు వెళ్లాలంటే ధారి లేక పోయిన కొండల్లో, గుట్టల్లో ప్రయాణించాల్సి వచ్చినా కూడా భక్తులు శ్రావణ మాసం లో పెద్ద ఎత్తున ధట్టమైన అడవుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా కూడా వెళ్తుంటారు. కొండ గట్టున గోపాల స్వామి వెలిసిఉండటం తో కొండ గోపాల స్వామి అని, సంతానం లేని వారికి సంతాన కలుగుతుండటం తో సంతాన స్వామి అని కూడా గోపాల స్వామి ని పిలుచుకుంటారు.యుగ యుగాల చరిత్ర కలిగిన ఆలయానికి నడకదారి ఏర్పర్చుకోవాలన్న అటవీశాఖ ఆంక్షలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వాయిస్ 1 :
గోపాల స్వామి ఆలయానికి కనీసం నీళ్ళు ఆహార పదార్థాలు తీసుకెళ్లాలన్న ఎంతో వ్యయం తో కూడుకున్న పరిస్థితి. దాదాపు 2 గంటల పాటు నడకదారిలో వెళ్తే తప్ప ఒక్క సామగ్రిని కూడా పైకి తీసుకెళ్లలేని స్థితి. శ్రావణ మాసం లో రహదారి లేక పోయిన లక్షల మంది  భక్తులు వ్యయ ప్రయసాలతో కొండ గట్టున ఉన్న స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తుండటం తో కొంత మంది దాతలు తమ సొంత ఖర్చులతో కూలీలను పెట్టి నిత్యవసర సరుకులు తీసుకెళ్లి అక్కడ బక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. చుట్టూ ప్రక్కల ప్రజలు తమ సొంత నిధులతో క్షేత్రాన్ని అభివృద్ది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భక్తులకు కొంగు బంగారం కొండ గోపాల స్వామి కోన అని భక్తుల ప్రగాడ నమ్మకం.సరైన రహదారి ఏర్పడితే కింది నుంచి నిత్యవసర సరుకులు కోన కు చేరుకుంటాయి. మొత్తం దేశ వ్యాప్తంగా ఇక్కడికి వాచీ స్వామి వారిని దర్శించుకుంటారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నదానం చేస్తూ చుట్టూ ప్రక్కల గ్రామ ప్రజలు స్వామి వారి కృప కు పత్రులవుతున్నారు .


బైట్ : వేణుగోపాల రెడ్డి, అన్నదాత, కొండూరు గ్రామం.


వాయిస్ 2 :
పురాతమైన దేవాలయం కావడం 10 సంవత్సరాల ముందు శిదిలావత్స కు చేరుకున్నాక కొండూరు పరిసర గ్రామ ప్రజలంతా కలిసి దాదాపు 8 సంవత్సరాల నుంచి కలిసి ఆలయాన్ని అభివృద్ది చేసుకున్నామని ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వాచీ కొండ గోపాల స్వామి వారిని దర్శించి ఆయన కృపకు పాత్రులవుతున్నారని ఆలయ ఛైర్మన్ తెలిపారు. జిల్లా నుంచే కాకుండా బయట దేశాలనుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తున్నారని, ఇటువంటి పుణ్యక్షేత్రం జిల్లాలో ఎక్కడ లేదని దీనిని అభివృద్ది చేసుకుంటే జిల్లాకే తలమానికంగా క్షేత్రం నిలుస్తుందని అన్నారు. కేవలం అటవీ అధికారుల ఆంక్షల వల్ల రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం స్పందించి రహదారి ఏర్పాటు చేస్తే ఇంకా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వాచే అవకాశం ఉందన్నారు.


బైట్ : గోపాల్ రెడ్డి, ఆలయ ఛైర్మన్, గోపాల స్వామి కోన, అట్లూరు.

ఎండ్ వాయిస్ :  భక్తులకు కొంగుబంగారమైన గోపాల స్వామి కోనకు 9 అడుగుల రహదారి గెజిట్ లో ఉందని కానీ అటవీ అధికారులు లేని పోనీ ఆంక్షలతో దారి లేకుండా చేస్తుండటం పై భక్తులు తీవ్ర అసహనానికి గురవ్తుతున్నారు. ఎంతో ప్రసిద్ది గాంచిన ఆలయానికి ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని,టూరిజం కు కూడా ఎంతో అభివృద్ది అవుతుందని భక్తులు కోరుతున్నారు.



నోట్ : రిపోర్టర్ పి 2 సి  వాడుకోగలరు. 

తిరుమల బ్రహ్మోత్సవాలు


యాంకర్: బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఆధ్యంతం స్వర్ణ శోభయమనం. తిరుమలగిరి రాయుడికి బ్రహ్మ చేసిన ఘనోత్సవాలు సప్తవర్ణ శోభితంగా సాగుతాయి. అసలు బ్రహ్మోత్సవాల అంతరార్థం ఏమిటి..? బ్రహ్మోత్సవంలో దాగి ఉన్న దైవ రహస్యం ఏమిటి..? భక్తజన కోటికి తిరుమలలో ప్రతి రోజు బ్రహోత్సవాలే అయినప్పుడు ఈ ఉత్సవాల నిర్వహణ వెనక ఉన్న వైశిష్ట్యం ఏమిటో తెలియచెప్పే అంతరార్థం పై  భారత్ టూడే ప్రత్యేక కథనం..
వాయిస్: ఈ కలియుగ వైకుంఠంగా... ఓ దివ్యక్షేత్రంగా పవిత్ర పుణ్యక్షేత్రంగా యుగ యుగాల నుంచి భాసిల్లుతున్న క్షేత్రం తిరుమల.. అందుకే ఈ క్షేత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇంతంటి పుణ్యస్ధలంలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించిన స్వామి శ్రీవేంకటేశ్వరుడు.శ్రీనివాసుడు, తిరుమలేశుడు, ఆపదమొక్కులవాడు సప్తగిరీశుడు, గోవిందుడు ఇలా అనంతమైన పేర్లతో పిలిచే స్వామి..,భక్తుల పాలిట కల్పతరువు. పట్టిన వారి చేత బంగారం. సేవ చేసిన వారి చేతిలో మాణిక్యం. భావించువారి పరబ్రహ్మ.కావలనన్నవారికి మనమనోరథ సిద్ధి నిచ్చే గురుతైన దైవం.పూజించేవారిని రక్షించే వజ్రాయుధం. అందుకే తిరుమలేశుని కోవెలె నిత్య కళ్యాణం పచ్చ తోరణం.రోజుకు దాదాపు 70 వేల మంది భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే..అది తిరుమలే. సంవత్సరంలోని 365 రోజులు ఈ క్షేత్రంలో రద్దీ ఉంటూనే ఉంటుంది. దేశం నలుమూలలనుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీనివాస సందర్శన కోసం వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వస్తుంటారు.. గంటల తరబడి క్యూలైన్లలో నిలుచుని అరవింద దళాక్షుడిని ఆర్తితీరా దర్శించుకుంటారు.. సాధారణ భక్తులే కాదు సంపన్నులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ వేత్తలు క్యూలు కట్టే క్షేత్రం ఏదంటే అది తిరుమలే.అందుకే తిరుమల గిరులు ఎప్పుడూ జన సంద్రమే.. శ్రీవారి దర్శనానికి వచ్చే వారు వస్తుంటే వెళ్లేవారు వెళుతుంటారు. సాధారణ భక్తులు సర్వదర్శనం తో సంతృప్తి చెందితే కొందరు భక్తులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు.. మరికొందరు కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సహస్రకళాశాభిషేకం, తోమాల, అర్చనం, అభిషేకం మొదలైన సేవల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.  ఒక్కోక్క సేవలోనూ ఒక్కో దివ్యానుభూతి పొందడం జరుగుతుంది. అందుకే వచ్చినవారే మళ్లీ మళ్లీ వస్తారు. చూసిన కనులే మళ్లీ మళ్లీ ఆ దేవదేవుని దర్శించుకుంటాయ్. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని ఎన్ని సార్లు దర్శించినా తనివితీరదు..

వాయిస్: ప్రపంచంలోనే పేరొందిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలకు యుగయుగాల చరిత్ర ఉంది. శ్రీ వైకుంఠాన్ని వదిలి భక్తులను అనుగ్రహించడానికి భూలోకం వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్టువే శ్రీవేంకటేశ్వరుడు. భూభారాన్ని వహించడానికి వరాహస్వామి రూపుదాల్చిన శ్రీమహావిష్ణువు ఈ క్షేత్రంపైనే సేదతీరారు. లక్ష్మీదేవితో కలహించి వేంకటాద్రికి చేరడం ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవిని పెళ్లాడడం తిరుమల శిఖరానికి చేరుకుని శిలారూపంగా మారినట్లు పురాణాలు చెబుతున్నాయ్. కలియుగారంభం నుంచి అర్చామూర్తిగా భక్తులచేత పూజలందుకుంటున్నాడు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠంగా జగత్ ప్రసిద్ధమైంది. స్వయం వ్యక్తమై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అనాదిగా వైఖానసాగమం ప్రకారం పూజా నివేదనలు జరుగుతున్నాయ్. శ్రీవేంకటేశ్వరస్వామి ఇక్కడ ధ్రువమూర్తిగా,కౌతుకమూర్తి,స్నపనమూర్తి,కొలువుమూర్తి, ఉత్సవమూర్తులుగా ఐదు రూపాల్లోనూ భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. ఊరేగింపులు,సేవలు,వేడుకలు చేయించుకుంటూ కలౌ వేంకట నాయకఃగా భక్తుల హృదయాల్లో కొలువుదీరాడు తిరుమలేశుడు. వేద కాలం నుంచి తిరుమల పవిత్ర పుణ్యధామంగా భాసిల్లుతోంది. స్వామి పుష్కరిణితోపాటు ఆకాశ గంగ పాపనాశనం ఇంకా అనేకానేక తీర్ధాలు తిరుమల గిరులను పునీతం చేస్తున్నాయ్. యుగాలు మారుతున్నా తిరుమల ప్రాశస్త్యం ఏడుకొండలవాడి వైభవం ఇంతింతై వటుడింతై అన్నచందాన పెరుగుతుందే కానీ తరగట్లేదు. అందుకు నిదర్శనమే నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీ. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో ప్రతి రోజూ పండగే ప్రతి రోజూ ఉత్సవమే. ఏడాది పొడవునా దాదపుగా 450 ఉత్సవాలు జరుగుతాయ్. ఏడాది పొడువునా ఏడుకొండలకు వాడికి ఎన్ని ఉత్సవాలు జరిగినా సంవత్సరానికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేకతే వేరు.

వాయిస్ : తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించాలని వివిధ వాహనాలపై ఊరేగే స్వామిని దర్శించాలని భక్త కోటీ ఉవ్విళ్లూరుతుంది. స్వామికి బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కనుక బ్రహ్మత్సవాలనీ...వైభవంగా జరిగే వేడుకులు కావున...బ్రహ్మోత్సవాలనీ పేరొందినట్లు పురాణాలు చెబుతున్నాయ్.ఆశ్వయుజ మాసంలోని స్వామి వారి జన్మనక్షత్రం శ్రవణం పూర్తయ్యే విధంగా ప్రతి సంవత్సరం...ఈ ఉత్సవాలు ఘనంగా  తిరుమల కొండలపై జరుగుతాయ్. ప్రతి మూడవ ఏటా అధిక మాసం సందర్భంగా రెండు బ్రహ్మత్సవాలు భాద్రపద మాసంలో(కన్యామాసం)...ఒకటి..దసర నవరాత్రుల్లో మరొక బ్రహ్మోత్సవం జరుగుతుంటుంది.అధిక మాసం రాని సందర్భాల్లో నవరాత్రుల సమయంలో ఒకే బ్రహ్మోత్సవం...శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయ్.యుగయుగాల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయని పురాణాలు చెబుతున్నప్పటికీ....శాసనాల ఆధారంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు 6వ  శతాబ్దంలో ప్రారంభమైనట్లు  తెలుస్తోంది. చక్రవర్తులు,మహరాజులు తమ విజయపరంపరలకు గుర్తుగా తిరుమలేశుని బ్రహ్మోత్సవాల పేరుతో వైభవంగా ఉత్సవాలను నిర్వహించేవారు.నెలకొకటి చొప్పున ప్రతి ఏటా పన్నెండు బ్రహ్మోత్సవాలు కూడా జరిగేవని చరిత్ర చెబుతోంది. క్రీ.శ.614లో పల్లవరాణి సమవాయ్( పేరిందేవి) మనవాళ పెరుమాళ్ అనే వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల ఆలయానికి బహుకరించింది.పెరటాసి నెలలో (కన్యామాసం)జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేవారు.ఆ తరువాత క్రీ.శ.1254 చైత్ర మాసంలో తెలుగు పల్లవరాజు విజయ గండ గోపాలదేవుడు,క్రీ.శ. 1328 ఆషాఢమాసంలో  ఆడి తిరునాళ్ల పేరుతో త్రిభువన చక్రవర్తి తిరువేంకట యాదవ రాయలు,క్రీ.శ. 1429 ఆశ్వయుజ మాసంలో వీర ప్రతాపదేవరాయలు,క్రీ.శ.1446లో మాసి తిరునాళ్ల పేరుత హరిహరిరాయలు,క్రీ.శ.1530లో అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు...ఉత్సవాలు నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది.క్రీ.శ. 10వ శతాబ్దంలో తిరుమలలో 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగేవి.ఉత్సవాల్లో ఉగ్ర శ్రీనివాసమూర్తిని  ఉత్సవ విగ్రహంగా వినియోగించేవారు.క్రీ.శ. 1339 నుంచి మలయప్ప కోనలో లభించిన మలయప్ప స్వామిని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసి...ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది.శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామికి నిత్య కల్యాణోత్సవాలు,ఇతర ఉత్సవాలు,బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది.ఈ ఉత్సవాల సమయంలో....రాజులు. చక్రవర్తులు...స్వామికి ధనధాన్యాలు,అగ్రహారాలు,దివ్యాభరణాలు కానుకగా సమర్పించేవారు.

వాయిస్ : 14వ శాతబ్దం వరకూ శ్రీ వేంకటేశ్వరస్వామికి రెండు బ్రహ్మోత్సవాలు జరిగేవి.15వ శతాబ్దంలో ఏకంగా సంవత్సరంలో ఏడు బ్రహ్మోత్సవాలు కూడా స్వామికి అప్పటి రాజులు నిర్వహించారు.అన్నమాచార్యుల కుమారుడు తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు రెండు వేల వరహాలను శ్రీవారి భాండాగారముకు సమర్పించి 13 రోజుల బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు పలు శాసనాల ద్వారా తెలుస్తోంది.ఇంకా
దేవరాయ మహరాయలు...                         అల్పిశి బ్రహ్మోత్సవం
బుక్కరాయ మహారాయలు                            కార్తికి బ్రహ్మోత్సవం
కృష్ణ దేవ మహరాయలు...తల్లిదండ్రుల పేరుతో    తై బ్రహ్మోత్సవం
హరిహరరాయ మహరాయలు             మాసి బ్రహ్మోత్సవం
వీరనరసింగ యాదవ రాయలు             పుంగుణి బ్రహ్మోత్సవం
తాళ్లపాక తిరుమలాచార్యులు   ఆని  బ్రహ్మోత్సవం ...ఇలా వివిధ పేర్లతో ఉత్సవాలు నిర్వహించారు. ఈ విధంగా క్రీ.శ.16వ శతాబ్దంలో శ్రీనివాసునికి తొమ్మిది నెలల్లో పది బ్రహ్మత్సవాలు...9 రోజుల పాటు,11 రోజుల పాటు,13 రోజుల పాటు జరుగుతుండేవని చరిత్ర పేర్కొంటోంది.రాయల వారి కాలంలో ప్రతి ఏటా 15 బ్రహ్మోత్సవాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయ్.వెంకన్నకు మాన్యాలు సమర్పించి...దాతలు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు.

వాయిస్: రాజులు...రాజ్యాలు....కాలగర్భంలో కలసిన పోయినందువల్ల వారి పేరుతో జరిగిన ఉత్సవాలు ఆ తరువాతి కాలంలో నిలిచిపోయాయి.కానీ జగత్కల్యాణం కోసం సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మత్సవాలు మాత్రం అఖండంగా....అంగరంగ వైభవంగా కొనసాగుతూ....కొండల రాయుని కొండంత వైభవాన్ని దశదిశలా చాటుతున్నాయ్.సకల దేవతలు హాజరై తిలకించే ఉత్సవాలను వీక్షించడం..మహద్భాగ్యంతో భక్తులు భావిస్తారు.థ్వజారోహణతో ప్రారంభమై....ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు పరిసమాప్తమౌతాయ్.విశిష్ట ఉత్సవాలను పురస్కరించుకుని...ఉత్సవాలకు ముందు రోజున వచ్చే మంగళవారం నాడు...అర్చకులు...అధికారులు సంయుక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని మొత్తం శుద్ధి చేసే కార్యక్రమం... కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంతోనే.....ఉత్సవ శోభ మొదలైతుంది.ఆ తరువాత శ్రీవారి ఆలయాన్ని నేత్రానందంగా....పరిమళ భరిత పుష్పాలతోనూ....విద్యుద్దీపాలతోనూ పూల పందిళ్లతోనూ....అందంగా అలంకరిస్తారు.థ్వజారోహణానికి ముందు రోజు ఉత్సవాలకు అంకారార్పణ జరుగుతుంది.థ్వజారోహణం నాడు...శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామి సమక్షంలో వేదమంత్రోఛ్చారణల మధ్య మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా...అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభం పై గరుఢ థ్వజాన్ని ఎగురవేస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవతలను ఆహ్వానించే ఈ కార్యక్రమం...వేడుకగా నిర్వహించిన తరువాత....ఇక శ్రీవారి వాహన సేవలు ప్రారంభమౌతాయ్.రోజూ ఉదయం రాత్రి వేళల్లో....స్వామి...అమ్మవార్లతో కలసి...వివిధ వాహనాలపై ఉరేగే...ఈ రమణీయ కమనీయ ఘట్టాన్ని వీక్షించడానికే భక్తకోటీ తిరుమలకు పోటెత్తుతుంది.పరిమళ భరిత పూమాలల నడుమ...దివ్యాభరణాలను ధరించి....స్వామి...దేవేరులతో కలసి తిరుమాఢ వీధుల్లో సాగించే...వాహన విహార వైభోగం...చూసిన వారికి చూసినంత.




వాయిస్ :పెద శేషవాహనం,చిన శేషవాహనం,హంస వాహనం,సింహ వాహనం,ముత్యపు పందిరి వాహనం,కల్పవృక్షవాహనం,సర్వభూపాల వాహనం,గరుఢ వాహనం, హనుమంత వాహనం,గజ వాహనం,సూర్యప్రభ వాహనం,చంద్రప్రభ వాహనం,అశ్వ వాహనాల పై 9 నాళ్లూ ఉరేగి...భక్తులకు కనువిందు కలిగిస్తాడు...ఆ కోనేటి రాయుడు.మోహినీ అవతారంలో మురిపించి....ధగధగలాడే స్వర్ణరథంపై అనుగ్రహ కాంతులు వెదజల్లుతూ...చక్కరధం పై భక్తులను కఠాక్షిస్తూ స్వామి మాఢ వీధుల్లో ఊరేగి...అభయ ప్రదానం చేస్తారు.ఇక బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికున్న ప్రాముఖ్యత  అంతా ఇంతా కాదు.స్వామి వాహనం గరుత్మంతుడు.ఉత్సవాల్లో ఐదవ రోజు రాత్రి జరిగే...గరుడోత్సవం పురస్కరించుకుని...సప్తగిరులు...భక్తగిరులుగా మారిపోతాయ్.గోవిందనామస్మరణలతో ఏడుకొండలు మారుమ్రోగతాయ్.కొండంత దేవుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు...తిరుమలకు పోటెత్తుతారు.రోజుకొక్క వాహనంతో...రోజుకొక్క అలంకరణలతో...శ్రీవారి వాహన సేవలు...ఆద్యంతం...ఆనందమయంగా సాగుతాయ్.అందుకే తిరువీధుల మెరసీ దేవదేవుడు...గరిమల మించిన సింగారముల తోడను అంటూ...ఉత్సవ వైభవాన్ని తన కీర్తనలో కళ్లకు కట్టినట్లు వర్ణించాడు...అన్నమయ్య....ఇక ఉత్సవాలకు ముగింపుగా శ్రీవారి పుష్కరిణిలో జరిగే చక్రస్నాన కార్యక్రమమూ వేడుకగా జరుగుతుంది.భక్తులు కూడా పుష్కరిణిలో  పుణ్య స్నానాలాచరించి...దేవదేవుని దర్శించుకుంటారు. 9వ రోజు రాత్రి జరిగే థ్వజ అవ రోహణంతో...ఉత్సవాలు పరిసమాప్తమౌతాయ్. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తిరుమలకు వచ్చే భక్తజనులను గురించి అన్నమయ్య
నానా దిక్కుల నరులెల్లా....
వానలలోనే వత్తురు గదిలి
సతులు సుతులు బరిసరులు బాంధవులు
హితులు గొలువగా నిందరును
శత సహస్ర యోజన వాసులను
వ్రతములు తోడనే వత్తురు గదలి
అంటూ సంకీర్తనల్లో  వర్ణించాడు.
కలియుగ వైకుంఠాన...9 రోజుల ఉత్సవాలను కళ్లారా తిలకించి...తరించి...ఆ దేవ దేవుని దివ్యమంగళ స్వరూపాన్ని మదిలో భద్రంగా దాచుకుని.....పునర్దర్శనాన్ని కోరుతూ...భక్తులు తిరుమల యాత్రను ముగిస్తారు.
       బ్రహ్మోత్సవం...ఇది బ్రహ్మోత్సవం...
       బ్రహ్మండనాయుకుని బ్రహ్మోత్సవం..

బైట్:వేణుగోపాల్దీక్షితులు..., శ్రీవారిఆలయప్రధానఅర్చకులు











వాహనసేవల  వివరాలు : 


తేదీ                                 ఉదయం                          రాత్రి


                            (9గం. నుండి 11 గం. వరకు)                   (8 గం. నుండి 10 గం. వరకు)


30-09-2019                   బంగారు తిరుచ్చి ఉత్సవం    (3:00 గం నుండి 5:00 గం వరకూ)        పెద్దశేషవాహనం.


01-10-2019                   చిన్నశేష వాహనం                    హంస వాహనం


02-10-2019                   సింహ వాహనం                    ముత్యపుపందిరి వాహనం


03-10-2019                   కల్పవృక్ష వాహనం                  సర్వభూపాల వాహనం


04-10-2019                   మోహినీ అవతారం                  గరుడ వాహనం(రా.7 నుండి 12 వరకు)


05-10-2019                   హనుమంత వాహనం       స్వర్ణ రధం(సా.4 నుండి 6 వరకు), గజవాహనం.


06-10-2019                   సూర్యప్రభ వాహనం                              చంద్రప్రభ వాహనం


07-10-2019                   రథోత్సవం(ఉ.7 గంటలకు)           అశ్వ వాహనం


08-10-2019                   చక్రస్నానం(ఉ.7 నుండి 9 గం. వరకు)             బంగారు తిరుచ్చి ఉత్సవం(రా. 7 నుంచి 9 గం. వరకు)